హోమ్ / సామాజిక సంక్షేమం / వికలాంగుల సంక్షేమం / వికలాంగుల సామర్ధ్య శిక్షణ కోసం ఆర్థిక సహాయం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వికలాంగుల సామర్ధ్య శిక్షణ కోసం ఆర్థిక సహాయం

వికలాంగుల నైపుణ్యాన్ని పెంపొందిచటానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం

లక్ష్యాలు

 • వికలాంగుల నైపుణ్యాన్ని పెంపొందిచటానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం
 • వైకల్యం కంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది వైకల్యాన్ని దృవీరించడానికి వైద్య అధికారి ద్వారా సర్టిఫికేట్ తీసుకోవాలి
 • 30% మహిళా రిజర్వేషన్లు: మహిళలను ప్రోత్సహించే ప్రయత్నంగా , ప్రతి శిక్షణ కార్యక్రమంలో మొత్తం 30%ను మహిళా అభ్యర్థులకు కేటాయిస్తున్నారు.
 • ఈ పథక నియమాల ప్రకారం ఈ శాఖ ద్వారా గుర్తింపు పొందిన శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ అమలు జరుదుతుంది.

అర్హత

 • భారత పౌరులు అయిఉండాలి.
 • 40% వైకల్యం కంటే ఎక్కున వైకల్యం ఉండి వైద్య అధికారి ద్వారా  సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
 • కింది వాటిని వైకల్యాలుగా గుర్తించారు (ఏ) అంధత్వం (బి) తక్కువ దృష్టి (సి) నయమవుతున్న కుష్టు  (డి) వినికిడి సమస్యలు (ఇ) లోకో - మోటారు వైకల్యం (ఎఫ్) మెంటల్ రిటార్డేషన్ (హెచ్) ఆటిజం (ఐ) సెరిబ్రల్ పాల్సి లేదా (జె) రెండు లేదా మూడు వైకల్యాలు కలిపి ఉండటం.
 • వయసు: కోర్సు కోసం అప్లికేషను చివరి తేదీ నాటికి దరఖాస్తుదారు వయస్సు 15 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 59 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి .
 • దరఖాస్తు చివరి తేదీకి ముందు రెండు సంవత్సరాల కాలంలో దరఖాస్తుదారు ప్రభుత్వం స్పాన్సర్ చెసిన ఏ ఇతర శిక్షణ కోర్సులను చేసి ఉండకూడదు.

నిధుల నిబంధనలు

 • శిక్షణ ఖర్చు: పూర్తి శిక్షణా కాలానికి గాను అన్ని శిక్షణా కార్యక్రమాల ఖర్చులను కలుపుకొని నెలకు Rs.5,000/-  ప్రితీ ట్రేనీకి ఖర్చుచేయాలి. ఉదాహరణకు, మూడు నెలలు శిక్షణ కార్యక్రమం చేపట్టి ఉంటే, ప్రితి ట్రేనీకి చెల్లించ వలసిన శిక్షణా కార్యక్రమాల ఖర్చు రూ .15000 / అవుతుంది. నెలలో కొన్నిరోజులు శిక్షణ కార్యక్రమం ఉంటే దానికి తగ్గట్టుగా ఖర్చును లెక్కిస్తారు.
 • ట్రైనీలకు స్టైఫండు: హాస్టల్లో ఉండేవారికి నెలకు రూ. 2000 మరియు  బయటివారికి 1000/ నెలకు స్టైఫండుగా ఇస్తారు.
 • రవాణా ఖర్చు: - హాస్టల్లో ఉండేవారికి నెలకు రూ.500/ మరియు  బయటివారికి  నెలకు రూ. 1500/ రవాణా ఖర్చులను ఇస్తారు.

మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

2.95918367347
G KALAVATHI Jul 12, 2018 02:46 AM

SIR NENU HANDICAPPED NA BARTHAKU ACSIDENT JARIGINDI NAAKU 3 PILLALU AADHARAM LEEDU SAHAYAM CHEYANDI

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు