অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇఫ్కో కిసాన్" మొబైల్ యప్

మొబైల్ యప్ గురించి

ఈ "ఇఫ్కో కిసాన్" మొబైల్ యప్ గ్రామీణ సాధికారత కోసం కృషి చేస్తోంది. దీని ద్వారా వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, వ్యవసాయ సలహా, ఒక ఉత్తమ వ్యవసాయ గ్రంధాలయం, నిపుణుల సలహాలు, తాజా వార్తలు మరియు అనేక విషయాలు తెలియ చేస్తుంది. ఈ యప్ వినియోగదారు అనుకూలమైన యప్, పదకొండు భారతీయ భాషలలో అనగా ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళ మరియు గుజరాతీ భాషల్లో అందుబాటులో ఉంది. దీని ద్వారా తక్కువ చదువుకున్న రైతులు సౌలభ్యం కోసం ఆడియో చేతనత్వం తో అందుబాటులో ఉంది.

వాతావరణం

ఈ విభాగం లో ఎంపిక చేసుకున్న జిల్లాకు చెందినా ఐదురోజుల వాతావరణ సమాచారం అనగా ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం అవకాశం, గాలి వేగం మరియు దిశ అందించబడును. రైతులు ఆయ జిల్లాకు సంబందించిన సమాచారం కోసం ప్రాంతాలను అవసరమైతే జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు. రైతులు వాతావరణం ఆధారంగా వ్యవసాయ సంబంధిత పనులపై నిర్ణయం తీసుకోవచ్చు. వాతావరణ విభాగం, ప్రాధాన్యతల విభాగంలో ఒకే సమయంలో, రెండు ప్రదేశాలను ఎంపిక చేయవచ్చు.

మార్కెట్ సమాచారం

మండి విభాగం మార్కెట్ యార్డ్ లో ధరలను సమాచారాన్ని అందిస్తుంది. రైతులు మార్కెట్ ధర స్థితి పోకడలు వీక్షించడానికి మరియు వారి ఉత్పత్తులకు విక్రయించడాన్ని నిర్ణయం తీసుకోవచ్చు. రైతులు పంటలు / మండి / స్థానాలను సమాచారం కోసం సెట్టింగ్ లో సవరించవచ్చు. రైతులు ఒక నిర్దిష్ట వ్యవసాయ ఉత్పత్తి స్థితి కోసం శోదించవచ్చు. ఒకే సమయంలో, ఐదు పంటలు మరియు మండి లేదా మార్కెట్ యార్డ్ ఎంపిక చేయవచ్చు..

సలహాలు

వివిధ పంటలకు సంబందించిన ప్రత్యేకమైన సమాచారం, వ్యవసాయ వాతావరణ మండలలో నిలకొని ఉన్న పరిస్థితులకు సంబందించిన సమాచారం ఇవ్వబడుతుంది. ఈ సూచనలు మరియు హెచ్చరికలు, నిపుణుల అధ్యనయం మీద ఆధారపడి ఉంటుంది. . సమాచారం రైతులకు ఉపయోగపడే విధంగా ఆడియో ఫార్మాట్ లో అందించబడుతుంది. ఒకే సమయంలో, రెండు పంటల మరియు మండి లేదా మార్కెట్ యార్డ్ ఎంపిక చేయవచ్చు.

నిపుణులను అడగండి

ఈ విధాగం కింద రైతు సోదరులకు వచ్చే సందేహాలను, ప్రశ్నలను మా నిపుణులను సంప్రదించవచ్చు. రైతు సోదరులకు సందేహాలను, ప్రశ్నలను అడగలేకపోయినచో, అట్టి వారు పంట పై ఉన్న సమస్యను ఫోటో తీసి పంపించవచ్చు. నిపుణులు సమస్యను అధ్యనయం చేసి సరైన సమాధానాన్ని ఇస్తారు. ఈ విభాగం లో ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటల పూర్తి సమాచారాన్ని నిపుణుల ద్వారా పొందవచ్చు. రైతులు పంటలు / మండి / స్థానాలను సమాచారం కోసం సెట్టింగ్ లో సవరించవచ్చు. ఒకే సమయంలో, రెండు పంటల మరియు మండి లేదా మార్కెట్ యార్డ్ ఎంపిక చేయవచ్చు.

జ్ఞాన భండార్

ఇది యూసర్ సెట్టింగ్ ప్రాధాన్యతల ఆధారంగా, వ్రాసిన సమాచారం పొందవచ్చు. సమాచారం రైతులకు ఉపయోగపడే విధంగా ఆడియో ఫార్మాట్ లో అందించబడుతుంది.

మార్కెట్

ఇది అమ్మే వారికీ కొనే వారికి, ఇష్టమైన, ముఖ్యమైన విభాగం. ఇక్కడ మీ పంట దిగుబడిని అమ్మొచ్చు మరియు కొనుగోలు చేయవచ్చు. మీ పంట దిగుబడిని చాలా తక్కువ సమయంలో అమ్మి, మీ పంట కొనుగోలుకు అధిక లాభం పొందవచ్చు. పంట దిగుబడిని అమ్మ గోరె రైతు అన్ని వివరాలు అందించటం తో పాటు, మొబైల్ నెంబర్ అందుబాటులో ఉంచాలి. అలాగే, కొనుగోలు చేసే వారు, వారికి సంబందించిన సమాచారం మరియు మొబైల్ నెంబర్ అందుబాటులో ఉంచాలి. ఇది భారత దేశంలో ఉన్న పల్లె ప్రాంతాల్లో కొత్త వ్యాపార అవకాశాలను కలుగజేస్తుంది. మధ్య వర్తి లేకుండా నేరుగా రైతు వద్ద నుంచే పంట దిగుబడిని అమ్మ వచ్చు మరియు కొనొచ్చు.

99Service

వార్తలు

ఇక్ఫో కిసాన్ మొబైల్ యాప్, వార్తల విభాగంలో తాజా మరియు అందరికి ఉపయోగపడే మంచి సమాచారాన్ని అందించబడుతుంది. ఈ వార్త విభాగంలోని సమాచారం అందరికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వినియోగ దారులు రోజుకి రెండు సార్లైనా దీనిని సందర్శించగలరు. మా వార్త విభాగంలోని వార్తలు, వివిధ మూలల నుంచి తీసుకోబడినవి మరియు పూర్తిగా వ్యవసాయం సంబందించిన వివరాలు, గ్రామీణ భారత దేశానికి సంబంధించి, సామజిక సంక్షేమం, ఉద్యోగం, ఉపాధి, ప్రభుత్వ కారిక్రమలతో ఇంకా అధిక సమాచారాన్ని అందించగలము.

చాట్

చాట్ విభాగంలో ఇఫ్కో కిసాన్ యాప్ వాడుతున్న వారు ఒకరిని ఒకరు టెక్స్ట్ ఆధారిత సంబాషణ ద్వారా పలకరించుకోవచ్చు. ఉదాహరణకు ఎవరైనా వినియోగదారుడు టెక్స్ట్ ఆధారిత సమాచారాన్ని స్వీకరించినప్పుడు ఇద్దరు లేదా ఒక గ్రూప్ వెంటనే వారి అభిప్రయనాన్ని పంచుకోవచ్చు.

సెట్టింగ్స్

ఈ సెట్టింగ్స్ విభాగంలో వినియోగదారుడు, ఇఫ్కో కిసాన్ మొబైల్ యాప్ ను, వినియోగదారుని అనుకూలంగా మార్చుకోవచ్చు. వినియోగదారుని అభిరుచికి తగినట్టు, వాతావరణం, మండి ధరలు, జ్ఞాన భండార్ లాంటి ఉపయోగపడే అంశాలను, స్థలము, పంటను ఎంచుకోవడం ద్వారా వినియోగదారుని సంబందించిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ విభగంలో వినియోగారులు ఇంకా అతనికి సంబందించిన సమాచారం ఉదాహరణకు, పంటకు సంబంధించి, పొలానికి సంబంధించి, పశువులకు సంబంధించి తదితర సమాచారాన్ని అందించవచ్చు.

హెల్ప్ లైన్

ఈ విభాగం కింద గ్రీన్ సిమ్ వాడుతున్న వినియోగదారుడు, ఇఫ్కో కిసాన్ హెల్ప్ లైన్ ను మరియు కిసాన్ కాల్ సెంటర్ ను సంప్రదించవచ్చు. మా నిపుణులు వ్యవసాయానికి సంబంధించి అన్ని సందేహాలను నివృత్తి చేస్తారు. మినిస్ట్రీ అఫ్ అగ్రికల్చర్, కిసాన్ కాల్ సెంటర్ ను 2004 వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మా ఇఫ్కో కిసాన్ యాప్ ద్వారా నేరుగా కిసాన్ కాల్ సెంటర్ నిపుణులతో సంభాషించవచ్చు. KCC ఐకాన్ ని ఒక టచ్ ద్వారా KCC నిపుణులతో సంభాషించవచ్చు. ఇది ఏ మొబైల్ నెట్ వర్క్ వాడుతున్న వారైన ఉపయోగించుకొని సరైన సమయంలో సరైన సమాచారాన్ని పొందవచ్చు. ఈ సేవ పూర్తిగా ఉచితం.

ఆధారం : మధుబాబు, ఇఫ్కో కిసాన్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate