పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎలక్ట్రానిక్ కామర్స్

ఎలక్ట్రానిక్ వర్తకం (ఈ-కామర్స్) అంటే... డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చట్రం (నెట్వర్క్)ద్వారా డిజిటల్ ఉత్పత్తులుసహా వస్తువులు, సేవలు లేదా రెండూ సరఫరా చేసే వ్యాపారంగా నిర్వచించబడింది.

ఎలక్ట్రానిక్ వర్తకం (ఈ-కామర్స్) అంటే ఏమిటి?

ఎలక్ట్రానిక్ వర్తకం (ఈ-కామర్స్) అంటే... డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చట్రం (నెట్వర్క్)ద్వారా డిజిటల్ ఉత్పత్తులుసహా వస్తువులు, సేవలు లేదా రెండూ సరఫరా చేసే వ్యాపారంగా నిర్వచించబడింది.

ఈ-కామర్స్ నిర్వహణదారు అంటే ఎవరు?

ఎలక్ట్రానిక్ కామర్స్ నిర్వహణదారు అంటే... ఎలక్ట్రానిక్ వ్యాపార కార్యకలాపాల కోసం డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ సదుపాయం లేదా వేదికను కల్పించే, నిర్వహించే, సొంతంగా కలిగి ఉండే వ్యక్తిగా నిర్వచించబడింది.

కామర్స్ నిర్వహణదారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలా?

అవును. ఈ-కామర్స్ నిర్వహణదారులకు ప్రవేశ మినహాయింపు లబ్ది లభించదు.కాబట్టి తమ సరఫరాల విలువతో నిమిత్తం లేకుండా వారు తప్పక నమోదు చేసుకోవాలి.

ఈ-కామర్స్ వేదికద్వారా వస్తువులు లేదా సేవల సరఫరాదారులు ప్రవేశ మినహాయింపునకు అర్హులేనా?

కాదు... అటువంటి సరఫరాదారులకు ప్రవేశ మినహాయింపు లబ్ది లభించదు. తాము సరఫరా చేసే వస్తుసేవల విలువతో నిమిత్తం లేకుండా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అయితే, మూలంలో పన్ను వసూలు అనుమతిగల ఈ-కామర్స్ వేదికద్వారా సరఫరాలు చేసేవారికి మాత్రమే ఇది అవసరం.

ఎలక్ట్రానిక్ మార్గంలో వస్తుసేవల సరఫరాపై వాస్తవ సరఫరాదారుకు బదులు ఈ-కామర్స్ నిర్వహణదారుకు పన్ను చెల్లింపు బాధ్యత ఉంటుందా?

ఉంటుంది... అయితే, ఇది కొన్ని నిర్దిష్ట ప్రకటిత సేవలకు మాత్రమే పరిమితం. అటువంటి సందర్భాలలో తమద్వారా సాగే సరఫరాలకు ఈ-కామర్స్ నిర్వహణదారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి సేవల సరఫరా విషయంలో పన్ను చెల్లింపు బాధ్యత ఉన్నట్లు పరిగణిస్తూ చట్టంలోని అన్నినిబంధనలూ వారికి వర్తిస్తాయి.

ప్రకటిత సేవలపై ఈ-కామర్స్ నిర్వహణదారులకు ప్రవేశ మినహాయింపు లభిస్తుందా?

లభించదు... తమద్వారా సరఫరా అయ్యే ప్రకటిత సేవలపై పన్ను చెల్లించాల్సిన ఈ-కామర్స్ నిర్వహణదారులకు ప్రవేశ మినహాయింపు వర్తించదు.

మూలంలో పన్ను వసూలు (TCS) అంటే ఏమిటి?

జవాబు: ప్రతి ఈ-కామర్స్ నిర్వహణదారు తమద్వారా నెలవారీగా సరఫరా అయ్యే వస్తుసేవలకు ప్రతిఫలాన్ని రాబట్టేట్లయితే అందులోనుంచి "పన్ను విధించదగిన సరఫరాల నికర విలువ"పై 1 శాతం మించకుండా వసూలు చేయాలి. ఇలా సేకరించిన సొమ్మునే "మూలంలో పన్ను వసూలు" (TCS) అంటారు.

ఏయే సమయాల్లో లేదా ఏయే గడువుల ప్రకారం ఈ-కామర్స్ ఆపరేటర్ సదరు డిడక్షన్స్ చేయాల్సి ఉంటుంది.?

అలాంటి డిడక్షన్స్ లేదా పన్ను వసూలు చేయడానికి ఈ దిగువన తెలిపిన దానిలో ఏది ముందు అయితే అది గడువుగా ఉంటుంది.

  1. వాస్తవిక సరుకులు మరియు / లేక సేవల సరపరాదారు ఖాతాకు సొమ్ము జమ అయినప్పుడు,
  2. సరఫరాదారుకు నగదు రూపంలో లేదా మరే ఇతర రూపంలో చెల్లింపు జరిగిన సమయం.

ప్రభుత్వ ఖాతాకు ఈ-కామర్స్ ఆపరేటర్ సదరు టీసీఎస్ మొత్తాన్ని ఎప్పటిలోగా జమచేయాలి. ఇందుకు సంబంధించి ఆపరేటర్ ఏదైనా రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుందా .?

నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 43సీ(3) ప్రకారం సదరు మొత్తం వసూలు చేసిన నెల పూర్తయిన తర్వాత 10 రోజులలో సంబంధిత ప్రభుత్వ ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. అలాగే నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 435(4) ప్రకారం ఆపరేటర్ తన పోర్టల్ ద్వారా జరిపిన బయటి సరఫరాలపై వసూలు చేసిన మొత్తం అన్ని మొత్తాలకు సంబంధించిన స్టేట్ మెంట్ ను ఎలక్ట్రానిక్ రూపంలో సదరు స్టేట్మెంట్ క్యాలెండర్ నెల పూర్తయిన తర్వాత పదిరోజుల లోపల ఫైల్ చేయాల్సి ఉంటింది. వాస్తవిక సరఫరాదారు(ల) పేర్లు, వారు చేసిన సరఫరాల వివరాలు మరియు వారి నుంచి వసూలు చేసిన సొమ్ము వివరాలు అందులో చేర్చాలి. ఇందుకు సంబంధించిన ఫాం మరియు దానిని నింపాల్సిన తీరుతెన్నులు జీఎస్టీ నిబంధనల్లో వివరించడమైంది.

వాస్తవ సరఫరాదారు తరఫున ప్రతి ఈ-కామర్స్ నిర్వహణదారు పన్నువసూలు చేయాలా?

అవును... సరఫరా అయిన వస్తుసేవలపై ప్రతి ఫలాన్ని స్వయంగా రాబట్టే ప్రతి ఈ-కామర్స్ నిర్వహణదారు వాస్తవ సరఫరాదారు తరపున పన్ను వసూలు చేయాలి.

ఈ-కామర్స్ నిర్వహణదారు పన్ను వసూలు చేయాల్సిన సమయం ఏది?

తమద్వారా సాగే సరఫరాలపై ప్రతి నెలవారీగా ఈ-కామర్స్ నిర్వహణదారు పన్ను వసూళ్లు చేయాలి.

ఈ-కామర్స్ నిర్వహణదారు టీసీఎస్ సొమ్మును ఎప్పటిలోగా ప్రభుత్వానికి జమచేయాలి?

ప్రతి నెలలో ఈ-కామర్స్ నిర్వహణదారు వసూలు చేసిన టీసీఎస్ సొమ్మును తదుపరి నెల 10వ తేదీలోగా సంబంధిత ప్రభుత్వ ఖాతాలో జమచేయాలి.

టీసీఎస్ జమను వాస్తవ సరఫరాదారులు తిరిగి పొందటం ఎలా?

ఈ-కామర్స్ నిర్వహణదారు సంబంధిత ప్రభుత్వానికి జమచేసిన టీసీఎస్ మొత్తం వారు సమర్పించే నివేదికలో నమోదైన ప్రకారం నమోదిత వాస్తవ సరఫరాదారు (ఎవరినుంచి వసూలైంది) నగదు పుస్తకంలోనూ ప్రతిఫలించాలి. వాస్తవ సరఫరాదారు ఈ మొత్తాన్ని తన సరఫరాలకు సంబంధించిన పన్నుబాధ్యత నెరవేర్చడంలో వాడుకోవచ్చు.

ఈ-కామర్స్ నిర్వహణదారు నివేదిక సమర్పించాల్సిన అవసరముందా?... అందులో ఉండాల్సిన వివరాలేమిటి?

అవును... ప్రతి ఈ-కామర్స్ నిర్వహణదారు ఎలక్ట్రానిక్ రూపంలో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. తమద్వారా సరఫరా చేసిన వస్తువులు, సేవల వివరాలతోపాటు వాపసు వచ్చిన వస్తుసేవల వివరాలనూ అందులో పొందుపరచాల్సి ఉంటుంది. సదరు నివేదికతోపాటు టీసీఎస్ ద్వారా వసూలు చేసిన పన్ను మొత్తాన్ని సదరు నెలాఖరు తర్వాత 10 రోజుల్లోగా ప్రభుత్వానికి జమచేయాల్సి ఉంటుంది. అలాగే పన్ను వసూలుచేసిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆ ఏడాది డిసెంబరు 31నాడు వార్షిక నివేదికను కూడా ఈ- కామర్స్ నిర్వాహణదారు సమర్పించాల్సి ఉంటుంది.

ఈ-కామర్స్ నిబంధనల్లోని ‘సరిపోల్చడం' అనే భావన ఏమిటి... అది ఎలా అమలవుతుంది?

ఏదైనా ఒక నెలలో తమద్వారా సాగిన సరఫరాలు, మొత్తం వసూళ్ల వివరాలతో ప్రతి ఈ-కామర్స్ నిర్వహణదారు నివేదిక ఇస్తారు. అదే నెలలో వాస్తవ సరఫరాదారు చేసిన సరఫరాలపై సమర్పించే చెల్లుబాటయ్యే రిటర్నులోని వివరాలతో దీన్ని సరిపోలుస్తారు. ఈ-కామర్స్ నిర్వహణదారు ప్రకటించిన సరఫరాలు, వాటిపై వసూలు చేసిన పన్ను వివరాలు వాస్తవ సరఫరాదారు సమర్పించిన వివరాలతో సరిపోలకపోతే రెండు పక్షాలకూ ఆ సమాచారం అందజేస్తారు.

వివరాలు సరిపోలకుండా ఉండిపోతే ఏమవుతుంది?

ఏదైనా చెల్లింపునకు సంబంధించి సరఫరా విలువ సరిపోలనప్పుడు ఆ లోపాన్ని రెండు పక్షాలకు తెలియజేసినప్పటికీ సరఫరాదారు దాన్ని తన చెల్లుబాటయ్యే తదుపరి నెలవారీ రిటర్నులో సరిదిద్దకపోతే వారి రాబోయే నెల చెల్లింపు బాధ్యతలో దాన్ని చేరుస్తారు. అలా అదనంగా కలిసిన మొత్తంపై అదే తేదీనుంచి చెల్లింపు తేదీదాకా వడ్డీతో కలిపి సరఫరాదారు జమ చేయాల్సి ఉంటుంది.

పన్ను అధికారులకు అదనపు అధికారాలేమైనా ఉన్నాయా?

జవాబు: డిప్యూటీ కమిషనర్ హోదాకు తగ్గని అధికారి ఎవరైనా ఈ-కామర్స్ నిర్వహణదారుకు నోటీసు జారీచేయవచ్చు. అది అందిన తేదీనుంచి 15 పని దినాల్లోగా తాను కోరిన నిర్దిష్ట వివరాలను అందజేయాలని అందులో ఆదేశించవచ్చు.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

3.00079051383
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు