హోమ్ / వ్యవసాయం / పశు సంపద / పశువుల పెంపకంలో మెళకువలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పశువుల పెంపకంలో మెళకువలు

పశువుల పెంపకంలో మెళకువలు.

గేదెల పోషణ: గేదెలతో కానీ, ఆవులలో కానీ ప్రతి లీటరు పల ఉత్పత్తికి అయ్యే ఖర్చులో 60 -70 శాతం మేత, ధనల మీద ఖర్చు చేయబడుతుంది. కొన్ని మేళ కువలు పాటించుట వలన పది గేదెలకు ఇచ్చే మేత, దాణా ఖర్చు తగ్గించుకోవచ్చును. తాధ్వర తక్కువ ఖర్చుతో పల ఉత్పత్తి చేసుకుని, ఎక్కువ లాభాలు ఆర్జించుకొనవచ్చును.

పాడి పశువులకు ఆహారము ముఖ్యం:

  1. పశువు బరువు పాల్పోకుండా, ఆరోగ్యాంగా జీవించుట కొరకు,
  2. పాల ఉత్పత్తి కొరకు, కావలసిన పోషక పదార్ధములను పాడి పశువు శరీర బరువును బట్టి పాల ఉత్పత్తిని బట్టి నిర్మయిస్తారు.

ఉదాహరణకు 500 కి.గ్రా. బరువు వున్నా గేదెకు 12 .5 కి.గ్రా. తేమలేని ఆహార పదార్ధములు, 280 గ్రాముల జీర్ణమగు మాంసపుకృత్తులు, 4 .55 కి.గ్రా. జీర్ణమగు శక్తినిచ్చే పదార్ధములు రోజుకు ఇవ్వాలి.

పాల ఉత్పత్తికి కావాల్సిన పోషక పదార్ధములు, పాల దిగుబడి రోజుకు, పాలలో వెన్న శాతము మీద ఆధారపడి ఉంటుంది. పశువుకు కావాల్సిన జీర్ణమగు మాంసకృత్తులు, జీర్ణమగు శక్తినిచ్చే పదార్ధము , పశుగ్రాసములు, దాణా మిశ్రమము ధ్వారా లభించును. పత్తిగింజల చెక్క పొయాచిక్కుడు గింజల చెక్క, కొబ్బరి పిండి, పాడి పశువుల ఆహారములో వాడిన ఎక్కడ పాలలో వెన్న శాతము పెరుగుతుంది. పాలలో గట్టిగా వుండే వెన్న ఉత్పత్తి అవుతుంది. పసరుతో వున్నా గడ్డి మొత్తగా పొడి చేసిన దాణా మిశ్రమము, వేడి చేసిన లేక వండిన ఆహారము, రేషనులో దాణా శాతము ఎక్కువ, పశు గ్రాసము శాతము తక్కువగా వున్నా ఆహారమును ఇచ్చిన ఎడల గేదె, ఆవు పాలలో వెన్న శాతము తగ్గుతుంది. పాల దిగుబడి మాత్రము తగ్గదు.

గేదెలు ఈనిన తరువాత సుమారు 5 -6 వారములలో ఉన్నత స్థాయి పాల ఉత్పత్తికి చేరుకుంటాయి. ఈ సమయములో పాడి పశువుకు మంచి ఆహారము ఇచ్చి, శ్రద్ధగా యాజమాన్య పద్ధతులు పాటించుట వలన ఈ ఉన్నత స్థాయి పాల ఉత్పత్తి పడిపోకుండా చూడాలి. అలా చేయుట వలన పాడి పశువు ఈత కాలము (305 రోజులు ) లో ఎక్కువ పలు యిచ్చి రైతులు అధిక లాభము పొందుటకు వీలుపడుతుంది. కొద్ది రోజులు (10-15 రోజులు ) తర్వాత పాల దిగుబడి క్రమేణా ప్రతి నెల 4-6 శాతము చొప్పున తగ్గుతుంది. అయితే నెలకు 4 -6 శాతము కన్నా ఎక్కువ పాల ఉత్పత్తి పడిపోకుండా చూడాలి. వివిధ పరిస్థితులలో పాడి గేదెలను పోషించుట, పోషణకయ్యే రోజు వారి ఖర్చు ఈ క్రింద విధంగా ఉంటుంది. ఒక గేదె 500 కి.గ్రా. బరువు కలిగి, రోజుకు 6 లీటర్ల పాలు 7 శాతం వెన్నతో ఇచ్చిన ఎడల ఈ క్రింది విధంగా మేపవలెను.

(ఎ)మొక్కజొన్న/ సజ్జ / జొన్న పచ్చిమేత ల్యూసర్న్ / బారి / పిల్లి పెసర / అలసంద / పచ్చిమేత (చిక్కుడు జాతి )

40 కి.గ్రా.

15 కి.గ్రా.

(బి) వరిగడ్డి ఈ పద్దతిలో రోజువారీ మేత ఖర్చుకు (పైన తెల్పిన గేదెకు )

2 కి.గ్రా.

రూ. 35.00 లు

(సి) వరి గడ్డి దాణా మిశ్రమము ఈ పద్దతిలో రోజువారీ మేత ఖర్చు (ముందు తెలిపిన గేదెకు )

12 కి.గ్రా.

5 కి.గ్రా.

రూ. 42.00 అవుతుంది.

పైన తెలిపిన ఉదాహరణలు (ఎ), (బి), (సి) రేషన్లకు పరిశీలించిన ఎడల ధాన్యపు జాతి, చిక్కుడు జాతి పచ్చిమేతను మేపుట (ఎ) వలన గేదెలతో రోజుకు 6 లీటర్ల పాల ఉత్పత్తి వరకు దాణా మిశ్రమము పెట్టనవసరం లేదు. రోజు వరి పోషణకయ్యే ఖర్చు కూడా తక్కువ (రూ. 35.00 ). చిక్కుడు జాతి పచ్చిమేత లేనప్పుడు, ధాన్యపు జాతి పచ్చిమేత, దాణా మిశ్రమము, వరిగడ్డి మేపుట వలన (బి) రోజుకు గేదెకు రూ. 40 .00 లు ఖర్చు అవుతుంది. పచ్చిమేత లేనప్పుడు దాణా మిశ్రమము , వరిగడ్డి (సి) మేపుట వలన గేదె కు రోజువారీ మేత ఖర్చు (రూ. 42 .00 ) ఉంటుంది. పచ్చిమేత మేపుట వలన పాడి ఆవులు, గేదెలతో పోషణ ఖర్చు తగ్గించుకొనవచ్చును, చౌకగా పాలు ఉత్పత్తి చేసి ఎక్కువ లాభము పొందవచ్చును. కాబట్టి రైతులు మేలురకపు పశుగ్రాసాలలో సాగుచేసి, దాణా ఖర్చు తగ్గించుకుని పాడిపరిశ్రమలో అధిక లాభాలు పొందవచ్చును.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు