పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

స్టార్టప్ ఇండియా

స్టార్టప్ ఇండియా

స్టార్టప్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రముఖ కార్యక్రమము. దేశంలో శక్తివంతమైన ఆవిష్కరణలు మరియు స్టార్టప్‌ల అభివృద్ధికి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దీని ఉద్ధేశం. ఇది స్థిరమైన ఆర్థిక వృద్ధిని మరియు భారీ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది. ప్రభుత్వం చొరవతో స్టార్టప్‌ల ఆవిష్కరణ మరియు డిజైన్లను పెంచడానికి ప్రయత్నిస్తుంది.

భారతదేశం స్టార్టప్ యాక్షన్ ప్లాన్ అవలోకనం

లక్ష్యాలను పూర్తిచేయడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ యొక్క అన్ని అంశాలను కలిగిన భారత యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ యాక్షన్ ప్లాన్ తో ప్రభుత్వపు స్టార్టప్ ఉద్యమ వ్యాప్తి వేగవంతం అవుతుందిని భావిస్తోంది.

 • డిజిటల్/సాంకేతిక రంగం నుండి వ్యవసాయం, తయారీ, సామాజిక రంగ, ఆరోగ్య, విద్య, మొదలైన రంగాలకు వస్తరిస్తుంది.; మరియు
 • ప్రస్తుతమున్న టైర్ 1 నగరాల నుంచి టైర్ 2, టైర్ 3 నగరాలు మరియు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరింస్తుంది.

యాక్షన్ ప్లాను క్రింది విధంగా విభజించబడింది:,

 • సరలీకరణ మరియు హ్యాండ్ హోల్డింగ్
 • నిధుల మద్దతు మరియు ఇన్సెంటివ్స్
 • ఇండస్ట్రీ అకాడెమియా భాగస్వామ్యం మరియు ఇంక్యుబెషను

ప్రణాళికలో ముఖ్యాంశాలు

సరలీకరణ మరియు హ్యాండ్ హోల్డింగ్,

 • స్వీయ సర్టిఫికేషన్ ఆధారంగా అంగీకారము - స్టార్టప్‌లకు 9 కార్మిక మరియు పర్యావరణ చట్టాలకు సంబంధించి స్వీయ అంగీకారాన్ని(స్టార్టప్ మొబైల్ అనువర్తనం ద్వారా) అనుమతి లభించును. కార్మిక చట్టాల సందర్భంలో, 3 సంవత్సరాల వ్యవధి వరకు ఏ పరీక్షలు నిర్వహించరు. స్టార్టప్‌ల ఉల్లంఘనలకు సంబంధించి నమ్మదగిన మరియు పరిశీలనా ఫిర్యాదు అంది కనీసం ఒక సీనియర్ లెవెల్ పర్యవేక్షణాధికారి ఆమోదించింన తర్వాత విచారణను చేపడతారు. పర్యావరణ చట్టాలకు సంబంధించి ఇవి 'తెలుపు వర్గం' కిందికి వస్తాయి (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) నిర్వచించిన విధంగా). అలాంటి సందర్భాలలో స్వీయ సర్టిఫై సమ్మతి ఉన్నందు వలన స్టార్టప్‌లకు తక్కువ నిఖీలు జరుగుతాయి.
 • స్టార్టప్ భారత్ హబ్ -మొత్తం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఒకే దగ్గర సంప్రదింపులు జరపటం మరియు నిధులు మరియు సమాచార మార్పిడి యాక్సెసును ఎనేబుల్ చెయ్యటం.
 • రోలింగ్ అవుట్ మొబైల్ ఆప్ మరియు పోర్టల్ - అన్ని వ్యాపార అవసరాలు మరియు వివిధ వాటాదారుల మధ్య సమాచార మార్పిడి కోసం ప్రభుత్వం మరియు రెగ్యులేటరీ సంస్థలతో కలవడానికి ఒకే వేదికను నిర్మించటం.
 • లీగల్ మద్దతు మరియు తక్కువ ఖర్చుతో ఫాస్ట్ ట్రాక్ పేటెంట్ పరిశీలన - ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ పేటెంట్లు, చిహ్నాలు లేదా నమూనాలకు సంబంధిచిన వాటి మొత్తం ఫీజును భరింస్తుంది. స్టార్టప్ చట్టబద్ధమైన ఫీజు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. అప్లికేషన్ దాఖలు చేయడానికి తగ్గింపును కల్పిస్తుంది: స్టార్టప్ పేటెంట్లపై ఇతర కంపెనీలుతో పోలిస్తే80% రిబేటు పొందితుంది. ఈ పథకం ఒక సంవత్సరం పాటు పైలెట్ ప్రాతిపదికన మొదట ప్రారంభించబడింది; అనుభవము ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.
 • స్టార్టప్ పబ్లిక్ ప్రోక్యూర్మెంట్ నిబంధనల సడలింపు - స్టార్టప్‌లను ప్రోత్సహించే క్రమంలో, ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు లేదా సాంకేతిక పరిమితులలో ఏ సడలింపు లేకుండా "అనుభవముతో/టర్నోవర్" యొక్క ప్రమాణం నుండి స్టార్టప్‌లకు (తయారీ రంగంలో) మినహాయింపును ఇచ్చింది. స్టార్టప్ కూడా కొన్ని అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు అమలులో అవసరమైన సామర్ధ్యం ప్రదర్శించేందుకు భారతదేశంలో వారి సొంత తయారీ సౌకర్యాలు తప్పని సరిగా కలిగి ఉండాలి.
 • స్టార్టప్‌ల కోసం వేగంగా నిష్క్రమణ – స్టార్టప్ ఇటీవలి దివాలా మరియు వ్యాపారాల స్వచ్ఛంద మూసివేత నిబంధనలు దివాలా బిల్ 2015, ప్రకారం, ఫాస్ట్ ట్రాక్ ఆధారంగా విరమించుకోవచ్చు. అప్లికేషన్ ఇచ్చిన 90 రోజుల వ్యవధిలో మూసివేయటానికి అనుమతిని ఇస్తారు. ఈ ప్రక్రియ పరిమిత బాధ్యత భావనతో పనిచేస్తుంది.

నిధుల మద్దతు మరియు ఇన్సెంటివ్స్

 • ₹ 10,000 కోట్ల కార్పస్ ఫండ్ ద్వారా నిధులు మద్దతు అందించడం - స్టార్టప్‌లకు మద్దతు అందించడానికి ప్రభుత్వం 2,500 కోట్ల ప్రారంభ కార్పస్ మరియు నాలుగు సంవత్సరాలకు 10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయనుంది (అంటే సంవత్సరానికి 2,500 కోట్లు). ఇది ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపంలో ఉంటుంది. ఇది స్టార్టప్‌లకు నేరుగా పెట్టుబడి పెట్టదు. కానీ సెబి తో నమోదు అయిన వెంచర్లకు ఇది నిధులను అందిస్తుంది.
 • స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ -జాతీయ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ (NCGTC)/SIDBI ద్వారా క్రెడిట్ గ్యారంటీ మెకానిజం కోసం రాబోయే నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 500 కోట్లు బడ్జెట్లో ఉంచబడతాయి.
 • పెట్టుబడి లాభాల మీద పన్ను మినహాయింపు - ఈ లక్ష్యం తో, ప్రభుత్వం ద్వారా గుర్తింపు ఫండ్స్ ఆఫ్ ఫండ్ లో మూలధన లాభాలు పెట్టుబడి ఉంటే, సంవత్సరంలో మూలధన లాభాలు కలిగిన వ్యక్తులకు పన్నులు ఉండవు. అదనంగా, వ్యక్తులు కొత్తగా ఏర్పరిచిన తయారీ SMEs పెట్టుబడికి ఇప్పటికే మూలధన రాబడి పన్ను మినహాయింపును అన్ని స్టార్టప్‌లకు విస్తరించవచ్చు.
 • పన్ను 3 సంవత్సరాలు స్టార్టప్‌లకు మినహాయింపు - స్టార్టప్ లాభాలకు 3 సంవత్సరాల వరకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. మినహాయింపు స్టార్టప్ ద్వారా డివిడెండ్ పంపిణీ చేయకుండా ఉంటేనే అందుబాటులో ఉంటుంది.
 • సరసమైన మార్కెట్ విలువ కంటే ఎక్కువ పెట్టుబడులపై పన్ను మినహాయింపు - ఒక స్టార్టప్ (సంస్థ) వాటాలు, అదనపు పరిశీలనలో సరసమైన మార్కెట్ విలువకు (FMV) మించి వాటాలను జారీచేస్తే ఆదాయపు పన్ను చట్టం, 1961, కింది పన్ను విధించబడుతుంది. స్టార్టప్‌లో వెంచర్ కాపిటల్ నిధులను ఉపయోగిస్తే దీనీకి మినహాయింపు ఉంది. స్టార్టప్‌లు ఇంక్యుబేటర్లలో పెట్టుబడి చేసినప్పుటు దీనిని విస్తరించవచ్చు.

ఇండస్ట్రీ -అకాడెమియా భాగస్వామ్యం మరియు ఇంక్యుబేషన్

 • ఇన్నోవేషన్ ప్రదర్శనలను మరియు కొలాబరేషనుకు వేదికల కోసం స్టార్టప్ ఉత్సవాల నిర్వహణ -భారతదేశంలో స్టార్టప్ వాతావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రభుత్వం జాతీయ మరియు అంతర్జాతీయ స్టేజీలలో స్టార్టప్ ఉత్సవాలను పరిచయంచెసే ప్రతిపాదన ఉంది.
 • స్వయం ఉపాధి మరియు టాలెంట్ యుటిలైజేషన్లతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) కార్యక్రమం ప్రారంభం (SETU) -వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెక్టార్ సంబంధిచిన ఇంక్యుబేటర్లను మరియు 500 'టింకరింగ్ ల్యాబ్స్'ను స్థాపించింది. దీనిలో, స్టార్టప్ అదిక పెరుగుదల కోసం, ప్రాథమిక శిక్షణతోపాటు సీడ్ ఫండ్ ఉంటుంది. మూడు జాతీయ అవార్డులతో పాటు మూడు ఆవిష్కరణ అవార్డులు ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇస్తారు. అలాగే దేశంలో అతి తక్కువ ఖర్చు పరిష్కారాలను కనుగొన్నవారికి ఒక గ్రాండ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అవార్డును కూడా ఇస్తారు.
 • ఇంకుబేటర్ సెటప్ కోసం ప్రైవేట్ సెక్టార్ నిపుణత నియంత్రణ - ప్రభుత్వ మద్దతు/నిధులతో ఇంక్యుబేటర్ల నిర్వహణకు, ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడానికి ఒక విధానాన్ని మరియు ఫ్రేమ్ వర్కును తయారు చేస్తుంది.
 • నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లలో ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు-దేశంలో R & D మిరియు ఇంక్యుబేటర్ల ఎదుగుదల ప్రయత్నాలు పెంపొందించడానికి గాను ప్రభుత్వం జాతీయ ఇన్స్టిట్యూట్లలో (1,200 కంటే ఎక్కువ నూతన స్టార్టప్‌ల ప్రారంభాలకు సౌకర్యాలు అందించడానికి) 31 కేంద్రాలను ఆవిష్కరిస్తుంది.
 • ఐఐటీ మద్రాసు రిసెర్చ్ పార్క్ సెటప్పును పోలిన7 కొత్త పరిశోధనా పార్కుల ఏర్పాటు -ప్రభుత్వం 100 కోట్లతో 7 కొత్త పరిశోధనా పార్కు ఇన్స్టిట్యూట్లను ప్రారంభిస్తుంది. ఈ రీసెర్చ్ పార్కులకు ఐఐటీ మద్రాసు రిసెర్చ్ పార్కును మోడలులాగా నిర్ణయించారు.
 • బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్‌ల ప్రోత్సహించడం -5 కొత్త బయో క్లస్టర్లు, 50 కొత్త బయో ఇంక్యూబేటర్లు, 150 సాంకేతిక బదిలీ కార్యాలయాలు మరియు 20 బయో కనెక్ట్ కార్యాలయాలను భారతదేశం అంతటా పరిశోధన సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలో ఏర్పాటు చేయబడతాయి. BIRAC ఏస్ ఫండ్ జాతీయ మరియు గ్లోబల్ ఈక్విటీ ఫండ్స్ (భారత్ ఫండ్, ఇతర మధ్య భారతదేశం ఆశించిన ఫండ్) భాగస్వామ్యంతో యువ బయోటెక్ స్టార్టప్‌లకు ఆర్థిక సాయాన్ని అందింస్తుంది.
 • ఆవిష్కరణలపై దృష్టిసారించే విద్యార్థి కార్యక్రమాలు - ఐదు లక్షల పాఠశాలలో 10 లక్షల ఆవిష్కరణలను సేకరించాలని ఆవిష్కరణ కోర్ కార్యక్రమం చేస్తుంది. వాటిలో 100 ఉత్తమ ఆవిష్కరణలను ఎంపికచేసి రాష్ట్రపతి భవన్లో వార్షిక ఫెస్టివల్లో ప్రదర్శింప చేస్తుంది. గ్రాండ్ చాలెంజ్ కార్యక్రమం NIDHI (జాతీయ హార్నేస్సింగ్ ఆవిష్కరణలు మరియు అభివృద్ధి కార్యక్రమం) ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అభివృద్ధి కేంద్రాల (IEDCs) సహాయంతో ఏర్పాటు చేయబడుతుంది. ఇది 10 లక్షల రూపాయల అవార్డును 20 మంది విద్యార్థి ఆవిష్కరణలకు అందజేస్తుంది. ఉచ్చతర్ ఆవిష్కార్ యోజనను, ఉమ్మడి MHRD-DST పథకం ద్వారా ఏటా 250 కోట్ల రూపాయలు ఐఐటి విద్యార్థుల " చాలా అధిక నాణ్యత" పరిశోధనను ప్రోత్సహించడానికి, ప్రారంభించారు.
 • వార్షిక ఇంకుబేటర్ గ్రాండ్ ఛాలెంజ్ -ప్రభుత్వం పది ఇంకుబేటర్లను గుర్తించి ఎంచుకుంటుంది. వాటి పని తీరును ముందే ఉన్న పనితీరు సూచికలతో (KPIs) మూల్యాంకనంచేసి అవి ప్రపంచ స్థాయి సామర్ధ్యం కలిగి ఉన్నాయని తెలిస్తే వాటికి రూ .10 కోట్ల సహాయం వాటి ముల సదుపాయాల అభవృద్ధికీ గాను ఇస్తుంది.

ఆధారం : స్టార్టప్ ఇండియా

3.03389830508
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు