పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అభ్యర్థనలు - వసూళ్లు

అభ్యర్థనలు - వసూళ్లు

తక్కువగా చెల్లించిన లేదా అసలు చెల్లించని లేదా పొరపాటున వాపసు చేయబడిన లేదా ఉత్పాదకాల కొనుగోళ్ల పన్ను మినహాయింపు (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్-TC) మొత్తాన్ని తప్పుదోవన వినియోగించుకుంటే తిరిగి రాబట్టుకునేందుకు వర్తించే సెక్షస్ ఏది?

మోసం/గోప్యత/తప్పుగా ప్రకటించలేదని స్పష్టమైన కేసులలో అయితే సెక్షస్ 51ఎ వర్తిస్తుంది. మోసం/గోప్యత/తప్పుగా ప్రకటించినట్లు తేలితే సెక్షస్ 51బి వర్తిస్తుంది.

పన్నుచెల్లించాల్సిన వ్యక్తి సెక్షస్ 51ఎ కింద నోటీసు జారీ చేసేలోగా అభ్యర్ధన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించవచ్చా?

చెల్లించవచ్చు. అలాంటి సందర్భాలలో సంబంధిత అధికారి నోటీసు జారీచేసే వీల్లేదు.

సెక్షస్ 51ఎ కింద నోటీసు జారీచేశాక సదరు వ్యక్తి చెల్లింపు చేస్తే ఆ కేసుపై తుది నిర్ణయం అవసరమా?

సెక్షన్ 51ఎ, ఉప సెక్షన్ (1) కింద నోటీసు అందుకున్న వ్యక్తి 30 రోజులలోగా వడ్డీతో కలిపి పన్ను చెల్లించినట్లయితే జరిమానా చెల్లించనక్కర లేదు. అంతేకాకుండా ఆ నోటీసుకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ ముగిసినట్లే పరిగణించాలి.

సెక్షస్ 51ఎ/బికింద సంజాయిషీ నోటీసు జారీకి తగిన తేదీ ఏది?

వార్షిక లెక్కల పట్టిక (రిటర్న్) వాస్తవ దాఖలు రోజే తగిన తేదీ... అయితే, దాఖలు చేయాల్సిన తేదీలోపు రిటర్ను దాఖలైందా, కాలేదా అన్నది పరిగణనలోకి వస్తుంది.

సెక్షస్ 51ఎ/బి కింద సంజాయిషీ నోటీసు జారీ లేదా తుది నిర్ణయానికి నిర్దేశిత వ్యవధి ఏదైనా ఉందా?

సంజాయిషీ నోటీసు జారీకి నిర్దేశిత వ్యవధి ఏదీ లేదు. అయితే, సెక్షస్ 51ఎ కింద కేసులలో నోటీసు జారీ లేదా తుది నిర్ణయ ప్రక్రియ సంబంధిత తేదీ నుంచి మూడేళ్లలోపు, సెక్షన్ 51బి కింద కేసులలో అయితే ఐదేళ్లలోపు పూర్తికావాలి.

పన్ను చెల్లించాల్సిన వ్యక్తికి సెక్షస్ 51బి కింద నోటీసు జారీ చేసేలోగా అభ్యర్థన మొత్తాన్ని అతడు వడ్డీతో కలిపి చెల్లించవచ్చా?

చెల్లించవచ్చు. ఉప సెక్షన్ (1) కింద నోటీసు జారీ, ఉప సెక్షన్ (2) కింద స్టేట్మెంట్ జారీకి ముందు పన్ను చెల్లించాల్సిన వ్యక్తి ఆ పన్ను మొత్తాన్ని వడ్డీతోపాటు 15 శాతం జరిమానాతో చెల్లించవచ్చు. ఇందుకోసం తన సొంత లెక్కల ప్రకారం లేదా సముచిత అధికారి అంచనా వేసిన ప్రకారం చెల్లించే వీలుంది. అలాంటి సందర్భాల్లో నోటీసు జారీ చేయరాదు.

సెక్షస్ 51బి కింద నోటీసు జారీ చేశాక సదరు వ్యక్తి చెల్లింపు చేస్తే ఆ కేసు తుది నిర్ణయం అవసరమా?

పన్ను/వడ్డీతోపాటు జరిమానా కలిపి చెల్లించినట్లయితే తుది నిర్ణయం అవసరం ఉండదు. ఉప సెక్షస్ (1) కింద నోటీసు నోటీసు అందుకున్న వ్యక్తి పన్ను మొత్తం, దానిపై వడ్డీతోపాటు 25 శాతం జరిమానాను 30 రోజుల్లోగా జమచేస్తే ఆ నోటీసుకు సంబంధించిన అన్ని చర్యలూ ముగిసినట్లే పరిగణించాలి.

సెక్షస్ 51బి కింద నోటీసు జారీతోపాటు చెల్లించాల్సిన పన్ను, జరిమానాను నిర్ధారిస్తూ ఆదేశాలు జారీ అయిన పక్షంలో సదరు నోటీసుకింద జరిమానా తగ్గించి చెల్లించే వెసులుబాటు ఏదైనా ఉందా?

ఉంది. ఆదేశాలు అందుకున్న 30 రోజుల్లోగా పన్ను/వడ్డీతోపాటు 50 శాతం జరిమూనాను సదరు వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 51 బి, ఉప సెక్షస్ (6) కింద ఆదేశాలు జారీ అయిన పక్షంలో పన్ను, వడ్డీతోపాటు జరిమానాలో 50 శాతానికి సమానమైన పన్ను మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తే సదరు పన్నుకు సంబంధించి అన్ని చర్యలూ ముగిసినట్లే పరిగణించాలి.

సెక్షస్ 51ఎ, బిల కింద నోటీసులు జారీచేసినా మూడేళ్లు (51ఎ), ఐదేళ్ల (51బి) వ్యవధిలో ఆదేశాలు జారీ కాకపోతే ఏమవుతుంది?

సెక్షన్ 51ఎ (7) ప్రకారం మూడేళ్లలోగా, సెక్షన్ 51 బి (8) ప్రకారం ఐదేళ్లలోగా ఆదేశాలు జారీ కాకపోతే న్యాయ నిర్ణయ ప్రక్రియ ముగిసినట్లు పరిగణించవచ్చునని వస్తుసేవల పన్ను నమూనా చట్టం (మోడల్ జీఎస్టీ లా-MGL) నిర్దేశిస్తోంది.

ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి వసూలు చేసిన పన్నును ప్రభుత్వానికి జమ చేయకపోతే ఏమవుతుంది?

వస్తుసేవల పన్ను నమూనా చట్టం సెక్షస్ 52 ప్రకారం. ఇతరుల నుంచి ఈ చట్టం కింద పన్ను వసూలు చేసే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఆ మొత్తాన్ని కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సిందే. సరఫరా చేసిన ఏ వస్తువులపై పన్ను వసూలు చేశాడో అవి పన్ను విధించదగినవా, కాదా అన్నదానితో దీనికి నిమిత్తం లేదు.

వసూలు చేసిన పన్నును ప్రభుత్వానికి జమ చేయకుండా సెక్షస్ 52కు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తీసుకోదగిన చర్య ఏమిటి?

నోటీసు జారీచేయాలి. సహజ న్యాయ సూత్రావళిని అనుసరించడంతోపాటు నోటీసు జారీచేసిన తేదీనుంచి కచ్చితంగా ఏడాదిలోగా ఆదేశాలు జారీ చేయాలి. అయితే, సంజాయిషీ నోటీసు ఇవ్వడానికి నిర్దేశిత కాలావధి ఏదీ లేదు. అటువంటి ఉదంతాలలో పదేళ్ల తర్వాత కూడా పన్ను వసూలు చేయవచ్చు.

సెక్షస్ 52 కింద వసూలు చేసిన పన్నును జమచేయని ఉదంతాలలో నోటీసు జారీకి నిర్దేశిత కాలావధి ఏమైనా ఉందా?

లేదు... అలాంటి కాలావధి ఏదీ లేదు. అటువంటి ఉదంతాలను కనుగొన్నట్లయితే కాలావధితో నిమిత్తం లేకుండా నోటీసు జారీ చేయవచ్చు. అయితే, నోటీసు జారీచేశాక మాత్రం ఆ తేదీనుంచి ఏడాదిలోగా ఆదేశాలు జారీ చేయడం తప్పనిసరి.

పన్ను వసూళ్ల కోసం సంబంధిత అధికారి అనుసరిందగిన పద్ధతులేమిటి?

సంబంధిత అధికారికిగల వెసులుబాట్లు కిందివిధంగా ఉంటాయి:-

  1. అటువంటి వ్యక్తులకు చెల్లించాల్సిన మొత్తం ఏదైనా ఉంటే అందులోనుంచి మినహాయించుకునే వెసులుబాటు లేదా మరో అధికారి పరిధిలో ఉంటే సదరు అధికారిని ఆ మేరకు కోరవచ్చు.
  2. సదరు వ్యక్తినుంచి నేరుగా వసూలు చేయవచ్చు లేదా మరో అధికారి పరిధిలో ఉంటే సంబంధిత వ్యక్తికి చెందిన వస్తువులను స్వాధీనం చేసుకుని వాటి అమ్మకంద్వారా రాబట్టాలని కోరవచ్చు.
  3. పన్ను జమ చేయాల్సిన వ్యక్తికి బకాయిపడిన వారు లేదా సొమ్ము చెల్లించాల్చినవారు లేదా వారికి సంబంధించిన నగదు కలిగిన, అందుకోబోయే వ్యక్తులకు సముచిత అధికారి లిఖితపూర్వక నోటీసు జారీద్వారా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు పన్నును జమచేయాల్సిందిగా కోరవచ్చు.
  4. తగిన ఉన్నతధికార స్థానం ఆమోదంతో సదరు వ్యక్తి సొంత లేదా అతని నియంత్రణలోని స్థిర, చరాస్తులను జప్తు చేసి, సొమ్ము చెల్లించేదాకా స్వాధీనంలో ఉంచుకోవచ్చు. అటువంటి చర్య తర్వాత కూడా 30 రోజులపాటు సదరు ఆస్తులను విక్రయించి తద్వారా లభించే మొత్తం నుంచి అతడు చెల్లించాల్సిన పన్నుతోపాటు విక్రయ లావాదేవీల వ్యయాన్ని మినహాయించి, మిగిలిన సొమ్మును అతడికి ముట్టచెప్పవచ్చు.
  5. పన్ను చెల్లించాల్సిన వ్యక్తి బకాయి పడిన మొత్తాన్ని నిర్ధారిస్తూ తయారుచేసిన ధ్రువీకరణ పత్రాన్ని అతడి సొంత జిల్లా కలెక్టరుకు పంపవచ్చు. దాన్ని అందుకున్న తర్వాత సదరు జిల్లాలో అతడికేవైనా ఆస్తులున్నా, అక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, పన్ను బకాయి మొత్తాన్ని భూమి శిస్తు బకాయి వసూలు రూపేణా కలెక్టర్ అతడినుంచి రాబట్టే వీలుంటుంది.

పన్ను బకాయిలను వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతించే అధికారం సంబంధిత అధికారికి ఉందా?

ఉంది. పన్ను స్వీయ మదింపేతర సందర్భాలకు మాత్రమే ఇది పరిమితం. చెల్లింపు గడువును కమిషనర్/చీఫ్ కమిషనర్ పొడిగించవచ్చు లేదా స్వీయ మదింపు రిటర్నులలో దేనిలోనూ పేర్కొన్నది కాకుండా బకాయి పన్నులో ఎంత మొత్తమైనా చెల్లించేందుకు చట్టం ప్రకారం అనుమతించవచ్చు. సెక్షస్ 36 కింద నిర్దేశించిన నిబంధనలు, షరతులకు లోబడి వడ్డీసహా చెల్లింపు ప్రాతిపదికన సదరు వ్యక్తికి 24 నెలవారీ వాయిదాలకు మించకుండా సమయం ఇచ్చే వీలుంది. అయితే, ఏ ఒక్క వాయిదానైనా నిర్దిష్ట తేదీలోగా జమ చేయకపోతే ఆనాటికి ఎంత చెల్లించాల్సి ఉన్నదో ఆ మొత్తం సొమ్ము బకాయిగా పరిగణించబడి మరోసారి నోటీసుతో నిమిత్తం లేకుండా వసూలు చేయబడుతుంది.

పునర్విచారణ/సవరణ అభ్యర్ధనపై విచారణ సందర్భంగా నిర్ధారిత పన్నుమొత్తం పెంచబడితే ఏమవుతుంది?

పెంచిన బకాయి పన్ను మొత్తాన్ని మాత్రమే పేర్కొంటూ అభ్యర్ధన నోటీసును జారీ చేయాల్సి ఉంటుంది. పునర్విచారణ/సవరణ అభ్యర్ధన పరిష్కారానికి ముందే నిర్ధారించిన పన్ను వసూలు ప్రక్రియను అంతకుముందున్న దశనుంచే కొనసాగించవచ్చు.

పన్ను చెల్లింపుదారుపై కొంత పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండగా తన వ్యాపారాన్ని అతడు మరో వ్యక్తికి బదలాయిస్తే అప్పటికే అతడిపైగల పన్ను బాధ్యత మూటేమిటి?

పన్ను చెల్లించాల్సిన వ్యక్తి తన వ్యాపారం మొత్తాన్ని లేదా ఓ భాగాన్ని అమ్మకం, బహుమతి, కౌలు, ఉన్నదున్నట్లు అప్పగింత, అద్దె లేదా ఇతరత్రా రూపాల్లో మరో వ్యక్తికి బదలాయిస్తే ఆ ఇద్దరూ వ్యష్టిగా, సమష్టిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సదరు వ్యాపార బదిలీ కాలం వరకూ చెల్లింపుదారు నుంచి రావాల్సిన పన్ను, వడ్డి లేదా జరిమానా బకాయిలు బదిలీనాటికే నిర్ధారితమై ఉన్నా, బదిలీ తర్వాత ఖరారైనా బాధ్యత మూత్రం వారిద్దరిపైనా ఉంటుంది.

ఒక కంపెనీ (పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి) మూసివేత (లిక్విడేషన్) పరిస్థితి ఏర్పడితే అప్పటికే చెల్లించాల్సిన పన్ను బకాయిల మాటేమిటి?

ఏదైనా కంపెనీ మూసివేసినప్పుడు అంతకుముందుగానీ, ఆ తర్వాతగానీ పన్నులు, బకాయిలు వసూలు కాలేదని నిర్ధారణ అయినప్పుడు, సదరు సంస్థలో అప్పటిదాకా డైరెక్టర్లుగా ఉన్న ప్రతి ఒక్కరూ వ్యష్టిగా, సమష్టిగా చెల్లింపునకు బాధ్యులవుతారు. కంపెనీ వ్యవహారాలకు సంబంధించి తన తీవ్ర నిర్లక్యం, దారుణ కర్తవ్యోపేక లేదా విధుల ఉల్లంఘన వంటివేవీ లేవని, అందువల్ల బకాయిలు చెల్లించకపోవడానికి తాను కారణం కాదన్న వివరణతో కమిషనర్ను సంతృప్తి పరచగలిగితే తప్ప డైరెక్టర్లందరూ బాధ్యులే అవుతారు.

ఒక భాగస్వామ్య సంస్థ (పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి) పన్ను బకాయిల చెల్లింపులో భాగస్వాముల బాధ్యత ఏమిటి?

పన్ను, వడ్డీ, జరిమానాల చెల్లింపులో ఏ భాగస్వామ్య సంస్థలోని భాగస్వాములైనా వ్యష్టిగా, సమష్టిగా బాధ్యులవుతారు. భాగస్వాములలో ఎవరైనా విరమించుకునేట్లయితే ఆ తేదీనాటికి చెల్లించాల్సిన పన్ను, వడ్డీ లేదా జరిమానాలకు సంబంధించి ఆ సమయానికి లేదా ఆ తర్వాత సదరు భాగస్వామికిగల బాధ్యత గురించి కమిషనరుకు లిఖితపూర్వక నోటీసు ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. విరమించుకున్న నెలలోగా సదరు సమాచారం ఇవ్వకపోతే, కమిషనరుకు ఆ వ్యవహారం గురించి ఎరుకపరచే తేదీదాకా భాగస్వామిపై ఆ సంస్థ బకాయిల బాధ్యత కొనసాగుతుంది.

పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి వ్యాపారాన్ని బాల్యదశలోనివారి తరఫున సంరక్షకుడు లేదా ధర్మకర్త లేదా ప్రతినిధి నిర్వహిస్తున్నట్లయితే సదరు వ్యక్తి పన్ను చెల్లింపు బాధ్యత ఏమవుతుంది?

బాల్యదశలోనివారు, లేదా అశక్తులైనవారి తరఫున లేదా వారి లబ్దికోసం వ్యాపారాన్ని సంరక్షకుడు/ధర్మకర్త/ప్రతినిధి నిర్వహిస్తున్న సందర్భంలో దానికి సంబంధించి పన్ను, వడ్డీ లేదా జరిమానా చెల్లించాల్సి ఉన్నట్లయితే సదరు సంరక్షకుడు/ధర్మకర్త/ప్రతినిధిపైనే వాటిని విధించాల్సి ఉంటుంది.

పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తికిగల హక్కుభుక్తమైన ఆస్తి (ఎస్టేట్) సంరక్షక/మైనర్ వివాదాల న్యాయస్థానం (Court of Wards) నియంత్రణ లో ఉన్నపుడు ఏమవుతుంది?

పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తికి వ్యాపారం ఉండి, ఏదైనా న్యాయస్థానం ఆదేశాల మేరకు అతడి హక్కుభుక్తమైన ఆస్తి నియంత్రణ కోసం సంరక్షక/మైనర్ వివాదాల న్యాయస్థానం/పరిపాలన జనరల్/అధికారిక ధర్మకర్త/మధ్యవర్తి లేదా నిర్వాహకుడు నియమితులైన పక్షంలో సదరు వ్యాపారానికి సంబంధించి ఆ వ్యక్తినుంచి వసూలు చేయాల్సిన పన్ను, వడ్డీ, జరిమానాలను ఆస్తి నియంత్రణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపైనే విధించి రాబట్టాల్సి ఉంటుంది.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

3.01204819277
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు