ఆరుబయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డి లో షెడ్డు వేసి గొర్రెలను పెంచవచ్చును. మెట్ట సేద్యంలో గొర్రెల పెంపకం ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడి తో సన్నకారు, చిన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కులిలకు గొర్రెల పెంపకం లాభసాటి ఉపాధిగా వుంటుంది.
వివరాలకు : సమీపంలో ఉండే వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా పశువుల ఆసుపత్రిని సంప్రదించవచ్చు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
జీవాలు అనగా గొర్రెలు మరియు మేకలు. ఇవి ఎంతో మందికి జీవనోపాధి కల్పిసూ, గ్రామీణ ఆర్థిక అభ్యున్నతిలో ప్రధాన పాత్ర వహిస్తున్న విషయం మనందరికి తెలిసిందే. అనాదిగా జీవాల పెంపకాన్ని నమ్మకుని జీవనోపాధి పొందుతున్న గొర్రెల, మేకల పెంపకందార్లు మాత్రం వివిధ కారణాల వల్ల ఆధునిక, శాస్త్రీయ పద్ధతులను పాటించక, ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. అందువల్ల గొర్రెల పెంపకందారు, జీవాల ఎంపికతో పాటు వాటి కొనుగోలు, వాటి పెంపకంలో తీసుకోవల్సిన ఆధునిక, శాస్త్రీయ పద్ధతుల పట్ల అవగాహన పెంచుకొని, ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అనాదిగా గొర్రెల పెంపకాన్ని వివిధ వాతావరణ, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తలొగ్గకుండా వృత్తి నైపుణ్యం లో గొర్రెల పెంపకాన్ని కులవృత్తిగా చేపట్టి యాదవ, గొల్ల కురుమ వర్గాల వారికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేసి గొర్రెల సంపదలో, మాంసం ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రత్యేక అభివృద్ది కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది.
ఐదువేల కోట్ల రూపాయలతో చేపడుతున్న పథకంలో గొల్ల కురుమ సంఫు సభ్యులైన గొర్రెల పెంపకందారులకు 4 లక్షల యూనిట్ల (84 లక్షల గొర్రెలు) గొర్రెలు రెండు సంవత్సరాల కాలంలో అందజేయబడతాయి. ఒక్కో గొర్రెల యూనిట్ కు 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు అందజేస్తారు. ఒక్కో యూనిట్ విలువ రూ. 1, 25,000/- అందులో ప్రభుత్వ రాయితీ రూ. 93,750/–
మొదటి దశలో ప్రాథమిక గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాలను బలోపేతం చేయడానికి గొల్ల, కురుమ కుటుంబ సభ్యులందరిని ప్రోత్సహించి సంఘాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంఘాలు లేని గ్రామాల్లో కొత్త సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది.
రెండవ దశలో అరులైన లబ్దిదారులను ఎంపిక చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకు జిల్లా కలెక్టర్ 6 ఆధ్వర్యంలో ప్రతి మండలంలో మండల రెవెన్యూ అధికారి, మండల ప్రజా పరిషత్ అధికారి మరియు మండల పశు వైద్య అధికారితో కూడిన త్రిసభ్య బృందం ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది. అలా ఎంపిక అయిన సగం మందికి మిగిలిన 50% లబ్దిదారులకు వెుదటి 2017-18 సంవత్సరంలో మిగిలిన 50% లబ్దిదారులకు 2018-19 సంవత్సరంలో గొర్రెల యూనిట్ పంపిణి చేయడం జరుగుతుంది.
ఇలా పంపిణీ చేసే గొర్రెలకు ఉచిత భీమా కల్చించడమేకాకుండా వాటి రవాణా ఖర్చులు కూడా యూనిట్ విలువలో పొందపర్చడమైనది. అంతేకాక పశుగ్రాస వసతి కలిగిన వారికి 75% రాయితీపై పశుగ్రాస విత్తనాలు, 75% రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రం కూడా అందజేయబడతాయి.
గొర్రెలను ఇతర రాష్ట్రాల నుండి మాత్రమే కొనుగోలు చేసి మన రాష్ట్ర గొర్రెల సంపదను వృద్ది చేసుకోవడం జరుగుతుంది. మేలు రకపు గొర్రెలను ఎంపిక చేసిన దూర ప్రాంతాల నుండి కొనుగోలు చేసి తీసుకురావడం జరుగుతుంది. కావున గొర్రెల ఎంపికలో, రవాణా విషయంలో ప్రయాణ సమయంలో మరియు కొట్టాలలో చేర్చిన తరువాత గొర్రెల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది. గొర్రెల ఎంపికలో వాటి వయస్సు, జాతి, బాహ్య లక్షణాలు, శారీరక స్థితి మొదలగు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అధిక మాంసాన్నిచ్చే మేలు జాతి గొర్రెలైన
నెలల్లారు, డెక్కని, మాండ్య మొదలగు జాతులను ఎంపిక చేసుకోవాలి.
ఆడ గొర్రెలు ఒకటి నుండి ఒకటిన్నర వయస్సు నుండి 25-30 కిలోల బరువు కలిగిన వాటిని ఎంపిక చేసుకోవాలి. క్రింది దవడకు రెండు శాశ్వత పళ్ళు వచ్చి ఉండాలి. పొట్టేలు ఒక్కటిన్నర నుండి రెండు సంవత్సరాల వయస్సు కలిగి సుమారు 35 కిలోల బరువుతో ఉండాలి. 2-4 శాశ్వత పళ్ళు వచ్చి ఉండాలి.
ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. మేత మేయడం, నెమరు వేయడం సాధారణంగా ఉండాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలి. కాళ్ళు నిటారుగా ఉండాలి. అంతేకాక దగ్గడం కాని, కాళ్ళు, ముక్కుల నుండి స్రావాలు కారటం కాని, దవడ క్రింద వాపు , ఉబ్బిన పెదవులు, కుంటడం మొదలగు అనారోగ్య లక్షణాలు కలిగి ఉండరాదు.
శారీరకంగా గొర్రెలు మంచి పుష్టి కలిగి ఉండాలి. గొర్రెలు బక్కచిక్కి ఉండరాదు. ఆడ గొర్రెల ఎంపికలో ఒక ఈత గొర్రలె లేదా పాలు మరచిన లేదా పాలు త్రాగే ఆడ గొర్రె పిల్ల కలిగిన గొర్రెలను ఎంచుకోవాలి. ఆరోగ్యంగా చురుకుగా ఉండాలి. పొదుగు వాపు ఉండకూడదు. ఆరోగ్యంగా ఉండాలి. విత్తనపు పొట్టేలు ఎంపికలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మంచి లైంగిక సామర్థ్యం కలిగి ఉండాలి. వృషణాలు సమానంగా ఉండాలి. ఎలాంటి వాపు ఉండకూడదు. చర్మవ్యాధులు ఉండరాదు. నెలూరు జాతి పొట్టేళ్ళ నెలూరు, కనిగిరి, కావలి, నందిగామ, గురజాడ, మాచర్ల ప్రాంతాలు మరియు దక్కన్ జాతి పొట్టేళ్ళు తెలంగాణ ప్రాంతములలో లభ్యమవుతాయి.
ఇలా కొనుగోలు చేసిన గొర్రెలకు, కొనుగోలు చేయబడిన ప్రాంతం నుండి భీమా సౌకర్యం ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసిన గొర్రెల చెవికి సంబంధించిన భీమా కంపెనీ ట్యాగులు వేసిన పిదప మాత్రమే గొర్రెలను తరలించాలి. ట్యాగులు చెవి మధ్య భాగంలోనే వేయించాలి. వేసిన తరువాత సరిగా వేయబడిందో లేదో చూసుకోవాలి. భీమా చేయబడిన గొర్రెగొర్రెలు అకస్మాత్తుగా లేదా వ్యాధుల వల్ల మరణించినా సంబంధిత భీమా కంపెనీకి లేదా పశు వైద్య అధికారికి తెలియజేయాలి.
జనవరి : నట్టల నివారణ మందు త్రాగించాలి. పిపిఆర్, గొంతువాపు టీకాలు |
ఫిబ్రవరి : నోటి ద్వారా లివర్ టానిక్స్ మరియు బి-కాంప్లెక్స్ మందులు త్రాగించాలి. |
మార్చి : పిడుదులు, గోమార్ల నిర్మూలన |
ఏప్రిల్ : - |
మే :- లివర్ టానిక్స్ - బి-కాంప్లెక్స్ |
జూన్ : - |
జూలై :- నట్టల నివారణ, గొంతు వాపు టీకాలు |
ఆగష్టు :- బి-కాంప్లెక్స్, లివర్ టానిక్స్ |
సెప్టెంబర్ :- పిడుదులు, గోమార్ల నివారణ |
అక్టోబర్:- నట్టల నివారణ, గొర్రె వునూచి మరియు చిటుకు రోగం టీకాలు వేయించాలి. |
నవంబర్ : బి-కాంప్లెక్స్, లివర్ టానిక్స్ |
డిసెంబర్ : - |
ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. వరా కాలం అందులోను ఆగష్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ వ్యాధి అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. వర్శపాతం ఎక్కువగా నమోదైన సంవత్సరంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
వ్యాధి సోకిన గొర్రెలకుత్రివమైన జ్వరం, మూతి, పెదవులు, చిగుళ్ళు, నాలుక, ముఖం వాపు వచ్చి పుండు ఏర్పడతాయి. నోటి నుండి నురుగతో కూడ చొంగ, కళ్ళు, ముక్కు వాపు వస్తాయి. వ్యాధి చివరి దశలో నాలుక నీలి రంగుగా మారుతుంది. నోటి ద్వారా దుర్వాసన వస్తుంది. గిట్టలపై పైభాగం ఎర్రగా కందిపోయి, చీము పట్టి నడవలేక పోతాయి. మేత తినకపోవడం వలన, నీరసించి బరువు తగ్గిపోతాయి. మరణించే అవకాశం ఉంది.
వ్యాధి వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి చికిత్స వలన పెద్ద ప్రయోజనం ఉండదు. జబ్బు పడ్డ జీవాలను వేరు చేయాలి. ఇతర వ్యాధులు సోకకుండా యాంటి బయోటిక్ మందులు వాడాలి. నోటి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ నాలుక వాపు ఉండటం వలన మేత మేయవు కాబట్టి రాగి గంజి, అంబలి ఇచ్చి మరణాల బారిన పడకుండా నివారించవచ్చు. నొప్పి తగ్గుటకు పశు వైద్యుని సూచనల మేరకు నొప్పి తగ్గించే సూది మందులు ఇవ్వాలి.
వ్యాధి వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి చికిత్స వలన పెద్ద ప్రయోజనం ఉండదు. జబ్బు పడ్డ జీవాలను వేరు చేయాలి. ఇతర వ్యాధులు సోకకుండా యాంటి బయోటిక్ మందులు వాడాలి. నోటి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ నాలుక వాపు ఉండటం వలన మేత మేయవు కాబట్టి రాగి గంజి, అంబలి ఇచ్చి మరణాల బారిన పడకుండా నివారించవచ్చు. నొప్పి తగ్గుటకు పశు వైద్యుని సూచనల మేరకు నొప్పి తగ్గించే సూది మందులు ఇవ్వాలి.
ఈ వ్యాధికి టీకాలు లేవు. అందుచేత కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలి. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణకు వేపాకు లేదా యూకలిప్టస్ ఆకు, కలబంద ఆకు, పిడక కాల్చి దోమల్ని నివారించవచ్చు. షెడ్ లోపల, బయట మలాథియాన్ వంటి క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి. షెడ్డును పొడిగా ఉంచాలి. మాంసం, పాల ద్వారా ఈ వ్యాధి ఒకదానినుంచి మరొక దానికి వ్యాపిస్తుంది. అలాగే ఈ జబ్బు కలిగిన గొర్రెల పాలను గొర్రె పిల్లలు త్రాగకుండా చూడాలి.
ఆధారము: అగ్రిస్ నెట్