షెడ్యూల్డ్ కులాల (SC) సంక్షేమము
భారత ప్రజారాజ్యపు 40వ సంవత్సరములో భారతదేశ పార్లమెంటుచే, షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం 1989 (1989 యొక్క .నెం.33) చట్టం చేయడమైనది. ఆ చట్టానికి సంబందించిన వివరములు ఈ పోర్టల్ నందు లభించను.
- Contents
భారత ప్రజా రాజ్యపు 40వ సంవత్సరములో భారతదేశ పార్లమెంటుచే, ఈ క్రింది విధంగా శాసనం చేయడం జరిగింది.
అధ్యాయం-I ఉపక్రమణిక
సంగ్రహనామం, పరిధి మరియు ప్రారంభం
- ఈ చట్టాన్ని షెడ్లూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 అని పిలవవచ్చు.
- ఇది ఒక్క జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రానికి మినహా భారతదేశానికంతటికీ విస్తరించి ఉంటుంది,
- కేంద్ర ప్రభుత్వపు అధికారిక రాజపత్రంలో (అఫిషియల్ గెజెట్) ప్రకటన (నోటిఫికేషన్) ద్వారా, నిర్ణయించిన తేదీ నుండి ఈ చట్టం అమలులోకి వస్తుంది.
నిర్వచనాలు
- ఈ చట్టంలో సందర్భాన్ని బట్టి అర్ధం వేరే విధంగా ఉంటేనే తప్ప ఈక్రింది విధంగా నిర్వచించుకోవచ్చు.
- అత్యాచారం అంటే విభాగం (సెక్షన్) 3 క్రింది శిక్షింపదగిన ఒక నేరం, అపరాధం.
- ప్రవర్తన (కోడ్) అంటే నేరప్రవర్తనా శిక్షణా నియమావళి ) Code of Criminal Procedure), 1973 (1074 యొక్క 2)
- షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అంటే భారత రాజ్యాంగంలోని, 366వ ప్రకరణం యొక్క క్లాజు (24) మరియు క్లాజు (25) క్రింద వీరికి, ఆ వరుసలో, ఆపాదించబడిన అర్ధాన్ని కలిగివుంటాయి
- ప్రత్యేక న్యాయస్ధానం అంటే విభాగం 14లో ఒక ప్రత్యేకంగా స్పష్టంచేసిన న్యాయస్ధానమనే ప్రత్యేక సెషన్ న్యాయస్ధానం.
- ప్రత్యేక ప్రభుత్వ విచారణకర్త (పబ్లిక్ ప్రాసిక్యూటర్) అంటే ఒక ప్రభుత్వం తరపున వక్తాలా పుచ్చుకున్న న్యాయవాది.
- ఈ చట్టంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, వాడిన పదాలు, మాటలు, భావాలు మరియు ప్రవర్తనా నియమావళి లో గానీ లేక భారతీయ శిక్షాస్మృతి (1866 యొక్క 45) లోనివి తిరిగి నిర్వచింపబడినవి, ఈ నియమావళి (కోడ్) లో వాటికి ఆపాదించబడిన అర్ధాలను కలిగివుంటాయి, లేక సందర్భాన్ని బట్టి, భారతీయ శిక్షాస్మృతిలో ఉన్నట్లుగా కూడా ఉంటాయి.
- ఏ శాసనానికైనా సరే, లేక దానిలోని ఏ అంశాలకైనా, అటువంటి శాసనం లేక అంశం అమలులో లేని ప్రాంతానికి సంబంధించి, ఆ ప్రాంతంలో అది వరకే అమలులో వుండే ఏదైనా చట్టం ఉంటే దానికి అనుగుణంగా, దానికి సంబంధించినదిగా ఈ చట్టంలో చేయబడిన రిఫరెన్స్ (నిర్దేశకం, సూచన) గా భావించడం జరుగుతుంది.
అధ్యాయం-II అత్యాచారాలకు సంబంధించిన నేరాలు
అత్యాచారాలకు సంబంధించిన నేరాలకు శిక్షలు
షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగలకు చెందని, సభ్యుడు కానటువంటి ఎవరైనా సరే
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుణ్ణి ఏవిధమైన మరువలేని లేక దుర్ఘంధపూరితమైన పదార్ధాన్ని త్రాగమని గాని లేక తినమని గాని బలవంతం చేసినా
- మలమూత్రాదులను, వ్యర్ధపదార్ధాలను, జంతువుల కళేబరాలు, అవయవ ఖండాలు లేక ఏవిధమైన దుర్గంధపూరితమైన పదార్ధాన్ని గాని షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల వారి ప్రాంగణంలో గానీ, లేక వారి ఇరుగు, పొరుగువారి ప్రాంగణంలో గాని పారవేయడం, వారికి గాయాలను కలుగజేయాలని, అవమానించాలని లేక చిరాకును పుట్టించాలని తలంపుతో చేసే చేష్టలు
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల వారి వంటిపై నుండి బలవంతంగా దుస్తులను తొలగించడం లేక వారిని దిగంబరంగా నలుగురి ముందు నడిపించడం (పేరేడ్) గానీ లేక రంగు వేసిన ముఖంతో గానీ లేక శరీరంతో గానీ లేక మానవ మర్యాదకు, సభ్యతకు చేటు కలిగించే అటువంటి ఏ పని చేసినా
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యులకు కేటాయించబడిన, దురుద్దేశపూర్వకంగా, తప్పుగా ఆక్రమించడం లేక వారు స్వంతంగా కలిగివున్నలేక కేటాయింపబడిన, లేక వారికే కేటాయించాలని ఏ అధికారం గల అధికారిచేతనైనా ప్రకటింబపబడిన ఏ భూమినైనా సాగు చేసినా, లేక వారికి కేటాయించబడిన భూమిని తనకు బదలాయించుకున్నా
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యునికి చెందిన భూమిని లేక ప్రాంగణాన్నివారికి లేకుండా చేయడం లేక ఏ భూమిపైనైనా, ప్రాంగణంపైనైనా లేక నీటిపైనైనా వారికున్న హక్కులను అనుభవించనివ్వకుండా జోక్యం చేసుకుంటూ ఉన్నా
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుణ్ణి ‘బిచ్చగాడి‘ గా లేక అటువంటి ఇతర పనులను చేయమని లేక ప్రభుత్వంచే అప్పజెప్పబడిన ప్రజోపయోగం కోసం ప్రజాసేవకు సంబంధించిన పనులనుండి కాకుండా బలవంతంగా అతనిచే వెట్టిచాకిరీ చేయమని బలవంతం లేక ఉసిగొల్పడం చేసినా
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుణ్ణి ఒక ప్రత్యేక అభ్యర్ధికే ఓటు వేయమని, లేక చట్టప్రకారం కాకుండా వేరేవిధంగానైనా ఓటు వేయమని బలవంతం చేసినా లేక బెదిరించినా
- షెడ్యూల్డ్ కులాల లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుడిపై తప్పుడు, ద్వేషపూరితమైన లేక క్షోభను కలిగించే, హింసించే రీతిలో సూట్ (అభియోగం, దావా) లేక నేరసంబంధిత లేక ఇతర న్యాయ పరమైన వ్యాజ్యాలను చేపట్టినా
- ఒక ప్రజాసేవకుడు తనకున్న న్యాయపరమైన అధికారాన్ని వినియోగిస్తూ షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుడికి హాని కలిగించేటట్లుగా లేక చిరాకును కలిగిస్తూ హైరాన పెట్టే టట్లుగా, అటువంటి ప్రజాసేవకుడికి ఏ విధమైన తప్పుడు లేక అల్పబుధ్దితో, కొరగాని సమాచారాన్నిచ్చినా
- ప్రజాసమక్షంలో, బాహాటంగా షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుడిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేక చిన్నబుచ్చే, అగౌరవపరిచే ఉద్దేశంతో భయపెట్టి, బెదిరించడం వంటివి చేసినా
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళపై దౌర్జన్యం చేయడం లేక ఆమె గౌరవాన్ని భంగపరిచే ఉద్దేశ్యంతో ఆమె బిడియాన్ని, సఛ్చీలతపై బలాన్ని ఉపయోగించి దౌర్జన్యం చేసినా
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళ ఇష్టాయిష్టాలపై అధికారాన్ని చెలాయించే పరిస్ధితిలో ఉండి, అటువంటి అధికారాన్ని ఉపయోగిస్తూ అమెకు ఇష్టం లేక పోయినా లేక ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించినా
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉయోగించుకునే ఏ ఋతువులో లభించే నీటినైనా లేక జలాశయాన్ని (రిజర్వాయర్) పాడుచేయడం లేక కలుషితం చేయడం లేక షెడ్యూల్డ్ కులాలు లేక షెడ్యూల్డ్ తెగల వారు సాధారణంగా ఉపయోగించుకునే ఏ ఇతర ఆధారాలనైనా సరే, వాటిని సాధారణంగా ఉపయోగించుకోవడానికి ఆశించిన లక్ష్యానికి కాకుండా కేవలం అధమస్ధాయిలో ఉపయోంచుకునే లాగా చేసినా
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యులను ప్రజా సమావేశ స్ధలానికి వెళ్లే దారిని ఉపయోగించుకునే, రివాజైన హక్కును నిరాకరించడం, కాదనడం, లేక మామూలుగా ఇతర కులాల ప్రజానీకం లేక తదితర వర్గాలవారు దానిని ఉపయోగించుకునే, దానికి అందుబాటును కలిగివుండే హక్కును, ఇటువంటి షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యులు వినియో గించుకోవడంలో అడ్డుపడినా, నిరోధించినా
- షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుడిని అతని ఇంటిని, గ్రామాన్ని లేక ఇతర నివాస స్ధలాన్ని వదిలిపొమ్మని లేక అలా చేసేటట్లు అతణ్ణి బలవంతం చేసినా
ఆరు నెలలకు తక్కువ కాకుండా , ఐదు ఏళ్లకు మించి ఉండకుండా విధించబడే జైలుశిక్షతో పాటూ, జరిమానా కూడా విధించడం జరుగుతుంది.
ఎవరైనా సరే, షెడ్యూల్డ్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగలకు చెందిన సభ్యుడు కాకుండా ఉన్నప్పుడు
- ఏ షెడ్యూల్డ్ కులాల లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుడైనా, అప్పుడు అమలులో ఉన్న చట్ట ప్రకారం దోషిగా నిర్ణయింపబడి, మరణదండన వంటిది కాకపోయినా దాని కారణంగా అతను జరిమానాతో సహా జీవిత శిక్షను విధింపబడతాడని తెలిసి వుండి కూడా అతనికి వ్యతిరేకంగా కృత్రిమంగా కల్పించబడిన ఋజువును, సాక్ష్యాన్ని ఇవ్వడం మరియు ఒకవేళ అమాయకుడైన షెడ్యూల్డ్ కులాల లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుడు దోషిగా నిర్ణయింపబడి, అటువంటి తప్పుడు లేక కృత్రిమంగా ఇవ్వబడిన ఋజువులు, సాక్ష్యాల ఆధారంగా ఉరి తీయబడినపుడు, అటువంటి తప్పుడు, కృత్రిమంగా కల్పించబడిన ఋజువులను, సాక్ష్యాలను ఇచ్చిన వ్యక్తి మరణ శిక్షను విధించబడతాడు.
- ఏ షెడ్యూల్డ్ కులాల లేక షెడ్యూల్డ్ తెగల సభ్యుడైనా, చట్ట ప్రకారం దోషిగా నిర్ణయింపబడి, మరణ దండన వంటిది కాకపోయినా దాని కారణంగా అతను ఏడు సంవత్సరాల పాటు లేక మరింత అధిక కాలానికి పెంచబడిన శిక్షను విధింపబడతాడని తెలిసివుండి కూడా అటువంటి తప్పుడు, కృత్రిమంగా కల్పించబడిన ఋజువులను, సాక్ష్యాలను అతనికి వ్యతిరేకంగా ఇచ్చిన వ్యక్తి ఆరు నెలలకు తక్కువ కాకుండా ఏడేళ్ల వరకూ లేక మరింత అధిక కాలానికి పెంచబడిన శిక్షను జరిమానాతో సహా, విధించబడతాడు.
- తన తుంటరితనంతో అగ్నితోనూ లేక మరే ఇతర విస్ఫోటక పదార్ధాలతోనూ షెడ్యూల్డ్ కులాల లేక షెడ్లూల్డ్ తెగలకు చెందిన వ్యక్తియొక్క ఆస్తికి తను చేసే అటువంటి పని వల్ల నష్టం, హాని జరిగే అవకాశం ఉంటుందని తెలిసే వుండి కూడా అటువంటి పని చేసిన వ్యక్తి ఆరు నెలలకు తక్కువ కాకుండా, ఏడేళ్ల వరకూ లేక దానికి మించిన కాలానికి శిక్షను జరిమానాతో సహా, విధించబడతాడు.
- తన తుంటరితనంతో అగ్నితోనూ లేక మరే ఇతర విస్ఫోటక పదార్ధాలతోనూ షెడ్యూల్డ్ కులాల లేక షెడ్లూల్డ్ తెగలకు చెందిన, సాధారణంగా ఒక ప్రార్ధనాస్ధలంగా ఉపయోగించబడే లేక మనుషులు నివశిస్తూ ఉండే నివాస స్ధలం లేక షెడ్యూల్డ్ కులాల లేక షెడ్లూల్డ్ తెగల సభ్యుడు తన ఆస్తిని జాగ్రత్తగా తన అధీనంలో ఉంచుకుని, కాపాడుకుంటూ ఉండే స్ధలం వంటిది అయి వున్నప్పుడు తాను చేసే అటువంటి పని వల్ల నష్టం, హాని జరిగే అవకాశం ఉంటుందని తెలిసే వుండి కూడా అటువంటి పని చేసిన వ్యక్తి జీవిత ఖైదు శిక్షతో సహా జరిమానాను కూడా విధించబడతాడు.
- భారతీయ శిక్షాస్మృతి క్రింద (1866 యొక్క 45) క్రింద, 10 సంవత్సరాలు లేక అంతకు మించిన కాలవ్యవధికి శిక్షింపబడే నేరాన్ని ఒక వ్యక్తి షెడ్లూల్ట్ కులాలకు లేక షెడ్యూల్డ్ తెగలకు చెంది ఉన్నాడనే నెపంతో అతనికి లేక అటువంటి సభ్యునికి చెందివున్న ఆస్తికి, వ్యతిరేకంగా, చేసి నప్పుడు అటువంటి పని చేసిన వ్యక్తి జీవితఖైదు శిక్షతో సహా జరిమానాను కూడా విధించ బడతాడు.
- ఈ ఆధ్యాయం క్రింద నేరం చేయబడిందని తెలిసివుండి లేక అలా జరిగిందని నమ్మడానికి కారణం కలిగివుండి, ఆ విధంగా చేయబడిన నేరానికి సంబంధించిన సాక్ష్యాన్నీ, ఋజువులను, అటువంటి నేరగాణ్ణి చట్టప్రకారం విధించబడే శిక్షనుండి కాపాడాలనే ఉద్దేశంతో మాయం చేయడం, లేక అటువంటి నేరానికి సంబంధించి, అటువంటి ఉద్దేశంతోనే, తెలిసుండి, తప్పుడు వని నమ్ముతున్నా కూడా తప్పుడు ఋజువులను, సాక్ష్యాలను ఇవ్వడం వంటి పనులను చేసివ వ్యక్తి అటువంటి నేరానికి అనుగుణంగా ఉండే, తగిన శిక్షను విధించబడతాడు.
- ఒక ప్రజాసేవకుడై ఉండి, ఈ విభాగం క్రింద నేరం చేసిన వ్యక్తి, ఒక ఏడాదికి మించకుండానూ, ఆటువంటి నేరానికి అనుగుణంగా ఉండే తగిన కాలవ్యవధికి పెంచబడిన శిక్షను విధించబడతాడు.
విధులలో చూపించే అలసత్వానికి, నిర్లక్ష్యానికి శిక్ష
ఒక ప్రజాసేవకుడై ఉండి, కానీ షెడ్యూల్డ్ కులాల లేక షెడ్లూల్డ్ తెగల సభ్యుడు కానటువంటి ఎవరైనా సరే ఈ చట్టం క్రింద తను నిర్వహంచవలసిన విధులలో ఇష్టపూర్వకంగా అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే అటువంటి వారు ఆరు నెలలకు తక్కువ కాకుండా, లేక ఒక సంవత్సరం వరకూ పొడిగించబడే శిక్షను విధింపబడతారు.
నేరస్ధుడుగా సమయంలో చేసే నేరానికి పెంచబడిన శిక్ష:
ఈ విభాగం క్రింద ఇప్పటికే నేరస్ధుడుగా ఋజువైన ఏ వ్యక్తి అయినా సరే, రెండోసారి, రెండోనేరానికి లేక దరిమిలా చేసే ఏ నేరానికైనా నేరస్ధుడుగా ఋజువైతే, అటువంటి వ్యక్తి ఒక ఏడాదికి తక్కువ కాకుండానూ, ఆటువంటి నేరా నికి అనుగుణంగా ఉండే తగిన కాలవ్యవధికి పెంచబడిన శిక్షను విధించబడతాడు.
భారతీయ శిక్షా స్మృతిలోని కొన్ని అంశాలను వర్తింపచేయడం
ఈ చట్టంలోని అంశాలకు లోబడి, ఈ చట్టంలోని విభాగాలు 34, భారతీయ శిక్షా స్మృతి (1860 యొక్క 45)
కొంతమంది వ్యక్తుల ఆస్తులను జప్తు చేయడం
- ఈ అధ్యాయం క్రింద శిక్షార్హుడైన ఒక వ్యక్తి నేరస్ధుడుగా ఋజువైతే, లిఖితపూర్వకమైన ఆదేశంతో పాటుగా ప్రత్యేక న్యాయస్ధానం విధించే శిక్షకు అదనంగా, అటువంటి వ్యక్తికి చెందిన, అలాగే ఈ నేరం చేయడానికి వినియోగించబడిన ఏ ఆస్తి అయినా - స్ధిరాస్ధి గానీ లేక చరాస్ధి గానీ లేక రెండూ కూడా ప్రభుత్వానికి కోల్పోయినట్లుగా, ప్రకటించబడ (డిక్లేర్) వచ్చు.
- ఈ అధ్యాయం క్రింద ఏ నేరమైనా చేసినట్లు అభియోగాన్ని మోపబడిన వ్యక్తి, అతనికి చెందిన అన్ని ఆస్తులు, స్తిరాస్ధులు మరియు చరాస్ధులు లేక రెండూ కూడా, అటువంటి నేరంపై విచారణ జరుగుతున్నప్పుడు, విచారణ జరుపుతున్న ప్రత్యక న్యాయస్ధానం జప్తుచేయబడినట్లు ఆదేశాన్ని జారీచేయవచ్చు. అలాగే అతని నేరం ఋజువై అతను దోషిగా నిర్ణయించబడిన తర్వాత, ఈ అధ్యాయం క్రింద అతనిపై విధించబడిన జరిమానాను అతని నుండి వసూలు చేయడానికి అవసరమైనంత మేరకు, ఆ విధంగా జప్తు చేయబడిన ఆస్తిని అతను కోల్పోవలసి ఉంటుంది.
నేరాలుగా భావించడం
ఈ అధ్యాయం క్రింద చేయబడిన నేరంపై విచారణ కొనసాగుతున్నప్పుడు, ఒక వేళ అది ఈ క్రింది విధంగా ఋజువైనప్పుడు
- ఈ అధ్యాయం క్రింద ఒక నేరస్ధుడు, అటువంటి నేరం చేసిన అసలు నేరస్ధునికి ఆర్ధిక సహాయాన్ని అందించినా, లేక సహేతుకంగా నేరాన్ని చేయవచ్చు అని అనుమానించబడినప్పుడు, ప్రత్యేక న్యాయస్ధానం, అటువంటి నేరం జరగడానికి అటువంటి వ్యక్తి సహకరించాడని భావిస్తుంది, దీనికి వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఋజువు చేయబడితే తప్ప.
- ఈ అధ్యాయం క్రింద ఒక వ్యక్తుల బృందం నేరాన్ని చేసినట్లయితే, ఈ నేరం చేయడానికి కారణం ప్రస్తుతం ఉన్న భూమికి సంబంధించిన లేక మరే ఇతర విషయాలకు సంబంధించిన వివాద తదుపరి పరిణామమై వున్నప్పుడు, ఒక మామూలు, సాధారణ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి, లేక మామూలు, సాధారణ లక్ష్యాన్ని కొనసాగించడానికే ఇటువంటి నేరం చేయబడిందని భావించ బడుతుంది.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
షెడ్యూల్డ్ కులం, జాతుల పరిరక్షణ చట్టాలు
షెడ్యూల్డ్ కులాల, జాతుల పరిరక్షణ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు చట్టాలు అమలు చేస్తున్నాయి. వాటిలో జోగిని / దేవదాసి వ్యవస్థ నిషేధ చట్టం 1988, వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం 1976, షెడ్యూల్డ్ కులాల తెగల చట్టం (అత్యాచార నిరోధక చట్టం) 1989 వంటి చట్టాల గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ జత చేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ ను చూడండి. పి.డి.ఎఫ్. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆధారము: అపార్డ్ స్థానిక పాలన
మాది కామరెడ్డి జిల్లా,మాకు S.C కార్పొరేషన్ లోని బోరుమోటర్ లోను గురించి ఎలా apply చేసుకోవాలి.మరియు ఇతర వ్యవసాయరంగ లోన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వగలరు