హోమ్ / వ్యవసాయం / పశు సంపద / పశువుల భీమా పథకం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పశువుల భీమా పథకం

పశు భీమా పథకము వివరాలు

వ్యవసాయం, పశుపోషణకి అనాది కాలం నుండి విడదీయరాని అనుబంధం ఉంది. రైతులు వ్యవసాయానికి పశుపోషణని అనుబంధ రంగంగా చేర్చుకుని వ్యవసాయాన్నిసాగించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. bhimaపశుపోషణని ఈ విధంగా వ్యవసాయానికి అనుసంధానించుకోవడం ద్వారా రైతుకు ఆహార భద్రత, వాటిని వ్యవసాయంలో వివిధ అవసరాలకు వాడుకోవడం అనగా దుక్కిదున్నడానికి, పశువుల ద్వారా వచ్చే ఎరువును పంటలకు అందించడం జరుగుతుంది. ఇలా వ్యవసాయ రంగంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న పశువులకు వివిధ రూపాల్లో వచ్చే ప్రమాదాల ద్వారా వాటి ప్రాణానికి ముప్పు లేకపోలేదు. ఎన్నో ఆశలతో వ్యవసాయ, పాడి అవసరాల నిమిత్తం చాలా పెద్ద మొత్తం డబ్బులను చెల్లించి కొనుగోలు చేసిన పశువులు అలా అకస్మాత్తుగా ప్రమాదానికి గురి అయినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ఇలా వివిధ రూపాల్లో వచ్చే ప్రమాధాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2006-07లో పశువుల బీమా పథకాన్ని మొదట దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గల 100 జిల్లాల్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ పథకం అన్ని జిల్లాలకు విస్తరించి అందరికీ అందుబాటులోకి వచ్చింది. కావున రైతులు ఈ పథకాన్ని వినియోగించుకొని, వివిధ రూపాల్లో వచ్చే ప్రమాదాలకు ఆర్థిక సహకారాన్ని పొందవచ్చు.

పశువుల బీమా పథకంలో గల ప్రధాన అంశాలు

 • దేశీయ, క్రాస్ బ్రిడ్ జాతులకు చెందిన పశువులకు ఈ పథకం ద్వారా బీమా చేయించడానికి అర్హత ఉంది.
 • ఈ పథకం ద్వారా బీమా చేయించడానికి అర్హత గల పశువులు వాటి వివరాలు.
 • పాడి ఆవులు, గేదెలు.
 • దూడలు, పడ్డలు.
 • క్యాస్ట్రేషన్ చేయబడిన దున్నలు, ఎడ్లు.
 • ఈ బీమా పథకం ద్వారా బీమా సౌకర్యాన్ని పొందడానికి పశువు ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తానికి 4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక గేదె ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 40,000/- ఉంటే ఆ మొత్తంలో 4 శాతం అంటే రూ.1600/- రూపాయలను ప్రీమియంగా చెల్లించడం ద్వారా బీమా సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ 4 శాతం ప్రీమియం అనేది ఒక సంవత్సర కాలం బీమా చేయించడానికి మాత్రమే. అంటే 4 శాతం ప్రీమియంతో బీమా చేయించినప్పుడు దాని పరిమితి ఒక సంవత్సరానికి మాత్రమే ఉంటుంది. ఈ బీమాని దీర్ఘకాలికంగా చేయించినప్పుడు ప్రీమియంలో డిస్కౌంటును పొందవచ్చు. బీమా చేసే సమయంలో పశువుల ప్రస్తుత విలువ అనేది రైతు, పశువైద్య అధికారి, బీమా కంపెనీల యాజమాన్యం సమక్షంలో నిర్ణయించబడుతుంది.
 • బీమా చేయించిన పశువులు ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు బీమా చేసే సమయంలో సంబంధిత పశువు మార్కెట్ విలువ ఎంతైతే ఉందో అంత మొతాన్ని పరిహారంగా పొందవచ్చు. పాలు ఇవ్వని పశువులకు మాత్రం మార్కెట్ విలువలో 75 శాతాన్ని మాత్రమే పరిహారంగా ఇస్తారు.

ఈ కింది తెలుపబడిన సందర్భాల్లో భీమా  చేయించిన పశువులకు పరిహారం ఇస్తారు

 • అగ్ని ప్రమాదం, వరదలు, తుపానులు, భూకంపం మొదలగు ప్రమాదాల వల్ల చనిపోయిన పశువులకు ఈ బీమా ద్వారా పరిహారాన్ని అందజేస్తారు.
 • వివిధ రకాల వ్యాధుల బారిన పడిన పశువులకు, శస్త్ర చికిత్స చేసే సమయంలో చనిపోయిన పశువులకు పరిహారం ఇస్తారు.

భీమా వర్తించని సందర్భాలు

 • అశాస్త్రీయ పద్ధతులలో వైద్యం అందించడం, బీమా కంపెనీలు నిర్దేశించిన ప్రమాణాలకు వ్యతిరేకంగా పశువులను వేరే పద్ధతులలో ఉపయోగించడం లాంటి సందర్భాల్లో బీమా వర్తించదు.
 • బీమా చేయించడానికి ముందే వ్యాధుల బారిన, ప్రమాదాల బారిన పడిన పశువులకు బీమా వర్తించదు.
 • ఉద్దేశ పూర్వకంగా జంతువులను వధించడం వంటి సందర్భంలో బీమా వర్తించదు.
 • బీమా చేయించిన పశువులు దోపిడికి గురికావడం, వాటిని రహస్యంగా అమ్మకానికి తరలించడం ద్వారా బీమా ఇవ్వబడదు.
 • పౌర, అణు యుద్ధం, తీవ్రమైన దాడి, జంతువుల మధ్య అలజడి, దేశంలో అంతర్యుద్దాల వల్ల పశువులు మరణిస్తే బీమా వర్తించదు.
 • ఆకాశ, సముద్ర మార్గాన పశువులను తరలిస్తున్నప్పుడు ఏదేని ఆపదకు గురైన సందర్భంలో కూడా బీమా వర్తించదు.

పశువుల భీమా చేయించడానికి కావాల్సిన ధృవీకరణ పత్రాలు

 • పశువైద్య అధికారిచే ధృవీకరించబడిన పశువు ఆరోగ్య స్థితిని తెలిపే పత్రం. ఈ ధృవీకరణ పత్రంలో ఈ కింద తెలిపిన వివరాలు తప్పనిసరిగా ఉండాలి.
  1. వయస్సు
  2. ఆరోగ్య పరమైన వివరాలు
  3. మార్కెట్ విలువ
  4. గుర్తింపు మచ్చలు

భీమా చేయించబడిన పశువులను గుర్తించడం

 • భీమా చేయించబడిన పశువుల సహజమైన రంగు, మచ్చలను కచ్చితంగా ధృవీకరణ పత్రంలో పశువైద్య అధికారి ద్వారా నమోదు చేయించాలి.
 • భీమా చేయబడిన పశువుల కుడి చెవి భాగాన కోడ్ నెంబర్ కలిగిన ప్లాస్టిక్ ట్యాగ్ని పశువైద్య అధికారి సమక్షంలో తగిలిస్తారు. ఈ ట్యాగ్ పై ఉన్న కోడ్ నెంబర్ని పశువు ఆరోగ్య ధృవీకరణ పత్రంలో చేర్చవలసి ఉంటుంది. ఈ కోడ్ నెంబర్ ఆధారంగా బీమా చేయించిన పశువును గుర్తించవచ్చు.
 • మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్న పశువుల ఫోటోలను ధృవీకరణ పత్రానికి జతపరచవలసి ఉంటుంది.

కావున పైన తెలపబడిన వివరాలను ఇంకా నిక్షిప్తంగా తెలుసుకోవడానికి సంబంధిత ప్రాంతానికి చెందిన పశువైద్య అధికారి లేదా వివిధ ఇన్సురెన్స్ కంపెనీల యాజమాన్యం ద్వారా తెలుసుకుని పశువులకు వివిధ రూపాల్లో వచ్చే ఆపదల ద్వారా వచ్చే నష్టాల బారినుండి తప్పించుకుని నష్ట పరిహారాన్ని పొందాలంటే ఈ పశువుల బీమా పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నాం. అదే విధంగా ఇన్సురెన్స్ చేయించిన పశువులకు తగిలించిన ట్యాగ్ పోతే పరిహారాన్ని పొందడానికి అర్హత ఉండదు.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

2.94047619048
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు