హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / ఆముదంలో చీడపీడల యాజమాన్యం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆముదంలో చీడపీడల యాజమాన్యం

ఆముదం వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో పండించే నూనెగింజల పంటలలో ముఖ్యమైనవి.

amudamఆముదం వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో పండించే నూనెగింజల పంటలలో ముఖ్యమైనవి. ఆముదం సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 80-85 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తున్నారు.

ఆముదం పంటను వివిధ రకాలైన పురుగులు, తెగుళ్ళు ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వాటిని సరైన వేళలో గమనించి సమర్థవంతంగా నివారించినట్లయితే ఈ పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చు.

పురుగులు

ఆకుతినే / తొలిచే పురుగు

amdtwoవీటిలో ముఖ్యమైనవి దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు. ఇవి ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. వీటి ఉధృతి ఎక్కువ గొంగళి పురుగులు, బిహారి గొంగళి పురుగులు ఆకులను, పువ్వులను, కాయలను తిని పంటకు నష్టం కలిగిస్తాయి. ఆకు తొలిచే పురుగు లేత ఆకుల పొరల్లో ప్రవేశించి తొలుస్తుంది. దీని ఉదృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా ఎండి రాలిపోతాయి. కాయలు ఏర్పడే దశలో కొమ్మ, కాయ తోలిచే పురుగు ఆశిస్తుంది. తద్పారా లేత కాడలు ఎండిపోతాయి. కాయలోని ప్రవేశించి లోపలి భాగాలను తినడం ద్వారా కాయలు నల్లగా మారి రంధ్రాలు పడి ఎండి రాలిపోతాయి.

రసం పీల్చే పురుగులు

ఆముదాన్ని తరుచుగా ఆశించే రసం పీల్చే పురుగులు పచ్చదోమ, తామర పురుగులు, తెల్లదోమ. ఈ పురుగు తల్లి, పిల్ల పురుగులు లేత ఆకుల అడుగు భాగన చేరి రసం పీల్చడం వలన ఆకులు ముడుచుకు పోతాయి. కు అంచులు ఎర్రబడతాయి. మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది.

తెగుళ్ళు

ఆముదం పంటను వివిధ దసల్లో ఆశించే తెగుళ్ళ వల్ల అదిక నష్టం వాటిల్లుతుంది. మొలకెత్తిన తర్వాత ఎక్కువ రోడులు నీరు నిల్వ ఉంటే ఆకులపై మచ్చలు కింద తెల్లని శీలీంద్రం గమనించవచ్చు. ఇవి మొలకకుళ్ళు తెగులు లక్షణాలు.

పంట విత్తిన 20-60 రోడుల్లో ఎండు తెగులు ఆశిస్తే మొక్కలు వడలిపోయి చనిపోవడం గమనించవచ్చు. పంట ప్రత్యుత్పత్తి దశలో గెలలు ఏర్పడే సమయంలో అధిక తేమ, ఎడతెరిపి లేని వర్షాలు వస్తే బూజూ తెగులు ఆశిస్తుంది. తెగులు పోకిన కాయలు మెత్తబడి, కుళ్ళి రాలిపోతాయి. అపార దిగుబడి నష్టం కలుగుతుంది.

సమగ్ర సస్యరక్షణ చర్యలు

విత్తనశుద్ధి : 3 గ్రా. ధైరమ్ / కాప్టాన్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకుంటే తెగుళ్లను అరికటట్వచ్చు.

 • amdthreeఎండు తెగులును తట్టుకునే రకాలను సాగుచేసుకోవాలి.
 • పంట మార్పిడి చేసుకోవాలి. ఆముదంలో అంతర పంటలుగా కందిని వేసుకోవచ్చు. తద్వారా తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది.
 • ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చితే పురుగు ఉనికిని తెలుసుకోవచ్చు.
 • దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు గుడ్లు గమనించిమ వెంటనే ఎకరానికి 50,000 చోప్పున ట్రైకోగ్రామా పరాన్న జీవులను విడుదల చేయాలి.
 • లద్దె పురుగులు తొలి దశలో గుంపులుగా ఆకుల అడుగు బాగం నుండి పత్రహరితాన్ని గోకి తింటాయి. అటువంటి ఆకులనుస పురుగుల సముదా.న్ని ఏరి నాశనం చేయాలి.
 • తొలి ధసలో ఉండే లద్దె పురుగు నివారణకు 5 మి.లీ. వేప కషాయాన్ని / వోప సంభందిత మందులను పిచికారి చేయాలి.
 • ఎదిగిన లద్దె పురుగులను చేతితో ఏరి నాశనం చేయాలి.
 • ఎకరానికి 10 పక్షి స్థావరాలను అమర్చాలి.
 • దాసరి పురుగును ఆశించే పరాన్న జీవులు స్నెలినయన్, యూప్లెక్ర్టన్ లను పొలంలో గమనించినప్పుడు పురుగు మందులను పిచికారి చేయరాదు.
 • చివరి దశ లద్దె పురుగుల నివారణకు విషపు ఎర (5 కిలోల తవుడు + అర కిలో బెల్లం +  500 మి.లీ. మోనోక్రోటోఫాస్ తగిన నీరు) తయారు చేసి సాయంట్రం వేళల్లో పొలంలో అక్కడక్కడ చల్లాలి.
 • పురుగు ఉధృతిని బట్టి చివరి అస్త్రంగా పురుగు మందులను పిచికారి చేయాలి. దాసరి / లద్దె పురుగుకు నోవాల్యూరాన్ 1 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా,/లీ. రసం పీల్చే పురుగులకు ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. /లీ.
 • బూజు తెగులు నివారణకు వాతావరణ సూచవలను అనుసరించి వర్,నికి 6-8 గంటల ముందు, వర్షాలు తగ్గిన 6-8 గంటల లోపు ప్పొపికొనజోల్ 1 మి.లీ. /లీటరు నీటికి కలిపి పిచికారి చేసి ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను వేసుకోవాలి.
 • ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.95698924731
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు