పొదుగు వాపు వ్యాధి
కావాల్సిన పదార్ధములు:
(ఏ) కలబంద-250గ్రా, (బి) పసుపు-50గ్రా, (సి) సున్నం-15గ్రా, (డి) నిమ్మకాయలు-2 ,(ఇ) బెల్లం-100గ్రా.

తయారుచేయు విధానము:
ఈ పదార్ధములను (ఏ-సి మాత్రం) వేసి, కలిపి, ఎర్రటి పాకం / పేస్టు తయారు చేసుకోవాలి రెండు నిమ్మకాయలను బద్దలుగా కోసి ఉంచాలి.
వాడు విధానం:
- చేతినిండుగా పేస్టు తీసుకొని దానికి 150-200 మీ.లీ. నీరు కలపాలి.
- పరిశుభ్రమైన నీటితో పొదుగును బాగా రుద్ది కడగాలి. ఈ మిశ్రమాన్ని పొదుగంతా పూర్తిగా రాయాలి.
- ఇలా రోజుకి 10 సార్లు చొప్పున 5 రోజులు రాయాలి.
- రెండు నిమ్మకాయలను బద్దలుగా కోసి నోటి దవడలో ఉంచాలి. ఈ విధంగా రోజుకి రెండు సార్లు చొప్పున మూడు రోజులు పెట్టాలి.
గమనిక:
పాలలో రక్తం కనపడినప్పుడు కరివేపాకు, బెల్లం నూరి పేస్టుగా చేయాలి. ఈ పేస్టు ని రోజుకు రెండు సార్లు తినిపించాలి.
చన్నురంధ్రం లో అవరోధం
కావాల్సిన పదార్ధములు:
అప్పుడే తుంచిన, శుభ్రం చేసిన వేప ఆకు ఈనె, పసుపు వన్నె లేదా నెయ్యి.

తయారుచేయు విధానము :
చన్ను పొడుగును బట్టి ఈనె పొడుగును కత్తిరించుకోవాలి వెన్న పసుపు కలిపినా మిశ్రమాన్ని వేప ఆకు ఈనె కు బాగా పాటించాలో.
వాడు విధానం:
- వెన్న పసుపు కలిపినా మిశ్రమాన్ని వేప ఆకు ఈనె కు బాగా పటించాలి.
- వేపాకు ఈనెను మూసుకుపోయిన చన్ను రంధ్రం లోనికి మెల్లగా దుర్చాలి.
- పాలు పితికిన ప్రతిసారి తాజా ఈనెను చన్ను రంధ్రం లోనికి ప్రవేశపెట్టాలి.
పొదుగుకు నీరు దిగుట
కావాల్సిన పదార్ధములు:
నువ్వులనూనె, పసుపు చేతినిండా, వెల్లుల్లి 2 రెబ్బలు.

తయారుచేయు విధానము:
- నూనెను వేడిచేసి దానిలో పసుపు మరియు తురిమిన వెల్లుల్లిని కలపాలి.
- బాగా కలుపుతూ వేడి చేయాలి. మరగపెట్ట కూడదు.
- తర్వాత చల్లారనివ్వాలి.
వాడు విధానం:
- నీరు దిగి వాపు కనబడిన ప్రాంతం మీద మొత్తం పొదుగు మీద బలంగా ఈ మిశ్రమాన్ని వలయాకారంలో రాయాలి.
- రోజుకి 4 సార్లు చొప్పున 3 రోజులు రాయాలి.
గమనిక:
ఈ మందు రాసెముందు అది పొదుగు వాపు కాదని నిర్ధారించుకోవాలి.
మాయ పడకుండా ఉండుట.
కావాల్సిన పదార్ధములు:
తెల్ల ముల్లంగి -1 , బెండ కాయ 1 .5 కిలోలు., బెల్లం ఉప్పు.

తయారుచేయు విధానము:
బెండ కాయని రెండు ముక్కలుగా చేయవలెను.
వాడు విధానం :
- ఈనిన తరువాత 2 గంటల లోపల ఒక ముల్లంగి దుంపను తినిపించాలి.
- ఈనిన 8 గంటల తర్వాత కూడా మాయ పడకుండా అలానే వుంటే 1.5 కిలోల బెండకాయల్ని , బెల్లం మరియు ఉప్పు తో కలిపి తినిపించాలి.
- ఈనిన 12 గంటల తర్వాత కూడా మాయ పడకుండా అలానే వుంటే వేలాడే మయమొదలు వద్ద దారంతో కట్టి ఒక ముడి వేసి దానికి 2 ఆంగుళాల దూరంగా కత్తిరించవలెను. కట్టులోపలికి వెళ్ళావిధంగా జాగ్రత్త వహించాలి.
- అంటిపెట్టుకుని మాయను చేతితో తీసివేయడానికి ప్రయత్నించవద్దు.
- నాలుగు వరాల పట్టు వారానికి ఒక సరి ఒక పెద్ద ముల్లంగి దుంపను తినిపించాలి.
తిరగ పోరుట్ల

వాడు విధానం:
- ఎదుకు వచ్చిన మొదటి లేదా రొండోవ రోజు చికిత్సను ప్రారంభించాలి.
- అయు పదార్థములను తాజాగా రోజుకి ఒక్కసారి ఈ కింద సూచించిన క్రమంలో బెల్లము, ఉపుతో కలిపి నోటి ధవరా పట్టాలి.
- తెలు ముల్లంగి రోజుకు ఒక్కటి చప్పున 5 రోజులు.
- రోజుకు ఒక కలబంద ఆకూ చప్పున 4 రోజలు.
- రోజుకి 4 గుపిళ్ల చప్పున మునగ ఆకూ 4 రోజలు.
- రోజుకి 4 గుపిళ్ల చప్పున నలేరు 4 రోజలు.
- రోజుకి 4 గుపిళ్ల చప్పున కరివేపాకు +పసుపు విశమం 4 రోజలు.
మెయ్య కు చికిత్స
కావలిసిన పదార్దములు:
కలబందగుజ్జు -1 ఆకు చొప్పున, పసుపు -1 ఒక స్పూన్, అత్తిపత్తి ఆకూ -2 చారెళ్ళు.

తయారుచేయు విధానము:
- కలబంద మట్టను చీల్చి గుజ్జును సేకరించాలి.
- నాలుగైదు సార్లు బాగా కడగాలి.
- వేరే గిన్నెలో వేసి, 1 లీటర్ నీళ్లు కలిపి, మిక్సీలో వేసి ఆడించాలి. తరవాత 1 స్పూన్ పసుపు కలిపి వేడి చెయాలి. అర లీటరు అయ్యేవరకు మరిగించాలి.
- అత్తిపత్తి ఆకు పేస్టులా చేసుకోవాలి.
వాడు విధానం:
- మెయ్యను శుభ్ర పరచవలెను.
- ఆ మిశ్రమాన్ని వడపోసి మెయ్య వచినప్పుడు దాని మీద పిచికారి చెయ్యాలి రాసిన కలబంద మిశ్రమం పిరితిగా ఆరిపోయిన తరవాతనే అతిపతి ఆకూ పేస్ట్ ను రాయాలి.
- ఈ పక్రియను పరిస్థితి మార్గుయన వరకు కొనిసాగాంచాలి.
గాలికంటు వ్యాధి/నోటి పుండ్ల చికిత్స
కావలిసిన పదార్దములు:
జిలకర-10 గ్రా, వెంతలు - 10 గ్రా, పసుపు -10 గ్రా, వేలులి-4 , కొబారి కాయ-1 , బెల్లం - 120 గ్రా.

తయారుచేయు విధానము:
- జెలికార, వెంతలు, మీరాయలు గింజలను నీటిలో 20 - 30 నిముషాలు.
- ననుబటాలి.
- అనేంటిని నూరి పస్తేగా తయారు చెయ్యాలి.
- ఈ పేస్ట్ కి కోబరి తారమని కలపాలి.
- ప్రతిసారి ఈ విశమని తాజాగా తయారు చేసుకోవాలి.
వాడు విదానం:
ఈ పస్తేనే నీటిలోనే, నాలిక మీద ఆంగెటీలను బాగా రాయాలి రోజుకు మూడు సార్లు చొప్పున 3 - 5 రోజలు ఈ పత్ మందిని వాడాలి.
గాలికుంటూ వ్యాధి/ కాలి పుండ్లకు చికిత్స
కావాల్సిన పదార్ధములు:
మూర్కొడం ఆకులు - చారెడు, వెల్లుల్లి -10 రెబ్బలు, వేప ఆకులు - చారెడు, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె -200 మీ.లీ, పసుపు 20 గ్రా, రిటాకుచారెడు, తులసి ఆకులు - చారెడు.

తయారుచేయు విధానము:
- దినుసులు అన్నిటిని బాగా రుబ్బాలి.
- ఈ మిశ్రమానికి 250 మీ.లీ, ల కొబారి లేదా నువ్వులనూనె కలిపి మరిగించి చల్లార్చాలి.
వాడు విధానం :
- పుండ్లను శుభ్రాంగా కడగాలి. పుండ్లపై మందును రాయాలి. శుభ్రమైన గాజుగుడ్డతో కట్టు కట వచ్చు.
- ఒక వేళ పుండ్లలో పురుగులు వుంటే మొదటిరోజు కొబారినూనెలో కర్పూరం కలిపి రాస్తే లేదా సీతాఫలం గుజ్జును రాస్తే పురుగులు పోతాయి. తరువాత పై మిశ్రమాన్ని యధావిధిగా ఫుడ్ల పై రాయాలి.
జ్వరము
కావలిసిన పదార్థములు:
వెల్లుల్లి :2 రెబ్బలు , ధనియాలు -10 గ్రా ,జీలకర్ర -10 గ్రా ,తులసి ఒక గుప్పెడు , బిర్యానీ ఆకులు 10గ్రా , మిరియాలు 10గ్రా,తమలపాకులు 5,ఉల్లి 2 ,పసుపు 10గ్రా ,నెలవేము ఆకుల పొడి 20 గ్రా ,సబ్జా ఆకులు చారెడు , వేప ఆకులు చారెడు , బెల్లం 100 గ్రా .

తయారుచేయు విధానం:
- జీలకర్ర , మిరియాలు ,ధనియాలను 15 నిముషాలు నీటిలో నానబెట్టాలి.
- అన్ని పదార్థాలను మిక్సీలో వేసి ఆడించాలి. ఆ మిశ్ర మాం పేస్టుగా తరవుతుంది.
వాడు విధానం:
చిన్న మోతాదు లో ప్రొద్దున్న సాయంత్రం తినిపించాలి.
పారుడు వ్యాధి :
కావలిసిన పదార్థములు:
మెంతులు 10 గ్రా ,ఉల్లి-1 ,వెల్లుల్లి -1 రెబ్బ, జీలకర్ర -10 గ్రా ,పసుపు -10 గ్రా ,కరివేపాకు -చారెడు , గసగసాలు -5 గ్రా ,మిరియాలు 10 గ్రా, బెల్లం 100 గ్రా ,ఇంగువ -5 గ్రా.

తయారుచేయు విధానం:
- జిలికార , మెంతులు , గసగసాలు,ఇంగువ , మిరియాలు , పసుపును ముందుగా తీసుకొని వేయించాలి.
- తరువాత వాటిని నూరాలి.
- ఆ పేస్టును ఉల్లి, వెల్లుల్లి ,కరివేపాకు , బెల్లంను కలిపి మరల మెత్తగా నూరాలి.
వాడు విధానం:
- ఆ పేస్టును ఉండలుగా చేయాలి .
- ఈ మిశ్రమాన్ని పశువు దవాడలో ఉంచాలి. ఈ మందును రోజుకి ఒకసారి చొప్పున 1 -3 రోజులు పెట్టాలి .
కడుపు ఉబ్బరం అజీర్ణం
కావలిసిన పదార్థములు:
ఉల్లి 100 గ్రా ,వెల్లుల్లి 10 గ్రా,ఎండు మిరపకాయలు 2 ,జీలకర్ర 10 గ్రా, పసుపు 10 గ్రా ,బెల్లము 100 గ్రా ,మిరియాలు 10 గ్రా,తమలపాకులు 10 గ్రా, అల్లం 100 గ్రా.

తయారుచేయు విధము:
- ముందుగా నల్ల మిరియాలు, జీలకర్రను ఒక గంట సేపు నీటిలో నానబెట్టాలి మిరియాలు, జీలకర్ర , పసుపు మిరపకాయలను మిక్సీలో వేసి ఆడించాలి.
- తరువాత మిగిలిన పదార్థాలను కలిపి మిక్సీలో ఆడించి పాకం తాయారు చేసుకోవాలి . ఆ పేస్టును 100 గ్రా బెల్లం కలిపి ఉండలుగా చేయాలి.
వాడు విధానం:
- ఆ ఉండాలి మీద ఉప్పును అద్ది, పశువు నాలుక మీద రాయాలి .
- రోజుకి ఒక పర్యాయం చొప్పున 3 రోజులు వాడాలి.
నట్టల నివారణ
కావలిసిన పదార్థములు:
ఉల్లి 1 , వెల్లుల్లి 5 రెబ్బలు, ఆవాలు 10 గ్రా , వేప ఆకులు - చారెడు, జీలకర్ర 10 గ్రా ,కాకరకాయ -50 గ్రా , పసుపు 5 గ్రా, మిరియాలు 5 గ్రా, అరటి దవ్వ 100 గ్రా , తమ్మి ఆకులు 1 గుప్పెడు , బెల్లము 100 గ్రా.

తయారుచేయు విధానము:
30 నిమిషాల పాటు మిరియాలు, జిలికార, ఆవాలు నీటిలో నాన పెట్టవలెను. మిగిలిన పదార్థాలలో కలిపి దీనిని ఒక మిశ్రమం వాలే తాయారు చేయవలెను.
వాడు విధానం:
ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయవలెను. ఈ పదార్థాన్ని ఉప్పుతో కలిపి రోజుకి ఒకసారి చొప్పున 3 రోజుల పాటు తినిపించ వలెను.
జోరీగలు బాహ్య పరాన్నజీవులు
కావలిసిన పదార్థములు :
వెల్లుల్లి 10 రెబ్బలు ,వేప ఆకు -చారెడు ,వేప పండ్లు -చారెడు, వస/వాడజ 10 గ్రా , పసుపు 20 గ్రా ,పులికంప ఆకులు -చారెడు.

తయారుచేయు విధానం :
- అన్నిన్నిటిని మిక్సీలో వేసి ఆడించాలి.
- ఒక లీటరు పరిశుభ్రమైన నీటిని కలపాలి.
- పరిశుభ్రమైన గుడ్డతో గాని ఫిల్టర్ తో గాని వడపోయాలి.
- స్ప్రే యర్లతో ఆనిసంధానించబడిన సీసాలో ఈ మిశ్రమాన్ని నింపాలి.
వాడు విధానం :
- పశువు శరీరమంతా ఈ మందు పీచికారీ చెయ్యాలి.
- పశువుల శాలలో,పగుళ్లలోనూ, మూలలలోను కూడా పీచికారీ చేయాలి.
- ఈ ద్రావకంలో ముంచిన గుడ్డతో కూడా పశువు శరీరం పై రాయవచును .
- బాహ్య వారన్నా జీవులు నశించు వరకు వారానికి ఒకసారి ఈ మందును పీచికారీ చేయాలి.
- రోజులో ఎండా కాసే సమయంలో మాత్రమే ఈ విధానాన్ని పాటించవలెను.
అమ్మవారి పొక్కులు పురిపిడి కాయలు పగుళ్ళు
కావలిసిన పదార్థములు :
వెల్లుల్లి -5 రెబ్బలు ,పసుపు 10 గ్రా , జీలకర్ర 15 గ్రా , సబ్జా ఆకులు-చారెడు ,వేప ఆకులు -చారెడు , వెన్న -50 గ్రా.

తయారుచేయు విధానము :
- జీలకర్ర గింజలను 15 నిమిషములు నీటిలో నానబెట్టాలి.
- పదార్థాలనంటింటిని కలిపి పాకం /పేస్టు చేయాలి.
- దానికి వెన్నను చేర్చి బాగా కలపాలి.
వాడు విధానం :
సంబంధిత భాగం పై వీలైనన్ని పర్యాయములు తగ్గే వరకు రాయాలి. చర్మపు ఉపరితలాన్ని పొగిడా చేసి మాత్రమే మందును రాయాలి.