పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జాబ్ వర్క్

పన్ను విధించదగిన నమోదిత వ్యక్తికి చెందిన వస్తువుల అభివృద్ధి లేదా ప్రవర్ణన ప్రక్రియ చేపట్టడమే చిరు ఉపాధి పని (జాబ్ వర్క్). అలాంటి పనులు చేసే వ్యక్తినే ‘చిరుద్యోగ శ్రామికుడు' (జాబ్ వర్కర్)గా వ్యవహరిస్తారు.

చిరు ఉపాధి పని (జాబ్ వర్క్) అంటే ఏమిటి?

పన్ను విధించదగిన నమోదిత వ్యక్తికి చెందిన వస్తువుల అభివృద్ధి లేదా ప్రవర్ణన ప్రక్రియ చేపట్టడమే చిరు ఉపాధి పని (జాబ్ వర్క్). అలాంటి పనులు చేసే వ్యక్తినే ‘చిరుద్యోగ శ్రామికుడు' (జాబ్ వర్కర్)గా వ్యవహరిస్తారు. సదరు వస్తువుల యజమానిని ‘ప్రధాన వ్యక్తి’ (ప్రిన్సిపల్)గా పిలుస్తారు. ఈ నిర్వచనం 23 మార్చి 1986 నాటి కేంద్ర ఎక్సైజ్ నోటిఫికేషన్ నం.214/86లో పేర్కొన్నదానికన్నా విస్తృతమైనది. కాగా, 1986 నాటి నోటిఫికేషన్లో చిరు ఉపాధి పని కార్యకలాపాలను తయారీ రంగంతో సమానంగా పరిగణించాలని పేర్కొన్నారు. అందువల్ల ప్రతిపాదిత జీఎస్టీ వ్యవస్థలో చిరు ఉపాధి పనికి సంబంధించిన నిర్వచనం పన్ను విదాన రూపకల్పనలో ప్రాథమిక మార్పును ప్రతిబింబిస్తుంది.

పన్ను విధించదగిన వ్యక్తి చిరుద్యోగ శ్రామికుడికి పంపిన వస్తువులను జీఎస్టీ విధించదగిన సరఫరగా పరిగణించాలా... అయితే ఎందుకు?

సరఫరా’ అంటే అమ్మకం, బదిలీ తదితర రూపాల్లోని సరఫరా గనుక దీన్ని కూడా సరఫరాగానే పరిగణించాలి. అయితే, నమోదిత పన్ను విధించదగిన వ్యక్తి (ప్రధాన వ్యక్తి) ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు నిర్దేశిత షరతులేవైనా ఉంటే వాటికి లోబడి పన్ను చెల్లించకుండానే ఉత్పాదకాలు/మూలధన వస్తువులు లేదా రెండింటినీ సంపూర్ణ వస్తువులుగా రూపుదిద్దడం కోసం చిరుద్యోగ శ్రామికుడికి, అక్కడి నుంచి తదుపరి దశ అభివృద్ధి కోసం మరో చిరుద్యోగ శ్రామికుడు(ల)కు పంపవచ్చు. సదరు ఉత్పాదకాలు/మూలధన వస్తువులు సంపూర్ణ రూపంలోకి వచ్చిన తర్వాత లేదా ఏడాది/మూడేళ్లలోపు వెనక్కు తెచ్చుకోవచ్చు. లేదా ఏడాది/మూడేళ్లలోపు చిరుద్యోగ శ్రామికుల వ్యాపార ప్రాంగణం నుంచి దేశం పరిధిలో అయితే పన్ను చెల్లించి, ఎగుమతుల కోసమైతే పన్ను చెల్లించి లేదా చెల్లించకుండానైనా పంపవచ్చు.

చిరుద్యోగ శ్రామికులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందా?

అవును... చిరు ఉపాధి సేవ కిందికి వస్తుందిగనుక, చిరుద్యోగ శ్రామికుల మొత్తం వార్షిక వ్యాపార పరిమాణం నిర్దేశిత ప్రవేశ పరిమితిని అధిగమించినప్పుడు నమోదు చేసుకోవడం అవసరం.

చిరుద్యోగ శ్రామికుడి ప్రాంగణంలోని తన వస్తువులను ప్రధాన వ్యక్తి అక్కడి నుంచి నేరుగా సరఫరా చేసినప్పుడు వాటిని చిరుద్యోగ శ్రామికుడి మొత్తం వ్యాపార పరిమాణంలో చేర్చాలా?

లేదు. అది ప్రధాన వ్యక్తి మొత్తం వ్యాపార పరిమాణంలోనే చేర్చబడుతుంది. అయితే, తనకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు చిరుద్యోగ శ్రామికుడు వినియోగించిన వస్తువులు లేదా సేవల విలువ అతడు ప్రధాన వ్యక్తికి సరఫరా చేసే వస్తుసేవల విలువలోనే చేర్చబడుతుంది.

ప్రధాన వ్యక్తి ఉత్పాదకాలు, మూలధన వస్తువులను తన ప్రాంగణానికి తరలించకుండా నేరుగా చిరుద్యోగ శ్రామికుడి ప్రాంగణానికి పంపవచ్చా?

పంపవచ్చు. ప్రధాన వ్యక్తికి ఆ వెసులుబాటు ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఉత్పాదకాలు లేదా మూలధన వస్తువులపై చెల్లించిన పన్ను మినహాయింపు (ఐటీసీ)ను కూడా అతడు వినియోగించుకోవచ్చు. సదరు ఉత్పాదకాలు, మూలధన వస్తువులను అతడు ఏడాది/మూడేళ్లలోప) తిరిగి స్వీకరించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సదరు అసలు లావాదేవీయే సరఫరాగా పరిగణించబడి, ప్రధాన వ్యక్తి తదనుగుణంగా పన్ను చెల్లింపునకు బాధ్యుడవుతాడు.

చిరుద్యోగ శ్రామికుడి వద్దనుంచి ప్రధాన వ్యక్తి వస్తువులను తన ప్రాంగణానికి తరలించకుండా నేరుగా సరఫరా చేసే వీలుందా?

ఉంది... అయితే నమోదుకాని చిరుద్యోగ శ్రామికుడి ప్రాంగణాన్ని తన అదనపు వ్యాపార ప్రాంగణంగా ప్రధాన వ్యక్తి ప్రకటించి ఉండాలి. ఒకవేళ చిరుద్యోగ శ్రామికుడు నమోదిత వ్యక్తి అయి ఉంటే, అతడి ప్రాంగణం నుంచి నేరుగా వస్తువులను సరఫరా చేయవచ్చు. ఈ సందర్భంలో చిరు ఉపాధి పని కోసం పంపిన ఉత్పాదకాలు, మూలధన వస్తువులకు సంపూర్ణ రూపం ఏర్పడిన తర్వాత వాటిని చిరుద్యోగ శ్రామికుడి ప్రాంగణం నుంచే నేరుగా సరఫరా చేయవచ్చునని కమిషనర్ ప్రకటించే వీలు కూడా ఉంది.

చిరుద్యోగ శ్రామికుడి ప్రాంగణాన్ని తన అదనపు వ్యాపార ప్రాంగణంగా ప్రధాన వ్యక్తి ప్రకటించకపోయినా ఏ పరిస్థితులలో అక్కడినుంచి నేరుగా వస్తువులను సరఫరా చేయవచ్చు?

రెండురకాల పరిస్థితులలో అలా చేయవచ్చు. చిరుద్యోగ శ్రామికుడు పన్ను విధించదగ్గ వ్యక్తిగా నమోదై ఉన్నట్లయితే అతడి వ్యాపార ప్రాంగణాన్ని ప్రధాన వ్యక్తి తన అదనపు వ్యాపార ప్రాంగణంగా ప్రకటించకపోయినా వస్తువులు నేరుగా సరఫరా చేయవచ్చు. అలాగే సదరు వస్తువులు కమిషనర్ ఇచ్చే నోటిఫికేషన్ పరిధిలోనివై ఉన్నా సరఫరా చేయవచ్చు.

చిరుద్యోగ శ్రామికుడికి పంపిన ఉత్పాదకాలు/మూలధన వస్తువులపై ఐటీసీ పొందడానికిగల నిబంధనలేమిటి?

ఉత్పాదకాలు లేదా మూలధన వస్తువులను ప్రధాన వ్యక్తి తన ప్రాంగణం నుంచి చిరుద్యోగ శ్రామికుడి ప్రాంగణానికి తరలించినా లేక తన ప్రాంగణానికి తరలించకుండా నేరుగా అతడికి పంపినా ఐటీసీని పొందే హక్కుంటుంది. అయితే, సదరు ఉత్పాదకాలు/మూలధన వస్తువులను పంపిన తేదీ తర్వాత ఏడాది/మూడేళ్లలోపు చిరుద్యోగ శ్రామికుడి ప్రాంగణం నుంచి అవి తిరిగి ప్రధాన వ్యక్తి ప్రాంగణానికి చేరడం తప్పనిసరి.

చిరుద్యోగ శ్రామికుడికి ప్రధాన వ్యక్తి పంపిన ఉత్పాదకాలు లేదా మూలధన వస్తువులు నిర్దేశిత వ్యవధిలోగా తిరిగి చేరకపోతే లేదా అతడు వెనక్కు పంపకపోతే ఏమవుతుంది?

చిరుద్యోగ శ్రామికుడికి ప్రధాన వ్యక్తి పంపిన ఉత్పాదకాలు లేదా మూలధన వస్తువులు నిర్దేశిత వ్యవధిలోగా తిరిగి చేరకపోయినా లేదా అతడు వెనక్కు పంపకపోయినా ప్రధాన వ్యక్తి వాటిని అతడి ప్రాంగణానికి నేరుగా సరఫరా చేసినట్లు పరిగణించబడుతుంది. ఆ మేరకు సదరు ఉత్పాదకాలు/మూలధన వస్తువులను పంపిన తేదీన (లేదా చిరుద్యోగ శ్రామికుడు వాటిని నేరుగా అందుకున్న తేదీన) లావాదేవీ చోటుచేసుకున్నట్లు అవుతుంది. తదనుగుణంగా ప్రధాన వ్యక్తి పన్ను చెల్లింపునకు బాధ్యుడవుతాడు.

బిగింపులు, అమరికల వంటి కొన్నిరకాల మూలధన వస్తువులను ఒకసారి వినియోగించాక సాధారణంగా తుక్కుకింద విక్రయించేస్తారు. చిరుద్యోగ ఉపాధి పని నిబంధనల కింద వాటిని ఎలా పరిగణిస్తారు?

మూసలు, అచ్చులు, బిగింపులు, అమరికల వంటి మూలధన వస్తువులకు మూడేళ్ల తర్వాత వెనక్కు తెచ్చే షరతు వర్తించదు.

చిరుద్యోగ ఉపాధి పని సాగే సందర్భంగా వెలువడే వ్యర్థాలు, తుక్కును ఎలా పరిగణిస్తారు?

చిరుద్యోగ శ్రామికుడు నమోదిత వ్యక్తి అయి ఉంటే సదరు వ్యర్థాలు, తుక్కుపై పన్ను చెల్లించి వాటిని తన వ్యాపార ప్రాంగణం నుంచి నేరుగా సరఫరా చేయవచ్చు. నమోదిత వ్యక్తి కానిపక్షలో ప్రధాన వ్యక్తి వాటిపై పన్ను చెల్లించి సరఫరా చేస్తాడు.

మధ్యంతర స్థితిలోని వస్తువులను కూడా చిరుద్యోగ ఉపాధి పనికి పంపవచ్చునా?

పంపవచ్చు. చిరుద్యోగ ఉపాధి పనికి ఉద్దేశించిన 'ఉత్పాదకాలు' అనే పదంలో మధ్యంతర స్థితిలోని వస్తువులు కూడా అంతర్భాగమే. ఉత్పాదకాలపై ప్రధాన వ్యక్తి లేదా చిరుద్యోగ శ్రామికుడు చేపట్టిన ఏదైనా ప్రక్రియ సందర్భంగా అవి మధ్యంతర స్థితికి చేరి ఉండవచ్చు.

చిరుద్యోగ ఉపాధి పని సంబంధిత ఖతాల నిర్వహణ ఎవరి బాధ్యత?

చిరుద్యోగ ఉపాధి పని సంబంధిత ఉత్పాదకాలు, మూలధన వస్తువులకు సంబంధించిన ఖాతాల నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రధాన వ్యక్తిదే.

చిరుద్యోగ ఉపాధి పని సంబంధిత నిబంధనలు అన్నిరకాల వస్తువులకూ వర్తిస్తాయా?

వర్తించవు. పన్ను విధించదగిన నమోదిత వ్యక్తి పన్ను విధించదగిన వస్తువులను పంపేందుకు ఉద్దేశించినపుడు మాత్రమే చిరుద్యోగ ఉపాధి పని సంబంధిత నిబంధనలు వర్తిస్తాయి. మరో మాటలో చెబితే. పన్ను మినహాయింపుగల లేదా పన్ను విధించదగని వస్తువుల విషయంలో లేదా పంపేవారు పన్ను విధించదగిన నమోదిత వ్యక్తి కానప్పుడు ఈ నిబంధనలు వర్తించవు.

చిరుద్యోగ ఉపాధి పని నిబంధనలను ప్రధాన వ్యక్తి తప్పనిసరిగా పాటించాలా?

జవాబు: పాటించనక్కర్లేదు... జీఎస్టీ చెల్లించాక ప్రత్యేక విధానం పాటింపుతో నిమిత్తం లేకుండా ఉత్పాదకాలను లేదా మూలధన వస్తువులను ప్రధాన వ్యక్తి పంపవచ్చు. అటువంటి సందర్భాలలో చిరుద్యోగ శ్రామికుడు ఐటీసీని పొంది, తనవంతు పని ముగించాక జీఎస్టీ చెల్లించి పూర్తయిన వస్తువులను తిరిగి సరఫరా చేయవచ్చు.

ప్రధాన వ్యక్తి, చిరుద్యోగ శ్రామికుడు ఒకే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంవారై ఉండాలా?

అవసరం లేదు... చిరుద్యోగ ఉపాధి పనికి సంబంధించిన నిబంధనలు యూటీజీఎస్టీ చట్టంతోపాటు ఐజీఎస్టీ చట్టంలోనూ అనుసరించబడ్డాయి. అందువల్ల ప్రధాన వ్యక్తి, చిరుద్యోగ శ్రామికుడు ఒకే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం వారై ఉండాల్సిన అవసరం లేదు. వేర్వేరు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు కావచ్చు.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

3.01232394366
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు