অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పశుగ్రాసానికి ఉపయోగబడు చెట్లు

సుబాబుల్,అవిశ,నల్లతుమ్మ,రావి వంటి చెట్లు ఆకులు పశుగ్రాసానికి బాగా ఉపయోగపడతాయి. మేత కొరత సమయాల్లో వరిగడ్డి చొప్ప ఎండుమేతలలో ఈ చెట్ల ఆకులు 20-30 శాతం వరకు మేపితే పాల దిగుబడి తగ్గదు.

ఇటువంటి చెట్లను పెరట్లోను, తోటల చుట్టు పొలంగట్ల పైన సేద్యమునకు ఉపయోగపడని ఎత్తు పల్లాలలోను, ఖాళీ ప్రదేశంలోను వర్షాకాలములో నాటుకొని అభివృద్ది పరుచుకోవలి.

సుబాబుల్

పచ్చిమేతకు అనువైన పప్పు జాతి వృక్షం త్వరగా పెరుగుతుంది. బెట్టను తట్టుకుంటుంది. ముఖ్యంగా వేసవిలో పశువులకు మేత కొరత తీరుస్తుంది. అన్ని నేలలో పెరుగుతుంది. పోషక విలువలు ఎక్కువగా వున్నందున పశువులు ఈ మేత తినటం వలన పాల ఉత్పత్తి పెరుగుతుంది.

నేలలు : తేలికయిన బరక నేలలు మరియు సారం తగ్గిన భూములలో పెరుగుతుంది. 500-4600 మి.మి వర్షపాతం ఉన్న ప్రాంతంలలో పెరుగుతుంది .
రకాల మెట్ట నేలల్లో – హవాయిన్ కామన్, కె-8 ,కె -28.
ఎరువుల యాజమాన్యం 8 కిలోల నత్రజని, నీటి వసతిగల నేలల్లో – హవాయిన్ జెయంట్ – కె.636. 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్.
విత్తన మోతాదు విత్తనం పైన గట్టి పొర తొలగించి విత్తుకోవాలి. ఇందుకోసం నీళ్ళలో ఐదు నిమిషాలు నానబెట్టి, పైన గట్టిపొరను తొలగించాలి. విత్తనం నీడన ఆరబెట్టి నిల్వ చేసుకోవచ్చు లేక విత్తుకోవచ్చు . ఎకరానికి 320 గ్రా విత్తనం సరిపొతుంది.
విత్తుసమయం జూన్ – జూలై, ఫిబ్రవరి – మార్చి. నీటి వసతి క్రింద. విత్తనం లేక 2 -3 నెల మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు నాటితే మంచి దిగుబడి వస్తుంది.
మొక్కల మధ్య దూరం సాలుకు, సాలుకు మధ్య దూరం 1.2 -1.5 మీ. దూరంలో నాటుకోవాలి.0.5 -0.9 మీ మొక్కకు మొక్కకు మధ్య దూరం వుండాలి.
యాజమాన్య పధ్ధతులు
 1. కలుపు నివారణ మొదటి 2 సంవత్సరములు వరకు చేయాలి.
 2. అవసరాని బట్టి 2 – 5 సంవత్సరముల వరకు చేయాలి
 3. పశుగ్రాసం కొరకు ప్రతి 2 -3 నెలలకు 10 -15 సెం.మీ. ఎత్తులో నరకాలి.
దిగుబడి 1. సుబాబుల్ 6 సంవత్సరములలో మీ. ఎత్తు అరకు పెరుగుతుంది. 2. పశుగ్రాసం, ఎకరాకు వర్షాధార ప్రాంతాలలో 5 -10 టన్నుల నీటి వసతి ఉన్న ప్రాంతాలలో 30 – 36 టన్నులు వస్తుంది.
సమస్యలు – నివారణ
 1. పశుగ్రాసానికి పనికి వస్తుంది. కనుక, మొదటి సంవత్సరములో మొక్కలను పశువులు, మేకల బారినుండి కాపాడాలి.
 2. లేత ఆకుల్లో మైమోసిన్ అనేది ఎక్కువగా ఉండటం వలన సుబాబుల్ ఆకులను వేరే పశుగ్రాసంతో కలిపి మేపుకోవాలి.

పశుగ్రాసము నిల్వ వుంచే పద్ధతులు

పశుగ్రాసము ఎక్కువ లభించే రోజులలో వృథా చేయకుండా నిల్వ చేసుకోవాలి. పశుగ్రాసము నిల్వ చేసినప్పుడు మేతలో పోషక విలువలు సాధ్యమయినంత వరకు తగ్గకుండా చూసుకోవాలి.

నిల్వ చేసే పద్ధతలలో రెండు పద్ధతులు వున్నాయి.

 1. ఎండుమేతను నిల్వచేసుకొనే పద్ధతి.
 2. పచ్చిమేతను పాతర లేదా సైలేజి చేయు పద్ధతి.

ఎండుమేతను నిల్వచేసుకొనే పద్ధతి

పశుగ్రాసము కోసిన తర్వాత అందులోని తేమ శాతం తగ్గించి నిల్వ చేసుకోవాలి. ముందుగా పశుగ్రాసము ఉదయం పూట సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు కోసి ఎండలో తల క్రిందులుగా నిలబెట్టాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు మరలి వేస్తుండాలి. దీని వల్ల మేతలోని తేమ శాతం 35 వరకు తగ్గించాలి. ఇలా ఆరపెట్టేటప్పుడు మేతలోని ఆకులు ఎక్కువగా రాలిపోకుండా చూడడం చాలా ముఖ్యం.

పచ్చిమేతను పాతర లేదా సైలేజి చేయు పద్ధతి

సైలేజి రోజుకు పాడి పశువుకు 20 కిలోల చొప్పున ఇవ్వవచ్చును. సుమారు 120 రోజులుకు సరిపడే పాతర గడ్డి చేతిలో వుంటే వేసవి కాలపు పచ్చిమేత కొరత చాలా వరకు తగ్గించుకొన వచ్చును. సుమారు ఒక ఎకరా భూమి నుండి లభించే జొన్న గాని, మొక్కజొన్న కాని అవసరముటుంది. 5 పాడి పశువులకు 120 రోజులకు 20 కిలోల సైలేజి కావాలి. ఈ సైలేజి తయారు చేయటానికి 18,000 కిలోల పచ్చిమెత కావాలి.

పాతర పెట్టే విధానం

 1. 15 టన్నుల సైలేజి కొరకు 8 అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవు గల పాతర సరిపోతుంది.
 2. గుంత అడుగు భాగంలో ఏ పరిస్థితిలోను నీరు రాని ప్రదేశంలో గుంత తవ్వాలి.
 3. పచ్చిమేతలో 70 – 80 శాతం నీరు వుంటుంది. సైలేజి చేయడానికి 60 శాతం మించి వుండకూడదు. కనుక పచ్చిమేతను పొల0లోనే ఆరబెట్టి తేమను తగ్గి0చవచ్చును. పచ్చిమేతను ముక్కలుగానరికితే మరి కొంత తొందరగా ఆరుతుంది.
 4. లేతగా ఉన్నపచ్చిమేత సైలేజి చేయడానికి పనికి రాదు. మొక్కజొన్న, సజ్జ రకాలను కంకిలో పాలు పట్టి గింజ గట్టి పడుతున్న సమయంలో పాతర వేసే పశువులకు రుచికరమైన సైలేజి తయారు అవుతుంది.
 5. సైలేజి పులవకుండా వుండేందుకు కొంత తవుడు గాని, జొన్నపిండి లేదా బెల్లపు మడ్డి 2 శాతం వరకు కలిపి వుంచాలి. ఎక్కువ తేమవున్నా సైలేజి బూజుపట్టి పాడవుతుంది.పాతర వేయవలసిన గడ్డిని వరుసలలో నింపాలి. భూమిపైన కూడ 2 – 3 అడుగులు వచ్చేలా నింపాలి. ప్రతి వరుసకు బాగా త్రొక్కి, గాలి ఏ మాత్రం లేకుండా చూడాలి. పశువులతోను లేదా ట్రాక్టరుతో కూడా త్రొక్కించవచ్చును. మలిన పదార్థములు గుంతలో పడకుండా చూడాలి.
 6. పచ్చిమేత నింపుట పూర్తి అయిన తరువాత దీనిపైన, పనికిరాని గడ్డి లేదా తాటి ఆకులు వేసి కప్పి మీద 4 – 5 అంగుళాల మందంగా బురద మట్టితో కప్పాలి. క్రమేణా ఇది 2 – 3 అడుగుల వరకు క్రుంగి పోతుంది.ఈ సమయంలో ఏర్పడే పగుళ్ళను చిక్కటి మట్టి పేడతో కలిపి అలకడం మంచిది.

 7. సైలేజి తయారు చేయడానికి తీసిన గుంత

 8. పాతర వేసిన గడ్డి రెండు నెలలకు మాగి కమ్మటి వాసన గ సైలేజిగా మారుతుంది. తరువాత అవసరాన్ని బట్టి ఎప్పుడైనా తీయవచ్చు. అవసరం లేకుంటే 2 – 3 సంవత్సరాల వరకు చెడిపోకుండా సైలేజిని నిల్వ వుంచుకోవచ్చును.
 9. క్రొత్తలో పశువుల సైలేజిని తినకపోవచ్చు. పాలు పితికిన తరువాత లేదా పాలు పితకడానికి నాలుగు గంటల ముందు సైలేజిని పశువులకు మేపాలి, లేని యెడల పాలకు సైలేజి వాసన వస్తుంది. సైలేజి పాల పితికే దగ్గర వుండ కుండా చూసుకోవాలి.

ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate