హోమ్ / వ్యవసాయం / పశు సంపద / సాంద్ర పద్ధతిలో మేకల పెంపకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సాంద్ర పద్ధతిలో మేకల పెంపకం

సాంద్ర పద్ధతిలో మేకల పోషణ వివరాలు

మన దేశంలో వేల సంవత్సరాల నుండి గొర్రెల, మేకల పెంపకం ఒక కులవృత్తిగా కొనసాగుతోంది. కొన్ని లక్షల రైతు కుటుంబాలు గొర్రెలు /మేకల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా చేపట్టి జీవిస్తున్నాయి. అధిక శాతం రైతులు సాంప్రదాయ పద్ధతిలోనే జీవాల్ని పెంచుతూ ఆశించిన లాభాలను గడించలేక పోతున్నారు. అంతేకాక తగ్గిపోతున్న పచ్చిక బీళ్ళు, వ్యవసాయ కమతాల విస్తీర్ణం, పెరుగుతున్న నగరీకరణ, వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల సాంప్రదాయ / విస్తృత పద్ధతిలో గొర్రెల/మేకలను పూర్తి కాలం బయట మేపడానికి ఆటంకం ఏర్పడుతోంది. అందుకే మేలుజాతి గొర్రెలు / మేకలు ఎంచుకొని సాంద్ర పద్ధతిలో పోషణ చేపట్టడం వల్ల తక్కువ శ్రమతో, సులభమైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక లాభాలు పొందవచ్చు.

సాంద్ర పద్ధతి అంటే ఏంటి?

mponeజీవాలను బయట మేపకుండా, పాకలలో పూర్తి సమయం ఉంచి, వాటికి సమతుల్య పోషకాహారం, శుభ్రమైన నీరు సమకూరుస్తూ శాస్త్రీయ పద్ధతిలో పెంచడాన్ని సాంద్ర పద్ధతిలో గొర్రెలు/మేకల పెంపకం అంటారు. ప్రస్తుత మేత పద్ధతిలో సహజ మేతల వద్దకు జీవాలు వెళుతుండగా, ఈ పద్ధతిలో జీవాల వద్దకే సాగుచేయబడి, ముక్కలు చేయబడిన మేలురకం పశుగ్రాసం, సమీకృత దాణా చేరుతుంది. దీనినే 'జీరో గ్రేజింగ్' అని కూడా అంటారు.

సాంద్ర పద్దతిలో జీవాలను పెంచడం వలన లాభాలు

  • మేకలను పచ్చిక బైళ్ళల్లో లేదా అడవిలో తిప్పి మేపుతూ పెంచినట్లయితే ఒక సంవత్సరానికి కేవలం రెండు మేకలకు గాను ఒక హెక్టారు భూమి అవసరం అవుతుంది. అదే సాంద్ర వద్దతిలో, ఒక షెడు లో ఉంచి  పోషించినట్లయితే 40 నుండి 50 మేకలకు సరిపోయేటంత పశుగ్రాసాన్ని ఒక హెక్టారులో సాగు చేయవచ్చు.
  • మేకలను పూర్తి సమయం పెడులో ఉంచి మేపడం వలన ప్రతికూల వాతావరణ పరిస్థితులు అనగా  వర్షం, చలి, ఎండా, దుమ్ము, ధూళి లాంటి వాటి నుండి కాపాడబడుతాయి. తద్వారా వాటిలో ఉత్పాదక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా సాంద్ర పద్ధతిలో మేత, నీరు, దాణా దుబారాను అరికట్టవచ్చు.
  • మేకలను బయట తిప్పి మేపడం వలన రోజుకు 3-4 కి.మీ. దూరం నడిచి, శక్తి కోల్పోతాయి. అదే పెడులో పెంచినట్లయితే ఇలా శక్తి వృథా అవదు.
  • ఈ వద్దతిలో బహువారిక పశుగ్రాసాలను పెంచుకొని, ఏ రోజు మేత ఆరోజే ఛాప్ కట్టర్ సాయంతో కోసి, శరీర బరువుకు తగినట్లుగా, మేకలకు ఇస్తారు. కాబట్టి జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అపరిశుభ్రమైన నీరు / మేత ద్వారా వచ్చే వ్యాధులు నివారించబడతాయి. అంతర్ పరాన్నజీవుల బెడద ఉండదు.
  • మేకలను షెడ్లలో పెంచడం వలన వ్యాధి సోకిన వాటిని త్వరగా గుర్తించి, మంద నుండి వేరుచేసి చికిత్స అందించవచ్చు. ఎదలో ఉన్న వాటిని గుర్తించి సకాలంలో పోతులతో దాటించి, ప్రతి 7-8 నెలలకొకసారి పిల్లలు పుట్టేటట్లు చేయవచ్చు. అంతే కాకుండా సన్నగా, బక్కగా ఉన్న జీవాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపించవచ్చు.
  • సాంద్ర పద్ధతిలో జీవాలను పెంచినట్లయితే వాటిని అడవి జంతువులు, కుక్కల బారి నుండి కాపాడుకోవచ్చు.

సాంద్ర పద్ధతిలో మేకల పోషణకు కావాల్సిన వసతులు

గృహ వసతి (పాక)

ఒక్కొక్క మేకకు పెడులో 1.5 చ.మీ. స్థలం ఉండేలా చూడాలి. షెడు చుట్టూ రెండింతల స్థలం ఖాళీగా ఉంచాలి. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పాక నిర్మాణం చేయాలి. పాకలోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా, వర్షం నీరు రాకుండా ఉండే విధంగా, తూర్పు పడమర దిశగా పాకలను నిర్మించాలి.

జీవాల ఎంపిక

సాంద్ర పద్ధతితో జీవాల ఎంపిక అత్యంత ముఖ్యమైనది. త్వరగా ఎదిగే సామర్థ్యం కలిగిన సిరోహి సోజత్, జమునాపారి, తోతాపారి, ఉస్మానాబాది లాంటి మేక జాతులను ఎంపిక చేసుకోవాలి. మేకలకు పౌష్టిక విలువలు కలిగిన సమతుల్య పశుగ్రాసాన్ని శరీర బరువుకు తగినట్లుగా అందించడంతో పాటు విటమిన్లు, లవణ, దాణా మిశ్రమాన్ని ప్రతిరోజు ఇవ్వాలి. అప్పుడే నిర్దిష్ట ప్రమాణాల్లో పునరుత్పత్తి, పెరుగుదల ఉంటుంది.

ఆరోగ్య పరిరక్షణ

mptwoగొర్రెలతో పోలిస్తే మేకలు తక్కువగా వ్యాధుల బారిన పడతాయి. పుట్టిన 10వ రోజు అంతర పరాన్నజీవుల నివారణకు మొదటి సారి నట్టల మందును తాగించాలి. తర్వాత 8 నెలల వయస్సులో రెండవ సారి, ఆ తర్వాత ప్రతిమూడు నెలలకొకసారి తాగించాలి. ప్రతి సంవత్సరం పెద్ద రోగం, గాలి కుంటు వ్యాధి, చిటుకు వ్యాధి, ఉదరకోశ వ్యాధి, పారుడు రోగాల నివారణకు టీకా మందులను పశువైద్యుని సలహా మేరకు మందలోని అన్ని మేకలకు వేయించాలి. సాంద్ర పద్ధతిలో జీవాలను పోషిస్తున్నట్లయితే యజమాని కానీ, వారి కుంటుంబ సభ్యులు కానీ, రోజువారీ పనులను స్వయంగా పర్యవేక్షించడం మంచిది.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.97435897436
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు