హోమ్ / వ్యవసాయం / పశు సంపద / కడక్ నాథ్ జాతి - ప్రసిద్ధ భారతీయ నాటు జాతి
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కడక్ నాథ్ జాతి - ప్రసిద్ధ భారతీయ నాటు జాతి

కడక్ నాథ్ జాతి కోళ్ళ పెంపకం,దాణా మరియు రోగనిరోధక టీకాలు

bh.jpg

వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెరటికోళ్ళ పెంపకం అత్యంత లాబగదాయుకంగా తయారవుతోంది. గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులతో పాటు భూమిలేని వ్యవసాయ కూలీలు పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు గడిస్తున్నారు. సమతుల్యమైన ఆహారంతో పాటు ఆదాయం పొందుతున్నారు. గుడ్లు, మాంసం అమ్మకాలతో మంచి రాబడిని పొందవచ్చు. పెరటి కోళ్ల పెంపకం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధానంగా మారుతోంది. గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఈ కోళ్ల పెంపకం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం నాటుకోడి మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ఈ నాటుకోడికి ప్రత్యామ్నాయంగా కడక్ నాథ్ కోడి కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పెంచే ఈ జాతి కోళ్లకు వాతావరణం ఉంటుందని శాస్రవేత్తలు సూచిస్తున్నారు. ఎన్నో పోషక విలువలుండి, వేసవిలో సుమారు వంద గుడ్ల వరకు పెట్టే ఈ జాతి కోడితో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కడక్‌నాథ్ ప్రాచుర్యం

అత్యంత విలువైన పెరటి జాతి నాటు కోడి. అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ జాతి కోళ్లలో కడక్‌నాధ్ ఒకటి. ఈ కోడి అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. “కడక్‌నాథ్" అనేది మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే అనువైన జాతికి చెందిన నాటుకోడి. ఆయా రాష్ట్రాల్లో నివసించే గిరిజనులు ఈ కోడిని ఎక్కువగా పెంచుతారు. అంతరించి పోతున్న నాటు కోడికి ప్రత్యామ్నాయంగా ఈ కోళ్ళనుకూడా పెంచవచ్చని మాంసంలో పోషక అధికం అని శాస్రవేత్తలు సూచిస్తున్నారు. వీటిని ఎక్కువగా కొండ జాతులు, ఆదివాసి ప్రజలు, గ్రామీణ ప్రాంతాలలో పెంచుతారు. దీనిని పవిత్ర మైన జాతిగా గుర్తించి, దీపావళి పండుగలో దేవునికి నైవేద్యంగా పెడతారు.

కడక్ నాథ్ జాతి ప్రత్యేకతలు

 • ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్‌నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా ఉంటుంది. ఈ కోళ్ళను కాలామాళి అని కూడా పిలుస్తారు. అరుదుగా, కొన్ని పుంజులు నలుపుతో పాటు బంగారు రంగు ఈకలు కలిగి ఉంటాయి.
 • కోడి పిల్ల నీలం రంగు నుంచి నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. ఈ జాతి మాంసం నల్లగా ఉన్నా దీనికి చాలా ఔషధ విలువలతోపాటు. సెక్సు సామర్థ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఆదివాసులు దీని రక్తాన్ని చాలా దీర్ఘకాల జబ్బులకు ఉపయోగిస్తారు. అంతేగాక కడక్‌నాథ్ కోడి మాంసం, గుడ్లకు మంచి డిమాండ్ ఉంది. ముదురు నీలం రంగుతో ఉండే ఈకలు, చర్మం, మాంసంతో పాటు ఈ కోళ్ళ రక్తం నలుపు రంగులో ఉంటుంది. వీటి మాంసం, రక్తం అత్యంత అరుదైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. గిరిజనుల మూలికా వైద్యంలో సైతం ఈ కోళ్ళ రకాన్ని వాడతారు.
 • కడక్‌నాధ్ కోళ్ళకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు.
 • be.jpg

 • ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది.

కడక్‌నాథ్ పోషక విలువలు ప్రాముఖ్యత

 • అత్యంత అరుదైన సూక్ష్మపోషకాలు రక్తంలోనూ, మాంసంలోనూ ఉన్నాయి. మెలనిన్ అనే పదార్థం ఈ జాతి కోళ్ళలో అధికంగా ఉంటుంది. ఈ మాంసం తినడం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రావం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు. సాధారణ 8 మాంసంతో పోలిస్తే ఈ జాతి కోళ్ళ మాంసంలో అధిక మాంసకృత్తులు, లినోలెనిక్ ఆమూలు, తక్కువ కొవ్వు పదార్ధాలు ఉన్నాయి. వీటి మాంసంలో మెలనిన్ పదార్థం అధిక మొత్తంలో ఉండడం వల్ల, పురుషుల్లో నరాల బలహీనతకు, పురుషుల్లో వంధ్యత్వ నిరోధానికి సైతం వాడతారు. అలాగే దీని మాంసానికి వయాగ్రాల పని చేసే లక్షణం సైతం ఉందని శాస్త్రవేత్తల వాదన.
 • ఈ కోడి మాంసంలో బి1 బి2, బి6, బి12తో పాటు సి, ఈ విటమిను అధికంగా ఉంటాయి. పాస్పరస్, ఇనుము వంటి ధాతువులు మానవ శరీరానికి ఎంతో అవసరమైనవి. ఈ కోడి మాంసంలో ఇనుప ధాతువు బి2 అధికంగా ఉండటం వలన నిమ్మోనియా, ఎనిమియా, క్షయ, ఆస్తమా వ్యాధుల నివారణకు కటక్నాథ్ కోడి మాంసం మంచి ఆహారంగా పనిచేస్తుంది.
 • వాటితో పాటు అనేక సూల, సూక్ష్మధాతువులు కలిగి ఉండడం వల్ల కీళ్ళ సమస్యలు, ఎముకలు విరిగిన వారికి ఇది అద్భుత ఆహారంగా భావించవచ్చు మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనాల్లో కడక్‌నాథ్ మాంసం గుండెకి రక్త ప్రసారాన్ని అభివృద్ధి పరుస్తుందని రుజువయింది.
 • సాధారణ కోడి మాంసంతో పోలిస్తే ఈ జాతి కోడి మాంసంలో మాంసకృతులు episono ఉంటాయి. కొవ్వు శాతం తక్కువ. 8 అమైనో ఆమూలతో పాటు, 18 అమైనో ఆమూలు వీటి వూం నంలో ఉన్నట్ను శాస్తవేత్తలు ధ్రువీకరించారు. శరీరానికి అవసరమైన ఓమోగా ఆమూల ఫాటో యాసిడ్ ప్రతిరూపమైన లినోలెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు.
 • వీటి గుడ్లని తలనొప్పి నీరసం, ఆస్తమా, మూత్రపిండాల సంబంధిత వ్యాధులను తగ్గించడానికి వాడుతారు. వయసు మళ్ళీన వారికి వీటి గుడ్లు చాలా ఆరోగ్యదాయకం.
 • గుడ్లు, మాంసంలో ప్రొటీన్లు (25.47%), ఇనుము ఎక్కువగా ఉంటుంది.
 • 20 వారాల వయస్సులో 920 గ్రాముల బరువు ఉంటుంది.
 • గుడ్లు పెట్టే వయస్సు - 180 రోజులు.
 • సంవత్సరానికి గుడ్ల ఉత్పత్తి – 105.
 • 40 వారాల వయస్సుకి గుడ్ల బరువు 49 గ్రా.
 • గుడ్లు పెట్టే సామర్థ్యం - 55%.
 • అధిక వృద్ధి శాతానికి షెడ్లల్లో 6 కోళ్ళకు, ఒక పుంజుచాలు.

hen.jpg

దాణా

తొలి దశలో పొడి లేదా నూక రూపంలో ఉండే మేతనే దాణాగా ఇవ్వాలి. ఎటువంటి వంట వ్యర్ధాలనైన అరిగించుకోగలడం వీటి ప్రత్యేకత.

రోగనిరోధక టీకాలు

కొక్కెర తెగులుకు- 7వ, 28 వ రోజు, 9, 18,41, 56వ వారాల్లో కొక్కెర తెగులు నివారణకు టీకా ఇవ్వాలి. 15వ 21వ రోజుల్లో - గంబోర

పోషక విలువలు

 

కడక్ నాధ్

ఇతర బ్రాయిలర్ కోడి

మాంసకృత్తులు (శాతం)

25

18-20

కొవ్వు (శాతం)

0.73 – 1.03

13-21

లినోలిక్ ఆమ్లం (శాతం)

24

21

కొలస్టరాల్ (రక్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు పదార్ధం మి.గ్రా/గ్రా.)

18/100

218/100

అలాగే ఇతర వాటితో పోలిస్తే, ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడు పెట్టడం ప్రారంభిస్తాయి. సాలుకు సుమారు నూరు గుడ్ల వరకు ఇస్తుంది. కోడి పిల్లలకు మొదటి 6 వారాల పాటు బ్రూడింగ్ పద్ధతిలో వేడిమి అందచేయడం అవసరం. ఆ తరువాత పెరటి పెంపకానికి అలవాటు చేయవచ్చు

కడక్‌నాథ్ జాతిలోని ప్రతికూల విషయాలు

 • అధిక డిమాండ్, సహజ మేతతో నిదానంగా పెరగడం, పిల్లల దశలోనే 50 శాతం మరణించడం వంటి కారణాల వల్ల, ఈ జాతి కోళ్లు వృద్ధి చెందడం లేదు. అంతరించిపోతున్న కదక్ నాడ జాతి నాటు కోళ్లను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం కూడా ఈ జాతి అంతరించి పోకుండా, వీటి సంఖ్యను పెంచే దిశగా చర్యలు జరుపుతుంది. కడక్‌నాథ్ జాతి నుంచి కారిశ్యామ పేరుతో సంకరజాతిని ఇజాత్ నగర్ లోని కేంద్ర పక్షిజాతుల అభివృద్ధి సంస్థ (కారి)లో అభివృద్ధి చేశారు.
 • కారీశ్వామా (కడక్‌నాథ్ క్రాస్)
 • ప్రాంతీయంగా "కలమాశి" అంటారు, అంటే దీని అర్థం నల్లని మాంసం కలది - మధ్యప్రదేశ్‌లోని జాబ్యూ, ధర్ జిల్లాలు, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాలలో సుమారు 800 చ.మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి వుంటాయి.

ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు

3.08421052632
A Srinivas Jan 09, 2019 12:28 PM

Na ku kadaknad kodipillalu kavali ekkada dhorukuthay

కుమారస్వామి. Jan 03, 2019 09:56 PM

ఆంధ్రా లో ఎక్కడ దొరుకుతాయి

B rama krishna Nov 22, 2018 12:39 PM

కడకనాథ్ కోళ్లు పెంపకం గురించి నాకు పూర్తిగా తెలుసుకోవాలని ఉంది ఇవి మన ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ లభిస్తాయి తెలియజేయండి దయచేసి వారి ఫోన్ నెంబర్ తెలియజేయ గారు

దేముడు బాబు Sep 12, 2018 12:14 PM

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పిల్లలు దొరుకుతాయి .ఫోన్ no తెలియజేయి గలరు

Kurubabhaskar Aug 19, 2018 10:48 PM

96*****83 కి కాల్ చెయ్యండి మా దగ్గర ఉన్నాయి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు