హోమ్ / సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం / భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు మరియు నిర్వహణ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు మరియు నిర్వహణ

ముస్లిమ్ లా (LAW)

కూతుర్లు
 • మహిళ పురుషుడిలో సగం అన్న భావనతో వారసత్వంలో కుమార్తె వాటా కుమారుడి వాటాలో సగంతో సమానంగా ఉంటుంది.
 • అయితే, ఆమె ఎల్లప్పుడూ ఈ ఆస్తి మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. దీనీని చట్టబద్ధంగా ఆమె నిర్వహించడానికి, నియంత్రణకు, మరియు విడిచి పెట్టడానికి ఆమె జీవితం కాలంలో లేదా మరణం తర్వాత హక్కు ఉంటుంది.
 • ముస్లిం మత చట్టం కింద ఆమె వారసత్వంగా బహుమతులు అందుకొనే అవకాశం ఉన్నప్పటికీ, బహుమతి పురుషుడి వాటాలో మూడో వంతు మాత్రమే ఉంటుంది. వంశపారంపర్య వాటాలు చాలా కఠినంగా ఉంటాయి.
 • కూతుర్లకు వారి వివాహం వరకు తల్లిదండ్రుల ఇళ్లలో నివాసం మరియు నిర్వహణా హక్కులు ఉంటాయి. విడాకులకు సంబంధించిన పరిస్థితులలో నిర్వహణ బాధ్యతను ఇద్దత్ కాలం (సుమారు 3 నెలల) వరకు ఆమె తల్లిదండ్రుల కుటుంబానికి ఉంటుంది. ఆమె పిల్లను కలిగి ఉండి వారికి ఆమెకు సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటే వారు సహాయం చేయాలి.

భార్యలు

 • ముస్లిమ్ చట్టంలో ఒక మహిళ యొక్క గుర్తింపు ఒక వ్యక్తి యొక్క స్థితి కంటే తక్కువ అయినా ఆమె వివాహానంతరం అతనిలో మాయమవదు.
 • అందువలన ఆమె తన వస్తువులు మరియు ఆస్తులపైన నియంత్రణ కలిగిఉంటుంది. అతని ఇతర భార్యలకు ఎలాంటి నిర్వహణ ఇస్తున్నాడో అదే ఈమెకు కూటా ఇవ్వాలి, లేకపోతె అతనికి వ్యతిరేకంగా చర్య తీసుకోవచ్చు.
 • సుప్రీం కోర్టు విడాకులు సందర్భంలో, ఒక ముస్లిం మతం భార్తకు విడాకులు ఇచ్చిన భార్య నిర్వహణ మరియు ఆమె భవిష్యత్తు కోసం సహేతుకమైన ఏర్పాట్లు చేసే బాధ్యతను కలిగి ఉంటాడు. అటువంటి ఒక సహేతుకమైన నిబంధన ఇద్దత్ సమయం దాటే లోపల సెక్షన్ 3 {1Ha} (ముస్లిం మత ఆడవారి విడాకుల హక్కుల రక్షణ) చట్టం, 1986 ప్రకారం భర్త బాధ్యతను స్వీకరించాలి.
 • పెళ్లి సమయంలో అంగీకరించిన ఒప్పందం ప్రకారం మెహర్ హక్కు కలిగి ఉంటుంది.
 • పిల్లలు ఉంటే ఎనిమిదవంతు ఆస్తి లేదా పిల్లలు లేకపోతే నాలుగో వంతు ఆస్తిని అతని నుండి వారసత్వంగా పొందుతుంది. అతినికి ఒకటి కంటే ఎక్కువ భార్యలు ఉంటే, వాటా పదహారవ వంతుకు తగ్గిపోతుంది. చట్టంలో సూచించిన ఎస్టేట్లో ఏభాగస్వాములు లేకపోతె, భార్య సంకల్పంతో ఎక్కువ మొత్తంలో వారసత్వంగా తీసులోవచ్చు. ఒక ముస్లిం తన ఆస్తిలో మూడవ వంతు వారసత్వంలో భాగస్వామి కాని వారికి ఇవ్వవచ్చు.
తల్లి
 • విడాకులు లేదా వైధవ్యం విషయంలో ఆమె పిల్లలు నుండి నిర్వహణ పొందగలుగుతుంది.
 • ఆమె ఆస్తిని ముస్లిం మత చట్టం నియమాల ప్రకారం విభజించవచ్చు.
 • ఆమెకు మరణించిన పిల్లల ఎస్టేటులో ఆరవవంతు వారసత్వంగా పొందే అర్హత ఉంది.

క్రిస్టియన్ లా (LAW)

కూతుర్లు
 • ఆమె తన తండ్రి లేదా తల్లి ఎస్టేటును సోదరులకు సమానంగా పొందుతుంది.
 • ఆశ్రయం మరియు నిర్వహణకు వివాహానికి ముందు అర్హులు, కానీ తర్వాత కాదు.
 • ఆమె వ్యక్తిగత ఆస్తి మీద సంపూర్ణ హక్కులు ఆమె మెజరు అయిన తర్వాత ఉంటాయి. అప్పటి వరకు, ఆమె సహజ సంరక్షకుడుగా ఆమె తండ్రి ఉంటాడు.

భార్యలు

 • ఆమె తన భర్త నుండి నిర్వహణ పొందు తుంది. కానీ అతను దానిలో వైఫల్యమైతే విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
 • ఆమె భర్త మరణం తరువాత ఆమె ఆస్తిలో మూడవ వంతు వాటా ఉంటుంది, మిగిలిన ఆస్తి సమానంగా పిల్లలు పంచుకోవలి.
 • ఆమె తన భర్త యొక్క ఎస్టేటు నుంచి కనీసం Rs.5000/- వారసత్వంగా ఉండాలి. ఎస్టేటు దీనికంటే ఎక్కున మొత్తాన్ని కలిగి ఉంటె. ఇది కాకాపోతె ఆమె మొత్తం వారసత్వంగా తీసుకోవచ్చు.
తల్లులు
 • ఆమెకు పిల్లల నుండి నిర్వహణ హక్కు లేదు. ఒకవేళ ఆమె పిల్లలలో ఎవరైనా భార్యా పిల్లల లేకుండా మరణిస్తే అప్పుడు ఆమెకు ఆ ఆస్తిలో నాలుగో వంతు వారసత్వంగా ఉంటుంది.

హిందూ మతం లా (LAW)

కూతుర్లు
 • కూతుర్లకు వారి తండ్రి ఆస్తిలో కుమారులతో సమానంగా హక్కు ఉంటుంది.
 • తల్లి ఆస్తిలో కూడా ఒక భాగం ఉంటుంది.
 • హిందూ మతం వారసత్వ (సవరణ) చట్టం, 2005 (2005 39) సెప్టెంబర్ 9, 2005 నుంచి అమలులోకి వచ్చింది. సవరణ చట్టం లింగ వివక్షత నిబంధనలను తొలగించింది మరియు కుమార్తెలకు క్రింది హక్కులు కలిగించింది.
 • పుట్టికతోనే కుమారులతో సమానంగా ఆమె కూడా స్వంత హక్కుతో ఒక దాయాది అవుతుంది;
 • ఆమె కుమారునిగా జన్మించి ఉంటే ఉండేటటువంటి అన్నిదాయాది హక్కులు కుమార్తెకు ఉంటాయి;
 • కుమార్తెకు కుమారునికి ఉన్న దాయాది అర్హత ఉంటుంది ;
 • కుమార్తెకు కుమారుడికి కేటాయించిన వాటా లాగే కేటాయించాలి.
 • వివాహిత కుమార్తెకు ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఆశ్రయ హక్కు, లేదా నిర్వహణా హక్కు ఉండదు. అయితే, ఒక వివాహిత కుమార్తె విడాకులు లేదా భర్తను కోల్పోయినప్పుడు నివాస హక్కు ఉంటుంది.
 • ఒక మహిళ, ఆమె ఆర్జించింది లేదా బహూమతి ఇచ్చిన లేదా వీలునామా చెయ్యబడిన ఆస్తిపైన సంపూర్ణ హక్కులు ఆమెకు యుక్తవయసు రాగానే అందుతాయి. ఆమె సరియైనది అనుకుంటే దానిని అమ్మవచ్చు, బహుమతి ఇవ్వవచ్చు లేదా విల్లు రాయవచ్చు.
భార్యలు
 • ఒక వివాహిత స్త్రీ తన వ్యక్తిగత ఆస్తి మీద పూర్తి హక్కును కలిగి ఉంటుంది. ఆమె దానినిలో కొంత భాగం గానీ లేదా పూర్తిగా ఎవరికైనా బహుమతిగా ఇస్తే తప్ప. ఆమె సంపాదించింది అయినా సంక్రమించినది అయినా లేదా బహుమతి పొందిందైనా ఆమె పూర్తి యజమానురాలు.
 • ఆమె భర్త నుండి నిర్వహణ, ఉమ్మడి కుటుంబానికి చెందినది అయితే కుటుంబం నుండి మద్దతు మరియు ఆశ్రయ హక్కు కలిగి ఉంటుంది.
 • ఉమ్మడి కుటుంబ ఆస్తి విభజనలో తన భర్త మరియు అతని కుమారులు మధ్య, ఆమె ఇతరులలాగా సమాన వాటా పొందుతుంది. అదేవిధంగా, ఆమె భర్త చనిపోవయినప్పుడు, ఆమె తన భాగాన్ని ఆమె పిల్లలు మరియు అతని తల్లి తో మమానంగా ఉంటుంది.

మదర్స్

 • ఆమె ఎవరిపైనా ఆధారపడి లేని తన పిల్లలు నుండి నిర్వహణ పొందవచ్చు. ఆమె మొదటి తరగతి వారసురాలు కూడా.
 • భర్తను కోల్పోయిన తల్లి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో విభజన కుమారులు మధ్య జరిగినప్పుడు పుత్రుడి వాటాతో సమానంగా వాటా తీసుకోనే హక్కును కలిగి ఉంటుంది.
 • ఆమె స్వంతమైన అన్ని ఆస్తులను అమ్మవచ్చు, బహుమతి ఇవ్వవచ్చు లేదా విల్లు రాయవచ్చు.
 • ఆమె విల్లు వ్రాయకుండా మరణించిలప్పుడు, ఆమె పిల్లలు సెక్స్ సంబంధంలేకుండా , సమానంగా వారసత్వంకలిగి ఉంటారు.

నిర్వహణ

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రుల నిర్వహణ సూచిస్తుంది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రుల నిర్వహణ సూచిస్తుంది.

వ్యక్తి నిర్లక్ష్యం వహిస్తే లేదా పోషణను తిరస్కరించి నట్లైతే
 • అతని భార్య తనకు తాను పోశించుకోలేక పోతే లేదా
 • అతనికి చట్టబద్ధమైన లేదా చట్టవిరుద్ధమైన చిన్న పిల్లల కలిగి ఉంటే,
 • అతని తండ్రి లేదా తల్లి, తనను తాను నిర్వహించుకోలేక పోతే
అలాంటి సందర్భాలలో కోర్టు భార్య పిల్లలు లేదా తల్లిదండ్రుల నిర్వహణ కోసం నెలసరి భత్యం ఇవ్వాలని అలాంటి వ్యక్తికి ఆదేశించవచ్చు.
 • మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఆర్డర్ జారీ
 • మేజిస్ట్రేట్ అదాలత్లు కొనసాగే క్రమంలో మధ్యంతర నిర్వహణ కోసం నెలసరి భత్యం ఆర్డరు ఇవ్వవచ్చు.
 • మధ్యంతర నిర్వహణ మరియు కొనసాగే ఖర్చుల నెలవారీ భత్యం కోసం వీలైనంత వరకూ అప్లికేషన్ యొక్క నోటీసు తేదీ నుంచి అరవై రోజుల్లో పరిష్కరించు కోవాలి.
 • భర్త నుండి విడాకులు తీసుకున్న లేదా ఇచ్చి తిరిగి పెళ్లి చేసుకోకపోతే "భార్య" అంటారు.

ముఖ్యమైన జ్యుడీషియల్ తీర్మానాలు

మంగత్ మూల్ వి. పున్ని దేవి (1995) (5) 199 ఎస్సీ స్కేల్

నివాసానికి సంబంధించి తప్పనిసరిగా నిర్వహణా నియమం ఉండాలి. స్త్రీ ఆమె అలవాటు పడిన దానకంటే ఎక్కువ లేదా తక్కువ పద్ధతిలో జీవించటానికి నిర్వహణ ఇవ్వబడుతుంది. నిర్వహణలో ఆహారం, బట్టలు, మరియు అటువంటివాటితోపాటు ప్రాథమిక ఇంటి అవసరం కలిగి ఉంటాయి.

Sh. రాజేష్ చౌదరి వర్సెస్ నిర్మలా చౌదరి CM (ఎం) 1385/2004 ఢిల్లీ హైకోర్టు

ఈ సందర్భంలో వ్యక్తి ఆడ శిశువు యొక్క పితృత్వాన్ని నిర్ధారించేందుకు అనుమతి కోరుతూ పిటిషను వేసాడు. అతను ఆరోపణలు రూఢీ పరచడానికి DNA పరీక్ష ద్వారా బాలిక పితృత్వాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. పాప అధర్మం ఆరోపణపై DNA పరీక్ష నిర్ణయం ఒక క్లిష్టమైన సమస్య. ఇలాంటి సమయంలో విడిపోయిన భార్య తన్నుతాను మరియు పిల్లల కోసం మధ్యంతర నిర్వహణను ఖండించవచ్చా లేక అంగీకరించాలా అనేది సమస్య.

రక్త గ్రూపు పరీక్ష వివాదాస్పద పితృత్వాన్ని గుర్తించడానికి ఒక ఉపయోగకరమైన పరీక్ష అని పేర్కొంది. కోర్టులు దీనిని సర్కంస్టాంషిల్ సాక్ష్యంగా తీసుకొని సంతానం యొక్క తండ్రిగా ఒక వ్యక్తిని మినహాయించవచ్చు. అయితే, ఏ వ్యక్తి అతని/ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా విశ్లేషణ కోసం రక్తం నమూనాను ఇవ్వాలని ఒత్తిడి చేయలేము మరియు అలా ఒప్పుకోవి వారిపై ఎలాంటి చర్య తీసుకోవడానికి వీలు ఉండదు. భారతదేశం లోని కోర్టులు రక్త పరీక్షపై మాత్రమే ఆధారపడి ఉండవు. పితృత్వ రుజువు విచారణ ప్రార్థన అప్లికేషన్లలో ప్రతిదానికి రక్త పరీక్ష చేయటాన్ని ప్రోత్సహించదు.

వివాహం వేడుకలు మరియు ప్రతి వ్యక్తి సక్రమమైన వాల్లుగా చట్టం భావిస్తుంది. వివాహం లేదా సంతతి (తల్లిదండ్రులు) ఉహించుకోవచ్చు. చట్టం మోసం మరియు అనైతికత ఇందులో ఉంటుందిని ఊహించుకోదు. కోర్టు రక్త పరీక్షకు ఆదేశాలిస్తే ఎలాంటి ప్రభావాలు ఉంటాయో జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ఆదేశం వలన ఒక పవిత్ర స్త్రీ కి చెడ్డ పేరు రావచ్చు మరియు శిశువుకు మానసికంగా పడే ప్రభావాన్ని దాని ఫలితాలను కూడా పరీక్షించవలసి ఉంటుంది. "శిశువు మరియు తన తల్లి, పిటిషనర్ భార్య, జీవనోపాధి భరణానికి సంబంధించిన , అధర్మ ఆరోపణ నిర్ణయం వచ్చేవరకు ఎదురుచూడకూటదు మరియు భరణం, చెల్లించవలసి ఉంటే, వేగంగా అందేలా ఆదేశించాలి".

శ్రీమతి. B.P. అచల ఆనంద్ - 2000 సివిల్ అప్పీల్ నంబర్ 4250

ఈ కేసులో సుప్రీం కోర్టు వ్యక్తిగత చట్టాల్లో వివాహ ఇంటిలో భార్య నివసించటం ఆమె హక్కు అని చెప్పింది. భర్త తన భార్యను పోషించాలి. ఆమె అతని ఇంట్లో మరియు రక్షణ కింద ఉండే హక్కు ఉంది. భర్త ప్రవర్తన కారణంగా లేదా ఇంట్లో ఉంచుకోక పోయినా లేదా ఆమెను చూడడానికి నిరాకరించినా ఆమె అతని నుండి దూరంగా జీవించే హక్కు కలిగి ఉంటుంది. నివాస హక్కు భార్య నిర్వహణలో భాగం. నిర్వహణ కోసం భార్య అనే పదం విడాకులు తీసుకున్నామేకు కూడా వర్తిస్తుంది.

భారత్ హెవీ ప్లేట్లు మరియు వెసల్ లిమిటెడ్, AIR 1985 ఆంధ్ర ప్రదేశ్ 207

భర్త ఒక కంపెనీలో ఉద్యోగి. అతను తన భార్య తో నివసించేందుకు కంపెనీ క్వార్టర్ కేటాయించింది. క్వార్టర్ వివాహ నివాసంగా ఉంది. అయితే, వ్యత్యాసాలు వచ్చి వారు విడిపోయారు. భర్త కంపెనీ క్వార్టర్ వదిలి పోయాడు. అతని భార్య మరియు చిన్న పిల్లల మాత్రమే అందులో ఉన్నారు. భర్త తన లీజు రద్దు చేయమని కంపెనీకి రాశారు. వారు ఆమెను ఖాలీ చేయించె అవకాశాలు ఉన్నప్పుడు తనను మరియు తన ముగ్గురు మైనర్ పిల్లలను ఖాళీ చేయించకుండా నిరోధక నిషేధాజ్ఞను కోరుతూ, రక్షణ కోసం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు భార్య మరియు ఆమె చిన్న పిల్లలను కంపెనీ ఖాళీ చేయించడాన్ని ఖండించింది. భర్త భార్య మరియు పిల్లలకు ఆశ్రయం అందించే బాధ్యత కలిగి ఉంటాడు. అందువల్ల క్వార్టరు అద్దె మొత్తం భర్త జీతం నుండి ఇవ్వబడింది.

మూలం: జాతీయ మహిళా కమిషన్

3.01886792453
గురురాజ Aug 06, 2019 08:19 PM

తల్లి ఆస్థిలో వివాహిత కూతుర్లకు వాటా విషయం లో చట్టం లోని సేక్షన్ల క్లాజు ల వివరాలు తేలపండి.

KS Nov 07, 2018 01:05 PM

మొదటి భార్య బతికి ఉండగా రెండో పెళ్ళి చేసుకుని ఉంటే భర్త చనిపోయిన తర్వాత రెండో భార్యకు భర్త ఆస్తిలో వాటా హక్కు ఉందా?

Harun basha Apr 02, 2018 06:01 PM

తండ్రి ఆస్తి వివాహిత కుమార్తెకు వర్తించని సందర్భాలు ఉన్నాయ..?

p.madhavi Nov 04, 2017 05:41 AM

మా అమ్మ నాన్న ను మాఅన్నయ్యకి చుడనే చడం లెదు కానీ వాడికి అస్తి కావాలీ అని చాల ఇబ్బంది పెడుతున్న రు మెము 3ఆడ పిల్లలం మాకు ఇంటికి రాకూడదు అటున్నా రు మేము ఎమ్మీ చేయలో చోపండి

A.చిన్న Feb 20, 2017 09:19 PM

మా నాన్నకి 6 గురు పిల్లలం అందులో 3 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు ... ఒక తమ్ముుడు చనిపోయాడు అతనికి పెళ్లి కాలేదు... ఈ మధ్య మా నాన్నగారు చనిపోయారు.. మా నాన్నగారి కష్టార్జీతం ఓ 3 సెంట్లు ఇల్లు ఉంది అది మా అమ్మగారి పేరు మీద రాసేసారు... ఇప్పుడు మా అమ్మగారు భర్త ద్వారా సక్రమించిన ఆస్థిని తన పిల్లల్లో ఎవరైన ఒకరికి బహుమతిగా గాని, విల్లు వ్రాసికాని ఇచ్చెెయవచ్చును ... ఇతర పిల్లలనుండి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా తెలుపు గలరు.
ధన్యవాదములు.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు