অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పాలజ్వరం (మిల్క్ ఫీవర్) పాక్షిక లేదా అసంపూర్ణ ప్రసవ పక్షవాతం

cow.jpg

పాల జ్వరం అనగా పాల వల్ల వచ్చే జ్వరం కాదు, అంతకన్నా ఇది వ్యాధిగా కూడా పరిగణించరు. ఎందుకంటే ఎక్కువగా పాలిచ్చే ఆరోగ్యవంతంగా పాడి పశువుల్లో రక్తంలోని కాల్సియం పరిమాణం అకస్మాత్తుగా తగ్గిపోవడం, తద్వారా రక్తప్రసారంలో అంతరాయం, కండరాల బలహీనత, వెనుకకాళ్ళు పడిపోవడం, అపస్మారక స్థితికిలోనై మరణించడం జరుగుతుంది. సకాలంలో చికిత్స అందితే పశువులు బతికి బయటపడే అవకాశాలున్న ఈ పోషక లోపం కల వ్యాధిని "పాల జ్వరం' అని వ్యవహరిస్తారు.

పాల జ్వరం ఎటువంటి పశువుల్లో వస్తుంది ?

ఇది ఈనే పాడి పశువులు ఈనిని మొదటివారంలో, ముఖ్యంగా 2-3 రోజుల్లో సంభవిస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా 5-10 సంవత్సరాల వయస్సున్న పాడిపశువుల్లో 3–7 ఈతల మధ్యకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. ముఖ్యంగా జఫార్బాడి, జెర్సీ ఆవులలో ఇంకా ఎక్కువగా ఉంటుంది.

పాలజ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి ?

వ్యాధి లక్షణాలు మూడు దశలలో ఉంటాయి. మొదటి దశలో పాలజ్వరంతో బాధపడే పాడిపశువులు ప్రారంభదశలో మేత సరిగ్గా మేయకపోవడం, నెమరు వేయకపోవడం, పళ్ళు కొరుకుతూ బెదురుచూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేకుండా ఉంటాయి. పాలజ్వరం వ్యాధిలో పశువు జ్వరం కలిగి ఉండకుండా, వ్యాధి ప్రారంభంలో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉండి, ఆ తర్వాత సాధారణ స్థాయి కంటే తగ్గి ఒళ్లంతా చల్లబడుతుంది.

తర్వాత దశలో వశువులు నరిగా నిలబడలేకపోతాయి. శ్వాస, నాడి తగ్గి పశువులు కదలకుండా ఉంటాయి. ఈ స్థితిలో పాడి పశువులు తలను పొట్టపై డొక్కలో అనించి "ఎస్" ఆకారంలో ఉండి మగతగా పడుకుని ఉంటాయి. ఇది పాలజ్వరం కేసుల్లో సాధారణంగా కనబడే ప్రత్యేక లక్షణం.

వ్యాధి చివరిదశలో శ్వాస, నాడి వేగం పడిపోతుంది. పశువు ఒక వైపు పడిపోవడం, తద్వారా కడుపు ఉబ్బరం మొదలగు లక్షణాలు కనబడతాయి. కండరాల వణుకుతో చలనం లేకుండా, అపస్మారక స్థితిలోకి వెళతాయి. వైద్య సదుపాయం సత్వరమే అందకపోతే పశువులు మరణిసాయి.

పాల జ్వరం ఎందుకు వస్తుంది ?

పశువుల వంద మి.లీ. రక్తంలో కాలియం పరిమాణం 8-10 మి.గ్రా. ఉంటుంది. పాడిపశువులు, చూడి పశువులు, చూడి, అధిక పాల ఉత్పత్తి వల్ల కలిగే ఒత్తిడిలకు, శ్రమకు లోనైనప్పుడు కాలియం 6-8 మి.గ్రా.లకు కూడా పడిపోయి పాలజ్వరం ప్రమాదం ఏర్పడుతుంది. పశువు గర్భంతో ఉన్నప్పడు ఇచ్చే ఆహారంలో కాలియం తక్కువగా ఉండడం, ఎక్కువగా వట్టి గడ్డి పెట్టడం, గర్భస్త పశువులో అజీర్తి సమస్య ఉన్నప్పుడు.

పారాథైరాయిడ్ గ్రంథి పనిలోపం వల్ల ఎముకల్లో నిలువ ఉన్న కాలియం రక్తంలోనికి త్వరగా అందకపోవడం, తద్వారా రక్తంలో కాలియం పరిమాణం తగ్గడం సంభవిస్తుంది.

ఈనిన తర్వాత జన్నుపాల ద్వారా, మామూలు పాల ద్వారా కాలియం ఎక్కువగా పోతుంది.

ఆ సమయంలో ప్రేవులనుండి కాలియం తగినంతగా పీల్చుకోలేనప్పుడు, ఎముకలనుండి తగినంతగా కాలియం భర్తీ కానందువల్ల, కాలియం శాతం సాధారణ స్థాయికంటే తగ్గుతుంది.

విటమిన్ డి లోపం, కాలియం, ఫాస్పరస్ నిష్పత్తిలో లేదా మొదలగు కారణాలవల్ల కూడా శరీరంలో కాల్వియం వినియోగం కుంటుపడుతుంది.

అంతేగాక చల్లని వాతావరణం, ఎక్కువ దూరం పశువులను రవాణా చేయడం, అక్సలేట్లు కలిగిన గడ్డిని ఎక్కువగా పెట్టడం వలన శరీరంలో కాలియం శాతం తగ్గుతుంది.

చికిత్స ఎలా చేయాలి ?

పాలజ్వరం ఆలస్యం చేస్తే పశువు చనిపోవడం గానీ, పడకజబ్బు (డౌనర్ కౌ సిండ్రోం)కు దారితీస్తుంది. పాలజ్వరం కేసులో రోగనిర్ధారణ కాగానే కాలియం బోరు గూకోనేటు 25 శాతం ఇంజెక్షనును వెంటనే 400-800 మి.లీ. రక్తనాళాల్లోకి ఇప్పించడం ద్వారా 75 నుండి 85 పాడిపశువుల్ని రక్షించుకోవచ్చు. అవసరమైతే 12 గంటల వ్యవధిలో మూడుసార్లు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.

పాల జ్వరం నివారణ ఎలా ?

పాలజ్వరం వ్యాధి నివారణలో భాగంగా పాలిచ్చే పశువులు చూడిగా ఉన్నప్పుడు దాణాలో సరిపోను పాళ్లలో కాలియం ఉండేలా జాగ్రత్త లెగ్యూం పశుగ్రాసాలు, పచ్చిమేత, ఎముకలపొడి, ఎండు చేపల్లో కాలియం అధికంగా లభ్యమవుతుంది. అలాగని అవసరానికి మించి కాల్వియం చూడిగా ఉన్నప్పుడు ఇవ్వడం వల్ల కూడా ఈనిన తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అధిక శాతం ఫాస్ఫరస్, తక్కువ శాతం కాలియం (1:3 నిష్పత్తి)తో కూడిన దాణా పశువులు చూడిగా ఉన్న చివరి నెలలో ఇవ్వడం ద్వారా పారాథైరాయిడ్ గ్రంధి చురుకుగా పనిచేసి ఈనిన తర్వాత 'పాలజ్వరం' నివారించబడుతుంది.

పశువులు ఈనే 24 గంటల ముందు, ఈనిన 10 నుండి 14 గంటల తర్వాత రోజుకు మూడుసార్లు 150 గ్రా, కాలియం తాగించడం ద్వారా పాలజ్వరం రాకుండా జగ్రత్తపడవచ్చు.

చూడి, పాడి పశువులు అనవసరపు ఉద్రేకతలకు గురికాకుండా చూడాలి. దాణాలో జొన్నలు పెట్టడం మేలు.

పశువులు ఈనిన వెంటనే కాల్వియంతో కూడిన ఇంజెక్షన్లు, ఈనే 5 రోజుల ముందు నుండి విటమిన్ డి ఇంజక్షన్లు ఇప్పించడం శ్రేయస్కరం.

అధిక పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత ప్రారంభంలో, పాలు పూర్తిగా పితకకూడదు. పశువులకు తగిన వ్యాయామం కల్పించాలి. పశువులను చలినుండి సంరక్షించాలి.

వ్యాధి నివారణకై అమ్మోనియం క్లోరైడ్ 25 గ్రా, చొప్పున చూలి చివరి వారాల్లో అందిస్తూ, ఈనే సమయం చేరేటప్పటికి 100 గ్రా. ప్రతిరోజు అందివ్వాలి.

మాక్స్ కాల్ జెల్ (నియోస్పార్క్ కంపెనీ) ట్యూబు, పశువు ఈనే ముందు ఒకటి, ఈనిన 6-12 గంటల తర్వాత మరొక ట్యూబులోని మందును నోటి ద్వారా తినిపించాలి. అవసరాన్ని బట్టి ప్రతి 12 గంటలకు ఈ ట్యూబుల్లోని మందు తినిపించడం ద్వారా పాలజ్వరం నివారించబడుతుంది.

మెటబొలైట్ (విర్బాక్ కం) పౌడర్ను చూడి పశువులకు చూడి చివరి 20 రోజులు రోజుకు 100 గ్రా, చొప్పున తినిపిస్తే, కాలియం, భాస్వరం పశువులకంది, ఈనిన తర్వాత పాలజ్వరం సమస్య రాకుండా ఉంటుంది.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate