పాడి పశువుల్లో కిటోసిస్ (ఎండు వాతo) వ్యాధి – నివారణ
క్రిటోసిస్ వ్యాధి ముఖ్యంగా అధిక పాలదిగుబడి ఇచ్చే పశువుల్లో వస్తుంది. సంకరజాతి పశువులలో, ముర్రా గ్రేడెడ్ గేదెలలో కూడా ఈ వ్యాధి వస్తుంది. దీనినే అనిటోనివిుయా, ఎండువాతం వ్యాధి హైపోగైసిమియా అనికూడా అంటారు.
ఈ వ్యాధి పశువు ఈనిన నెలలోపు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ వ్యాధి మొదటి ఈత పశువులలో కన్నా నాల్గవ ఈతలో ఉన్న పశువులకు ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి వలన పశువుల్లో గూకోజు శాతం తగ్గిపోవడం, కిటోనిమియా, కిటోన్యూరియా కూడా ఉంటుంది.
వ్యాధి కారణాలు
- ఎక్కువగా సైలేజి తినిపించడం, ఇందులో బ్యూటిరిక్ ఆమ్లం అనే కిటోన్ బాడి ఎక్కువగా ఉంటుంది.
- తక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలు తినిపించడం ముఖ్యంగా ఈనిన తరువాత, పోషకాహార లోపం వలన కూడా వస్తుంది. ఖనిజ లవణాల లోపం ముఖ్యంగా కోబాల్డ్, భాస్వరం.
- అత్యధిక పాలదిగుబడి ప్రభావం.
- కాలేయం సరిగా పనిచేయక పోవడం.
- ధైరాయిడ్ గ్రంది తక్కువగా పనిచేయడం వలన, కొన్ని హార్మోన్ల కొరత వలన ఈ వ్యాధి వస్తుంది.
వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి.
మొదటి రకం
- గేదెలలో ఎక్కువగా వస్తుంది. దీనినే వేస్టింగ్ ఫామ్ అంటారు.
- మేత మేయవు, దాణా తినవు కాని చొప్ప తింటాయి.
- పశువులు చురుకుదనం కోల్పోయి మగతగా ఉంటాయి.
- శరీర బరువు త్వరగా తగ్గుతుంది.
- పేడ గట్టిగా వేస్తుంది. అరల పొట్టలో కదలికలు తగుతాయి.
- పశువు నడక బిగబట్టినట్లుగా ఉంటుంది.
- శరీర ఉష్ణోగ్రత, శ్వాస, నాడి సాధారణంగా ఉంటాయి.
- చర్మం గరుకుగా, జీవం కోల్పోయినట్లుగా ఉంటుంది.
- వ్యాధి ముదిరిన కొద్ది శ్వాస, పాలలో తియ్యటి వాసన (కిటోన్ వాసన) వస్తుంది.
రెండవ రకంలో
- సంకరజాతి ఆవులలో నరాల సంబంధమైన లక్షణాలు కనిపిస్తాయి.
- పశువు గుండ్రంగా తిరగడం, కాళ్ళు అడ్డంగా పెట్టడం, చర్మాన్ని వస్తువుల్ని అతిగా నాకుతాయి. చొంగ అధికంగా కారుతుంది.
- కండరాలలో వణుకు, గుడ్డితనం, గమ్యంలేకుండా తిరగడం వంటి లక్షణాలు గంట రెండు గంటల వరకు ఉండి, మళ్ళీ ప్రతి ఎనిమిది నుండి పన్నెండు గంటల్లో కనిపిస్తాయి. ఈ దశలో పశువుకు గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువ.
చికిత్స
- ఇరవై శాతం గూకోజ్ను అర లీటరు నుండి లీటరు వరకు రక్తంలోకి రోజుకు రెండుసార్లు ఎక్కించాలి.
- గ్లిసరిన్ లేదా ప్రొఫైలిన్ గైకాల్ 225 గ్రా. రోజుకి రెండుసార్లు మొదటి రెండు రోజులు, తరువాత రెండు రోజులు 125 గ్రా. జాగ్రత్తగా పశువుకి త్రాగించాలి.
- సోడియం ప్రాపయినేట్ 100-200 గ్రా. మూడు రోజులు తినిపించాలి.
- లాక్లేటులు ముఖ్యంగా (కాలియం, సోడియం, అమెనియం) రోజుకి 200 గ్రా. ఇవ్వాలి.
- ఇన్సులిన్ సూది మందులు 200-300 యూనిట్లు ఒక్కో పశువుకి ఇప్పించాలి. దీనివలన గూకోజ్ వినియోగం ఎక్కువవుతుంది.
- కోబాలు, భాస్వరం ఉన్న ఖనిజ లవణాల మిశ్రమం తినే ఆహారంలో వాడాలి.
- కాల్టికోస్టిరాయిడ్ వంటి ఇంజక్షన్లు ఇప్పించాలి.
- కిటోనిల్ జల్లు, మెటబొలైట్, కిటోనెక్స్ బోలసలు, ఈ-బూస్టర్ వంటి పదార్థాలను ఇప్పించాలి.
నివారణ చర్యలు
- పశువు మరీ సన్నగా, మరీ లావుగా కాకుండా చూడాలి. ముఖ్యంగా పాల ఉత్పత్తి తగ్గే సమయంలో, పశువు ఈనే సమయంలో అధికంగా వేువకూడదు, ఉవ వానం ఉంచకూడదు.
- పాడి పశువులకు ప్రతీ రోజు వ్యాయామం చేయించాలి.
- ఈనిన తరువాత, పాల దిగుబడి పెరుగుతున్న సమయంలో దాణా పరిమాణం పెంచాలి.
- పశువుల మందలో మెటబాలిక్ ప్రొఫైల్ టెస్ట్లు నిర్వహించాలి.
- ఈనిన ఆరు వారాల వరకు సోడియం ప్రాపయనేట్ 100 గ్రా. రోజుకు అందివ్వాలి.
- మొక్కజొన్నలను తినే దాణాలలో భాగంగా ఇవ్వాలి.
- దాణాలో సరైన పాళ్ళలో కోబాలు, అయోడిన్ ఉండాలి.
- సైలేజి ఎక్కువగా ఇవ్వకూడదు.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.