অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఖైదీల హక్కులకు పునాది ఎక్కడ?

ఖైదీల హక్కులకు పునాది ఎక్కడ?

  1. ప్రభుత్వం బాధ్యత
  2. ప్రవర్తనా (Treatment) ప్రమాణాలకు పునాది ఐక్యరాజ్యసమితి పత్రాలు ఐక్యరాజ్యసమితి పత్రాలు
    1. భారతీయ చట్టం
  3. ఖైదీల హక్కుల జాబితా
    1. తగిన వర్గీకరణ ప్రకారం ప్రత్యేక వసతిలో ఉంచబడే హక్కు
    2. మహిళా ఖైదీల హక్కులు
    3. ఆరోగ్యకరమైన వాతావరణం, సరియైన సమయంలో వద్య సేవలు పొందే హక్కు
    4. బెయిలు పొందే హక్కు
    5. సత్వర న్యాయవిచారణాహక్కు
    6. ఉచిత న్యాయ సేవను పొందే హక్కు
    7. తన న్యాయవాదిని సంప్రదించే హక్కు
    8. కోర్టు విధించిన శిక్షకంటే ఎక్కువ కాలం నిర్భంధించడాన్ని వ్యతిరేకించే హక్కు
    9. బలవంతపు లైంగిక చ్ర్యలకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు
    10. విచక్షణారహితంగా బేడీలు, గులుసులు విధించ డానికి వ్యతిరేకంగా హక్కు
    11. చిత్రహింసలు, క్రూరమైన,అవమాన కరమైన శిక్షలకు వ్యతిరేకంగా హక్కు
    12. జైలు తప్పులకు ఒంటరి ఖైదు విధించడానికి వ్యతిరేకంగా హక్కు
    13. విచక్షణారహిత జైలు శిక్షలకు వ్యతిరేకంగా హక్కు
    14. సమస్యలను చెప్పుకొనే హక్కు, దానికి సరియైన పరిష్కారాన్ని పొందే హక్కు
    15. దుడుకు చర్యలకు పాల్పడిన జైళ్ళ అధికారు లకు వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ రిట్ ను దాఖలు చేసే హక్కు
    16. మానవ హక్కుల ఉల్లంఘనకు నష్టప్రిహారం పొందే హక్కు
    17. కుటుంబసభ్యులను కలుసుకునే హక్కు
    18. కుటుంబానికి, స్నేహితులకు ఉత్తరాలు రాసు కునే హక్కు, వారి నుండి ఉత్తరాలు, పత్రికలు అందుకునే హక్కు
    19. సంస్కరణా కార్యక్రమాలలో పాల్గొనే హక్కు
    20. జైలులో పనిచేసే హక్కు, పనికి తగిన వేతనం పొందేహక్కు
  • రెండు సూత్రాలనుండి ఖైదీల హక్కులు ఉంటాయి మొదటగా, ఖైదీలు కూడా మీలాగ, నాలాగ మనుషులే. కాబట్టి చట్టబద్దమైన పద్ధతిలో నిర్బంధించినప్పుడు కోల్పోవాల్సి వచ్చిన హక్కులు తప్ప మిగిలిన హక్కులన్నీ వారికి ఉంటాయి. ఈ హక్కుల జాబితాలో ఖైదీల ప్రాథమిక మానవ గౌరవాన్ని రక్షించడానికి అవసరమైనవే కాక వారు మనుషులుగా ఎదగడానికి అవసరమైన హక్కులన్నీ కూడా ఉండాలి.
  • రెండవది, ఖైదీలు తమ రోజువారీ అవసరాలన్నింటి కొరకు జైలు అధికారుల మీద ఆధారపడడం వల్ల, వారి జీవెతం మీద స్వేచ్ఛ మీద ప్రభుత్వానికి అదుపు ఉండడం వల్ల, అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నిరోధించడానికి కూడా హక్కులు ఆవిర్భంవించాలి

ప్రభుత్వం బాధ్యత

  • ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలు ఉండడం వల్ల పౌరుల హక్కులను రక్షించడంలో దానికి విస్తృతమైన బాధ్యతలు కూడా వున్నాయి. ఇతర వ్యక్తుల నుండి న్యాయమైన, గౌరవనీయమైన, వివక్షకు తావులేని (Treatment)కోరే మనం ప్రభుత్వాధి కారుల నుండిదీనిని మరింట బలంగా ఆకాంక్షిస్తాము. అధికార దుర్వినియోగం నుండి పౌరులను రక్షించడం కోసమే ఈ ఆకాంక్షలను (claims)ఉన్నత స్థాయినిచ్చి, వాటిని హక్కుల రాజ్యాంగం గుర్తించింది1. పౌరుల ఆకాంక్షలకు హక్కుల స్థాయిని కల్పించడం ద్వారా, వాటి ఉల్లంఘన నుండి తమను తాము రక్షించుకోవడానికి, పరిహారం పొందడానికి, న్యాయస్థానాల తలుపు తట్టడానికి కావల్సిన శక్తిని అది పౌరులకు ఇచ్చింకి. అదే విధంగా, ఇతరుల నుండిన్యాయమైన, గౌరవనీయమైన, వివక్షకు తావులేని ప్రవర్తనను కాంక్షించే పౌరుల హక్కులకు హామీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎవరైనా ఈ హక్కులను ఉల్లంఘించినా, పౌరులను రక్షించే కర్తవ్యంలో ప్రభుత్వం విఫలమైనా, ప్రభుత్వమే వాటికి బాధ్యత వహించాలి.
  • కాబట్టి ఖైదీలకు పౌరులుగా సహజంగా సంక్రమించే హక్కులను అధికారులు గాని, ఇతర ఖైదీలుగాని అతిక్రమిస్తే వారి హక్కుల ఉల్లంఘన జరిగినట్లే. ఈ అధ్యాయంలో ఇవ్వబడిన హక్కులు ఆ అర్థంలో పొందుపరచ బడ్డాయి.

ప్రవర్తనా (Treatment) ప్రమాణాలకు పునాది ఐక్యరాజ్యసమితి పత్రాలు ఐక్యరాజ్యసమితి పత్రాలు

విభిన్నమైన ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న ఖైదీలపట్ల ప్రవర్తించాల్సిన పద్ధతులకు సంబంధించిన ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి అనేక పత్రాలలో పొందుపరిచింది. మానవ గౌరవాన్ని నిలపడానికి, ఖైదీలకు అవసరమైన కనిష్ట ప్రాథమిక పరిస్థితులను జైళ్ళలో వుండేలా హామీ పొందడానికి, ఖైదీలు మెరుగైన మనుషులుగా ఎదగడానికి సంబంధించిన విషయాలను అవి చర్చించాయి.

  • ఖైదీలతో వ్యవహరించడంలో కనీస పామాణిక నిబంధనలు (1995).
  • చిత్రహింసలు లేక క్రూర, అమానవీయ, అగౌరవపరిచే శిక్షల నుండి ఖైదీలను రక్షించడంలో వైద్యాధికారులు, ముఖ్యంగా ఫిజీషియన్లు పాటించాల్సిన వైద్య నైతికతా సూత్రాలు (1982).
  • చిత్రహింసల వ్యతిరేక ఒప్పందం
  • జైళ్ళతో సహా ఎటువంటి నిర్బంధంలో ఉన్న వ్యక్తులనైనా రక్షించ డానికి సూత్రాలు (1984).
  • ఖైదీల పట్ల పాటించాల్సిన ప్రాధమిక సూత్రాలు (1990).
  • నిర్బంధేతర (Non-custodial) చర్యలకు ఐక్యరాజ్య సమితి రూపొందించిన కనిష్ట ప్రామాణిక నిబంధనలు (టోక్యో నిబంధనలు 1990)

భారతీయ చట్టం

  • భారతదేశ జైళ్ళలో జరుగుతున్నజ్ మానవహక్కుల ఉల్లంఘనలపై భారతదేశ కుప్రీంకోర్టు 1970 ల మధ్యనుండి చురుకుగా స్పంధిస్తూ ఉంది. ఆ క్రమంలో రాజ్యాంగంలోని 21, 19, 22, 32, 37, 39ఎ అధికరణలను మానవీయంగా విశ్లేషించడమే కాక, ఖైదీలకున్న అనేక హక్కులను కోర్టు గుర్తించింది. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కావడంతో అది నూతనంగా గుర్తించే హక్కులను ప్రభుత్వం కూడా తప్పకుండా గుర్తించాలని రాజ్యాంగంలోని 141 అధికరణ ఉంటుంది. “సుప్రీంకోర్టు ప్రకటించిన ఆదేశాలను దేశంలోని న్యాయ స్థానాలన్ని అమలు చేయాలని” 141వ అధికరణ అంటుంది.
  • 1980 లో వెలువరించిన సునీల్ బాత్ర వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసులో ఖైదీలకున్న అనేక రకాల హక్కులను వివరణాత్మకంగా సుప్రీంకోర్టు గుర్తించింది2 . అప్పటి న్యాయమూర్తి కృష్ణ అయ్యర్3 ఇలా అన్నారు.
  • “కోర్టు విధించిన శిక్ష మరియు నిర్బంధానికి అవసరమైన దానికంటే ఎక్కువ స్థాయిలో ఏ ఖైదీని వ్యక్తి గతంగా శిక్షించకూడదు. మిగిలిన అన్ని రకాల స్వేచ్ఛలు – చదువుకోవడానికి రాసుకోవ డానికి, వ్యాయామం, విశ్రాంతి, ధ్యానం, భజన వంటి పనులు చేసుకోవడానికి, విపరీతమైన చలినుండి, వేడినుండి రక్షణ పొందడానికి, బలవంతపు నగ్నత్వం లాంటి అవమానాల నుండి, బలవంతపు ;లైంగిక చర్యల వంటి భరించలేని చర్యల నుండి, రక్షణ పొందడానికి, క్రమశిక్షణ ఉల్లంఘించి బడకుండా జైలులోపల తిరగబడడానికి, నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి – వాళ్ళకు రక్షణ పొందడానికి స్వేచ్ఛ ఉంది”. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మనిషి మేధస్సును అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన ప్రాథమిక కనీస అవసరాలను పొందే హక్కును ( Right to basic minimum needs) పై ఆదేశం ప్రతిబింబిస్తుంది. ఈ హక్కులో సరియన వసతి, శుభ్రమైన నివాస పరిస్థితులు సంపూర్ణ ఆహారం, బట్టలు పడక సమయానికి వైద్య సౌకర్యం, పునరావాస హక్కులు సైతం ఇమిడి ఉన్నాయి4 .

ఖైదీల హక్కుల జాబితా

ఈ విభాగంలో భారతీయ చట్టాలు5 స్పష్టంగా గుర్తించిన హక్కులు, సుప్రీంకోర్టు,హైకోర్టులు రూలింగ్ ల ద్వారా ఏర్పరిచిన హక్కులు, వివిధ కమిటీలు సిఫారసు చేసిన హక్కులు ఇవ్వబడ్డాయి. ప్రతి హక్కుకు సమాంతరంగా జైళ్ళ అధికారుల, నేరన్యాయ వ్యవస్థ లోని ఇతర అధికారుల బాధ్యతలు పేర్కొనబడ్డాయి. స్థూలంగా ఇవ్వబడ్డ ఈ హక్కులు సంపూర్ణం కావ్య, ఎందుకంటే ఈ రంగం ఇంకా అభివృద్ధి చెందుతూ వుంది.

  • jail1తగిన వర్గీకరణ ప్రకారం ప్రత్యేక వసతిలో ఉంచబడే హక్కు.
  • పెద్ద వయస్సులో ఉన్న ఖైదీల నుండి విడిగా ఉండడానికి యుక్త వయస్కులకున్న ప్రత్యేక హక్కు.
  • మహిళా ఖైదీల హక్కులు
  • ఆరోగ్యకరమైన వాతావరణం, సకాలంలో వైద్య సేవలను పొందే హక్కు
  • బేయిల్ పొందే హక్కు
  • సత్వర విచారణజ్ పొందే హక్కు
  • ఉచిత న్యాయ సేవలను పొందే హక్కు.
  • తన న్యాయవాదితో మాట్లాడుకొనే హక్కు
  • న్యాయస్థానం విధించిన శిక్షకన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడాన్ని వ్యతిరేకించే హక్కు.
  • బలవంతపు లైంగిన కార్యం నుండి రక్షణ పొందే హక్కు
  • అహేతుకంగా సంకెళ్ళు, గొలుసులతో బంధించడాన్ని వ్యతిరేకించే హక్కు
  • చిత్రహింసలకు, క్రూరమైన మరియు అవమానకర శిక్షలకు వ్యతిరేకంగా హక్కు.
  • ఒంటరి ఖైదు శిక్షలు విధించడాన్ని వ్యతిరేకించే హక్కు
  • జైలులోపలి అహేతుక శిక్షలను వ్యతిరేకించే హక్కు
  • సమస్యలు ప్రస్తావించి, సరియైన పరిష్కారం పొందే హక్కు.
  • మానవహక్కుల ఉల్లంఘనకు నష్టపరిహారం పొందే హక్కు,
  • కుటుంబ సభ్యులను కలుసుకునే హక్కు
  • కుటుంబానికి, స్నేహితులకు ఉత్తరాలు వ్రాసుకొనే హక్కు వారి నుండి ఉత్తరాలు, పత్రికలు అందుకునే హక్కు
  • సంస్కరణ కార్యక్రమాలు కోరే హక్కు
  • పనిహక్కు, వేతనాలు పొందే హక్కు
  • జైలునిబంధనలు గురించి సమాచారం పొందే హక్కు.
  • జైలు అధికారుల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో రిట్ ఆఫ్ హెబియస్ కార్పన్ దాఖలు చేసే హక్కు.

తగిన వర్గీకరణ ప్రకారం ప్రత్యేక వసతిలో ఉంచబడే హక్కు

  • పురుష ఖైదీలకు సంబంధం లేకుండా, వారి దృష్టికి దూరంగా ప్రత్యేకమైన చోట ఉండే హక్కు మహిళా ఖైదీలకు ఉంది. వారిని ప్రత్యేక జైలులో కాని, లేక అదే జైలులో ప్రత్యేక భవనంలో గాని ఉంచవచ్చు.
  • విచారణలో ఉన్న స్త్రీ పురుషులకు, శిక్షపడిన ఖైదీలతో కాక, విడిగా ఉండే హక్కు ఉంది6
  • విచారణలో ఉన్న ఖైదీగా మొదటిసారి జైలుకొచ్చిన వ్యక్తికి, చిన్న నేరాలలో శిక్షపడిన ఖైదీకి, తీవ్రమైన శిక్ష అనుభవిస్తున్న ఖైదీల నుండి వేరుగా ఉండే హక్కుఉంది.
  • యుక్త వయస్సులో వున్న లేక తీవ్రమైన నేరాలలో లేని మహిళా ఖైదీలకు, చేడు ప్రవర్తన కలిగిన, నేరాలకు అలవాటు పడిన ఖైదీలకు దూరంగా వుండే హక్కు ఉంది.
  • సివిల్ ఖైదీలకు క్రిమినల్ ఖైదీల నుండి వేరుగా ఉండే హక్కు ఉంది.
  • ఖైదీల ఆర్థిక, సామాజిక స్థాయికి అనుగుణంగా వారి పట్ల వ్యవహరించడం, దాని ప్రకారం వివక్ష, అసమానతలను చూపడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది 7 .ధనవంతులైన నేరస్తులను విలాసవంతంగాను, పేదవారిని అంటరాని వారిగాను పరిగణిస్తారు.
  • 1.4.2. పెద్దవారైన ఖైదీలనుండి విడిగా వుండడానికి ప్రత్యేక హక్కు
  • 21 ఏళ్ళకన్నా తక్కువ వయస్సున్న నేరస్తులకు, పెద్ద వయస్కులైన్ నేరస్తుల నుండి విడిగా ఉండే హక్కు ఉంది. వారిని ఉంచిన వార్డులోకి సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితులలోను పెద్ద వయస్సు లైన ఖైదీలకు అనుమతి లేకుండా చూడవలసిన బాధ్యత జైలు అధికారులపై ఉంది.
  • యుక్తవయస్కు లైన ఖైదీలకు పెద్ద వయస్కులైన ఖైదీల వార్డులోనికి బదిలీ కాకుంఆ ఉండడానికి హక్కుంది.
  • 21 ఏళ్ల లోపు ఖైదీలలో కూడా చిన్న వారిని పెద్దవారిని దూరంగా ఉంచాలి.9
  • యుక్తవయస్కులైన నేరస్తులు చేసే జైలు తప్పులకు వారి ఆహారంలో కోత విధించరాదు.(Penal diet).
  • ఒక సంవత్సరం కన్నా తక్కువ శిక్షపడిన యుక్తవయస్కులైన నేరస్తుల కేసులను, ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం, 1958 ప్రకారం అప్పెలేట్ కోర్టు ముందుంచడానికి, సంబంధిత ప్రొబేషన్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్ళాలి.
  • యుక్తవయస్కులైన్ ఖైదీలు విడుదలైనప్పుడు, వారిని వారి బంధువులు, కుటుంబం, స్నేహితులు వచ్చి తీసుకెళ్ళడానికి వీలుగా అధికారులు ముందుగా వారికి విడుదల గురించి నోటీసులు పంపాలి

మహిళా ఖైదీల హక్కులు

  • మహిళా ఖైదీల దగ్గర నిషేధిత వస్తువుల కొరకు లేక గాయాల నమోదు కొరకు వైద్యాధికారి పర్య వేక్షణలో మాట్రస్ మాత్రమే వెతకాలి. పురుష అధికారులకు, ఖైదీలకు కనబడకుండా, ఆమె గౌరవానికి భంగం కలగకుండా వెతకాలి.
  • మహిళా ఖైదీలకు సంబంధించిన సమస్య లను ఈ పుస్తకంలోని 13వ అధ్యాయంలో చర్చిం చాం. వాటితో పాటు వారికున్న రెండు ప్రధానమైన రక్షణల్ని కూడా ఎక్కడ ప్రస్తావించాలి.
  • మహిళాఖైదీలకు, మహిళా డాక్టరు లేకమహిళా సహాయకు రాలు మాత్రమే వైద్య పరీక్ష చేయాల ని కోరే హక్కుంది.

ఆరోగ్యకరమైన వాతావరణం, సరియైన సమయంలో వద్య సేవలు పొందే హక్కు

  • పరిశుభ్రమైన, రోగ నిరోధక వాతావరణంలో నివసించే హక్కు ప్రతి ఖైదీకి వుంది.
  • టి.బి. లాంటి అంటువ్యాధులతో బధపడుతున్న ఖైదీలను ఆరోగ్యంగా ఉన్న ఖైదీలకు దూరంగా ఉంచి వారికి సరియైన వైద్యం చేయించి, ఆఅంటు  వ్యాధులు  ఇతరులకు సోకకుండా చేయాల్సిన బాధ్యత జిల్లా వద్యాధికారికి ఉంది.
  • ప్రతి దినాన జైలును సందర్చించి, కనీసం వారాని కి ఒక సారి జైలును పరిశీలించి, రోగాలు ఉన్న ప్పుడు మరీ తరుచుగా వెళ్ళి జైలులో రోగనిరోధక వాతావరణాన్నిపెంపొందించాల్సిన బాధ్యత జిల్లా, వైద్యాధికారికి, జైలు సూపరింటెండెంట్ కు ఉంది.
  • ఆమె, ఖైదీల బరువును, బట్టలను పడకను పరి శీలించి అవి సక్రమంగా ఉన్నాయోలేదో చూడాలి. అదే విధంగా ఖైదీల గదులను పారి శుద్ధ్యాన్ని గాలి వెలుతురును, త్రాగునీటిని, పరిశీలించాలి16.
  • జైలులో చేరిన వెంటనే, తనకు అంటువ్యాధులు ఉన్నాయేమో నిర్ధారించమని, పోలీసు నిర్బంధం లో అయిన గాయాలను పరిశీలించమని, కోర్టు కఠిన కారాగార శిక్ష విధించినట్లయితేతనఆరోగ్యం  శారీరక శ్రమకు తగినదో కాదో నిర్ధారించ మని డాక్టరును కోరే హక్కు ప్రతిఖైదీకి ఉంది –సెక్షన్ 24(2), జైళ్ళచట్టం 1894.
  • జైలులో చేరేనాటికే ఉన్న జబ్బులకైన, జైలులో సంక్రమించిన జబ్బులకైనా చికిత్స కోరే హక్కు ప్రతి ఖైదీకి ఉంది.
  • తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న ఖైదీని, అతని/ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా విడుదల చేయడానికి వీలు లేదు. వైద్యాధికారి నిర్ధారించిన తర్వాత మాత్రమే విడుదల17
  • వైద్యాధికాతి నిర్ధారించిన తర్వాతమాత్రమే వేరే జైలుకు బదిలీ చేయాలని కోరే హక్కు ఖైదీకి ఉంది. బదిలీ వలన ప్రమాదకరంగా పరిణమించే జబ్బేమీ ఖైదీకి లేదని వైద్యాధికారి నిర్ధారించిన తర్వాతనే అతన్ని/ఆమెను బదిలీ చేయాలి 18 .
  • శిక్షగా గానిలేక మరేదైనా కారణం వల్ల గాని ఖైదులో ఉంచబడిన ఖైదీకి తనను వైద్యాధికారి రోజుకు ఒక్కసారైనా పరిశీలించాలని కోరే హక్కుంది19
  • కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ లేద తనకు తానుగా శారీరిక శ్రమ చేస్తున్న ఖైదీకి, తన బరువును తరచు తూచాలని, తన హిస్టరీ టికెట్ పై పదిహేను రోజులకు ఒకసారి బరువును నమొదు చేయలని కోరే హక్కుంది20 .
  • తరచూ నిర్వహించే వైద్య పరీక్షల తర్వాత ఒక ఖైదీ కఠిన శ్రమకు పనికిరాడని డాక్టరు అభి ప్రాయ పడితే, అతనిని కఠిన శ్రమలో నియోగించ రాదు. ఆఖైదీకి సరి పోయినదిగా డాక్టరు సూచిం చిన పనిలో మాత్రమేనియోగించాల.
  • అతనికి నిజంగానే గుండెనొప్పి ఉందని వైద్య పరీక్షలన్నీ చెబుతున్నయి బహుశా అరను నిజంగానే అమాయకుడేమో!
  • ఖైదీల వైద్యసౌకర్యం హక్కుకు గుర్తింపుగా, మహారాష్ట్ర లోని నాసిక్ జైలులో విచారణలో ఉన్న ఒక ఖైదీ వైద్య సౌకర్యంలేక మరణిస్తే అతని మీద ఆధారపడిన వారికి లక్ష రూపా యలు చెల్లించాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆ రాష్ట్ర ప్రభూత్వానికి సిఫారసు చేసింది. అతను జీర్ణాశయానికి సంబంధించిన క్షయతోను తీవ్రమైన రక్తహీనతతోను బాధపడిచివరకుగుండె పోటు తో మరణించాడు. కాని అరనికి విరోచనా లకు చికిత్స ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా క్షయ, ఇతర అంటువ్యాధుల నిర్మూలనకుకావల్సిన అన్ని చర్యలను తీసుకోవాలని, జైళ్ళలో వ్యాధిపరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభు త్వాన్ని మానవ హక్కుల కోరింది. (జాతీయ మానవహక్కుల సంఘం, న్యూస్  లెటర్, సెప్టెంబరు(1999).

బెయిలు పొందే హక్కు

  • మోతీరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో బెయిల్ మీద విడుదల కావడం నిందుతుడిహక్కుని అతనిని జైలుకు పంపడం అరుధుగా జరగాలని సుప్రీంకోర్టు అనింది. నిందితుడు పారిపోడని, సాక్ష్యాలను తారుమారు చేయడని, సాక్షులను బెదిరీంచడని హామీ ఇస్తే నేరారోపణ తీవ్రమైనది కాని పక్షంలో, ఆరోగ్య కారణాల రీత్యా నిందితుణ్ణి తప్ప కుండా బెయిలుపై విడుదల్ చేయాలి. అంతేకాక ఎక్కువ మొత్తంలో జామీను లేక పూచీకత్తు కట్టవల సిందిగా ఉత్తిడి చేయరాదు.
  • బెయిలు వచ్చే నేరాల్ క్రింద ఒక వ్యక్తి అరెస్టు అయితే, లేక నేర విచారణ స్మృతిలోని 7వ  అధ్యాయం క్రింద విచారణ మొదలైతే, అమె కాని/అతను కాని ఒక హక్కుగా బెయిలు పై విడుదల కావచ్చు.
  • నిందితులు ఏ నేరం క్రింద అరెస్టు అయ్యారనే విషయం, అది బెయిలు పొందగల నేరమా కారా అనే విషయం వారికి తెలియజేయాల్సిన బాధ్యత
  • ·అరెస్టు చేసే పోలీసు అధికారికి బెంచి మీదున్న న్యాయమూర్తికి ఉంది.
  • బెయిలు పొందగల నేరమైతే, నిందుతుడు జామీ ను ఇవ్వడానికి సిద్ధపడితే, అతనిని అప్పుడే  అక్కడే విడుదల చేయాల్సిన బాధ్యత పోలీసు అధికారికి న్యాయమూర్తికి ఉంది.
  • తమముందు ప్రవేశపెట్టిన నిందుతుడిని జామీ ను లేకుండా వ్యక్తిగత పూచీకత్తుపై, ఆ తర్వాత కోర్టులో హాజరయ్యే హామీతో విడుదల చేసే అధి కారం పోలీసు అధికారికి, న్యామూర్తికి ఉంది.
  • కేసులోని పూర్వాపదాలను, వాస్తవాలను పరిగణ లోకి తీఉకోకుండా నిందుతుడు ఎక్కువ మొత్తం తో పూచీకత్తును ఇవ్వాలని పోలీసు అధికారి గాని, న్యాయమూర్తి గాని నిర్ణయించ డానికి వీకులేదు. ఉదాహరణకు ఒక వ్యక్తిపై వెయ్యి రూపాయలు దొందిలించినట్లు నేరారోపణ ఉంటే పది వేల రూపాయల పూచీకత్తు నిర్ణయించ డానికి వీలులేదు.
  • నేరారోపణతో హేతుబద్ధ  సంబంధం లేకుండా పూచీకత్తు మొత్తం నిర్ణయించితే, నిందితులు సిఆర్ పిసి సెక్షన్ 440(1) లోని పరిమితిని ఎత్తిచూపవచ్చు. ఆ తర్వాత సెషన్స్ న్యాయ స్థానంలో లేక హైకోర్టులో పూచీకత్తు మొత్తం తగ్గించమని అప్పీలు చేసుకోవచ్చు.
  • అరెస్టు అయిన వ్యక్తికి బెయిలు పొందే హక్కును తెలపక పోయినా, ఎక్కువ మొత్తంలో పూచీకత్తు మొత్తం నిర్ణయించినా, తద్వారా బెయిలు నిరాకరించి, అతన్ని నిర్భంధించినా, అరెస్టు చేసిన పోలీసు అధికారి చట్ట విరుద్దంగా నిందుతుణ్ణి నిర్భంధానికి గురి చేసిన నేరానికి పాల్పడిన వారవుతారు.
  • బెయిలుకు వీలులేని నేరాలలోనూ, 16సంవత్సరాల లోపు వయస్సు వారినీ, మహిళలను, అనారోగ్యంతో ఉన్నవారినీ బెయిలు మీద విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించ వచ్చు. ఈ సెక్షను సక్రమంగా అమలు పరిస్తే అనారోగ్యంతో ఉన్న విచారణఖైదీల కస్టడీ మరణాలు ఉండవు.
  • బెయిలు పొందడానికి వీలులేని నేరాలలో, కేసు న్యాయమూర్తి ముందు పెండీంగ్ లో ఉండి, సాక్ష్యాలు నమోదుచేయడానికి నిర్ణ్తయించ బడిన మొదటి తారీఖు దాటి 60 రోజులు గడిచినట్లయితే నిందితుణ్ణి తప్పకుండా న్యాయమూర్తి బెయిలు పై విడుదల చేయాలి. లేని పక్షంలో న్యాయమూర్తి తన కారణాలను నమోదు చేయాలి.
  • తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న విచారణ ఖైదీల గురించి కోర్టు వారికి బెయిలు మంజూరు చేయడానికి వీలుగా వైద్యాధికారి నివేదికతో సహా కోర్టుకు తెలియజేయాల్సిన బాధ్యత జైలు అధికారికి ఉంది.

సత్వర న్యాయవిచారణాహక్కు

  • విచారణలో ఉన్నప్రతి ఖైదీకి లేక పైకోర్టులలోఅప్పీలు చేసుకున్న ప్రతి ఖైదీకి తమ కేసులను, సత్వరం, న్యాయంగా విచారణ చేసి పరిష్కరించాలని కోరే ప్రాథమిక హక్కు ఉంది. ఖైదీల ఈ హక్కును నెర వేర్చే కర్తవ్యం కోర్టులకు ఉంది.
  • ·ఒక నెల పైబడి విచారణలో ఉన్న ఖైదీల కేసుల న్నింటినీ అధికార సందర్శకులు (official visitos) జైలును సందర్శీంచనప్పుడు వారి దృష్టికి తేవలసిన బాధ్యత జైలు అధికారికి ఉంది. మూడు నెలల పైబడి పెండింగ్ లో ఉన్న కేసులను  జిల్లా కెలెక్టరు, జిల్లా న్యాయమూర్తి దృష్టికి తేవాలి. ఆరు నెలలకు పైబడి పెండింగ్ లో ఉన్న కేసులను జైళ్ళ ఇన్ స్పెక్టర్ జనరల్ దృష్టికి  ప్రత్యేకంగా తీసుకు రావాలి.
  • విచారణలో ఉన్న ఖైదీని నిర్ణయించబడిన సమయంలో కోర్టు ముందు ప్రవేశ పెట్టడానికి కావలసిన పోలీసు ఎస్కార్ట్ ఏర్పాట్లను చేయవలసి న బాధ్యత జైలు సూపరింటెండెంట్ కు ఉంది.
  • విచారణలో ఉన్న ఖైదీని నిర్ణయించబడిన తేదీ నాటికి కోర్టుకు ఉద్దేశ పూర్వకం గానే జైలు అధికారులు పంపకపోతే, దానివల్ల కేసు మరలా వాయిదా పడెతే, వారు పై హక్కును ఉల్లంఘించిన వరవు తారు.
  • ఎస్కార్టుగా వెళ్ళిన పోలీసులు ఖైదీని న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టకుండా వరంటును న్యాయమూర్తికి పంపి సంతకం తీసుకుని, తద్వారా నిందితుని రిమాండ్ పొడిగింపుకు కారణమైతే, అటువంటి పోలీసులు కూడా పై హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారవుతారు.
  • ఖైదీ కేసును బాధ్యతారహితంగా వాయిదా వేసినా లేదా ఖైదీ పరోక్షంలో వాయిదా వేసినా లేదా సరియైన కారణాలు చూపకుండా రిమాండు వారంటుపై సంతకం చేసినా, న్యామూర్తి కూడా పై హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వాడవుతాడు.
  • ముందుగా నిర్ణయించిబడిన ప్రకారం కోర్టు ముందు అభియోగజ్ పత్రాన్ని (charge sheet) దాఖలు చేయకపోయినా, లేక సాక్షులను ప్రవేశ పెట్టలేకపోయినా పరిశోధన చేస్తున్న పోలీసులు కూడా విచారణ ఖైదీకి సత్వర న్యాయ విచారణ హక్కును కల్పించడంలో విఫలం చెందిన వారవు తారు.
  • క్రింది కోర్టులలో ఇచ్చిన తీర్పులపై అప్పీలు చేసు కొన డానికి గల కాలపరిమితిని భారతీయ లిమిటేషన్ చట్టం 1963 ప్రకారం ప్రతి ఖైదీకి జైలు సూపరింటెండెంట్ తెలియాలి. హైకోర్టు నియమించి న న్యాయ వాదులచే ఖైదీ తరౌపున అప్పీలు రాయించి (న్యాయవారులకు దానికి రూ.100/- చెల్లించవచ్చు నిర్ణీత కాలం కన్నా ముందే పై కోర్టుకు పంపాలి.
  • నిర్ణీత కాలం ముగిసిన తర్వాత ఎవరైనా ఖైదీ అప్పీలుకు వెళ్ళదలిస్తే జైలు అధికారు అందుకు నిరాకరించ రాదు. ఆలస్యానికి గల కారణాలతో ఖైదీ విన్నపాన్ని జైలు అధికారి కోర్టుకు పంపాలి.
  • కోర్టుకు చెందినరిజిస్ట్రార్ కార్యాలయంలో తగిన సమయం లోఅప్పీలుకు నెంబరు వేయని కారణం గా కేసు ఆలస్యమైతే అందుకు సంబంధిత అధికారులే భాద్యత వహించాలి. వారు కూడా సత్వర న్యాయవిచారణ హక్కును ఉల్లంఘించన వారవుతారు.
  • కోర్టునుండి అప్పీలు లేదా రివిజన్ పై తీర్పు వచ్చిన వెంటనే తీర్పు కాపీని ;ఖైదీకి వ్యక్తిగతంగా జైలరు సమక్షంలో అందజేసి ఆ వివరాలను నమోదు చేయాలి. అప్పటికే ఆ ఖైదీని వేరే జైలుకు తరలించి ఉంటే తీర్పు కాపీని అక్కడకు పంపాలి.

ఉచిత న్యాయ సేవను పొందే హక్కు

  • పేదవారైన ప్రతి ఖైదీకి తన కేసు విచారణ లోని వివిధ స్థాయిలలో ఉచిత న్యాయ సేవను పొందే హక్కుంది.
  • తమకు తెలియక ఖైదీలు అడగక పోయినా, తన ముందు మొదటిసారి ప్రవేశ పెట్టిన ప్రతి ఖైదీకి ఉచిత న్యాయ సహాయం ఉందనే విషయాన్ని న్యాయమూర్తులు తెలియజేయాలి. అది వారి కర్తవ్యం.
  • కేసుకు సంబంధించిన ప్రథమ సమాచార నివేదిక (FIR) , సాక్షుల వాంగ్మూలాలు, ఆరోపణ పత్రాలను ఉచితంగా ప్రతి నిందితునికి అందించే బాధ్యత న్యాయమూర్తి మీదుంది. తద్వారా నిందితుడు తన రక్షణార్థం వాదించు కోడానికి తోడ్పడాలి.
  • తన న్యాయ సలహాదారుతో కేసు నిమిత్తమై రహస్యంగా, జైలు అధికారుల అనుమతి లేకుండా రాతపూర్వక సంబంధాలను నెరపే హక్కు ప్రతి విచారణ ఖైదీకి వుంది.
  • శిక్షపడిన ప్రతి ఖైదీకి, అపీలు చేసుకోవడానికి వీలుగా, తీర్పునకళ్ళను ఉచితంగా అందించే కర్తవం న్యాయమూర్తికి వుంది.అపీలుకు కాలపరిమితి ముగిసేలోపు అటువుంటి పత్రాలను అందజేయాలి.
  • తనకేసును వాదించుకునే స్తోమతలేని ప్రతి ఖైదీ విషయంలో నిబద్ధత, క్రిమినల్ కేసులలో అను భవం ఉన్న న్యాయవాదిని ప్రభుత్వ ఖర్చుతో నియ మించాల్సిన బాధ్యత ప్రతి న్యాయమూర్తి పై వుంది.
  • పైన పేర్కొన్నటువంటి కేసులను జిల్లా న్యాయ సలహా సంస్థ దృష్టికి తేవాల్సిన బాధ్యత కూడా న్యాయమూర్తిపై ఉంది.
  • అలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఆర్థిక, పరిపాలనా పరమైన అసహాయత్వాన్ని ప్రకటించడానికి వీలు లేదు.
  • జిల్లా న్యాయసలహా కేంద్రం జిల్లా సెషన్సు కోర్టు భవన సముదాయంలోనే వుంటుంది. జిల్లా న్యాయ మూర్తి న్యాయ సలహా కేంద్రానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఎ ఖైదీకైనా ఉచిత న్యాయ సలహా అందకపోతే జిల్లా న్యాయమూర్తి సరియైన చొరవ తీసుకోక పోతే రాష్ట్రన్యాయ సలహా కేంద్ర అధ్యక్షు డైన హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి తెలియ జేయాలి.
  • ఉచిత న్యాయసలహా సదుపాయం గురించి మరింత తెలుసుకో డానికి ఈ అధ్యాయం చివర ఉన్న అనుబంధం 14ను చూడండి.

తన న్యాయవాదిని సంప్రదించే హక్కు

  • జైలు సూపరింటెండెంట్ కు ముందస్తు సమాచారం ఇచ్చి, తన న్యాయవాదిని తగిన సమయంలో కలుసుకునే హక్కు ప్రతి ఖైదీకి ఉంది. ఆ సంప్రదింపుల సమయంలో జైలు అధికారి ఉంటే అతను వరిద్దరిని చూడగలిగే దూరంలోనే జైలు అధికారి ఉంటే అతను వరిద్దరిని చూడగలిగే దూరంలోనే ఉండాలి గాని, వినగలిగే దూరంలో ఉండరాదు.
  • జిల్లా లేక సెషన్స్ న్యాయమూర్తులు, హైకోర్టు లేక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించిన న్యావవాదులకు జైలును సందర్శించడానికి, ఖైదీలతో విడిగా మాట్లాడడానికి జైలు క్రమశిక్షణకు, రక్షణకు భంగం కలగకుండా అన్ని సౌకర్యాలు కలిగించాలని సుప్రీంకోర్టుకు ప్రకటించింది.
  • ఈ అధ్యాయం చివరలో న్యాయమూర్తి యస్ పి. అరూచగారి తీర్పును చూడండి.

కోర్టు విధించిన శిక్షకంటే ఎక్కువ కాలం నిర్భంధించడాన్ని వ్యతిరేకించే హక్కు

  • న్యాయస్థానం విధించిన శిక్షకన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడానికి వ్యతిరేకంగా ఖైదీలకు హక్కుంది.
  • కాబట్టిపేజీనెంబర్లు గల సరియైన రిజిస్టర్లను తయారు చేయడం, వాటిలో ఏ తారీఖున ఎ ఖైదీని విడుదల చేయాలో నమోదుచేయడం, వాటిని ఖైదీలకు చాలా ముందుగానే తెలియ చేయడం జైలు అధికారుల కర్తవ్యం

బలవంతపు లైంగిక చ్ర్యలకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు

  • రక్షణలేని ఒంటరి జైలు వాతావరణంలో తోటి ఖైదీల చేతుల్లో జైలు సిబ్బంది చేతుల్లో లైంగిక బలత్కారానికి గురయ్యే ప్రమాదం ఖైదీలకు చాలా ఉంటుంది. ;ఈ పరిస్థితిలో ఖైదీలుభౌతిక గాయాలకు, మానసిక వేదనకు గురికావడమే కాక, హెచ్ ఐ.వి/ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన జబ్బుల పాలపడే అవకాశం కూడా ఉంటుంది.
  • జైళ్ళు రక్షిత వాతావరణాన్ని ;అందించాల్సిన అవసరం వుంది. కాబట్టి:
  • జైలు సిబ్బంది, ఖైదీల చేతుల్లో లైంగిక బలత్కారాని కి కాకుండా జైలు అధికారుల చేత రక్షింపబడే హక్కు  ఖైదీ లందరికీ ఉంది.
  • అలాంటి లైంగిక దాడి జరిగితే, జైలు అధికారులను, వైద్యుణ్ణి సంప్రదించే హక్కు ప్రతి ఖైదీకి ఉంది. అలాంటివి మరలా జరగకుండా, దాడి చేసిన వారి మీద తగిన చర్య తీసుకునే బాధ్యత అధికారుల కుంది.
  • ఫిర్యాదు చేసిన తర్వాత కూడా దాడులు ఆగనట్ల యితే, సాధ్యమైనంత తొందరగా జిల్లా మెజిస్ట్రేట్ కు లేక సెషన్సు న్యాయ మూర్తికి ఫిర్యాదు పంపే హక్కు ఖైదీకి ఉంది.

విచక్షణారహితంగా బేడీలు, గులుసులు విధించ డానికి వ్యతిరేకంగా హక్కు

  • రక్షణగా ఉండే పోలీసులకు అనువుగా ఉంటుందనే కారణంతో ఖైదీలకు బేడీలు, గొలుసులువేయ డానికి వీలులేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఖైదీకి బేడీలు వేయాల్సిన తీవ్రమైన సందర్బాలలోనూ దానికి గల కారణాలను ఎస్కార్ట్ పోలీసులు నమోదు చేసి ముందుగా కోర్టు ఆసుపత్రిలో ఖైదీ అనుమతి పొందాలి. అది సాధ్యం కాకపోతే ఆ తర్వాతనైనా పొందాలి.
  • ఊచలతో కూడిన గొలుసుల్ని రాత్రంతా ఉంచడం గాని ఎక్కువ సేపు ఉంచడం గాని విచారణ కోర్టు అనుమతి లేనిదే చేయరాదు

చిత్రహింసలు, క్రూరమైన,అవమాన కరమైన శిక్షలకు వ్యతిరేకంగా హక్కు

  • భారత రాజ్యాంగం 21వ అధికరణ క్రింద హామీ ఇచ్చిన ‘స్వేచ్ఛగా జీవించే హక్కు’లో శరీరంలోని ప్రతి అవయవాన్ని బుద్ధిని ఉపయోగించే హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. కాబట్టి చిత్రహింసలు,క్రూరమైన,అవ మానవీయ మైన, అవమానకరమైన ప్రవర్తన లేక శిక్షలకు తావు లేదు.
  • తోటి ఖైదీల చేతుల్లోగాని, జైలు సిబ్బంది చేతుల్లో గాని శారీరకంగా మానసికంగా హానికిగురికాకుండా ఉండే హక్కు ఖైదీలందరికీ ఉంది. అదే విధంగా జైలులో క్రమశిక్షణను కాపాడడానికి జైలు నిబంధనలను పాటించడంకూడా ప్రతి ఒక్క ఖైదీ బాధ్యత. వివరాలకు రెండవ అధ్యాయం చూడండి.
  • ఒకవేళ తోటి ఖైదీవల్ల, జైలు సిబ్బందివల్ల, ఎటు వంటి కారణం లేక హానికి గురైతే, అటువంటప్పుడు అతను/ఆమె పై అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలి. ఆ సంఘటన పై విచారణ జరపాల్సిన బాధ్యత ఆ అధికారిపై ఉంటుంది.
  • పోలీసు లేక జైలు కస్టడీలో ఎవరైనా వ్యక్తి మరణిస్తే,
  • సంఘటన జరిగిన 24గంటలలోపు జిల్లా మెజిస్ట్రేటు  మరియు పోలీసు అధికారులు జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదిక పంపాలి. దానికి సంబంధించిన సంఘంఆదేశాలను అనుబంధం IC,ID లలో చూడండి.

జైలు తప్పులకు ఒంటరి ఖైదు విధించడానికి వ్యతిరేకంగా హక్కు

  • ఒక వ్యక్తిని దీర్ఘకాలం ఒంటరి ఖైదులో ఉంచితే అతనికి ప్రమాదకరమైన మానసిక హాని జరగ వచ్చు. అలాంటి వ్యక్తి విడుదలైతే, అతని చేతిలో సమాజం మరింత హానికి గురికావచ్చు. ఖైదీలు మెరుగైన మనుషులుగా విడుదలైనప్పుడే సమానం సురక్షింతంగా ఉంటుంది. వారు బాధ్యతాయుతమై మైన పౌరులుగా మెలిగే శక్తిసామర్థ్యాలను కోల్పోతే అది జరగదు. సమాజాన్ని రక్షిస్తామని తరచూ చెప్పుకునే దానికి విరుద్ధంగా జైళ్ళు తయారవు తాయి.
  • ఒక అలవాటుగా ఖైదీలను ఒంటరిఖైదులో ఉంచటా నికి వీలులేదని, సునీల్ బాత్ర వర్సస్ జిల్లా అడ్మిని స్ట్రేషన్ కేసు నాటినుండిసుప్రీం కోర్టు పలు సార్లు ఆదేశాలు జారీ చేసింది.
  • ఒంటరి ఖైదు అనే శిక్ష న్యాయస్థానం మాత్రమే విధించగల శిక్ష, న్యాయస్థానం ఆదేశించకుండా, జైలు అధికారులు దీనిని తమ ఇష్టానుసారం విధించడానికి వీలులేదు.
  • మరణశిక్షకు గురైన ఖైదీకి ఒంటరి ఖైదు విధించే అధికారాన్ని సెక్షన్ 30(2)ద్వారా జైళ్ళ చట్టం అధికా రులకు ఇచ్చినప్పటికీ, అది అన్ని విధాలా నిర్ధారణ అయాక, అంతిమ నిర్ణయమని ధృవపడ్డాక, చట్ట పరంగాను, రాజ్యాంగపరంగాను కూడా ఇక రద్దు చేయలేనిదని స్పష్టమయ్యాక మాత్రమే ఆ అధి కారాన్ని వారు వినియోగించుకోవచ్చు

విచక్షణారహిత జైలు శిక్షలకు వ్యతిరేకంగా హక్కు

  • ప్రతి ఖైదీకి తాను ఉల్లంఘించినట్లు ఆరోపించిన విషయానికి సంబంధించిన కచ్చితమైన చట్టం లేక నిబంధన గురించిన సమాచారాన్నితెలుసుకొనే హక్కు ఉంది. అతనికి లేక ఆమెకు తనవైపువాదన లను వినిపించేహక్కు విచారణ ఫలితంగా తీసు కున్న నిర్ణయాలను తెలుసుకునేహక్కు, చట్ట నిబంధనల ప్రకారం దానిపై అప్పీలు చేసుకునే హక్కు, కూడా వుంటాయి.
  • ఖైదీ ఆరోగ్యంపై దుష్ప్రభావంచూపనటువంటి శిక్షను విధించే అధికారం మాత్రమే జైలు సూపరింటెండెంట్ కు ఉంది.
  • జైలులో తప్పులుచేసినట్లు నిర్ధారణాఅయిన తర్వాత విధించబోయే శిక్ష తన ఆరోగ్యాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో పరీక్షించమని వైద్యుణ్ణి కోరే హక్కు ఖైదీకి ఉంది. ఆరోగ్యానికి హాని జరగకుండా ఎంతవరకు ఆ శిక్షను ఖైదీ భరించ గలడనే విషయాన్ని వైద్యుడు నిర్ణయించాలి.
  • విధించబోయే శిక్షను­­­ ఖైదీ భరించగలడని వైద్యుడు రాతపూర్వకంగానిర్ధారించేంతవరకు, తిండిలో కోత పెట్టడం లేక శారీరిక శ్రమలో మార్పు చేయడం లాంటి శిక్షలను అమలు పరచడానికి వీలు లేదు

సమస్యలను చెప్పుకొనే హక్కు, దానికి సరియైన పరిష్కారాన్ని పొందే హక్కు

  • జైలులో తన బాగోగులు గురించి ఫిర్యాదు చేసే హక్కు ప్రతి ఖైదీకి ఉంది. ఫిర్యాదులపై తొందరగా,
  • ·అవసరమైనప్పుడు రహస్యంగా చర్య తీసుకుంటేనే ఈ హక్కువలన ఉపయోగం ఉంటుంది.
  • అవసరమైతే ఖైదీ తరపున అతని బంధువులు, స్నేహితులు, న్యాయవాదులు కూడాఫిర్యాదు చేయవచ్చు.
  • జిల్లా మెజిస్ట్రేటు లేక సెషన్సు న్యాయమూర్తి ఆధీనంలో ఉండటట్లు ఫిర్యాదుల పెట్టేనుప్రతి జైలులో పెట్టాలి. వాటిని ఎంతతరచుగా అవసరమైతే అంత తరచుగాతెరవాలని, అలాంటిపెట్టెలు ప్రతి ఖైదీకి అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు ప్రకటించింది51.
  • జిల్లా మెజిస్ట్రేటు,సెషన్సు న్యాయమూర్తి తమ పరిధిలో ఉన్న జైళ్ళను వ్యక్తిగతంగా క్రమం తప్ప కుండా సందర్శించాలి. ఖైదీలు భయం లేకుండా తమ సమస్యలను చెప్పకోడానికి అవకాశం కల్పించాలి.  వారు తగిన విచారణలు జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి. ఖైదీలను కోర్టు ముందు ప్రవేశ పెట్టడానికి కావల్సిన చర్యలను తీసుకోడానికి – అవసరమైతే, అవసరమని పించిన కేసులకు సంబంధించిన నివేదికను వారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి52.
  • జాతీయ,రాష్ట్ర  మానవహక్కుల సంఘాలకు చెందిన సభ్యులు కాని, ప్రత్యేక దూతలు కాని జైలు సంద ర్శించినప్పుడు వారికి ఫిర్యాదు చేసే హక్కు లేక ఫిర్యాదులను వారికి పోస్టు ద్వారా పంపే హక్కు ఖైదీలకు ఉంది.
  • సంఘటనకు సంబంధించిన కచ్చితమైన వాస్తవ విషయాలు, వాటిలో పాలు పంచుకున్న వారి పేర్లు అక్కడ ఉన్న సాక్షుల జాబితాలాంటి వివరాలు ఆ ఫిర్యాదులో ఉండాలి

దుడుకు చర్యలకు పాల్పడిన జైళ్ళ అధికారు లకు వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ రిట్ ను దాఖలు చేసే హక్కు

  • తమ ఫిర్యాదును పరిష్కరించు కోవడానికి ఖైదీ చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైతే రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ జారీ చేయమని అతడు రాజ్యాంగం లోని 226వ అధికరణ క్రింద నేరుగా హై కోర్టును కోరవచ్చు. న్యాయస్థానం విధించిన శిక్షకు అనుగుణంగా లేని అధికారుల ప్రతి చర్యకు వ్యతిరేకంగా ఈ హక్కును ఉపయోగించవచ్చు
  • కావలసిన మార్పును తేవడంలో ఈ చర్య విఫల మైతే తన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం రాజ్యాంగంలోని 32వ అధికరణ క్రింద ఖైదీ సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయవచ్చు. ఇది రాజ్యాంగం క్రింద ప్రతి పౌరునికి హీమీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు

మానవ హక్కుల ఉల్లంఘనకు నష్టప్రిహారం పొందే హక్కు

  • జీవించే హక్కు, స్వేచ్ఛపొందే హక్కులాంటి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే, ప్రభుత్వంనుండి ఆర్థిక పరమైన  నష్టపరుహారాన్ని పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది.
  • ఖైదీల మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని భావించిన చోట నష్టపరిహారం ఇవ్వాలని జాతీయ మానవహక్కుల సంఘం కూడా సిఫారసు చేసింది.

కుటుంబసభ్యులను కలుసుకునే హక్కు

  • ముభావంగా, ఒంటరిగా ఉన్న ఖైదీ ప్రమాదకర నేర స్తుడుగా మారే అవకాశం ఉంది. అప్పుడుజైలేవారిని తయారు చేసిన కర్మాగారం అవుతుంది.
  • కుటుంబ సభ్యులు, స్నేహితులు కలుసుకోవడానికి అవకాశం ఇస్తే అది అతనికి ఎంతో ఊరటనిస్తుంది. ఈ మానవీయ సౌకర్యాన్ని నిరాకరించి ఆనందాన్ని పొందే వ్యవస్థ చాలా అమానవీయమైనది.
  • శిక్ష ద్వారా పునరావాసం కల్పించాలనేలక్ష్యం ఖైదీ లను మృదువుగా  చేయడానికి, కఠినంగా కాదు. తరచూ అలా కలుసు కోవడం ద్వారా మాత్రమే దీని ని పెంపొందించవచ్చు.
  • కాబట్టి ఖైదీలు మాట్లాడాలని కోరుకునే వారిని జైళ్ళ లోకి అనుమతించ డానికి కావల్సిన పద్ధతులు పాటించాల్సిన బాధ్యత జైలు అధికారుల మీద ఉంది.
  • అలాంటి అనుమతి జైలులోని క్రమశిక్షణకు, రక్షణకు సంబంధించిన నిబంధనల మేరకే జరగాలి. జైలు సందర్శకులు తమజ్ పూర్తి గుర్తింపును, చిరునామాను జైలు అధికారులకు ఇవ్వాలి. నిషేధిత వస్తువుల కోసం వారిని సోదా చేయవచ్చును

కుటుంబానికి, స్నేహితులకు ఉత్తరాలు రాసు కునే హక్కు, వారి నుండి ఉత్తరాలు, పత్రికలు అందుకునే హక్కు

  • తనకుటుంబసభ్యులను, స్నేహితులను కలుసుకునేహక్కు వారికి ఉత్తరాలు రాసుకునే హక్కు ప్రతి ఖైదీకి ఉంది. వారి నుండి ఉత్తరాలు అందుకునే హక్కూ వారికి ఉంది. ఖైదీకి తన సొంత ఖర్చుతో పత్రికలు తెప్పించుకునే హక్కుంది.
  • జైళ్ళ ఉన్నతాధికారులకు, మంత్రులకు, పైన్యాయస్థానాలకు, న్యాయసలయా కమిటీలకు ఉత్తరాలు లెక సమస్యల గురించి ఫిర్యాదులు పంఏ హక్కు ఖైదీకి ఉంది.
  • ఒక అజిలు నుండి మరోక జైలుకు తనను తర లించిన సమాచారాన్ని ఉత్తరం ద్వారా తన బంధు మిత్రులకు తెలియ జేసే హక్కు ఖైదీకి ఉంది.

సంస్కరణా కార్యక్రమాలలో పాల్గొనే హక్కు

  • జైలు శిక్ష పడిన వారికి చేపట్టే సంస్కరణా కార్యక్రమాలు ఖైదీలను చట్టాన్ని గౌరవించే వారి గాను, తమ కాళ్ళమీద తాము నిలబడే వారి గాను తీర్చిదిద్దేవిగా ఉండాలి.అవిఖైదీలలోఆత్మగౌరవాన్ని, బాధ్యతాయుతంగా మెలగడాన్ని ప్రోత్సహించేవిగా ఉండాలి.
  • ఈ హక్కు క్రింది ఖైదీలకు చదువుకొనే హక్కు కౌన్సిలింగ్ పొందే హక్కు, అర్థ వంతమైన నైపుణ్యాన్ని నేర్చుకునే హక్కు, సాంకేతిక శిక్షణ, ధ్యానం లాంటివి పొందే హక్కులు ఉంటాయి

జైలులో పనిచేసే హక్కు, పనికి తగిన వేతనం పొందేహక్కు

  • ఖైదీకి కఠిన కారాగార శిక్ష విధించడమంటే ఎక్కువ శ్రమ చేయించాలనో, కఠినమైన శ్రమ చేయించాలనో కాదు” అని సునీల్ బాత్రా IIవర్సెన్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ తీర్పులో సుప్రీంకోర్టు అనింది. ప్రతీకారంతో ప్రవర్తించే అధికారి ఖైదీని కఠినమైన, అవమానకరమైన శ్రమకు గురిచేస్తే పైన పేర్కొన్న తీర్పును ఉల్లంఘించినట్టే.
  • సివిల్ నేరాలలో ఉన్న ఖైదీలు కూడా, జైలు సూప రింటెండెంట్ అనుమతితో తమ వృత్తిని జైలులో కొన సాగించే హక్కుంది58.
  • సివిల్ ఖైదీలు తమ స్వంత పనిముట్లను వాడితే కనుక తమ మొత్తం సంపాదనను తామే ఉంచు కోవచ్చు. కాని వాటిని జైలు నుండి పొందితే పని ముట్ల కొరకు కొంత మొత్తాన్ని జైలు అధికారి మిన హాయింపులు చాలా ఎక్కువగాను, అహేతుకం గాను ఉండరాదు.
  • కఠిన కారాగారశిక్షపడిన వారిని లేక స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వచ్చిన వారిని ఏక బిగిన 9 గంటల కంటే ఎక్కువ కాలం ఏ పని దినం లోను పని చేయించరాదు. అత్యవసర పరిస్థితుల లో మాత్రం జైలు సూపరింటెండెంట్ రాతపూర్వక అనుమతితో ఎక్కువ కాలం పనిచేయించవచ్చు60.
  • రాజ్యాంగం నిషేధించిన వెట్టి చాకిరి లేక అలాంటి బలవంతపు శ్రమనేదీ ఏ ఖైదీ చేత చేయించరాదు.
  • జైలు అధికారుల ఇళ్ళలో ఏ ఖైదీనీ పని చేయించ రాదు. వేతనం రూపంలో కొంత ఇచ్చినప్పటికీ అలాంటి పని లాభదాయకమైన లేక అర్థవంతమైన శ్రమగా పరిగణించబడదు.
  • లాభాలకోసం పనిచేస్తున్న ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో, అదుపులో, లేక మార్గదర్శకంలో ఎట్టి పరిస్థితుల్లోను, ఖైదీలను పనికి ఉంచరాదు.
  • కఠిన కారాగార శిక్షకు గురైన వారికి తాము జైలు లో చేసే పనికి వేతనం పొందే హక్కుంది. జైలులో చెల్లించే వేతనం కనీస వేతనాల కనా తక్కువ ఉండడానికి వీలులేదు61.
  • 1.4.22 సాధారణ సెలవు (ఫర్లో), అత్యవసర సెలవు (పెరోల్) పొందే హక్కు:
  • 5 ఏళ్ళ కన్నా ఎక్కువ శిక్షకు గురైన ఖైదీలు 2 సంవత్సరాలకు ఒకసారి 14 రోజులు సెలవుపై బయటకు వెళ్ళవచ్చును62.
  • క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ (1973)లో 432 సెక్షన్ ప్రకారం, ఖైదీల బంధువులకు తీవ్రమైన అనారోగ్యం, మరణం సంభవించినా, లేక వివాహంలాంటి సందర్భాలలోను ప్రభుత్వం ఖైదీలకు పెరోల్ లేక అత్యవసర సెలవులను మంజూరు చేయవచ్చు.
  • సెలవుపై విడుదల కావడానికి ఒక ఖైదీ అర్హత సంపాదించిన వెంటనే ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్ని జైలు సూపరింటెండేంట్ ఆ ఖైదీకి తెలియపరచాలి63.
  • 1.4.23 జైలు నిబంధనల గురించిన సమాచారం పొందే హక్కుజైలులోని వ్యక్తులందరూ చూడగలిగే ప్రాంతంలో జైలు నిబంధ నలను తెలుగులోను, ఇంగ్లీషులోను
  • ·స్పష్టంగా కనిపించేలా ఉంచాలి. అవసరమైతే వీటిని ఖైదీలు జైలులో ప్రవేశించే సమయంలోనే మౌఖికంగా వివరించాలి.
  • ఖైదీల హక్కులకు సంబంధించిన ఒక పుస్తకాన్ని హిందీలోను, ఇతర ప్రాంతీయ భాషలోను ప్రభుత్వం తయారు చేయాలని, ఖైదీలలో చట్టపరమైన చైతన్యం తేవడానికి వాటిని జైళ్ళలో పంచాలని సుప్రీంకోర్టు ప్రకటించింది.
  • ఖైదీలకు క్రమశిక్షణకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలి. సమాచారాన్ని పొందే పద్ధతుల గురించి, ఫిర్యాదులు చేసే పద్ధతుల గురించి, తమ హక్కులను బాధ్యతలను అర్థం చేసుకోవడానికి, తద్వారా జైలు జీవితానికి ‘అలవాటు’ పడడానికి అవసరమైన ఇతర సమాచారాన్ని ఖైదీలకు ఇవ్వాలి.
  • పైన పేర్కొన్న హక్కులు ఆచరణలోకి రావడానికి వాటిని రక్షించడానికి జైలు సందర్శకులను నియమి స్తారు.
  • చివరగా, గుర్తుపెట్టుకోండి.
  • చట్టవ్యతిరేక చర్యలు, అనైతిక చర్యలకు పాల్పడి కూడా తప్పించుకోగల్గుతున్న మనలోని చాలా మందికి, చట్టానికి దొరికిన వారి మీద లేక చట్ట విరుద్ధంగా చిక్కుబడిన వారిమీద ఎలాంటి నైతిక ఆధిక్యం లేదు..
  • అలాగే మన తప్పు ఏమీ లేనప్పటికీ మనలో ఎవ రైనా రేపు జైలులో తేలవచ్చు అనే విషయాన్ని మనం 1975లో భారత దేశంలో విధించబడిన అత్యయిక పరిస్థితి ద్వారా నేర్చుకున్నాం. మన హక్కులకే ముప్పు వాటిల్లినట్లు భావించి, ఖైదీల హక్కుల రక్షణకై ఒక ప్రామాణిక వ్యవస్థను ఏర్ప రచడానికి మనం కృషి చేయాలి. నిజానికి పరిస్థితి అదే!

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate