మన దేశంలో పశువులను శాస్త్రీయ పద్ధతిలో మేపడానికి కావాల్సిన మేత వనరులు, దాణా లభ్యత చాలా తక్కువగా ఉంది. సమీకృత దాణాల ధరలు కూడా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్న కారణంగా పాడి రైతులు తమ పశువులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించలేక తక్కువ దిగుబడులను పొందుతున్నారు. రైతులు కొంచం వినూత్నంగా ఆలోచించి ప్రత్యామ్నాయ దాణా దినుసులు, వ్యవసాయ ఉప ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఉప ఉత్పత్తులను ఉపయోగించి సమీకృత దాణాను తయారు చేసుకున్నట్లయితే లేదా పశువులకు సాధారణంగా ఇచ్చే మేతకు వీటిని అదనంగా ఇచ్చినట్లయితే పశువులకు కావాల్సిన పోషకాలన్నీ తక్కువ ఖర్చుతో అందించి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు.
పశువుల మేతలో వాడే వివిధ రకాల ప్రత్యామ్నాయ మేత వనరులలో ఆల్కహాల్ తయారీ పరిశప్రమల నుండి వచ్చే ఉప ఉత్పత్తుల వాడకం క్రమేపి పెరుగుతోంది. మన దేశంలో ఆల్కహాల్ తయారు చేసే పరిశ్రమల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. కాబట్టి భవిష్యత్తులో ఆల్కహాల్ ఉప ఉత్పత్తుల లభ్యత ఇంకా పెరిగే అవకాశం ఉంది.
మొక్కజొన్న వరి, గోధుమ, బార్లీ వంటి ధాన్యపు గింజల నుండి పిండి పదార్ధాన్ని వేరుచేసి, దాన్ని ఈస్ట్లను ఉపయోగించి పులియబెట్టి ఆల్కహాల్ / బీరు తయారు చేస్తారు. మన దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా వెుక్కజొన్నను వాడుతున్నారు. ఈ పరిశ్రమలలో పిండి పదార్ధం పోగా మిగిలిన పోషకాలన్నీ ఉప ఉత్పత్తులుగా లభిస్తాయి. బీరు తయారీకి వాడిన ధాన్యపు గింజలతో పోలిస్తే వీటి నుండి వచ్చే ప్రక్రియలో వచ్చే ఉప ఉత్పత్తులలో మూడు రెట్లు ఎక్కువ పోషకాలు (పిండి పదార్థం మినహా) లభిస్తాయి. ఆల్కహాల్ తయారీ పరిశ్రమ నుండి వచ్చే ఉప ఉత్పత్తులు ముఖ్యంగా మూడు రకాలు
ఆల్కహాల్ తయారీలో చివరగా మిగిలిన మిశ్రమం నుండి ఘన పదార్థాలను వేరు చేయగా పలుచని ద్రవ పదార్థం వస్తుంది. ఈ ద్రవ పదార్ధాన్ని ఆవిరి చేయగా వచ్చే అర్ధ ఘన రూప పదర్గాన్నే డిస్టిల్లరీ ద్రవ పదార్థంగా పిలుస్తారు. బీరు పొట్టును ఈ డిస్టిల్లరీ ద్రవ పదార్థంను కలుపగా వచ్చే పదార్ధాన్ని తడి బీరుపొట్టు అని, తడి బీరు పొట్టును పూర్తిగా ఎండబెట్టగా వచ్చే పదర్గాన్ని పొడి బీరు పొట్టు అని పిలుస్తారు. డిస్టిల్లరి ద్రవ పదార్థం లోని మాంసకృత్తులలో అధిక శాతం (80 శాతం) రుమేన్లోనే జీర్ణం అవుతాయి. దీన్ని అధికంగా వాడినప్పుడు రక్తంలో, పాలలో యూరియా సంబంధిత నత్రజని పెరిగి పశువులు అనారోగ్యానికి గురవుతాయి.
పోఛక విలువలు (శాతం) |
డిస్టల్లరీ ద్రవ వ్యర్థపదార్థం |
తేమ |
55-70 |
మాంసకృతులు |
20-30 |
కొవ్వులు |
9-15 |
శక్తినిచ్చే పదార్థాలు |
75-120 |
ఫాస్ఫరస్ |
1.3-1.45 |
సల్ఫర్ |
0.37-0.95 |
ధర/ కిలో రూ. |
4-5 |
డిస్టల్లరీ ద్రవరూప పదార్థం వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా వాడటం వల్ల పశువుల ఆరోగ్యం, ప్రత్యుత్పత్తిలో ఏవైనా సమస్యలు ఎదురవుతాయా అనే కోణంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. రైతులు పై విషయాలు అన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణీత మోతాదులో, నాణ్యమైన డిస్టల్లరీ ద్రవరూప పదార్ధాన్ని మాత్రమే తమ పశువుల మేతలో భాగంగా వాడుకొని వాటికి తక్కువ ఖర్చుతో మంచి పోషకాలు ఉన్న దాణా ఇవ్వడం ద్వారా అధిక పాల దిగుబడి, పొందవచ్చు.
ఆధారం : పాడిపంటలు మాస పత్రిక