పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రవాస భారతీయుల వివాహాలు

కొన్ని రాష్రాలలో ప్రవాస భారతీయులతో తమ కూతురు పెళ్లి జరిపిస్తే తమ కూతురు అన్ని రకాల సుఖాలతో జీవితాంతం గడుపుతుందని, దీనితో పాటు తమ కుటుంబాలకు ఈ వివాహాలు ఆర్థికంగా ఉపయోగ పడతాయని మరియు ఒక కొత్త అవకాశాలను మార్గాలను తెరుస్తాయని భావిస్తారు.

కొన్ని రాష్రాలలో ప్రవాస భారతీయులతో తమ కూతురు పెళ్లి జరిపిస్తే తమ కూతురు అన్ని రకాల సుఖాలతో జీవితాంతం గడుపుతుందని, దీనితో పాటు తమ కుటుంబాలకు ఈ వివాహాలు ఆర్థికంగా ఉపయోగ పడతాయని మరియు ఒక కొత్త అవకాశాలను మార్గాలను తెరుస్తాయని భావిస్తారు.

ఆచరణలో, ఈ వివాహాలు చాలా వరకు విఫలమయ్యాయి మరియు అమ్మాయిల జీవితంలో దీర్ఘ కాల సమస్యలను సృష్టించాయి, ఎందుకంటే:

 • అబ్బాయి మరియు అతని కుటుంబ గతచరిత్రను తనిఖీ చేయలేదు.
 • అబ్బాయి అతని చట్టపరమైన స్థితికి సంబంధిచి తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు మరియు తన ఉద్యోగం గురించి ఆకర్షణీయంగా అమ్మాయి తల్లిదండ్రులకు తెలిపిన సందర్భాలు ఉన్నాయి.
 • విదేశాలకు వారి భార్యలను తీసుకు పోయిన భర్తలు, కొంతకాలం తర్వాత వారిని తిరిగి పంపించి వేసారు.
 • భార్యలను వదిని పెట్టారు.

మహిళలు NRIలను పెళ్ళి చేసుకొని ఎదుర్కొన్న సమస్యలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు

 • చాలా సందర్భాలలో, భర్త తను ఉంటున్న దేశానికి తీసుకు వెళ్ళకుండానే తను వెళ్ళగానే పలిపించుకుంటానని వాగ్దానం చేసి ఆమెను వదిలేసాడు మరియు ఇలాంటి వాటిలో కొన్ని సార్లు మహిళలు గర్భవతులుగా కూడా ఉన్నారు, వారిని మరియు వారి పిల్లలను ఎప్పటికి భర్త తీసుకు వెళ్ళలేదు.
 • మహిళ విదేశంలో ఒంటరి అయిపోతుంది. ఆమెపైన శారీరకంగా మరియు మానసికంగా దాడిచేయడమే కాకుండా పోషకాహారలోపం కూడా కలిగించవచ్చు. కొన్ని సార్లు భర్త లేదా అతని బంధువులు ఆమెతో చెడుగా ప్రవర్తించవచ్చు
 • మహిళను వరకట్నం కోసం వేధించవచ్చు.
 • మహిళ విమానం దిగిన తర్వాత ఆమెను తీసుకోవడానికి ఎవరూ రాకపోవచ్చు. అప్పుడు ఆమెకు ఎక్కడికి వెళ్ళాలని తెలియని పరిస్థితి కలగవచ్చు. ఆమె దగ్గర కొంత ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. అంతేగాక ఆ దేశంలో ఉండటానికి కావలసిన చట్టబద్దమైన మంజూరు ఉండకపోవచ్చు.
 • మహిళ భర్త అప్పటికే వివాహితుడని గుర్తించవచ్చు లేదా మరొక స్త్రీతో సంబంధం కలిగి ఉండవచ్చు లేదా ఇప్పటికే ఒక కుటుంబం కలిగి ఉండవచ్చు.
 • ఆమె భర్త తన ఇమ్మిగ్రేషన్ స్థితి మరియు ఉద్యోగానికి సంబంధించిన తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చు అంతేకాక వైవాహిక స్థితి మరియు ఇతర విషయాలకు సంబంధించిన వివరాలు తప్పుగా ఇచ్చినట్లు తెలుసుకోవచ్చు.
 • భర్త విదేశంలో ఎక్స్-పార్టే విడాకులు కోసం అర్జీచేసుకోవచ్చు మరియు ఆమె తన పిల్లల సంరక్షణను కూడా పొందలేకపోవచ్చు.
 • స్త్రీ వివాహాన్ని విదేశీ కోర్టు కొట్టేసిన కారణంగా, భారతదేశంలో ఆమె నిర్వహణకు ఎలాంటి సహాయం దొరకకపోవచ్చు. నోటీసులు ఇవ్వడానికి , ఆదేశాలు మరియు ఉత్తర్వులను జారీ చేయడానికి చట్టబద్దమైన అడ్డంకులు రావచ్చు. ప్రైవేటు అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన వివిధ ఇతర చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు

తీసుకోవలిసిన జాగ్రత్తలు

 • ప్రవాస భారతీయులతో మీ కుమార్తె వివాహానికి తొందర పడకండి. ఎలాంటి పరిస్థితిలో కూడా తొందరలో వివాహానికి అంగీకరించవచ్చు.
 • ఫోన్ లో లేదా ఇమెయిల్స్ ద్వారా, ఎక్కువ దూరాలతో విషయాలను ఖరారు చెయకండి. గుడ్డిగా ఎజెంట్ బ్యూరోలు, లేదా మధ్యవర్తులను నమ్మవద్దు.
 • పత్రాల నకిలీ లావాదేవీలను నమోదు అంగీకరించకండి.
 • గ్రీన్ కార్డ్ కొరకు వాగ్దానాలు మరొక దేశానికి తరలి వెళ్ళేందుకు వీలు లాంటి మాటలు నమ్మవద్దు.
 • రహస్యంగా వివాహాలు ఖరారు చేయకండి; నిజానికి ప్రతిపాదనను ఇతరులకు అందరికి తెలియపరిస్తే ఎవరైనా వరుని గురించిన కీలక సమాచారం ఇవ్వవచ్చు.
 • రిజిస్టరు వివాహం మాత్రమే లేదా ఎక్కడో మారు మూల ప్రాంతాలలో వివాహం అంటే ఒప్పు కోవద్దు.
 • విదేశాలలో వివాహానికి ఒప్పుకోవద్దు.
 • తని వైవాహిక స్థితి, ఉపాధికి సంబంధించిన వివరాలను అతని యజమాని/కార్యాలయంలో, పరిసర ప్రాంతాల నుండి అతని కుటుంబం గురించి సరిగ్గా తెలుసుకొండి. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ స్థితి, ఆర్థిక స్థితి, అతని లక్షణాలు, నేర చరిత్ర, ఏదైనా ఉంటే, మరియు అతని కుటుంబానికి సంబంధించిన వివరాలను కనుక్కోవాలి.
 • కొన్ని ముఖ్యమైన పత్రాలు పాస్పోర్ట్, వీసా, ఓటరు లేదా విదేశి నమోదు కార్డు, సామాజిక భద్రతా సంఖ్య, గత మూడు సంవత్సరాలుగా పన్ను, రాబడి, బ్యాంకు ఖాతా పత్రాలు, మరియు ఎన్నారై వరుడి ఆస్తి పత్రాలు ధ్రువీకరణకోసం తనిఖీ చేయండి .
 • వధువును పంపే సమయంలో, స్థానిక పోలీసు మరియు ఇతర సహాయ ఏజన్సీలు మరియు భారత రాయబార కార్యాలయం, స్థానిక భారతీయ సంఘాలు మరియు నెట్వర్క్ లాంటి కొన్ని ముఖ్యమైన నంబర్లును ఇవ్వండి.
 • పెళ్ళి నమోదు, వీసా మరియు ఇతర అవసరమైన ఫార్మాలిటీల జారీ లాంటి అన్ని కాగితపు పనులను భర్త తరఫుల కాకుండా భార్య తరఫున చేయండి. అలాగే ఎన్నారై వరుడి నుంచి ప్రస్తుతం ఆయన వైవాహిక స్థితిని పేర్కొంటున్న అఫిడవిట్ తీసుకోవటం మంచిది.
 • వధువు మరియు వరుడు కమ్యూనికేట్ అయి, వ్యక్తిగతంగా కలుసుకుని, స్వేచ్ఛగా మరియు స్పష్టంగా, ముఖాముఖి సంభాషించటం ద్వారా విషయాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం అని గుర్తుంచుకొండి.

ఎన్నారై వివాహాలకు సంబంధించిన ముఖ్యమైన న్యాయ తీర్మానాలు

ధన్వంతీ జోషి వి మాధవ్ అండె (1998) 1 SCC 112

ఈ సందర్భంలో ఎన్నారై భర్త ధన్వంతీ జోషి అప్పటికే మరొక స్త్రీతో వివాహం చేసుకొని సంసారం సాగిస్తూ ఉండగానే అతను రెండవ సారి పెళ్లి చేసుకున్నాడు. వారికి కుమారుడు పుట్టాడు. పిల్లలవాడు 35 రోజుల వయసులో ఉన్నప్పుడు; ఆమె తన భర్తను వదిలి భారతదేశం తిరిగి వచ్చింది. పిల్లల సంరక్షణకు సంబంధించిన నిర్ణయంలో సుప్రీం కోర్టు ఆమె భర్త విదేశీ కోర్టు నుండి సంరక్షణ ఆదేశాలు పొందినప్పటికీ పిల్లల అవసరానికి తగ్గట్టుగా తల్లికి కస్టడీ మంజూరు చేసింది. తండ్రికి తన కొడుకును పరామర్శించే హక్కు ఉంటుంది కాబట్టి అతను భారతదేశం రావచ్చు మరియు ఉండవచ్చనని తీర్పు నిచ్చింది.

నీరజ సరఫ్ వై జగంత్ సరఫ్ (1994) 6 SCC 461

భార్య, ఒక సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారి కూతురు, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తు రూ 3000 / - జీతం పొందుతున్నప్పుడు జే సరఫ్ తో వివాహం జరిగింది, అతను ప్రతివాది.

నం 1, కంప్యూటర్ హార్డ్వేర్ డాక్టర్ మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం 6 ఆగస్టు, 1989 న జరిగింది. ఫిర్యాదుదారు కొన్ని రోజులు గోవాకి హనీమూనుకోసం తీసుకెళ్లబడింది. ప్రతివాది నం 1, 24 ఆగష్టు, 1989 న అమెరికా తిరిగి వెళ్ళాడు అక్కడినుండి అమెరికాలో ఆమె కెరీర్ కోసం వివిధ మార్గాలను సూచిస్తూ 15 సెప్టెంబర్, 20 అక్టోబర్, నవంబర్ 14 న ఉత్తరాలను రాసాడు.

దానిని నమ్మి ఫిర్యాదుదారు వీసా కోసం ప్రయత్నించి చివరకు నవంబర్, 1989 లో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది. కాని డిసెంబరు నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఫిర్యాదుదారు తండ్రి తన కుమార్తె కష్టాల గురించి ప్రతివాది భర్తకు జనవరి, 1990 లో ఒక లేఖ రాసినప్పటికీ అతని నుండి ఏరమైన అనుకూలమైన స్పందన రాలేదు. జూన్ లో, 1990 భర్త సోదరుడు ఢిల్లీ వచ్చి రెండు ఎన్వలపులను అందిచాడు. అందులో ఒకటి USA కోర్టు వాడాకుల పత్రం. భార్య ద్వారా విడిచిపెట్టబడి ఉద్యోగం పోగొట్టుకున్ని జీవితం నాశనం అయినందువల్ల ఆమె అతని మీద మరియు మామ పైన తనకు జరిగిన నష్టానికి గాను కోర్టులో ఒక దావా దాఖలు చేసింది. దావా రూ 22 లక్షల పరిహారం కోసం వేసింది.

సుప్రీం కోర్టు ప్రతివాదులు రెండు నెలల వ్యవధిలో, రూ 3,00000మొత్తం హైకోర్టు రిజిస్ట్రార్ దగ్గర డిపాజిట్ చేయమని చెంప్పింది. ఇందులో 1.00.000 / - ఎప్పుడైనా ఆమె తీసుకోవచ్చు. మిగిలిన రూ. 2OOOOO / - స్థిర డిపాజిటుగా ఒక జాతీయ బ్యాంకులో ఉంచబడుతుంది. దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెల ఫిర్యాదుదారుకు చెల్లించేట్లుగా నిర్ణయించబడింది. విచారణ సహేతుకమైన సమయం లోపల జరగకపోతే, మరింత మొత్తం ఉపసంహరించకో వచ్చు అని తెలిపింది.

మూలం: జాతీయ మహిళా కమిషన్

3.01470588235
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు