హోమ్ / సామాజిక సంక్షేమం / మానవ హక్కులు / మానవ హక్కుల భోధన - విధ్యర్ధుల పార్ ప్రణాళిక
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మానవ హక్కుల భోధన - విధ్యర్ధుల పార్ ప్రణాళిక

మానవ హక్కుల భోధన - విధ్యర్ధుల పార్ ప్రణాళిక

మానవత్వపు వెదుకులాట

పిల్లవాడు : అమ్మ! అమ్మా .

తల్లి:నీవెందుకు అరుస్తున్నావు
పిల్లవాడు : నీవు తోటలో ముళ్ళపొదను నరికావు కదా? నరకలేదా?
తల్లి:అవును ! ఇప్పడేమైంది
పిల్లవాడు : ఆ ముళ్ళ చెట్టు మళ్ళ మొలకెత్తింది
తల్లి: ఓరి దేవుడో ! దాన్ని మళ్ళీ నరకాలి
పిల్లవాడు : అవునమ్మా ! దాన్ని మనం నరకాలి. (తల్లి, కొడవలితో క్రొత్తగా మొలకెత్తిన కొమ్మలను నరుకుతుంది. కొన్న రోజులు తర్వాత తోటలో ఆడుకోవడానికి వెళ్ళిన, ఆ ముండ్లచెట్టు మరలా కొమ్మలు వేయటాన్ని గమనించిన పిల్లవాడు, తిరిగి తల్లి దగ్గరికి పరిగెత్తాడు.)
పిల్లవాడు : పదేపదే నరుకుతున్నప్పటికీ, ఆ ముళ్ళచెట్టు, మళ్ళీ మళ్ళీ ఎందుకు మొలకెత్తుతుంది.
తల్లి : ෂඩ් ෂරජී.
పిల్లవాడు : దయచేసి నాకు చెప్ప మమ్మీ
తల్లి : ఆ మొక్కకి కూడా ప్రాణం ఉంది. అందువలన
పిల్లవాడు : దానికి ప్రాణముందా?
తల్లి:దానికి ప్రాణం ఉంది కాబట్టే, చనిపోవటానికి ఇష్టముండదు
పిల్లవాడు : కాబట్టి
తల్లి : దానికి ప్రాణం ఉంది కాబట్టే, దానికి జీవించాలనే కాంక్ష ఉంది.
పిల్లవాడు : ఈ ముండ్ల చెట్టుకి మాత్రమే ప్రాణముందా?
Chapter1 image1

తల్లి:: ఓ నాన్నా! నీవు చాలా తెలివైన వాడివి. పరిశోధనాత్మక ప్రశ్నలడుగుతున్నావు

పిల్లవాడు: దయచేసి నాకు చెప్పమ్మా!

తల్లి: నాకు చాలా పనుంది. సాయంత్రం నాన్నగారు వచ్చినపుడు అడగు (సాయంత్రం - తండ్రి ఆఫీసు నుండి తిరిగివస్తాడు)

పిల్లవాడు:: నాన్నా! నాన్నా! మమ్మీ చాలా చెడ్డది.

తండ్రి: ఏమి జరిగింది.

తల్లి: ఉదయం నుండీ, ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రశ్నలడుగుతున్నాడు. మీరు మాత్రమే వాడికి సమాధానాలు చెప్పగలరు.

తండ్రి:ఏమిటి నాన్నా నీ సమస్య

పిల్లవాడు:: మన తోటలో ముళ్ళ చెట్ట లేదా? పోయిన వారం, అమ్మా దాన్ని నరికివేసింది. తిరిగి ఈ రోజు అది మళ్ళీ మొలకెత్తింది. మళ్ళీ అది ఎందుకు మొలకెత్తుతుందని. నేను వ్య అడిగాను, దానికి బ్రతకాలని కోరుకుందని అమ్మ సమాధానమిచ్చింది. ?

తండ్రి: ఈ ప్రపంచంలోని ప్రాణులన్నీబ్రతకాలని కోరుకుంటాయి. బ్రతుకును ఇష్టపడతాయి. ఇది ప్రతి ఒక్కరికీ, ప్రతి దానికీ సాధారణమే, నాన్నా!

పిల్లవాడు:ఆకాంక్ష సర్వసాధారణమైనప్పడు, దాన్ని నరకాలనుకోవటం తప్పకాదా?

తండ్రి:నీవంటున్నది నిజమే !

పిల్లవాడు: ఈ ఆకాంక్ష మొక్కలకి ఉన్నటైతే, మరి మనుషులుకి కూడా అది ఉండాలి కదా ! ఇది నిజం కాదా నాన్నా!

తండ్రి:: నిజమే తప్పకుండా ప్రతి ఒక్కరికి కోరికలు, ఆకాక్షలు ఉంటాయి.

పిల్లవాడు: నీకైమనా ఆకాంక్షలున్నాయా, నాన్నా?

తండ్రి:: నాకు ఉన్నాయి, మీ అమ్మకు ఉన్నాయి. నీకు కూడా !

పిల్లవాడు: నాకు కూడానా? నేను దేని కోసం ఆకాంక్షించటం లేదు.

తండ్రి: కాదు, కాదు. నీకు కూడా తప్పకుండా ఉన్నాయి.

పిల్లవాడు: ఎలా నాన్నా!

తండ్రి:నీవు ఆలోచించటం లేదా, నీవు అడిగింది ప్రతిదీ మేము కొనిపెట్టాలని నిన్ను మేము పండుగలకి తీసుకెళ్ళాలని నీవు అనుకోవటం లేదా? నీకు, మేము టోఫీలు కొనిపెట్టాలని నీవనుకోవటం లేదా ? ఇదే మాదిరిగా నీకూ చాలా ఆకాంక్షలుండవచ్చు.

పిల్లవాడు: ఇది ఆకాంక్ష అవుతుందా నాన్న!

తండ్రి: కొంతమందికి ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షఉండవచ్చు. కొంతమందికి దేవుడికి భక్తులు కావాలని ఉండవచ్చు. కొంతమందికి, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని ఉండవచ్చు. కొంతమందికి స్వేచ్చగా ఉండాలని ఆకాంక్ష ఉండవచ్చు కొంతమందికి, సమాజం తమల్ని సమానంగా చూడాలని ఆకాంక్ష ఉండవచ్చు. ఈ మాదిరిగా, అనేక మందికి అనేక ఆకాంక్షలుండవచ్చు

పిల్లవాడు : ఈ విషయాల గురించి మనమేమి చేయగలం?

తండ్రి : మనం మానవులం. మనం, కేవలం, మన ఆకాంక్షల గురించే ఆలోచించి, కంగారు పడకూడదు. ఇతరుల గురించి కూడా ఆలోచించి, వారి ఆకాంక్షలను కూడా అర్థం చేసుకోవాలి.

పిల్లవాడు : మన పొరుగింటి మల్లిక స్కూలుకి రావటం లేదు. ఆమెకి స్కూలుకు పోవాలని ఆకాంక్ష లేదా నాన్న?

తండ్రి : తప్పకుండా ఉంటుంది. దీనినే మనం జీవితం కోసం ఆకాంక్ష అని చెప్పకుంటాం.

పిల్లవాడు : అప్పడు, నాన్నా మరి నాకు ఒక విషయం చెప్పండి. ఈ ఆకాంక్షలు మన మనస్సులో ఎప్పడు, ఎలా ప్రతిఫలిస్తాయి.

తండ్రి : మంచి ప్రశ్న! మనం పుట్టినప్పటి నుండి, ఈ ఆకాంక్షలు మనతో ఉంటాయి. మన మనస్సులో ఎప్పడూ ఉంటాయి. ఒక మనిషి కష్టాలలో ఉన్నప్పడు, ఇవి తెలుస్తుంటాయి. చూడు ! నా దగ్గర కొన్ని వార్తాపత్రికల కటింగ్లున్నాయి. ఈ సంఘటనలు కొన్నింటిని, నేను చదువుతాను. జాగ్రత్తగా విను! అప్పుడు నేను చెప్పింది నీవు అర్థం చేసుకోగలవు.

మానవ లక్షణాలు-1

సంగీత వయస్సు 14. ఆమె, మానవ మలాన్ని ఎత్తివేసే ఒక దళిత కులానికి చెందిన అమ్మాయి. క్లాస్ టీచర్, ఆమెని, తోటి విద్యార్థులతో కలిసి కూర్చోటానికి అంగీకరించడు. ఆమె ఆఖరి బెంచీలోనే కూర్చోవాల్సి ఉంటుంది. ఆమె బాగానే చదువుతున్నప్పటికీ ఈ విధంగా అవమానింప బడుతున్నందు వలన ఆమె, తన చదువుల్ని మేము మనుషులం కామా? మాకు గౌరవం లేదా? మా ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని మాకు కోరిక ఉండదా? వారు మమ్మల్ని ఇతరులతో సమానంగా చూడరా?

మానవ లక్షణాలు -2

మరణశయ్యపై పడుకొని ఉన్న వృద్దుడు ఏదో గొణిగాడు. మీకు తెలుసా అతను ఏమి గొణిగాడో, చనిపోయిన తరువాత తనని పాతి పెట్టడానికి ఆరడుగులు నేల కావాలని కోరుతున్నాడు. అతను నివసించే చోట స్మశానవాటిక లేదు. ఇప్పటికే, జిల్లా కలెక్టర్కి అప్లికేషన్ పెట్టాడు. దానిలో "నేను జీవిత అంత్య దశలో ఉన్నాను. మేము నివసించే ప్రాంతంలో స్మశానవాటిక లేదు. నా మరణం తర్వాత నేనెవర్నీ ఇబ్బంది పెట్టకూడదనుకుంటున్నాను. దయచేసి, మాకు స్మశాన స్థలాన్ని మంజూరు చెయ్యండి. నా ఆత్మకి శాంతి చేకూరుతుంది."

 

మానవ లక్షణాలు -3
లక్ష్మి (32), చెన్నై ఆమె భర్త ఆమెని మంటల్లో కాల్చాడు. ఆమె, తన జీవనం కోసం పూలమ్మతుంది. అతను మద్యం త్రాగివచ్చి, తన భార్యను కొడుతుంటాడు. ఒక రోజు, భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకునే సమయంలో, అతను, ఆమెపై కిరోసిన్ పోసి నిప్ప పెట్టాడు. ప్రస్తుతం ఆమె తన పిల్లలతో నివసిస్తుంది. ఆమె శరీరంపై ఉన్న కాలిన మచ్చలే ఆమె వైవాహిక జీవితం గురించి గ్రంథాల కొద్దీ చెబుతాయి. అయినప్పటికీ ఆమె, తన భర్తతో ఉండాలనేకోరుకుంటోంది ఇప్పటికీ ఎందుకు, భర్తతో ఉండాలని కోరుకుంటున్నారని ఆమెని అడిగినప్పడు, ఆమె ఏమి సమాధానం చెప్పిందో మీకు తెలుసా? "నా నలుగురు పిల్లల ఆలనా పాలనా ఎవరు చూస్తారు. పిల్లల భవిష్యత్తు కారణంగా కేసుని ఉపసంహరించుకొని, అతనితో రాజీపడి బ్రతుకుతున్నాను."
మానవ లక్షణాలు - 4
జానూ వయస్సు కేవలం 30 సంnరాలే. ఆమె కేరళ రాష్ట్రంలో ఉంటుంది. తన రాజీలేని పోరాటం ద్వారా, ఆమె మూడు లక్షల గిరిజనుల హక్కుల పరిరక్షించింది. ఆదివాసీలు తమ యొక్క అమాయకత్వం వలన తమ భూముల్ని కోల్పోయారు. వారి బాధలకు ఇదే మూలకారణమని గుర్తించిన ఆమె, గిరిజనులను ఒక సంఘంగా ఐక్యం చేసింది. వారు కలిసికట్టుగా పోరాటం చేసి, తమ భూములను తిరిగి స్వాదీనం చేసుకున్నారు. తమ జీవితాల్ని కాపాడిన జానూను, కేరళ గిరిజనులు, తమ దేవతగా భావిస్తారు.
మానవ లక్షణాలు - 5

కలైమ్మాల్ చెన్నైలో ఉంటుంది. ఆమె తండ్రి, ఆమెను డబ్బుకోసం ఒక వృద్దుడికిచ్చి పెళ్ళి చేసాడు. అతనితో ఉండటానికి ఆమెకి ఇష్టం లేదు. అందువలన ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. వృద్ధురాలైన తన భార్య ఆదాయంపై నివసిస్తున్న ఆమె తండ్రి, హఠాత్తుగా చనిపోయాడు, ఈ సంఘటనలన్నీ కలైమ్మాల్ని మానసిక రోగిని చేసాయి. ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆమెకే తెలియని పరిస్థితిలో ఒక రైలెక్కి చెన్నైసెంట్రల్ రైల్వేస్టేషన్లో దిగింది. మెజిస్టేట్ ఆదేశాల ప్రకారం, ఆమెని మానసికచికిత్సాలయంలో చేర్చారు. ఆమె, ఇప్పటికీ, అక్కడనే ఉంది. ప్రస్తుతం ఆమెకి మానసిక అస్వస్థత పూర్తిగా తగ్గింది. అయినప్పటికీ, ఆమె బంధువులు, ఆమెని తమ ఇంటికి తీసుకెళ్ళటం లేదు. నేనిప్పడు బాగానే ఉన్నాను. దీపావళి, ఇతర పండుగల సందర్భంగా నన్ను ఇంటికి పిలిచే బంధువలందరికీ ఈ విషయం తెలుసు. అయినప్పటికీ, నన్నెవరూ ఇంటికి తీసుకుపోవటానికి సిద్ధంగా లేరు. నా ఆరోగ్య పరిస్థితి బాగుపడిందని తెలిస్తే, నా సోదరులు నన్ను ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. నేను, వారిని కలిసి చాలా కాలమైంది. దయచేసి, అందుకు కావాల్సిన ఏర్పాట్లు, మీరు చేస్తారా" - 5–5–2002 దినకరన్ పత్రిక

పిల్లవాడు : నేను బాగా ఆందోళనకి గురయ్యాను నాన్నా ప్రతి ఒక్కరికి మనస్సులో అనేక ఆకాంక్షలు దాగి ఉంటాయని, ఇప్పడు నాకు అర్థమైంది.

ఆకాంక్షలు లక్షణాలు

బ్రతకాలనే కోరిక ప్రాణులన్నింటికీ సమానమేనని, మనకీ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఈ ఆకాంక్షలు లేదా కోరికలేమిటో మనం తెలుసుకోగలమా?

శాంతియుతంగా జీవించాలంటే, తాము చేపట్టే రాజకీయ, ఆర్థిక, సామాజిక కార్యకలాపాలకి సంబంధించి, రాజ్యం, కార్పోరేట్ రంగం, పౌర సమాజాలు- ప్రజలందరి యొక్క మరీ ముఖ్యంగా దుర్భల వర్గాల భద్రతని దృష్టిలో పెట్టుకోవాలి. వారి సమాజంలో వారికి విలువనిచ్చే అంశాల నుండి వారిని వేరు చేయకుండా, అదే విధంగా వారు నివసించే సహజ పర్యావరణంలో వారి భద్రతకి భంగం కలిగించకుండానూ, అణచివేత, దోపిడీ, హింసలకి తావు లేకుండా, వారి అవసరాలు, ఆకాంక్షలు తీర్చుకోవడానికి, రాజకీయ, ఆర్థిక సామాజిక పరిస్థితులు వారికి భద్రత కల్పించాలి.

(నిబంధన 4= ఆసియా మాన్దక్కల ప్రణాళిక ప్రజల ప్రణాళిక = 1998)

3. ప్రేమ పూర్వక సంబంధం కోసం ఆకాంక్ష :నా తల్లి, తండ్రి నా పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలి. మా టీచర్ నాతో ప్రేమ పూర్వకంగా మాట్లాడాలి. నా తోటి విద్యార్థులు నాతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.

4. జ్ఞానం కోసం ఆకాంక్ష: నా జ్ఞానం అభివృద్ధిచెందాలి. మంచి టీచర్లు కావాలి. నాకు అన్ని రకాల పుస్తకాలు కావాలి. స్కూలులో ఆటలాడటానికి మంచి సదుపాయాలు

5. సృజనాత్మక కార్యకలాపాల కోసం ఆకాంక్ష :బొమ్మలు గీయటమంటే నాకెంతో ఆసక్తి, ఏ దృశ్యం చూసినా, నాకు వెంటనే బొమ్మ గీయాలనిపిస్తుంది. నేను బొమ్మలు గీస్తున్నప్పడు చూసిన వారెవరైనా, నన్ను నిందించి, పారాలు చదవమని చెబుతున్నారు. ఎవరి జోక్యం చేకుండా, బొమ్మలు గీయాలనుకోవటమే నా ఆకాంక్ష

అనందం, ప్రేమ ఉన్న పరిస్థితులు, సంబంధాల ద్వారానే బాలల యొక్క పూర్తి స్థాయి అభివృద్ధి సాధ్యమవుతుంది. వీల్లల యొక్క హక్కులకి సంబంధించి కుదరిన ఒప్పందానికి, ఉపోద్ఘాతం, ఐక్యరాజ్యసమితి - 1989

6. నిజాయితీతో కూడిన జీవితం గడపటానికి అకాంక్ష .

నా తోటి విద్యార్థులకు డబ్బులు బాగా ఉన్నాయి. నోట్బక్స్, ఇతర పుస్తకాలు కొనడానికి అబద్దాలు చెప్పి, వారి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఈ మాదిరి విషయాలు నేను ఇష్టపడను. మరోవైపనా స్నేహితుల్లో కొంతమంది మధ్యాహ్నం భోజనమే తెచ్చుకోరు. ఎందుకు తెచ్చుకోలేదని అడిగితే, తమ దగ్గర డబ్బులు లేవని చెప్పారు. ఎందుకు కొంతమంది ప్రజలు ధనికులు గానూ, మరి కొంతమంది పేదవారు గానూ ఉంటున్నారు.ప్రతి ఒక్కరూ, వారి యొక్క అవసరాలు తీర్చుకొనే పరిస్థితులు ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నారు.

7. దేవుడిలో నమ్మకం కోసం ఆకాంక్ష :

దేవుడిలో నాకు గొప్ప నమ్మకం ఉంది దేవుళ్ళ మతాల పేరు మీద హింస ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. నేను మత సామరస్యాన్ని ఆకాంక్షిస్తాను

 

8. సామాజిక స్థాయి కోసం ఆకాంక్ష.

నా తండ్రి, జీవనోపాధి కోనం మరుగుదొడ్లను శుభ్రపరుస్తుంటాడు. నేను 8వ తరగతి వరకు చదువుకున్నాను, పేదరికం వలన, చదువు మధ్యలో ఆపేసాను. కాని చదువును కొనసాగించాలనే కోరిక నాకు బాగా ఉంది. అంతేకాదు. నాకు డాక్టర్నికావాలని కూడా కోరిక ఉంది గాని అది నెరవేరలేదు. కనీసం వచ్చే జన్మలోనైనా, నా కలలుల నిజమవుతాయని ఆశిస్తున్నానంటూ 14 సంవత్సరాల సుగుణ తన ఆకాంక్షని తెలిపింది.

 

 

స్వాతంత్ర్యం కోసం ఆకాంక్ష

నాపేరు మీరా, నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మా తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ, మా తమ్ముడు, తన స్నేహితులతో ఆటలాడుకుంటాడు. నేను అమ్మాయిని కాబట్టి, ఆటలాడకూడదని, ఇంట్లోనే ఉండాలని మా అమ్మ చెపుతుంది. అందువలన నేను ఇంట్లోనే ఉంటున్నాను. మా తమ్ముడు లాగానే నేను, నా స్నేహితురాళ్ళతో కలిసి, ఆటలాడుకోవాలని నా ఆకాంక్ష.

 

విద్యార్ధులతో టీచర్ చేయించాల్సిన అభ్యాసం

క్లాస్రూమ్ అభ్యాసం

1. ఎ. ఇప్పటికి అనేకమంది ప్రజల ఆకాంక్షలను మీరు చదివే ఉన్నారు. వాటిని చదివిన తరువాత, మీ అనుభూతులెలా ఉన్నాయి.

(ఎ) ఆందోళన చెందారు. (బి) ఆశ్చర్యపోయారు (సి) సంతోషంగా ఉన్నారు (డి) ఏ అనుభూతులూ లేవు.

బి. క్రింద పేర్కొన్న వ్యక్తులు ఏమి కోల్పోయారు.

  • సంగీత కోల్పోయిన హక్కులు
  • వృద్దుడు కోల్పోయిన హక్కులు
  • లక్ష్య్  కోల్పోయిన హక్కులు
  • కలైమ్మాల్ కోల్పోయిన హక్కులు

సి. జానూ ఆకాంక్షలు, మిగతావారి ఆకాంక్షల నుండి ఏ విధంగా భిన్నంగా ఉన్నాయి.

డి. భిన్నరకాలుగా ఉన్న వారి ఆకాంక్షలు నెరవేరకపోవటానికి కారణం.

2. ఎ. మీ తండ్రి పనికెందుకు వెళ్తున్నాడో కారణాల్ని క్లాస్రూమ్లో వివరించండి.

బి. మీ తండ్రి మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నాడో కారణాలు తెలిపి, వాటిని క్లాస్రూమ్ విద్యార్థులతో చర్చించండి.

సి. టీచర్ పారాలు ఎందుకు బోధిస్తాడు. అందుకు గల ప్రధాన కారణాలను తెలిపి, వాటిని క్లాస్రూమ్ విద్యార్థులతో చర్చించండి.

3. బావి దగ్గర ఆటలాడుకుంటున్న పిల్లవాడు, అనుకోకుండా దేనిపైనో దొర్లిపడి, అక్కడి నుండి బావిలో పడిపోయాడు. మీకు ఈతరాదు. మీరేమి చేస్తారు? ఎందువలన చేస్తారు?

ఎ. విద్యార్థులు తమ అభిప్రాయాలను చర్చించాలి.

బి. చివరిగా టీచర్ విద్యార్థుల అభిప్రాయాలన్నింటినీ సమీక్షించి తన అభిప్రాయాలను కూడా వివరిస్తాడు.

ఎలాంటి హింసకు గురికాకుండా ఆనందంగా జీవనాన్ని కొనసాగించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

ఆసియన్ పీపుల్స్ హ్యూమన్ రైట్స్ డాక్యుమెంట్ - 1988

4. మీరు గాని మరెవరైనా గాని ఇంట్లోని కోడిని లేదా మరేదైనా పెంపుడు జంతువును గట్టిగా పట్టుకున్నప్పుడు దాని అనుభూతులెలా ఉంటాయో ఊహించండి.

ఎ. మీ అభిప్రాయాల్ని మీ క్లాస్ రూమ్ విద్యార్థులతో చర్చించండి.

బి. చివరగా టీచర్, తన అభిప్రాయాల్ని వివరిస్తాడు.

5. పాఠం యొక్క శీర్షికను దృష్టిలో పెట్టుకొని

ఎ. మీకు ఇష్టమైన ప్రాణులతో ఒక ఊహాత్మకమైన ఇంటర్వ్యూను ప్రచురించండి. (బాక్టీరియా, పాకే జంతువులు, పక్షులు, ఇతర జంతువులు, వృక్షజాలం, ఇంకా ఇతర ప్రాణులు,

బి. ఈ ఇంటర్వ్యూను క్లాస్రూమ్ విద్యార్థులతో చర్చించండి.

6. ఈ మధ్యకాలంలో మీ తీరిన ఆకాంక్షలు, తీరని ఆకాంక్షలు ఒక పేపర్ పై జాబితాగా వ్రాయండి.

ఎ.

బి.

సి.

ఎ.

బి.

సి.

7. మీకు ఇష్టమైన ఆకాంక్షలలో రెండింటిని, పేపర్ పై వ్రాసి (మీ పేరు వ్రాయకుండా) టీచర్ గారి టేబుల్ పై పెట్టండి. అప్పడు టీచర్, అన్నింటినీ క్రోధీకరించి, విద్యార్థులతో ఒక చర్చను నిర్వహించి ఆ తరువాత తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకుంటాడు.

8. ఒక విద్యార్థి క్లాస్రూమ్లో పెద్దగా పద్యాన్ని చదువుతుంటే, మిగతా విద్యార్థులు దాన్ని తిరిగి చెప్పాలి. చదివిన తరువాత పద్యంలోని ప్రాణుల యొక్క ఆకాంక్షలను బ్లాక్బోర్డుపై వ్రాయాలి.

ప్రతి వ్యక్తి  తను, తన కుటుంబం యొక్క పేరు, ప్రతిష్టలకి, గౌరవానికి, భంగం కలిగించే దాడులు లేదా దుప్రచారాలకి వ్యతిరేకంగా చట్టం నుండి రక్షణం పొందే హక్కును కలిగి ఉన్నాడు. - నిబంధన-5, మానవహక్కలు, బాధ్యతల గురించి అమెరికన్ డిక్లరేషన్, 1948.

జీవన ప్రతిధ్వని

జీవన ప్రతిధ్వనిని మనం ప్రతిచోటా చూస్తుంటాం. చెట్టు కొమ్మను నరికితే, మళ్ళీ కొత్త కొమ్మలు, కొత్త ఆకులు పుట్టుకువస్తాయి. అందంగా తీర్చిదిద్దటం కోసం, గులాబీ మొక్కను కత్తిరిస్తే మళ్ళీ కొత్త ఆకులు పట్టుకొస్తాయి. సీతాకోకచిలుకను పట్టుకుంటే, అది రెక్కలు కదిలిస్తుంది. వదిలెయ్యండి అది ఆనందంతో ఎగిరిపోతుంది. గొంగళిపరుగును ముట్టకోండి. అది గుండ్రంగా ముడుచుకుపోతుంది. కొంచెంసేపయిన తరువాత, మరలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. నత్తగుల్లను పట్టుకుంటే అది తన తలను కర్సరం లేదా చిప్పలోనికి తీసుకు మరలా కొంతసేపయిన తరువాత, తలను బయటపెట్టి, శాంతియుతంగా తన ప్రయాణం కొనసాగిస్తుంది. కుక్కకి రాయి తగిలితే అది అరుస్తుంది. తన ప్రాణం విలవిల్లాడిందని అది వాపోతుంది. పాల కోసం ఆకలిగొనిఉన్న పాప, ఏడుస్తుంది. టీచర్ చేతిలో బెత్తం చూడగానే, పిల్లలు వణికిపోతారు. ఒకవేళ పిల్లవాడ్ని కొడితే, అతని మనసు గాయపడుతుంది.

జీవనోత్సాహాన్ని లేదా స్థాయిని గుర్తించటానికి డాక్టర్లు నాడిని పట్టుకుంటారు. మనం ఎక్కడ చూసినా జీవితం కదలాడుతూనే ఉంటుంది. అదే, జీవితం యొక్క ప్రతిధ్వని. అందువలననే ఓ నా పిల్లలారా, ప్రాణులను బ్రతకనివ్వాలి, ప్రాణుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలి. వేయి పువ్వులు వికసించటానికి మనం తోడ్పాటునివ్వాలి.

వేల వేల ప్రాణులు మనల్ని హృదయ పూర్వకంగా అభినందించనీ.

ఇంటివద్ద అభ్యాసం

మీ స్నేహితులు / బాలిక, బాలుడు లేదా వృద్దుడు. ఎవరైనా కావచ్చు. వారితో మాట్లాడి వారి ఆకాంక్షలను తెలుసుకోండి.

ఆకాంక్ష మీ స్నేహితులు / బాలిక, మీ స్నేహితులు / బాలుడు,                                 వృద్దుడు

ఆకాంక్ష 1

ఆకాంక్ష 2

ఆకాంక్ష 3

మానవులు కూడా శరీరంలోని వివిధ అవయవాల లాంటి వారే. శరీరంలో ఒక భాగం దెబ్బతింటే ఇతర భాగాలు కూడా ఎంతో మేరకు అప్రభావానికి లోనవుతాయి. అదేవిధంగా సమాజంలోని ఒక వ్యక్తికి ఏమైనా జరిగితే ఇతర వ్యక్తలు స్తబ్దంగా ఉంటారు.

సామాజిక జీవితం

మీ అందరికే యం.జి.ఆర్. అంటే ఎవరో తెలుసు. ఆయన తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసాడు. చాలా సినిమాల్లో నటించాడు. 'బానిస ఫ్రీ సినిమాలో ఆయన రాకుమారుడు పాత్రలో నటించాడు. ఈ కథలో విలన్ రాజుని చంపి, రాకుమారుడిని జైలులో బంధిస్తాడు.

ఒంటరి ఖైదీగా జైలుగదిలో బంధించబడిన రాకుమారుడు, తన బాల్యం మొత్తం అక్కడే గడపాల్సి వస్తుంది. యవ్వనం ప్రారంభమయే దశలో అంటే నూనూగు మీసాలు మొలకెత్తే వయస్సులో అతన్ని జైలు నుండి విడుదల చేస్తారు. అప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసా? అందువలన అతను ఎవరితోనూ కలవకలేకపోతాడు. ప్రతిమనిషి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఆ వయస్సు కుర్రవాళ్ళకి ఉండాల్సిన జ్ఞానం అతనికి లేదు. ప్రజలు కనబడినప్పడు, అతను, వారివైపు కళ్ళప్పగించి చూస్తుంటాడు. కొంతసేపయిన తరువాత, అంటే వారికి దగ్గరైన కొంతసేపటికి వారిని గుర్తించటం మొదలుపెడతాడు. భాష నేర్చుకుంటాడు, వ్యక్తుల్ని గుర్తించి, వారితో కలిసిమెలసి ఉండటానికి అలవాటుపడతాడు.

ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకుంటున్నాం ?

మనందరి లాగానే ఈ కథలు చూపించిన బాలుడు కూడా, ఒక కుటుంబంలో పట్టాడు. కాని, మనలాగా తల్లిదండ్రులతో కలిసిమెలసి ఉండటానికి, అతనికి అవకాశం లభించలేదు. అంతేకాకుండా, సమాజంతో సంబంధాల్లేకుండా, ఒంటరిగా జైల్లో బంధించబడతాడు. అందువలన, అతను మాట్లాడలేకపోతాడు. ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోతాడు. తన పరిసరాల గురించి, అతనికి ఎటువంటి పరిజ్ఞానం లేదు. మనిషి సమాజంలో జన్మిస్తాడు. సమాజంలో జీవించినప్పడు మాత్రమే, అతనికి వాస్తవ జ్ఞానం అబ్బతుంది. సమాజం నుండి ప్రతి విషయాన్నీ నేర్చుకుంటాడు. తల్లి, తండ్రి, ఇతరులతో సహజమైన మానవ సంబంధాలు ఏర్పరుచుకుంటాడు. అతడు గనుక ఒంటరిగా జీవించినట్లయితే, అతన్ని మనిషిగా భావించలేం. అందవలననే, మనం మనిషిని సామాజిక జంతువుగా పిలుస్తుంటాం.

ఉదాహారణకి, అప్పడే పట్టిన బాలుడ్ని ఒక విదేశీయుడు దత్తత తీసుకొని, వారి దేశం తీసుకెళ్ళాడని అనుకుందాం. ఆ బాలుడ్ని అక్కడే పెంచటం జరుగుతుంది. కాబట్టి, ఆ బాలుడు తెలుగు మాట్లాడతాడా లేక విదేశీ భాష మాట్లాడతాడా, తప్పకుండా తను పెరిగినటువంటి విదేశీ భాష మాత్రమే మాట్లాడగలుగుతాడు?

సమాజం అంటే మనుషులు, వారి మద్య సంబంధాలతో నిర్మించబడేదే కాబట్టి, ఆ బాలుడు కూడా ఆ విదేశీ సమాజం యొక్క సంస్కృతినే నేర్చుకుంటాడు. ప్రజలే లేనప్పుడు, సమాజమే ఉండదు. ఒకరితో ఒకరు, ప్రజలు, సంబంధాలు ఏర్పరుచుకుంటూ ఉంటారు. మనం ఒక కుటుంబంలో జన్మించాం. తల్లి, తండ్రి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో కలిసి మనం నివసిస్తుంటాం, మన తల్లి లేదా తండ్రి లేదా అన్నదమ్ములు, అక్కచెల్లెల్ని ఎవరైనా తప్పపడితే మనం కోప్పడుతాం. వారికెవరైనా హాని తలపెడితే మనం ప్రతిస్పందిస్తాం. మనం ఒక కుంటుంబంలో జన్మించాం కాబట్టి, మనకి కేవలం మన కుటుంబ సభ్యులతోనే సంబంధాలుంటాయా? కుటుంబ సంబంధమనేది మన యొక్క గ్రామ ప్రజలతో సంబంధంగా కూడా వ్యాప్తి చెందుతుంది. అదే విధంగా, ఈ సంబంధం ఒక వ్యక్తియొక్క దేశానికి కూడా విస్తృతమవుతుంది. ఈ సంబంధం చాలా సహజసిద్ధమైనది. కుటుంబసభ్యులకు ఏదైనా హాని జరిగితే మనం కోప్పడుతాం. మన గ్రామం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే, కూడా మనం కోప్పడుతాం. ఎవరైనా విదేశీయుడు, మన దేశం గురించి చెడుగా మాట్లాడితే, మనం చర్య తీసుకోవటం జరుగుతుంది.

ఎటువంటి విచక్షణ, ఆటంకం లేకుడా దేశ మూలవాసులు, ఆదివాసీ ప్రజలు తమ యొక్క మానవహకుల్ని ప్రాథమిక స్వేచ్చల్ని పరిపూర్ణంగా అనుభవించగలిగాలి. ఈ ప్రజల యొక్క మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలకి వ్యతిరేకంగా ఎటువంటి వత్తిడులు గాని, బలప్రయోగం కానీ చేయకూడదు. నిబంధన - 3. అంతర్జాతీయ శ్రామికసంస్థ : స్వతంత్ర దేశాలలో మూలవాసులు, ఆదివాసీ ప్రజలకి సంబంధించిన కన్వెన్షన్, ౧౯౮౯

ఉదాహరణకు, జంతువుల సంగతి చూద్దాం. అవి అడవుల్లో సమూహాలుగా జీవిస్తుంటాయి, దుప్పిని చూడండి. అవి కలిసి ఉంటూ కలిసి తింటూ జీవిస్తుంటాయి. వాటిలోనొకదాన్ని వేటగాడు చంపాడనుకుందాం. దుప్పలు ఏమి చేస్తాయి. అప్పడు, దుప్పలన్నీ కలిసి, మాలో ఒక దుప్పిని ఎందుకు చంపావని ఆ వేటగాడ్ని ప్రశ్నిస్తాయా?

ఆ వేటగాడ్ని ఎదురుర్కొనేందుకు, ఆ దుప్పలన్నీ కలిసి పోరాడుతాయా? పోరాడవు. తమ ప్రాణాన్ని కాపాడుకునేందుకు అవి పారిపోతాయి. ఉదాహరణకు ఒక గ్రామానికి చెందిన వ్యక్తి, మరో గ్రామానికి పోయి ఆ గ్రామానికి చెందిన వ్యక్తిని కొడితే, ఆ గ్రామ ప్రజలు ఏమి చేస్తారు?

వారు దౌర్జన్యం చేసిన వ్యక్తిని ఎదుర్కొంటారు, దుప్పలు గుంపులుగా నివసిస్తాయి. కాని, బంధు లేదా జాతి సంబంధ భావనని కలిగి ఉండవు. సమాజంలో ప్రజలు సమూహాలుగా జీవిస్తున్నప్పుడు, వారి మధ్య జాతి సంబంధ భావన కలుగుతుంది. ప్రతి వ్యక్తి తోటి వారి సంతోషాల్ని దుఃఖాల్ని పంచుకుంటారు. అందువలననే మనం, మనిషి, సమాజంలో పట్టి, సమాజంలో పెరిగి, సమాజంలో మరణిస్తాడని చెప్పకుంటాం.

తరగతి గదిలో అభ్యాసం

  1. మీ స్వంత ఊరులో కాకుండా వేరే ఊరిలో నివసిస్తున్నారని భావించినప్పడు, మీలో కలిగే భావాలను ఊహించుకోండి.
  2. మీలో కొంతమంది కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉండవచ్చు. ఆ సందర్భాలలో మీలో ఎటువంటి భావాలు కలుగుతున్నాయి.
  3. తల్లిదండ్రులు చనిపోయిన ఒక అనాథ బాలుడ్ని ఊహిచుకొని, ఆ సందర్భంగా మీలో కలిగే భావనలను వ్రాత రూపంలో పెట్టండి.
  4. మిమ్మల్ని ఒక ప్రత్యేక గదిలో బంధించి, రెండు రోజుల పాటు ఎవరితోనూ కలవనీయకుండా, మాట్లాడనీయకుండా చేసినట్లుగా ఊహించుకోండి, ఆ సందర్భంలో (ఎ) మీరు ఎలా భావిస్తారు. (బి) ఎందుకు అలా భావిస్తారు లేక ఆలోచిస్తారు (సి) దీని నుండి మీరు నేర్చుకునే పారాలేమిటి?
  5. మానవుడు సామాజిక జీవి అయినప్పటికీ, కొంత మంది వ్యక్తులు సంఘంలో జీవించటానికి తిరస్కరిస్తారు. కారణాలేమై ఉండవచ్చో వివరించండి.

మానవ సమాజం అనేది విడదీయటానికి వీలులేని అవిభాజ్యమైన కుటుంబం వంటిది. కుటుంబంలో ఒక వ్యక్తి తప్ప చేస్తే, ఇతర సభ్యులందరూ, దానికి బాధ్యత వహించినట్లుగానే మానవ సమాజానికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. - మహాత్మాగాంధీ

భారతదేశంలో లేదా దాని భాగంలో ఏ ప్రాంతంలోనైనా నివసించే, కొంతమంది ప్రజలకి సంబంధించి ప్రత్యేకమైన భాష, లిపి లేదా సంస్కృతి ఉన్నట్లయితే, వాటిని పరిరక్షించుకోడానికి ఆ ప్రాంత ప్రజల హక్కు కలిగి ఉన్నారు.- (నిబంధన 291, భారత రాజ్యంగం)

మన దేశం యొక్క బహుళ లేదా సంకీర్ణ సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి పైనా ఉంది. - (నిబంధన 51ఎ, భారతరాజ్యంగం)

వర్గం, జాతి, రంగు స్త్రీ, పురుష తేడాలు లేక వివక్షలు కొనసాగుతున్నప్పటికీ ఈ ప్రపంచం, ఎలా మనుగడ సాగించగలుగుతుందని ఒక కవిని ప్రశ్నించగా, నిస్వార్థబుద్ధితో ఇతరుల కోసం జీవించే ప్రజలున్నందువలననే ప్రపంచ మనుగడ సాధ్యమౌతుందని, ప్రాచీన తమిళ సాహిత్యానికి చెందిన "పురానానూరు" అదే పద్యం ద్వారా ఆ కవి సమాధానమివ్వడం జరిగింది

పోమ్వర్క్

6. మీరు ఈ పారం నేర్చుకున్న తర్వాత, ఇంకొకరితో కలిసి ఈ సమాజంలో జీవించాలనుకుంటున్నారా? దీనికి సమాధానం 'అవును' అన్నట్లయితే, కారణాలు తెలపండి.

7 (ఎ) మానవుడ్ని ఒక సామాజిక జీవి అనే విషయం తెలిపే బొమ్మగీసి, తరగతి గదికి తీసుకురండి

(బి) మరుసటి రోజే మీరు గీసిన బొమ్మల్ని మీ క్లాస్ టీచర్కి అందించండి.

(సి) మీరు గీసిన బొమ్మల్ని మీకు తెలిసిన వారందరికీ చూపించండి.

(డి) ప్రతి విద్యార్థి, మీ క్లాస్లోని వేరే విద్యార్థి గీసిన బొమ్మని ఎంచుకోండి. మీరు నేర్చుకున్న పాఠానికి సంబంధించి, ఆ బొమ్మ తెలియచేసే భావాల్ని క్లాస్లోని తోటి విద్యార్థులతో చర్చించండి.

(ఇ) చివరిగా, టీచర్, తనయొక్క అభిప్రాయాన్ని విద్యార్థులతో చర్చిస్తుంది.

ఎటువంటి వివక్ష ప్రదర్ణించకుండా, ప్రతిమనిషి, తోటి మనిషిని గౌరవించాలి.- నిబంధన 28 మానవహక్కుల, ప్రజల హక్కులు గురించి ఆఫ్రికన్ డాక్యుమెంట్, 1981.

అనేక సముదాయాలు

ప్రియమైన విద్యార్ధులారా !

ఈ రోజు, మన మాతృభూమి భారతదేశం గురించి మనం పాఠం నేర్చుకోబోతున్నాం. మనం, ఈ దేశానికి చెందిన బాలబాలికలమని చెప్పకుంటున్నాం. ఈ రోజు నేను, మన దేశం గురించి మీకున్న పరిజ్ఞానాన్ని పరీక్షించాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి, మన దేశం గురించి మీకు తెలిసిన విషయాల్ని చెప్పండి. సరేనా !

విద్యార్థులు : ఒకె. (మేము సిద్ధంగా ఉన్నాం) సరే!

టిచర్ : సరే, మొదలుపెట్టండి.

విద్యార్థి 1 : భారతదేశం ఒక ప్రాచీనదేశం

విద్యార్థి 2 : భారతదేశం ఒక పెద్ద దేశం

విద్యార్థి 3 : ఇది గాంధీ పుట్టిన దేశం

విద్యార్థి 4 : భారతదేశం ఒక ఉపఖండం

విద్యార్థి 5 ; భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ,

విద్యార్థి 6 : భారతదేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి.

విద్యార్థి 7 : భారతదేశంలో అనేక జాతుల ప్రజలు నివసిస్తున్నారు.

విద్యార్థి 8 : ఈ దేశంలో ప్రజలు అనేక మతాల్ని అవలంభిస్తున్నారు.

విద్యార్థి 9 : ఈ దేశంలో అనేక సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయి.

విద్యార్థి 10 : మనమందరం ఐకమత్యంతో జీవిస్తున్నాం.

మీరందరూ అనేక మంచి విషయాలు చెప్పారు. ఇప్పడు నేను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. కొంతమంది విద్యార్థులు మనదేశంలో అనేక భాషలు, మతాలు, జాతులు ఉన్నాయని చెప్పటం జరిగింది. ఈ విషయాలతో బాటుగా, మనం ఐకమత్యంతో జీవిస్తున్నామని కూడా చెప్పారు. ఇది ఎలా సాధ్యమైంది.

(1) భారతదేశ భూభాగంలో లేదా దానికి సంబంధించిన ఏ ప్రాంతంలోనైనా ఒక సముదాయానికి చెందిన ప్రజలు తమకున్న ప్రత్యేక భాష, లిపి లేదా స్కృతిని పరిరక్షించుకునే హక్కుని కలిగి ఉన్నారు. నిబంధన  29. (1) భారతరాజ్యంగం

విద్యార్థి 1 ::మీరు చెప్పేది నిజం, టీచర్ ఒక దేశంలో అనేక మానవసముదాయాలుండటం మంచిది కాదు. అటువంటి పరిస్థితుల్లో దేశంలో శాంతి కరువై, అంతా అయోమయంగా ఉంటుంది.

విద్యార్థి 2 :దేశంలో ఒక భాష ఒక జాతి, ఒక సంస్కృతి మాత్రమే ఉండాలి. ఇలా కానట్లయితే దేశంలో ఐకమత్యం సాధ్యం కాదు.

విద్యార్థి 3 :మీరు చెప్పిన విషయం తప్ప, మన తోటలో అనేక రకాల పుష్పాలున్నందవలననే, ఆ తోట చూడటానికి చాలా అందంగా ఉంది కదూ.

విద్యార్థి 4 :(అన్ని రకాల మొక్కలు సమాన సంఖ్యలో లేవు) ఒక రకం మొక్కలు తక్కువ సంఖ్యలో ఉండగా, మరోరకం మొక్కలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ అన్ని రకాల మొక్కల్ని మనం సమదృష్టితో చూడగలమా

టిచర్ :కొన్ని రకాల య్క్కలు సంఖ్యలో గానూ, మరికొన్ని రకాలు తక్కువగానూ ఆయనప్పటికి, ఆన్ని రకాల మొక్కలు సంఖ్యలో ఎక్కువ కవగానూ ఉన్నాయి

అయినప్పటికీ, అన్నిరకాల మొక్కల్ని సమానమైన శ్రద్ధతోనే గమనిస్తుంటాం. సంఖ్యతో సంబంధం లేకుండా అన్నిరకాల మొక్కల్లోనూ ప్రాణం ఉంటుంది. ప్రతి మొక్కకి హక్కు ఉంది. అదే విధంగా, అధిక సంఖ్యాక మానవసముదాయం లేదా అల్పసంఖ్యాక మానవసముదాయం, అగ్రకులం లేదా అట్టడుగు కులం అందరికీ సమాన హోదా, గౌరవం ఇచ్చినట్లయితే మన దేశంలో సమస్యలు ఉత్పన్నం కావు.

విద్యార్థి : అన్ని మానవ సముదాయాలకి, సమాన గౌరవం ఇచ్చినట్లయితే, ఐక్యత దానంతటదే వస్తుందా ?

టిచర్ : ప్రజలందరికీ సమాన గౌరవం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి వివక్షా ఉండబోదు. దీనితో బాటుగా, అనేక మానవ సముదాయాల మధ్య ఉన్న తారతమ్యాలను సహజమైన విషయంగా భావించాల్సి ఉంది. తనికి వచ్చిన భాషను మాట్లాడడం అదే విధంగా తనకి నచ్చిన దేవుడ్ని ఆరాధించటానికి ప్రతి మనిషికి ఉన్న హక్కుల్ని మనమందరం తప్పనిసరిగా ఆమోదించాలి. మనలో ప్రతి ఒక్కరూ తోటివారి వ్యక్తిగత ప్రత్యేకతలను గుర్తించాల్సి ఉంది. మనమందరం ఈ విధంగా వ్యవహరించినట్లయితే, మన సమాజంలో అయోమయానికి తావులేదు.

విద్యార్థి :: మీరు ఈ విషయాన్ని మరికొంత వివరించి చెబుతారా ! టీచర్

విద్యార్థి : తప్పకుండా వివరిస్తాను.

ఒక తోటలో అనేకరకాల మొక్కలు ఉన్నట్లే, మనదేశంలో అనేక ప్రత్యేకతలకి చెందిన మనుషులు నివసిస్తున్నారు. అందరూ, కేవలం ఒక రకానికి చెందినవారు కాదు కాబట్టి, వారి మధ్య ఐకమత్యం సాధించాల్సి ఉంది. నేను వివరించిన విషయం నీకు అర్థమైందా?

విద్యార్థి : అయితే, భారతదేశం యొక్క సౌందర్యం, దాని బహుళత్వంలో ఉంది.

టిచర్  : తప్పకుండా, అందువలననే మన దేశం ఒకటే అయినప్పటికీ ఈ బహుళత్వ పరిరక్షణ కోసమే, దేశాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించటం, అదేవిధంగా అనేక మానవ సముదాయాల భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం అనేక చట్టాలు చేయటం జరిగింది.

క్లాస్ వర్క్

1. (ఎ) ఈ పాఠంలో మీకు బాగా నచ్చిన మూడు విషయాలు చెప్పండి.

(బి) మీరెందుకు వాటిని ఇష్టపడతారు?

(సి) మీ అభిప్రాయాలను క్లాసులు ఇతర విద్యార్థులతో కలిసి పంచుకోండి.

రెండు కళ్ళ - ధృష్టి ఒక్కటే

ఐదు వేళ్ళ - కలిసి పనిచేస్తాయి.

అనేక అవయవాల వైవిధ్యం - కాని శరీరం మాత్రం ఒక్కటే

హోమ్వర్క్

(3) ప్రతి ఒక్క విద్యార్థి ఇంటి నుండి ఒక పుష్పాన్ని తీసుకువచ్చి టేబుల్ పై నున్న పొడుగాటి పూలతో టైలో పెట్టాలి. ఈ పుష్పాలు మనకి ఏ సందేశాన్ని అందిస్తాయి. తోటి విద్యార్థులతో కలిసి, మీకు తోచిన సందేశాన్ని గురించి చర్చించండి.

(4) మీరు దేన్ని ఎక్కువ ఇష్టపడతారు – బహుళత్వాన్నా లేక ఏకత్వాన్నా?

(ఎ) క్రింద ఉన్నచదరాల్లో బొమ్మలు గీయండి.

(బి) రంగు పెన్సిళ్ళనుపయోగించి, అవసరమైన ఛాయ వచ్చేటట్ల చూడండి.

(సి) మీరు బహుళత్వాన్ని నచ్చుతారో లేక ఏకత్వాన్ని నచ్చుతారో పేర్కొనండి.

జాతి, వర్ధం ప్రాతిపదికపై మానవుల మధ్య వివక్షపాటించడం-వివిధ దేశాల మధ్యమైత్రి, శాంతి సంబంధాలకు ఆటంకం కల్పించటంతోబాటు ప్రజల మద్య ఉండాల్సిన శాంతి, భద్రతలకు, సంఖ్యతతో జీవించటానికి విఘాతం కల్గిస్తుందని మేము భావిస్తున్నాం. - (ఉపోద్ఘాతం : జాతి వివక్షత యొక్క అన్ని రూపాల నిర్మూలన గురించి ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ కి ఉపోద్ఘాతం 1965)

మానవ గౌరవం

అది మట్టితో తయారుచేసిన బుద్ధదేవుని విగ్రహం. కొంతమంది వ్యక్తలు, దాన్ని భద్రంగా ఉంచటానికై మరొక ప్రాంతానికి తీసుకెత్తన్నారు. ప్రయాణం మధ్యలో అకస్మాత్తగా వర్షం రావటంతో ఆ మట్టి విగ్రహం కరిగిపోవటం మొదలైంది. విషయాన్ని గమనించిన ప్రజలు కంగారుపడగా, ఇంతలోనే ఒక అద్భుతం జరిగింది. బుద్ధని కళ్ళ, అతని ముఖం, చేతులు, చివరకు మొత్తం శరీరం కరిగిపోయిన వెంటనే మట్టి విగ్రహం స్థానంలో బంగారు విగ్రహం ప్రత్యక్షమై తళుక్కన మెరిసింది. విగ్రహం భద్రత గూరి భయపడిన పెద్దలు, ఆ విగ్రహానికి మరలా మట్టితో పూత పూసారు.

మనం కూడా ఆ విగ్రహం లాంటివారమే. మనలోనే ఉన్న బంగారు బుద్ధఢ్ని మరిచిపోయాం. - ఆనంద వికటన్ – 21-04-2004 .

యదార్థ సంఘటన-1

అప్పడప్పడు ఒక్క రోజు తిండి పెట్టని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని సార్లు పాచిపోయిన ఆహార పదార్థాలను కూడా వాళ్ళ మోహాన పడేస్తుంటారు. ఈ ఆహారం వలన ఇప్పటికే 11 మంది రోగులు చనిపోవటం కూడా జరిగింది. అసలైన విషాదమేమిటంటే, అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది రోగులు చనిపోగా, కేవలం రెండు కుటుంబాల వారు మాత్రమే, తమకి సంబంధించిన రోగులను చూడటానికి ఈ కేంద్రాలకి రావటం జరిగింది. ప్రభుత్వం 50 వేల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించగా, ఈ సంఖ్య 15 కి పెరిగింది. డబ్బుల కోసం రోగి సంబంధీకులుగా చాలా మంది పోటీ పడ్డారు.

సంఘటన జరిగి వారం రోజులైనప్పటికీ కేవలం 100 మంది రోగులను మాత్రమే వారికి  సంబంధించిన బాధ్యులు తమ ఇండ్లకి తీసుకెళ్ళటం జరిగింది. మిగిలిపోయిన 400 మంది రోగుల

కోసం, వారికి సంబంధించిన బాధ్యులెవరూ రాలేదు. కేవలం పోలీసుల వత్తిడి కారణంగానే, కొంత మంది బాధ్యులు, రోగులను వెనక్కి తీసుకెళ్ళటం జరిగిందని ఒక వార్డెన్ పేర్కొన్నాడు.-  ఇండియాటుడే ఆగష్టు 22, ౨౦౦౧

 

యధార్గ సంఘటన-౨

."పంచాయితీ బోర్డులు విధులు నిర్వర్తించటానికి, వారు నన్ను అనుమతించలేదు. నేను పంచాయితీ బోర్డు సమావేశాలలో మట్టి విగ్రహం లాగ కూర్చుకోవాల్సి వస్తుంది. వేరేవాళ్ళ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే కేవలం సంతకం చేయటమే నాపని. మా పంచాయతీలో ఒక రోజు ఫిర్యాదులకి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటుచేసాం. జిల్లా కలెక్టరు కూడా రావటం జరిగింది. ఇతర కులాల వారి సేవల కోసం నా జేబులో డబ్బులు చెల్లించి, భోజనాలు తయారు చేయించాను. కాని, నేను వారితో కూర్చొని భోజనం చేయటానికి అవకాశం లేదు. గ్రామీణ ప్రజానీకం అందరూ, నన్ను నా పిల్లల్ని అవమానించటానికి మా పేర్ల చివర "డా" అనే మాటను చేరుస్తుంటారు. కాని మేము మాత్రం వారిని పేర్లు పెట్టి పిల్లవటానికి కూడా వీలు లేదు.

ఇతర కులానికి చెందిన బాలురు, మా కులానికి చెందిన బాలురుతో కలవరు. ఇంటర్మీడియట్ చదివిన నా కుమారుడు, ప్రత్యేకంగా ఉంచిన గ్లాసుల్లో టీ త్రాగటం, అగ్రకులాల ఆదేశాల కనుగుణంగా చెప్పల్లేకుండా వీధుల్లో తిరగాల్సి రావటాన్ని అవమానంగా భావించి చెప్పా పెట్టకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ నేను. నాకుమారుడి కోసం వెదుకుతున్నాను. గత 43 సంవత్సరాలుగా నేను ఈ విధమైన ఆవమానాల్ని పొందుతున్నారు. ఎటువంటి మార్పులూ చోటు చేసుకోలేదు. పరిస్థితులు మారతాయని కూడా నాకు నమ్మకం లేదు. నా కుమారులకు నేను వట్టి కాళ్ళతో నడిచి వెళ్ళమని, టీ తాగవద్దని చెప్పాము. అవమానాలకు గురవటం ఇష్టపడని మానాన్న ఎప్పడూ టీ దుకాణానికి వెళ్ళలేదు. ఆయన హుందాగానే జీవితం గడిపి, హుందాగానే మరణించాడు.

ఇదంతా ఎవరు చెప్పారో మీకు తెలసా? ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెట్ - కుముదమ్ రిపోర్టర్ 14-02-౨౦౦౧

యధార్గ సంఘటన=4

అమ్మకానికి ప్రజలు

  • ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు గత పది సంవత్సరాలుగా మూత్ర పిండాలు అమ్మకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీని ఫలితంగా, నిర్విరామంగా బాధలు పడుతున్నారు. కిడ్నీ దాతల్లో ఎక్కువమంది కుపు వ్యాధిగ్రస్తులు.
  • తన కుటుంబాన్ని పోషించటానికి మూత్ర పిండాన్ని అమ్మకున్న అరుముగమ్ జబ్బున పడ్డాడు. అతన్ని బ్రతికించుకోటానికి, అతని భార్య కూడా, మూత్ర పిండాన్ని అమ్మింది. " ఒక జీవితాన్ని కాపాడటానికి, అతను తన మూత్ర పిండాన్ని అమ్మాడు. ఇప్పడు తను బ్రతకటానికి మరొక మూత్రపిండం కావాలి"దీనికి 20 వేల రూపాయలు అవసరమౌతాయి. నేనెక్కడికి పోవాలి? అని అతని భార్య పార్వతి ఏడ్చింది,
  • తన కుటుంబ అవసరాల కోసం మేరీ తన మూత్రపిండాన్ని అమ్మింది ప్రస్తుతం ఆమె జబ్బున పడింది. ఇంకా బాధాకరమైన విషయమేమంటే, ప్రస్తుతం ఆమె గర్భిణీగా ఉంది.

అస్యశ్యత యధార్గ సంఘటన=4

ఇది ఎరోడ్ జిలాలో ఒక గ్రామం. షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక స్త్రీ పోషకాహార పథకంలో భాగంగా, ఒక ప్రాథమిక విద్యా పాఠశాలలో వంట చేయడానికి నియమించబడింది, అగ్రకులానికి చెందిన ప్రజలు ఈమె నియామకానికి ఇష్టపడక, ఆమెని బదిలీ చేయమని ఆ స్కూలు హెడ్మాష్టర్కి ఒక దరఖాస్తు పెట్టారు. హెడ్మాస్టర్ ఈ బదిలీకి అంగీకరించక పోవటంతో, వారు టిఫిన్ బాక్సులలో మధ్యాహ్నభోజనం పెట్టితమ పిల్లల్ని స్కూలుకి పంపటం జరిగింది. చాలా మంది తల్లిదండ్రులు, తమ

పిల్లల్ని ఆ స్కూలుకి పంపించడానికి ఇష్టపడక సమస్యలు సృష్టించటం జరిగింది. ఈ సమస్య గురించి ఆ ఊరి యువకులు ఏమి చెప్పారో మీకు తెలుసా?"కులానికి సంబంధించిన విషయాల్ని మేము వదిలిపెట్టం, ఒక అట్టడుగు కులానికి చెందిన స్త్రీ, మధ్యాహ్నభోజనం తయారు చేస్తే, అగ్రకుల పునాది బాగా ఉన్న ఈ ఊర్లో, ఆ భోజనం ఎవరు తింటారు? " ఈ గ్రామానికి చెందిన స్త్రీలు ఏమి చెప్పారో తెలుసా? " మేము ఈ విషయాన్ని ఇష్టపడం. ప్రభుత్వం ఏచర్య అయినా తీసుకోవచ్చు ప్రభుత్వం కోసం మేము కలచారాల్ని వదులోకోలేం. మా పిల్లలకి మేమే మధ్యాహ్నభోజనాన్ని పంపుతాం. అది తప్పని మేము అనుకోవటం లేదు". - కుముదమ్ విలేఖరి, 13-1-౨౦౦౨

మానవ కుటుంబానికి చెందిన వ్యక్తలందరికి అన్యాక్రాంతం చేయటానికి వీలులేని సహజసిద్ధమైన హక్కలున్నాయని గుర్తించటమే స్వేఛ్ఛకి ప్రాథమిక పునాదిగా ఉంటుంది. ఈ ప్రపంచంలో న్యాయం, - శాంతి వర్ధిల్లాలంటే ఇది తప్పనిసరి అవసరం. (అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని ప్రస్తావన, 1948)

ప్రాథమిక మానవ హక్కులు, మానవ గౌరవం, విశాలమైన భాగంగా జీవన ప్రమాణాల పెంపపట్ల ఐక్యరాజ్య సమితికి చెందిన దేశాలలోని ప్రజలందరూ విశ్వాసం ప్రకటిస్తున్నారు. (ప్రస్తావన, బాలల హక్కుల గురించి ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ 1989)

యధార్థ సంఘటన=౫

వెట్టిచాకిరి చేసే బాలకార్మికులు

"తొమ్మిది సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుండి ఈ బాలలు, నేత మగ్గాల కార్మికులుగా పని చేస్తున్నారు. వీరు పనిలో చేరగానే యజమానులువీరికి 3,000 రూపాయలు అడ్వాన్సు చెల్లిస్తారు. ఇది ఒక రకంగా పిల్లలను తాకట్ట పెట్టుకోవటం లాంటిదే. ఈ బాల కార్మికులు ఉదయం 7 గంట నుండి రాత్రయ్యే వరకు, మధ్యలో ఎటువంటీ విశ్రాంతీ లేకుండా మగ్గాల మీద పని చేయాల్సిందే. వీరికి 50 నుండి 60 రూపాయల వరకు రోజు కూలీ ఇస్తారు. అడ్వాన్సు సొమ్ముని తిరిగి చెల్లించే దాకా, ఈ బాల కార్మికులకి విముక్తి లేదు. ఈ మధ్యనే చనిపోయిన తమిళరాసన్ మూడు వేల రూపాయలకి కుదువపెట్టబడ్డాడు. కొన్ని రోజులు మాత్రమే పని చేసిన అతన్ని ఏదో కారణం చూపి తిట్టడం జరిగింది. తరువాత కొన్ని రోజులకి అతను చనిపోయడు. ఈ దుర్మార్గానికి సంబంధించి బాధలు పడిన వ్యక్తి"కంచీపురంలో ఎంతమంది పిల్లలు ఈ విధంగా కుదువ పేట్టబడ్డారో మీకు తెలుసా అని ప్రశ్నించటం జరిగింది .”

" ఒక సంవత్సరం క్రితమే ఈ విధంగా తాకట్ట పెట్టబడిన ఒక బాలిక బాధలకు తట్టుకోలేక తనకు తాను నిప్పటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఒక బాలిక, తన మెడపై గాయం మానకుండానే పనికి వెళూ ఉంది. మర్గాజి నెలలో తాకట్ట పెట్టబడిన పిల్లలు (డిసెంబరు - జనవరి) రోజుకి పద్దెనమిది గంటలకి పైగా పని చేయాల్సి ఉంది. ఈ విధమైన బాధల కారణంగా, ఎంతమందిపిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో మీకు తెలుసా?

(కుమధమ్ విలేఖరి 18-9–2001)

ఇటువంటి సంఘటనలు, మానవ గౌరవ భావననే ప్రశ్నిస్తున్నాయన్న విషయం గురించి మీరు ఆలోచించటం లేదా?

  • పిల్లలు వెట్టి చాకిరీ కార్మికులుగా మారినప్పుడు వారి యొక్క గౌరవానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి?
  • పంచాయతీ బోర్డు ప్రెసిడెంటుని ఒక మనిషిగా ఎందుకు చూడలేదు?
  • మానసిక వికలాంగులను మనుషులుగా చూడరు? ఎందుకు చూడలేదు?
  • పోషకాహార పథకానికి, షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక ఫ్రీని వంట మనిషిగా నియమించనప్పడు, ఆమె వండిన భోజనాన్ని అగ్రకులస్తులు ఎందుకు నిరాకరించారు?
  • మనుషులు వేర్వేరు రకాలుగా ఉండవచ్చు. కాని వారి సహజ లక్షణమేమిటి? దాన్నే మానవ గౌరవం అని పిలుస్తాయి. ఒక వ్యక్తికి గౌరవాన్ని నిరాకరించినట్లయితే, అతన్ని అస్తిత్వాన్ని జీవితాన్ని కూడా నిరాకరించినట్లే,

> గౌరవం తిరస్కరించడం > హక్కు తిరస్కరించడింది > మానవత్వం తిరస్కరించబడింది

తాము నివసిస్తున్న రాజ్య పరిధిలోనే, తమ యొక్క జీవన విధానాలు, ఆర్థికాభివృద్ధి, అస్థిత్వం, గుర్తింపు, భాషలు, మతాలు, సంస్కృతి పరిరక్షణకై తమ సాంప్రదాయక సంస్థలపై తమకేనియంత్రణ ఉండాలనే మూలవాసులు, ఆదివాసీల ఆకాంక్షలను మేము గుర్తిస్తున్నాం. (ఉపోద్ఘాతం, అంతర్జాతీయ కార్మిక సంస్థ స్వతంత్ర్య దేశాలలోని మూలవాసులు, ఆదివానీలకి సంబంధించిన కన్వెన్షన్, 1989).

క్లాస్ వర్క్:

1. ఈ పాఠంలో వివరించిన సంఘటలను చదివి ఆలోచించమని విద్యార్థులకు చెప్పండి. ఆ తరువాత, వారిని ఈ క్రింది ప్రశ్నలు అడగండి.

ఎ) ఈ సంఘటనలు తెలియజేస్తున్న సందేశమేమిటి?

బీ)తమకి తాము ప్రత్యేకంగా ఉండటానికి మనుషులు సహజంగా భయపడుతుంటారు. కాని ప్రతి ఒక్కరికి వేర్వేరు లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని ఆమోదిస్తారా?

సి) బహుశా మనం మంచి వ్యక్తులమై ఉండవచ్చు. ఒక విగ్రహానికి మట్టి పూత పూసినట్లే మనల్ని కూడా చెడ్డ లక్షణాలు కమ్ముకొని ఉంటాయి. అవి ఏమిటి? కులతత్వం, మత అసహనం, అసూయ.

డి) మనుషుల బాహ్య రూపురేఖల వలన వారు కోల్పోయే హక్కులేమిటి?

2. ఎ) విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఈ పాఠంలోని సంఘటనలను బిగ్గరగా చదవమని చెప్పండి.

బి) దివిన తరువాత, ప్రతి గ్రూప్ ఇతర గ్రూప్లతో తన భావాల్ని పంచుకుంటుంది.

సి) పాఠంలోని పేర్కొన్న సంఘటనలకి గురైన మనుషులు ఏయే హక్కులు కోల్పోయారో ఒక జాబితా వ్రాయండి.

సంబంధిత వ్యక్తి కోల్పోయిన హక్కులు

1. మానసిక వికలాంగులు

2. పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు,

3. మూత్రపిండాల్ని కోల్పోయిన మనుషులు

4. వెట్టి ¤ కార్మికులు.

5. పోషకాహార పథకంలో వంట మనిషిగా నియమింపబడిన షెడ్యూల్డ్ కులానికి చెందిన స్త్రీ


ఆత్మ గౌరవంతో జీవించటమే మానవ ఆకాంక్షల యొక్క అంతిమ లక్ష్యం,

3. మీరు ఈ పాఠంలోని ఇద్దరు జాతీయ నాయకుల అనుభవాలను తెలుసుకున్నారు. ఈ పాఠంలో మిమ్మల్ని బాగా కదిలించిన వాక్యాలు ఏమిటి? ఎందుకు?

వాక్యం కారణాలు

 

 

 


4. (ఎ) మీ యొక్క అనుభవం ద్వారా ఈ క్రింది జాబితాలో పేర్కొన్న వ్యక్తులు ఎంత మేరకు మానవ గౌరవాన్ని పొందారు లేదా కోల్పోయారో తెలపండి. సరియైన బాక్సులో టిక్() మార్కుపెట్టండి. నా అభిప్రాయం ప్రకారం జాబితాలో పేర్కొనబడిన వ్యక్తులు

బి). ఏ బాక్సులో టిక్ మార్కులు ఎక్కువున్నాయి.

సి) మార్కింగ్ల సంఖ్యని విశ్లేసించినప్పుడు మీరు ఏమి అర్థం చేసుకున్నారు?

డి). కొన్ని బాక్సులలో "టిక్ మార్కింగ్ చేయకపోవటానికి కారణమేమిటో వివరించండి?

5. ఈ క్రింది కార్యకలాపాలలో ఏవి హుందాతనాన్ని పెంపొందిస్తాయి. 'అవును" అనుకున్నట్లయితే టిక్ (/) మార్కు కాదని చెప్పాలనుకుంటే (X) మార్కుపెట్టండి మీ సమాధానాలకు కారణాలు తెలపంది.

మరణ శిక్షను రద్దు చేయటం ద్వారా మానవ హక్కుల ప్రగతిశీల అభివృద్ధి, అదే విధంగా మానవ జీవిత హుందాతనం పెంపెదల సాధ్యమౌతుందని మేము విశ్వసిస్తున్నాం. (ప్రస్తావన, అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల ఒప్పంద అధికార పత్రానికి రెండవ ఆప్షనల్ ప్రోటోకాల్, 1989)

6. మానవ హుందాతనాన్ని పరిరక్షించటానికి మీరు చెప్పే మార్గాలు లేదా కార్యాకలాపాలు.

హోమ్ వర్క్:

7. ఒక వేళ మీ స్నేహితుడు మీ సమక్షంలో మీ ఫోటోను చింపివేసినట్లయితే మీలో ఎటువంటి భావాలు కలుగుతాయో తెలియజేయండి.

8. అద్దం ఇచ్చే సందేశం

ఎ) మీరు ఉదయం సమయంలో బయటికి పోవటానికి ముందు,

ఇప్పడు చెప్పిన మూడు అభిప్రాయాలు :

  1. ఏ అభిప్రాయం తరచుగా మీ మనసులో కలుగుతుంది.
  2. మీకు సంబంధించి మీ జీవితానికి ఏ అభిప్రాయాన్ని ముఖ్యమైన దానిగా భావిస్తున్నారు.
  3. అద్దం ముందు నిలబడి తమని తాము సరిచూసుకొనే అవకాశాలు లేని పేద పిల్లల పరిస్థితి ఏమిటి? ఆత్మగౌరవానికి సంబంధించి వారి స్థాయి ఏమిటి? మీ అభిప్రాయాల్ని భావాల్ని నోట్ పుస్తకంలో వ్రాసి, ఇతర విద్యార్థులతో వాటి గురించి చర్చించండి
  4. హుందాతనం, దానికి సంబంధించిన భావాలు ప్రతి వారికి సహజ సిద్ధమైన లేదా మానవ నైజంగా చెప్పుకోవచ్చు. కొంతమంది విషయంలో ఈ సహజసిద్ధమైన లక్షణం ఎందుకు ధ్వంసం చేయబడుతుంది.మహిళల ఆత్మగౌరవం గురించి మేరేమీ ఆలోచిస్తున్నారు!

మనదేశంలో జరుగుతున్న మహిళల హత్యల్లో దాదాపుగా సగం, బెడ్రూమ్ల్లో జరుగుతున్నాయి. లైంగిక వేధింపులు 40% వరకట్నం చాపలు 15.2%, కిడ్నాపింగ్లు ఆడపిల్లల్ని వ్యభిచార కూపాల్లో దింపటం, 87.2% మేరకు పెరిగాయి. బాలికలకు వారి మాతృగర్భం సైతం సురక్షితమైన ప్రదేశంగా లేదు. కౌరవులు ద్రౌపదిని వివస్తని చేసిన సంఘటన ఇప్పుడు ప్రతి చోటా జరుగుతుంది. ఈ సందర్భంలో నేను, ప్రధాన మంత్రి

వాజ్పాయ్ యొక్క కవితా శీర్షికను ఉదహరిస్తాను. "ప్రతి పంచాయతీలో ద్రౌపదిని వివస్తను చేయటం జరుగుతుంది" స్త్రీలు, షెడ్యూల్ కులాలు, తెగలకి చెందిన ప్రజలకి గౌరవం ఇవ్వనప్పుడు, ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించినట్లుగా అర్థం చేసుకోవాలి.

రాష్ట్రపతి కెఆర్ నొరొయన్, - 25, జనవరి 2002, రిపబ్లిక్ డే ప్రసంగం.

3.08108108108
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు