హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / స్టాండ్ అప్ ఇండియా పథకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

స్టాండ్ అప్ ఇండియా పథకం

ఇక్కడ ఎస్సీ/ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తల స్టాండ్ అప్ ఇండియా పథకం గురించిన సమాచారం అందించబడింది.

స్టాండ్ అప్ ఇండియా పథక లక్ష్యం మహిళలు, షెడ్యూల్డ్ కులాల మరియు తెగల మధ్య వ్యవస్థాపకతను ప్రోత్సహించడం. ఈ పథకం ఆర్థిక సేవల శాఖ (DFS), ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతుంది.

బ్యాంకు శాఖ కనీసం ఒక షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) లేదా షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) రుణగ్రహీత మరియు కనీసం ఒక మహిళకు గ్రీన్ఫీల్డ్ సంస్థ ఏర్పాటు కోసం స్టాండ్-అప్ ఇండియా పథకం కింద రూ 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు రుణాన్ని అందిస్తుంది. ఇది తయారీ, సేవలు లేదా వ్యాపార రంగం లోఉండవచ్చు. ఒకవేళ వాటా సంస్థలకైతే కనీసం 51% వాటా మరియు నియంత్రణ ఒక SC / ST లేదా మహిళ పారిశ్రామికవేత్త కలిగి ఉండాలి.Standup ecosystem

అర్హత

  • ఎస్సీ/ఎస్టీ మరియు/లేదా మహిళ వ్యవస్థాపకులు, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
  • పథకం కింద ఆకుపచ్చ పథకాలకు (గ్రీన్ ప్రాజెక్ట్) మాత్రమే రుణాలు అందుబాటులో ఉంటాయి. గ్రీన్ ఫీల్డ్, ఈ సందర్భంలో, లబ్ధిదారుని మొదటి ప్రయత్నం (వెంచర్) తయారీ లేదా సేవలు లేదా వ్యాపార రంగంలో ఉండాలి.
  • కాని భాగస్వామ్య సంస్థల విషయంలో, 51% వాటా మరియు నియంత్రణలు ఎస్సీ/ఎస్టీ మరియు/లేదా మహిళా పారిశ్రామికవేత్త నిర్వహించాలి.
  • రుణగ్రహీత ఏ బ్యాంకు/ఆర్ధిక సంస్థకు బకాయ (డిఫాల్ట్) ఉండకూడదు.

రుణం వివరాలు

  • రుణ స్వభావం - సంయుక్త (కాంపోజిట్) రుణం (ఈ విడత ఋణం మరియు మూలధలం కలుపుకొని) 10 లక్షల నుండి 100 లక్షల వరకు ఉంటుంది.
  • రుణం ఉద్దేశ్యం - ఎస్సీ/ఎస్టీ/మహిళలు పారిశ్రామికవేత్తలతో తయారీ, వ్యాపార లేదా సేవల రంగంలో ఒక నూతన ప్రయత్నాల (వెంచర్) ఏర్పాటు.
  • రుణ పరిమాణం - -విడత ఋణం మరియు మూలధనాన్ని కలుపుకొని ప్రాజెక్టు ఖర్చులో 75% సంయుక్త రుణం. ఇతర పథకాల మద్దతుతో పాటు రుణ గ్రహీత యొక్క సహకారం ప్రాజెక్టు ఖర్చులో 25% మించి ఉంటే రుణ నిబంధనల ప్రాజెక్టు ఖర్చులో 75% రుణం వర్తించదు.
  • వడ్డీ రేటు -వడ్డీ రేటు ఆ వర్గం (రేటింగు వర్గం) బ్యాంకు అత్యల్ప వర్తించే రేటు (బేస్ రేటు (MCLR) +3% + టెనార్ ప్రీమియం) మించకుండా ఉంటుంది.
  • హామీ - ప్రాధమిక హామీతో పాటు, రుణానికి అనుషంగిక (కొల్లాటరల్) హామీ లేదా బ్యాంకులు నిర్ణయం మేరకు స్టాండ్-అప్ ఇండియా రుణాల (CGFSIL) క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం హామీ ఉండాలి.
  • చెల్లింపు - 18 నెలల గరిష్ట విరామం (మారటోరియం) కాలంతో 7 సంవత్సరాలలో తిరిగి చెల్లించాలి.
  • మూలధనం -10 లక్షల వరకు మూలధనం వర్కింగ్ డ్రావల్ , దీనిని అతిగ్రహణం (ఓవర్డ్రాఫ్ట్) ద్వారా మంజూరు చేయవచ్చు. రుణగ్రహీత సౌలభ్యం కోసం రూపే (Rupay) డెబిట్ కార్డ్ జారీ చెయవచ్చు. 10 లక్షల పరిమితి కంటే ఎక్కువ మూలధనం ఉంటే క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా ఆమోదించాలి.
  • మార్జిన్ మనీ -పథకం కింద 25% మార్జిన్ మనీ కేంద్ర/రాష్ట్ర పథకాలు ఏకీభవించటం ద్వారా సమకూర్చుకోవచ్చు. అటువంటి పథకాలు అనుమతించదగిన రాయితీలు పొందవచ్చు లేదా మార్జిన్ మనీ అవసరాల కొరకు ఉపయోగించుకోవచ్చు. అన్ని కేసుల్లో రుణగ్రహీత సొంతంగా ప్రాజెక్టు ఖర్చులో 10% కనీసం తీసుకురావాలి.

రుణాలకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి

ఈ పథకాన్ని, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల అన్ని శాఖలను కలుపుకొని, మూడూ సంభావ్య విధాలుగా ఉపయోగించవచ్చు.

సరిచూసుకో (చెక్లిస్ట్) – స్టాండప్ ఇండియా రుణ వినతి పత్రం

  • గుర్తింపు రుజువు : ఓటరు ID కార్డ్/పాస్పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డు/ప్రస్తుత బ్యాంకర్ల నుండి యజమాని సంతకం గుర్తింపు, సంచాలకుల (డైరెక్టర్) భాగస్వామి (సంస్థ అయితే)
  • నివాస రుజువు : ఇటీవలి టెలిఫోన్ బిల్లులు, విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను రసీదులు/పాస్పోర్ట్/ప్రొప్రైటర్ ఓటరు ID కార్డ్, సంచాలకుని భాగస్వామి (సంస్థ అయితే)
  • వ్యాపార చిరునామా రుజువు
  • అభ్యర్థి ఏ బ్యాంకు/F.I లో డిఫాల్టరుగా ఉండకూడదు.
  • మెమొరాండమ్ మరియు భాగస్వాములు కంపెనీ / పార్టనర్షిప్ కార్య సమితి నిబంధనలు మొదలైనవి
  • తాజా ఆదాయ పన్ను రిటర్నుతో పాటు ప్రమోటర్లు మరియు పూచీదారు ఆస్తులు మరియు రుణాల ప్రకటన.
  • రెంట్ ఒప్పందం మరియు వర్తిస్తే కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి (అద్దె వ్యాపార ప్రాంగణంలో ఉంటే).
  • SSI / MSME నమోదు, వర్తిస్తే.
  • మూల నిధి పరిమితులు ఉంటే వచ్చే రెండు సంవత్సరాల ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్లు మరియు విడత రుణం విషయంలో రుణ కాలపరిమితి
  • లీజు దస్తావేజు/అన్ని ఆస్తుల టైటిల్ దస్తావేజుల ఫోటో నకల్లు ప్రాధమిక మరియు అనుషంగిక పూచీ వలె ఇవ్వాలి.
  • అభ్యర్థి ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన వారని తెలిపే పత్రాలు, ఎక్కడ వర్తిస్తుందో అక్కడ.
  • కంపెనీ లో అందరికంటో ఎక్కువ వాటా ఎస్సీ/ఎస్టీ/స్త్రీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి చేతిలో ఉంది అని ROC నుండి దృవీకరణ పత్రం.
  • 25 లక్షల పైన ఎక్స్పోజరు కేసులలో
    • యూనిట్ వివరాలు (యజమానుల పేర్లు, కంపెనీలోని ఇతర సంచాలకులు, అన్ని కార్యాలయాలు మరియు ప్లాంటుల చిరునామాలు, వాటాదారుల నమూనా మొదలైనవి)
    • గత మూడు సంవత్సరాల అసోసియేట్/గ్రూప్ కంపెనీల (ఏదైనా ఉంటే) బ్యాలెన్స్ షీట్లు.
    • యంత్రాల వివరాలున్న (ప్రతిపాదిత ప్రాజెక్టుకు విడత నిధులు అవసరమైతే) ప్రాజెక్ట్ నివేదికను సమర్పించాలి. ఏ యంత్రాన్ని కొంటారో, దాని ధర, సరఫరాదారుల పేర్లు అందివ్వాలి. యంత్రాల సామర్థ్యం, అనుకున్న వినియోగ సామర్థ్యం, ఉత్పత్తి, అమ్మకాలు, ప్రొజెక్టెడ్ వివరాలు వంటి ఆర్థిక వివరాలు మరియు టెనర్ రుణం బ్యాలెన్స్ షీట్లు, కార్మికుల వివరాలు, అవసరమైన సిబ్బంది, మరియు అంచనా ఆర్థిక వివరాలు మొదలైనవి కలిగి ఉండాలి.
    • ఉత్పత్తి పద్దతుల వివరాలు (వర్తిస్తే), కంపెనీల ప్రధాన ఎగ్జిక్యూటిన్ ప్రొఫైల్, ఏవైనా టై-అప్స్, ఉపయోగించిన ముడి పదార్థాల వివరాలు మరియు వాటి పంపిణీదారు, కొనుగోలుదారుల వివరాలు, ప్రధాన పోటీదారుల గురించిన వివరాలు మరియు పోటీదారులతో పోలిస్తే సంస్థ యొక్క బలం మరియు బలహీనతలు మొ.

చెక్ జాబితా ఒక సూచిక మాత్రమే మరియు సమగ్రమైనది కాదు మరియు వివిధ ప్రాంతాలలో అదనంగా స్థానిక అవసరాల (ఆవశ్యకత) ప్రకారం తయారు చేయవచ్చు.

రుణ వినతుల సమర్పణ ప్రక్రియ

    1. రుణగ్రహీత (క్రింది జాబితా 8-10 ప్రశ్నలు సమితి ద్వారా పొందుతారు) కొన్ని పారామితులు/కొలమానాల సమాచారాన్ని పోర్టల్ లో ప్రారంభ నమోదు ప్రక్రియ కింద సేకరిస్తారు. అందించిన సమాచారం ఆధారంగా, రుణగ్రహీతలకు అభిప్రాయం అందించబడుతుంది.

    2. స్టాండ్ అప్ ఇండియా పోర్టల్ విధానం చేయూత ప్రారంభ దశలో సంబంధిత ప్రశ్నలు సమాధానాల ఆధారంగా ఉంటుంది. సాధారణంగా ఇవి:

    i. రుణగ్రహీత యొక్క ప్రదేశం

    II. వర్గం - ఎస్సీ/ఎస్టీ/స్త్రీ

    iii. వ్యాపార ప్రణాళిక స్వభావం

    iv. వ్యాపారం నడపడానికి స్థలం లభ్యత.

    v. ప్రాజెక్ట్ ప్రణాళికను సిద్ధం చేయడానికి అవసరమైన సహాయం

    vi. నైపుణ్యాల/శిక్షణ అవసరం (సాంకేతిక, ఆర్థిక).

    vii. ప్రస్తుత బ్యాంకు ఖాతా వివరాలు.

    viii. ప్రాజెక్టులో సొంత పెట్టుబడి మొత్తం

    ix. మార్జిన్ మనీ సహాయం అవసరమా

    x. వ్యాపారంలో ఏదైనా పూర్వ అనుభవం ఉందా

    ప్రతిస్పందన ఆధారంగా గ్రహీతలను సిద్ధంగా ఉన్న రుణగ్రహీతలు మరియు ట్రైనీ రుణ గ్రహీతలుగా వర్గీకరించవచ్చు.
  1. సద్ధంగా ఉన్న రుణగ్రహీత - రుణగ్రహీతకు ఎటువంటి చేయుత మద్దతు అవసరంలేకపోతే, అప్పుడు ఎంచుకున్న బ్యాంకు రుణం కోసం అప్లికేషన్ ప్రక్రియ స్టాండ్-అప్ ఇండియా పోర్టల్ (www.standupmitra.in) ద్వారా చేయవచ్చు. ఈ దశలో అనువర్తన సంఖ్య ఉత్పత్తి చేయబడుతుంది మరియు సంబంధిత బ్యాంకుకు భాగస్వామ్య రుణగ్రహీత గురించిన సమాచారం అందించబడుతుంది. LDM (ప్రతి జిల్లా లో పోస్ట్) మరియు నాబార్డ్ / సిడ్బికి ఈ సమాచారాన్ని పంచుతారు. సిడ్బి మరియు నాబార్డ్ కార్యాలయాలు నియమించబడిన స్టాండ్-అప్ కనెక్ట్ కేంద్రాలు (SUCC). రుణ అప్లికేషన్ ఇప్పుడు ఉత్పత్తి అయి పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి ఉంటుంది.
  2. ట్రైనీ రుణ గ్రహీత

    i. రుణగ్రహీత చేయూత అవసరం అని తెలిపినప్పుడు, నమోదు ట్రైనీ రుణగ్రహీతగా స్టాండప్ ఇండియా పోర్టల్ సూచిస్తుంది. అప్పుడు www.standupmitra.in సంబంధిత జిల్లా LDMకు మరియు సిడ్బికి / నాబార్డ్ సంబంధిత కార్యాలయానికి రుణగ్రహీతను లింక్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ పద్దతి అయిన ఈ ప్రక్రియను స్వయంగా రుణగ్రహీత ద్వారా ఇంట్లో చేయవలెను.

    ii. సిడ్బి మరియు నాబార్డులు స్టాండ్-అప్ ఇండియాతో జోడించే కేంద్రాలు కాబట్టి ట్రేనీ రుణగ్రహీతలకు కింది విధానాలలో ఒకటి లేదా ఎక్కువ వాటిలో శిక్షణా మద్దతు ఏర్పాట్లు చేస్తాయి:

    ఏ. ఆర్థిక శిక్షణ కోసం - ఆర్ధిక అక్షరాస్యత సెంటర్స్ (FLCs)

    బి. నైపున్య కేంద్రాలకు (ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ - - VTPs /ఇతర సెంటర్స్ -OCs)

    సి. EDPల కోసం - MSME DI/జిల్లా పరిశ్రమల కేంద్రాలు (డి ఐ సి)/గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు (RSETIs)

    డి. పని షెడ్ కోసం - డి ఐ సి

    ఇ. మార్జిన్ మనీ కోసం - మార్జిన్ మనీ మద్దతు పధకాల సంబంధిత కార్యాలయాలు. ఉదా. రాష్ట్ర SC ఫైనాన్స్ కార్పొరేషన్, మహిళా అభివృద్ధి సంస్థ, రాష్ట్ర ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు (KVIB), MSME- DI మొదలైనవి

    ఎఫ్. పేరొందిన వ్యవస్థాపకులతో గురువు మద్దతు. DICCI, మహిళా పారిశ్రామికవేత్త అసోసియేషన్స్, ట్రేడ్ బాడీస్. విశ్వసనీయ, బాగా పేరొందిన NGO లను కూడా చేయూతకు ఉపయోగించవచ్చు.

    జీ. వినియోగ కనెక్షన్ల కోసం - వినియోగ ప్రొవైడర్ల కార్యాలయాలు

    హెచ్. DPRల కోసం - సిడ్బి/నాబార్డ్/డిఐసి అందుబాటులోని ప్రాజెక్ట్ ప్రొఫైల్స్

    ఏ సమయంలో అయినా, రుణం మంజూరు చేసిన తర్వాత కూడా, రుణగ్రహీత స్టాండ్-అప్ కనెక్ట్ సెంటర్స్ సేవలు ఉపయోగించుకోవచ్చు.

    iii. LDM ప్రాంతీయ కార్యాలయాల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది మరియు సిడ్బి మరియు నాబార్డుల సమస్యల పరిష్కారం మరియు ఆటంకాలను నిర్ములించేందుకు పని చేస్తుంది. ప్రతి సందర్భంలో మొదటి అభిప్రాయ సాధ్యత పురోగతి ఆధారంగా, LDM పైకి రావటానికి అవకాశం ఉన్న కేసుల గురించి బ్యాంకు శాఖలకు తేలియ చేస్తుంది. దీని తర్వాత, సిడ్బి/నాబార్డ్ బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ(ఫాలోఅప్) ఉంటారు. ఇవి కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI), మహిళా పారిశ్రామికవేత్త అసోసియేషన్స్, దళిత ఇండియన్ ఛాంబర్స్ వంటివి వాటాదారుల ఇతర సంస్థలతో కూడా పని చేస్తాయి.

    iv. సహాయానికి కావలసిన అవసరాలు తగినంతగా అందించినట్టుగా LDM మరియు ట్రేనీ రుణగ్రహీత సంతృప్తి పడితే, రుణ వినతి పత్రం పోర్టల్ ద్వారా ఉత్పత్తి అవుతుంది.

    మూలం : Stand-Up India portal (www.standupmitra.in)

    సంబంధిత వనరులుs

    1. స్టాండ్-అప్ ఇండియా రుణ వినతి పత్రం.
    2. సహాయ కేంద్రాల జాబితా
    3. LDMల జాబితా
    4. కనెక్ట్ కేంద్రాల జాబితా
3.0
బాలాజీ Jul 26, 2017 03:53 PM

బీసీ కులమునకు చెందిన మహిళా అరుహారాల తెలియ జేయండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు