హోమ్ / సామాజిక సంక్షేమం / ఆర్థిక అక్షరాస్యత / ప్రధాన మంత్రి జన ధన పథకం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రధాన మంత్రి జన ధన పథకం

ప్రధాన మంత్రి జన ధన యోజన అని పిలిచే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జాతీయ మిషను ప్రతి పేదవాడిని బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంది.

పథకం యొక్క ముఖ్యాంశాలు

 • దేశవ్యాప్తంగా, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని అన్ని, గృహాలు ఈ పథకం క్రింద వస్తాయి. 15 కోట్ల పేద వ్యక్తుల కోసం బ్యాంక్ ఖాతాల తెరవబడతాయి.
 • ఈ పథకం కింద ప్రారంభించబడిన అన్ని బ్యాంకు ఖాతాలు, 6 నెలల సంతృప్తికరమైన ఆపరేషన్ తర్వాత, ఆధార్ లింక్ చేసిన ఖాతాలు, రూ. 5,000 ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.
 • రూ .1 లక్ష వ్యక్తిగత ప్రమాద బీమా, HDFC ఎర్గో అందిస్తుంది. అలాగే రూ 30,000 ఎల్ఐసి లైఫ్ కవర్ RuPay డెబిట్ కార్డ్ తోపాటు జారీ అవుతుంది.
 • రూ .5,000 కనీస నెలవారీ వేతనం వ్యాపార ప్రతినిధులుకు అందిస్తుంది.

ఈ పథకం అమలు

ఈ మిషన్ రెండు దశల్లో అమలు చేయబడుతుంది, వివరాలు కింది విధంగా ఉన్నాయి. దశ I - 15 ఆగష్టు 2014 - 14 ఆగష్టు 2015

 • అన్ని కుటుంబాలకు యూనివర్సల్ బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పించటం. ఒక బ్యాంకు శాఖ ద్వారా లేదా స్థిర బిందువు బిజినెస్ కరస్పాండెంట్ (బిసి) ద్వారా సహేతుకమైన దూరంలో అందుబాటూలోనికి తేవటం.
 • RuPay డెబిట్ కార్డ్ తో రూ .1 లక్ష ప్రమాద భీమాను ఒక ప్రాథమిక బ్యాంకింగ్ ఖాతాతో అన్ని గృహాలను కవర్ చేయటం
 • ఆర్ధిక అక్షరాస్యత కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకు వెళ్ళటం.
 • లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్ల ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విస్తరణ చేయటం.
 • కిసాన్ క్రెడిట్ కార్డ్ జారీ కూడా ప్రతిపాదించబడింది

రెండో దశ - 15 ఆగష్టు 2015 - 14 ఆగష్టు 2018

ప్రజలకు సూక్ష్మ భీమాను అందించడం.

 • వ్యాపార ప్రతినిధుల ద్వారా 'స్వావలంభనం' వంటి అసంఘటిత రంగ పెన్షన్ పథకాలు

కేవలం 2 ఫోటోస్ సమర్పించడం ద్వారా జన ధన్ ఖాతా తెరవచ్చు:ఆర్థిక శాఖ

అధికారికంగా చెల్లుబాటు పత్రాలు లేదా ఆధార్ సంఖ్యలను కలిగి లేనప్పుడు సంతకం చేసిన రెండు ఫోటోలు సమర్పించడం ద్వారా జన్ ధన్ బ్యాంకు ఖాతాలను తెరవవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

"ఆర్బిఐ ఆగష్టు 26, 2014, నాటి మార్గదర్శకాల ప్రకారం చెల్లుబాటు పత్రాలు లేదా ఆధార్ నంబర్లు లేని ప్రజలు బ్యాంకు శాఖ వద్ద సంతకం చేసిన రెండు ఫోటోలను సమర్పించడం ద్వారా ఖాతా తెరవవచ్చు అని అధికారికంగా ప్రకటించిది. అయితే, ఈ ఖాతాల చిన్న ఖాతాల అని పిలుస్తారు మరియు సాధారణంగా 12 నెలల వరకు చెల్లుబాటులో ఉంటాయి. అతను/ఆమె చిన్న ఖాతా ప్రారంభించిన 12 నెలల్లో అధికారికంగా అధికారిక పత్రాన్ని సమర్పించ వలసి ఉంటుంది.

ఈ ఖాతాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏ సమయంలోనూ బ్యాలంసు రూ .50,000కు మించకూడదు. సంవత్సరం మొత్తం రూ .1 లక్ష క్రెడిట్ మించ కూడదు. మరియు ఒక నెలలో మొత్తం ఉపసంహరణలు రూ 10,000 మించకూడదు .

ఇప్పటికే ఖాతాలు ఉన్నవారు ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద ప్రయోజనాలు పొందడానికి మరొక బ్యాంకు ఖాతా తెరవ వలసిన అవసరం లేదు. భీమా ప్రయోజనాలను RuPay కార్డ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఖాతాఉన్నవారు PMJDY క్రింద బీమా ప్రయోజనాలు పొందెందుకు మరియు RuPay డెబిట్ కార్డ్ పొందడానికి సంబంధిత శాఖలో అర్జీని ఇవ్వాలి. రూ 5,000 మైక్రో క్రెడిట్ పరిమితిని కూడా, ఖాతా యొక్క సంతృప్తికరమైన ప్రవర్తను అనుసరించి, పెంచుకోవచ్చు.

ఎవరైనా ఖాతా తెరవడానికి సమీప బ్యాంకు శాఖ / బ్యాంకు mitr లో అప్లికేషన్ సమర్పించవచ్చు. ఖాతా దరఖాస్తు www.financialservices.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.

రాష్ట్రాల వారీగా బ్యాంక్ సమన్వయకర్తలు & టోల్ ఫ్రీ నంబర్స్

రాష్టం లీడ్ బ్యాకు GM లీడ్ బ్యాకు ఫోను నం ఇ మేయిలు ఉచిత నం
ఆంద్రప్రదేశ్ శ్రీ డి దుర్గా ప్రసాదు ఆంద్రా బ్యాంకు 9618590303 040-23234625 gmdurgaprasad@andhrabank.co.in, slbc@andhrabank.co.in 1800-425-8525
తెలంగాణ శ్రీ అజీత్ సింగ్ స్టేటే బ్యాంక్ ఆఫ్ ఇండియా 7674088842 dgmfi@sbhyd.co.in 1800-425-1825

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన FAQ

ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజనలో ఉమ్మడి ఖాతా తెరవవచ్చా?

అవును, ఉమ్మడి ఖాతా తెరవవచ్చు.

RuPay డెబిట్ కార్డ్ అంటే ఏమిటి?

Rupay జాతియ చెల్లింపు కార్పొరేషన్ (NPCI) పరిచయంచేసిన ఒక దేశీయ డెబిట్ కార్డు. ఈ కార్డు ATM (నగదు ఉపసంహరణ కోసం) మరియు పిఓఎస్ యంత్రాలలో (నగదు రహిత చెల్లింపులకు) ఆమోదించబడుతుంది.

భార్యాభర్తలిద్దరూ PMJDY క్రింద ఖాతా తెరిచినట్లైతే ప్రమాద భీమా Rs.1.00 లక్ష మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ Rs. 3000/- కవర్ వర్తిస్తుందా మరియు Rs.5000 / ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం విడిగా ఖాతాలకు వర్తిస్తుందా?

Rs.1.00 లక్ష ప్రమాద భీమా మరియు Rs.30000 / లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అందరు ఖాతాదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే, Rs.5000 / వరకు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కుటుంబం (స్త్రీలకు ముఖ్యంగా ) లో ఒకే వ్యక్తికి అందుబాటులో ఉంటుంది.

ఏ పత్రాలు ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన కింద ఖాతా తెరవడానికి అవసరం?

 1. ఆధార్ కార్డ్ / ఆధార్ సంఖ్య అందుబాటులో ఉంటే ఏ ఇతర పత్రాలు అవసరంలేదు. చిరునామా మారితే, అప్పుడు ప్రస్తుత చిరునామా స్వీయ ధ్రువీకరణ సరిపోతుంది.
 2. ఆధార్ కార్డ్ అందుబాటులో లేకపోతే, క్రింది పత్రాలలో ఒకటి (OVD) అవసరం: ఓటరు ID కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ & ఎన్ఆర్ఇజిఎ కార్డ్. ఈ పత్రాలు మీ చిరునామా కూడా కలిగి ఉంటే, అవి "గుర్తింపు మరియు చిరునామా" రుజువుగా ఉపయోగపడుతాయి. ఒక వ్యక్తికి పైన పేర్కొన్న "అధికార చెల్లుబాటు పత్రాలు" ఏవీ చేయకపోతే, బ్యాంకుల ద్వారా "తక్కువ ప్రమాదం" గా వర్గీకరించబడి నప్పుడు అతను /ఆమె బ్యాంకు ఖాతాను క్రింది పేర్కొన్న పత్రాన్ని సమర్పించి తెరవవచ్చు:
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, చట్టపరమైన/రెగ్యులేటరి అధికారులు, ప్రభుత్వ రంగ, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మరియు పబ్లిక్ ఆర్ధిక సంస్థల ద్వారా జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డులతో ఖాతా తెరవ వచ్చు;
  • గెజిట్ అధికారి జారీ చేసిన వ్యక్తి లెటరు మరియు అటెస్ట్ ఫోటోతో కలిపి ఆమోదించచ్చు.

PMJDY కింద ప్రారంభించబడిన ఖాతాలలో చెక్ బుక్కు జారీ చేయబడుతుందా?

PMJDY ఖాతాలను జీరో బ్యాలెన్స్ తో తెరువ బడతాయి. అయితే, ఖాతా దారు చెక్ బుక్ పొందాలనుకుంటే, అతను/ ఆమె బ్యాంకు యొక్క కనీస బ్యాలెన్స్ అర్హతను ఏదైనా ఉంటే, పూర్తిచేయాలి.

ఒక చిన్న వయస్సు గల (18 సంవత్సరాల కంటే తక్కువ) వారు PMJDY ఖాతాను తెరవవచ్చా?

10 సంవత్సరాల పైబడి వారు ఏ బ్యాంకులో అయినా అతని/ఆమె సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరవచ్చు.

నా PMJDY ఖాతాను ఇతర సిటీ/రాష్ట్రాలకు బదిలీ చేసుకోవచ్చా?

PMJDYలో పాల్గొంటున్న అన్ని భ్యాంకులు CBS (కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్) తో ఉన్నాయి. అందువల్ల ఖాతాను సులభంగా, ఖాతా హోల్డర్ యొక్క అభ్యర్థన ప్రకారం, ఏ నగర/పట్టణ బ్యాంకు శాఖకైనా బదిలీ చేయసుకోవచ్చు.

మూలం: ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, ఆర్థిక మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం

సంబంధిత వనరుల

 1. ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన ప్రోగ్రెస్ రిపోర్ట్
 2. బ్యాంక్ ఖాతా ప్రారంభ ఫాం - ఇంగ్లీష్ , హిందీ
 3. ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన వెబా సైటు
3.14285714286
peggarla aravind Jun 23, 2016 10:44 AM

బ్యాంక్ మిత్రా లకు 5000 జీతం ఇవ్వాలి

విశ్వనాధరెడ్డి బి May 10, 2016 01:24 PM

బ్యాంకు మిత్ర గా పని చేసే వారికి కనీస వేతనం 6000 అమలు చేయండి

peggarla aravind May 05, 2016 11:10 PM

బ్యాంక్ మిత్రా CSP లకు 5000 జీతం ఇవ్వాలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు