హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / చీఫ్ మినిష్టర్స్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ యూత్ (సి.ఎం.ఇ.వై. పధకం)
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చీఫ్ మినిష్టర్స్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ యూత్ (సి.ఎం.ఇ.వై. పధకం)

యువజన సంఘం అంటే:ఈ కార్యక్రమం "గ్రూప్ స్ట్రేటజీ" పై ఆధారపడి ఉంది. 18 - 35 సం||రాల వయోవర్గంలోని 5 నుండి 15 యువజనుల కలయికే ఇది రిజిస్ట్రేషన్ - అధిక లాభాలు: ఆంధ్రప్రదేశ్ సొసైటీల చట్టం, 1995 పరస్పర సహాయక సహకార చట్టం / కంపెనీల చట్టం / భాగస్వామ్య పత్రం క్రింద రిజిష్టరు అయిన యువజన సంఘం, తన పేరు మీద ఋణాన్ని పొందడానికి ఏదైనా బ్యాంకును కోరవచ్చును. అంతేకాక, ఈ విధంగా రిజిష్టరైన యువజన సంఘం మార్జిను మనీ / సబ్సిడీ వంటివి పొందడానికి ఎస్.సి / ఎస్.టి / బి.సి. / మైనారిటీలు / మహిళా ఆర్ధిక సంస్ధలు / డి.ఆర్.డి.ఏ. / కె.వి.ఐ.బి. వంటి ఏజన్సీలతో తన కార్య కలాపాలను విస్తరించుకోవచ్చు.

 

అమలు విధానం

రాష్ట్రంలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు యువజన సేవలను, ప్రయోజనాలను విస్తరింపచేయాలనేది ప్రభుత్వ విధానం. దీన్ని మూడు దశలుగా విభజించారు.

మొదటి దశ: మొదటి దశలో "పైలటు" ప్రాతిపదికన ఒక్కొక్క మండలంలోనూ రెండు గ్రామాలను ఎంపిక చేస్తారు. మొదటి దశలో మున్సిపల్ ప్రాంతాలు తప్ప, ఇతర అన్ని మండల ప్రధాన కార్యాలయ ప్రాంతాల్లో చేపడతారు. ఒక మండలంలో అదనంగా మరో గ్రామాన్ని జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రితో సంప్రదించి ఎంపిక చేయవచ్చు. ఆ గ్రామ జనాభా 2,500 - 3,000 మధ్య ఉండాలి.

రెండవ దశ

దీనిలో మొదట చేపట్టని 5 - 10 గ్రామాలను ఎంపిక చేస్తారు.

మూడవ దశ

ఈ దశను పట్టణ ప్రాంతాలకు కూడా వర్తింపచేస్తారు.

ప్రాజెక్టుల ఎంపిక

ఎట్టి పరిస్ధితిలోనూ ఒకే గ్రామానికి పదికి మించి యువజన సంఘాలు ఉండరాదు. సంఘం ఏర్పడ్డాక గుర్తింపు నిమిత్తం జిల్లా యువజన సంక్షేమ అధికారికి, మండల యువజన ఎంపవర్‌మెంటు ఆఫీసరు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామానికి చెందిన స్వాభావిక పరిస్థితులు, సాంఘిక - ఆర్ధిక స్ధితిగతులు, స్ధలాకృతిని బట్టి ప్రాజెక్టును ఎంపిక చేసుకోవాలి. యువజన సంఘానికి సేవింగ్స్ బ్యాంక్ అక్కౌంట్ ఉండాలి. బ్యాంకులో వేసే డిపాజిట్లు, విత్‌డ్రాయల్సు, సమావేశపు తీర్మానాల ద్వారా మాత్రమే చేయాలి.

ఆర్ధిక సహాయం వివరాలు

యువజన సంఘం సభ్యులు గ్రూప్ సేవింగ్స్ ద్వారా 15,000 రూపాయలు జమ చేయాలి. దానికి మ్యాచింగ్ గ్రాంట్‌గా 15,000 రూపాయలు లభిస్తాయి. యువజన సంఘానికి గ్రూప్ లోన్ సబ్సిడీగా 50,000 రూపాయలను సమకూర్చుతుంది ప్రభుత్వం. ఇదే కాకుండా, ఎస్.సి./ ఎస్.టి./బి.సి./ మైనారిటీలు / వికలాంగులు / మహిళలకు "మార్జిన్ మనీ"గా మరో 20 వేల రూపాయలు అందిస్తుంది. ఈ వర్గాలకు చెందని ఇతర యువజన సంఘాలకు యువజన సంక్షేమ శాఖ ద్వారా 20,000 రూపాయల మార్జిన్ మనీ లభిస్తుంది.

ర్ధిక వనరులు

S.C./S.T./B.C./Min/P.H./Ladies

ఇతర యువజన సంఘాలు

1. గ్రూప్ సేవింగ్స్

2. మ్యాచింగ్ గ్రాంట్

3. గ్రూప్‌లోన్ సబ్సిడీ

4. మార్జిన్ మనీ

5. యువజన సంక్షేమ శాఖ మార్జిన్ మనీ

రూ. 15,000-00

రూ. 15,000-00

రూ. 50,000-00

రూ. 20,000-00

పరిస్థితిని బట్టి మారును

రూ. 15,000-00

రూ. 15,000-00

రూ. 50,000-00

పరిస్థితిని బట్టి మారును

రూ. 20,000-00

శిక్షణ

అవసరమైన శిక్షణను మండలం, జిల్లా స్ధాయిలో ఒక మాస్టర్ క్రాప్ట్స్మెమెన్ ద్వారా గానీ, ఏదైనా సంస్థ ద్వారా కానీ ట్రైసెం కింద ఇప్పించబడుతుంది.

ప్రాజెక్టుల మంజూరు

మండల యువజన ఎంపవర్‌మెంటు ఆఫీసరు దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయి మంజూరు సంఘానికి దాఖలుపరుస్తారు. ఈ సంఘంలో జిల్లా కలెక్టర్ చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. ఇంకా పి.డి., డి.ఆర్.డి.ఏ., ఇ.డి., డి.ఎస్. బి.సి. / మైనారిటీలు / మహిళలు, జి.ఎం., డి.ఐ.సి., జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేతృత్వం వహించే బ్యాంకు మేనేజరు, స్థానిక పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

సి.ఎం.ఇ.వై.లో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు

1.విత్తన ఉత్పత్తి - మార్కెటింగ్
2. పండ్లతోటల పెంపకం - ఉత్పత్తి
3. పండ్ల చెట్ల ప్రూనింగు, అందులో శిక్షణ
4. తోటపని పువ్వుల పెంపకం
5. పుట్టగొడుగుల ఉత్పత్తి
6. మంచినీటి కొలనులు, చెరువుల్లో చేపల పెంపెకం
7. చేపపిల్లల ఉత్పత్తి పెంపకం
8. ఉప్పునీటి కయ్యల్లో చేపలు, రొయ్యల పెంపకం
9. చేపల, రోయ్య పిల్లల సేకరణ
10. తేనె తయారీ
11. వైద్య ప్రయోజనాల నిమిత్తం ఓషధి మూలికలు, మొక్కల సాగు
12. కోళ్ళ పెంపకం
13. పందుల పెంపకం14. గొర్రెలు, మేకల పెంపకం
15. వ్యవసాయం
16. చిన్నతరహా సాగునీటి పధకం
17. భూమి కొనుగోలు

రెండవ ప్రాధాన్యత రంగాలు:

1. అగ్గిపెట్టెల తయారీ
2. బాణాసంచా తయారీ
3. అగర్ఒత్తుల తయారీ
4. వంట నూనెలు కాని తైలాల తయారీ
5. సబ్బుల పరిశ్రమ
6. చర్మ ఉత్పత్తుల పరిశ్రమ
7. గ్రామీణ కుమ్మరి పరిశ్రమ
8. గానుగనూనె పరిశ్రమ
9. చేతితో చేసిన కాగితం
10. చెరకు బెల్లం తయారీ
11. తాటిబెల్లం, ఇతర తాటి ఆధార ఉత్పత్తుల తయారీ
12. అటవీ ఉత్పత్తుల నుండి ఇతర పదార్ధాల తయారీ
13. పప్పు, తృణ ధాన్యాల ప్రాసెసింగ్
14. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, పరిరక్షణ క్యానింగ్
15. రొట్టెలు, మిఠాయిల తయారీ
16. తేనె ప్రాసెసింగ్
17. చేతి వృతులు
18. సున్నపు ఉత్పత్తుల పరిశ్రమ
19. వెదురు, పేముపరిశ్రమ
20. అల్యూమినియంతో గృహోపకర పాత్రలు తయారీ
21. పట్టు పరిశ్రమ.

ఇవే కాకుండా పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమలు, నిర్మాణాలు, రవాణా, చిల్లర వర్తకం, బ్యాంకింగ్, బీమాంశాలకు చెందిన ప్రాజెక్టులను కూడా మంజూరుచేస్తారు. పైన చూపిన జాబితా ఉదాహరణ మాత్రమే. ఇంకా అనేక రంగాల ప్రాజెక్టులను సాధించుకోవచ్చును.

మరిన్ని వివరాలకు:స్పెషల్ కమీషనర్, యువజన సంక్షేమ సర్వీసెస్, బోట్స్ క్లబ్, సికింద్రాబాద్

ఆదారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

2.83870967742
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు