పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జీఎస్టీలో పునర్విచారణలు, సమీక్ష – సవరణ

జీఎస్టీలో పునర్విచారణలు, సమీక్ష – సవరణ

ఏదైనా ఆదేశం లేదా నిర్ణయం తనకు వ్యతిరేకంగా జారీ అయిన పక్షంలో బాధిత వ్యక్తికి పునర్విచారణ కోరే హక్కు ఉందా?

ఉంది. ఏదైనా ఆదేశం లేదా నిర్ణయం తనకు వ్యతిరేకంగా జారీ అయినట్లు భావించిన పక్షంలో బాధిత వ్యక్తికి పునర్విచారణ కోరే హక్కుంది. అయితే, సదరు ఆదేశం "న్యాయ నిర్ణయాధికార స్థానం" (adjudicating authority) జారి చేసినదై ఉండాలి. అయితే, కొన్ని నిర్ణయాలు - ఆదేశాలపై (సెక్షన్ 93లో పేర్కొన్నవి) మాత్రం పునర్విచారణ కోరే వీలు లేదు.

ఏదైనా ఆదేశం చట్టబద్ధమైది, సరైనది కాదని కేంద్ర వస్తుసేవల పన్ను (CGST) కమిషనర్ భావిస్తే తనంతటతాను దాన్ని సవరించగల వీలుందా?

లేదు. కేంద్ర వస్తుసేవల పన్ను (CGST) కమిషనర్ సదరు ఆదేశాన్ని సవరించజాలరు. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట వస్తుసేవల పన్ను (SGST) నమూనా చట్టంలో భిన్నమైన నిబంధనలున్నాయి. సీజీఎస్టీ విషయంలో సెకన్ 79 (2) ప్రకారం... ఏదైనా ఆదేశం (న్యాయ నిర్ణయాధికార స్థానం జారీచేసినది) చట్టబద్దమైది, సరైనది కాదని సీజీఎస్టీ కమిషనర్ భావిస్తే అందులో పునర్నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలను నిర్ధారిస్తూ, వాటిపై ప్రధమ పునర్విచారణ స్థానం (ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ-FAA)లో అభ్యర్ధన దాఖలు చేయాల్సిందిగా తన కిందిస్థాయి జీఎస్టీ అధికారికి ఆదేశాలు జారీ చేయవచ్చు. అటువంటి అభ్యర్థనను పునర్విచారణ అభ్యర్ధనగా ఎఫ్ఎఎ పరిగణించవచ్చు.

ఎఫ్ఎఎ సమక్షంలో అభ్యర్థనను ఎంత కాలంలోగా దాఖలు చేయాలి?

ఆదేశం లేదా నిర్ణయం తెలియజేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిని అభ్యర్ధన దాఖలుకు కాలపరిమితిగా నిర్ణయించారు.

సీజీఎస్టీ కమిషనర్ ఆదేశాల తర్వాత శాఖాపరంగా పునర్విచారణ అభ్యర్థన/దరఖాస్తు దాఖలుకు కూడా ఈ కాలపరిమితి వర్తిస్తుందా?

అవును. అటువంటి దరఖాస్తులను పునర్విచారణ అభ్యర్ధనగా పరిగణించాలి గనుక కాలపరిమితితోపాటు పునర్విచారణ సంబంధిత నిబంధనలన్నీ కూడా సదరు అభ్యర్థనకు వర్తిస్తాయి.

అభ్యర్ధన దాఖలు లోఆలస్యాన్ని మన్నించే అధికారం పునర్విచారణ స్థానాని (ఎఫ్ఎఎ)కి ఉందా?

ఉంది. నిర్దేశిత 3 నెలల పరిమితి ముగిసిన రోజు నుంచి అభ్యర్ధన దాఖలు కు ఒక నెల ఆలస్యాన్ని సదరు స్థానంలోని అధికారి (3+1) మన్నించవచ్చు. అయితే, సెక్షన్ 79 (4) నిబంధన నిర్దేశిస్తున్న మేరకు ఆలస్యానికి 'తగిన కారణం' ఉండాలి.

పునర్విచారణ అభ్యర్థన దాఖలు నిర్దేశక పత్రంలో పేర్కొన్నవి కాకుండా అదనపు విచారణాంశాలను అనుమతించే అధికారం (ఎఫ్ఎఎ)కి ఉందా?

ఉంది. సదరు విచారణాంశాలు ఉద్దేశపూర్వకంగా విస్మరించినవి లేదా అహేతుకమైనవి కావని సంతృప్తి చెందితే ఎఫ్ఏఏగా వ్యవహరించేవారికి వాటిని అనుమతించే అధికారం ఉంటుంది.

ప్రథమ పునర్విచారణ స్థానం తాను జారీచేసే ఆదేశం గురించి ఎవరికి తెలియజేయాల్సి ఉంటుంది?

ప్రథమ పునర్విచారణ స్థానం తన ఆదేశం నకలును అభ్యర్థనదారుకు, న్యాయ నిర్ణయాధికార స్థానంతోపాటు సంబంధిత అధికారపరిధిగల సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కమిషనర్లకు అందజేయాలి.

ప్రతి పునర్విచారణ అభ్యర్థనతోపాటు తప్పనిసరి ధరావతు (ముందస్తు చెల్లింపు) మొత్తం ఎంత?

వివాదంలోని మొత్తంలో 1O శాతం (అయితే, ఎస్జీఎస్టీకి సంబంధించి అదనపు నిబంధనలున్నాయి. వీటికోసం నమూనా చట్టాన్ని పరిశీలించవచ్చు... 12, 13 ప్రశ్నలు చూడండి).

వివాదంలోగల మొత్తమంటే ఏమిటి?

జవాబు: ఎంజీఎల్ సెక్షన్ 79(6)లోని వివరణ ప్రకారం "వివాదంలోని మొత్తం"అంటే:-

 1. సెక్షన్ 46 లేదా 47 లేదా 48 లేదా 51 క్రింద నిర్ధారించిన మొత్తం;
 2. జీఎస్టీ జమ (Credit) నిబంధన 201 ప్రకారం చెల్లించాల్సిన మొత్తం; అలాగే
 3. విధించిన రుసుము లేదా జరిమానా మొత్తం.

వాస్తవ అధికారి ఆదేశాలలో నిర్దేశించిన సుంకం/అపరాధ రుసుము/జరిమానాను పెంచుతూ/ వాపసు/ఐటీసీ మొత్తాన్ని తగ్గిస్తూ పునర్విచారణ సందర్భంగా ఎఫ్ఎఎ ఆదేశాలు జారీచేయవచ్చా?

జప్తు లేదా వాపసు మొత్తం/ఐటీసీ తగ్గింపునకు బదులుగా సుంకం/అపరాధ రుసుము/జరిమానాను పెంచుతూ ఆదేశం జారీచేసే అధికారం ఎఫ్ఎఎకి ఉంది. అయితే, తనపై ప్రతిపాదిత నష్టదాయక ఆదేశాలమీద సంజాయిషీ ఇచ్చుకునేందుకు అభ్యర్థనదారుకు తగిన అవకాశం ఇచ్చి ఉండాలి (సెక్షన్ 79(10)లోని తొలి నిబంధన). ఇక సుంకం పెంపు లేదా ఐటీసీని తప్పుగా వినియోగించుకున్నట్లు నిర్ణయించటానికి సంబంధించి సదరు ఆదేశాలకు ముందు అభ్యర్థనదారుకు తగిన సంజాయిషీ నోటీసు జారీచేసిన తర్వాత మాత్రమే ఎఫ్ఎఎకి ఆ అధికారం ఉంటుంది. అంతేగాక సదరు ఆదేశాలను సెక్షన్ 51కింద నిర్దేశించిన కాలపరిమితిలోపు జారీచేయాలి (సెక్షన్ 79(1O)లోని రెండో నిబంధన).

రాష్ట జీఎస్టీ (SGST) కింద ప్రథమ పునర్విచారణ స్థానం ఎదుట అభ్యర్ధన చట్టానికి పరిమితమైన) ధరావతు (ముందస్తు చెల్లింపు) కు సంబంధించిన నిబంధన ఏమిటి?

అభ్యర్ధన దాఖలుకు ముందు వివాదంలోని మొత్తంలో 10 శాతం ముందుగా జమ చేయాలి. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీలు రెండింటికీ ఇందులో మార్పేమీ ఉండదు. అయితే, ఎస్జీఎస్టీ విషయంలో మాత్రం ఈ 10 శాతానికి అదనంగా "అభ్యర్థనదారు అంగీకరించిన మేరకు తాను సవాలు చేసే ఆదేశంలో పేర్కొన్న పన్ను, వడ్డీ, అపరాధ రుసుము, సుంకం, జరిమానా వంటివి పూర్తిగా చెల్లించాలి." అంతేకాకుండా ఎస్టీఎస్టీ కమిషనర్ ఏ కేసునైనా "తీవ్రమైనది"గా పరిగణిస్తే ధరావతును వివాద మొత్తంలో 50 శాతానికి మించకుండా నిర్ణయించాలని శాఖాపరమైన అధికార స్థానం ప్రధమ పునర్విచారణ స్థానానికి దరఖాస్తు చేయవచ్చు.

“తీవ్రమైన కేసు" అంటే అర్థమేమిటి? (ఎస్జిఎస్టీ చట్టానికే ఇది పరిమితం)

వివాద పన్ను బాధ్యత రూ.25కోట్లకు తక్కువకానిదైనప్పుడు, అలాగే సదరు పన్ను చెల్లింపుదారుపై ఇది నిరూపించదగినదిగా తమశాఖ భావిస్తున్నట్లు ఎస్జీఎస్టీ కమిషనర్ అభిప్రాయం (అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదుచేయాలి) వ్యక్తం చేస్తున్నప్పుడు దాన్ని "తీవ్రమైన కేసు"గా నిర్వచించవచ్చు.

ఎస్జీఎస్టీ చట్టం కింద తన దిగువస్థాయి అధికారులిచ్చిన ఆదేశాన్ని కమిషనర్ సవరించగలరా?

సవరించగలరు. ఎస్జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 80(1) అందుకు అధికారం ఇస్తోంది. తన దిగువస్థాయి అధికారులు జారీచేసిన ఆదేశాన్ని తన పరిశీలనకు కోరి, తనిఖీ చేయవచ్చు. సదరు ఆదేశం లోటుపాట్లతో కూడినదని, వసూళ్లకు నష్టం కలిగించేదిగా ఉందని భావిస్తే వివరణ ఇవ్వడం కోసం నోటీసుదారుకు తగిన అవకాశమిచ్చి ఆ తర్వాత సవరించవచ్చు.

సదరు సవరణ ప్రక్రియ కొనసాగుతుండగానే తన దిగువస్థాయి అధికారులు ఇచ్చిన ఆదేశాల అమలు నిలిపివేతకు ఎస్టీఎస్టీ కమిషనర్ ఆదేశించవచ్చా?

ఆదేశించవచ్చు.

దిగువస్థాయి అధికారుల ఆదేశాల సవరణలో కమిషనర్ అధికారాలకు అడ్డుకట్టవేసే అవరోధాలు ఏవైనా ఉన్నాయా?

ఉన్నాయి... ఏ ఆదేశాన్నయినా కమిషనర్ ఏయే సందర్భాల్లో సవరించరాదంటే:-

 1. సదరు ఆదేశంపై సెక్షన్ 79 లేదా సెక్షన్ 82 లేదా సెక్షన్ 87 లేదా సెక్షన్ 88ల కింద పునర్విచారణ కోరే అవకాశం ఉన్నప్పుడు; లేదా
 2. సదరు ఆదేశం లేదా నిర్ణయం జారీ చేసి, మూడేళ్లు దాటిపోయాక సవరణ కోరినప్పుడు.

ఈ అవరోధాలతోపాటు మరికొన్ని "సంకెళ్ల వివరాల కోసం MGLలోని సెక్షస్ 80ని దయచేసి పరిశీలించండి.

ఏయే సందర్భాల్లో పునర్విచారణ అభ్యర్థనను స్వీకరించ తిరస్కరించే అధికారాలు ధర్మాసనాని (Tribunal)కి ఉంటాయి?

పునర్విచారణ అభ్యర్ధనలో కింది అంశాలు భాగంగా ఉన్నపుడు.

 • పన్ను మొత్తం లేదా
 • ఉత్పాదకాల కొనుగోళ్ల పన్ను మినహాయింపు లేదా
 • పన్ను మొత్తంలో వ్యత్యాసం లేదా
 • ఉత్పాదకాల కొనుగోళ్ల పన్ను మినహాయింపు మొత్తంలో వ్యత్యాసం లేదా
 • అపరాధ రుసుం మొత్తం లేదా
 • రుసుము మొత్తం లేదా రూ.1,00,000కన్నా తక్కువ మొత్తం జరిమానా చెల్లింపు ఆదేశం జారీచేసినప్పుడు.... సదరు పునర్విచారణ అభ్యర్థనను స్వీకరించ నిరాకరించే విచక్షణాధికారం ధర్మాసనానికి ఉంటుంది (ఎంజీఎల్లోని సెక్షన్ 82(2)ను చూడండి).

ధర్మాసనం ఎదుట పునర్విచారణ అభ్యర్ధన దాఖలుకు కాలపరిమితి ఎంత?

ఆదేశాలు అందిన తేదీ నుంచి దానిపై అభ్యర్ధన దాఖలుదాకా మూడు నెలలు కాలం

పునర్విచారణకు అభ్యర్ధన దాఖలుకోసం 3 నెలల కాలపరిమితి దాటితే ఆలస్యాన్ని మన్నించే అధికారం ధర్మాసనానికి ఉందా? ఉన్నట్లయితే ఆ పరిమితి ఎంత?

జవాబు: ఉంది.... మూడు నెలల పరిమితి దాటిన తర్వాత అభ్యర్థనదారు తగిన కారణం చూపితే ఎంత ఆలస్యమైనా మన్నించే అధికారం ధర్మాసనానికి ఉంటుంది.

ధర్మాసనం ఎదుట అభ్యర్థనదారు తన అభ్యంతర పత్రందాఖలుకు నిర్దేశించిన కాలపరిమితి ఎంత?

పునర్విచారణ అభ్యర్ధన దాఖలు చేసిన తేదీనుంచి 45 రోజులు.

సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ల కింద ధర్మాసనం ఎదుట పునర్విచారణ అభ్యర్ధనల దాఖలు నిబంధనలలో వ్యత్యాసాలేమిటి?

 1. ఆదేశం లేదా నిర్ణయం వల్ల బాధితుడైన వ్యక్తి ఎఫ్ఎఎ ఎదుట పునర్విచారణ అభ్యర్ధన దాఖలుకు సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 82 కిందగల నిబంధనలే యధాతథంగా ఎస్జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 82 కింద కూడా ఉంటాయి. చర్చల సందర్భంగా ఈ మేరకు సమానంగా వర్తించేలా నిర్ణయించారు.
 2. పైన పేర్కొన్న నిబంధనకు అదనంగా కమిషనర్ జారీచేసిన సవరణ ఆదేశాలపై పునర్విచారణ ధర్మాసనంలో అభ్యర్ధన దాఖలు అంశానికి కూడా ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 82 వర్తిస్తుంది.
 3. అయితే, ఎఫ్ఎఎ జారీచేసిన ఆదేశాలపై రెవెన్యూ విభాగం పునర్విచారణ అభ్యర్ధన దాఖలుకు సంబంధించిన నిబంధనలు సీజీఎస్టీ చట్టంలో ఉన్నా వాటిని ఎస్జీఎస్టీ చట్టంలో పొందుపరచలేదు.
 4. సవరణ అదికారాలను ఎస్జీఎస్టీ కమిషనర్ (రాష్ట్రాల్లో ఎఫ్ఎఎగా వ్యవహరించేవారు కమిషనరుకు దిగువస్థాయి అధికారి కావచ్చుగనుక)కు కల్పించడమే ఇందుకు కారణం.
 5. దీంతోపాటు బాధిత వ్యక్తి ఎస్జీఎస్టీ ప్రకారం తనకు వ్యతిరేకంగా జారీ అయిన ఆదేశాలకు అనుగుణంగా తాను అంగీకరించిన మేర పన్ను, వడ్డీ, అపరాధ రుసుము, సుంకం, జరిమానాలను పూర్తిస్థాయిలో ముందస్తుగా జమ చేయాల్సి ఉంటుంది.

ధరావతుగా జమచేసిన సొమ్ము వాపసు సందర్భంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుందా?

అవును... అభ్యర్థనదారు సెక్షన్ 79లోని ఉప సెక్షన్ (6)(4) లేదా సెక్షన్ 82లోని ఉప సెక్షన్ (10)/(7) కింద జమచేసిన మొత్తాన్ని ఎఫ్ఎఎ లేదా పునర్విచారణ ధర్మాసనం ఆదేశాల మేరకు వాపసు చేసే సందర్భంలో ఎంజీఎల్లోని సెక్షన్ 85 ప్రకారం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 39 కింద నిర్దేశిస్తున్న వడ్డీ శాతం ప్రకారం అభ్యర్థనదారు నొమ్ము జమచేసిన నాటినుంచి దాన్ని వాపసు చేసే తేదీదాకా లెక్కగట్టి చెల్లించాలి.

ధర్మాసనం ఆదేశాలపై పునర్విచారణార్హతగల వేదిక ఏది?

హైకోర్టు... కానీ, సదరు అభ్యర్థనలో సెక్షన్ 87(1) కింద చట్టపరమైన ప్రశ్న తలెత్తినట్లు హైకోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అయితే, ధర్మాసనం జారీచేసిన ఆదేశంలోని అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో సదరు లావాదేవీలపై రెండు లేదా అంతకన్న ఎక్కువ రాష్ట్రాలు లేదా ఓ రాష్ట్రం-కేంద్రం మధ్య భిన్నాభిప్రాయాలున్నపుడు; సరఫరా ప్రదేశానికి సంబంధించి రాష్టాంతర్గత లేదా రాష్టాంతర; లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు లేదా ఒక రాష్ట్రం- కేంద్రం మధ్య అభిప్రాయభేదాలు ఉన్నపుడు ధర్మాసనం ఆదేశాలపై పునర్విచారణ అభ్యర్ధన దాఖలు వేదిక సుప్రీం కోర్ట్ అవుతుంది తప్ప హైకోర్టు పరిధిలో ఉండదు.

హైకోర్టులో పునర్విచారణ అభ్యర్ధన దాఖలుకు కాలపరిమితి ఎంత?

ఆదేశాలు అందుకున్నతేదీనుంచి అభ్యర్థన దాఖలు తేదీనాటికి 18O రోజులు. అయితే, తగిన కారణం చూపగలిగితే అంతకన్నా ఎక్కువ ఆలస్యమైనా మన్నించే అధికారం హైకోర్టుకుంది.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

3.02489626556
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు