హోమ్ / వ్యవసాయం / పశు సంపద / పశువుల్లో తూటుకాడ మొక్కల విష ప్రభావం - నివారణ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పశువుల్లో తూటుకాడ మొక్కల విష ప్రభావం - నివారణ

పశువుల్లో తూటుకాడ మొక్కల విష ప్రభావం మరియు చికిత్స విధానము

తూటు కాడ ఒక రకపు కలుపు మొక్క దీనికి సాగే గుణం ఉండడం వలన రబ్బరు మొక్క అని, కాండం మధ్యలో బొంగులాగా స్థలం ఉండడం వలన బొంగు మొక్క అని కూడా అంటారు. దీని ఆకులు హృదయాకారంలో ఉండి, పూలు లేత ఎరుపు, తెలుపు రంగులలో ఉంటుంది. ఎక్కువగా నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో, చెరువులు, కాలువ గట్ల మీద పెరుగుతూ ఉంటుంది. వీటిని పశువులు తినడం వలన నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చి జీవాలు, పశువులు చనిపోయే అవకాశం ఎక్కువ.

తూటు కాడ మొక్క ఉపయోగాలు

 • మొక్క కాడను పేపర్ పరిశ్రమమలలో ఎక్కువగా వాడతారు.
 • ఆ ఆకుల్లో మార్సిలిన్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని మూర్చ వ్యాధిలో, మత్తు కలిగించడానికి ఉపయోగిస్తారు.
 • ఆ మొక్కలోని సపోనిన్లు అనే రసాయనిక పదార్థాలను క్యాన్సర్ తగ్గించే మందుల్లో వాడతారు.
 • పండ్లు మానడానికి, మధుమేహం తగ్గించడానికి రోగనిరోధక శక్తి మందుల్లో వాడతారు.
 • పూర్వపు రోజుల్లో వీటి కాడను పొగాకు గొట్టాలుగా వాడేవారు.tutukada

విష ప్రభావం

 • ముఖ్యంగా విష ప్రభావానికి కారణం లైసర్టిక్ ఆమ్లం
 • సాధారణంగా మొక్కలను పశువులు తినవు. కానీ ఒక్కసారి తినడం అలవాటైతే అందులో ఉన్న మత్తు పదార్ధానికి బానిసలా మారతాయి. తరువాత మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా తింటాయి. ఆ విధంగా తిన్న 3-4 నెలల్లోపు విషప్రభావం వల్ల చనిపోతాయి.
 • మేకలు, ఆవులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.
 • బ్రెజిల్ లో దీన్ని దెయ్యపు మొక్కగా వర్ణిస్తారు.
 • మొక్కలోని స్పేయినోనైన్ పదార్ధం వలన తలలోని నరాల వ్యవస్థ దెబ్బతింటుంది.
 • మొక్కలో సెలీనయం అధికంగా ఉండడం వలన ఆల్లకీ వ్యాధి వస్తుంది.

లక్షణాలు

 • ఎక్కువగా ప్రతి రోజు తింటే లక్షణాలు కనిపిస్తాయి.
 • కనుగుడ్లు తిరగడం, నోటి నుండి చొంగ కారడం, పారడం ఉంటుంది.
 • తలను అటు ఇటు ఊపుతూ ఉండడం
 • నరాల బలహీనత
 • మూర్చ రావడం.
 • మత్తు వచ్చినట్లు ప్రవర్తించడం.
 • నాలుగు కాళ్ళు సమన్వయం లేకపోవడం.

అలాంటి స్థితిలో కూడా ఆ మొక్కను తెస్తే తినడానికి ప్రయత్నిస్తుంది. అంతగా పశువులు దానికి బానిస అవుతాయి.

చికిత్స

 • ఆ మొక్కలు ఉండే దగ్గర మేపకుండా జాగ్రత్త తీసుకోవాలి.
 • ఇంజక్షన్, అట్రోపిన్ సల్ఫేట్ 0.1 మి.గ్రా./కిలో బరువుకు, ఇంజక్షన్, మేగ్గుడైన్ 1 మి.లీ./10 కిలోల బరువుకు రక్తంలోకి ఇవ్వాలి.
 • దీనితో పాటు ఇంజక్షన్ మిథైల్ కొబాలమయిన్ 20 మి.లీ. టాబ్లెట్ గాబపెంటిన్ 1 మి.లీ. గ్రా. వాడాలి.

పైవన్నీ 3-5 రోజుల వరకు వాడాలి. అంతేగాక పశువైద్యుని సంప్రదించి తప్పక సలహాలను పాటించాలి.

హెూమియో వైద్యం

 • ఫారపిన్ లేదా వంట నూనెను తాగించడం లేదా డైరెక్ట్ పొట్టలోకి ఎక్కించడం చేయాలి.
 • వంట బొగ్గును మెత్తగా పొడిచేసి నీటిలోకి కలిపి (5 గ్రా. / లీటరు నీళ్ళకి) పెద్ద పశువులకు అయితే 5 లీటర్లు, చిన్న పశువులకు అయితే అర్ధ లీటరు తాపించాలి.
 • 10-12 గుడ్ల తెల్లసొనను, పావు కిలో పంచదారను లీటరు నీటిలో కలిపి 2 రోజులు తాపించాలి.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

3.03703703704
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు