హోమ్ / సామాజిక సంక్షేమం / ఆర్థిక అక్షరాస్యత / ఆర్ధిక సంబంధ ప్రాధమిక అవగాహన
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆర్ధిక సంబంధ ప్రాధమిక అవగాహన

ఆర్ధిక సంబంధ ప్రాధమిక అవగాహన. గత తరంతో పోల్చి చూస్తే ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ యొక్క విధి విధానాలు కొంచెం క్లిష్ట భూయిష్టంగా ఉన్నాయి.

ఆర్ధిక సంబంధమైన అవగాహన - ఆర్థిక అక్షరాస్యత - భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నగేట్ వే అందించే విధి విధానాలు

గత తరంతో పోల్చి చూస్తే ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ యొక్క విధి విధానాలు కొంచెం క్లిష్ట భూయిష్టంగా ఉన్నాయి. 40 ఏళ్లకిందట స్థానిక బ్యాంకులు లేక పొదుపు సంస్థలలో తెరిచే పొదుపు ఖాతాలు, చెక్కుల నిర్వహణ విషయాలు తెలుసు కుంటే సరిపోయేది. ప్రస్తుతం బ్యాంకులు తదితర ఆర్ధిక సంస్థలు విస్తృతంగాఅందించే ఆర్ధిక సేవలు, ఉత్పత్తులను గురించి ముఖ్యంగా గ్రామీణ పౌరులు పూర్తిగా తెలుసుకుని వాటిలో గల భేదాలు, మార్పులను గమనించవలసిన అవసరమేర్పడింది. గతంలో ఆ తరం వారు తాము పొందిన ఋణాలు, వాటిపై వసూలు చేసే చక్రవడ్డీల, ఋణాల ఖాతాలలో జరిగే అవకతవకల గురించి నిర్ధిష్టమైన అవగాహన కలిగి ఉండవలసిన అవసరమేర్పడలేదు.

వినియోగదారులలో ఆర్ధికపరమైన అవగాహన కల్పించవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఆ అవగాహనను వారికి ఎలా కల్పించాలన్నదే ముఖ్యం. ఇది ఒక్క మదుపరులకు మాత్రమే అతి ముఖ్యమైన అంశం కాదు. ప్రతి ఒక్క సగటు కుటుంబంలో తల్లిదండ్రులు తమ పదవీ విరమణ, పిల్లల విద్యాభ్యాసం కోసం పాటించవలసిన పొదుపు జాగ్రత్తలు, తమ ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకోవడం తప్పనిసరి. వినియోగదారులకు వివిధ స్థాయిలలో తమ జీవితంలో ఆర్ధికపరమైన అవగాహన పొంద వలసిన అవసరమేర్పడింది. వారి కొరకు అనేక పథకాలు ప్రారంభింపబడి ఆయా అవసరాలను తీర్చడానికి నిర్దేశించబడ్డాయి.

ఇండియాడెవలప్ మెంట్ గేట్ వే ప్రాజెక్ట్ (భారత ప్రగతి ద్వారం పథకం ) కూడా ఆర్ధికావగాహన, ఆర్థిక అక్షరాస్యత కల్పించే ప్రణాళికను రూపొందించి, ఆ వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచి వివిధ ప్రసార, ప్రచార సాధనాల (మల్టీమీడియా సిడి రామ్ ) ద్వారా అందిస్తోంది.

భారత దేశం యొక్క కొత్త రూపాయి చిహ్నం - కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించిన బారతీయ రూపాయి చిహ్నం

(కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన భారత దేశం యొక్క కొత్త రూపాయి చిహ్నం . భారతీయ రూపాయి తన యొక్క స్వంత చిహ్నం కల్గి ఉంది. దేవ నాగరి లిపిలో ‘ ఆర్ ‘ కలిపిన ఈ చిహ్నం ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు కల్గిన ద్ర వ్యాల్లో (కరెన్సీ- currency) ఐదవ స్థానంలో ఉంది. భారత దేశం యొక్క ఈ కొత్త రూపాయి చిహ్నం లేదా భారతీయ రూపాయి చిహ్నం ఐఐటి లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డి. ఉదయ్ కుమార్ రూపొందించగా 2010 వ సంవత్సరం జూలై 15 వతేదీ అంటే ఈ రోజు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. )ఈ రూపాయి ప్రపంచంలోని శ్రేష్టమైన దేశాల ద్రవ్యాలలో (కరెన్సీ) స్వంత చిహ్నం గల ఒక ద్రవ్యంగా యుఎస్ డాలర్, బ్రిటీష్ పౌండ్ – స్టేర్లింగ్, యూరో , జపానీయుల ఎన్ కోవలోకి చేరింది.

ఈ చిహ్నం త్వరలో కరెన్సీ నోట్లపైన ముద్రించబడుతుంది. అలాగే నాణేల పైన పొదగబడుతుంది(embossed).కరెన్సీ చిహ్నం కోసం నిర్వహించిన ఐఐటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డి. ఉదయ్ కుమార్ రూపొందించిన చిహ్నం ఎంపిక చేయబడింది. ఇందుకు అతడు 2.5 లక్షల రూపాయలను పురస్కారంగా అందుకో బోతున్నాడు.

దేశ వ్యాప్తంగా ఆరు నెలలలోపు ప్రపంచ వ్యాప్తంగా 18 నుంచి 24 నెలలలోపు కేంద్ర ప్రభుత్వం భారత దేశంయొక్క కొత్త రూపాయి చిహ్నాన్ని లేదా భారతీయ రూపాయి చిహ్నాన్ని అమలులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కంప్యూటర్ కీ బోర్డు పైన మరియు సాఫ్ట్ వేర్ పైన ఈ చిహ్నాన్ని పొందుపరుస్తారు. ఈ విధంగా కంప్యూటర్ ( ఎలక్ట్రానిక) పైన ప్రదర్శిస్తూ ముద్రించడం కూడా చేపట్టవచ్చు. ఈ విధానం వలన భారత దేశం యొక్క చెలామణిలో ఉన్న ద్రవ్యం ( భారత దేశం రూపాయి) పాకిస్థాన్, నేపాల్ , శ్రీలంక , ఇండోనేషియా దేశాల రూపాయికి ఉన్న భేదం తెలుసుకునే వీలుంది.

గత సంవత్సరం భారత దేశంయొక్క రూపాయికి చిహ్నాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్ర మరియు సంస్కృతిని ప్రతిబింబించేలాగా రూపాయి చిహ్నాన్ని రూపొందించాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ భావించింది. ఆ కారణంగా ప్రజల నుంచి దరఖాస్తులను పోటీ కోసం ఆహ్వానించింది.

మీ యొక్క కంప్యూటర్ లో రూపాయి చిహ్నం పొందండి.

రూపాయి ద్రవ్య చిహ్నం భారత ప్రభుత్వం 15 జూన్ 2010 వతేదీన ఆమోదించింది. అందువలన ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ చిహ్నాన్ని ఉపయోగించే అవసరం తెలుసుకోవాలి. ఈ రూపాయి చిహ్నాన్ని మీ యొక్క మైక్రో సాఫ్ట్ వర్డ్ లో ఏ విధంగా ఉపయోగించాలో ఈ కింద వివరించడం జరిగింది.

ఎమ్.ఎస్(MS Word) వర్డ్ లో రూపాయి చిహ్నం

  1. జత పరచిన రూపాయి టిటిఎఫ్ ఫాంట్ ను దయ చేసి గమనించండి.
  2. C: Windows Font Folder(సి: విండోస్ ఫాంట్ ఫోల్డర్) లోకి రూపాయి ఫాంట్ ను Rupee:ttfను కాపీ చేసి పొందుపరచండి.
  3. ఎమ్ ఎస్ వర్డ్ (MS Wordను open చేయండి) ను తెరవండిి
  4. 1.ఎమ్ ఎస్ వర్డ్ యొక్క ఫాంట్ లిస్ట్ (జాబితా)నుండి ‘Rupee Foradian’(రుపీ ఫోరాడియన్ ) అనే ఫాంట్ ను సెలక్ట్ (ఎన్నుకోండి) చేయండి.
  5. 1.Rs చిహ్నాన్ని మీ యొక్క కీ బోర్డ్ లోని టిల్డా(tilde) కీ దగ్గర క్లిక్ చేయండిి

వారికి ఒక్క రూపాయితో బ్యాంకు ఖాతా ఒక వరంగా మారింది

ఒక రూపాయి ఖాతా దారు పథకం కింద హైదరాబాదు లోని నింబోలి గడ్డ ప్రాంతంలోని మురికివాడ నివాసికి భారతీయ స్టేట్ బ్యాంకు(SBI)  గుర్తింపు కార్డును అందజేసింది. ఆ గుర్తింపు కార్డు కలిగిన ఆమెను ఫొటోలో చూడవచ్చు.
కర్రి జగ్గియమ్మను ఇప్పుడు ఒక తెలివైన( జాగ్రత్త గల)వ్యక్తిగా చెప్పవచ్చు. 56 యేళ్ళు పూర్తయినా ఒక పైసా పొదుపు చేయని కాచిగూడలోని నింబోలి అడ్డ ప్రాంతానికి చెందిన ఈ చిన్న అమ్మకముదారు భారతీయ స్టేట్ బ్యాంకు(SBI) తో వ్యాపార లావాదేవీలు చేయడం ప్రారంభించింది. బ్యాంకు వారు మొట్ట మొదటిసారిగా ప్రారంభించిన ఈ పథకంలో పట్టణ ప్రాంతాలను చేర్చినందుకు బ్యాంకు యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పాలి.

దేశంలోనే మొట్టమొదటిసారిగా భారతీయ స్టేట్ బ్యాంకు , హైదరాబాదు మంగళవారం ప్రారంభించిన భారతీయ స్టేట్ బ్యాంకు 20 ‘ ఒక రూపాయి బ్యాంకు’ చిన్న దుకాణాలు( బడ్డీ కొట్ల – kiosks)ఖాతాలలో ఒక రూపాయిని మాత్రమే డిపాజిట్ గా చెల్లించి ఆమె ఖాతా తెరిచింది. ఈ బడ్డీ కొట్టు లేదా వినియోగదారు సేవాకేంద్రం (point) బ్యాంకు యొక్క ఇసామియా బజారు శాఖలో తాను వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునే ఒక కేంద్రం అయ్యింది.
సరళీకృత బ్యాంకింగ్ విధానాల వల్ల పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గాలు, ఈ పరిమితులు( డిపాజిట్లకు అవసరమైన సొమ్ము) లేని ఖాతాలు ఈ బడ్డీ దుకాణాల వాళ్ళు తెరుచుకోగల్గుతున్నారు. అంతేగాక అట్టడుగు వర్గాల మహిళలు తాము బ్యాంకుల ద్వారా ఆర్ధికంగా బలోపేతం కావడానికి ఈ ఖాతాలు దోహదపడతాయి. నగరంలోగల 7 వేల’ ‘ ఒక్క రూపాయి’ ఖాతాదారులలో 22 శాతం మంది మహిళలే.

అన్ని బ్యాంకులు మాకు దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వుండడం వల్ల మేము యేనాడు పొదుపు ఖాతాలు తెరవలేదు. నేను కాని నాభర్త కానీ ( ఆయన కారు మెకానిక్ గా పని చేస్తున్నాడు ) బ్యాంకుకు వెళ్ళి క్యూలో వేచి వుండి ఖాతాలో డిపాజిట్ చేయడానికి కాని, డబ్బు ఖాతా నుంచి తిరిగి తీసుకోవడానికి కాని సమయం దొరికేదిగాదు అని ఖాతాదారు కె. లక్ష్మి చెప్పింది. ఆమె బట్టలను ఇస్త్రీ చేసే వృత్తి ద్వారా జీవనోపాధి పొందుతోంది.
ఆమెకి ఒకే దఫా బ్యాంకులో ఖాతా తెరిచేందుకు ప్రాథమిక డిపాజిట్ చెల్లించే ఆర్ధిక స్థోమత లేదు.
అటువంటిదే ఎల్. మణెమ్మ సంగతి కూడా. ఎల్ మణెమ్మ ఇళ్ళల్లో పనిమనిషిగా పనిచేస్తున్నది. పొదుపు ఖాతాలు తెరవగలగడమే కాకుండా ఈ ఒక్క రూపాయి ఖాతాదారులు ఫిక్స్ డ్ , టెర్మ్ లేదా రికరింగ్ ఖాతాలు కూడా తెరుచుకోవచ్చు. అలాగే ఈ ఖాతాదారులు తమ ఖాతానుంచి సొమ్మును బదిలీ చేసుకోవచ్చు. 6నెలలపాటు బ్యాంకులో సక్రమంగా(loyalty)ఖాతా నిర్వహిం చిన పిదప ఋణాలు కూడా పొందవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జంట నగరాల్లో ఈ వినియోగదారుల సేవాకేంద్రాలను (CSPs)రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభిస్తూ ఈ ప్రత్యేక పథకం ఋణదాతలకు ప్రత్యామ్నాయంగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ సేవా కేంద్రాలు వినియోగదారులకు పూర్తి స్థాయి బ్యాంకు శాఖల మాదిరి సేవలందిస్తాయని ఎస్ బిఐ డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ దివాకర్ గుప్తా అన్నారు.
ఈ ఖాతాలో వుండవలసిన అత్యధిక బ్యాలెన్స్ సొమ్ము 50 వేల రూపాయలు. రోజువారీ వ్యాపార లావాదేవీలు 10 వేల రూపాయల వరకు ఉండవచ్చు. సంవత్సరం మొత్తంలో 1 లక్ష రూపాయలు ఉండాలి. వడ్డీరేటు ఖాతాదారులందరకు వర్తించేటట్లే వర్తిస్తాయి. ఖాతాలో బ్యాలెన్స్ ఏమీ లేకపోయినా ఖాతా అమలులో వుంటుంది.
బయోమెట్రిక్ విధానం( వేలి ముద్రలు, ఫొటోలు మొదలైన వాటి ఆధారంగా) , కాగితంపై నిర్వహించే విధులు చాలా తక్కువగా (కనీస స్థాయిలో) వుంటాయి.
మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా వుండేందుకు ప్రతి వ్యాపార లావాదేవీకి ఖాతాదారు యొక్క బొటన వ్రేలి ముద్రను ప్రముఖంగా పరిగణిస్తారు. తమ కుటుంబంలోని మగవారి జోక్యం లేకుండా ఆడవారు తమ ఖాతాలను తామే నిర్వహించుకోవచ్చు.

ఈ విధానం చాలా ఉపయోగకరమైనది ( the system is accommodative). ఖాతాదారు తన యొక్క గుర్తింపుకు సరైన ఆధారాలు చూపలేకపోతే మా బ్యాంకు అధికారుల(executives)ఖాతాదారులు (అతడు/ఆమె) నివాసాల వద్దకు వెళ్ళి వారి యొక్క దాఖలా పత్రాలను పరిశీలిస్తారు అని ఎస్ బిఐ యొక్క వ్యాపార ప్రతినిధి ఏజెన్సీ అయిన మెయిన్ స్ట్రీమ్ సొల్యూషన్స్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. రమేష్ చెప్పారు. ఈ ఏజెన్సీకి ఎస్ బి ఐ జియో సంసార్ (Geosansar)అనే బ్రాండ్ నేమ్ ( గుర్తింపు పిలుపు) ఇచ్చింది. ఈ సంస్థకు ‘ఈ ఒక్క రూపాయి బడ్డీకొట్టు ఖాతాల’ యొక్క వ్యవహారాలు ఎస్ బి ఐ ఔట్ సోర్సింగ్ గా అప్పగించింది.
అన్ని ప్రధాన నగరాల్లో 150 సి ఎస్ పి ల ద్వారా ఒక లక్ష ఖాతాలను తెరిపించాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పారిశ్రామిక నగరాల్లో కూడా ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి అదే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనకు నిర్ణయించుకున్న నగరాలు ఢిల్లీ , నోయిడా, గురుగాంవ్ , ముంబై , విశాఖ పట్టణం , బెంగుళూరు మరియు తిరుపూర్ అని రమేష్ చెప్పారు.

బ్యాంకు రుసుములను గురించి తెలుసుకోవడం

మీకు క్రెడిట్ కార్డు వున్నా, చెకింగ్, లేదా సేవింగ్స్ ఖాతా వున్నా , మీ ఖాతాకు సంబంధించి ఎలాంటి రుసుములు ( ఫీజులు )వసూలుచేస్తారో తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఏ బ్యాంకిలోనైనా ఖాతా ప్రారంభిస్తే, మీ ఖాతాపై వసూలుచేసే రకరకాల రుసుముల జాబితా మీకు అందజేస్తారు. బ్యాంకులు వసూలుచేసే కొన్ని సాధారణమైన రుసుముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నెలసరి సేవా రుసుము ( మంత్లీ సర్వీసు ఫీజు)

మీ ఖాతాలకు సేవలు అందించడానికి అయ్యే ఖర్చులో కొంత భాగం భర్తీచేసుకోవడానికి, ఈ నెలసరి సర్వీసు ఫీజు బ్యాంకులకు ఉపయోగపడుతుంది. మీకు నెలకొకసారి మీ ఖాతా వివరాలతో బ్యాంకులు మీకు అందించే స్టేట్‌మెంట్‌లో, మంత్లీ మెయింటెనెన్స్ ఫీజు అనో, లేదా మంత్లీ సర్వీసు ఫీజు అనో దీనిని పేర్కొనివుండడాన్ని మీరు గమనించవచ్చు.

మీఖాతాలో నిర్దిష్టమైన కనీసమొత్తాన్ని ఎప్పుడూ కొనసాగిస్తే, లేదా బ్యాంకి విధించిన ఇతర నిబంధనలను పాటిస్తే , మీ ఖాతాపై నెలసరి సేవా సుంకం వసూలును మినహాయిస్తారేమో మీరు మీ బ్యాంకికి వెళ్ళి , తెలుసుకుని, రద్దుచేయించుకోవచ్చు. కొన్ని బ్యాంకులు, నెలసరి సేవా సుంకం వసూలుచేయడం లేదు. అందువల్ల, ఇతర బ్యాంకుల సుంకాలతో పోల్చిచూసి, మరికొంత పరిశీలన జరిపి, మీరు కొంత సొమ్మును ఆదా చేసుకోవచ్చు. ఈ ఆలోచన భేషుగ్గా లేదూ ?

ఏ టి ఎం సుంకం

మీ చెకింగ్ ఖాతానుంచో. లేదా సేవింగ్స్ ఖాతానుంచో మీకు అవసరమైన సొమ్మును , అవసరమైనప్పుడు ఏ టి ఎం ద్వారా తీసుకోగలగడం ఒక సౌకర్యమైన పద్ధతి. ఏ టి ఎం నుంచి డబ్బు తీసుకోవాలంటే, మీవద్ద మీ బ్యాంకు అందజేసే డెబిట్ కార్డో, లేదా వీ సా ® డెబిట్ కార్డో వుండాలి. మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు ఏ బ్యాంకు ఏ టి ఎం ను ఉపయోగిస్తున్నారనేదానిని బట్టి , ఏ టి ఎం ద్వారా డబ్బు తీసుకోవడానికి కొంత సుంకం చెల్లించవలసిరావచ్చు. ఈ సుంకం ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కొక్కరకంగా వుండవచ్చు. కొన్ని బ్యాంకులు అసలు ఏ టి ఎం సుంకమే వసూలుచేయకపోవచ్చు, మరికొన్ని బ్యాంకులు చాలా ఎక్కువమొత్తం వసూలుచేయవచ్చు.

ఆలస్యంగా చెల్లిస్తే సుంకం ( లేట్ ఫీ )

చాలా బ్యాంకులు, క్రెడిట్ కార్డులకు సంబంధించి, నిర్ణీత తేదీ తర్వాత చేసే చెల్లింపులకు లేట్ ఫీ (ఆలస్యపు సుంకం) వసూలు చేస్తాయి. భారీగా లేట్‌ఫీ చెల్లింపునుంచి తప్పించుకోవాలంటే, ఒకటే మార్గం; సకాలంలో చెల్లించడమే ! సకాలంలో చెల్లించడంవల్ల మీకు ఆలస్యపు సుంకం తగ్గడమేకాదు, మీ లావాదేవీలు సక్రమంగా వుంటాయన్న నమ్మకం బ్యాంకువారికి కలుగుతుంది. మీ చెల్లింపులలోజాప్యం జరిగితే, మీరు లేట్ ఫీ చెల్లించవలసిరావడంతోపాటు, చక్కనినిర్వహణకలిగిన ఖాతాలకు సంవత్సరాంతంలో బ్యాంకులు అందించే, ప్రోత్సాహక వార్షిక వడ్డీ శాతం ( యాన్యువల్ పర్సెంటేజ్ రేట్.....ఏ పి ఆర్ ) అవకాశాన్ని కూడా కోల్పోవలసిరావచ్చు; మీ ఖాతా అధికవడ్డీ ఖాతాగా మార్చబడవచ్చు.

వివిధ చెల్లింపు పద్ధతులు

చెల్లింపులు త్వరితంగా జరిగేలా చూడడంకోసం, వివిధ బ్యాంకులు రకరకాల సేవలను ఖాతాదారులకు అందుబాటులో ఉం చుతున్నాయి. ఈ కింది సేవలలో మీ బ్యాంకు వేటిని అందిస్తున్నదో తెలుసుకోవడం మరువవద్దు.

  1. నిర్ణీత కాలవ్యవధి మెయిల్ చెల్లింపులు: మీరు చెల్లించవలసిన చివరిరోజుకు, కనీసం వారం ముందుగానే, మీ చెల్లింపులను పోస్ట్ (మెయిల్) చేయడం అలవాటుచేసు కోండి. మీ చెల్లింపులు త్వరగా, ఖచ్చితంగా మీ ఖాతాలో జమకావడంకోసం, బ్యాంకునుంచి అందే స్టేట్‌మెంట్‌లో ముద్రించివున్న చెల్లింపు నిబంధనలను పాటించండి.
  2. ఆన్‌లైన్ బ్యాంకింగ్ చెల్లింపులు: సురక్షితమైన ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవను ఉపయోగించుకుని, ప్రతిసారి, ఒక నిర్ణీత తేదీన మీ చెల్లింపులు జరిగేలా మీరు ఏర్పాటుచేసుకోవచ్చు.
  3. బ్యాంకింగ్ సెంటర్: కావాలంటే, మీరు నేరుగా, మీ బ్యాంకులోనే చెల్లించి, అదేరోజు మీ ఖాతాకు జమ అయ్యేలా చూసుకోవచ్చు. అయితే, బ్యాంకులో నగదు లావాదేవీల నిర్ణీత సమయం ఎంతవరకో తెలుసుకోవడం మరచిపోవద్దు.
  4. ఏ టి ఎం చెల్లింపులు: మీ ఏ టి ఎం కార్డును ను లేదా డెబిట్ కార్డును ఉపయోగించి, మీ బ్యాంకుకుచెందిన ఏ ఏ టి ఎం లోనైనా మీరు చెల్లించే వీలు వుంటుంది. అయితే, ఏ సమయంలోగా చెల్లించాలనేది, ఆ ఏ టి ఎం వున్న ప్రాంతాన్నిబట్టి ఒక్కొక్క ఏ టి ఎం కు ఒక్కొక్క రకంగా వుండవచ్చు.
  5. ఫోన్ ద్వారా చెల్లింపులు: బ్యాంకుకు సంబంధించిన ఆటోమేటెడ్ పేమెంట్ సర్వీస్ కు ఫోన్‌చేసిగాని, లేదా బ్యాంకుకు చెందిన నిర్ణీత సిబ్బందికి ఫోన్‌చేసిగాని మీరు మీ బిల్లులను చెల్లించవచ్చు. ఈ సేవను వినియోగించుకోవడానికి కొంత సుంకం చెల్లించవలసి రావచ్చు
  6. చెల్లింపు సొమ్ము బదలాయింపు: మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపునకు కావలసిన సొమ్మును మీరు, మీ చెకింగ్ ఖాతా, సేవింగ్స్ ఖాతా లేదా మనీ మార్కెట్ ఖాతానుంచి కూడా బదలాయించవచ్చు ( ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు ). ఇలాంటి చెల్లింపులను ఏ సమయందాకా అనుమతిస్తారో తెలుసుకోవడం మరువవద్దు.

ఆన్ లైన్ , మొబైల్ ద్వారా బ్యాంకు సేవలు

ఆన్ లైన్ లో మీరు ఏన్నెన్నో చేస్తుంటారు. స్నేహితులతో ముచ్చటిస్తుంటారు, చదువులో అవసరమైన పరిశోధనలను గురించి తెలుసుకుంటుంటారు, సంగీతాన్ని కొనుక్కుంటారు, సినిమాలను అద్దెకు తీసుకుంటారు. కాని, బ్యాంకు వ్యవహారాల మాటేమిటి ?

ఆన్‌లైన్ బ్యాంకింగ్ అంటే మామూలు బ్యాంకు వ్యవహారాలలాంటిదే; కాకపోతే, వాటికంటె, మరింత చక్కగా, కాగితాలతో పనిలేకుండా సాగించవచ్చు. మీరు మీ కంప్యూటర్ నుంచే, మీ బ్యాంకు ఖాతాలను, లావాదేవీల వివరాలను, రద్దుచేసిన చెక్కులను చూడవచ్చు. కొన్ని బ్యాంకులు మొబైల్ బ్యాంకు సేవలను కూడా అందిస్తున్నాయి. అందువల్ల, మీరు మీసెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్‌తో ఆన్‌లైన్‌లో బ్యాంకు సేవలు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో బ్యాంకు వ్యవహారాలు సాగించడంవల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలను ఇక్కడచూద్దాం.

సౌకర్యం

సాధారణంగా ఆన్‌లైన్ బ్యాంకు సేవలు వారంలో అన్ని రోజులూ, రోజూ 24 గంటలపాటు అందుబాటులో వుంటాయి. నేరుగా మీ కంప్యూటర్‌ద్వారానో,సెల్ ఫోన్ ద్వారానో ఈ సేవలను పొందవచ్చు.

సులభంగా అందుబాటు

ఏదో ఒక సురక్షితమైన వెబ్ సైట్ నుంచి, మీరు ఎన్నిసార్లయినా మీ చెక్కులను , మీ పొదుపు ఖాతాలను నిర్వహించుకోవచ్చు. మీ ఖాతాల నిల్వలను తరచుగా సరిచూసుకోవడానికి, మీ ఇటీవలి లావాదేవీలపై ఒక కన్ను వేసి వుండడానికి , ఆన్‌లైన్ బ్యాంకింగ్ మీకు అవకాశం కలిగిస్తుంది.

ఉపయోగకరమైన సాధనాలు:

బ్యాంకింగ్ కు సంబంధించిన అనేక సైట్లు, మీకు ఉపయోగపడే రకరకాల సాధనాలను అందిస్తున్నాయి. బిల్లులు ఎలా చెల్లించాలో శిక్షణ ఇవ్వడం, మీ ఒక ఖాతానుంచి మరొక ఖాతాకు ఆన్‌లైన్ లో నగదు బదిలీ, మీబ్యాంకి లావాదేవీల జాబితాలను ఆన్‌లైన్ లో పొందడం, మీ చెక్కుల కాపీలను ఆన్‌లైన్‌లో చూడగలగడం, కళాశాల చదువులకు అవసరమయ్యే సొమ్ముకోసం ఎలాంటి పథకాన్ని అనుసరించాలి, బ్యాంకునుంచి రుణం ఎలా పొందాలనే సమాచారంతో సహా ఎన్నెన్నో సాధనాలు లభిస్తున్నాయి.

మొదలుపెట్టడం ఎలా ?

ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను పొందడానికి బహుశా మీరు, ఏదైనా బ్యాంకి శాఖలో మీ గుర్తింపు ( ఐ డి ) ను అందించి, సంతకం చేయవలసి వుంటుంది. కొన్ని బ్యాంకులు మీ ఇంటి నుంచే, మీ కంప్యూటర్ ద్వారా , ఆ బ్యాంకు వెబ్ సైట్‌లో ఆన్‌లైన్ సేవలకోసం మీ పేరు నమోదుచేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నాయి. మరి, ఇంతకంటె సౌకర్యం మరొకటి వుంటుందా ?

ఆన్ లైన్‌లో బిల్లులను అందుకోండి, చెల్లించండి

కొన్ని బ్యాంకులు ఆన్ లైన్‌లోనే మీకు బిల్లులను పంపించే సదుపాయం అందిస్తున్నాయి. కాగితం రూపంలోని బిల్లులో మీరు చూడాలనుకునే , బిల్లు మొత్తం ఎంత , రుసుము ఎంత వంటి బిల్లు చెల్లింపునకు సంబంధించిన వివరాలన్నీ, ఆన్ లైన్ లో మీరు చూడవచ్చు. మీరు కావాలనుకున్నప్పుడు ఆ బిల్లులను చెల్లించవచ్చు. ఇంటి అద్దె, ఫోన్ బిల్లు వంటి మీ నెలసరి చెల్లింపులను, ఆ సమయానికి వాటంతట అవే చెల్లింపబడేలా కూడా మీరు మీ ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

లావాదేవీల వివరాలు చూడగలగడం

మీ బ్యాంకి ఖాతాల లావాదేవీలను మీరు ఎప్పుడుకావాలంటే అప్పుడు ఆన్‌లైన్‌లో చూడవచ్చు. వాటి ప్రింట్ కాపీని పొందవచ్చు. అవసరమైతే 18 నెలల వెనుకటి స్టేట్ మెంట్స్ కూడా తీసుకోవచ్చు. మెయిల్ ద్వారా కంటె, ఆన్‌లైన్‌లో స్టేట్ మెంట్స్ పొందడంలో కాగితం వినియోగం తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది ; మెయిల్ మోసాలు, ఐ డి చోరీల వంటివాటికి ఆస్కారం తగ్గుతుంది.

మొబైల్ బ్యాంకింగ్ తో మెరుగైన సౌకర్యం

సెల్ ఫోన్ ను లేదా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను మీరు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా పొందవచ్చు. మీ ఖాతాల సమాచారాన్ని తెలుసుకోవడానికి, బిల్లులు చెల్లించడానికి , సొమ్ము బదిలీ చేయడానికి , ఏ టి ఎం సెంటర్లు , బ్యాంకి శాఖలు సమీపంలో ఎక్కడ వున్నాయో తెలుసుకోవడానికి మిక్కిలి సులువైన, త్వరితమైన సాధనంగా ఈ మొబైల్ సేవలను కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి

నగదు బదిలీ

కొన్ని బ్యాంకులు, ఆన్‌లైన్‌లో, మీ ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు, మరొక బ్యాంకికి లేదా మరొక ఆర్ధిక సంస్థకు కూడా నగదు బదిలీచేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి. చెక్కుల రూపంలోని నగదును సేవింగ్స్ ఖాతాకో, లేదా క్రెడిట్ కార్డుకో, అప్పు వాయిదా చెల్లింపునకో బదిలీ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు మీ ఖాతా నుంచి తమ మరొక ఖాతాదారుకు నగదు బదిలీనికూడా అనుమతిస్తున్నాయి. మీ తల్లిదండ్రులు మీకు తక్షణం డబ్బు పంపించడానికి ఇది ఎంతో అనువైనది.

మీ ఖాతాల సమాచార సందేశాలు ( బ్యాంకింగ్ అలర్ట్స్)

ఆన్‌లైన్ బ్యాంకింగ్ అలర్ట్స్ సదుపాయంలో, మీ ఖాతాలకు సంబంధించిన తాజా వివరాల సందేశాలు మీ ఇ-మెయిల్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు వాటంతట అవే మీకు అందజేసే ఏర్పాటు వుంటుంది. మీఖాతాలో నగదు నిల్వ తక్కువగా వున్నదేమో తెలుసుకోవడానికి, మీ రోజువారీ నిల్వలవివరాలను , నేరుగా వచ్చే డిపాజిట్ల వివరాలను తెలుసుకోవడానికి మీరు ఈ అలర్ట్స్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

చెక్ బుక్ సక్రమ నిర్వహణ

మీరు మీ చెక్ బుక్‌ను సక్రమంగా నిర్వహించుకోవడానికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ మీకు తోడ్పడుతుంది. మీ ఖాతాలో జరిగే లావాదేవీలను మీరు మీ కంప్యూటర్ ద్వారా అన్‌లైన్‌లో తెలుసుకోగలుగుతారుకదా! అప్పుడు, మీ ఖాతాలో డబ్బు వేసే , తీసే వివరాలను మీరు మీ చెక్‌బుక్‌ రిజిస్టర్‌లో రాసుకోవచ్చు. పెండింగ్‌లోవుండే లావాదేవీలనుకూడా మీరు తెలుసుకోవచ్చు. పెండింగ్ అంటే, ఆ లావాదేవీలు ఇంకా బ్యాంకు పరిశీలనలోనే వున్నాయని, వాటికి సంబంధించిన జమలు, లేదా చెల్లింపులు ఇంకా పూర్తికాలేదని అర్ధం. ఏవైనా లావాదేవీలు కొన్నిరోజులకుపైగా ( ఎన్ని రోజులనేది ఆ బ్యాంకునుబట్టీ వుంటుంది ) పెండింగ్‌లో వుంటే, ఆ లావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ రిజిస్టర్ నుంచి తొలగించే అవకాశం వుంది. అందువల్ల, మీ ఖాతాలోనుంచి ఎంత సొమ్ము తీశారో మీరు ఎప్పటికప్పుడు మీ చెక్ రిజిస్టర్‌లో లెక్కరాసుకోవలసిన ( లేదా రసీదులను భద్రపరచుకోవలసిన ) అవసరం వుంది. అప్పుడు, మీ చెక్కుల లావాదేవీలలో ఏది పూర్తయిందో, ఏది పూర్తికాలేదో మీరు తెలుసుకోగలుగుతారు.

తాజా వ్యక్తిగత వివరాలు

మీ చిరునామా, ఇ-మెయిల్ ఐ డి , ఫోన్ నంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలను మీరు మీ ఖాతాలన్నిటిలో , ఎప్పటికప్పుడు తాజాగా వుంచుకోవడం ఎంతైనా అవసరం. అప్పుడు, మీఖాతాల వివరాలతో బ్యాంకులు పంపే ముఖ్యమైన లేఖలేవైనా మీకు అందకుండాపోయే ఇబ్బంది వుండదు. మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుని, మీ వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు తాజాగా వుండేలా చూసుకోవడం ఎంతో సులభం.

డెబిట్ కార్డు

మీ ఖాతాకు జత చేయబడిన డెబిట్ కార్డ్ పొందడం ద్వారా మీ ఖాతాను సరిచూసుకునేందుకు ప్రాధాన్యత కల్పించబడింది. చెక్కులాగానే మీ డెబిట్ కార్డ్ వినియోగించి దుకాణాలలో, హోటళ్ళలో కొనుగోలు చేసుకోవచ్చును. మీరు ఆన్ లైన్ సదుపాయం ద్వారా కూడా కొనుగోళ్లు చేసుకోవచ్చు. ఎ.టి.ఎమ్ ద్వారా కూడా నగదు పొందవచ్చు. ఈ డెబిట్ కార్డులు సదుపాయాలనివ్వడంతోబాటు భద్రత కల్పించడంలో కూడా అతి ముఖ్యమైనవి. ఇవి ఎందుకు భద్రత కల్పించగలవంటే మీరు వెళ్ళే ప్రతిచోటుకి చెక్కు పుస్తకం, లేదా ఎక్కువ మొత్తంలో నగదు పట్టుకు వెళ్లనక్కరలేదు. అంతేగాక దీనిలో మరొక ప్రత్యేకత గలదు. మీరు డెబిట్ కార్డు వినియోగించేటందుకు కార్డు జారీ చేసే సంస్థ(బ్యాంకు) మీకు పిన్ నంబర్ ను( వ్యక్తిగత గుర్తింపు సంఖ్య) కేటాయించడం జరుగుతుంది. ఆ సంఖ్యను మీరు కార్డ్ నుపయోగించేటప్పుడు ఎ.టి.ఎమ్ లో పేర్కొనవలసి ఉంటుంది. లేదా కార్డు పైన మీ సంతకం చేసి ఉండడం వల్ల కార్డ్ చెలామణిలో ఉండి సరుకులు కొనుగోలు చేసేటప్పుడు ఇచ్చే రశీదుపై మీరు సంతకం చేయవలసి ఉంటుంది.

మీ సంతకాలను రెండింటిలో సరిజూసి బ్యాంకు వారు రశీదునిచ్చిన వారికి నగదును చెల్లిస్తారు మీ లావాదేవీల లో తెల్పిన రూపాయల ఆధారంగా కొందరు వ్యాపారస్తులు మిమ్మల్ని రశీదుపై సంతకం చేయమని అడగకపోవచ్చు. మీరు డెబిట్ కార్డ్ పొందే సమయంలో మీకు ఇష్టమైన పిన్ సంఖ్యను కోరుకుని తెలుసుకోవచ్చు. కాని ఆ సంఖ్య మీ ఒక్కరికి మాత్రమేతెలిసి ఉండేటట్లు జాగ్రత్త వహించాలి .మీ నంబరు, చిరునామా లేదా మీ జనన తేదీలలో ఉండే సంఖ్యలు పిన్ సంఖ్యతో ఉండని విధంగా జాగురూకత వహించాలి. మీ పిన్ సంఖ్యను రహస్యంగా ఉంచండి. ఆ సంఖ్యను గుర్తుంచుకునేటందుకు ఎక్కడా వ్రాయకండి. స్నేహితులకు కూడా చెప్పకండి. అలాగయితేనే మీ డెబిట్ కార్డ్ ను వేరెవ్వరు వినియోగించి నగదును పొందలేరు. దీనివల్ల మీ నగదుకు భద్రత కల్పించబడుతుంది.

డెబిట్ కార్దులు త్వరితంగాను, సులభంగాను వినియోగించుకోవచ్చు. మామూలు ఎ.టి.ఎమ్ కార్డుల కంటే వీటిపై వీసా® లేదా మాస్టర్ కార్డ్ ® అని పేర్కొనబడి ఉండడం వల్ల త్వరితగతిని చెలామణి లో నగదు చెల్లించబడుతుంది. మీరు ఎక్కడైనాఈ కార్డులను వినియోగించి కొనుగోళ్లు చేసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డులలో, మొదటిది పొందాలనుకుంటే పిన్ నంబరు కూడా పొందవలసి ఉంటుంది. క్రెడిట్ కార్డును తీసుకోవాలనుకుంటే సంతకం చేస్తే సరిపోతుంది. ఏ పద్ధతిలోనైనా మీ బ్యాంకు ఖాతా సొమ్ములో నుంచి నగదు చెల్లింపబడుతుంది.

డెబిట్ కార్డులు, చెక్కులు వినియోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.
  1. మీ లావాదేవీలకు మీరేబాధ్యులు. మీరు చేసే ఖర్చులకు తగినంత సొమ్ము ఖాతాలో ఉందో లేదో అనే అవగాహన మీకు ఉండాలి.
  2. మీ ఖాతాలో ఉన్న సొమ్ము కన్నా హెచ్చు సొమ్ము ఖర్చు చేయవద్దు. మీ ఖాతాలోంచి తీసిన డబ్బు జమ చేసిన సొమ్ము గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. మీ యొక్క చెక్కు పుస్తకం చూసుకుని లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించి మీఖాతా గురించి తెలుసుకునే వీలుంది. మీ లావాదేవీలను సక్రమంగా తెలుసుకొననిచో, మీరు మీ ఖాతాలోని సొమ్ము కంటే ఎక్కువ సొమ్ము చెల్లింపు కోరుతూ చెక్కు జారీ చేసే ప్రమాదముంది. అలా జరిగితే మీరు జారీ చేసిన చెక్కు అంగీకరించబడదు. డబ్బు చెల్లింపు చేయ బడదు. ఇందుకుగాను మీరు మీ బ్యాంకుకు హెచ్చు వాడకపు రుసుము (over draft fees) అధిక మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది.
  3. ఈ కారణంగా మీరు చెల్లించే హెచ్చు వాడకపు రుసుముతో కలిపి మీరు కొన్న వస్తువుల ధర అసలు ధర కంటే ఎక్కువ మొత్తంగా పెరుగుతుంది.
  4. డెబిట్ కార్డ్ ఉపయోగించడం వల్ల మీరు మీఖాతాలో వున్న సొమ్ము కన్నా ఎక్కువ సొమ్ము చెల్లించ లేరు.

క్రెడిట్ కార్డ్

క్రెడిట్ కార్డులను వినియోగించే ముందు అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి, దానిని వినియోగించే విధానం మొదలైన అంశాలను వినియోగ దారుడు తెలుసుకోవడం ముఖ్యం. క్రెడిట్ కార్డ్ ను మీరు ఎలా వినియోగిస్తారో, ఏ విధంగా నిర్వహిస్తారో అనే దానిపై మీ ఆర్ధిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీ ఆర్ధిక భవిష్యత్ పై క్రెడిట్ కార్డుల వినియోగ ప్రభావం ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ అంటే అసలు అర్ధమేమిటి?

ఇది ప్లాస్టిక్ కార్డ్ మాత్రమే కాదు. ఇది ఒక ఆర్ధిక సంస్థ నుంచి మీరు పొందే ఋణానికి ఆధారమైనది. ఈ కార్డు ద్వారా మీరు ఋణాన్ని పొంది ఆ మొత్తాన్ని నిర్దేశించిన నెలవారి వాయిదాలలో తిరిగి చెల్లించేందుకు ఉపయోగడే సాధనం. మీకు జారీ చేయబడిన క్రెడిట్ కార్డ్ లో కొంత సొమ్మును మీరు పొందేటందుకు పరిమితి విధిస్తారు. మీరు పెట్టే ఖర్చు ఆ పరిమితికి లోబడి ఉండాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చేసిన కొనుగోళ్లకు మొత్తం ఋణం, వడ్డీ లేకుండా మీరు ఒకే వాయిదాలో చెల్లించేందుకు ఆర్ధిక సంస్థలు కాల వ్యవధి (గ్రేస్ పిరియడ్ ) ఇచ్చినట్లయితే సరేసరి, లేకపోయినట్లయితే మీరు చెల్లించే మొత్తానికి వడ్దీతో సహా చెల్లించవలసి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ ను అవసరమైన మేరకే వినియోగించి మీ ఆర్ధిక స్తోమతను నెలవారీగా సక్రమంగా నిర్వహించుకోవచ్చు .

మూడు రకాలైన క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి

సాధారణ అవసరాలకు ఉపయోగ పడే(రివాల్వింగ్ క్రెడిట్ కార్డులు):

క్రెడిట్ కార్డులు వీటిని ఏ అవసరాలకైనా వాడుకోవచ్చు. దుస్తులు మొదలుకొని విమాన ప్రయాణాల వరకు వాడుకోవచ్చు. వీసా® ,మరియు మాస్టర్ కార్డ్ ® క్రెడిట్ కార్డులు ఇటువంటివే . మీరు చేసే ఖర్చులలో మార్పుల కోసం నెలవారీ కొనుగోళ్లు చేసి చెల్లించేందుకు జి పి సి క్రెడిట్ కార్డ్ లు ఉపయోగపడ్తాయి .మీరు కొనుగోలు చేసిన మొత్తం ఒకే వాయిదాలో వడ్డీలేకుండా ఒక నెలవరకు కాలపరిమితి ఇవ్వబడుతుందని గుర్తుంచుకోండి. మీరు కొనుగోలు చేసిన వస్తువులు, సరుకులకు పూర్తి చెల్లింపు ఒక నెల లోపల చేయనట్లయితే మరుసటి నెలనుంచి కొనుగోలు చేసిన నాటినుంచి చెల్లించని మొత్తానికి, ( కొంత మొత్తం చెల్లించి నట్లయితే ) మిగిలిన మొత్తానికి వడ్డీ వసూలు చేయబడుతుంది.

స్టోర్ కార్డులు

(ప్రత్యేక కాలపరిమితి, ఒకే రకానికి మాత్రమే వినియోగపడే కార్డులు). ఇవి ఒక ప్రత్యేక కారణానికి ఒక స్టోరు లేదా కొన్ని దుకాణాల సముదాయంలో వస్తువులు, సరుకులు కొనుగోలు కోసం జారీ చేయబడినవి. డిపార్ట్ మెంట్ స్టోర్ కార్డులు, ప్రముఖ దుస్తుల దుకాణాలు, నగల దుకాణాలు అందించే క్రెడిట్ కార్డుల వంటివి. ఈ కార్డులపై వడ్డీ రేటు చాలా అధికంగా ఉంటుంది. కొన్ని దుకాణాలు మీరు కొనే కొనుగోళ్ళపై మొదటి దఫా 15 శాతం దాకా తగ్గింపు ఇస్తాయి. తమ సరుకుల, వస్తువుల అమ్మకాలను పెంచుకునేందుకు ఈ రాయితీ కల్పిస్తారు. ఆ దుకాణాల్లో మీరు ఖాతా తెరచిన తదుపరి ఈ రాయితీ కల్పిస్తారు. ఎక్కువ కాలపరిమితి కల్గిన పక్షంలో ఈ అధికవడ్దీ రేటు పెద్దగా వినియోగదారులను బాధించదు.

సాంప్రదాయబద్ధమైన వడ్డీ వేసే కార్డులు

ఈ కార్డ్ లను వినియోగించేటప్పుడు మీరు చేసే కొనుగోళ్లకు, పొందే సేవలకు మీకిచ్చిన కాల వ్యవధిలో ఒకేదఫా మొత్తం ఋణం చెల్లించవలసి ఉంటుంది. ఇటువంటి ఋణాలకు సాధారణంగా వడ్డీ చెల్లించవలసిన అవసరమేర్పడదు. కాని క్రమం తప్పకుండా నెలవారీ వాయిదాలతో సంస్థ పేర్కొన్న రీతిలో మిగిలిన మొత్తం చెల్లించవలసి ఉంటుంది. చార్జ్ కార్డులను ప్రయాణాల, వినోదాల కార్డులుగా పిలుస్తారు. అమెరికన్ ఎక్స్ प्रेशरప్రెస్®, డైనర్స్ క్లబ్® కార్డులవంటివే.

క్రెడిట్ కార్డ్ వినియోగంతో వచ్చే ప్రయోజనాలు.
  • చెక్కులు వ్రాసి జారీ చెయ్యడం లేదా నగదును మీతో తీసుకువెళ్ళవలసిన అవసరముండదు.
  • మీరు అనుకోకుండా ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు, అనుకోకుండా నగదు చెల్లింపులు చేయవలసి వచ్చినప్పుడు అంటే కారు మరమ్మత్తులు, వైద్య ఖర్చుల వంటివి.
  • మీకు అవసరమైనప్పుడు మీవద్ద నగదులేని సమయాల్లో అంటే భోజనం, దినసరి వెచ్చాలు, నీరు, గ్యాస్ వంటి వాటికి ఖర్చు చేయవలసినప్పుడు.
  • మీరు నెలలో చేసిన ఖర్చులు కొనుగోళ్లతో సహా నెలవారీ వివరణ పొందడం వలన మీరు చేసే ఖర్చు వివరాలు తెలుసుకోగల్గుతారు.
  • మీరు చేసే ఖర్చును ఒకే దఫా నెలవారీ చెల్లింపు ద్వారా క్రమపద్ధతి లో నిర్వహించవచ్చు.
  • మీరు చేసిన కొనుగోళ్లకు రక్షణ కల్పించ బడుతుంది. కొన్న వస్తువులకు హామీ ఇవ్వబడుతుంది.
క్రెడిట్ కార్డుల వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
  • కార్డుపై వసూలు చేసే చార్జీలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది.
  • మీరు కొనుగోలు చేసే కొనుగోళ్లపై వసూలు చేసే ఆర్ధిక సంబంధమైన చార్జీల (పై వన్నియు) వల్ల మీ వస్తువుల ధర మరి కొంత పెరగవచ్చు.
  • మీరు మీ కార్డును ఇచ్చిన ఋణపరినమితికి మించి వినియోగించుకున్నచో, ఆ అధిక ఋణానికి అపరాధ రుసుము, అలాగే ఇచ్చిన కాలపరిమితి (నెలవారీ వాయిదాలు సక్రమంగా చెల్లించనట్లయితే) అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మీ కార్డ్ ఖాతాను సక్రమంగా నిర్వహించుకోవాలి.
  • మీరు మీ బడ్జెట్ ను రూపొందించుకోవాలి. మీరు చేసిన ప్రతి ఖర్చును తిరిగి చెల్లించవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
  • ఎక్కువ కొనుగోళ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ బడ్జెట్ కు మీ ఆర్ధిక స్తోమతకు మించి ఖర్చు చేయవద్దు.
  • మీరు పొందే ఋణపరపతి పై మీరు చెల్లించే అపరాధ రుసుము అంటే ఇచ్చిన కాలపరిమితి దాటిన తర్వాత చెల్లించే అధిక వడ్డీ, నెలసరి వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడం వల్ల చెల్లించే అధిక వడ్డీపై ప్రభావం చూపుతాయి.
క్రెడిట్ కార్డులను బాధ్యతాయుతంగా వినియోగించాలి

నెలవారీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డ్ లు మీకు సాధారణ రీతిలో ఎక్కువ సదుపాయం కల్గించేందుకు ఉపయోగపడతాయి. అయితే ఈ సదుపాయాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. మీరు మీ యొక్క కార్డును సక్రమంగా ఉపయోగిస్తే, మీకు ఋణాలిచ్చేవారు ఋణాన్ని మీరు ఎలా వినియోగించుకోవాలో అవగాహన కలిగిన వారైనట్లు గుర్తిస్తారు. ఋణదాతలు మీకు ఉన్న విశ్వసనీయత ఆధారంగా మీకు పెద్దమొత్తంలో విలువైన వస్తువులకొనుగోళ్లు – కారు లేదా ఇల్లు వంటి వాటికి ఋణం మంజూరు చేస్తారు.

క్రెడిట్ కార్డ్ మీరు ఎందుకు ఉపయోగిస్తారన్నది ముఖ్యం కాదు, మీరే ముఖ్యం
  • మీరు పొందిన నెలవారీ పద్దు లో పేర్కొన్న చెల్లించవలసిన కనీస మొత్తాన్ని మీరు తప్పక చెల్లించండి. మీకు వచ్చిన నెలవారీ కనీస మొత్తాన్ని కాని లేదా నెలవారీ చెల్లించవలసిన మొత్తాన్ని గాని చెల్లించినట్లయితే ఆ చెల్లింపు మీకు మేలు కల్గిస్తుంది. మీకు అధిక మొత్తంలో వడ్దీ చెల్లించవలసిన పరిస్థితి రాదు.
  • మీరు చెల్లించే ప్రతీ చెల్లింపు ప్రతిసారి సరిఅయిన సమయంలో సక్రమంగా చెల్లించండి.
  • మీ కార్డులో పేర్కొన్న పరిమితి కి లోబడి మీ మొత్తం లావాదేవీలను నిర్వహించే జాగురూకత కలిగి ఉండండి.
  • మీరు చెల్లించలేని స్థాయిలో మీఖర్చులను పెంచుకోకండి. ఈ మార్గదర్శక సూత్రాన్ని మీరు గమనించక తప్పదు. క్రెడిట్ కార్డ్ పై తెచ్చిన ఋణాన్ని లేదా చేసే ఖర్చును (అద్దెలు లేదా తనఖా చెల్లింపులు మినహాయించి) మీరు పన్ను చెల్లించగా మిగిలిన ఆదాయంలో 20 శాతం మించకుండా జాగ్రత్త వహించాలి.
ఋణం వల్ల వచ్చే ఇబ్బందులను గమనించండి
  • బిల్లులు వచ్చేటంతవరకు మీరు ఎంత బాకీ వున్నారో మీకు తెలియదు.
  • మీరు కొన్ని సమయాలలో ఋణాల చెల్లింపులో జాప్యం చేసే అవకాశముంది.
  • కొన్ని సమయాలలో మీరు క్రెడిట్ కార్డు లో పేర్కొన్న కనీస ఋణం చెల్లింపు కూడా చేయలేకపోవచ్చు.
  • మీరు తరచు ఋణ పరిమితికి మించి ఖర్చు చేయవచ్చు.
  • మీకున్న ఋణ పరిమితిని వినియోగించుకోవచ్చును లేదా నగదు తీసుకుని బిల్లులు చెల్లించవచ్చను.
ఋణ బాధలను ఏ విధంగా ఎదుర్కోవాలి
  • మీరు ఋణదాతలతో ముఖాముఖి మాట్లాడండి. దీని వలన వారు ఋణాన్ని చెల్లించాల్సిన విధానం మరియు చెల్లింపు పట్టికను యేర్పాటు చేస్తారు.
  • అప్పటినుంచి మీరు క్రెడిట్ కార్డ్ లను వినియోగించకుండా ఆపివేయండి .
మీ స్తోమత తెలుసుకోండి

మీ ఆర్ధిక స్తోమత మించి ఖర్చు చేయవచ్చు. ఖరీదైన కొనుగోళ్ళు చేసి ఋణాన్ని పెంచుకోవచ్చు. మీ ఆర్ధిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని విజ్ఞతతో క్రెడిట్ కార్డ్ ను వినియోగించాలి.

ఋణాల చెల్లింపు ప్రణాళిక రూపొందించుకోవడం

ప్రతి నెలా మీ కార్డుపై చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించనట్లయితే కనీసం మీపై ఋణదాతలు వసూలు చేసే ఛార్జీలపై అవగాహన కలిగి ఉండాలి. మీరు నెలవారీ చెల్లించవలసిన మొత్తం, దానిపై ఋణదాతలు వసూలుచేసే ఛార్జీ మీరు చెల్లించని మిగులు మొత్తంపై వసూలు చేసే వడ్దీపై అవగాహనకల్గి ఉండాలి. మీ క్రెడిట్ కార్డ్ నకు చెల్లించిన కనీస మొత్తం తర్వాత మిగులు సొమ్మును త్వరితగతిని చెల్లించే ప్రణాళిక లేదా ఆలోచన కల్గి ఉండాలి. అటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీరు ఋణాన్ని వినియోగించడంలో సమర్ధులుగా, బాధ్యతగల వారిగా గుర్తింపు పొందగలరు.

క్రెడిట్ కార్డ్ ను జాగ్రత్తపరచడం గురించి

నేరస్థుల నుంచి మిమ్ములను రక్షించేందుకు ఆర్ధిక సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తునే ఉంటాయి. మీ కార్డు పోయినా దొంగలించబడిన లేదా మీరు ఆర్ధికంగా మోసానికి గురయినట్లయితే మీకు కార్డు జారీ చేసిన సంస్థలను వెంటనే సంప్రదించండి.

డెబిట్ కార్డుకు - క్రెడిట్ కార్డుకు గల భేదం

మీరు చేసిన ప్రతి కొనుగోలు లేదా పొందిన నగదుకు డెబిట్ కార్డు నేరుగా మీ యొక్క ఖాతానుంచి ఆ సొమ్మును మినహాయిస్తే, క్రెడిట్ కార్డ్ మీ యొక్క లావాదేవీల యొక్క బిల్లులను మీఖాతాకు సమర్పించి అందులో నుంచి మినహాయిస్తుంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు మీ ఖాతానుంచి ఋణదాతకు చెల్లించబవలసి ఉంటుంది.

కొన్ని సందర్భాలలో ఊహించని పరిణామాలు సంభవించవచ్చు. మీ కార్డు పోవడం గాని, దొంగలింపబడడంగానీ జరగవచ్చు. ఆ పరిస్థితిలో తక్షణమే మీ బ్యాంకును సంప్రదించండి. అటువంటప్పుడు జరిగే మోసాలకు మీరు బాధ్యులు కానవసరంలేదు.

చెక్కు

సాధారణంగా ప్రత్యేక ముద్రిత పత్రం జారీ ద్వారా నగదు చెల్లింపు కోరుతూ ఇచ్చే ఆదేశాలను చెక్కు అంటారు. ఖాతాద్వారా నగదు చెల్లించే విధానంలో చెక్కు ను ఉపయోగిస్తారు. చెక్కును రాసే వ్యక్తి సాధారణంగా తనకు గల బ్యాంకు ఖాతా (చెక్కింగ్ అకౌంటు లేదా డిమాండ్ అకౌంటు ) నుంచి నగదు చెల్లించమని తన బ్యాంకునకు ఆదేశాలిస్తారు. చెక్కు వ్రాసే వ్యక్తులు ఎంత నగదు (మొత్తం ) చెల్లించాలి, తేది, చెక్కుపై ఎవరికి నగదు చెల్లించాలి మొదలైన వివరాలు వ్రాసి సంతకం చేస్తారు. తన బ్యాంకు అధికారులను ఫలానా వ్యక్తి లేదా సంస్థ(కంపెనీ) కి నగదు చెల్లించమని పేర్కొంటారు.

ఖచ్చితంగా చెప్పాలంటే, ఈ వ్యవహారంలో బ్యాంకునకు ఎటువంటి ప్రమేయం ఉండదు. నగదు పొందగోరు వ్యక్తి (payee), చెక్కు తయారుచేసి జారీ చేసే వ్యక్తి ని మాత్రమే నగదు చెల్లించమని కోరాలి. బ్యాంకుల యొక్క ఉద్దేశం తమపై జారీ చేయబడిన చెక్కు యొక్క విశ్వసనీయతను మరింత పెంచడమే . చెక్కునకు విశ్వసనీయత కల్గి ఉండడం వలన నగదు కోరగోరు వ్యక్తి ఆ చెక్కువ్రాయబడిన బ్యాంకును నగదు చెల్లించమని కోరతారు. ప్రస్తుత నేపధ్యంలో అన్ని బ్యాంకులు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా అను సంధానం చేయబడినందున (కంప్యూటరీకరణం వల్ల) ఏ చెక్కు ఏ బ్యాంకులో జమ చేసినను, కనీసం చెక్కు జారీ చేయబడిన దేశంలో చెల్లింపబడుతుంది.

చెక్కులద్వారా నగదు చెల్లింపు (papera money-కాగితం ద్వారాడబ్బు చెల్లింపు ) అనే కొత్త విధానం కనుగొనబడింది. ఆ చెక్కుపై వ్రాసిన సొమ్మును చెక్కు వ్రాసిన వ్యక్తి ఆదేశాల మేరకు చెక్కు వ్రాయబడిన బ్యాంకు ద్వారా పొందవచ్చు. వ్రాయబడిన బ్యాంకు ద్వారా పొందవచ్చు.

సాంకేతికపరంగా చెప్పాలంటే, సాధారణంగా, ఒక ఆర్ధిక సంస్థ బ్యాంకులో ఖాతాకల్గిన వ్యక్తి తన కోరిక మేరకు తాను కోరిన విధంగా పేర్కొన్న సొమ్మును చెలామణిలో ఉన్న ద్రవ్యమును ఆ సంస్థ ను చెల్లించవలసినదిగా ఆదేశిస్తూ వ్రాసిన ఆదేశిత పత్రాన్నే చెక్కు అని పిలుస్తారు. చెక్కు అనగా ఖాతాద్వారా అమలులో వున్న ద్రవ్యమును చెల్లింపు కోరుతూ నగదుకు బదులుగా వినియోగించే ఒక ద్రవ్య మారక పత్రం.

నగదు చెల్లించే వ్యక్తి, నగదు చెల్లింపు కోరే వ్యక్తి ఇద్దరూ చట్ట ప్రకారం ఏర్పడిన సంస్థలైనా కావచ్చు లేదా సజీవ వ్యక్తులైనా కావచ్చు. ఒకసారి గనుక మీరు బ్యాంకులో ఖాతా తెరచిన పిదప మీరు తరచుగా మీ ఖాతాలో ఉన్న మిగులు సొమ్మును గూర్చి పూర్తి అవగాహన ఎల్లప్పుడు కల్గి ఉండాలి. మీరు జారీ చేసిన చెక్కుల సొమ్ము మీ ఖాతానుంచి ఎంత చెల్లింపబడిందో ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం మరచిపోవద్దు. మీరు చేసిన డెబిట్ (ఖర్చు) కార్డు కొనుగోళ్ళ చెల్లింపులను బ్యాంకులు ఎల్లవేళలా అందిస్తున్న ఆన్ లైన్ సేవలద్వారా పొందవచ్చునని తెలుసుకోండి. మీరు మీ చెక్కు రిజిస్టరులో మీరు జారీ చేసిన చెక్కు వివరాలను నమోదు చేసుకోండి. మీరు ఎ.టి.ఎమ్ (ATM) నుంచి పొందిన సొమ్ము వివరాలను, డెబిట్ కార్డ్ పై చేసిన కొనుగోళ్ల వివరాలను కూడా ఒక పుస్తకంలో వ్రాసుకోండి. దీని వలన మీరు ఎంత సొమ్మును ఏ విధంగా మీ ఖాతానుంచి ఖర్చు చేశారో అవగాహనకల్గి ఉంటారు. రశీదులు మీ ఖాతాయొక్క సమాచారం అందించి ఖాతాయెడల జాగ్రత్త వహించేటందుకు తోడ్పడతాయి. ఆయా రశీదులను భద్రపరచండి. రశీదులను చించి వేయదలిస్తే వాటిని చిన్న ముక్కలుగా చేసే యంత్రాన్ని వినియోగించి ముక్కలు. చేసి భద్రమైన రీతిలో పారవేయండి.

పాన్ కార్డ్- తరచు అడిగే ప్రశ్నలు

1.పాన్ అంటే ఏమిటి?

ఆదాయంపన్ను శాఖ (ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ ) , మీ ఖాతాకు శాశ్వతంగా కేటాయించే సంఖ్యను ( పర్మినెంట్ అకౌంట్ నంబర్ .. పి ఏ ఎన్ ) పాన్ అంటారు. ఇది అంకెలు, అక్షరాలతో కూడిన పది స్థానాల సంఖ్య. ఈ సంఖ్యను లామినేట్ చేసిన కార్డుపై ముద్రించి ఆదాయంపన్ను శాఖ అందజేస్తుంది. ఉదాహరణకు పాన్ ఇలాఉంటుంది. ఏఏబిపిఎస్1205ఇ. { సెక్షన్ 139 ఏ (7) వివరణ (బి) మరియు (సి) }

2.పాన్ కలిగివుండవలసిన అవసరం ఏమిటి?

ఆదాయంపన్నును ప్రకటించే పత్రాలలో (రిటన్) , ఆ శాఖకుచెందిన ఏ అధికారితోనైనా జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో పాన్ ను పేర్కొనడం తప్పనిసరి. 2005 జనవరి నుంచి, ఆదాయంపన్ను శాఖకు చెల్లించవలసిన అన్ని చలాన్లపైన పాన్ పేర్కొనడం తప్పనిసరిచేశారు. {సెక్షన్ 139 ఏ (5) (ఏ) (బి) మరియు (బి)} ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు (సి బి డి టి )ఎప్పటికప్పుడు ప్రకటించే, ఆర్ధికలావాదేవీలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలలోకూడా పాన్ ను విధిగా పేర్కొనాలి. స్థిర ఆస్తులు లేదా వాహనాల కొనుగోలు, లేదా హోటళ్ళు, రెస్టారెంట్‌లకు 25,000/- రూపాయలకు పైబడి చేసే చెల్లింపులు, లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆర్ద్కిక లావాదేవీల వంటివి ఈ కోవలోకి వస్తాయి. టెలిఫోన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ పొందాలన్నా పాన్ ను పేర్కొనడం తప్పనిసరి. బ్యాంకులో లేదా పోస్టాఫీసులో 50,000 రూపాయలకు పైబడిన కాలపరిమితి డిపాజిట్లకు చెల్లించాలన్నా, బ్యాంకులో 50,000 రూపాయలు, అంతకు మించి నగదు చెల్లించాలన్నా కూడా పాన్ నంబర్‌ను పేర్కొని తీరాలి. { సెక్షన్ 139 ఏ (5) 114 బి నిబంధనతో కలిపి చదువుకోవాలి }

3.పైన పేర్కొన్న లావాదేవీలలో, పాన్ ను పేర్కొనే విధంగా, ఆదాయంపన్నుశాఖ ఏ విధంగా శ్రద్ధ వహిస్తుంది ?

సి బి డి టి ప్రకటించిన ఆర్ధిక, ద్రవ్య లావాదేవీలకు సంబంధించిన పత్రాలలో తన పాన్ పేర్కొనడం, ఆ పత్రాలను అందుకునే వ్యక్తి చట్టబద్ధమైన బాధ్యత.

{Section139A (6)}

4. ఇన్‌కం టాక్స్ రిట ర్న్ లో పాన్ విధిగా పేర్కొనాలా ?

అవును, ఇన్‌కం టాక్స్ రిట ర్న్ లో పాన్ ను విధిగా పేర్కొనాలి.

5. అధికారులు పాన్ ను ఎలా సరిచూడగలుగుతారు ?

పాన్ ను సరిచూడగలిగే సదుపాయం ఇన్‌కం టాక్స్ వెబ్ సైట్ లో వుంటుంది.

6.ఎవరెవరికి తప్పనిసరిగా పాన్ వుండాలి?

i. ప్రస్తుతం ఆదాయం పన్ను చెల్లించవలసినవారికి, చెల్లించేవారందరికి, ఇతరుల తరఫున ఇన్‌కం టాక్స్ రిటన్ రిటర్న్ దాఖలుచేయవలసినవారికి కూడా పాన్ వుండడం తప్పనిసరి.

{Section 139A (1) and (1A)}

ii. విధిగా పాన్ పేర్కొనవలసిన ఆర్ధిక లావాదేవీలలోకి కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి కూడా పాన్ తప్పనిసరిగా ఉండాలి

{ Section 139A (5) (c) read with Rule 114B}

iii. ఆదాయం పన్నును లెక్కిం చే అధికారి తనకు తానుగా కాని, ఆ వ్యక్తి నుంచి అందే అభ్యర్ధనపైన కాని ఎవరికైనా పాన్ కేటాయించవచ్చు.

{Section 139A (2) and (3)}

7. ఒక వ్యక్తి, ఒకటికంటె ఎక్కువ పాన్ లు పొందవచ్చునా ? ఉపయోగించవచ్చునా?

ఒకటికంటె ఎక్కువ పాన్ లు పొందడం లేదా ఉపయోగించడం చట్ట విరుద్ధం

{Section 139A (7)}

8. పాన్‌కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి?

పాన్ కు సంబంధించిన సేవలను మెరుగుపరచడంకోసం, ఇన్‌కం టాక్స్ కార్యాలయం వున్న ప్రతిపట్టణంలో ఐ టి పాన్ సేవా కేంద్రాలను ఏర్పాటుచేయడానికి యు టి ఐ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ ( యు టి ఐ ఐ ఎస్ ఎల్ ) సంస్థకు ఆదాయం పన్ను శాఖ అధికారం కల్పించింది. . టిన్ ఫెసిలిటేషన్ సెంటర్స్ నుంచి పాన్ సేవలను అందించడానికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ( ఎన్ ఎస్ డి ఎల్ ) సంస్థకు కూడా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారం కల్పించింది. పెద్ద నగరాలలోని పాన్ దరఖా స్తుదారుల సౌకర్యంకోసం, యు టి ఐ ఐ ఎస్ ఎల్ ఒకటికంటె ఎక్కువ ఐ టి పాన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటుచేసింది. అదేవిధంగా, టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లుకూడా ఒకటికి మించి ఏర్పాటయ్యాయి.

9. పాన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? తెల్ల కాగితంపైన దరఖాస్తు చేయవచ్చునా ?

ఫారం 49 ఏ లోనే పాన్ కోసం దరఖాస్తు చేయాలి. ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ కు చెందిన వెబ్ సైట్ నుంచి , లేదా యు టి ఐ ఐ ఎస్ ఎల్ , లేదా ఎన్ ఎస్ డి ఎల్ వెబ్ సైట్ (www.incometaxindia.gov.in, లేదా www.utiisl.co.in లేదా tin.nsdl.com) నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న , లేదా స్థానికం గా ముద్రించిన, లేదా (ఏ 4 సైజు 70 జి ఎస్ ఎం మందం కలిగిన పేపర్ పై ) జిరాక్స్ చేసిన , లేదా ఇతర ఏ విధంగా నైనా పొందిన దరఖాస్తు పత్రంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తు ఫారాలు ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ల లో, టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లలో కూడా లభిస్తాయి.

10.ఎక్కడినుంచైనా పొందిన, ఫారం 49 ఏ లో, పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునా ?

అవును. ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ల నుంచి, టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లనుంచి కాకుండా , ఇతరత్రా ఎక్కడినుంచైనా పొందే ఫారం 49 ఏ లో పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ కు చెందిన వెబ్ సైట్ నుంచి , లేదా యు టి ఐ ఐ ఎస్ ఎల్ , లేదా ఎన్ ఎస్ డి ఎల్ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న , లేదా స్థానికం గా ముద్రించిన, లేదా జిరాక్స్ చేసిన దరఖాస్తు పత్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

11. పాన్ కోసం ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చునా?

అవును, కొత్తగా పాన్ కేటాయింపు కోసం ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఇంతేకాకుండా, పాన్ సమాచారంలో ఏవైనా మార్పులు చేయాలనుకున్నా, కొత్త పాన్‌కార్డు పొందాలనుకున్నా ( పాన్ వుండి కార్డు మాత్రమే కొత్తది పొందడం ), ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ( మరిన్ని వివరాలకోసం (www.tin-nsdl.com) వెబ్ సైట్ లో చూడండి ).

12. నేను త్వరగా పాన్ పొందడం (తత్కాల్) ఎలా?

పాన్ కోసం ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తుచేసుకుని, నామినేటెడ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లిస్తే, ప్రాధాన్య ప్రాతిపదికపై పాన్ కేటాయించి. ఆ సమాచారం ఇ-మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.

13. ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడవున్నదో తెలుసుకోవడం ఎలా ?

ఏ పట్టణంలోనైనా ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడవున్నదో అక్కడి ఆదాయంపన్ను కార్యాలయాన్ని గాని, లేదా అక్కడి యు టి ఐ / యు టి ఐ ఐ ఎస్ ఎల్ / ఎన్ ఎస్ డి ఎల్ కార్యాలయాన్ని గాని సంప్రదిం చి తెలుసుకోవచ్చు. లేదా ఆదాయం పన్ను శాఖ ( ), లేదా యు టి ఐ ఐ ఎస్ ఎల్ ( ), లేదా ఎన్ ఎస్ డి ఎల్ ( ) వెబ్ సైట్ ద్వారాకూడా తెలుసుకోవచ్చు.

14. ఈ ఐ టి పాన్ సర్వీస్ సెంటర్లు లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏ ఏ సేవలను అందిస్తాయి?

ఐ టి పాన్ సర్వీస్ సెంటర్లు లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లు పాన్ దరఖాస్తు ఫారాలను ( ఫారం 49 ఏ ), కొత్త పాన్‌కార్డు దరఖాస్తు ఫారాలను , పాన్ సమాచారంలో మార్పులు చేయడానికి దరఖాస్తుచేసుకునే ఫారాలను సమకూర్చుతాయి. దరఖాస్తులను పూర్తిచేయడంలో, దరఖాస్తుదారుకు సహకరిస్తాయి, పూర్తిచేసిన ఫారాలను తీసుకుని, రసీదు ఇస్తాయి. ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి పాన్ వచ్చిన తర్వాత, యు టి ఐ ఐ ఎస్ ఎల్ లేదా ఎన్ ఎస్ డి ఎల్ , (ఎవరు ఆ పాన్ అందుకుంటారో వారు) దానిని కార్డు మీద ముద్రించి, దరఖాస్తుదారుకు ఆ కార్డు అందజేస్తారు.

15. నేను ఫారం 49 ఏ ను అసంపూర్తిగా అందజేస్తే ఏమవుతుంది ?

ఐ టి పాన్ సర్వీస్ సెంటర్లు లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లు అసంపూర్తిగా వున్న లేదా లోపాలతోకూడిన పాన్ దరఖాస్తు ఫారాలను స్వీకరించవు. అయితే, దరఖాస్తుదారు అవసరం మేరకు ఫారం 49 ఏ , లేదా కొత్త పాన్‌కార్డుకోసం దరఖాస్తు , లేదా పాన్ సమాచారంలో మార్పులకు ఉద్దేశించిన దరఖాస్తు ఫారాలను సక్రమంగా పూర్తిచేయడంలో ఈ సెంటర్లు దరఖాస్తుదారులకు సహకరిస్తాయి.

16. ఫారం 49 ఏ దరఖాస్తుతో పాటు ఏ ఏ పత్రాలను జతచేయాలి, లేదా ఏ సమాచారం పొందుపరచాలి ?

అ) వ్యక్తిగత దరఖాస్తుదారు ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోను ( స్టాంపు సైజు : 3.5 x 2.5 సెం. మీ.) దరఖాస్తు ఫారం పై అతికించాలి.
ఆ) గుర్తుపట్టడానికి రుజువుగా , చిరునామాకు రుజువుగా 114 నిబంధనలో పెర్కొన్న ఏదోఒక పత్రాన్ని జతచేయాలి.
ఇ) మీ దరఖాస్తును పరిశీలించే సంబంధిత ఇన్‌కంటాక్స్ అధికారి ( అసెసింగ్ ఆఫీసర్ ) హోదాను, కోడ్ ను ఫారం 49 ఏ లో పేర్కొనాలి.

17. వ్యక్తిగత దరఖాస్తుదారుల విషయంలో, (మైనర్లు, హెచ్ యు ఎఫ్ దరఖాస్తుదారులతో సహా) గుర్తుపట్టడానికి రుజువుగా ఏ ఏ పత్రాలు పనికివస్తాయి?

స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ , గుర్తింపుపొందిన విద్యా సంస్థనుంచి పొందిన డిగ్రీ, డిపాజిటరీ ఖాతా, క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతా, నీటి బిల్లు, రేషన్ కార్డు, ఆస్తిపన్ను విధింపు ఉత్తర్వు, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎం.పి. లేదా ఎం.ఎల్ ఏ, లేదా మునిసిపల్ కౌన్సిలర్ లేదా గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతోకూడిన గుర్తింపు పత్రం ...వీటిలో ఏదో ఒకదాని నకలును (కాపీ) వ్యక్తిగత గుర్తింపునకు రుజువుగా అందజేయవచ్చు.

పాన్ దరఖాస్తుదారు మైనర్ అయితే, ఆ దరఖాస్తుదారు తలిదండ్రులు లేదా సంరక్షకుని కి సంబంధించి, పైన పేర్కొన్న ఏదో ఒక గుర్తింపు పత్రం అందజేయవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం ( హెచ్ యు ఎఫ్ ) తరఫున పాన్ కోసం దరఖాస్తు చేస్తే, ఆ కుటుంబ కర్తకు సంబంధించి పైన పేర్కొన్న ఏ పత్రం నకలునైనా రుజువుగా అందజేయవచ్చు.

18. వ్యక్తిగత దరఖాస్తుదారులకు (మైనర్లు,, హెచ్ యు ఎఫ్ దరఖాస్తుదారులతోసహా ) చిరునామాకు రుజువంటే ఏమిటి ?

ఎలెక్ట్రిసిటి బిల్లు, టెలిఫోన్ బిల్లు, డిపాజిటరీ ఖాతా, క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతా, నీటి బిల్లు, రేషన్ కార్డు, ఉద్యోగి గా గుర్తిస్తూ యాజమాన్యం ఇచ్చే సర్టిఫికేట్, ఆస్తిపన్ను విధింపు ఉత్తర్వు, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అద్దె రశీ దు, ఎం.పి. లేదా ఎం.ఎల్ ఏ, లేదా మునిసిపల్ కౌన్సిలర్ లేదా గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతోకూడిన చిరునామా ధ్రువీకరణ పత్రం ...వీటిలో ఏదో ఒకదాని నకలును (కాపీ) చిరునామాకు రుజువుగా అందజేయవచ్చు.
పాన్ దరఖాస్తుదారు మైనర్ అయితే, ఆ దరఖాస్తుదారు తలిదండ్రులు లేదా సంరక్షకుని కి సంబంధించి, పైన పేర్కొన్న ఏ పత్రం నకలునైనా చిరునామాకు రుజువుగా అందజేయవచ్చు.
హిందూ అవిభాజ్య కుటుంబం ( హెచ్ యు ఎఫ్ ) తరఫున పాన్ కోసం దరఖాస్తు చేస్తే, ఆ కుటుంబ కర్తకు సంబంధించి పైన పేర్కొన్న ఏ పత్రం నకలునైనా చిరునామాకు రుజువుగా అందజేయవచ్చు.

19 ఇతర దరఖాస్తుదారులకు, వ్యక్తిగత గుర్తింపునకు, చిరునామాకు రుజువుగా ఏ పత్రాలు పనికివస్తాయి ?

కంపెనీల రిజిస్ట్రార్ జారీచేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నకలు ; ఫర్మ్స్ రిజిస్ట్రార్ జారీచేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నకలు; చారిటీ కమిషనర్ జారీచేసిన పార్ట్ నర్‌ షిప్ డీడ్ నకలు, లేదా ట్రస్ట్ డీడ్ నకలు, లేదా రిజిస్ట్రేషన్ నంబర్ సర్టిఫికేట్ నకలు ; లేదా చారిటీ కమిషనర్‌, లేదా సహకార సంఘాల రిజిస్ట్రార్ లేదా సంబంధిత అధికారపరిధి కలిగిన ఏ అధికారి అయినా జారీచేసిన అగ్రిమెంట్ నకలు, లేదా రిజిస్ట్రేషన్ నంబర్ సర్టిఫికేట్ నకలు ; లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వశాఖలలో దేనినుంచైనా దరఖాస్తుదారు వ్యక్తిగత గుర్తింపును, చిరునామాను వెల్లడిస్తూ జారీ అయ్యే ఇతర ఏ పత్రాన్ని అయినా ఇతర దరఖాస్తుదారుల వ్యక్తిగత గుర్తింపునకు, చిరునామాకు రుజువుగా అందజేయవచ్చు.

20. అసెసింగ్ ఆఫీసర్ కోడ్ తెలుసుకోవడం ఎలా?

అసెసింగ్ ఆఫీసర్ కోడ్, మీరు మీ ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలుచేసే ఇన్‌కంటాక్స్ కార్యాలయంలో లభించవచ్చు. అంతకుముందు, ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలుచేయని దరఖాస్తుదారులు, ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ నుంచిగాని,టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌నుంచిగాని, జ్యురిసిడిక్షనల్ ఇన్‌కంటాక్స్ కార్యాలయంనుంచిగాని పొందవచ్చు.

21 పాన్ దరఖాస్తుకు ఫోటో తప్పనిసరా?

వ్యక్తిగత దరఖాస్తుదారులకు మాత్రమే ఫోటో తప్పనిసరి

22. సంతకంచేయలేని దరఖాస్తుదారుల మాటేమిటి?

అలాంటివారు, ఫారం 49 ఏ లో, లేదా కొత్త పాన్‌కార్డు దరఖాస్తు ఫారంలో , లేదా పాన్ సమాచారంలో మార్పులు చేయడానికి దరఖాస్తుచేసుకునే ఫారంలో , సంతకంకోసం నిర్దేశించిన చోట, తన ఎడమమచేతి బొటనవేలి గుర్తు వేయాలి. దానిని ధ్రువీకరిస్తున్నట్టు , మేజిస్ట్రేట్, లేదా నోటరీ, లేదా ప్రభుత్వ గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి, వారి అధికారిక ముద్ర ( మొహరు ) వేయించి పంపాలి.

23.మహిళలకు తండ్రిపేరు తప్పనిసరా (వివాహిత / విడాకులు తీసుకున్న / వితంతు అభ్యర్థులతో సహా ) ?

పాన్ దరఖాస్తులో ( ఫారం 49 ఏ లో ) కేవలం తండ్రిపేరే వ్రాయవలసివుంటుంది. మహిళా దరఖాస్తుదారులు, వారి వివాహ స్థితితో నిమిత్తంలేకుండా, తండ్రిపేరు మాత్రమే వ్రాయాలి.

24. ఫారం 49 ఏ లో టెలిఫోన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలా?

టెలిఫోన్ నంబర్ తప్పనిసరి కాదు. అయితే, టెలిఫోన్ నంబర్ పేర్కొంటే, సమాచారం త్వరగా అందించడానికి వీలవుతుంది.

25. దేశంలో నివసించని వ్యక్తి, మైనర్, మతిస్థిమితం లేని వ్యక్తి, మందమతి, బాల వారసుల తరఫున ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ఐ టి చట్టం , 1961 లోని 160 వ సెక్షన్ ప్రకారం, దేశంలో నివసించని వ్యక్తి, మైనర్, మతిస్థిమితం లేని వ్యక్తి, మందమతి, బాల వారసులు, ఇంకా ఈ కోవకు చెందినవారి తరఫున, ప్రాతినిధ్య (రెప్రెజెంటెటివ్) అసెసీ దరఖాస్తు చేయవచ్చు.

26. నేను ఆదాయం పన్ను శాఖకు దరఖాస్తు చేసుకున్నాను; కాని నా పాన్ ఏమిటో నాకు తెలియదు. తెలుసుకోవడం ఎలా ?

మీరు, దయచేసి ఆయకర్ సంపర్క్ కేంద్ర ( ఆస్క్) ను సంప్రతించండి. ఆస్క్ ఫోన్ నంబర్: 0124-2438000 ( లేదా ఎన్ సి ఆర్ నుంచి 95124-2438000 ), లేదా www.incometaxindia.gov.in వెబ్ సైట్‌లో (" నో యువర్ పాన్ ") నుంచి తెలుసుకోండి.'know your PAN'

27 ఐ టి పాన్ సర్వీస్ సెంటర్‌లో లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఏదైనా ఫీజు చెల్లించవలసి వుంటుందా?

ఒక్కొక్క పాన్ దరఖాస్తుకు 85 రూపాయలు + దానికి వర్తించే సర్వీసు సుంకం వసూలుచేసుకోవడానికి యు టి ఐ ఐ ఎస్ ఎల్ , ఎన్ ఎస్ డి ఎల్ లకు అధికారం ఇవ్వడం జరిగింది. సురక్షితంగా వుండే పాన్ కార్డు ఖరీదు కూడా ఇందులో వున్నది. ఐ టి పాన్ సర్వీస్ సెంటర్‌లో లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించవలసి వుంటుంది.

28. ఒక నగరం లేదా పట్టణం నుంచి మరొక చోటికి వెళ్ళినా లేదా బదిలీ అయినా మళ్ళీ పాన్‌కోసం దరఖాస్తు చేసుకోవాలా?

పాన్ ( పర్మినెంట్ అకౌంట్ నంబర్...శాశ్వత ఖాతా సంఖ్య ) అనే పేరును బట్టే, అది శాశ్వత సంఖ్య. పాన్ ఖాతాదారు జీవితకాలంలో దానిలో మార్పు వుండదు. అయితే, వున్న నగరమో, పట్టణమో మారినందువల్ల అసెసింగ్ ఆఫీసర్ మారవచ్చు. అందువల్ల, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ ‘సమాచార కోశం’ ( డేటా బేస్) లో తగిన విధంగా మార్పుచేయడానికి వీలుగా, ఇలాంటి మార్పులను గురించి, సమీపంలోని, ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ , లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్ లో తప్పనిసరిగా తెలియజేయాలి. కొత్త పాన్ కార్డు / పాన్ సమాచారంలో మార్పుల కు సంబంధించిన దరఖాస్తు రూపంలో ఈ అభ్యర్ధనలు చేయవలసి వుంటుంది.

29 నేను నెలక్రిందటనే యు టి ఐ టి ఎస్ ఎల్ / ఎన్ ఎస్ డి ఎల్ కు దరఖాస్తు చేశాను , కాని ఇప్పటివరకు నాకు పాన్ కార్డ్ రాలేదు. నేను ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలుచేయవలసి వుంది . ఏం చేయాలి ?

మీరు, దయచేసి ఆయకర్ సంపర్క్ కేంద్ర ( ఆస్క్) ను సంప్రతించండి. ఆస్క్ ఫోన్ నంబర్: 0124-2438000 ( లేదా ఎన్ సి ఆర్ నుంచి 95124-2438000 ), లేదా www.incometaxindia.gov.in వెబ్'know your PAN' (" నో యువర్ పాన్ ") నుంచి తెలుసుకోండి లేదా pan@incometaxindia.gov.in కు ఇ-మెయిల్ పంపండి.

30. ఆదాయం పన్ను శాఖ జారీ చేసిన కార్డులు మావద్ద ప్రస్తుతం వున్నాయి. అవి ఇకపైకూడా చెల్లుబాటు అవుతాయా ?

ఆదాయం పన్ను శాఖ కేటాయించిన అన్ని పాన్ లు., జారీచేసిన అన్ని పాన్ కార్డులు చెల్లుబాటు అవుతూనేవుంటాయి. ఒకసారి పాన్ పొందినవారు మళ్ళీ దరఖాస్తుచేయవలసిన అవసరంలేదు.

31. ఆదాయం పన్ను శాఖ నాకు పాన్ కార్డు జారీ చేసింది. అయితే, నేను ఇప్పుడు సురక్షితమైన పాన్ కార్డును పొందవచ్చునా ?

సురక్షితమైన పాన్ కార్డు పొందడంకోసం, కొత్త పాన్‌కార్డు / పాన్‌కార్డులో సమాచా రం మార్పునకు సంబంధించిన దరఖాస్తు ఫారంలో, ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు దరఖాస్తుచేయవలసి వుంటుంది. ఈ దరఖాస్తులో మీరు మీ ప్రస్తుత పాన్ ను పేర్కొని, ఆ పాన్ కార్డును అప్పగించవలసి వుంటుంది. కొత్త పాన్‌కార్డుకోసం 60 రూపాయలు + సంబంధిత సర్వీసు చార్జి చెల్లించవలసి వుంటుంది.

32.నేను పాన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. నాకు పాన్ నంబర్ వచ్చిందికాని, పాన్ కార్డు ఇంకా రాలేదు. ఏం చేయాలి ?

మీకు కేటాయించిన పాన్ నంబర్‌ను పేర్కొంటూ, కొత్త పాన్ కార్డు కోసం లేదా పాన్‌సమాచారంలో మార్పుకోసం ఉద్దేశించిన దరఖాస్తు ఫారాన్ని నింపి, ఏదైనా ఐ టి పాన్ సర్వీస్ సెంటర్‌లోకాని, టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌లొకాని దాఖలుచేయండి.

34. నేను, ఈ రోజే పన్ను చెల్లించాలనుకుంటున్నాను. కాని, నాకు పాన్ లేదు. నేను ఏం చేయాలి ?

కొత్తగా పాన్ కేటాయించబడాలంటే, దాదాపు 15 రోజులు పడుతుంది. అయితే, ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేసి, ప్రాసెసింగ్ రుసుమును క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే, దాదాపు 5 రోజులలోనే పాన్‌ను పొందవచ్చు. కాని, పాన్ పొందడానికి తగినంత ముందుగానే చర్యలు చేపట్టాలని సలహా.

35. పాన్ దరఖాస్తులకు సంబంధించిన సమాచారంకోసం ఎవరిని సంప్రదిం చాలి ?

ఈ విషయాలను గురించి ఈ కిందివారిని సంప్రదిం చవచ్చు:

యు టి ఐ ఐ ఎస్ ఎల్ విషయంలో

ఎన్ ఎస్‌డి ఎల్ విషయంలో

ది వైస్ ప్రెసిడెంట్,
ఐ టి పాన్ ప్రాసెసింగ్ సెంటర్,
యు టి ఐ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ ,
ప్లాట్ నం: 3 , సెక్టర్: 11,
సి బి డి -బేలాపూర్, నవీ ముంబై- 400 614
ఇ-మెయిల్ : utiisl-gsd@mail.utiisl.co.in
టెలిఫోన్ నం: 022-27561690

ఫాక్స్ నం: 022-27561706

ది వైస్ ప్రెసిడెంట్,
ఇన్‌కం టాక్సెస్ పాన్ సర్వీసెస్ యూనిట్, ఎన్ ఎస్ డి ఎల్,
4 వ అంతస్తు, ట్రేడ్ వరల్డ్ , ' ఏ ' వింగ్ ,
కమల మిల్స్ కాంపౌండ్ ,
ఎస్ బి మార్గ్ , లోవర్ పరేల్, ముంబై-400 013
ఇ-మెయిల్ : tininfo@nsdl.co.in
టెలిఫోన్ నం: 022-2499 4650
ఫాక్స్ నం: 022-2495 0664

ఆధారము: http://www.incometaxindia.gov.in/pan/overview.aspa

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఎ.టి.ఎం.) గురించి తెలుసుకోవలసిన విషయాలు

ఎ.టి.ఎం.)ను వ్యాపారపరంగా మొదటి సారి 1960 లో ప్రవేశపెట్టారు. 2005 నాటికి ప్రపంచంలో 15 లక్షల ఎ.టి.ఎం.లు వాడుకలో ఉన్నాయి. ఈ ఎ.టి.ఎం.ల ద్వారా ఆర్ధిక సంస్థలు వారి వినియోగదారులకు 24 X 7, అంటే వారంలోని ఏడు రోజులూ, రోజుకి ఇరవై నాలుగు గంటలూ సేవలందించడానికి సాంకేతిక పరంగా దోహదపడ్డాయి. ఈ ఎ.టి.ఎం.ల వలన వినియోగదారులు ఎప్పుడైనా, వారికి చేరువలో ఉన్న ఎ.టి.ఎం. నుండి నగదు తీసుకునే వెసులుబాటు కలిగింది.

ఎ.టి.ఎం.ల వద్ద భద్రతను పెంచడానికి, మోసాలకు ఆస్కారం లేకుండా ఉండడానికీ ఆర్ధిక సంస్థలు అనేకమైన పద్ధతులను అవలంభించారు. ఇందులో కొన్ని: ఎ.టి.ఎం.ను పెట్టడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం, నిఘా వీడియో కెమేరాలను అమర్చడం, రిమోట్ పద్ధతిలో పర్యవేక్షించడం, ఆంటీ కార్డ్ స్కిమ్మింగ్ పరిష్కారాలు మరియు ఎ.టి.ఎం.ల వద్ద లేక ఇంటర్నెట్ లోనూ లావాదేవీలు నడిపేటప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలో అన్న పద్ధతులపై వినియోగదారులను చైతన్యపరచడం.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

సమృద్ధి-1వ భాగం

సమృద్ధి-2వ భాగం

ప్రభుత్వ ఉద్యోగులకు మరియు సాధారణ ప్రజల కొరకు తపాలా జీవిత భీమా

పరస్పర సహాయ సహకార సంఘ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం 1995 అనుసారం ఈ పుస్తకంలో పొడుపు, అప్పు సంబంధించిన అంశాలు, పుస్తక నిర్వహణ, లెక్కల తనిఖీ, సహకార సంఘాల పరిపాలన మరియు నష్ట నిర్వహన్ వంటి అంశాలు పొందుపరచటం జరిగింది.

పరస్పర సహాయ సహకార సంఘ నిర్వహణ కరదీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆధారము: ది లైవ్లీ హుడ్స్ ప్రొమోషన్ స్కూల్

3.05882352941
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు