పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భీమా

ఒక నిరక్షరాస్యుని దృక్పధంలో, బీమా అంటే ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయినట్లైతే వచ్చే ఆర్ధిక నష్టానికి బదులుగా యిచ్చే భద్రత అని, అలాగే శాశ్వత వికలాంగుడిగాగాని, వ్యాపారంలో నష్టంగాగాని, ప్రమాదం మున్నగు వాటి నుంచి రక్షణగా భావిస్తాడు.

భీమా

ఒక నిరక్షరాస్యుని దృక్పధంలో, భీమా అంటే ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయినట్లైతే వచ్చే ఆర్ధిక నష్టానికి బదులుగా యిచ్చే భద్రత అని, అలాగే శాశ్వత వికలాంగుడిగాగాని, వ్యాపారంలో నష్టంగాగాని, ప్రమాదం మున్నగు వాటి నుంచి రక్షణగా భావిస్తాడు. ఇటువంటి అనుకోని సంఘటనల వలన జరిగే హాని నుండి ఆర్ధికంగా రక్షణ నివ్వడానికి, భీమా కంపెనీలు ప్రీమియం లను సేకరిస్తాయి. ఈ భీమా పాలసీలను కొన్న వ్యక్తుల నుంచి, డబ్బును వాయిదాలుగా సేకరించి అభ్యర్ధనలకు చెల్లిస్తారు. ఈ డబ్బు వాయిదాలకు, భీమా కంపెనీలు ట్రస్టీలుగా వ్యవహరిస్తాయి.

లబ్ధిదారుడు

భీమా పాలసీలో లబ్ధిదారుడిని మార్చడం చాలా చిన్న విషయం. మీరు చేయవలసినదల్లా ఈ విషయం గురించి, భీమా కంపెనీ ని సంప్రదించడం మరియు వారి ఆదేశాల మేరకు లబ్ధిదారుడిని మార్చే ప్రక్రియ చేయడం.

సాధారణంగా ఒక వ్యక్తి తన భార్య లేక భర్తను గాని, పిల్లలను గాని, తల్లిదండ్రులను గాని, లేక యితర దగ్గర బంధువులను గాని భీమా లబ్ధిదారులుగా పేర్కొనడం సహజం. అయినప్పటికీ, బంధుత్వం లేని వారు , ఎస్టేట్ (స్ధిరాస్ధి), ట్రస్టు, వ్యాపార భాగస్వాములు, రుణదాత లేక ఇంటి భాగస్వామి వంటి వారు కూడ లబ్ధిదారులుగా మీ భీమా పాలసీకి కావచ్చు. మీరు, మీ భీమా పాలసీని దానం చేయడానికి కూడ ఉపయోగించవచ్చు.

భీమా ప్రాముఖ్యత

వివాహం కాని వారు తరచూ, తమకు భీమా పాలసీ అవసరం లేదు అని అనుకుంటారు. కాని, మీకు భీమా అవసరమని నిర్ణయించే కారణాలు అనేకం ఉన్నాయి. మీరు మంచి ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ కూడ, జీవితంలో కొన్ని విషయాలు అనుకోకుండ జరుగుతాయి. భీమా పధకాలు, యిటువంటి అనుకోని పరిణామాలను ఎదుర్కొనే విధంగా మిమ్మిల్ని సిద్ధం చేస్తాయి.

ప్రత్యేకమైన పాలసీ, ఒక పెట్టుబడి

మీరు మీ సంతానానికి భీమా చేయదలచితే, మీరు, మీ బిడ్డ జీవితానికై ఒక ప్రత్యేకమైన పాలసీని కొనుగోలు చేయాలి. ఈ అడుగు, మీ పెట్టుబడి కి మరింత విలువని చేకూరుస్తుంది. ఎప్పుడు భీమా పాలసీని కొనుగోలు చెయ్యాలన్నది, మీ వ్యక్తిగత పరిస్ధితులపై ఆధారపడి ఉంటుంది. దీనికై ఎటువంటి కఠినమైన మరియు వేగమైన నియమాలు లేవు ఏదైనా మంచి పని చెయ్యడం, ఎప్పుడూ ఆలస్యం అయినట్లు కాదు అని ఎవరో సరిగ్గా చెప్పారు.

ఇది, మీకు అవసరమైన భద్రత యొక్క లక్షణం మీద మరియు మీరు దేనికై రక్షణ కోరుతున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. భీమా పాలసీని కొనడానికి, మీరు భీమా కంపెనీకి ప్రీమియం లు చెల్లించవలసి ఉంటుంది. ప్రీమియం సొమ్ము చెల్లింపు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పాలసీ వర్గం, పాలసీ సమయం కాంట్రాక్టు (ఒప్పందం) హామి యిచ్చిన డబ్బు మరియు మీ వయసు.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం, భీమా ఒక పొదుపు ప్రణాళిక

ఎన్నో భీమా పధకాలు, ఈ రోజున పొదుపు అంశాలను చేర్చుకుని అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీలు, మీ ఆర్ధిక లక్ష్యాలను, భవిష్యత్తు ఆపదలనుండి రక్షిస్తూ, నెరవేర్చుకోవడానికి వీలు కలిగిస్తాయి. భీమా పాలసీలను కొనడం ద్వారా మీరు పన్ను నుండి మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80 సి, సెక్షన్ 80 సిసిసి, ఆదాయపు పన్ను చట్టంలోని విభాగాల ద్వారా ఈ పన్ను సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

ఎన్ డోమెంట్ పాలసీ (ఆస్తి సంక్రమణ) అంటే ఏమిటి ?

ఎన్ డోమెంట్ పాలసీ, పొదుపు మరియు ఆపదల నుండి రక్షణ కలిపి ఉండే పాలసీ. ఈ పధకాలు ప్రత్యేకంగా ధనాన్ని కూడబెట్టడం కోసం మరియు అదే సమయంలో భవిష్యత్తులో ఏదైనా అపాయం నుండి రక్షణ కోసం ఏర్పడ్డాయి. పాలసీ లక్షణం పై ఇది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా భీమా పాలసీలు వార్షిక, అర్ధ వార్షిక మరియు త్రైమాసికంగా ప్రీమియం చెల్లించే విధాన పద్ధతిలో ఉంటాయి. ప్రీమియం చెల్లింపులో ఎప్పుడూ క్రమబద్ధంగా ఉండాలి. భీమా కంపెనీలు, ప్రీమియం చెల్లింపు కాలపరిమితి దాటిపోయాక కూడ కొంత వెసులుబాటు సమయం కేటాయిస్తాయి. మీరు ఈ గ్రేస్ పీరియడ్ సమయం లోపల చెల్లింపు చేయక పోయినట్లైతే మీ పాలసీ రద్దు అయిపోతుంది.

భీమా మరియు చెల్లింపు

మీ భీమా పాలసీ పై ఆధారపడి నిర్ణీతకాలానికి మీకు రావలసిన చెల్లింపు ఉంటుంది. అది జీవిత భీమా పాలసీ అయినట్లైతే, మీకు హామి ఉంచిన సొమ్ము మొత్తాన్ని లేక దాచబడిన సొమ్మును, ఏది ఎక్కువ అయితే, అది చెల్లిస్తారు. అవి ఒక వేళ ఆటో భీమా అయినట్లైతే, భీమా పాలసీ నిర్ణీత కాలవ్యవధి దాటాక ఎటువంటి లాభాలు యివ్వబడవు. బోనస్, మీరు పాలసీ ని పోడిగించినట్లైతే, ఆ నియమం, పాలసీలో ఉంటే మాత్రం ఇవ్వబడుతుంది. మీరు, భీమా పాలసీలో కొన్ని అపాయం నుండి రక్షించడానికే అని అర్ధం చేసుకోవాలి. మీరు భీమా ధృవపత్రం పోగోట్టుకున్నా లేక మీకు అది అందకపోయినా, డూప్లికేటు సర్టిఫికేట్, సంబంధిత కంపెనీకి పోగోట్టుకోవడమో లేక అందకపోవడమో అనే స్ధితి గురించి తెలిపి తిరిగి పొందవచ్చు.

ఇప్పుడు భారతదేశపు భీమా రంగంలో ఎంతో మంది ఉన్నారు. పోటీ పెరుగుతూ ఉండడం వలన ఈ కంపెనీలు తమ అస్తిత్వాన్ని చూపడానికి ఎనలేని కృషి చేస్తున్నాయి- మీరు ఆన్ లైన్ లోనూ మరియు ఆన్ లైన్ కాకుండానూ కూడ పాలసీని కొనుక్కునే విధానం ఉంది.

భీమాలో రకాలు

  • జీవిత భీమా
  • ఆటో మొబైల్ - వాహనాల భీమా
  • ఆరోగ్య భీమా
  • గృహ భీమా
  • ప్రయాణ భీమా

జీవిత భీమా

జీవిత భీమా అంటే, భీమా చేసిన వ్యక్తి మరణం వలన జరిగే ఆర్ధిక నష్టానికి రక్షణ. భీమా కంపెనీ, నిర్ణీత కాల వ్యవధి దాటిన తరువాత గాని లేక భీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడుగాని ఒక నిర్దేశిత సొమ్మును చెల్లిస్తానని వాగ్దానం చేస్తుంది. ఎవరైనా తాము ఈ పాలసీ రక్షణలోనికి రాదల్చుకున్నప్పుడు, భీమా యిచ్చే వారికి ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి.

ఆర్ధిక భద్రత

మీరు, మీ కుటుంబంలో మీ అనారోగ్యంలో, మరణంలో లేక భౌతికంగా అనాశక్తతతో సంపాదించలేని తరుణంలో, ఆర్ధిక భద్రతను భీమా కల్పిస్తుంది. అంతేకాకుండా, జీవిత భీమా అంటే మీ వృద్ధాప్యంలో కావలసిన ధనాన్ని కూడ సమకూర్చే అండ. పిల్లల చదువులు మరియు పన్ను మినహాయింపు ఉండే పెట్టుబడి. మీరు, జీవిత భీమాను చిన్న వయసులోనే కొనుగోలు చేస్తే మంచిది. మీరు పెద్దవారయినా కొద్దీ ప్రీమియంలు ఎక్కువవుతాయి.

సరైన భీమా పధకాన్ని ఎంచుకొనండి

మీ అవసరాలను చర్చించుకొని, విశ్లేషించుకుని మీకు తగిన భీమా పధకాన్ని ఎంచుకోవాలి. మీ ప్రాముఖ్యతలు, మీ లక్ష్యాలపై ఆధారపడి ఉండాలి. ఉదాహరణకు, మరణం సంభవించినప్పుడు దొరికే ఆర్ధిక భద్రత, దీర్ఘకాలంలో మీ ధనం పెరగడం, పొదుపు లేక పదవీ విరమణ చేశాక పింఛను సదుపాయం (ఏదైనా కావచ్చు) మీరు ఒక ఆర్ధిక సలహాదారుడిని కూడ సంప్రదించి, అతడి మార్గదర్శకత్వంలో ఒక మంచి జీవిత భీమా పధకాన్ని ఎంచుకొనవచ్చు. దీనికై ఎటువంటి కఠిన నియమ నిబంధనలూ లేవు. సాధారణంగా, ఒక జీవిత భీమా రక్షణ పధకం, మీ వార్షిక ఆదాయానికి 15 నుండి 20 రెట్లు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.

లబ్ధిదారుడి నియామకం

మీకు మరణం సంభవించినట్లైతే, జీవిత భీమా పాలసీ యొక్క ప్రయోజనాలను పొందగలిగే వారసులను పేర్కొనడం ద్వారా వారికి ఆ హక్కుని సంక్రమింపజేసే ప్రక్రియను నామినేషన్ అంటారు. జీవిత భీమా పాలసీ తీసుకున్నప్పుడు, మీరు ఆ పేర్కొనబడిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలను తెలుపవలసి ఉంటుంది. ఒక పాలసీదారుడు, తన జీవిత కాలంలో ఆ నామినీ ని మార్చే వీలు ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, ఒక భీమా పాలసీని పొందడమంటే ఆభీమా పాలసీకు సంబంధించిన అన్ని హక్కులూ బాధ్యతలూ, ఆనియుక్తునికి బదిలీ చేయడమన్నమాట

పాలసీదారుని హక్కుని కాపాడే IRDA- భీమా క్రమబద్దీకరణ అభివృద్ధి అధికార సంఘం

IRDA ( Insurance Regulator development authority) - భీమా క్రమబద్దీకరణ అభివృద్ధి అధికార సంఘం, ఒక చట్టబద్ధమైన సంస్ధ. ఇది, పాలసీదారుల హక్కులను కాపాడుతూ, భీమా పరిశ్రమను అభివృద్ధి, పరచే విధంగా ప్రోత్సహిస్తుంది. IRDA ప్రకారం, ఒక క్లెయిమ్ (అభ్యర్ధన) వచ్చినప్పుడు, ఈ విషయానికి సంబంధించిన అన్ని ఆవశ్యక పత్రాలు అందినప్పుడు, 30 రోజుల లోగా ఈ క్లెయిమ్ ను పరిష్కరించాలి. ఇంకా, మరికొంత సమాచారంగాని, ఋజువులుగాని అభ్యర్ధనను పరిష్కరించడానికి అవసరమైతే, కంపెనీ వ్రాయబడిన క్లెయిమ్ ద్వారా తెలియపరచడమైన ఆరునెలల లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఏదైనా క్లెయిమ్ పరిష్కారం లేక చెల్లింపు సమయం, ఆరు నెలల కంటే ఎక్కువ అయినప్పుడు కంపెనీ, క్లెయిమ్ సొమ్ము పై వడ్డీ చెల్లించవలసి ఉంటుంది.

వాహనాల భీమా

అన్ని యాంత్రిక వాహనాలు ( motor vehicles) భీమా చేయబడాలి. వాహన భీమా, వాహానానికి జరిగే నష్టానికి, హానికి లేక దాని భాగాలకు జరిగే నష్టానికి, ఆర్ధిక రక్షణ కల్పిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలైన అగ్నిప్రమాదం మరియు వరదలు లేక (కృత్రిమ) మానవ తప్పిదాలైన దోంగతనం, అల్లర్లు వంటి విపత్తులు వచ్చినప్పుడు, వాహానాలకు నష్టం వాటిల్లుతుంది. వాహాన భీమా, మిమ్మల్ని మూడోమనిషి ద్వారా నచ్చే అనవసరమైన చట్ట సమస్యలు ఉదాహరణకు ప్రమాదాల వల్ల జరిగే నష్టాల నుండి కూడ కాపాడుతుంది.

క్లెయిమ్ చేయని వానికిచ్చే బోనస్

“నో క్లెయిమ్ బోనస్” అంటే, పాలనీ దారులకు, ఒక నిర్దిష్టమైన సంవత్సరానికి, వారు ఎటువంటి క్లెయిమ్ చెయ్యనప్పుడు యిచ్చే బహుమానం. పాలనీ దారుడు (NCB) “నో క్లెయిమ్ బోనస్”కు, పాలనీని రెన్యూవల్, (పొడిగించే) చేసి సమయంలో అర్హుడు అవుతారు. NCB రేటు, మీరు పాత వాహన భీమా దారుకు యిచ్చే NCB హక్కు పత్రాన్ని కొత్త వారికి చూపించగలిగితే అదే విధంగా ఉంటుంది.

అన్ని నష్టాలు, డ్యామేజ్ లు వాహనానికిగాని, దాని భాగాలకు గాని - మీ ద్వారా గాని లేక మూడో వ్యక్తి వలన గాని- జరిగినప్పుడు, ఆ ప్రాంతపు పరిధిలోనికి వచ్చే పోలీస్ స్టేష,న్ లో ఫిర్యాదు చెయ్యాలి. భీమా కంపెనీ, డబ్బు సంబంధం లేని సదుపాయం కల్పించినప్పుడు, మీరు వాహనానికి జరిగే మరమ్మతులకు ఎటువంటి డబ్బు యివ్వవలసిన అవసరం లేదు. కాని భీమా కంపెనీలు, కొంత మంది డీలర్లతో మాత్రమే ఒప్పందం చేసుకుంటుండడం వలన, మీరు అక్కడ నుండే ఈ సౌకర్యాన్ని పొందగలరు.

ఒక వేళ, మీ వాహనం దొంగిలించబడితే, మీరు చేయవలసిన మొదటి పని - ఆ ప్రాంతపు పరిధిలోనికి వచ్చే సరియైన పోలీస్ స్టేష,న్ లో ఫిర్యాదుచేయాలి. పస్ట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ ( FIR) ను నమోదు చేయాలి. భీమా కంపెనీకి ఈ విషయం తెలియచెప్పి, భీమా అభ్యర్ధన (క్లెయిమ్) ను ఫైల్ చెయ్యాలి.

ఆరోగ్య భీమా

ఆరోగ్య భీమా , మీ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులకు యిచ్చే ఆర్ధిక రక్షణ. భీమా, మీరు ఆరోగ్య భీమా చేసిన మొత్తానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆరోగ్య చికిత్స చాల ఖరీదు కలదిగా ఉంది. చికిత్సకు అయ్యే ఖర్చులు, భీమా కాలవ్యవధిలో జరిగినట్లైతే, ఆరోగ్య భీమా వాటి నుండి రక్షణ నిస్తుంది (ఖర్చులను చెల్లిస్తుంది) ఆరోగ్య భీమా పాలసీలు, పన్ను మినహాయింపులకు కూడ ఉపయోగపడుతుంది. ఆదాయపన్ను చట్టం 80 డి సెక్షన్ క్రింద, గరిష్ట తగ్గింపు 10000 రూపాయల వరకు ఉంటుంది. పదవీ విరమణ చేసినవారు లేక వృద్ధులు, తమ ఆదాయ పన్ను పరిధిలోనికి వచ్చే ఆదాయం నుండి గరిష్ట తగ్గింపును 15,000 రూపాయల వరకు పొందవచ్చు. ఆరోగ్య భీమా కంపెనీలు, 50 సంవత్సరాల వయసు వరకు ప్రజలకు భీమా రక్షణ నిస్తాయి.

ధన అవసరం లేని ఆసుపత్రి చేరిక

ఈ రోజుల్లో ఆరోగ్య భీమా కంపెనీలు, నూతన అంశాలతో తమ ఉత్పత్తులను తీసుకుని వస్తున్నాయి. వాటిలోనిది ఒకటి Cashless hospitalization - డబ్బు యివ్వనవసరం లేని ఆసుపత్రి ఖర్చు ఈ సదుపాయం వలన, వ్యక్తులు తమ ఆసుపత్రి ఖర్చులు ను చెల్లించవలసిన అవసరం లేదు. భీమా కంపెనీ నేరుగా తానే ఆ బిల్లులు చెల్లిస్తుంది. కాని, ఈ సదుపాయం, భీమా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రులలోనే ఉంటుంది.

రిబేటు (తగ్గింపు )

మీ కుటుంబ సభ్యులందరికీ వర్తించే ఆరోగ్య భీమా పాలసీలు మార్కెట్టులో అందుబాటులో ఉన్నాయి. మొత్తం కుటుంబానికి, మీకు, ఆరోగ్య రక్షణ ను పొందవచ్చు. కొన్ని బ్యాంకులు, మరుసటి సంవత్సరపు ప్రీమియం లో 5 శాతం దాకా తగ్గింపు నిస్తాయి. అంటే ఆసుపత్రి చేరిక వలన అయిన ఎటువంటి ఖర్చులకైనా, భీమా కాలవ్యవధిలోని మొదటి 30 రోజులు, రక్షణ క్రిందకు రానప్పుడు యిది వర్తించదు కాని ప్రమాదంలో జరిగే ఎటువంటి గాయాలకైనా ఈ పాలసీ నుండి రక్షణ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు ఉన్న వ్యాధులకు, ఈ పాలసీ నుండి రక్షణ ఉండదు.

ప్రయాణ భీమా

మీరు విదేశ ప్రయాణం చేసినప్పుడు జరిగే ఆర్ధిక నష్టాలకు, ప్రయాణ భీమా రక్షణ కల్పిస్తుంది. మీరు విదేశాలకు , రకరకాల పనుల మీద వెళ్ళవచ్చు. ఉదాహరణకు, సెలవులు గడపడానికి, విద్యకై లేక మీ ముఖ్యమైన వ్యాపార సమావేశం కొరకు. ఈ కాల వ్యవధిలో, మీకు విదేశీ ప్రయాణ భీమా అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీ మిమ్మిల్ని, ప్రయాణ సామాను పోయినప్పుడు, ఆకస్మిక వైద్యం, ప్రమాదం నుండి రక్షణ కల్పిస్తుంది.

ప్రయాణ భీమా, పాలసీ పేర్కొన్న తేదీ నుండి గాని, లేక మీకు విదేశీ ప్రయాణం చేయడానికి బయల్దేరిన సమయానికి లేక పాలసీలో పేర్కొన్న ప్రయాణమయ్యే తేదీ నుండి గాని ఏది ఆఖరు దయితే దాని నుండి మొదలు అవుతుంది. ప్రయాణ భీమా, భీమాకాల వ్యవధి ముగిసే దాకా లేక భీమా చేసిన వ్యక్తి భారతదేశం తిరిగి వచ్చే సమయం దాకా (ఏది ముందు అయితే అది) అమలులో ఉంటుంది. కాని, కొన్ని భీమా కంపెనీలు, భీమా పాలసీ యొక్క రక్షణ, పాలసీ దారుల ప్రయాణం కొన్ని పరిస్ధితుల వలన ఆలస్యమైనా వారికి వర్తింపచేస్తాయి.

మీరు ఒక ప్రయాణానికిగాని, లేక అనేక ప్రయాణాలకు గాని ప్రయాణ భీమాను ఎంచుకొనవచ్చు. ఒక్క ప్రయాణానికే పాలసీ తీసుకున్నట్లయితే, ఆ ప్రయాణానికి మాత్రమే భీమా రక్షణ ఉంటుంది. అనేక ప్రయాణాల పాలసీ తీసుకున్నట్లయితే, భీమా కాలవ్యవధిలో ఉన్న అన్ని ప్రయాణాలకు రక్షణ పొడగించబడుతుంది. TPA అంటే (ధర్డ్ పార్టీ ఎడ్మినిస్ట్రేటర్) మూడో పక్షం అధికారి, ధన సంబంధంలేని వైద్య సేవలు మరియు క్లెయిమ్స్ కు సంబంధించిన అవసరమైన సమాచారంతో ఉంటాడు.

మీ విదేశ ప్రయాణంలో, మీరు ఏదైనా వ్యాధికి గురి అయితే, ఆ వ్యాధికి జరగవలసిన చికిత్స మీ దేశంలో చేయించుకుంటానని మీరు క్లెయిమ్ (అడగవచ్చు) . ఇది TPA (మూడో పక్షం అధికారి) సలహా పై ఆధారపడి ఉంటుంది. TPA సలహాయిస్తే, కంపెనీ, మీరు భారతదేశం వచ్చిన తరువాత కూడ అయ్యే వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. కంపెనీ, కంపెనీకి, ఈ వైద్య ఖర్చుల గరిష్ట కాల పరిమితి మారుతూ ఉంటుంది. విదేశాలకు, విద్య నిమిత్తమై వెళ్ళే విద్యార్ధులకు, వైద్య రక్షణ లేని భీమా పధకాలు అందుబాటులో ఉన్నాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0990990991
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు