অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పాడి పశువుల ఎంపికలో తీసుకోవల్సిన జాగ్రత్తలు

పాడి పశువుల ఎంపికలో తీసుకోవల్సిన జాగ్రత్తలు

padipasuvuluప్రపంచ పాల ఉత్పత్తిలో 18.5 సాతం వాటాలో ప్రస్తుతం మన దేశం ప్రధమ స్తానంలో ఉంది. ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నా, ఒక పాడు పశువు తొలసరు పాల దిగుబడి అమెరికా, న్యూజిలాండ్, ఇజ్రాయిల్ వంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. మన దేశంలో ఒక పశువు సగటు వార్షిక పాల దిగుబడి 1172 కి.గ్రా. అయితే, ఆడే న్యూడిలాండ్, ఇజ్రాయిల్ వంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. మన దేశంతో ఒక పశువు సగటు వార్షిక పాల దిగుబడి 1172 కి.గ్రా. అయితే, అదే న్యూజీలాండ్ 3343 కి.గ్రా. ఆస్ట్రేలియాలో 5600 కి.గ్రా., యూ.కె.లో 7101 కి.గ్రా. యూ.ఎస్.లో 9332 కి. గ్రా., ఇజ్రాయిల్ లో 10214 కి.గ్రా. గా ఉంది. శాస్త్రీయంగా పశుపోషణ, ఆరోగ్యం, యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం, ఉత్పత్తికి సంబంధించిన రికార్డులు లేకపోవడం, దాని మూలంగా మేలైన పశువుల ఎంపిక సాధ్యం కాకపోవడం మెదలగు అనేక కారణాల చేత ఈ వ్యత్యాసం స్వష్టమవుతుంది.

అధిక పాల దిగుబడులు పొందడానికి రైతులు అధిక సాలసార కలిగిన పాడి పశువులను పోషించడం ఎంతో అవసరం. పాడి పశువుల్ని ఎంపిక చేసుకునే ముందు ఈ కింది అంశాలను పరిగమలోకి తీసుకోవాలి.

మన వాతావరణ పరిస్థితులని, పాలికి మార్కెట్ లో ఉన్న గిరాకీని, పశుగ్రాసాన లభ్యతని దృష్టిలో ఉంటుకొని సరైన జాతులని ఎంపిక చేసుకోవాలి. అధిక పాలనిచ్చే సంకర జాతి హాల్ట్సెయిన్ ఆవులను ఎంపిక చేసుకోవచ్చు. అయితే సంకర జాతి ఆవులను ఎంచుకున్నప్పుడు వాటిలో విదేశీ రక్తం 50-62.5 శాతం మించకుండా ఉండాలి. దేశవాలీ ఆవుజాతులలో సాహీవాల్, సింధీ, గర్, ఒంగోలు జాతులను ఎంపిక చేసుకోవచ్చు. గేదెల విషయానికి వస్తే ప్రపంచ ప్రసిద్ధిగావించిన ‘ముర్రా’ జాతి గేదె అత్యంత శ్రేష్ఠమైనది. అధిక పాలదిగుబడికి, అత్యధిక వెన్న శాతానికి పెట్టింది పేరు. కావున ముర్రా, గ్రేడెడ్ ముర్రా వంటి జాతులను ఎంపిక చేసుకోవచ్చు.

జన్యుశాస్త్ర రీత్యా పశువు అధికంగా పాలు ఇవ్వాలంటే, అందుకు కావల్సిన జన్యు కణాలను పాడి పశువుకు దాని తండ్రి నుండి గానీ, తల్లి నుండి గానీ, తల్ల నుండి గానీ లభించి ఉండాలి. జన్యుశాస్త్ర రూత్యా అధిక పాలని ఉత్పత్తి చేసే శక్తి ఒక పాడి పశువులో ఉన్నప్పుడే దానికి అవసరమైన పోషణ చేస్తే, పాల ఉత్పత్తి సాధ్యం, లాంటి జన్యు కణాలు లేని పశువులను ఎంత మేపినా, పాల దిగుబడి అంతంత మాత్రమే ఉంటుంది.

నాణ్యమైన పాడిపసువు ఎంపికలో ఆరోగ్యం చాలా ముఖ్యం. పశువును ఎంపిక చేసేటప్పుడు, అది సక్రమంగా ఎదకు వస్తుందా లేదా, సరిగా కడుకుందా లేదా మోదలగు అంశాలను గుర్తు పెట్టుకోవాలి. పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే, ప్రతి 14-15 నెలల్లో ఒకసారి ఈనేటట్లుండాలి. నిరుడు ఊతలో పొదుగు వాపు వ్యాధి, గాలికుంటు వ్యాది మెదలగునవి పోకాయా లేదా తెలుసుకోవాలి. ముఖ్యంగా గాలికుంటృ వ్యాధి సోకినట్లయితే, ఆ పశువు పాల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది.

పాడి పశువుల వంశ చరిత్ర, తండ్రి పాలసార తల్లి పాల దిగుబడు మొదలగు రికార్డులను పరిశీలించాలి. ఇలాంటి వివరాలు పెద్ద పెద్ద పార్కుల్లో మాత్రమే లభిస్తాయి. అయితే రైతులు తమ స్థాయిలో పాడి పశువులకి సంబంధించిన అన్ని వివరాలనుఅంటే ఒక ఫశువుకు ఎన్ని ఈతలయ్యింది, ప్రతి ఈతకు ఎన్ని పాలు ఇచ్చింది, ఉదయం ఎన్ని పాలు ఇచ్చింది, సాయంత్రం ఎన్ని ఇచ్చింది, ఆ పశువు ఎప్పుడు పుట్టింది, ఎక్కడ కొన్నది మొదలైన విషయాలన్నింటిని నమోదు చేసుకోవాలి. భవిష్యత్తులో రైతు పశువులను కొనాలన్నా, అమ్మాలన్నా ఈ వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి సమాచారం అందుబాటులో లేనప్పుడు పశువుల లక్షణాలు, పాల దిగుబడుల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. ఒకటి, రెండు ఈతల్లోనివి, లేగ దూడతో సహా, ఈనిన పెండు వారాలలోపు కొనడం మంచిది, కనీసం రోజుకి 12-15 లీటర్ల దిగుబడి ఇచ్చే పశువుని, రెండు పూటలా పాలను చూసి ఎంపిక చేసుకోవాలి. పాడు పశువు జీవన కాలంలో అత్యధిక పాల ఉత్పత్తి మూడవ ఈతలో కనబడుతుంది. ఆ తరువాత క్రమేపి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వయస్సున్న ఆవులని / గేదెలని ఎంపిక చేసుకోకూడదు. బంతాలని బట్టి పశువుల వయస్సును అంచనా వేయాలి. 2 – 6 శాశ్వత దంతాలు కలిగి ఉన్న పశువులను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే వాటి జీవిత కాలంలో ఎక్కువ ఈతలు పొందే అవకాశముంటుంది. కొంత మంది రైతులు చూడి పశువులను కొనడానికి ఆసక్తి కనబరుస్తుటారు. ది సరైన పద్దతి కాదు. చూడి పశువుని కొనుగోలు చేస్తే ఒక్కొక్క సారి గ్రభస్రావం జరగవచ్చు లేదా ఈనిన తరువాత మాయపడకపోవడం, ప్రోలాప్స్ వంటి సమస్యలు ఎదురుకావొచ్చు.

పాడి పశువుల ముఖ్య లక్షణాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో అంటే స్కోర్ కార్డు పద్ధతిలో ఎంపిక చేసుకోవాలి. ఈ పద్ధతిలో పాడుపశువు సాధరణ శరీర లక్షణాలను 30 మార్కులు, పాడి లక్షణాలకు 20 మార్కులు, పొదుగు వ్యవస్థకు 30 మార్కులు, శారీరక లజక్షణాల్లో ముఖ్యంగా పాడి పశువు జాతి లక్షణాలు అంటే శరీర రంగు, కొమ్మల ఆకారం, శరీర ఆకృతి మొదలగు లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలి.

ఆరోగ్యంగా చురుకుగా ఆడ లక్షణాలతో శాంత స్వభావం కలిగి ఉన్న పశువులను ఎంపిక చేసుకోవాలి. కళ్ళు పెద్దగా మెరుస్తూ ఉండాలి. ముట్టి వెడల్పుగా, బలంగా ఉండాలి. న్ని శరీర భాగాలు పూర్తిగా వృద్ధి చెంది సరైన నిష్పత్తిలో ఉండాలి. తల మిగితా శరీరాకృతిలో తగు నిష్పత్తిలో ఉండాలి. మెడ సన్నగా ఉండి ప్రక్కటెముకలు వెడల్పుగా ఉండాలి. కాళ్ళు, బలంగా, సన్నగా, నిటారుగా ఉండాలి. గొంతువాపు, జబ్బవాపు, బ్రుసెల్లోసిస్, క్షయ, ట్రైకోమోనియాసిస్ మొదలగు వ్యాధులు లేవని నిర్ధారించికోవాలి.

పాడి పశువుని ముందు నుండి, పక్కనుండి వెనకనుండి చూసినప్పుడు త్రికోణాకారంలో ఉండాలి. అప్పుడే భాతి భాగం, పొట్ట, పొదుగు పెద్దగా ఉండి అధిక ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంటుంది.

పాడు పశువుల ఎంపికలో పొదుగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. రెండుతోజల మధ్య భాగా వృద్ధి చెంది, వశాలంగా విస్తరించి, ఉదర భాగానికి అత్తుకొని ఉండాలి. చేతిలో స్వర్శించినప్పుడు సున్నితంగా, మెత్తగా, సంకోచవ్యాకోవాలు కలిగి ఉండాలి. క్షీరగ్రంధులు నిండుగా ఎటువంటి కణుతులు లేకుండా డాలి. పొదుగు వాపు వంటి వ్యాధులు లేవని నిర్ధారించుకోవాలి. పొదుగుపై నాలుగు రొమ్ములు ఒకే పరిమాణంలో ఉండి, చతురస్రాకారంలో మర్చబడి ఉండాలి. చన్నులు మరీ పొట్టిగా, మరీ పొడవుగా ఉండకూడదు. పొదుగుపై ఇరువైపులా పాలనరాల పంపులు తిరిగి, జిగ్ జాగ్ ఆకారంలో, ఉబ్బినట్లుండాలి. రక్త నాలాలు బాగా పెద్దగా, శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate