హోమ్ / వ్యవసాయం / పశు సంపద / గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

మన రాష్ట్రంలో అనాదిగా గొర్రెల పెంపకం కులవృత్తిగా సాగుతున్నది. గొర్రెల పెంపకం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను తెచ్చి పెట్టె ఒక వ్యాపకం. కాబట్టి ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రత్యేకంగా గొర్రెల పంపిణి పధకం కూడా మెడలు పెట్టింది. గొర్రెల పెంపకంలో అధిక లాభాలు పొందాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవి మఖ్యంగా గొర్రెల ఎంపిక, గృహ నిర్మాణం, పోషణ గార్బోత్పత్తి, ఆరోగ్యం మరియు మార్కెటింగ్.

ఎంపిక : గొర్రెల ఎంపికలో జాతి, మేలు జాతి పొట్టేళ్ళు, ప్రదేశం, వయస్సు వంటి అంశాలు పరిశీలించాలి. గొర్రెల పెంపకం చేపట్టే ముందు మనకు కావాల్సిన గొర్రెల మన వాతావరణానికి సరిపోతాయా? లేదా? పెంచుకునే జాతి అందుబాటులో ఉందా? లేదా? మనం ఎంచుకునే జాతి ప్రతి ఈతకు రెండు పిల్లలు పెడుతుందా? లేదా అని తెలుసుకోవాలి. సాధారణంగా మన రాష్ట్రంలో ఉన్ని జాతి గ్రీల కన్నా మాంసం జాతి గ్రీలకు అధిక గిరాకీ ఉంది. కాబట్టి పెంపకపుదార్లు నెల్లూరు జాతి తరువాత దక్కని, బళ్ళారి జాతులను ఎంపిక చేసుకోవాలి. జాతి లక్షణాలు ఉన్న వాటిని, 2 సం లోపు వయస్సు ఉన్న వాటిని, చుడి కట్టినవాటిని ఎంపిక చేసుకోవాలి. గొర్రెలను అక్టోబర్, నవంబర్ లేదా మర్చి, ఏప్రిల్ నెలల్లో కొనుక్కోవాలి. గొర్రెలను సంతలో కాకుండా మండల దగ్గరికి స్వయంగా వెళ్ళి ఎంపిక చేసుకోవడం మంచిది. క్రొత్తగా మెడలు పెటేవారు. కొన్ని పాత్రలను స్వయంగా సందర్సించి, పెంపకపుదార్ల అనుభవాల్ని తెలుసుకోవాలి.

గొర్రెలను ఎంపిక చేసుకునే క్రమంలో పొట్టేళ్ళుకు అధిక ప్రాముఖ్యం ఇవ్వాలి. పొట్టేళ్ళు 2-4 పళ్ళు వేసి ఉండాలి. వృషణాలు ఒకే సైజులో ఉండి, వెనుక కళ్ళు మధ్యలో సరిసమానంగా ఉండాలి. కళ్ళు బలంగా ఉండి గిట్టలు చక్కగా ఉండాలి మరియు ముఖం పై వెంట్రుకలు లేకుండా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. ప్రతి వంద గొర్రెలకు 4 పొట్టేళ్ళు ఉండేవిధంగా ఎంపిక చేసుకోవాలి.

పై విధంగా ఎంపిక చేసుకున్న గొర్రెలను మూడు విధాలుగా పెంచవచ్చును.

 1. విస్తృత పద్ధతి : మనదేశంలో అధికంగా పాటింస్తున్న పెంపకం పద్ధతి ఇది. ఈ పద్దతిలో గొర్రెలను 6-8 గంటలు బంజారా భూములు, అటవీ భూములలో మేతకు తీసుకువెళ్ళి రాత్రిపూట ఎలాంటి దాణా, గృహవసతి లేకుండా ఇంటి పరిసరాలలో ఉంచి పెంచవచ్చు.
 2. పాక్షిక సాంద్ర పద్ధతి : ఈ పద్దతిలో గొర్రెలను 4-6 గంటలు మేతకు తీసుకువెళ్ళి తరువాత పాకలలో ఉంచి కొద్దిగా దాణా మరియు పశుగ్రాసాలను ఇచ్చి పెంచే విధానం.
 3. సాంద్ర పద్ధతి : ఇది గొర్రెలను పాకలలోనే ఉంచి దాణా మరియు ఓశుగ్రాసాలు ఇస్తూ పెంచే పద్ధతి. ఈ పద్దతిలో ఎకరానికి 20 గొర్రెలను పెంచవచ్చు.

పాకల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • గొర్రెల పెంపకం నుండి ఆశించిన లాభాలు పొందాలి అంటే సరైన పాకాలను నిర్మించాలి. ఇవి గొర్రెలను అధిక ఉష్ణోగ్రత, చలి మరియు వాన నుండి కాపాడుతాయి.
 • పాకాలను ఎత్తెన ప్రదేశంలో నీరు నిలువ ఉందని ప్రదేశంలో నిర్మించాలి.
 • పాక తూర్పు - పడమరలుగా ఉండేటట్లు నిర్మించాలి.
 • నెల ఎత్తుపల్లాలు లేకుండా చూడాలి.
 • పై కప్పు ఖరీదైనది కాకుండా తుంగ, తాటాకులతో కప్పాలి.
 • వర్షాకాలంలో పాకలలో నీరు నిలువ ఉండకుండా చూడాలి.
 • వారానికి ఒక్కసారి పొడి సున్నం చల్లాలి.
 • ఆరు నెలలకు ఒకసారి నెల పై పొరను తీసి కొత్త మట్టితో నింపాలి.
 • బాహ్య పరాన్న జీవుల బెడద నుండి కాపాడుకోవడానికి క్రిమి సంహారక మందులు పిచికారి చేయాలి.
 • ప్రతి గొర్రెకు 16 చ.అ. స్ధలం, ఆరు బయట 40-50 చ.అ. స్ధలం కేటాయంచాలి. 60 గొర్రెలకు 15 మీ. * 4 మీ. * 3 మీ. స్ధలం సరిపోతుంది.

పునరుత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: గొర్రెలు ఎక్కువగా వేసవి మరియు వర్షాకాలంలో ఎదకు వస్తాయి. మందలోని గొర్రెలు అన్ని కట్టాలి అంటే ప్రతి వంద ఆడ గొర్రెలకు 4 పోటేళ్ళు ఉండేలా చూసుకోవాలి. పొట్టేళ్ళును రాత్రిపూట మత్తమే మందలో వదలాలి. పొట్టేళ్ళను ప్రతి రెండు సం.లకు. ఒకసారి మారుస్తుండాలి. అదేవిధంగా పొట్టేళ్ళను  5-6 సం.ల. కంటే ఎక్కువ మందలో ఉంచరాదు. ఆడ గొర్రె ఒక్కోమాటికి రోజు 20-30 మి.గ్రా. ఖనిజ లవణ మిశ్రమమును ఇవ్వాలి. వర్షాకాలంలో ఆడ గొర్రెలకు 1-2 వారాల ముందు 250 గ్రా. దాణా మిశ్రమాన్ని గాని 500 గ్రా. లూసర్న్ వంటి పప్పుజాతి పశుగ్రాసాలను ఇవ్వడం మూలాన గొర్రెలు ఎక్కువ సంఖ్యలో చుడీకట్టి, 10-15% పిల్లలు అధికంగా పుట్టడం జరుగుతుంది.

పోషణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సరైన పోషణ లేకుంటే జీవాల పెంపకం లాభదాయకం కాదు. ఒక ఎకరంలో పెంచే పశుగ్రాసం 20 గొర్రెలకు సరిపోతుంది. సాధారణంగా మన రాష్ట్రంలో గొర్రెలను విస్తృతథంగా పెంచుతున్నారు. ఈ పద్దతిలో గొర్రెలను బంజరు భూములు, అడవులు, రహదారులకు ఇరువైపుల  ఉండే ప్రదేశాలలో లభించే గడ్డి పై ఆధారపడి పెంచుతున్నారు. కానీ ఆసక్తి ఉన్న పెంపకపుదార్లు నాణ్యమైన పశుగ్రాసాలను సాగుచేసి గొర్రెలను పెంచినట్లేతే లాభాలను గడించవచ్చు. సాగు కొరకు అంజాన్ గడ్డి జాతులు, స్టైలో హైమాట అనుకూలంగా ఉంటాయి. పశుగ్రాస చెట్లేనా సుబాబుల్, దిరిసెన లాంటివి కూడా సాగు చేయాలి.

పాక్షిక మరియు సాంద్ర పద్దతిలో గొర్రెలను పెంచేవారు దాణా మిశ్రమాన్ని గొర్రెలకు అందించాలి. 3 నెలల పిల్లలకు 100-150 గ్రా.  పెద్ద గొర్రెలకు 200-250 గ్రా. చొప్పున ఇవ్వాలి.

ఆరోగ్య పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : గొర్రలలో బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే గొంతు వాపు, కాలి పుండ్ల వ్యాధి, దొమ్మ రోగం మరియు వైరస్ ద్వారా వ్యాపించే నీలి, నాలుక వ్యాధి, గాలి కుంటూ వ్యాధి, పిసిఆర్ వ్యాధులు సోకుతాయి.

పాకాలను పరిశుభ్రంగా ఉంచుతూ నీరు నిలువ లేకుండా చూసుకోవాలి. చినిపోయిన గొర్రెలను గుంత తీసి పూడ్చి పెట్టాలి. అదేవిధంగా రోగాలు సోకకుండా ముందు జాగ్రత్తగా ఈ క్రీంది టీకాలు ఇప్పించాలి.

జనవరి మాసంలో - పి.పి.ఆర్ వ్యాధికి

మార్చిలో - గాలికుంటూ వ్యాధికి

మే లో - చిటుకు రోగం

సెప్టెంబర్ లో - దుమ్మ వ్యాధి

నవంబర్ లో - మశూచి వ్యాధికి టీకాలు ఇప్పించాలి.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.10416666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు