অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ముల్లా కమిటీ చేసిన సిఫారసులు

ముల్లా కమిటీ చేసిన సిఫారసులు

ముల్లా కమిటీ ఈ క్రింద సిఫారసులను చేసింది

  • నేర నిరోధం, నేరస్తుల సంస్కరణలలో ప్రజల భాగస్వామ్యాన్ని జైళ్ళ జాతీయ విధానంలో భాగం చేయాలి.
  • నేర నిరోధంలో, నేరస్తుల సంస్కరణలో సమాజం పోషించగల పాత్ర పై పెద్ద ఎత్తున ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్గించాలి. ఇందులో సమాజంలోని సంస్కరణాభిలాష గల వారందరినీ భాగస్వాముల్ని చేయాలి.
  • జాతీయ స్థాయిలో జైళ్ళ సంస్కరణ రంగంలో పని చేయడానికి ఆసక్తి ఉన్న గ్రూపులను, వ్యక్తులను ప్రతి రంగం నుండి గుర్తించి, నమోదు చేసే పనిని ప్రతిపాదిత జైళ్ళ జాతీయ కమీషన్ చేయాలి.
  • రాష్ట్ర జిల్లా, మండల స్థాయిలో స్వచ్ఛంద కార్యకర్తలను, సంస్థలను గుర్తించి, నమోదు చేసే పనిని జైళ్ళ డిపార్టుమెంట్ చేపట్టాలి.
  • అటువంటి కార్యకర్తలను వ్యక్తిగత గుణగణాలు, వ్యక్తిత్వం, పేరు, ప్రజలతో కలిసిపోయే స్వభావం లాంటి వాటికి ప్రాముఖ్యతనిచ్చి, ఎంపిక చేయాలి. తగిన కారణాలు ఉన్నచోట, సంస్థల, వ్యక్తుల గుర్తింపును రద్దు చేయడానికి జైళ్ళ ఇన్స్ పెక్టర్ జనరల్ కు అధికారం ఉండాలి.
  • సంస్కరణల కార్యక్రమాలను చేపట్టే సంస్థలకు, వ్యక్తులకు తగినంత ప్రోత్సహాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. బలమైన స్వచ్ఛంద రంగం అభివృద్ధ్కి ప్రభుత్వంతగినన్ని ;నిధులను కేటాయించాలి. వారు జైళ్ళ రంగంలో చేసిన ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలకు తగిన సామాజిక, ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి.
  • అవసరమైనప్పుడల్లా ఎంపిక చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవగాహన, శిక్షణ ఇచ్చి సంస్కరణల రంగంలో పనిచేయడానికి చట్టబద్దమైన అధికారం ఇవ్వాలి. జైళ్ళ సిబ్బందికి భిన్నంగా వారి పాత్రను, విధులను నిర్వచించాలి.
  • స్వచ్ఛంద కార్యకర్తలకు అన్ని స్థాయిల నుండి సాధ్యమైనంత సహాయం, సలహాలు పొందగలిగేలా చూడాలి. వారికి కేంద్రప్రాంతీయ కార్యాలయాల నుండి, సంస్థల నుండి పర్యవేక్షణ, సంప్రదింపులు లభించాలి.
  • జిల్లా, కేంద్రీయ కారాగారాల్లో ఉన్న శిక్షా సమీక్ష బోర్డులలో వారిని నాన్ – అఫీషియల్ సభ్యులుగా కూడా నియమించ వచ్చును.

దీని తర్వాతిదే అతిముఖ్యమైన సిఫారసు

  • సంస్కరణ కార్యక్రమాలలో ఆసక్తి ఉన్న పౌర ప్రముఖులను జైలు సందర్శకులుగా నియమించవచ్చు. లేదా జైళ్ళలోని పరిస్థితులను, అక్కడ వారికి ఎదురవుతున్న సమస్యలను తరుచుగా, నిష్పక్షపాతంగా తెలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారిని లేఖకులు (correspondents)గా నియమించవచ్చును.
  • జైళ్ళ సందర్శక వ్యవస్థ సంప్రదాయక పరిధులను దాటి సమీక్షా విధులనేకాక, సహకార విధులను కూడా చేపట్టాల్సిన అవసరాన్ని పైన పేర్కొన్న అంశం స్పష్టం చేస్తుంది. కాని జైళ్ళ జాతీయ కమీషన్ లేకపోవడం వల్ల, ఇప్పటి మారిన పరిస్థితుల్లో, సంస్థలను, వ్యక్తులను గుర్తించి నమోదు చేసే కర్తవ్యాన్ని జాతీయ, రాష్ట్ర మానవహక్కుల సంఘాలకు, జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్లకు అప్పజెప్పవచ్చును.
  • ప్రజల భాగస్వామ్యంతో, మానవ వనరులపై దృష్టి పెట్టడం ద్వారా, మానవ హక్కుల ఉల్లంఘనలను సరి దిద్దడమే కాక, జైళ్ళ పరిస్థితులను కూడా మెరుగుపరచడానికి నూతన జైళ్ళ సందర్శక వ్యవస్థ ప్రయత్నిస్తుంది.
  • పై లక్ష్యాన్ని సాధించడం ఈ పుస్తకం ఉద్దేశాలలో ఒకటి.

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate