పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బాల్య వివాహం

ఈ విభాగంలో బాల్య వివాహం గురించి వివరించడం జరిగింది.

బాల్య వివాహాలను నిషేధించారు

18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలిక మరియు 21 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలుడి పెళ్లిళ్లను బాల్య వివాహ నిషేధ చట్టం, 2006 నిషేధిస్తుంది.

వివాహం అయిన పిల్లల వివాహాన్ని రద్దు చేసుకోనే హక్కు

 • చిన్నపుడు జరిగిన వివాహన్ని అతను/ఆమె రద్దుచేసుకొనే హక్కును చట్టం ఇస్తుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమ్మాయి తన వివాహాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే తన స్నేహితుడు/గార్డియనుతో పిటిషనును చైల్డ్ మ్యారేజ్ నిషేధ (i) ఆఫీసరుకు ఇవ్వవచ్చు. అయితే అతను/ఆమె 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత పిటిషన్ దాఖలు చెస్తే అప్పుడు వారు సొంతంగా వివాహ రద్దు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు.
 • ఇటువంటి పెళ్లి రద్దు జరిగితే, డబ్బు, విలువైన ఆభరణాలు మరియు పార్టీలు మధ్య బహుమతుల మార్పిడి మరియు ఇతరమైనవి తిరిగి ఇచ్చేయవలసి ఉంటుంది.
 • ఆమె పునర్వివాహం వరకు నిర్వహణ చెల్లించడానికి ఆమె భర్తకు లేదా అతను 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు వాడైతే అతని తండ్రి/సంరక్షకులకు మధ్యంతర లేదా తుది తీర్పు ఇవ్వవచ్చు.
 • అలాంటి వివాహం ద్వారా ఎవరైనా పిల్లలు జన్మించిన ఉంటే, పిల్లలకి మంచి జరుగే విధంగా సంరక్షణ ఎవరికి ఇవ్వాలనేది కోర్టు నిర్ణయించవచ్చు. పిల్లల వివాహాల నుండి జన్మించిన పిల్లలు చట్టబద్ధమే అని గమనించాలి.

బాల్యవివాహాలకు ఎవరిని శిక్షిస్తారు?

 • 18 సంవత్సరాలు వయసు కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయసున్న బాలికను పెళ్ళి చేసుకుంటే అతనికి రెండు సంవత్సరాల కఠన జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ కలిసి విధించవచ్చు.
 • ఎవరైతే బాల్యవివాహాన్ని చేస్తారో వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ కలిసి విధించవచ్చు.
 • ఎవరైతే బాల్యవివాహాన్ని ప్రోత్సహిస్తారో వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ కలిసి విధించవచ్చు అయితే, ఏ స్త్రీకి ఖైదు విధించరు./li>

బాల్య వివాహాలను నిషేధించే నిషేధాజ్ఞను జారీకి మేజిస్ట్రేట్ పవర్

బాల్య వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే సమాచార అందుకున్న వెంటనే ఏవ్యక్తి వ్యతిరేకంగానైనా నిషేధాజ్ఞను జారీ చేయవచ్చు.

ఒక మేజిస్ట్రేట్ కింది సందర్భాలలో నిషేధాజ్ఞను జారీ చేయవచ్చు

 • బాల్య వివాహం జరుగుతుందని తెలిసిన వ్యక్తి లేదా అలాంటి వివాహం జరిగే అవకాశం ఉందని ఎవరైనా తెలిపినప్పుడు లేక ఒక ఎన్జిఒ నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు.
 • దరఖాస్తు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ చేసి ఉంటే.
 • లేదా ఒక వ్యక్తి స్వయంగా తన వివాహాన్ని, అక్షయ తృతీయ వంటి కొన్ని రోజులలోని సామూహిక వివాహాలలో, నిరోధించడానికి విశ్వసనీయ సమాచారం ఇచ్చినప్పుడు.

తెలిసీ అలాంటి నిషేధాజ్ఞను ఏవరైనా వ్యక్తి మీరితే రెండు సంవత్సరాల కఠిన కారాగారం లేదా ఎంతైనా జరిమానా లేదా రెండూ కలిసి విధించవచ్చు, కానీ ఏ స్త్రీకి ఖైదు విధించరు.

బాల్య వివాహలతో చెడు ప్రభావాలు

 • తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు.
 • హెచ్ఐవి, రక్తహీనత, స్త్రీ జననేంద్రియ సమస్యలు.
 • 15 నుంచి 19 సంవత్సరాల వయస్సులో గర్భం బాలికలోల మరణం లేక వైకల్యాకు ఒక ప్రధాన కారణం.
 • అమ్మాయిల విద్యా సాంఘిక మరియు ఆర్థిక వృద్ధి ఆగిపోతుంది.

మూలం: జాతీయ మహిళా కమిషన్

2.94285714286
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు