పశుసంపద నుండి మనకు 10 శాతం జాతీయ ఆదాయం వస్తోంది. పాలు, గ్రుడ్లు, మాంసము, ఉన్ని మెదగునవి మనకు పశువుల నుండి లభ్యమవుతున్నాయి. ఇంత ఆధాయాన్నిస్తున్న పశువులకు పుష్టికరమైన మెతనిచ్చి వాటి నుండి తగినంత ఉత్పత్తిని పొందాల్సిన అవసరం ఉంది. కానీ నానాటికి పచ్చియా బీళ్లు తగ్గి పోతుండడంతో పాలు సకాలంలో వర్షాలు లేక పచ్చిమేత కొరత తీవ్రంగా కనబడుతొంది. ఇలాంటి సమయాల్లో వ్యవసాయ ఉప ఉత్పత్తుల వాడకాన్ని పెంచి, కొంతమేర మేత కొరత తీర్చే ప్రయత్నము జరుగుతువుంది. మన దేశంలో 43 శాతం దాకా దాణా దినుసులు, 44 ఎందుమేత మరియు 38 శాతం పచ్చిమేత కొరత ఉన్నట్లుగా తేలింది. అదికాక మనదేశంలో సగటున 250 మిలియన్ టన్నుల ధాన్యపు జాతి ఎందుమేత ఉత్పత్తి ఉన్నట్లు అంచనా. తక్కువ శాతం ప్రోటీన్, ఖనిజాలు మరియు ఎక్కువ శాతం లిగ్నిన్ మరియు సిలికా ఉన్నందున ఈ ఎందువేమతాలు మంచి అరుగుదల నోచుకోలేవు. ఇలాంటి సందర్భాల్లో పోషక నాణ్యత పెంచే ఏ ప్రక్రియ అయినా పశువులకు పోషక సరఫరా సరిగా జరిగినట్లే. ఈ పరిస్ధితుల్లోనే "సంపూర్ణ ఆహార వ్యవస్ధ" (కంప్లైట్ డైట్ సిస్టమ్) యెక్క ఆవశ్యకత, ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడం అవసరము. ఈ సంపూర్ణ ఆహార వ్యవస్ధ ద్వారా పశువులకు పోషకాలు అందించడమే కాకుండా, తక్కువ ఖర్చుతో మేతను తయారు చేసుకోవచ్చు.
ఈ సంపూర్ణ సమీశ్వత ఆహారంలో ఎండుమితతో సహా అన్ని దాణా దినుసులను పొడిచేసి కలుపుతారు. ముందుగా కొద్దీ మొతాదులో వాడే దినుసులను ప్రిమికిగా చేసైరు. పొడి చేసిన దినుసులను ప్రిమిక్సతో పాటుగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసిన మొలాసిస్ తగిన పాళ్ళలో మిశ్చరిలో వేసి 10 నిమిషాలు కలుపుతారు. ఈ పద్ధతిని మొదలుగా అభివద్ధి చెందిన దేశాల్లో ప్రారంభించారు. ఈ పద్ధతి ద్వారా పశువులకు సరియైన మేతదులో అన్ని పోషకాలు అందించడం పీచు మరియు దాణా పదార్దాల నిష్పత్తి సరిగి ఉండడం ఎక్కువ పీచు మరియు లిగ్నిన్ ఉండే పదార్థాలు సద్వినియాగపడడం లాంటివి ఉపయేగాలుగా ఉంటాయి. దాణా మరియు పీచు పదార్థాలు నిష్పత్తి ఒక్కో పశువులకు వాటి ఉత్తత్తి సామర్ధ్యాన్ని బట్టి మారుతూ వుంటుంది.
పెద్ద పొట్ట పశువులకు ఈ రకం మేత మేసేటప్పుడు, ఒక్కసారిగా మేపకుండా వివిధ సమయాల్లో కొద్దికొద్దిగా మేపుకొంటే మంచిది. ఒకేసారి మేపినందువల్ల పెద్ద పొట్ట ఒత్తిడికి లోనాయ్అ రుగుదల ఇబ్బందులు ఎదురవుతాయి. తద్వారా పొట్టలోని ఉడుజనము మారకుండా ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా పొట్టలో ఉత్పత్తయ్య్అ సిటిక్ మరియు ప్రొపియానిక్ ఆమ్లాల నిష్పత్తి గానే ఉండీ పాలలో వెన్నశాతం తగ్గకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ఇదే ఆడజనము పొట్టలో పీచు పదార్థాలను అరుగుదుల చేసే సెల్యులోలైటిక్ బ్యాక్టీరియా అభివద్ధి చెందేందుకు ఉపయెగపడుతుంది.
ఆధారం: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్ధ