పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీఎస్టీ లో ఇన్పుట్ సర్వీస్ డిస్త్రిబ్యుటర్ సూత్రం

ఉత్పాదక సేవల పంపిణీదారు (ISD) అంటే... ఉత్పాదక సేవల స్వీకరణ సంబంధిత పన్ను రసీదులు అందుకునే వస్తువులు/సేవలు లేదా రెండింటి సరఫరాదారు కార్యాలయం.

ఉత్పాదక సేవల పంపిణీదారు (ISD) అంటే ఎవరు?

ఉత్పాదక సేవల పంపిణీదారు (ISD) అంటే... ఉత్పాదక సేవల స్వీకరణ సంబంధిత పన్ను రసీదులు అందుకునే వస్తువులు/సేవలు లేదా రెండింటి సరఫరాదారు కార్యాలయం. సదరు సేవల స్వీకర్తలు ఐఎస్టీ తరహాలో ఒకే పాన్ నంబరుగల పన్ను విధించదగిన వస్తుసేవల సరఫరాదారుకు కేంద్ర, (సీజీఎస్టీ), రాష్ట్ర (ఎస్టీఎస్టీ), కేంద్రపాలిత ప్రాంత (యూటీజీఎస్టీ), సమీకృత (ఐజీఎస్టీ) పన్నుల కింద చెల్లించగా పోగుపడిన పన్నుల జమను పంపిణీ చేసేందుకు అవసరమైన నిర్దేశిత పత్రాన్ని సదరు రసీదుల ఆధారంగా ఈ కార్యాలయం జారీచేస్తుంది.

ఉత్పాదక సేవల పంపిణీదారుగా నమోదుకు అవసరమైనవేమిటి?

వస్తుసేవల సరఫరాదారుగా అప్పటికే నమోదై ఉన్నప్పటికీ ఐఎస్టీ కోసం ప్రత్యేక నమోదు అవసరం. అయితే, ఇందుకు ప్రవేశ పరిమితి నిబంధనేదీ వర్తించదు. ప్రస్తుత వ్యవస్థ (సేవాపన్ను) కింద ఇప్పటికే ఐఎసీగా ఉన్నవారు కొత్తగా రాబోయే జీఎస్టీ వ్యవస్థలో విలీనమయ్యే వీల్లేదు. కాబట్టి వారంతా ఐఎస్టీలుగా కొనసాగదలిస్తే కొత్త పన్నుల వ్యవస్థ కింద తాజాగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

పన్ను జమ పంపిణీ కోసం ఐఎస్టీ జారీచేసే పత్రాలేమిటి?

ఇందుకోసమే ప్రత్యేకంగా రూపొందించిన పత్రం ద్వారా పన్ను జమల పంపిణి జరుగుతుంది. పంపిణీ చేయాల్సిన పన్ను జమల మొత్తం గురించిన వివరాలు ఈ పత్రంలో ఉంటాయి.

సరఫరాదారులందరికీ ఉత్పాదక పన్ను జమ (ఐటీసీ)ను ఒక ఐఎస్టీ పంపిణీ చేయగలరా?

చేయలేరు. వ్యాపార విస్తరణలో భాగంగా ఉత్పాదక సేవలను వినియోగించుకున్న నమోదిత వ్యక్తులకు మాత్రమే సంబంధిత సేవల ఐటీసీని పంపిణీ చేయడం జరుగుతుంది.

ఉత్పాదక సేవలందించే చాలా సందర్భాల్లో వాటి పరిమాణం రీత్యా లేదా వ్యాపార విస్తరణలో భాగంగా సరఫరాదారుకు ముఖాముఖి సంధానం అసాధ్యం...అలాంటప్పుడు ఐఎస్టీద్వారా ఐటీసీ పంపిణి ఎలా జరుగుతుంది?

అటువంటి సందర్భాల్లో ఐటీసీ పంపిణీకి ఓ సూత్రం ఉంది. మొదట... ఉత్పాదక సేవల పంపిణీ వర్తించే ఐటీసీ స్వీకర్తలకు పంపిణీ జరుగుతుంది. రెండోదశలో నిర్వహణ యూనిట్ల మధ్య మాత్రమే పంపిణి జరుగుతుంది. మూడోదశలో ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం ఉత్పాదక సేవా స్వీకర్తల వార్షిక వ్యాపార పరిమాణం నిష్పత్తిలో పంపిణీ చేయబడుతుంది. చివరగా పంపిణీ చేసిన పన్ను జమల మొత్తం, అందుబాటులో ఉన్న జమల మొత్తాన్ని మించరాదు.

ఐఎస్టీకి పూచీగా ఉండాల్సిన వార్షిక వ్యాపార పరిమాణం ఎంత?

రాజ్యాంగంలోని 7 వ షెడ్యూలులో జాబితా-Iలోని 84, జాబితా-IIలోని 51, 54 ఎంట్రీల కింద ఐఎస్టీ కోసం నిర్దేశించిన వ్యాపార పరిమాణంలో ఏ విధమైన సుంకాలు లేదా పన్నుల విధింపు అంతర్భాగంగా ఉండరాదు.

ఐఎస్టీ రిటర్న్ సమర్పించాల్సిన అవసరం ఉందా?

ఉంది... ఐఎస్టీ ప్రతి నెలవారీ రిటర్నును తదుపరి నెల 13వ తేదీలోగా సమర్పించాలి.

ఏదైనా కంపెనీ బహుళ ఐఎస్టీలు కలిగి ఉండవచ్చా?

కలిగి ఉండవచ్చు... మార్కెటింగ్ విభాగం, సెక్యూరిటీ విభాగం తదితరాల కింద వేర్వేరు కార్యాలయాలు కలిగి ఉంటే, వేర్వేరు ఐఎస్టీల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఎస్టీ అదనంగా/పొరపాటుగా పంపిణీ చేసిన జమలను రాబట్టేందుకుగల నిబంధనలేమిటి?

అదనంగా/పొరపాటుగా పంపిణీ అయిన జమలను సెక్షన్ 73 లేదా 74 కింద చర్యలు చేపట్టడంద్వారా స్వీకర్తలనుంచి రాబట్టవచ్చు.

సీజీఎస్టీ, ఐజీఎస్టీల కింద పన్ను జమను ఐజీఎస్టీ జమగా వివిధ రాష్ట్రాల్లోని స్వీకర్తలకు ఐఎస్టీ పంపిణీ చేయొచ్చా?

చేయవచ్చు... వేర్వేరు రాపాలోని స్వీకర్తలకు సీజీఎసీ జమను ఐజీఎసీ జమకింద, ఐజీఎస్టీ జమను సీజీఎస్టీ జమకింద ఐఎస్టీ పంపిణీ చేయవచ్చు.

ఎస్టీఎస్టీ/యూటీజీఎస్టీల కింద పన్ను జమను ఐజీఎస్టీ జమగా వివిధ రాష్ట్రాల్లోని స్వీకర్తలకు ఐఎస్టీ పంపిణీ చేయొచ్చా?

చేయవచ్చు... వేర్వేరు రాష్ట్రాల్లోని స్వీకర్తలకు ఎస్టీఎస్టీ/యూటీజీఎస్టీ జమను ఐజీఎస్టీ జమకింద ఐఎస్టీ పంపిణీ చేయవచ్చు.

సీజీఎస్టీ, ఐజీఎస్టీ జమలను సీజీఎస్టీ కింద ఐఎస్టీ పంపిణీ చేయొచ్చా?

చేయవచ్చు.... సీజీఎస్టీ, ఐజీఎస్టీ జమను అదే రాష్ట్రంలోని స్వీకర్తలకు సీజీఎస్టీ జమకింద ఐఎస్టీ పంపిణీ చేయవచ్చు.

ఎస్టీఎస్టీ/యూటీజీఎస్టీ, ఐజీఎస్టీల జమలను ఎస్టీఎస్టీ, యూటీజీఎస్టీ జమల కింద ఐఎస్టీ పంపిణీ చేయొచ్చా?

చేయవచ్చు... ఎస్టీఎస్టీ, ఐజీఎస్టీ జమలను ఎస్టీఎస్టీ/యూటీజీఎస్టీ జమల కింద అదే రాష్ట్రంలోని స్వీకర్తలకు ఐఎస్తే పంపిణీ చేయవచ్చు.

ఒక ఐఎస్టీ పరిధిలోని స్వీకర్తలందరికీ ఉమ్మడి జమను పంపిణీ చేయడం ఎలా?

ఉమ్మడి జమను వినియోగించుకునే స్వీకర్తలకు దామాషా పద్దతిలో ఐఎస్టీ పంపిణీ చేయవచ్చు. అంటే... అందరి మొత్తం వ్యాపార పరిమాణంలో ప్రతి స్వీకర్త వ్యాపార పరిమాణ నిష్పత్తి ప్రకారం ఇది జరగాలి.

సీజీఎస్టీ, ఐజీఎస్టీ జమలను ఇతర రాష్ట్రంలోని స్వీకర్తకు ఐఎస్టీ ఇలా పంపిణీ చేయవచ్చు... (ఎ) ఐజీఎస్టీ కింద (బి) సీజీఎస్టీ కింద (సి) ఎస్టీఎస్టీ కింద...

(ఎ) ఐజీఎస్టీ కింద పంపిణీ చేయవచ్చు.

సీజీఎస్టీ జమను అదే రాష్ట్రంలో ఐఎస్టీ ఇలా పంపిణీ చేయవచ్చు... (ఎ) ఐజీఎస్టీ కింద (బి) సీజీఎస్టీ కింద (సి) ఎస్టీఎస్టీ కింద (డి) పైవాటిలో దేనికిందనైనా...

(బి) సీజీఎస్టీ కింద పంపిణీ చేయవచ్చు.

ఉత్పాదక సేవపై చెల్లించిన పన్ను జమను ఒకరికన్నా ఎక్కువ సరఫరాదారులు వినియోగించుకునేట్లయితే... (ఎ) సదరు ఉత్పాదక సేవను వినియోగించుకున్న వారందరికీ ఆ రాష్ట్రంలో వ్యాపార పరిమాణ దామాషా ప్రకారం పంపిణీ అవుతుంది; (బి) సరఫరాదారులందరికీ సమానంగా పంపిణీ అవుతుంది; (సి) ఒక సరఫరాదారుకే పంపిణీ అవుతుంది; (డి) పంపిణీ చేసే వీల్లేదు.

(ఎ) సదరు ఉత్పాదక సేవను వినియోగించుకున్న వారందరికీ ఆ రాష్ట్రంలో వ్యాపార పరిమాణ దామాషా ప్రకారం పంపిణీ అవుతుంది.

అదనంగా పంపిణీ చేసిన పన్ను జమను పన్నుల విభాగం ఐఎస్టీ నుంచి రాబటగలదా?

రాబట్టజాలదు... అదనపు పంపిణీ జరిగినట్లయితే స్వీకర్తనుంచి వడ్డీతో రాబట్టే వీలుందిగానీ, ఐఎస్టీనుంచి కాదు... ఇలా రాబట్టడం కోసం చేపట్టే చర్యలకు సెక్షన్ 73 లేదా 74 వర్తిస్తాయి.

చట్టాన్ని ఉల్లంఘించి జమను పంపిణీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?

చట్ట నిబంధనలకు విరుద్దంగా పన్ను జమలను పంపిణి చేస్తే, సదరు మొత్తాన్ని వడ్డీసహా స్వీకర్తల నుంచి రాబట్టుకోవచ్చు.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

3.00892857143
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు