অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పందుల పెంపకం

పందుల పెంపకం

 1. పందుల పెంపకం
  1. వాణిజ్య సరళిలో పందుల పెంపకం
  2. పంది జాతులు:
  3. పందుల పెంపకంతో ప్రయోజనాలు
  4. పందుల పెంపకం ఎవరికి పనికొస్తుంది?
  5. జాతులు
   1. పెద్ద తెల్ల యార్కషైర్ రకం
   2. ల్యాండ్ రేస్
   3. మిడిల్ వైట్ యార్క్ షైర్
   4. ఘుంగ్రూ పంది: గ్రామీణ రైతులకు పనికివచ్చే దేశవాళీ పంది జాతి
  6. సంతానోత్పత్తికోసం మంచి జాతిని ఎంపికచేసుకోవడం
   1. ఆడపందుల ఎంపిక
   2. మగపందుల ఎంపిక
   3. సంతానోత్పత్తి చేసే మగపందులను, ఆడపందులను మార్చేటపుడు చూడాల్సిన అంశాలు
  7. మేత వ్యవహారం
  8. నివాసము
   1. పందుల దొడ్డి
   2. పందులు ఈనడానికి దొడ్డి-నమూనా
   3. నీటికయ్యలు
  9. ఈనడానికి ఏర్పాట్లు
   1. ఈనడానికి తగిన వయస్సు
   2. వేడి గుర్తింపు
   3. సూడిపందులను మేపుట
   4. సూడిపందులపై తీసుకోవాల్సిన శ్రద్ధ, జాగ్రత్తలు
   5. ఈనేసమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
   6. ఈనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
   7. సూదిదంతాల తొలగింపు
  10. పందిపిల్లల్లో రక్తహీనత
  11. అనాధ పందిపిల్లలను పెంచడం
  12. పునరుత్పాదకసామర్ధ్యం తొలగింపు
  13. ఎక్కువ పాలివ్వడానికి తీసుకోవాల్సిన చర్యలు
  14. తల్లిపందినుంచి పిల్లలను వేరుచేయడం
  15. పందులకు వచ్చే వ్యాధుల నివారణ, నియంత్రణ

పందుల పెంపకం

వాణిజ్య సరళిలో పందుల పెంపకం

లాభాలు :

 • ఇతర వ్యాపారాలన్నింటి కంటే తక్కువ పెట్టుబడి తో శీఘ్రంగా ద్రవ్యఫలితాన్నిచ్చేది పందుల పెంపకం.
 • కోళ్ళ పెంపకంమూ, పాడి పరిశ్రమ కంటే కూలి ఖర్చు తక్కువ.
 • అన్ని రకాల క్షేత్రాలకు అనుకూలం.
 • దాణా మార్పిడి నిష్పత్తి ఎక్కువ. అంటే మూడు
 • మూడున్నర దాణాకు ఒక కిలో పోర్కు మాంసం లభిస్తుంది.

పంది జాతులు:

 • పెద్ద యార్క్‌షైర్‌ జాతి 350
 • 400 కి. గ్రా. బరువు
 • బెర్షైర్‌ సగటున 275 కి. గ్రా.
 • లాండ్రాస్‌
 • తామ్‌వర్త్‌
 • చెస్టర్‌ వైట్‌
 • హాంప్‌షైర్‌ (నలుపు)
 • పోలాండ్‌ చీనా
 • స్పాటెడ్‌ పోలాండ్‌ చీనా
 • గృహ వసతి
 • మేత
 • వాణిజ్య సరళి
 • పందుల పెంపకం
 • అమ్మకం

ఈ వివరాలకు వ్యవసాయ శాఖ కార్యాలయం గానీ, పశువుల ఆసుపత్రి గానీ సంప్రదించవచ్చు.

పందుల పెంపకంతో ప్రయోజనాలు

 • పందులు తినడానికి వీలులేని పదార్ధాలు, వదిలేసిన ఆహారపదార్ధాలు, మిల్లుల్లో లభించే కొన్ని ఆహారధాన్యాల అనుబంధ ఉత్పత్తులు, మాంసం అనుబంధ ఉత్పత్తులు, చెడిపోయిన మేత, పారేసిన పదార్ధాలను తిని విలువైన, పోషకవిలువలతో కూడిన మాంసంగా మారుస్తాయి. పై పదార్ధాలన్నీ మనుషులు తిననివి, తినడానికి వీలులేనివి.
 • పందులు త్వరగా పెరుగుతాయి. మంచి పంది ఒక్కఈతలో పది నుంచి పన్నెండు పిల్లలను ఈనుతుంది. మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అది సంవత్సరానికి రెండుసార్లు ఈనగలదు.
 • పంది కళేబరంనుంచి లభించే మాంసం, గొర్రెలు, కోళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బతికున్నప్పటి బరువులో 60-80శాతం మాంసం లభిస్తుంది.
 • భవనం, పరికరాలు, సరైన మేత అందించడం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారాను వాటిపై పెట్టే కొద్ది పెట్టుబడులద్వారా, రైతు తక్కువ సమయంలో తక్కువ మరియు కూలీలను వెచ్చించడంతో.... ఈ వృత్తిలో మంచి లాభాలను గడించవచ్చు.
 • పందిపెంట భూసారాన్ని పెంచడానికి చక్కటి ఎరువుగా పనికొస్తుంది.

పందుల పెంపకం ఎవరికి పనికొస్తుంది?

 • చిన్న మరియు భూమిలేని పేదలు
 • వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న విద్యావంతులైన యువతకు అదనపు ఆదాయంగా ఉంటుంది.
 • నిరక్షరాస్య యువత
 • వ్యవసాయ కూలీ మహిళలు

జాతులు

పందుల ఉత్పత్తికి ఎంతో కాలంగా దేశవాళీ పందులనే వాడుతున్నారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు పందుల ఉత్పత్తికి మెరుగైన జాతులను వాడుతున్నారు.

భారతదేశంలో ఇప్పుడు పెంచే విదేశీ పంది జాతుల వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్ద తెల్ల యార్కషైర్ రకం

 • భారతదేశంలో ఎక్కువగా పెంచుతున్న విదేశీ పంది జాతి
 • శరీర రంగు తెల్లగా ఉంటుంది...అక్కడక్కడా నల్లరంగు మచ్చలు ఉంటాయి.
 • చెవులు నిక్కబొడుచుకుని ఉంటాయి...ముట్టె మధ్యస్థమైన పొడుగు ఉంటుంది...ముఖం పళ్ళెంలాగా ఉంటుంది.
 • సంకర ఉత్పత్తి జరపడానికి పనికొచ్చే అద్భుతమైన జాతి
 • ఎక్కువ పిల్లలు పెట్టే జాతి
 • పెరిగిన మగపంది 300-400 కిలోల బరువు తూగుతుంది
 • పెరిగిన ఆడపంది 230-320కిలోల బరువు తూగుతుంది
ల్యాండ్ రేస్

నల్లటి మచ్చతో తెల్లటి రంగులో ఉంటుంది

 • పొడుగైన శరీరం, వాలిపోయిన పెద్ద చెవులు మరియు పొడుగైన ముట్టె
 • అధిక సంతానాన్ని ఉత్పత్తి చేసే జాతి మరియు మేతను వినియోగించడంలో సమర్ధవంతమైనది
 • కళేబరం నాణ్యత యార్క్ షైర్ తో సమానంగా ఉంటుంది
 • సంకర ఉత్పత్తి జరపడానికి పనికొచ్చే శ్రేష్ఠమైన జాతి
 • బాగా పెరిగిన మగపంది 270-360 కిలోల బరువు తూగుతుంది
 • బాగా పెరిగిన ఆడపంది 200-320 కిలోల బరువు తూగుతుంది
మిడిల్ వైట్ యార్క్ షైర్

 • భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వాడతారు
 • త్వరగా పెరుగుతుంది, మాంసం కూడా ఎక్కువ శాతం ఇస్తుంది
 • లార్జ్ వైట్ యార్క్ షైర్ జాతి స్థాయిలో సంతానోత్పత్తి జరపలేదు
 • మగవి 250-340కిలోలు తూగుతాయి
 • ఆడవి 180-270కిలోలు తూగుతాయి
ఘుంగ్రూ పంది: గ్రామీణ రైతులకు పనికివచ్చే దేశవాళీ పంది జాతి

ఘుంగ్రూ అన్న దేశవాళీ పంది జాతి మొట్టమొదట ఉత్తర బెంగాల్ ప్రాంతంలో కనుగొనబడింది. ఇది పిల్లలను బాగా పెట్టడం వలన, తక్కువ ఖర్చుతో పెంచదగినది కావడం వలన ఇది స్థానికంగా బాగా ఆదరణ పొందింది. వ్యవసాయ ఉపఉత్పత్తులను, వంటింటి వ్యర్ధాలను వినియోగించుకుని ఈ జాతి పంది మంచి నాణ్యమైన పంది మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పందులు ఈతకు 6-12 పరకూ పిల్లలను పెడతాయి. ఒక్కో పంది పిల్ల పుట్టగానే షుమారు ఒక కిలో బరువుండి వీనింగ్ (తల్లి పాలు మాని ఆహారం స్వీకరించడం) సమయానికి 7 నుండి 10 కేజీల బరువుంటాయి. ఆడ, మగ పందులు రెండూ మచ్చిక చేసుకోవడానికి వీలుగా సాధు స్వభావం కలిగి ఉంటాయి. ఈ పందుల పెంపకం చేపట్టే ప్రదేశాలలో వీటిని `స్కావెంజర్ పద్ధతి"లో, అంటే ఈ పందులను వదిలిపెట్టేస్తే వాటికవే ఏదో ఒక ఆహారాన్ని వెతుక్కుని తినే పద్ధతిలో, పెరగనిస్తారు. దీనివలన వర్షాధార వ్యవసాయంలో ఇవి కొంత చేతికి అందివస్తాయి.

జాతీయ పందుల పరిశోధనా కేంద్రం, రానీ, గౌహతిలో ఘుంగ్రూ పందులు ప్రామాణికమైన బ్రీడింగ్ (సంతానాన్ని వృద్ధి చెయ్యడం), ఫీడింగ్ (ఆహారాన్నివ్వడం) మరియు నిర్వహణ పద్ధతులతో ఇంటేన్సివ్ గా పెంచడం జరుగుతోంది. బ్రీడింగ్ కార్యక్రమాలలో ఈ జాతి పందులు జన్యు పరంగా ఎంతవరకూ పనికివస్తాయన్న నిర్ధారణ ఇంకా జరుగుతోంది. కాగా ఉత్పత్తిలోనూ, ప్రత్యుత్పత్తిలోనూ ఈ దేశవాళీ పంది జాతి మంచి ఫలితాలను కనబరుస్తోంది. ఈ సంస్థ ఫారంలో ఉన్న ఇతర దేశవాళీ పంది జాతులతో పోలిస్తే ఈ ఘుంగ్రూ జాతిలోని కొన్ని ఎంపిక చేసిన పందులు తడవకు 17 పంది పిల్లలను పెడ్తున్నాయి.

ఆధారము: http://www.icar.org.in/en/node/2766

సంతానోత్పత్తికోసం మంచి జాతిని ఎంపికచేసుకోవడం

సంతానోత్పత్తికోసం మంచి ఆడపందులను తయారుచేసుకోడానికి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి

 • ఒక ఈతలో పెట్టే పిల్లల సంఖ్య
 • పుట్టిన పిల్లల బలం మరియ శక్తి
 • పాలిచ్చే సామర్ధ్యం
 • స్వభావం

ఒక ప్రత్యేకమైన జాతిని ఎంపిక చేసుకోవడంకంటే కూడా పరిగణించాల్సిన ముఖ్యమైన అంశాలేమిటంటే...ఎంత మాంసం వస్తుంది, ఎంత సామర్ధ్యం ఉంది, ఎన్ని పిల్లలను పెట్టగలదు, మందలోని మిగిలినవాటికంటే ఏ విధంగా మెరుగ్గా ఉంది...వంటి విషయాలు. మందను తయారు చేసుకునే ప్రతి రైతు కూడా కొనుగోలు చేసు కునే ముందు వాటిని వ్యాధులు లేని విశ్వసనీయమైన మందనుంచి ఎంపికచేసుకోవాలి మరియు వాటి గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం సేకరించాలి. మందను తయారుచేసుకున్న తర్వాత సామర్ధ్యం, రకాలను బట్టి సంతానోత్పత్తి జరపడానికి ఆడపందులను, మగపందులను ఎంపికచేసుకోవాలి.

ఆడపందుల ఎంపిక

యార్క్ షైర్ ఆడపంది
 • సంతానోత్పత్తికి తొలిచూలు ఆడపందుల ఎంపికను మార్కెట్ బరువును బట్టి...అంటే సుమారు 90కిలోల బరువు తూగేపందిని తీసుకోవాలి.
 • ఎక్కువసార్లు క్రమంగా ఈనిన, పెద్ద ఆడపందు లో ఎక్కువ పీల్లులను పెట్టిన సంతతి నుండి తీసుకోవాలి
 • ఎంపిక చేసుకున్న ఆడపందులు...తక్కువసమయంలో మార్కెట్ చేరినవి, మార్కెట్ కు కావాల్సిన రకానివి అయి ఉండాలి
 • రోజువారి బరువు పెరుగుదలలో, మేతవినియోగ సామర్ధ్యంలో...ఎంపిక చేసుకున్న ఆడపందుల తోడబుట్టినవాటి పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
మగపందుల ఎంపిక

యార్క్ షైర్ మగపంది

 • మగపంది ఎంపిక చాలా కీలకమైన అంశం... ముఖ్యంగా చిన్న మందలు నడిపేవారికి.
 • మగపందిని కొనేముందు అమ్మకందారువద్ద దానిగురించి తగిన సమాచారం ఉందోలేదో తెలుసుకోవాలి
 • ఎంపిక చేసుకునే మగపంది తల్లి వరసగా ఎన్నోసార్లు ఈని, ఎక్కువ సంఖ్యలో పిల్లలను పెట్టినదై ఉండాలి
 • 5-6 నెలల్లోనే 90కిలోల బరువుకు చేరిన మగపంది మంచి రకానిదై ఉంటుంది...కాళ్ళు, పాదాలు బలంగా ఉంటాయి.
 • తిండి తినడం ప్రారంభించడంనుంచి 90కిలోల బరువుకు చేరడానికి తీసుకునే సమయం తక్కువగా ఉండాలి.
సంతానోత్పత్తి చేసే మగపందులను, ఆడపందులను మార్చేటపుడు చూడాల్సిన అంశాలు
 • ఎంపిక చేసుకున్న పంది తల్లి, ఎక్కువ పిల్లలను అంటే 8, అంతకంటే ఎక్కువ సంఖ్యలో పెట్టి ఉండాలి. ఆడపందిపిల్ల తిండి తినడం ప్రారంభించే సమయానికి(56రోజులు) దాని తల్లి తొలిచూలుదయితే 120కిలోల బరువు, మలి చూలుదయితే 150కిలోలకు తక్కువకాకుండా ఉండాలి.
 • ఆడపందిగానీ, మగపందిగానీ సుమారు ఆరునెలల్లోనే 90కిలోల బరువుకు చేరాలి.
 • పంది శరీరం తగిన పొడవు, లావు కలిగి ఉండాలి... వెనుక తొడల కండరాలు పటిష్ఠంగా, గట్టిగా ఉండాలి
 • పంది కాళ్ళు, పాదాలు బలంగా ఉండాలి.
 • ఆడ పంది వారు మందం 4సెం.మీ. లేదా అంతకన్నా తక్కువ ఉండాలి...మగపంది వారు మందం 3.2సెం.మీ. లేదా అంతకన్నా తక్కువ ఉండాలి.
 • ఆడపందికి పొదుగులో చక్కగా అమరిన చన్నులు కనీసం 12 అయినా ఉండాలి. పాలివ్వని చన్నులున్న పంది నుంచి, పాలు తక్కువగాగానీ, అసలు రాకుండాగానీ ఉంటాయి, పైగా అది వంశపారంపర్యంగా వస్తుంది కనుక అలాంటి పందిని తీసుకోకూడదు.
 • బ్రూసెల్లోసిస్ మరియు లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులున్నాయేమో తెలుసుకోడానికి ఎంపిక సమయంలోనే రక్తపరీక్షలు చేయించాలి...స్వైన్ ఫీవర్ వ్యాధి టీకాలు వేయించాలి.
 • ఇతర వ్యాధులు, శరీర అవకరాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి.

మేత వ్యవహారం

మేత తయారీలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు

 • బాగా చవకైన పదార్ధాలతో మేతను తయారుచేసుకోవాలి.
 • మొక్కజొన్న, జొన్నలు, ఓట్లు, ఇతర తృణధాన్యాలు, గోధుమలు, బియ్యం వంటి వాటితో మేత తయారుచేయొచ్చు.
 • ప్రోటీన్ అందించే...తవుడు,చెక్క, చేప వ్యర్ధాలు, మాంసం వ్యర్ధ పదార్థాలను ఉపయోగించాలి.
 • పందులను పొలంలో వదిలితే ప్రత్యేకంగా వైటమిన్ ప్రత్యామ్నాయాలనేమీ అందించనవసరంలేదు... లేనిపక్షంలో తాజా చిక్కుడుజాతి గింజలను కూడా పెట్టాల్సి ఉంటుంది. జంతు సంబంధిత ప్రోటీన్ తక్కువగా పెట్టినా, అసలు పెట్టకపోయినా వైటమిన్ బి 12 ప్రత్యామ్నాయాన్ని అందించాల్సిఉంటుంది.
 • కిలో మేతకు 11మి.గ్రా. యాంటీబయాటిక్ ను ప్రత్యామ్నాయంగా అందించాలి.
 • ఖనిజలవణాల ప్రత్యామ్నాయాలను కూడా అందించాలి.

ఈ కింది పట్టీ...వివిధ దశలలో ఉండే పందులకు ఇచ్చే మేతలో ఉండాల్సిన పోషకాల వివరాలను అందిస్తుంది

పోషక పధార్ధాలు

పాకుతున్నదశలోఇవ్వాల్సిన మేత

మధ్యస్థదశలోఇవ్వాల్సినమేత (20-40 కిలో)

చివరలో ఇవ్వాల్సిన మేత(40-90 కిలో)

ప్రోటీన్ ప్రత్యామ్నాయంశాతం(%)

 1. నూనెచెక్క16-18

 

14-16

 

13-14

 1. జంతుమాంసం

8-10

4

2

ఆహారధాన్యాలశాతం(మొక్కజొన్న, జొన్న, ఇతర తృణధాన్యాలు)(%)

60-65

50-55

40-50

గోధుమపొట్టు లేదా తవుడు(%)

5

10

20

ల్యూసిర్న్ మేత శాతం(దొరికితే)meal (%) if available

--

5-8

--

ఖనిజలవణాల మిశ్రమం శాతం(%)

0.5

0.5

0.5

యాంటీబయాటిక్ ప్రత్యామ్నాయం( మి. గ్రా)

40

20

10

వివిధ వయస్సులలో పందులకు ఇవ్వాల్సిన మేతలో ఉండాల్సిన పదార్ధాలు

పదార్ధాలు

పాకేదశ (14నుంచి56రోజులవరకు)

గ్రోయర్(40కిలోల బరువువరకు)

ఫినిషర్ (40-90 కిలో)
(40-90 k.g)

గర్భిణి, ఈనిన పంది

మొక్కజొన్నలులేదా జొన్నలు, గోధుమనూకలు, బియ్యం నూకలు, బార్లీ తగిన మిశ్రమాల్లో

65

50

50

50

నూనెచెక్క(వేరుశెనగచెక్క, సోయాబీన్ చెక్క, ఆవనూనె చెక్క, అవిశెనూనెచెక్క)

14

18

20

20

మొలాసెస్

5

5

5

5

గోధుమపొట్టు లేదా బియ్యపుపొట్టు

10

1.5

25

18

చేపవ్యర్ధాలు లేదా మాంసం వ్యర్ధాలు, మిగిలిపోయినవంటలు, చెడిపోయిన పాలఉత్పత్తులు

5

5

3

5

ఖనిజలవణాల మిశ్రమం

1

1.5

1.5

1.5

ఉప్పు

--

0.5

0.5

0.5

ఈ పందులకు మేతపెట్టడానికి అత్యంత సులభమైన మార్గమేమిటంటే...వివిధ రకాల పందులకు సూచింపబడిన సమగ్ర మేతను తయారుచేసుకోవడం, వృధా చేయకుండా అవి ఎంతయితే తినగలవో అంత మేతను వాటికి రోజుకు రెండు లేదా మూడుసార్లు పెట్టడం. పందులు రోజూ తినే ఎండుమేత పరిమాణం సుమారుగా ఈ క్రింది విధంగా ఉంటుంది.


పంది బరువు(కిలోల్లో)

ఒక్కొక్కటి రోజూ తినగలిగే మేత(కిలోల్లో)

25

2.0

50

3.2

100

5.3

150

6.8

200

7.5

250

8.3

మిశ్రమ దాణాలలో ఉపయోగించే ఆహారధాన్యాలనన్నిటినీ బాగా పిండిచేయాలి. సాధారణంగా మేతను గుజ్జుగా చేసి ఇవ్వడం కంటే ఎండు మేతగా గానీ, కుడితి గా గానీ ఇవ్వడమే మంచిది. కుడితి తయారు చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది...పని కూడా ఎక్కువ. మేతలో పీచుపదార్ధం ఎక్కువగా ఉంటే దానిని గుళికలుగా చేసి మేపడం వలన పందులు త్వరగా పెరుగుతాయి. .బరువెక్కుతాయి. గుళికలుగా చేయడంవలన మేత వృధా అవడం కూడా తగ్గుతుంది. సూడి పందులకు మేత మరీ ఎక్కువగా ఇవ్వడం కూడా మంచిదికాదనే విషయం చాలా ముఖ్యం. బాగా బరువు పెరిగిన ఆడపంది తక్కువ పిల్లలను పెడుతుంది.. ఈనిన తర్వాత దానికిందబడి పిల్లలు చనిపోతాయి. సూడికట్టిన దగ్గరనుంచి ఈనేలోపు...మలిచూలు పందయితే 35కిలోలు, తొలిచూలుదయితే 55కిలోలు బరువు పెరగాలి.

నివాసము

మారుతుండే వాతావరణం, వ్యాధులు, సూక్ష్మక్రిములనుంచి పందులను రక్షించడానికి వాటికి తగిన ఆశ్రయం కల్పించాలి.
వివిధ వర్గాల పందులకు ఆశ్రయం కల్పించడానికి కావాల్సిన గది విస్తీర్ణం, నీరు, గాలిలో తిరగడానికి కావాల్సిన బహిరంగ ప్రదేశ విస్తీర్ణం వివరాలు ఇలా ఉంటాయి.

పందిరకం

ఒక్కోపందికి కనీసవిస్తీర్ణం (చ.మీ.)

ఒక్కోపందికి ఖాళీప్రదేశం (చ.మీ.)

కావాల్సిన నీరు (లీటర్లు)

మగపంది

6.25-7.5

8.8-12.0

45.5

సూడిపంది

7.5-9.0

8.8-12

18-22

ఈనినపంది

0.96-1.8

8.8-12

3.5-4

ఆడపంది

1.8-2.7

1.4-1.8

4.5-5

పందుల దొడ్డి

గచ్చు గరుకుగా ఉండాలి...నీరు ఇంకకుండా సిమెంటుతో గట్టిగా చేయించాలి. వ్యర్ధ పదార్ధాలు బయటకు పోవడానికి తూములు ఏర్పాటు చేయాలి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో పందుల దొడ్డిని 3మీ.x2.4మీ లేదా 3మీx3మీతో ఏర్పాటు చేస్తారు. ఆరుబయట ఏర్పాటు చేసే దొడ్డి కూడా ఇదే పరిమాణంలో, లేదా కొద్దిగా పొడవుగా ఉంటుంది. గోడలు నేలనుంచి 1.2-1.5మీ ఎత్తు ఉండాలి. ఈనబోతున్న పందులకోసం కొన్ని దొడ్లలను ప్రత్యేకంగా ఉంచాలి. వాటిగోడలకు 5సెం.మీ. వ్యాసమున్న జీఐ గొట్టాలు... నేలనుంచి 20-25సెం.మీ. ఎత్తున ఏర్పాటుచేయాలి. ఇది కాకుండా పంది పిల్లలు పాకడానికి ఆ దొడ్డిలోనే విడిగా కొంత స్థలాన్ని ఏర్పాటుచేయాలి. దీని విస్తీర్ణం 0.75మీ.X2.4మీగా ఉండాలి.

దిగుమతి చేసుకున్నరకం పందులు మామూలు వాతావరణంలో కూడా ఎక్కువసేపు ఎండలో ఉండలేవు. ఒకవేళ అలా ఉంచితే అవి వేడెక్కిపోతాయి. వాతావరణం వేడిగా ఉన్నపుడు వాటికి నీడను ఏర్పాటుచేయడం వలన చనిపోకుండా నివారించవచ్చు...ఉత్పత్తి సామర్ధ్యం పెంచవచ్చు. పందుల దొడ్ల పక్కన చెట్లను పెంచడంద్వారా ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. అయితే దొడ్లపైన నీడకోసం చెట్లను పెంచడం మంచిదికాదు....దీనివలన సూక్ష్మజీవుల బెడద వస్తుంది.

పందులు ఈనడానికి దొడ్డి-నమూనా

నీటికయ్యలు

పందులకు చాలా కొద్ది స్వేదగ్రంధులు ఉంటాయి. వేడి వాతావరణంలో...ఎండాకాలంలో ఈనే పందులు, లావెక్కుతున్న పందులకు దొర్లడానికి నీటికయ్యలు అవసరం. మామూలు అపరిశుభ్రంగా ఉండే బురదకయ్యలు కాకుండా చక్కగా మురుగునీరు పోవడానికి వీలుగా తాపీమేస్త్రీతో నీటికయ్యలు ఏర్పాటు చేయించాలి. పందుల సంఖ్య, వాటి సైజులను బట్టి దాని పరిమాణాన్ని లెక్కవేసుకోవాలి.

ఈనడానికి ఏర్పాట్లు

ఆడపంది ఈనే వయసు

8 నెలలు

సూడిపంది బరువు

100-120 కిలోలు

వేడి ఇవ్వాల్సిన సమయం

2-3 రోజులు

ఈనడానికి పట్టే సమయం

తొలిచూలుపంది-మొదటిరోజు
మలిచూలుపంది-రెండోరోజు

ఆడపందికి ఎన్నిసార్లు పరీక్ష చేయించాలి

12-14గంటల తేడాతో రోజుకు రెండుసార్లు

రుతు చక్రం

18-24 రోజులు (సగటున21 రోజులు)

ఈనిన తర్వాత వేడి ఇవ్వాల్సిన సమయం

2-10 రోజులు

గర్భధారణ సమయం

114 రోజులు

ఈనడానికి తగిన వయస్సు

బాగా తయారయిన ఆడపందులు 12-14 నెలలవయస్సుకు ఈనడానికి తయారవుతాయి. ఇది వయస్సుపై కాక వాటి శరీరం ఏ మేరకు పెరిగిందనేదానిపై ఆధారపడి ఉంటుంది. సూడికట్టడానికి ముందు వాటి బరువు కనీసం వందకిలోలు ఉండాలి.దీనివల్ల రుతుక్రమం త్వరగా గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు లేదా మూడు రుతుకాలాల వరకు పందిని సూడికట్టించడం నిలిపితే మంచిది. ఐదు లేదా ఆరు ఈతల వరకు వరసగా పెట్టే పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఆ సంఖ్య తగ్గే అవకాశం ఉండటంవల్ల ఆ ఆడపందిని మందనుంచి వేరు చేయడం మంచిది.

వేడి గుర్తింపు

పందుల్లో రుతుక్రమం 21రోజులకు ఒకసారి వస్తుంది. ఇది ఐదునుంచి ఏడురోజుల వరకు ఉంటుంది. ఈ సమయంలో అవి ఎక్కువగా మూత్రాన్ని పోస్తాయి...ఆకలి తగ్గుతుంది...లేచి నిలబడుతుంటాయి...నడుముమీద సవరదీసినపుడు చెవులు నిక్కబొడుచుకుంటాయి. సూడికట్టే సమయాన్ని పసిగట్టడానికి ఆడపంది నడుము సవరదీస్తారు. రుతుక్రమం సరిగా లేని ఆడపందులను మగపందుల దగ్గరకు తీసుకొస్తారు.

రుతుక్రమం మొదటిరోజు చివరకానీ, రెండవరోజు ప్రారంభంకానీ మగపందితో కలయికకు అనువైనది. ఒక్కోసారి ఆడపందులను 12-14గంటల తేడాతో రెండోరోజు మరలా మగపందితో కలపాలి. దీనివలన గర్భధారణకు అవకాశాలు పెరుగుతాయి.

ఆడపంది సూడికట్టిన 1-4 రోజుల తర్వాత రుతుక్రమానికి లోనవుతుంది. అయితే వాటిని ఆ సమయంలో మగపందితో కలపకూడదు. ఈనిన తర్వాత2-10రోజుల తర్వాత కూడా అవి వేడెక్కుతాయి.... అప్పుడు వాటిని మగపందితో కలపవచ్చు. అయితే ఈనిన తర్వాత రెండోసారి వచ్చే రుతుక్రమం సమయంలో కలిపితే మంచి ఫలితాలు వస్తాయి. మగపందితో కలిపిన తర్వాత ఆడపందులకు రుతుక్రమం ఎప్పుడు వస్తుందో గమనిస్తుండాలి. రెండు రుతుక్రమాలలోనూ మగపందితో కలిపినా గర్భం ధరించకపోతే ఆ ఆడపందులను మందనుంచి వేరుచేయడం మంచిది.

సూడిపందులను మేపుట

కలయికకు ముందు ఆడపందులను మేపే విధానం చూస్తే... కలయికకు 7-10రోజుల ముందు మంచి మేత ఇవ్వడంవలన గర్భధారణ అవకాశాలు బాగా పెరుగుతాయి. కలయిక తర్వాత మేత పరిమితంగా ఇవ్వాలి. అయితే గర్భధారణలోని చివరి ఆరువారాలవరకు మంచి సమతుల్య ఆహారం ఇవ్వాలి....ఆ తర్వాత పూర్తి మేతను ప్రారంభించాలి.

సూడిపందులపై తీసుకోవాల్సిన శ్రద్ధ, జాగ్రత్తలు

ఆడపందుల గర్భధారణ సమయం 109-120రోజుల వరకు ఉంటుంది...సగటున 114రోజులు. సూడిపందులను వేరే దొడ్లలో ఉంచాలి. లేకపోతే అవి మామూలు పందులతో గొడవపడటంవలన గర్భస్రావం జరుగుతుంది. తొలిచూలు పందులను, మామూలు సూడిపందులను కూడా విడివిడిగా ఉంచడం మంచిది. ఒక్కొక్క ఆడపందికీ సుమారు 3 చదరపు మీటర్ల విస్తీర్ణం స్థలం ఉండటం మేలు. సూడిపందులను ప్రతిరోజూ ఉదయం వేళ ఆరుబయటగానీ, పొలంలోగానీ తిరగనివ్వడం మంచిది. ఆ పొలంలో ఇంతకుముందు ఏదైనా పంట పండి ఉంటే అదంతా శుభ్రంగా ఖాళీ అయిఉండాలి

ఈనేసమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పందుల ఉత్పత్తిలో ఈనేసమయం అత్యంత కీలకం. ఈనేటప్పుడు, ఈనిన మొదటివారంలో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈనే పందులను గట్టిగా ఇనుపచువ్వలతో కట్టిన దొడ్లలో ఉంచాలి....ఈనడానికి తొట్టెలను ఏర్పాటుచేయాలి. పందిపిల్లలు మూడు, నాలుగురోజుల వయస్సువరకు 24-28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఆ దొడ్డిలో ఉండాలి. ఆ తర్వాత వాటికి ఆరువారాల వయస్సు వచ్చేవరకు 18-22డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంచాలి. వేడికోసం నేలకు 45సెం.మీ. ఎత్తులో దీపాలు వేలాడతీయాలి...వాటిని జాగ్రత్తగా కాపాడాలి. పందులు ఈనే దొడ్లలోకి సూడిపందులను తీసుకురావడానికి ముందే ఆ దొడ్లను బాగా శుభ్రంచేయాలి. దీనివలన పందిపిల్లలను ఎన్నో జబ్బులనుంచి కాపాడవచ్చు. సూడిపందిని ఈనడానికి కనీసం ఒకవారం ముందు ఆ దొడ్డికి తీసుకురావడంవలన అది కొత్త పరిసరాలకు పరిచయం అవుతుంది. ఆ దొడ్డికి తీసుకువచ్చేముందు దానిని శుభ్రంగా కడగాలి. మేతలో మూడోవంతు గోధుమపొట్టుతో కూడి ఉండాలి. ఈనేవరకు దాని మేతను మూడోవంతు తగ్గించాలి. ఈనే సమయం నిర్ధారించడానికి సూడిపందిని జాగ్రత్తగా గమనిస్తూఉండాలి... ఈనడానికి 12గంటల ముందునుంచి దానికి మేతను ఆపివేయాలి.

ఈనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆడపంది ఈనేసమయంలో సహాయానికి ఒక మనిషి తోడుండాలి. లేకపోతే చాలా పందిపిల్లలు చనిపోతాయి. ఈనడం పూర్తవడానికి సాధారణంగా రెండునుంచి నాలుగు గంటలు పడుతుంది. పిల్లలు పుట్టగానే వాటిని పక్కకు తీసి ఈనడం పూర్తయ్యేవరకు పక్కన వెచ్చని ప్రదేశంలో పెట్టాలి. ప్రతిపిల్లనూ శుభ్రంగా కడిగి తేలిగ్గా ఊపిరితీసుకునేటట్లు చేయాలి. బొడ్డుతాడును బొడ్డుకు 2-5 సెం.మీ. దూరంలో కట్టేసి శుభ్రమైన కత్తెరతో కత్తిరించాలి. కోసిన చోట అయోడిన్ పూయాలి. పుట్టిన పిల్లల అవసరాలు చూడాలి. రెండురోజుల్లో అవి తల్లిపాలు తాగడానికి ఒక చన్నును ఎంచుకుంటాయి. తొలిదశలో రోజుకు 8-10సార్లు తల్లిదగ్గర పాలు తాగుతాయి. మొదటి రెండు వారాల్లో అవి తల్లిపంది కిందపడి నలిగిపోకుండా చూస్తుండాలి.

సూదిదంతాల తొలగింపు

పందిపిల్లలు నాలుగు జతల పదునైన పళ్ళతో పుడతాయి... ఒక్కొక్క దవడకు రెండు జతల చొప్పున ఉంటాయి. ఈ పళ్ళ వలన ప్రయోజనం ఏమీ ఉండదు...పైగా అవి పాలుతాగేటప్పడు తల్లి పొదుగువద్ద చిరాకు కలిగిస్తాయి లేదా మిగిలిన పిల్లలకు గాయాలు కలగజేస్తాయి. పుట్టినవెంటనే వాటిని కత్తిరించడంవలన పొదుగువద్ద గాయాలవ్వకుండా నివారించవచ్చు.

పందిపిల్లల్లో రక్తహీనత

పందిపిల్లల్లో రక్తహీనత అనేది సాధారణంగా వచ్చే పౌష్ఠకాహార లోపం. ఇనుపధాతువును నోటిద్వారాగానీ, ఇంజెక్షన్ ద్వారాగానీ ఇవ్వడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని(0.5కిలో ఫెర్రస్ సల్ఫేట్ ను పదిలీటర్ల వేడినీటిలో కలపాలి) తల్లిపంది పొదుగుకు రాయడంద్వారాగానీ చల్లడంద్వారాగానీ పందిపిల్లలకు ఇనుపధాతువును నోటిద్వారా అందించవచ్చు. అవి పుట్టిన దగ్గరనుంచి మేత తినేవరకు ఇలా ఇనుపధాతువును అందించాలి

అనాధ పందిపిల్లలను పెంచడం

ఈనిన తర్వాత తల్లిపంది చనిపోవడం, ఒక్కోసారి తల్లి పంది పాలు ఇవ్వలేకపోవడం, ఎక్కువ పిల్లలు పుట్టినప్పుడు పాలు చాలకపోవడం వంటి సందర్భాలలో కొన్ని పిల్లలు అనాధలవుతాయి. అదేసమయంలో ఇంకో పంది ఈనితే ఈ పిల్లలను దానిదగ్గరకు మార్చవచ్చు. అయితే ఇలా మార్చడం ఈనిన వెంటనే జరగాలి. కొత్తపిల్లలను ఆ మరొక పంది అంగీకరింపచేయడానికిగానూ, దానిపిల్లలను కూడా కొంతకాలం పక్కనపెట్టాలి. ఆ తర్వాత కొత్తపిల్లలను, అసలు పిల్లలను కలిపి వాటన్నటిమీద ఏదైనా ద్రావణాన్ని చల్లడంద్వారా వాసనలను మరుగునపరచాలి.

అనాధపిల్లలను పాలప్రత్యామ్నాయంతో కూడా పెంచవచ్చు. ఒక లీటరు పాలలో ఒక కోడిగుడ్డు పచ్చసొన కలిపి దీనిని తయారుచేయాలి. ఈ మిశ్రమంలో ఇనుము తప్పితే అన్ని పోషకవిలువలూ ఉంటాయి. ఇనుముకోసం ఒకలీటరు పాలలో కొద్దిగా ఫెర్రస్ సల్ఫేట్ కలిపి తాగించాలి. ఇనుమును ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వవచ్చు.

పునరుత్పాదకసామర్ధ్యం తొలగింపు

పునరుత్పాదకతకు పనికిరావనుకుంటున్న మగపందిపిల్లలకు మూడు, నాలుగు వారాల వయస్సులో వృషణాలు తొలగించవచ్చు.

ఎక్కువ పాలివ్వడానికి తీసుకోవాల్సిన చర్యలు

పాలిచ్చే ఆడపందులకు తదనుగుణంగా మంచి మేత ఇవ్వాలి. ఒక్కోపందిపిల్లకు అరకేజిచొప్పున తల్లిపందికి ఎన్ని పందిపిల్ల లుంటే అంత అదనపు మేత ఇవ్వాలి.

తల్లిపందినుంచి పిల్లలను వేరుచేయడం

పందిపిల్లలకు మేత అలవాటుచేయడం 8వారాల వయస్సునుంచి ప్రారంభించాలి. తల్లిపందిని ప్రతిరోజూ కొద్దిసేపు వేరు చేస్తూ ఒక్కసారిగా పిల్లలను దూరంచేస్తే కలిగే వత్తిడిని నివారించాలి...మేతను కూడా తగ్గిస్తూ ఉండాలి. మేత ప్రారంభించిన రెండువారాల తర్వాత క్రిముల తొలగింపుకు వాటికి మందు ఇవ్వాలి. రెండువారాలలో 18శాతం ప్రోటీన్ ఉండే మేతనుంచి 16శాతం గ్రోయర్ మేతకు పిల్లలను మారవాలి. ఒక్కోదొడ్డిలో ఒకే వయస్సున్న 20పిల్లలను ఉంచాలి.

పందులకు వచ్చే వ్యాధుల నివారణ, నియంత్రణ

 • 2-4వారాల వయస్సులో ప్రతిపందికీ స్వైన్ ఫీవర్ టీకాలు వేయించాలి. గర్భందాల్చే పందులకు బ్రుసెలోసిస్, లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులున్నాయేమో పరీక్షించాలి. మేత తినడం ప్రారంభించే పందిపిల్లలన్నిటికీ స్వైన్ ఫ్లూ టీకా తప్పనిసరిగా వేయించాలి.
 • పందులను కొనుగోలు చేసేటప్పుడు వ్యాధులు లేని మందలనుంచి కొనుగోలు చేయాలి. కొత్తగా కొనుగోలు చేసిన పందులను మూడు, నాలుగు వారాలదాకా పాత మందలో కలపకూడదు. దొడ్డిని చూడడానికి ఎవరినీ అనుమతించకూడదు. కొత్తవాటిని ఉంచే దొడ్లను మూడు, నాలుగు వారాలదాకా ఖాళీగా ఉంచితే అక్కడ సూక్ష్మక్రిములేమైనా ఉంటే అవి తొలగిపోతాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate