పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇన్పుట్ టాక్స్ క్రెడిట్

ఉత్పాదక పన్ను అంటే.... నమోదిత వ్యక్తికి సరఫరా చేసే వస్తువలు, సేవలు లేదా రెండింటిపైనా విధించే కేంద్ర పన్ను (సీజీఎస్టీ), రాష్ట్ర పన్ను (ఎస్టీఎస్టీ), సమీకృత పన్ను (ఐజీఎస్టీ) లేదా కేంద్రపాలిత ప్రాంత (యూటీజీఎస్టీ) పన్ను. ఎదురు చెల్లింపు ప్రాతిపదికన చెల్లించిన పన్ను, దిగుమతులపై విధించే సమీకృత వస్తుసేవల పన్ను కూడా ఇందులో అంతర్భాగమే. అయితే, మిశ్రమ విధింపు కింద చెల్లించిన పన్ను ఇందులో చేరదు.

ఉత్పాదక పన్ను (Input Tax) అంటే ఏమిటి?

ఉత్పాదక పన్ను అంటే.... నమోదిత వ్యక్తికి సరఫరా చేసే వస్తువలు, సేవలు లేదా రెండింటిపైనా విధించే కేంద్ర పన్ను (సీజీఎస్టీ), రాష్ట్ర పన్ను (ఎస్టీఎస్టీ), సమీకృత పన్ను (ఐజీఎస్టీ) లేదా కేంద్రపాలిత ప్రాంత (యూటీజీఎస్టీ) పన్ను. ఎదురు చెల్లింపు ప్రాతిపదికన చెల్లించిన పన్ను, దిగుమతులపై విధించే సమీకృత వస్తుసేవల పన్ను కూడా ఇందులో అంతర్భాగమే. అయితే, మిశ్రమ విధింపు కింద చెల్లించిన పన్ను ఇందులో చేరదు.

ఎదురు చెల్లింపు ప్రాతిపదికన చెల్లించిన జీఎస్టీని ఉత్పాదక పన్నుగా పరిగణిస్తారా?

పరిగణిస్తారు... ఎదురు చెల్లింపు కింద చెల్లించాల్సిన పన్ను కూడా ఉత్పాదక పన్ను నిర్వచనంలో అంతర్భాగమే.

ఉత్పాదక వస్తువులు, సేవలు, మూలధన వస్తువులపై చెల్లించిన పన్ను(సిజీఎస్టి, ఐజీఎస్టి, ఎస్టీఎస్టీ ) పన్నులో భాగమేనా?

అవును... ఉత్పాదక వస్తువులు, సేవలు, మూలధన వస్తువులపై చెల్లించిన పన్ను ఉత్పాదక పన్నులో భాగమే. మూలధన వస్తువులపై చెల్లించిన పన్ను జమను ఒకే దఫాగా వాడుకునేందుకూ చట్టం అనుమతిస్తుంది.

వస్తువులు లేదా సేవల సరఫరాపై విధించిన ఉత్పాదక పన్ను మొత్తాన్నీ జీఎస్టీ కింద జమగా అనుమతిస్తారా?

ఒక నమోదిత వ్యక్తి తన వ్యాపార విస్తరణ లేదా అందులో భాగంగా ఉద్దేశించిన వస్తువులు లేదా రెండింటి సరఫరాపై విధించిన ఉత్పాదక పన్ను జమ(ITC)ను పొందడానికి అర్జుడే. కానీ, ఇది ఇతర షరతులు, పరిమితులకు లోబడి ఉంటుంది.

ఉత్పాదక పన్ను జమ (ITC)ను పొందడానికి పాటించాల్సిన షరతులేమిటి?

పన్ను విధించదగిన నమోదిత వ్యక్తి ఐటీసీ పొందడం కోసం కింద పేర్కొన్న 4 పరతులను పాటించాల్సి ఉంటుంది:-

  • పన్ను రసీదు లేదా తగ్గింపు పత్రం (డెబిట్ నోట్) లేదా అటువంటి నిర్దేశిత పన్ను చెల్లింపు పత్రం కలిగి ఉండాలి;
  • వస్తువలు లేదా సేవలు లేదా రెండింటినీ స్వీకరించి ఉండాలి;
  • ప్రభుత్వానికి చేసిన సరఫరాలకు సంబంధించి విధించిన పన్నును సరఫరాదారు వాస్తవంగా చెల్లించి ఉండాలి; అలాగే
  • సెక్షన్ 39 కింద అతడు రిటర్న్ సమర్పించి ఉండాలి.

నమోదిత వ్యక్తి ఒక బిల్లుపై వస్తువులను కొన్ని రాశులుగా లేదా విడతలవారీగా స్వీకరించినప్పుడు అతడు ఐటీసీకి ఎలా అర్హుడవుతాడు?

తాను స్వీకరించాల్సిన వస్తువుల చివరి రాశి లేదా వాయిదా వస్తువులను అందుకున్న తర్వాత సదరు నమోదిత వ్యక్తి ఐటీసీ పొందడానికి అర్హుడవుతాడు.

ఒక వ్యక్తి తనకందిన సరఫరాలకు ప్రతిఫలంతోపాటు పన్ను చెల్లించకపోయినా ఐటీసీ పొందగలడా?

పొందగలడు. అయితే, ఇందుకోసం తాను స్వీకరించిన వస్తువులకు బిల్లు జారీ అయిన తేదీనుంచి 180 రోజుల్లోగా ప్రతిఫలంతోపాటు పన్నును అతడు చెల్లించాల్సి ఉంటుంది. ఎదురు చెల్లింపు ప్రాతిపదికన పన్ను చెల్లించేట్లయితే ఈ షరతు వర్తించదు.

బిల్లు జారీ అయిన తేదీనుంచి 180 రోజుల్లోగా నమోదిత వ్యక్తి ప్రతిఫలంతోపాటు పన్నుచెల్లించని పక్షంలో అతడు పొందిన ఐటీసీ ఏమవుతుంది?

నమోదిత వ్యక్తి పొందిన ఐటీసీ మొత్తం అతడి పన్ను చెల్లింపు బాధ్యతకు జమ కావడగమేగాక దానిపై వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఆ తర్వాతనైనా ప్రతిఫలంతోపాటు పన్ను చెల్లిస్తే, అతడు ఐటీసీని తిరిగి పొందే వీలుంది.

పన్ను విధించదగిన వ్యక్తికి కాకుండా వస్తువులను మరొకరికి పంపినప్పుడు (బిల్ టు, షిప్ టు' వంటి పరిస్థితుల్లో) ఐటీసీని పొందేవారెవరు?

పన్ను విధించదగిన నమోదిత వ్యక్తి సూచన మేరకు సదరు వస్తువులను మూడో పక్షం స్వీకరించినప్పటికీ వాటిని అతడే స్వీకరించినట్లు పరిగణనలోకి వస్తుంది. అందువల్ల వస్తువులను మూడో వ్యక్తికి చేర్చాల్సిందిగా ఆదేశించిన వ్యక్తి ఐటీసీని వినియోగించుకోగలడు.

ఐటీసీ పొందడానికిగల గడువు... అందుకు కారణాలు ఏమిటి?

తదుపరి ఆరిక సంవత్సరం అకోబరు 2O లేదా వార్షిక రిటర్న్ సమర్పణ తేదీలలో ఏది ముందైతే అదే ఐటీసీ పొందడానికి తుది గడువు అవుతుంది. ఈ నిబంధనలోని అంతరార్థం ఏమిటంటే. సెకన్ 39 ప్రకారం నమోదిత వ్యక్తి  తదుపరి ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు ఆఖరులోగా తన వార్షిక రిటర్న్ సమర్పించాలి. కాబట్టి ఆ తర్వాత అందులో మార్పులు చేసే అవకాశం లభించదు. ఒకవేళ సెప్టెంబరుకు ముందే రిటర్న్ సమర్పించినా ఆ ప్రక్రియ పూర్తయ్యాక అందులో మార్పుచేర్పులను చట్టం అనుమతించదు. కాబట్టి నమోదిత వ్యక్తి పై నిబంధనను అనుసరించని పకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో వస్తుసేవల సరఫరాపై ఏదైనా బిల్లు లేదా తగ్గింపు పత్రాలపై తనకు లభించిన ఐటీసీని వినియోగించుకోలేడు.

పన్ను విధించదగిన నమోదిత వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం-1961 కింద తన మూలధన వస్తువుల విలువపై తరుగుదలను సదరు పన్ను బాధ్యతనుంచి మినహాయింపుగా పొంది ఉంటే అతడికి ఐటీసీని అనుమతిస్తారా?

మూలధన వస్తువుల విలువపై తరుగుదలను పన్ను బాధ్యతనుంచి మినహాయింపుగా పొంది ఉంటే ఐటీసీ పొందడానికి అనుమతి లభించదు.

పన్ను విధించదగిన వస్తువులు లేదా సేవల సరఫరా కోసం ఉపయోగించే ప్రతి ఉత్పాదకంపై చెల్లించిన పన్ను జమను పొందడానికి జీఎస్టీ చట్టం అనుమతిస్తుందా?

అనుమతిస్తుంది..... చట్టంలో పొందుపరచిన ఓ చిన్న జాబితాలోని కొన్ని వస్తువులు మినహా మిగిలిన అన్నిటిపైనా పన్ను జమ పొందవచ్చు. ఈ జాబితాలో ప్రధానంగా వ్యక్తిగత వినియోగ వస్తువులు, స్థిరాస్తు (యంత్రాలు, యంత్రపరికరాలు మినహా)ల నిర్మాణంలో వినియోగించిన ఉత్పాదకాలు, టెలికం టవర్లు, కర్మాగార ప్రాంగణాల వెలుపల నిర్మించిన పైపులైన్లు, వంటివాటితోపాటు పన్ను ఎగవేత బయటపడటంవల్ల చెల్లించిన పన్నులు ఉన్నాయి.

పన్ను విధించదగిన వ్యక్తి ఒకరు సమాచార సాంకేతిక పరిజ్ఞాన వ్యాపారంలో ఉన్నాడు. అతడు తమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కోసం మోటారు వాహనం కొంటే ఈ కొనుగోలుపై చెల్లించిన జీఎస్టీని అతడు ఐటీసీకింద పొందవచ్చా?

పొందలేడు... పన్ను విధించదగిన వ్యక్తి ప్రయాణికుల లేదా సరకుల రవాణా వ్యాపారం చేస్తుంటే, వాహనాలను శిక్షణార్డుల సేవలకు వినియోగిస్తుంటే మాత్రమే సదరు మోటారు వాహనాల కొనుగోళ్లపై ఐటీసీని పొందగలడు.

వివిధ కారణాలవల్ల కొన్నిసార్లు వస్తువులు ధ్వంసం కావచ్చు లేదా గల్లంతు కావచ్చు... సదరు నష్టపోయిన వస్తువుల మేరకు ఒక వ్యక్తి ఐటీసీ పొందగలడా?

పొందలేడు... పోగొట్టుకున్న, అపహరణకు గురైన, ధ్వంసమైన, రద్దుచేసిన వస్తువులకు సంబంధించి ఐటీసీని పొందడం సాధ్యం కాదు. దీంతోపాటు బహుమతిగా లేదా ఉచిత నమూనాలుగా ఇచ్చిన వస్తువులపైనా ఐటీసీ అనుమతించబడదు.

వ్యాపారానికి ఉద్దేశించిన భవన నిర్మాణంలో వాడే వస్తుసేవలకు సంబంధించి ఒక వ్యక్తి ఐటీసీ పొందగలడా?

పొందలేడు... స్థిరాస్తి నిర్మాణంలో వినియోగించే (యంత్రాలు, యంత్ర పరికరాలు మినహా) వస్తువులు లేదా సేవలపై ఐటీసీ అనుమతించబడదు. యంత్రాలు, యంత్ర పరికరాలలోనూ కేవలం సాధన సంపత్తి, ఉపకరణాలు, పునాది లేదా కట్టడానికి అమర్చిన యంత్రాలు వంటివి మాత్రమే పరిగణనలోకి వస్తాయి. భూమి, భవనం తదితర స్థిర నిర్మాణాలు పరిగణనలోకి రావు.

కొత్తగా నమోదైన వ్యక్తికి ఐటీసీ అర్హత మాటేమిటి?

జవాబు: నమోదు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి నమోదు మంజూరు తేదీకి ముందు రోజున తనవద్దగల ఉత్పాదకాల నిల్వ మధ్యంతర లేదా పూర్తయిన స్థితిలోగల ఉత్పాదకాల వస్తు నిల్వలపై ఐటీసీని పొందవచ్చు. ఒక వ్యక్తి నమోదు బాధ్యత కలిగి ఉండి సదరు బాధ్యత ఏర్పడిన నాటినుంచి 30 రోజుల్లోగా నమోదుకు దరఖాస్తు చేసిన సందర్భంలో.... పన్ను చెల్లింపు బాధ్యత ఏర్పడే తేదీకి ముందు రోజున తనవద్దగల ఉత్పాదకాల నిల్వ మధ్యంతర లేదా పూర్తయిన స్థితిలోగల ఉత్పాదకాల వస్తు నిల్వలపై ఐటీసీని పొందవచ్చు.

ఒక వ్యక్తికి 2017 ఆగస్టు 1నాటికి పన్ను చెల్లింపు బాధ్యత ఏర్పడింది. అతడు 2017 ఆగస్టు 15న నమోదు మంజూరు పొందాడు. సదరు వ్యక్తి ఏ తేదీనుంచి ఐటీసీకి అర్ధుడవుతాడు?

  • (ఎ) 2017 ఆగస్టు 1;
  • (బి) 2017 జూలై 31;
  • (సి) 2017 ఆగస్టు 15;
  • (డి) గత కాలానికి అతడు ఐటీసీ పొందలేడు.

జవాబు: 2O17 జూలై 31.

స్వచ్ఛంద నమోదు పొందిన వ్యక్తి వద్దగల ఉత్పాదకాలపై ఐటీసీకి అర్హత ఏమిటి?

జవాబు: స్వచ్ఛందంగా నమోదు మంజూరు చేయించుకున్న వ్యక్తి సదరు నమోదు తేదీకి ముందు రోజున తనవద్దగల ఉత్పాదకాల నిల్వ మధ్యంతర లేదా పూర్తయిన స్థితిలోగల ఉత్పాదకాల వస్తు నిల్వలపై ఐటీసీని పొందటానికి అర్హుడవుతాడు.

ఒక నమోదిత సంస్థ/వ్యక్తి రాజ్యాంగంలో చోటు చేసుకున్న సందర్భాల్లో ఐటీసీ అర్హత ఏమిటి?

బాధ్యతల బదిలీకి సంబంధించి నిర్దిష్ట నిబంధన ఉన్నట్లయితే సదరు సంస్థ/వ్యక్తి ఎలక్ట్రానిక్ జమల పుస్తకంలో మిగిలి ఉన్న ఐటీసీ నిల్వను కొత్త సంస్థ /వ్యక్తికి బదిలీ చేసేందుకు అనుమతి ఉంటుంది.

నమోదిత పన్ను విధించదగిన వ్యక్తి తనకు అందిన వస్తుసేవలను తనవద్దగల పన్ను విధించదగిన, పన్ను విధించదగని సరఫరాలను ప్రభావితం చేయడం కోసం వినియోగిస్తే అతడికి ఐటీసీ అందుబాటులో ఉంటుందా?

జవాబు: వస్తువులు లేదా సేవలు లేదా రెండింటికీ సంబంధించి పన్నువిధించదగిన సరఫరాలపై మాత్రమే ఐటీసీ వర్తిస్తుంది. ఈ జమ అర్హతను లెక్కించే విధానాన్ని నిబంధనలు నిర్దేశిస్తాయి.

పన్ను విధించదగిన సరఫరాలను ప్రభావితం చేయడానికి వినియోగించే వస్తుసేవలకు మాత్రమే ఐటీసీని అనుమతించడంవల్ల పన్ను మినహాయింపు సరఫరాల ఎగుమతిలో ఐటీసీని నష్టపోయే పరిస్థితి ఏర్పడదా?

ఐటీసీని అనుమతించడం కోసం సున్నా రేటింగ్ సరఫరాలను పన్ను విధించదగ్గ సరఫరాల్లో చేర్చడం జరిగింది. సమీకృత వస్తుసేవల పన్ను చట్టం (ఐజీఎస్టీ)లో పన్ను మినహాయింపు సరఫరాలుసహా సున్నా రేటింగ్ సరఫరాల పరిధి పేర్కొనబడింది.

పన్ను జమను పొందడం కోసం పన్ను విధించదగిన సరఫరాల లెక్కలో చేర్చినవి ఏవి?...

(ఎ) సున్నా రేటింగ్ సరఫరాలు; (బి) పన్ను మినహాయింపు సరఫరాలు; (సి) రెండూ...

జవాబు: సున్నా రేటింగ్ సరఫరాలు.

నమోదిత వ్యక్తి తనకందిన వస్తుసేవలను కొంత వ్యాపారం కోసం, మరికొంత ఇతర అవసరాల కోసం వినియోగిస్తే అతడికి ఐటీసీ లభిస్తుందా?

వ్యాపారానికి ఉద్దేశించిన వస్తువులు లేదా సేవలు లేదా రెండింటికీ మాత్రమే ఐటీసీ వర్తిస్తుంది కాబట్టి ఆ మేరకు నమోదిత వ్యక్తి లబ్ది పొందవచ్చు. ఈ జమ అర్హతను లెక్కించే విధానాన్ని నిబంధనలు నిర్దేశిస్తాయి.

సమ్మేళన పథకం కింద పన్ను చెల్లించే వ్యక్తి సదరు పథకం ప్రవేశ పరిమితిని దాటి పన్ను విధించదగిన వ్యక్తిగా మారితే అతడికి ఐటీసీ పొందే అర్హత ఉంటుందా? ఉంటే... ఏ తేదీనుంచి వర్తిస్తుంది?

సమ్మేళన పథకం కింద పరిధిని దాటిపోయే తేదీకి ముందు రోజున తనవద్దగల ఉత్పాదకాల నిల్వ, మధ్యంతర లేదా పూర్తయిన స్థితిలోగల ఉత్పాదకాల వస్తు నిల్వలు, మూలధన వస్తువుల (నిర్దిష్ట శాతం మేరకు పాయింట్లు తగ్గించిన తర్వాత)పై ఐటీసీని పొందటానికి అర్హుడవుతాడు. ఈ జమ అర్హతను లెక్కించే విధానాన్ని నిబంధనలు నిర్దేశిస్తాయి.

బ్యాంకింగ్ కంపెనీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలేవైనా ఉన్నాయా?

నిర్దిష్ట సేవాప్రదాన కార్యకలాపాలు నిర్వహించే బ్యాంకింగ్ కంపెనీ లేదా ఆర్థిక సహాయ సంస్థసహా బ్యాంకింగేతర సంస్థలు ఐటీసీని సదరు సేవల దామాషా మేరకు లేదా అర్హతగల మొత్తంలో 50 శాతం వినియోగించుకోవచ్చు.

'ఎ' అనే నమోదిత వ్యక్తి 2017 జూలై 30 వరకు మిశ్రమ పథకం కింద పన్ను చెల్లిస్తూ వచ్చాడు. అయితే, 2017 జూలై 31 నుంచి క్రమబద్ధ పథకం కింద పన్ను చెల్లింపు బాధ్యతల పరిధిలోకి వస్తే ఐటీసీకి అర్హుడేనా?

అతడు 2017 జూలై 30వ తేదీకి ముందు రోజువరకూ తనవద్దగల ఉత్పాదకాల నిల్వ, మధ్యంతర లేదా పూర్తయిన స్థితిలోగల ఉత్పాదకాల వస్తు నిల్వలు, మూలధన వస్తువుల (నిర్దిష్ట శాతం మేరకు పాయింట్లు తగ్గించిన తర్వాత)పై ఐటీసీని పొందటానికి అర్హుడే.

'బి' అనే వ్యక్తి 2017 జూస్ 5న స్వచ్చం నమోదు కోసం దరఖాస్తు చేయగా జూస్ 22న మంజూరైంది. తనవద్ద ఏ తేదీవరకూ గల ఉత్పదకాల నిల్వపై ఐటీసీకి అతడు అర్హుడు?

అతడు 2O17 జూన్ 21వ తేదీవరకూ తనవద్దగల ఉత్పాదకాల నిల్వ, మధ్యంతర లేదా పూర్తయిన స్థితిలోగల ఉత్పాదకాల వస్తు నిల్వలపై ఐటీసీ పొందగలడు. అయితే, మూలధన వస్తువులపై మాత్రం ఐటీసీకి 'బి' అనర్హుడు.

ఒక నమోదిత వ్యక్తి మిశ్రమ పథకాన్ని ఎంచుకున్నప్పుడు లేదా అతడు సరఫరా చేసిన వస్తువులు-సేవలు లేదా రెండూ పూర్తిగా పన్ను మినహాయింపు పొందినప్పుడు అతడు వినియోగించుకున్న ఐటీసీ ఏమవుతుంది?

సదరు నమోదిత వ్యక్తి తన ఎంపికను ఉపయోగించుకున్న తేదీ లేదా మినహాయింపు పొందిన తేదీలకు ముందు రోజు నాటికి తనవద్దగల నిల్వలపై ఉత్పాదక పన్ను జమ (ఐటీసీ)తో సమానమైన మొత్తాన్ని అతడు చెల్లించాల్సి ఉంటుంది. మూలధన వస్తువుల విషయంలో చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్దేశిత పర్సంటేజ్ పాయింట్ ప్రకారం తగ్గించి లెక్కిస్తారు. తన ఎలక్ట్రానిక్ జమల పుస్తకంలో తగిన నిల్వలుంటే దాన్ని తగ్గించడంద్వారాగానీ, లేనిపక్షంలో ఎలక్ట్రానిక్ నగదు పుస్తకంలో తగ్గించడంద్వారాగానీ అతడు ఈ చెల్లింపులు చేయవచ్చు. అటుపైన జమల పుస్తకంలో ఇంకా ఏదైనా నిల్వ ఉంటే అది రద్దయిపోతుంది.

ఐటీసీని వినియోగించుకునే వ్యవధికి పరిమితి ఏదైనా ఉందా?

కొత్తగా నమోదు, మిశ్రమ పథకం నుంచి సాధారణ పథకానికి మారడం, మినహాయింపు సరఫరాల నుంచి పన్ను విధించదగ్గ సరఫరాలకు మారడం వంటి సందర్భాలలో అటువంటి సరఫరాలకు సంబంధించి పన్ను రసీదు జారీ అయిన తేదీనుంచి ఏడాది దాటి ఉంటే సదరు వ్యక్తి ఐటీసీని వినియోగించుకోవడం వీలుకాదు.

సరఫరాదారు దాఖలు చేసిన చెల్లుబాటయ్యే రిటర్నులోని అమ్మకాల వివరాలు, స్వీకర్త సమర్పించిన కొనుగోళ్ల వివరాలతో సరిపోలకపోతే ఏమవుతుంది?

ఇలా సరిపోలకపోతే రెండు పక్షాలకూ సదరు సమాచారం అందజేస్తారు. ఆ తర్వాత ఈ వ్యత్యాసాన్ని సరిచేయకపోతే తత్సమానమైన మొత్తాన్ని స్వీకర్త తదుపరి నెలలో దాఖలు చేయబోయే నెలవారీ రిటర్నులో అతడి పన్ను బాధ్యతకు జోడిస్తారు.

వివరాలు సరిపోలితేనే ఐటీసీని అనుమతిస్తారా?

లేదు... ఉత్పాదక పన్ను జమును రెండు నెలలపాటు తాత్కాలికంగా అనుమతిస్తారు. తర్వాత సరఫరా వివరాలను వ్యవస్థ సరిపోల్చి తేడాలుంటే సంబందిత సరఫరాదారు, స్వీకర్తలకు సమాచారం అందిస్తుంది. ఆ తర్వాత కూడా వివరాలు సరిపోలని పక్షంలో అప్పటికే పొందిన ఐటీసీ యధాతథంగా వెనక్కు వెళ్లిపోతుంది.

తాత్కాలికంగా అనుమతించిన ఐటీసీతో చెల్లింపు బాధ్యతలన్నిటినీ నెరవేర్చుకోవచ్చా?

లేదు... తాత్కాలికంగా అనుమతించిన ఐటీసీని తమ రిటర్నులలో పేర్కొన్న స్వీయ మదింపు పన్ను చెల్లింపునకు మాత్రమే వినియోగించుకోవడం సాధ్యం.

పన్ను విధించదగిన వ్యక్తి ఐటీసీని వినియోగించుకున్న మూలధన వస్తువులను సరఫరా చేస్తే పన్ను ప్రభావం ఎలా ఉంటుంది?

అటువంటి సందర్భాలలో సదరు మూలధన వస్తువులపై (యంత్రాలు, యంత్ర పరికరాలు వగైరా) నమోదిత వ్యక్తి వినియోగించుకున్న ఐటీసీకి సమానమైన మొత్తం నుంచి నిర్దేశిత పర్సంటేజి పాయింట్ల మేర ఆ వస్తువుల విలువను తగ్గించి లేదా ఆ వస్తువుల కొనుగోలు లావాదేవీ విలువపై పన్నులెక్కించి వీటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించాలి.

మూలధన వస్తువులపై ఐటీసీని వినియోగించుకున్న నమోదిత వ్యక్తి వాటిని సరఫరా చేసినప్పుడు పన్ను ప్రభావం ఎలా ఉంటుంది?

నమోదిత వ్యక్తి వినియోగించుకున్న ఐటీసీకి సమానమైన మొత్తం నుంచి నిర్దేశిత పర్సంటేజి పాయింట్ల మేర ఆ వస్తువుల విలువను తగ్గించి లేదా ఆ వస్తువుల కొనుగోలు లావాదేవీ విలువపై పన్ను లెక్కించి వీటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించాలి. అయితే, ఉష్ణ నిరోధక ఇటుకలతోపాటు మూసలు, అచ్చులు, బిగింపులు, అమరికలు వంటివాటిని తుక్కు కింద సరఫరా చేసి ఉన్నట్లయితే సదరు వ్యక్తి ఆ లావాదేవీ విలువపై పన్ను చెల్లించాలి.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

2.99593495935
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు