অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

డేటెడ్‌ ప్రభుత్వ సెక్యూరిటీలకు పోటీ లేకుండా వేలంపాడే సదుపాయం

మార్కెట్‌ నుంచి డబ్బు అప్పు తెచ్చుకోడానికి భారత ప్రభుత్వం, సెక్యూరిటీలు జారీ చేస్తుంది. వేలంపాటల ద్వారా పెట్టుబడి దారులకు సెక్యూరిటీలను ఇవ్వడం అనేది ఒక  పద్ధతి. వేలం ద్వారా ప్రకటిత మొత్తాన్ని తాను తీసుకొనే  తేదీని ప్రభుత్వం ప్రకటిస్తుంది. పెట్టుబడిదారులు, కొత్త సెక్యూరిటీకి వడ్డీరేటు (కూపన్‌) రూపంలోగానీ తిరిగి జారీచేస్తున్న ప్రస్తుతం అమలవుతున్న సెక్యూరిటీ ధర రూపంలోగానీ వేలంపాటలో పాల్గొంటారు. వేలంపాట విధానం కొంతవరకూ సాంకేతికంగా ఉంటుంది కాబట్టి బ్యాంకులు, ప్రధాన డీలర్‌లు, ఆర్థిక సంస్థలు,  మ్యూచువల్‌ ఫండ్స్‌,  భీమా కంపెనీలు మొదలయినటువంటి పెద్దపెద్ద, విషయ ఙనం కలిగిన పెట్టుబడుదారులు మాత్రమే సాధారణంగా వేలంపాటలలో పాల్గొంటారు. దీనివల్ల ప్రభుత్వ సెక్యూరిటీల ప్రాధ మిక మార్కెట్ల నుండి మధ్యతరహ, చిన్న చిన్న మదుపరులవర్గాలలో అధికభాగం దూరమైపోతుంది. ఇది సురక్షితమే కాకుండా మార్కెట్‌ సంబంధిత రాబడిరేట్లను అందిస్తుంది.

భారతీయ రిజర్వు బ్యాంకు, 2001 డిసెంబర్‌ 7వ తేదీన, చిన్న పెట్టుబడిదారులకోసం, డేటెడ్‌ సెక్యూరిటీలలో పోటీలేని వేలంపాట సదుపాయాన్ని ప్రకటించింది.

ఈ పథకంవల్ల ఎవరు లాభం ఎందుతారు?

పథకంలో ఎవరు పాల్గొనగలరు?

పోటీలేని వేలంపాట పథకంలో వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు, కంపెనీలు, కార్పొరేట్‌సంస్థలు, భవిష్యనిధులు, ట్రస్ట్‌లు, ఆర్‌బిఐ నిర్ణయించిన మరేదయినా సంస్థలు అన్నీ పాల్గొనవచ్చు. మార్కెట్‌ నైపుణ్యం లేని చిన్న చిన్న పెట్టుబడిదారులకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఈ పథకం

  • భారతీయ రిజర్వు బ్యాంకులో కరెంట్‌ ఖాతా (సిఎ) లేదా సబ్జిడరీ జనరల్‌ ఆవర్జా (ఎస్‌జిఎల్‌)లేని వారి కోసం
  • ఒక వేలం పాటకి కోటిరూపాయల (ముఖవిలువ) సెక్యూరిటీలకు మించి అవసరం లేనివారి కోసం ప్రారంభించడం జరిగింది.

ఇందులో మినహాయింపుగా, తమ తమ చట్టబద్దమయిన బాధ్యతల దృష్ట్యా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బిలు), పట్టణ సహకార బ్యాంకులు (యుసిబిలు) బాంకింగేతర ఆర్థిక కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) కూడా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, పెట్టుబడిదారు ఒక్కింటికి వేలంపాటు ఒక్కింటికి రూ. కోటి గరిష్ఠమొత్తం అనే పరిమితికి సంబంధించిన ఆంక్ష వీరికి కూడా వర్తిస్తుంది.

డేటెడ్‌ ప్రభుత్వ సెక్యూరిటీలకు పోటీలేని వేలంపాట అంటే ఏమిటి?

  • పోటీలేని వేలంపాట అంటే బిడ్‌లో రాబడి (ఈల్డ్‌) లేదా ధర  కోట్‌ చేయకుండా పాటదారు, డేటెడ్‌ ప్రభుత్వ సెక్యూరిటీల వేలపాంటలలో పాల్గొనవచ్చు. ఆ విధంగా, తన బిడ్‌ పరిగణనలో ఉంటుందా ఉండదా అని అతను ఆందోళన చెందనవసరం లేదు. పథకం  ప్రకారం అతని బిడ్‌ వేసినంత కాలమూ అతనికి పూర్తిగా లేదా పాక్షికంగా సెక్యూరిటీలను కేటాయించడం జరుగుతుంది.

పోటీలేని వేలంపాట సదుపాయంవల్ల లాభాలు ఏమిటి?

  • పోటీలేని వేలంపాట సదుపాయం, ప్రభుత్వ సెక్యూరిటీలలో విస్తృతమైన భాగస్వామ్యాన్నీ రీటైల్‌ హోల్డింగ్‌నూ  ప్రోత్సహిస్తుంది.
  • వేలంపాటలలో పోటీపడి బిడ్‌ చేయడానికి తగినంత నైపుణ్యం లేని  వ్యక్తులకు, సంస్థలకు, ఇతర మధ్యతరహా పెట్టుబడిదారులకు ఇది అనువుగా ఉంటుంది.
  • అలాంటి పెట్టుబడిదారులకు, వేలంపాటలో నిర్ణయమయ్యే రేటుకు కచ్చితమైన కేటాయింపులు ఎందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పథకం పరిధి

పోటీలేని వేలంపాటకు  ఆఫర్‌ చేసే మొత్తం ఎంత?

  • డేటెడ్‌ ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించిన నిర్ణీత వేలంపాటలో, ప్రకటిత మొత్తంలో 5 శాతం వరకూ పోటీలేని బిడ్‌లకు అనుమతించడం జరుగుతుంది.

పోటీలేని బిడ్‌లకోసం రిజర్వ్‌ చేసిన మొత్తం, ప్రకటిత మొత్తంలో భాగంగా ఉంటుందా?

  • ఉంటుంది. రిజర్వ్‌ చేసిన మొత్తం, ప్రకటిత మొత్తం పరిధిలోనే ఉంటుంది.

పోటీలేని వేలంపాటను అన్ని డేటెడ్‌ సెక్యూరిటీల వేలంపాటలలో అనుమతిస్తారా?

  • మొదటగా, జారీచేయాలని ప్రతిపాదించినప్పుడు ప్రకటించే భారత ప్రభుత్వ డేటెడ్‌ సెక్యూరిటీలకు సంబంధించిన కొన్ని వేలంపాటలలో మాత్రమే పోటీలేని వేలంపాటను  అనుమతించడం జరుగుతుంది.

ఈ పథకం, ట్రెజరీ బిల్లుల  వేలంపాటలకు అందుబాటులో వుంటుందా?

  • ఉండదు. ఈ పథకం, ట్రెజరీ బిల్లులకు వర్తించదు.

వేలంపాటలో ఎలా పాల్గొనాలి?

అర్హులయిన పెట్టబడిదారులు, వేలంపాటలలో ఎలా పాల్గొంటారు?

  • అర్హులయిన పెట్టుబడిదారులు నేరుగా పాల్గొనకూడదు. వారు తప్పనిసరిగా వేలం పాటకోసం బ్యాంక్‌ ద్వారాగానీ ప్రధాన డీలర్‌ (పి.డి) ద్వారా గానీ రావలసి ఉంటుంది.

వేలంపాట కనీస బిడ్డింగ్‌ మొత్తం ఎంత?

  • కనీస బిడ్డింగ్‌ మొత్తం రూ. 10,000 (ముఖవిలువ), ఆపై రూ. 10,000/-లు గుణకాలలో ఉంటుంది.

ఈ పథకం కింద ఒక పెట్టుబడిదారు ఎన్ని బిడ్‌లు వేయవచ్చు?

  • ఒక్కో నిర్ణీత వేలంపాటలో ఈ పథకం కింద ఒక పెట్టబడిదారుడు, బ్యాంకు ద్వారా గానీ పిడి ద్వారా గానీ ఒకే ఒక బిడ్‌ మాత్రం వేయవచ్చు.

దీన్ని కట్టుదిట్టంగా ఎలా అమలుచేయాలి?

  • పెట్టుబడిదారు బిడ్‌ను పంపుతున్న బ్యాంక్‌ లేదా పి.డి, పెట్టుబడిదారు ఒకేఒక బిడ్‌ మాత్రమే వేస్తున్నాడనే పూచీ తీసుకొని, రికార్డులో ఉంచాలి.

వేలం ప్రక్రియ

పోటీలేని పాటదారుల తరఫున బ్యాంకు లేదా పి.డి. ఎలా బిడ్‌ వేస్తారు?

  • స్థిరమైన ఆదేశాల ప్రాతిపదికమీద, ఒక్కో ఒక్కో బ్యాంకు లేదా పి.డి. వేలం రోజున పోటీలేని బిడ్‌ల సమష్టి మొత్తానికి ఒకేఒక బిడ్‌  సమర్పించడం జరుగుతుంది. దరఖాస్తుతోపాటు వైయక్తిక ఖాతాదారుల వివరాలను అంటే పేరు, మొత్తం మొదలయిన వివరాలను కూడా బ్యాంక్‌ లేదా పి.డి సమకూరుస్తారు.

దరఖాస్తు ఫారం ఉంటుందా?

  • పోటీలేని బిడ్‌లకోసం ప్రత్యేకమైన వేలాన్ని ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసే సమయంలో దీన్ని ప్రకటిస్తారు.

వేలం ప్రక్రియ ఎలా పనిచేస్తుంది?

  • భారత ప్రభుత్వం, ప్రభుత్వ సెక్యూరిటీల వేలాన్ని ప్రకటిస్తుంది. ఋణ మొత్తాన్ని, అది కొత్త ఋణమా లేదా ప్రస్తుతమున్న ఋణానికి సంబంధించిన తిరిగి జారీనా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది. పాటదారులు ధర కోసం లేదా కూపన్‌ (వడ్డీరేటు)కోసం బిడ్‌ చేయాలా అనే విషయాన్ని  కూడా అది ప్రకటిస్తుంది. పోటీపాటదారులు, ధర లేదా కూపన్‌ కోసం పోటీ బిడ్‌లు వేస్తారు. అందుకొన్న బిడ్‌ల ప్రాతిపదిక మీద ఆర్‌బిఐ, ఛేదన (కటాఫ్‌) ధర లేదా కూపన్‌ ధరను ప్రకటిస్తుంది. పాటదారులందరికీ వేలం వేసిన సెక్యూరిటీని పూర్తిగా గానీ పాక్షికంగాగానీ కేటాయిస్తారు.

ఉదాహరణ:

ఇటీవల, భారత ప్రభుత్వ 11 సంవత్సరాల ప్రభుత్వ స్టాక్‌ కోసం వేలం నిర్వహించడం జరిగింది. దీని ప్రకటిత మొత్తం రూ. 5000 కోట్లు ఛేదన రాబడికి (కటాఫ్‌ యిల్డ్‌)  కూపన్‌ రేటు 9-40 శాతం. అయితే, ఛేదర రేట్లకు లేదా దానికంటే తక్కువకు (అంటే బహుళ ధరల వేలం విధానం) వారు కోట్‌ చేసిన రేట్లకు విజయవంతమైన వివిధ పాటదారులకు కేటాయింపులు చేయడంవల్ల భారిత సగటు రాబడి(వెయిటెడ్‌ ఆవరేజి యీల్డ్‌) 9.36 శాతంగా ఉంది.

పోటీలేని పాటదారులు ఏరేటులో కేటాయింపు లభిస్తుంది?

  • పోటీలేని విభాగానికి పోటీ పరమైన వేలంపాట ప్రాతిపదికమీద తేలే భారత సగటు రేటులో కేటాయింపు ఉంటుంది (దయచేసి 14 మరియు 17 ప్రశ్నలకు గల సమాధానాలు చూడండి)

కేటాయింపు ఎలా జరుగుతుంది?

పోటీలేని పాటదారులకు ఆర్‌బిఐ ఏవిధంగా బిడ్‌లను కేటాయిస్తుంది?

  • పోటీలేని విభాగం కింద ఆర్‌బిఐ, బ్యాంకుకు లేదా పి.డికి బిడ్‌లు కేటాయిస్తుంది. బ్యాంకు లేదా పి.డి. ఆ బిడ్‌లను పాటదారులకు కేటాయిస్తుంది.

పోటీలేని వేలంపాట మొత్తం, రిజర్వ్‌ చేసిన మొత్తం కంటె ఎక్కువగా ఉన్నట్లయితే,  పోటీలేని బిడ్‌లను  ఆర్‌.బి.ఐ ఏవిధంగా కేటాయిస్తుంది?

  • సమిష్ఠి మొత్తం బిడ్‌, పోటీలేని వేలంపాట ద్వారా రిజర్వ్‌ చేసిన మొత్తంకంటే ఎక్కువగా  ఉన్న సందర్భంలో దామాషా ప్రాతిపదికమీద కేటాయింపు చేయడం జరుగుతుంది.

ఉదాహరణ:

పోటీలేని ప్రాతిపదికలో కేటాయింపుకు రిజర్వ్‌ చేసిన మొత్తం 10 కోట్లు ఉందనుకోండి. పోటీలేని విభాగానికి జరిగిన వేలంలో పూర్తి మొత్తం ఒక 12కోట్లు అనుకోండి. పాక్షిక కేటాయింపు శాతం = 10/12 = 83.33

వేలంలో వాస్తవ కేటాయింపు కింది విధంగా ఉంటుంది.

పాటదారు బిడ్‌ మొత్తం కేటాయింపు
బ్యాంకు 1 2 కోట్లు 1,66,70,000/-
బ్యాంకు 2 3 కోట్లు 2,50,00,000/-
పి.డి 1 1 కోటి 83,30,000/-
పి.డి. 2 1 కోటి 83,30,000/-
బ్యాంకు 3 5 కోట్లు 4,16,70,000/-
కేటాయించిన మొత్తాలు 10,000 గణాంకాలలో ఉండేట్లు చూసే దృష్ట్యా పాక్షిక కేటాయింపు నిష్పత్తిని పూర్ణాంకానికి తీసుకోవలసి ఉంటుంది.

పోటీలేని వేలంపాట ద్వారా వచ్చిన మొత్తం బిడ్‌, రిజర్వ్‌చేసిన బిడ్‌కంటె తక్కువగా ఉన్నట్లయితే?

  • సమష్టి మొత్తం బిడ్‌ రిజర్వ్‌ చేసిన మొత్తంకంటె తక్కువగా ఉన్నట్లయితే, దరఖాస్తు దారులందరికీ పూర్తిగా కేటాయించడం జరుగుతుంది. తక్కువపడ్డ మొత్తాన్ని పోటీ విభాగానికి తీసుకుపోవడం జరుగుతుంది.

బ్యాంకు లేదా పి.డి. పాక్షిక కేటాయింపును ఎలా చేస్తారు?

  • పారదర్శకమైన రీతిలో తమ క్లయింట్లకు తగువిధంగా సెక్యూరిటీలను కేటాయించడం బ్యాంకు లేదా పి.డి.  బాధ్యత.

పరిష్కారం ఎలా జరుగుతుంది?

రూ. 10,000/- ముఖ విలువగల సెక్యూరిటీని సంతం చేసుకోవాలంటే పెట్టుబడిదారు ఎంత చెల్లించాలి?

  • పైన 14వ ప్రశ్నకు ఇచ్చిన ఉదాహరణలో వేలం, రాబడిపై ఆధారపడింది. వేలంలో వచ్చిన ఛేదన రేటు 9.40 శాతం; అయితే భారిత సగటు ఛేదన రేటు 9.36 శాతంగా ఉంది. 9.36 శాతం భారిత సగటు రేటులో సెక్యూరిటీ ధర రూ. 100.27 లకు చేరుతుంది. అందువల్ల పథకం కింద, పెట్టుబడిదారుకు రూ. 100.27 రేటుకు సెక్యూరిటీ లభిస్తుంది.  కాబట్టి ప్రతి రూ. 100/- (ముఖవిలువ) లకు, చెల్లించవలసిన, ధర రూ. 100.27. అందువల్ల రూ. 10,000/- విలువవున్న సెక్యూరిటీలకు (ధర X ముఖవిలువ/100) 100.27 * 10,000/100  = రూ. 10,270/-లు చెల్లించవలసి ఉంటుంది.

సెక్యూరిటీ జారీ తేదీ తరవాత  బ్యాంకు/పి.డి.కి సెక్యూరిటీలకు సంబందించిన చెల్లింపు చేసినట్లయితే ఏమవుతుంది?

  • బ్యాంకు/పి.డి, జారీచేసిన తేదీకే చెల్లింపు చేయవలసి ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ జారీ తేదీ తరవాత క్లయింట్‌ చెల్లింపు చేసినట్లయితే  బ్యాంకుకు  లేదా పి.డి.కి క్లయింట్‌ చెల్లించవలసిన ప్రతిఫల (కన్సిడరేషన్‌) మొత్తానికి  వడ్డీ సంచితమవుతుంది. ఉదాహరణకు, 9.40శాతం భారత ప్ర భుత్వ సెక్యూరిటీ, 2015 విషయం లో జారీ తేదీ తరువాత మూడు రోజుల తరవాత చెల్లింపు చేసినట్లయితే సంచిత  వడ్డీ భాగం 9-40/100 * 3/360 * 10,000= రూ. 7.83గా ఉంటుంది. కాబట్టి, సెక్యూరిటీ ధర రూ. 100.27 అయినట్లయితే, మూడు రోజుల తరవాత రూ. 10,000/- విలువయిన సెక్యూరిటీలను స్వాధీ స్వాధీనం చేసుకోడానికి పెట్టుబడిదారు చెల్లించవలసిన పూర్తి మొత్తం రూ. 10,270 + రూ. 7.83 = రూ. 10,277.83 (పూర్ణాంకానికి  సర్దుబాటు చేయకపోతే)

ధర ఆధారిత వేలంపాటల విషయంలో పరిస్థితి ఏమిటి?

  • పోటీలేని పాటదారులు, వేలంలోవలే భారిత సగటు ధరను చెల్లిస్తారు. ఉదాహరణకు, ఆర్‌.బి.ఐ, ఏప్రిల్‌ 19, 2016న పరిపక్వమయ్యే, ప్రస్తుతం అమలులో ఉన్న సెక్యూరిటీ 10.71 శాత భారత ప్ర భుత్వ సెక్యూరిటీ, 2016 కి ధర ఆధారిత వేలాన్ని నిర్వహించింది. వేలంలో వచ్చిన ఛేదన ధర రూ. 121.92. భారిత సగటు ధర రూ. 121.99. ఆ విధంగా, పోటీలేని పాటదారులు, రూ. 121.99 భారిత సగటు ధరగా చెల్లిస్తారు. అదనంగా, కింద సూచించిన విధంగా సంచిత వడ్డీని  కూడా వారు చెల్లించాలి.

అయితే , రూ. 10,000/-లకు మించిన విలువలో సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి పోటీలేని పాటదారు ఎంత చెల్లించాలి?

  • ప్రతి రూ. 100 (ముఖ విలువ) లకు చెల్లించవలసిన ధర రూ. 121.99. అందువల్ల, రూ. 10,000 విలువలయిన సెక్యూరిటీలకు అతను (ధర X ముఖవిలువ/100) 121.99 * 10,000/100 = 12,199/  చెల్లించవలసి యుంటుంది. భారత ప్ర భుత్వ డేటెడ్‌ సెక్యూరిటీల మీద ఆరు నెలలకొకసారి కూప న్‌ చెల్లించవలసి ఉంటుంది కాబట్టి సెక్యూరిటీకి కూపన్‌ చెల్లింపు తేదీలు ఏప్రిల్‌ 19 మరియు అక్టోబర్‌  19.
  • ఇప్పుడు, 2001 డిసెంబర్‌ 6న సెక్యూరిటీని చెల్లించినట్లయితే చివరి కూపన్‌కి తేదీ నుంచి పరిష్కారం తేదీవరకు అంటే 2001 అక్టోబర్‌ 19 నుంచి 2001 డిసెంబర్‌ 6 వరకు అంటే 47 రోజులకు  సంచిత వడ్డీ 10.71/100 * 47 / 360 * 10,000/- = రూ. 139.83 గా ఉంటుంది.
  • కాబట్టి, పెట్టుబడిదారు చెల్లించవలసిన మొత్తంలో ధరతోపాటు సంచిత వడ్డీ కూడా ఉంటుంది. అంటే రూ. 12,199 * 139.83 = 12,338.83 (పూర్ణాంకానికి సర్దుభాటు చేయకపోతే). డిసెంబర్‌ 6, 2001న చెల్లింపు చేయకుండా డి సెంబర్‌ 9, 2001న చెల్లించినట్లయితే సంకుచిత వడ్దీ భాగం, 47 రోజులకు కాకుండా 50 రోజులకు (అంటే 3 రోజులు ఎక్కువగా) ఉంటుంది. దాన్ని  10.71/100 * 50 / 360 * 10,000/- రూ. 148.75 గా లెక్కిస్తారు. అప్పుడు పెట్టుబడిదారు చెల్లించవలసిన పూర్తి మొత్తం = 12,199 + 148.75 =12,347.75/- (పూర్ణాంకానికి సర్దుబాటు చేయకపోతే).

పెట్టుబడిదారు ఎన్నిరోజులలో సెక్యూరిటీని పొందుతాడు?

  • వేలంపాట తేదీ నుంచి అయిదు పనిరోజుల లోపల క్లయింట్‌లకు సెక్యూరిటీల బదిలీ పూర్తికావాలి.

కమతము (హోల్డింగ్‌ ) బట్వాడా మరియు రూపం

సెక్యూరిటీలను ఎలా జారీచేస్తారు?

  • ఆర్‌బిఐ,  సెక్యూరిటీలను  డిమేట్‌ (ఎస్‌జిఎల్‌) రూపంలో మాత్రమే జారీ చేస్తుంది. సెక్యూరిటీలను బ్యాంకు/పిడికి చెందిన సిఎస్‌జిఎల్‌ ఖాతాకు జమ చేస్తుంది.

ఎస్‌.జి.ఎల్‌ ఖాతా అంటే ఏమిటి? సిఎస్‌జిఎల్‌ ఖాతా అంటే ఏమిటి?

  • ఎస్‌జిఎల్‌ లేదా సిఎస్‌జిఎల్‌ అనేది ఆర్‌బిఐ దగ్గరున్న ప్రభుత్వ సెక్యూరిటీల హోల్డింగ్‌ల డీమాట్‌ రూపము. పెట్టుబడిదారు డిపాజిటరి పార్టిసిపెంట్‌ వద్ద డీమాట్‌ రూపములో షేర్లను వుంచుకొన్నట్లూగానే బ్యాంక్‌ లేదా పి.డి. దగ్గర ఖాతాలోప్రభుత్వ సెక్యూరిటీలను కూడా ఉంచుకోవచ్చు. కస్టమర్‌ల తరఫున బ్యాంకులు లేదా పి.డి.లు ఉంచుకున్న సెక్యూరిటీలను ఆర్‌.బి.ఐ దగ్గర ప్రత్యేకించిన సిఎస్‌జిఎల్‌ ఖాతాలో ఉంచుతారు. ఆ విధంగా, బ్యాంకు లేదా పి.డి. తన క్లయింట్‌ తరఫున సెక్యూరిటీ కొనుగోలు చేసినట్లయితే ఆ సెక్యూరిటీ ఆర్‌.బి.ఐ.లో ఉన్న  బ్యాంక్‌ లేదా పి.డి. సిఎస్‌జిఎల్‌ ఖాతాకు క్రెడిట్‌ అవుతుంది.

చిల్లర పెట్టుబడిదారు, సహాయక సాధారణ ఆవర్జా (ఎస్‌జిఎల్‌) ఖాతాను లేదా కానిస్టిట్యుయెంట్‌ సహాయక సాధారణ ఆవర్జా (సిఎస్‌జిఎల్‌) ఖాతాను నిర్వహించాలా?

  • అవసరంలేదు. వేలంలో పాల్గొనడానికి ప్రతిపాదిస్తున్న బ్యాంకు లేదా ప్రధాన డీలర్‌ దగ్గర చిల్లర పెట్టుబడిదారు, కానిస్టిట్యుయెంట్‌ సహాయక సాధారణ ఆవర్జా (సిఎస్‌జిఎల్‌) ఖాతాను నిర్వహించడం తప్పనిసరికాదు. అయితే, అలాంటి ఖాతా ఉండటం పెట్టుబడిదారులకు సదుపాయంగా ఉంటుంది.

చిల్లరపెట్టుబడిదారుకు డి.పి. దగ్గర ప్రస్తుతమున్న డిమాట్‌ ఖాతాకు అతని సెక్యూరిటీలు క్రెడిట్‌ అవుతాయా?

  • అవుతాయి. ఇందుకు దరఖాస్తును పంపిన బ్యాంకు/పి.డి.సెక్యూరిటీల క్రెడిట్‌ కావడానికి సంబంధించిన విధానాన్ని స్పష్టంగా  సూచించాలి.

పెట్టుబడిదారు, భౌతిక సెక్యూరిటీకోసం  అడగవచ్చా?

  • అడగవచ్చు. పెట్టుబడిదారు కోరికమేరకు, భౌతిక  రూపానికి తదుపరి మార్పడిని అనుమతించడం జరుగుతుంది.

బట్వాడా యంత్రాంగం ఏమిటి?

జారీ తేదీనే బ్యాంకు లేదా పి.డి. చెల్లింపు చేసిన మీదట పోటీలేని పాటదారు తరఫున వేలం పాడిన బ్యాంకు లేదా పి.డి.కి ఆర్‌బిఐ, సెక్యూరిటీలను బదిలీ చేస్తుంది.

పోటీలేని పాటదారు తాను బిడ్‌ పంపిన బ్యాంక్‌కు లేదా పి.డి.కి చెల్లింపు చేసి, వారినుంచి  సెక్యూరిటీలు అందుకుంటాడు.

మరోవిధంగా చెప్పాలంటే, తమ క్లయింట్ల నుంచి బ్యాంకు లేదా పి.డి.కి చెల్లింపు జరిగిందా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా జారీ తేదీన బ్యాంకు నుంచి లేదా పి.డి. నుంచి చెల్లింపు అందుకున్న మీదట ఆర్‌బిఐ, సెక్యూరిటీలు బ్యాంక్‌కు లేదా పి.డి.కి జారీ చేస్తుంది.

ఈ సేవ కోసం బ్యాంకు లేదా పి.డి. ఏదయినా ఛార్జి చేస్తారా?

  • తమ క్లయింట్లకు ఈ సేవ అందించినందుకు కమీషన్‌గా బ్యాంకు  లేదా పి.డి., రూ. 100/-లకు  ఆరు పైసల చొప్పున కమీషన్‌ వసూలు చేయవచ్చు.

ఛార్జీని ఎలా రాబట్టుకొంటారు?

  • బ్యాంకు లేదా పి.డి. ఈ వ్యయాన్ని అమ్మకం ధరలో కలపవచ్చు లేదా దీన్ని క్లయింట్ల నుంచి ప్రత్యేకంగా రాబట్టుకోవచ్చు.

పోటీలేని పాటదారు ఈ చెల్లింపు విధానాలను ఎలా తెలుసుకొంటాడు?

  • సెక్యూరిటీల వ్యయం, సంచిత వడ్డీ, కమీషన్‌ రూపంలో  క్లయింట్ల నుంచి  చెల్లింపు ఎందడానికి సంబంధించిన విధానాలను బ్యాంకు లేదా పి.డి. రూఎందించవలసి ఉంటుంది. ఇందు నిమిత్తం క్లయింట్‌తో చేసుకొనే కాంట్రాక్ట్‌లో స్పష్టంగా పేర్కొనాలి.

ఇందులో ఏదయిన గుప్తవ్యయం ఉందా?

  • లేదు. ఫండింగ్‌ వ్యయం లాంటి మరేదయినా వ్యయాన్ని ధరలో కలపడానికి బ్యాంకును లేదా పి.డిని అనుమతించడం జరగదు.  మరోవిధంగా చెప్పాలంటే, బ్యాంకు లేదా పి.డి, 21వ ప్రశ్నలోను, 23వ ప్రశ్నలోను సూచించిన సంచిత వడ్డీ, 31 ప్రశ్నలోసూచించిన కమీషన్‌ కాకుండా మరేదయినా వ్యయాన్ని క్లయింట్‌నుంచి వసూలు చేయకూడదు.

పథకాన్ని ఆర్‌బిఐ పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ఉంటుందా?

పథకాన్ని ఆర్‌బిఐ పర్యవేక్షించడం, సమీక్షించడం జేస్తుందా?

  • భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కోరినప్పుడు, పి.డి.లూ, బ్యాంకులూ పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి. ఆర్‌బిఐ మార్గదర్శక సూత్రాలను కూడా సమీక్షిస్తుంది. మార్గదర్శక సూత్రాలను సవరించిప్పుడు, సవరించిన మార్గదర్శక సూత్రాలను ఆర్‌బిఐ ప్రకటిస్తుంది.

ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate