অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కోళ్ళ పెంపకంలో పాటించవలసిన ముఖ్య విషయాలు

కోళ్ళ పెంపకంలో పాటించవలసిన ముఖ్య విషయాలు

ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఈ అభివృద్ధిలో మన రాష్ట్ర పాత్ర గణనీయం. కోళ్ళ సంఖ్యలోను, గుడ్ల ఉత్పత్తిలోను మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానాన ఉంది. భారతదేశంలో లభించే కోడి గుడ్లలో 35 శాతం ఉత్పత్తి మన రాష్ట్రంనుంచే జరుగుతోంది.

 • దేశవాళీ కోడి గుడ్ల ఉత్పత్తిలో చాలా వెనుకబడి ఉంది. అందుచేత గుడ్ల దిగుబడి పెంచేందుకు, విదేశీ జాతులు, వాటినుండి వచ్చిన సంకర జాతులు వున దేశంలోకి దిగుమతి చేసుకోబడ్డాయి. వీటిలో వైట్ లెగ్ హార్న్ ముఖ్యమైనది.
 • సంకరజాతి కోళ్ళు మంచి యాజమాన్యంతో ఏడాదికి 290-820 గుడ్లు పెడతాయి. స్వచ్ఛమైన జాతులకన్నా హైబ్రిడ్ కోళ్ళు దాదాపు ప్రతి కోడి పెట్ట 40-60 గుడ్లు ఎక్కువ పెడుతుంది. ఈనాటి గణనీయమైన గుడ్ల ఉత్పత్తి పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం.

జాతులు

 • గుడ్ల రకాల కోళ్ళు : బి.వి. 300, ఎచ్.ఎచ్. 260, బొవాన్సు, డికాల్ఫ్ శేవర్. వీటిలో ఏ రకాన్నైనా వాటి శ్రేష్టతను బట్టి, అనుభవమున్న రైతుల సమాచారాన్నిబట్టి ఎంపిక చేసుకోవాలి.
 • షెడ్డు నిర్మాణానికి ఎంచిన స్థలం మంచి నీటివసతి, విద్యుచ్చక్తి సరఫరా, మార్కెట్టుకు చేరువలో ఉండటం మున్నగు సదుపాయాలు కలిగి ఉండాలి.
 • షెడ్డు ఎత్తులో ఉంటే గాలి చలనం బాగా ఉంటుంది. మరుగు నీరు నిల్వకు అవకాశం లేనటువంటి ప్రదేశాలను ఎన్నుకోవాలి.
 • ఖర్చు తగ్గించే ప్రయత్నంలో పెడును ఎలుకలకు, అగ్నిప్రమాదాలకు అనువుగా నిర్మించకూడదు.
 • ఇందుకుగాను కాంక్రీటు నేల, పక్కలకు అల్లిన ఇనుపతీగ, పై కప్పుకు రేకులు వాడటం మంచిది.
 • సాధ్యమైనంత వరకు కోడి పిల్లలను, పెరిగే కోళ్ళను, గుడ్లు పెట్టే కోళ్ళను వేర్వేరు షెడ్లలో పెంచడం మంచిది.
 • షెడ్డు వెడల్పు 25 నుండి 88 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ళ సంఖ్యను బట్టి పొడవు ఎంతైన ఉండవచ్చు.
 • షెడ్డు పక్కగోడలు 1 అడుగు ఎత్తు ఉండి, ఆ పైన 6-7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుపతీగను (వైర్ మెష్) అమర్చాలి.
 • చూరు కనీసం 3-4అడుగులుండేటట్లు చూడాలి.
 • కప్పను ఆస్బెస్టాస్ రేకులతో వేయడం మంచిది.
 • షెడ్డులో ఎండపడకుండా ఉండడానికి షెడ్ను తూర్పు, పడమర దిశలో నిర్మించుకోవాలి.

కోడి పిల్లల పెంపకం

 • పుట్టినప్పటి నుండి 8 వారాల వయస్సు వచ్చే వరకు గల దశను "పిల్లదశ లేదా స్టార్టరు దశ అంటారు.
 • ఈ దశలో కోడి పిల్లలు సున్నితంగా ఉండి తక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
 • వీలైనంతవరకు ఒక రోజు వయస్సు పిల్లలతో పరిశ్రమ ప్రారంభించటం మంచిది.
 • కోడి పిల్లల రాకకు పది రోజుల ముందుగా షెడ్డులోనిబూజు, దుమ్ము దులిపి, గోడలకు సున్నం వేయించాలి.
 • బ్రూడరు, మేత తొట్లు, నీటి తొట్లు కడిగి క్రిమి సంహారక మందుతో శుభ్రపరచాలి.
 • వరి పొట్టు లేక వేరుశనగ పొట్టు 2-3 అంగుళాల మందంలో నేలపై పరచాలి (లిట్టరు).
 • మొక్కజొన్న నూకను కాగితంపై పలుచగా చల్లాలి. బ్రూడరు చుటూ 2-3 అడుగుల దూరంలో 18 అం. ఎత్తుగా అట్టగాని, రేకులుగాని వృత్తాకారంలో దడిగా అమర్చాలి.

బ్రూడింగ్

 • ప్రతిరోజు 2 లేదా మూడుసార్లు కోడిపిల్లల ఆరోగ్య అవసరాలను చూడాలి.
 • చిన్నపిల్లలను పెంచే షెడ్డుకు, పెద్ద కోళ్ళ షెడ్డు కు మద్య కనీసం 100 గజాల దూరం ఉండాలి.
 • పెద్దకోళ్ళ షెడ్డు లో పనిచేసే వ్యక్తి చిన్న పిల్లల పెడులో ప్రవేశించరాదు.
 • ఎల్లప్పుడు లిట్టరు తడికాకుండా పొడిగా ఉండునట్లు జాగ్రత్తపడాలి.
 • నాటు జాతికోళ్ళను షెడ్డు ఆవరణలోనికి రానీయకూడదు. షెడ్డు ద్వారంలో క్రిమి సంహారక మందు ఉంచిన తొట్టి ఉంచి షెడ్ లోకిప్రవేశించే ముందు పాదాలను ఆ ద్రావణంలో తడపాలి.
 • శీతాకాలంలో కోళ్ళ బ్రూడింగుపటిష్టతకు గ్యాస్ బ్రూడింగు లేదా బొగ్గుల కుంపటి వాడడం మంచిది. ఈదరగాలి సోకకుండ షెడ్డు కుఇరువైపుల గోనె పట్టాలను లేదా ప్లాస్టిక్ పరదాలను అవసరమున్నంత మేరకు వేలాడదీయాలి.

పెరిగే వయసు (9–20 వారాలు) కోళ్ళపెంపకం:

 • ఈ దశలో కోళ్ళను ప్రత్యేకమైన షెడులో కాని లేదా సాధారణంగా చిన్నపిల్లల నుంచిన షెడ్ లో కాని పెంచవచ్చు.
 • ప్రతి పెరిగే కోడి పిల్లకు వయసుని బట్టి 1-1.5 చదరపు అడుగుల స్థలం కావలసి ఉంటుంది. మేత తొట్టెలు, నీటి తొట్టెలుపిల్లలకుపయోగించిన వాటికంటే పెద్దవిగా ఉండాలి.
 • ప్రతి కోడికి 2.5 అం. మేత తినే స్థలం, 0.75 అం. నీరు తాగే స్థలం అవసరం.
 • ముక్కులను మరొకసారి 12-16 వారాల మధ్య కత్తిరించటంగాని, మొండిగా కాని చేయటం ముఖ్యం
 • లిట్టరును అపుడపుడూ తిరగ వేసూ, పొడిగా ఉండేట్లు చూడాలి. అవసరమైతే కొత్త లిట్టరు చల్లుకోవాలి.
 • ఈ వయసులో కోడి పిల్లల కడుపులో ఏలికపాములు, బద్దె పురుగులు పెరిగే అవకాశం కలదు. వీటి నివారణకు మందులు వాడాలి. లిట్టరుపై పడ్డ పురుగులను ఏరివేసి లిట్టరును బాగా తిరుగవేయాలి.
 • ఈ వయస్సులో, నాసిరకపు పిల్లలను వేరుచేసి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వయసులో రెండవసారి కొక్కెర తెగులుకు, మశూచికి బూస్టరు డోసు టీకాలు వేయాలి. వయసు సాధారణంగా 18-20 వారాల వయసు వచ్చేటప్పటికి కొన్నికోళ్ళగుడ్లు పెట్టటం మొదలు పెడతాయి. కాబట్టి ఈ సమయంలో షెడ్ లో గూళ్ళను అమర్చాలి. ప్రతి 5కోళ్ళకు ఒక గూడు చొప్పున అమర్చాలి.
 • గుడ్లు పెట్టె కోళ్ళకు ప్రత్యేక షెడ్ ఉంటే 16 లేక 17 వారాల్లో కోళ్ళను ఆ షెడ్డు లోనికి మార్చుకోవాలి. ఇలా చేయడం వలన కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి వాటికి తగినంత అవకాశం ఉంటుంది.

గుడ్ల కోళ్ళపెంపకం (20 వారాలపైన)

గృహవసతి : లేయర్ షెడ్డు వద్ద బ్రాయిలర్ షెడ్ నిర్మాణానికి ప్రాముఖ్యం ఇవ్వరాదు. లేయర్ షెడ్ ను తూర్పు పడమర దిశల్లో నిర్మించాలి. ప్రస్తుతం మినీ ఫొన్రీ లేదా కుటీర పరిశ్రమగా లేయర్ కోళ్ళ పెంపకం కింద 200కోళ్ళను పెంచేందుకు 15 అడుగుల వెడల్పు, 20అడుగుల పొడవు షెడ్ను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 72 వారాల వరకు లేయర్ కోళ్ళలను పెంచవచ్చు.

డీప్లిట్టర్ పద్ధతి : షెడ్ లోపల నేలపై వరిపొట్టు పరచి కోళ్ళను పెంచడాన్ని డీప్లిట్టర్ అంటారు. కోళ్ళు స్వేచ్చగా షెడ్లో తిరుగుతాయి. లిట్టర్ ను ఏడాది లోపు మార్చే అవసరముండదు. ఎరువుగా వాడవచ్చు.

లిట్టర్ మేనేజ్మెంట్ : కోళ్ళ షెడ్డు లో నేలపై పరిచే వరిపొట్టు లేదా రంపపు పొట్టు ను లిట్టర్ అంటారు. కోళ్ళ ఆరోగ్యం, గుడ్ల ఉత్పత్తి లిట్టర్ మేనేజ్మెంట్ పై ఆధారపడి ఉంటుంది. మొదట లిట్టరు ఎత్తు రెండు అంగుళాలు వేసి కాలాన్ని బట్టి కోళ్ళ సాంద్రతను బట్టి కోళ్ళ వయస్సును బట్టి కొత్త లిట్టర్ కలుపుతూ పోవాలి. లిట్టర్లో తేమ పెరిగినపుడు కొత్త లిట్టరు కొద్దిగా సున్నం 100 చదరపు అడుగుల స్థలానికి 7-11 కేజీలు చల్లి లిట్టరునుకలియదున్నాలి. దీనివల్ల లిట్టర్ నుంచి విషవాయువులైన అమ్మోనియం హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డై సల్ఫైడ్ వంటివి విడుదల కాకుండా నివారించవచ్చు.

గుడ్లు పెట్టే కోళ్ల పోషణ

: లేయర్ కోళ్ళకు కావలసిన పోషణ పదార్థాలన్నింటిని తగుపాళ్ళ మిశ్రమం తయారు చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతంలో తక్కువ ధరకు దొరికే దినుసులు ఉపయోగించి మిశ్రమం తయారు చేసుకోవచ్చు. దీనివల్ల 72 వారాల్లో 300–320గుడ్లు వరకు దిగుబడినిచ్చే అవకాశం ఉన్నది. 16-18 వ వారం నుంచి గుడ్ల ఉత్పత్తి ప్రారంభమై 25-26 వ వారం వరకు 90శాతం లేదా అంతకు మించి గుడు దిగుబడి ఉండే అవకాశం ఉంది .

 

 • ఈ దశలో ఏ విధమయిన ప్రయాస కలుగకుండా చూసుకోవడం, అతిముఖ్యం. టీకాలు, ముక్కులు రెండవసారి కత్తిరించటం మున్నగు కార్యక్రమాలు కోళ్ళు గుడ్లు పెట్టె దశకు చేరకముందే పూర్తి చేయాలి.
 • ఈ దశలో కోళ్ళకు రోజుకు 14 నుంచి 16గం. వెలుతురు అవసరం. అనగా పగటి వెలుతురుతోబాటు అదనంగా 4-5 గంటలు వెలుతురు రాత్రుల్లో ఇవ్వాల్సి ఉంటుంది (వారానికి 1 గంట చొప్పున). కాబట్టి 19-20 వ వారం నుంచి క్రమంగా వెలుతురు సమయాన్ని 24 వారాలకు 16 గంటలు వచ్చేవరకు పెంచాలి.
 • షెడ్ లోని వెలుతురు, కోళ్ళ గుడ్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది కాబట్టి, ఈ విషయాన్ని విస్మరించకూడదు. ప్రతి 200 చ.అ. స్థలానికి ఒక 40 వాట్ల బల్బును కాని, ట్యూబులైటునుకాని అమర్చాలి.
 • ఒక్కొక్క కోడికి కనీసం 3-4 అం. మేత స్థలం, 1 అం. నీటి స్థలం లభించేలా చూడాలి. ఇందుకోసం తొట్టెల సైజును పెంచుకోవాలి. 10-12 కిలోల పరిమాణంగల మేత తొట్టి సుమారు20-25కోళ్ళకు సరిపోతుంది. దాణా మిశ్రమం ఒక రకం నుండి వేరొక రకానికి క్రమంగా మార్చాలి.
 • లిట్టరుతడిగా ఉండి, అమ్మోనియా వాసన వచ్చే పరిస్థితుల్లో 10 చ.అలకు. 1 కిలో సున్నాన్ని కలిపితే చెడువాసన నివారింపబడి కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
 • ప్రతి కోడికి 1.5 నుండి 2 చ.అ. స్థలాన్ని కేటాయించాలి. దగ్గరలోని ఫారంలో కాని, అదే ఫారంలోకాని ఏవైనా రోగాలు ప్రబలినపుడు అవసరాన్ని బట్టి మందులు లేదా టీకాలు వేసి కోళ్ళను కాపాడవచ్చు.
 • పెరిగే దశలో ఎక్కువ సమయం వెలుతురునిస్తే గర్భసంచి బయటకు వచ్చి (ప్రాలాప్స్) చాలా సమస్యలు కలిగిస్తుంది.
 • గుడ్లు పెట్టని కోళ్ళను ఏరివేయటం, కోళ్ళ పెంపకం లాభసాటిగా జరగడానికి, నాసిరకమైన కోళ్ళను తరచు ఏరివేయటం ముఖ్యం.
 • నాసిరకపు కోళ్ళు అవకుండా తగు యాజమాన్య పద్ధతులను - గృహవసతి, నాణ్యతగల దాణా, రోగనిరోధక శక్తి, రోజువారి పోషణలో సక్రమమైన చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.

కోళ్ళటీకాల పటిక

వయస్సు

టీకా పేరు

మోతాదు

ఎలా ఇవ్వాలి?

1 రోజులు

మారేక్స్

మీ.లి.

చర్మం కింద

7 రోజులు

లసోట(ఎఫ్-1)

2 చుక్కలు

ఒక చుక్క కంట్లో ఒకటి ముక్కులో

14 రోజులు

ఐ.బి.డి. (గంబోరో)

1 చుక్క

నోట్లో

28 రోజులు

లసోట(ఎఫ్-1)

2 చుక్కలు

ఒక చుక్క కంట్లో ఒకటి ముక్కులో

30 రోజులు

ఐ.బి.డి. (గంబోరో)

1 చుక్క

నోట్లో

42రోజులు

ఫాల్ పాక్స్

0.2 మీ.లి.

కండకు

56 రోజులు

ఆర్ 2 బి

0.5 మీ.లి.

కండకు లేదా చర్మం కింద

18-20 (వారాలకు)

ఆర్ 2 బి

0.5 మీ.లి.

కండకు లేదా చర్మం కింద

వ్యాధుల నివారణకు, ఎదుగుదలకువాడే మందులు

వయస్సు

మందు

మోతాదు/డోసు

ఎన్ని రోజులు

మొదటి రోజు

లేవోప్లాక్సాసిన్

1 గ్రా, మందును 2లీటర్ల నీటిలో కలపాలి.

5 రోజులు

మొదటి రోజు

బి కాంప్లెక్స్

20 మి.లీ. 100 కోళ్ళకు తాగే నీటిలో కలపాలి.

7 రోజులు

మొదటి రోజు

విటమిన్ ఏ, డి, ఇ, సి.

5 మి.లీ./100 కోడి పిల్లలు

5 రోజులు

2 వారాల వయస్సు

కాల్షియం

25 మి.లీ./100 కోడి పిల్లలు

4 రోజులు

 

ఆధారము:పాడి పంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate