పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వరకట్నం

ఈ విభాగంలో వరకట్నం గురించి వివరించడం జరిగింది.

వరకట్నం యొక్క అర్థం

వరకట్నం అంటే ఏదైనా ఆస్తి లేదా విలువైన వస్తువును వధువు వరుడికి ఇవ్వటం లేదా వరుడు వధువుకు ఇవ్వటం అని అర్థం లేదా

 • వధువు లేదా వరుడి తల్లిదండ్రులు లేదా ఏ ఇతర వ్యక్తి ద్వారా ఇవ్వటం
 • వివాహంలో లేదా వివాహం ముందు లేదా పెళ్లి తర్వాత ఏసమయంలో అయినా ఇవ్వటం.
 • ఇవ్వటం, తీసుకోవటం, అడగటం లేదా కట్నం కోసం ప్రకటనలు చేయటం నేరం
 • ఎవరైనా అతని/ఆమె కుమారుని లేక కుమార్తె లేదా బంధువుల వివాహంలో కట్నం తీసుకోవటం నేరం

అయితే, చట్టం కళ్యాణంలో పెళ్ళికొడుకుకు లేదా వధువుకు కొన్ని బహుమతులను ఇవ్వటాన్ని అనుమతిస్తుంది. దానికి కావలసినని:

 • బహుమతుల జాబితా వ్రాయాలి
 • వివాహ సమయంలో లేదా పెళ్లి తర్వాత వెంటనే జరగాలి
 • రమారమి విలువతో ప్రతి బహుమతి క్లుప్త వివరణ పొందుపరచాలి
 • బహుమతి ఇచ్చిన వ్యక్తి పేరు పేర్కొనాలి
 • వధువు లేదా వరుడితో సంబంధం తెలియచేయాలి
 • జాబితాపై పెళ్ళికూతురు మరియు పెళ్ళికొడుకు సంతకం చెయ్యాలి
 • ఇటువంటి బహుమతులు ఆచారాకు సంబంధించి ఉండాలి మరియు దాని విలువ బహుమతి ఇచ్చిన వ్యక్తి ఆర్ధిక స్థితికి సంబంధించి అధికంగా ఉండకూడదు.
 • అటువంటి బహుమతులకు ఏడిమాండ్ లేదా బలవంతం ఉండకూడదు! తలి తండ్రులు పైవిధంగా చేస్తే వరకట్న చట్టం శిక్షా అంశాలను వర్తింపచేయరు.

వరకట్నం ఏ పార్టీ అయినా తీసుకుంటే అది భార్యకు ప్రయోజనంచేకూరేలా ఉండాలి, దానిని బదిలీ చేస్తే అమె వారసులు వరకట్న చట్టం కింది శిక్షించబడతారు.

 • వరకట్న ఇవ్వడం లేదా తీసుకోన్నందుకు పడే శిక్షలు: 5 సంవత్సరాలకు తక్కువకాకుండా కారాగారం మరియు 15 వేల రూపాయల జరిమాన, వరకట్నం 15 000 వేల కంటే ఎక్కువ ఉంటే వరకట్న మొత్తానికి సమానమైన జరిమాన ఉంటుంది.
 • ఐపిసి విభాగం 498a నేరం క్రూరత్వాన్నితెలుపుతుంది.
 • క్రూరత్వం : భర్త లేదా భర్త బంధువులు క్రూరంగా ప్రవర్తిస్తే, అతనికి లేదా బంధువుకు జైలు శిక్షను వేస్తారు. అది 3 సంవత్సరాల వరుకు ఉండవచ్చు లేదా జరిమానా కూడా విధించవచ్చు.
 • ఒక మహిళను అవయవాలు లేదా ఆరోగ్యం పాడయ్యేలాగా కొట్టడం లేదా గాయాలు చెయటం హింసించటం మరియు అమె ఆత్మహత్యాయత్నం చెసుకునెలా చేయటం క్రూరత్వం.

మానసిక మరియు భౌతిక క్రూరత్వం - హింస, బెదిరించడం, బలవంతంగా కొంత నగదు లేదా ఆస్తి తీసుకు రమ్మనటం. అలా చెయకపోతే ఆమె బంధువులు ద్వారా వేధింపులు. మగ పిల్ల వాడు కావాలనో లేదా ఇతర పిల్లులు మె. కావాలని వేధించటం.

బాధితురాలు, తన బంధువులు లేదా ఏదైనా గుర్తించబడిన సంక్షేమ సంఘం ద్వారా విభాగం 498a ఐపిసి కింద లేదా వరకట్న నిషేధ చట్టం కింద క్రూరత్వం ఫిర్యాదు చేయవచ్చు.

కట్నం మరణం - విభాగం 304B ఐపిసి

ఈ క్రింది పరిస్థితులో వరకట్న మరణం కేసును పెట్టవచ్చు:

 • ఒక మహిళ మరణం కాలిన గాయాలు, శారీరక గాయాల వలన లేదా అసహజ పరిస్థితుల్లో సంభవించినప్పుడు మరియు మరణం వివాహం జరిగిన 7 సంవత్సరాల లోపల జరుగితే ఈకేసు పెట్టవచ్చు.
 • అటువంటి సందర్భంలో ఆమె భర్త మరియు అత్తమామలను బాధ్యులుగా చేస్తారు. దోషులుగా రుజువైతే శిక్ష కనీసం 7 సంవత్సరాలు ఖైదు లేదా జీవిత ఖైదు వరకు ఉండవచ్చు.
 • ఆమె మరణం ముందు, ఆమె భర్త లేదా భర్త బంధువులు క్రూరంగా కట్నంకోసం వేధింపులు చేసినట్లైతే అప్పుడు అటువంటి మరణం "వరకట్న మరణం" అవుతుంది.
 • ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వరకట్న నిరోదక అధికారిని నియమించేలా చట్టం చేస్తుంది. (DPO)
 • చట్టం యొక్క నిబంధనలు సరిగా అమలు అయ్యేలా చూడటం DPO బాధ్యత.

కట్నం అనేది ఒక దుష్ట కార్యం దీనిని కూకటి వేళ్లతో పెకలించాలి. ప్రతి ఒక్కరు దీనికి వ్యతిరేకంగా నిలబడితేనే ఇది సాధ్యపడుతుంది. చాలా మంది బాలికలు చిత్రవధకు గురవతున్నారు, కాలిపోతున్నారు మరియు వారిని కట్నంకోసం కాల్చేస్తున్నారు మరియు చంపేస్తున్నారు. చట్టం ఉంది, కానీ దానిని ఉపయోగించాలి.

ముఖ్యమైన కోర్టు నిర్ణయాలు

రి: ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ వరకట్న నిషేధ చట్టం, 1961 రిట్ పిటిషను (సివిల్) 1997 నం 499

 • వరకట్న డిమాండ్ గురించి సుప్రీం కోర్టు ఈ కేసులో "సమాజం యొక్క మనస్సాక్షిని వరకట్న విధానాన్ని వ్యతిరేకించే లాగా జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. మన తెలివైన మహిళలు వారిని ఒక వాణిజ్య వస్థువుగా చూడటానికి వ్యతిరేకంగా పోరాడే సందర్భాలు పెరుగుతాయనడానికి మాకెలాంటి సందేహంలేదు. మన చదువుకున్న యువకులు కూడా వివాహ మార్కెట్ తమను అమ్మటాన్ని వ్యతిరేకస్తారని మరియు వారు తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో న్యాయమైన పద్ధతి అనుసరిస్తారని ఆశిస్తున్నాము".

మూలం: జాతీయ మహిళా కమిషన్

2.8813559322
ధన కుమార్ Sep 12, 2019 03:17 PM

మగవాళ్ళు వరకట్నం ఎందుకు తీసుకోవాలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు