హోమ్ / వ్యవసాయం / పశు సంపద / మేకల్లో వచ్చే మశూచి వ్యాధి / ఫాక్స్ / బొబ్బరోగం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మేకల్లో వచ్చే మశూచి వ్యాధి / ఫాక్స్ / బొబ్బరోగం

మేకలలో బొబ్బరోగం వ్యాప్తి,చికిత్స,నివారణ

వేసవిలో జీవాలకు గ్రాసం కొరకు కాకుండా కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటిలో మశూచి లేదా ఫాక్స్ లేదా బొబ్బరోగం అతి ముఖ్యమైనది, గొర్రెలకు, మేకలకు ఏప్రిల్ నెల నుండి ఆగష్ట్ వరకు మేకలకు మశూచి వ్యాధి (ఫాక్స్, వైరస్) ముప్పు పది ఉంటుంది. కావున మేకల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండి ముందస్తుగా టీకాలు వేయించడం మంచిది. గాలి ద్వారా వచ్చే ఈ వైరస్ వ్యాపించిన మేకల ఆహారం తీసుకోక, శ్వాస ఆడక ప్రాణాలు విడుస్తాయి. ముఖ్యంగా మేకలు పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.

మశూచి వ్యాధి లక్షణాలు

వ్యాధి సోకిన మేకలలో వారం రోజూల్లో దాని లక్షణాలు బయటపడతాయి. వ్యాది సోకిన మేకలకు జ్వరం తీవ్రంగా ఉంటుంది. చర్మంపై వెంట్రుకలు లేని భాగం, తోక కింద, పెదవులు, ముక్కు రంధ్రాలు, జనసేంద్రీయాలు, పాలపొదుగు పై ఎర్రని దద్దులు, పొక్కులు ఏర్పడతాయి. కళ్ళ నుంచి నీరు, నోటి నుండి పొంగ, ముక్కు నుంచి చీమును కారుతుంది. శ్వాసకోశ వ్యవస్థను వ్యాధి ఆశిస్తే, గొర్రెలు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. జీర్ణకోశ వ్సవస్థను ఆశిస్తే రక్తపు విరేచనాలు వుతాయి. చూడి మేకలకు వ్యాధి ప్రబలిలితే ఈనుకుని పోతాయి.

వ్యాధి వ్యాప్తి చెందే విధానం

 • గాలి ద్వారా మశూచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన మేకల నుంచి మరొక దానికి వ్యాపిస్తుంగి. దాణా తొట్టెలు, నీటి తొట్టెలు, ఇతర తాకే వస్తువుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా వైరస్ ఉపిరి తిత్తుల్లో చేరి ఇతర గొర్రెలకు వ్యాపిస్తుంది.
 • చర్మంలో ఎక్కడైనా పుండు గానీ, తెగిన గాయం గానీ ఉంటే సునాయసంగా అక్కడి నుండి జీవాల శరీరంలోకి ప్రవేశిస్తుంది. మోకాళ్ళు, మోచేతుల వద్ద ఉండే పుండ్లు, పక్కులు గట్టడం ద్వారా సంక్రమించే అంటువ్యాధి.
 • ప్రధానంగా జీవాల పెదవులు, ముక్కు, పొదగు చనుమొనలు, డెక్కల వద్ద పొక్కులు లేదా దద్దుర్ల వలె ఉంటే ఈ వ్యాధి సోకినట్లు గుర్తించాలి. దీని బారిన పడిన జీవాలు ఆరోగ్యంగా ఉండవు. త్వరగా ఇతర వ్యాధుల బారిన పడుతున్నాయి. తిండి తక్కువ తినడం అనారోగ్యంతో మృతి చెందే అవకాశం ఉంటుంది.
 • ముఖ్యంగా పాలిచ్చే ఆడమేకల చనుమొనలలో పొక్కులు ఏర్పడి వాటి పిల్లలు పాలు తాగే సమయంలో చాలా నొప్పి కలుగజేస్తాయి. అందుకే పిల్లలను పాలు తాగడానికి తల్లి మేకలు అనుమతిమచవు. కొన్నిసార్లు జీవాలు పొదుగువాపు బారిన పడే ప్రమాదం ఉంటుంది. దీనికోసం టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ వ్యాధి ఒకటి నుంచి నాలుగు వారాలలో తగ్గుతుంది. కాని జీవాల రోగ నిరోదక శక్తిపై ఇది ఆధారపడి ఉంటుంది.

వ్యాధి సోకిన తర్వాత పాటించాల్సిన చర్యలు

 • వ్యాధి సోకిన మేకలను వెంటనే మంద నుండి వేరు చేయాలి. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి గనుక మందులు పనిచేయవు. దీని వలన వ్యాధి నిరోదక శక్తి తగ్గుతుంది.
 • కావున ఇతర వ్యాధులు రాకుండా యాంటీబయోటిక్స్ వాడాలి. ఉపశమనం కోసం మెలోనెక్ష్ మందులు వాడాలి.
 • తేలికగా జీర్ణమయ్యే ఆహారం, గంజి గానీ, బెల్లం పానకం గానీ వ్వాలి. లేదంటే బయట మార్కెట్ లో దొరికే గ్లూకామాస్ట్ వంటి తాపే మందులను వినియోగించాలి.
 • ఇది, సోకిన మేకలు, గొర్రులతో ఇతర జీవాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పొక్కుల వద్ద అయోడిన్ పూయడం మంచిది. పురుగులు, ఈగలు, కీటకాల బెరడ ఉంటే వాటి నివారణకు పుండు కట్టిన చోట పశువైద్యుల సూచనలతో బోరిక్, గ్లిసరీస్ పేస్ట్ లాంటి మందులు చల్లాలి లేదా టాపిక్యుర్ లాంటి స్ప్రేలను వాడాలి.

నివారణ చర్యలు

 • వ్యాధి ఉన్న జీవాన్ని కుట్టిన కీటకాలు ఇతర జీవాలకు వ్యాధి వ్యాప్తి చేస్తాయి. ఈ వైరస్ మానవులకు కూడా సంక్రమించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. గొర్రెలు, మేకల మంద ఉన్నవాళ్ళు ఈ వ్యాధి నివారణ జాగ్రత్తలు తీసుకోవాలి.
 • చేతులకు గ్లౌస్ వేసుకొని మందులు వేయాలి. ఒక వేశ ఈ వ్యాధి మనుషులకు పోకితే దీన్ని ఓర్స్ అంటారు. ది చేతులు లేదా వేళ్ళ దగ్గర చర్మంపై అంటుపుండ్లను కలుగజోస్తుంది. వీటిలో చాలా నొప్పి ఉంటుంది.
 • జీవాలలో వ్యాధి నివారణకు స్థానిక పశువుల వైద్యులను సంప్రదించి టీకాలు వేయించాలి. లేదా వారి అనుమతితో చీకాలు వేయాలి. జీవాలలోని వెంట్రుకలు లేని ప్రాంతం, తోక కింద కానీ, చెవి లోపల (వెంట్రుకలు లేని భాగం) టీకా వేయాలి.
 • గొర్రెలు, మేకల మంద న్న రైతులు జాగ్రత్త పడకుంటే ఇది మళ్ళీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. ఈ అంటువ్యాధి సోకకుండా జాగ్రత్తిలు తీసుకోవడమే ఉత్తమం.
 • ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నేకలకు మశూచి వ్యాధి నివారణ టీకాలు వేయించాలి.
 • కొత్త జీవాలను మందలో చేర్చే నుందు వాటిని కొద్ది రోజుల ముందుకు దూరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యాన్ని పరీక్షించాలి. అవి ఆరోగ్యంగా ఉంటేనే మందలో కలపాలి.
 • వ్యాధి సోకిన మేకలు వద్దకు వ్యాధి సోకని వాటిని వెళ్ళనీయకూడదు.
 • వ్యాధి వల్ల చనిపోయిన మేకలను లోతుగా గొయ్యి తీసి ఖననం చేయాలి.
 • వ్యాధితో జీవాలు చనిపోయిన ప్రదేశం, అవి తాగిన నీటి తొట్లు, తిన్న దాణా తొట్లను క్రిమి సంహారక ద్రావణంలో శుభ్రపరచాలి.
 • వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే స్థానిక పశువైద్యాధికారలను సంప్రదించాలి.

పై విధంగా జీవాల కాపలదారులు సూచనలను పాటించినట్లయితే జీవాలను కోల్పోకుండా వారు ఆర్థిక౦గ అభివృద్ధి చెందగలరు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.98701298701
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు