অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉత్తమ పధ్ధతులు

ఉత్తమ పధ్ధతులు

 1. యంగ్ అండ్ డైనమిక్ : ఉజ్వల్ కుమార్
 2. హరిత బాటలో కంపెనీలు
 3. పంటల పాఠాలమ్మ
 4. కిసాన్‌రాజా
 5. కిసాన్‌రాజా ఎలా పనిచేస్తుందంటే..
 6. కిచెన్ గార్డెన్
 7. కుంకుమపువ్వు - వంటింటి పువ్వు...
 8. సారవంతంగా... జీవితపు సాగు
 9. ఇల్లెక్కిన తోట...
 10. పంటమార్పిడితో ప్రయోజనం
 11. రబీ.. ఆరుతడి పంటలే మేలు
 12. పూతను కాపాడితేనే కాత
 13. సిరుల ‘ఫ్లవర్’
 14. వేసెయ్‌జీ.. క్యాబేజీ
 15. వరిలో చీడపీడల నివారణే కీలకం
 16. కుసుమ తో లాభం
 17. బోడో మిశ్రమంతో క్రిమికీటకాలు దూరం
 18. పాల దిగుబడిపై వ్యాధుల ప్రభావం
 19. ఆదాయ పంట.. అలసంద
 20. రామసీతా ఫలం కమ్మ దనం
 21. పత్తి, వరిలో...తెగుళ్ల నివారణ ఇలా..
 22. ముడతలు ముంచేస్తాయ్..
 23. లాభాలు పట్టుకోండి
 24. పాలు పితికే వేళ.. జాగ్రత్తలు పాటించాలి
 25. పాడి-పంట : వాన నీటిని ఒడిసి పడదామా
 26. వేరుశనగ అన్ని ప్రాంతాల్లో విత్తుకోవచ్చు
 27. రైతన్న కష్టాలను తీర్చే వినూత్న పరికరాల రూపకర్త
 28. ఆవున్న చోటే అన్నముంది!
 29. కలుపు నివారణ : ఇవి మహా మొండివి!
 30. అంతరపంట వేయడం మరవద్దు
 31. పాడి-పంట: ఈ ధాతువులూ అవసరమే!
 32. చెట్టుకూ విశ్రాంతి అవసరమే!
 33. చిన్న రైతుకు పెద్ద వరం! వర్మి కంపోస్ట్ ద్వారా...
 34. పూతకు రాకముందే పీకేయాలి
 35. పంట వేస్తున్నారా? విత్తనశుద్ధి మరవద్దు!
 36. పప్పులే కాదు.. భూమికి బలాన్నీ ఇస్తాయి!
 37. నారుమడిని నష్టపరిచే పురుగులివే
 38. ఎండిన బోర్లలోకి వాన నీటిని ఒడిసిపట్టి కరువుకు చెక్! చినుకు బతికిం‘చేను’

యంగ్ అండ్ డైనమిక్ : ఉజ్వల్ కుమార్

ఉజ్వల్ కుమార్ యంగ్ అండ్ డైనమిక్. అందుకే అతడు 2011లో చెన్నైలోని ఎంజీఆర్ యూనివర్శిటీ నుంచి ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పట్టా అందుకుని బయటికి రాగానే ఉద్యోగం ఇస్తాం రమ్మని పెద్దపెద్ద కంపెనీలు అతడి వెంట పడ్డాయి. వాటన్నిటినీ కాదని ముజఫర్‌పూర్‌లోని తన ఇంటి దారి పట్టాడు ఉజ్వల్. అయితే ఉత్తర బీహార్‌లోని ఆ సొంత పట్టణం అతడికి ఏ విలువా ఇవ్వలేదు! చిన్న పొలం చెక్క కూడా లేనివాడు పట్టభద్రుడైతే ఏంటి? పీహెచ్.డీ చేస్తే ఏంటి అన్నది అక్కడివారి అభిప్రాయం.

భూమి ఉన్నవాడే అక్కడ మనిషి. ఆ లెక్కన ఉజ్వల్ మనిషి కాదు. అతడికి సెంటు భూమి కూడా లేదు. మరి ఉజ్వల్ అక్కడికి ఎందుకు వెళ్లినట్లు? వ్యవసాయం చేయడానికి!! వ్యవసాయం తన ప్రాణం అన్నాడు. కౌలుకిస్తే పండించుకుంటానన్నాడు. ఊళ్లో భూములున్నవారు నమ్మలేదు. మోతుబరులకే కావట్లేదు, స్టూడెంటు కుర్రాడివి నీకేం చేతనౌతుందని చీవాట్లు పెట్టి పంపారు. అక్కణ్ణుంచి దగ్గర్లోనే ఉన్న సిరిసియా వెళ్లాడు ఉజ్వల్.

అక్కడ భిక్షువులుంటారు. వారికొక పెద్ద ఆరామం ఉందని, ఆ ఆరామం పేరిట కొన్ని భూములు ఉన్నాయని తెలుసుకుని ఆరామం పెద్ద దగ్గరికి వెళ్లాడు. ‘రెండెకరాలు పొలం ఇప్పించండి. బంగారం పండించి ఇస్తాను’ అన్నాడు. ‘పండిన బంగారం నువ్వే ఉంచుకుని, పంటను మాత్రం మాకివ్వు చాలు’ అన్నారాయన. అలా ఉజ్వల్‌కుమార్ బి.టెక్ కాస్తా కౌలుదారుగా మారిపోయాడు. తను మారడమే కాదు, రెండేళ్లలో ఆ చుట్టుపక్కల నిరుద్యోగుల దశను కూడా మార్చాడు.

ప్రస్తుతం ఆ యువరైతు నెలసరి ఆదాయం కనీసం 75 వేలు. గరిష్టంగా లక్ష! ఇంతకీ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రెండ్స్ తలా ఇంత వేసుకున్నారు. వేసిన పంట ఏమిటి? ఒకటి కాదు, రెండు పంటలు. పసుపు కొమ్ములు, కంద. ఉపయోగించిన టెక్నాలజీ ఏమిటి? పెద్దగా ఏంలేదు. హైబ్రిడ్ విత్తనాలు, అధునాతన పద్ధతులు. స్థానికంగా ఇప్పుడతడు నిరుద్యోగ యువకులకు ‘వ్యవసాయ గురు’. ‘నచ్చిన పనే మనల్ని ఎప్పటికైనా నిలబెడుతుంది’ అంటాడు ఉజ్వల్. కానీ అతడిని చాలా త్వరగా నిలబెట్టినట్లుంది. ప్రస్తుతం డెబ్బైఎకరాలలో పంట పండిస్తున్నాడు ఉజ్వల్.

హరిత బాటలో కంపెనీలు

పచ్చగా కళకళలాడేందుకు కంపెనీలు పర్యావరణ అనుకూల హరితబాట పడుతున్నాయి. విద్యుత్, ప్యాకేజింగ్ మొదలైన వ్యయాలు తగ్గించుకునేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నాయి. షాపర్స్ స్టాప్, మార్క్స్ అండ్ స్పెన్సర్ తదితర రిటైల్ సంస్థలు ఈ విషయంలో ముందంజలో ఉంటున్నాయి. కరెంటు ఖర్చులు నింగినంటుతున్న తరుణంలో.. షాపింగ్ బ్యాగులే కాదు షాపులను కూడా పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దుతున్నాయి. మొత్తం వ్యయాల్లో దాదాపు అరశాతం నుంచి ఒక శాతం దాకా ఉండే విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఉదాహరణకు, షాపర్స్ స్టాప్..ముంబైలోని ఒక స్టోర్‌లో సోలార్ ప్యానెళ్లని అమర్చింది. నిర్వహణ భారం తగ్గించుకునే విధంగా తేలికపాటి విద్యుత్ పరికరాలను ఇందులో వాడుతోంది. అటు, స్పోర్ట్స్ లైఫ్‌స్టయిల్ దిగ్గజం ప్యూమా ..బెంగళూరులో ఎకో ఫ్రెండ్లీ స్టోరు ప్రారంభించింది. పాత డీవీడీ ప్లేయర్లు, సైకిళ్లు, టిఫిన్ బాక్సులు మొదలైన వాటిని రీసైకిల్ చేయగా వచ్చిన ఉక్కుతో ఈ బిల్డింగ్‌ను నిర్మించారు.
మరోవైపు మార్క్స్ అండ్ స్పెన్సర్.. ఢిల్లీలో సుమారు 20,000 చ.అ. మేర స్టోర్‌ని ప్రారంభించింది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని సంస్థ అని తెలిపింది. స్టోర్‌లోపల ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులేకుండా ఉండేలా చూసే గ్లాస్‌ని ఇందులో అమర్చినట్లు వివరించింది. ఇది హానికారక అల్ట్రావయోలెట్ కిరణాలను సైతం 90 శాతం వరకూ నిరోధించగలదు. అలాగే, సోలార్ రిఫ్లెక్టివ్ టైల్స్ వల్ల స్టోర్ చల్లగా ఉంటుంది. స్టోర్‌లో విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఎనర్జీ మీటర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

కోకాకోలా ‘ఎకోకూల్’ సోలార్ కూలర్లు

ఇక సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా కోలా విద్యుత్ ఆదా చర్యల కోసం 22 ప్రాంతాల్లో ఉన్న తమ బాట్లింగ్ ప్లాంట్ల భాగస్వామ్య సంస్థలతో చేతులు కలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి 1,000 ‘ఎకోకూల్’ సోలార్ కూలర్లను అమర్చడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా 5బై20 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద విద్యుత్ కొరత ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సైతం అమ్మకాలు పెంచుకునేందుకు స్థానిక రిటైలర్లకు సోలార్ కూలర్లను పంపిణీ చేస్తారు. ఈ కూలర్లు ఒక్కోటి 300 మిల్లీలీటర్లు ఉండే సుమారు 48 గాజు బాటిళ్లను చల్లబరిచి, నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇటు వ్యయాలను తగ్గించుకోవ డానికే కాకుండా అటు పర్యావరణానికీ మేలు చేసే విధంగా రిటైల్ సంస్థలు వ్యవహరిస్తుండటం మంచిదేనని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి వినూత్న ప్రయోగాలు మరిన్ని చూసే అవకాశం ఉండగలదని భావిస్తున్నారు.

పంటల పాఠాలమ్మ

రసాయన ఎరువుల్లో ఉపయోగించే నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటివాటికి ఆవర్తన పట్టికలో ఉండే స్థానాలూ ధర్మాలూ మర్మాలూ ఏమీ తెలియదు ఆ అమ్మకు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే...చేలల్లో చాళ్లలో వేళ్లు పారాడిస్తూ పంట నిండుగా పండాలంటే నేలకు సారం ఉండాలని! అందుకు రసాయనాల కంటే పేడ, పుట్టమట్టిలాంటివే గట్టివని! ఆ అనుభవంతో సేంద్రియ ఎరువనే పరుసవేదిని ఆకాశం స్లాబ్ కింద నేలతల్లి ఫ్లోరింగ్‌లోని నాలుగెకరాల చేను ల్యాబ్‌లో కనుక్కుందామె. ఆ పరుసవేదిని పంటకు ఆనించి బంగారం పండించితన చెలకలో ఆమె సృష్టించిన కలకలం ఢిల్లీలోని ‘కలెక్టర్ల కాలేజీ’ చెవులనూ తాకింది. అంతే... నేల మోటారునే అబ్బురంగా చూసే ఆమె గాలిమోటారుని నిబ్బరంగా ఎక్కి వచ్చింది. కాబోయే ‘జిల్లా దొరలకు’ పాఠాలు చెప్పడానికి ఢిల్లీ దాకా వెళ్లొచ్చిన లలితమ్మ స్ఫూర్తిదాయక కథనమే నేటి ప్రజాంశం.

పదేళ్ల కిత్రం లలితమ్మ రోజుకూలి. పొద్దునే కొడవలి పట్టుకుని పొలానికి వెళితేగాని పొట్టగడిచేది కాదు. సొంతంగా పొలం ఉన్నా...పెట్టుబడి పెట్టి పండించే స్తోమతలేక లలితమ్మ, ఆమె భర్త వ్యవసాయ పనులు చేసుకుని బతుకు బండినీడ్చారు. నాటి రోజుకూలి లలితమ్మే ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్లకు పాఠాలు చెప్పింది. మూడు నెలల క్రితం ఢిల్లీలోని లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వేదికగా లలితమ్మ పాఠాలు విన్న ట్రైనీ ఐఏఎస్‌లు హాలు దద్దరిల్లేలా చప్పట్లు కొట్టారు. ‘పుస్తకాల్లో అక్షరాలు కాదు...లలితమ్మలాంటి సాక్ష్యాలు’ కావాలంటూ శిక్షణలో ఉన్న కలెక్టర్లు సభాముఖంగా తెలియజేశారు. అవును, అధిక దిగుబడిని వచ్చే వ్యవసాయ పద్ధతుల్ని ల్యాబ్‌లో కాదు లైవ్‌గానే చేసి చూపించాలి. లలితమ్మ అదే చేసింది. సుస్థిర వ్యవసాయం పేరుతో అంతరించిపోతున్న పాత పంటల్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించి అధిక లాభాలు గడిస్తున్న లలితమ్మ తోటి రైతులందరికీ ఆదర్శంగా నిలబడడం వెనకున్న విశేషాలే ఈ వారం ప్రజాంశం.

"హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మీదిమోటార్ల (విమానం) తీస్కపోయిండ్రు. అక్కడ మసూర్కి పోవాలన్నరు. చూస్తే ఏప్రిల్ నెల...ఈడ ఎండలు మండుతుంటే... ఆడ మస్తు చలి. సెట్టర్లు కట్టుకుని పోయినం. గదేదో... చదువుకునే కాలేజి లెక్కుంది. పెద్ద హాలునిండ నల్లసూట్లు ఏసుకుని మస్తు జనమున్నరు. ఈడికెల్లి నాతోని ఇంకో నలుగురు ఆడోళ్లు వచ్చిండ్రు. లోపలికి పోంగనే రాండ్రి అనుకుంటూ మా చేతులు వట్టుకుని తీస్కపోయిండ్రు. ముందుగాల మమ్మల్ని తీస్కపోయిన రాయుడుసారు ఇంగ్లీష్‌ల మాట్లాడిండు. ఆ తర్వాత నన్ను మాట్లాడమన్నరు. నేను తెలుగుల చెబుతుంటే...గతే ముచ్చట ఆ సారు ఇంగ్లీష్‌ల చెప్పిండు’’ అని ఎంతో ఆనందంగా చెప్పింది లలితమ్మ. మెదక్‌జిల్లా జహిరాబాద్ మండలం రాయ్‌పల్లి గ్రామానికి చెందిన లలితమ్మ తన జీవితంలో మోటర్‌సైకిల్ కూడా ఎక్కుతాననుకోలేదు, ఏకంగా విమానంలో వెళ్లి ట్రైనీ ఐఏఎస్‌లకు క్లాస్‌లిచ్చింది.

సుస్థిర వ్యవసాయం

"గిప్పుడు తినే తిండిల బలంలేదు అంటున్నరు. అయినా తింటున్నరు. ఏం జేస్తరు. మందులేసి మందుల్ని పండించుకుంటున్నం. గదంత ఎందుకు పంట పండించేటోడే కరువైండు. ఇంక మందుల పంటలు, మంచి పంటల సంగతెక్కడిది. ఎవరైనా... పొలముంది కదా అని పంట పెడితే పెట్టిన సొమ్ము కూడా వస్తలేదు. పదేళ్లక్రితం నాది గూడ ఇదే కథ. అప్పుడు... ఇందిర క్రాంతి పథకం కింద సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి కొందరు సార్లు వచ్చి మాకు శిక్షణ ఇచ్చిండ్రు. మా చుట్టుపక్కల రైతులంతా మంచిగ విని ఊకుండ్రు. నాకు మాత్రం నచ్చి మా చేన్ల చాన ప్రయోగాలు చేసిన. ఇంకెవరో వచ్చి పాత పంటలకు ఇప్పుడు మస్తు గిరాకి ఉందని చెబితే వాటి గురించి ఆలోచన జేసిన’’ అంటూ తన తొలి అడుగుల గురించి పూసగుచ్చినట్టు వివరించింది లలితమ్మ. కొర్రలు, సామలు, తైదలు, పచ్చసజ్జలు, నల్లనువ్వులు వంటి పాత పంటల్ని పండించి పట్టణాలకు ఎగుమతి చేయడం సుస్థిర వ్యవసాయంలో లలితమ్మ ప్రత్యేకత.

ఎరువుల రహస్యం...

వ్యవసాయం పేరు చెప్పగానే రైతులకు రసాయన ఎరువుల ధరలు గుర్తుకొస్తాయి. ఏళ్ల అనుభవం ఉన్న రైతులు కూడా వ్యవసాయం పేరు చెప్పేటప్పటికి చేతులెత్తేసే పరిస్థితుల్లో లలితమ్మ అద్భుతమైన లాభాలు గడిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆమె సొంతంగా తయారుచేసుకుంటున్న సేంద్రీయ ఎరువులే. వాటి వెనకున్న రహస్యం కనుక్కోడానికే సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ)వారు ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి కలెక్టర్ల ముందు కూర్చుబెట్టారు. "ఢిల్లీల కలెక్టర్లకు నా వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పినంక ఒకాయన లేచి నేను తయారుచేసే ఘనజీవామృతం ఎరువు గురించి అడిగిండు. ఎట్లచేయాలో కూడా చెప్పమన్నడు. అన్నీ వివరంగా చెప్పినంక అందరూ లేచి నిలవడి తప్పట్లు కొట్టిండ్రు. వాళ్లనట్ల జూసేసరికి వంద ఎకరాలల్ల పంట ఊడ్చినంత సంతోషమొచ్చింది’’ అని ఎంతో గర్వంగా చెప్పిన లలితమ్మ కళ్లలో ఆకలి తీర్చే రైతన్నతో పాటు, తెలిసిన విద్యను పదిమందికి పంచిపెట్టే గురువు కూడా కనిపించాడు. ఘనజీవామృతం అంటే...పొలానికి వాడే సేంద్రీయ ఎరువు. "పది కిలోల పెండల రెండు కిలోల పప్పుల పొడి, రెండు కిలోల బెల్లం, ఒక కిలో పుట్టమట్టి, మూడు లీటర్ల ఆవు మూత్రం బోసి బాగ కలిపి ఎండవెట్టాలి. పది దినాల తర్వాత అది చాయిపత్త పొడిలా అయితది.. దాన్నిపొలంల యిత్తులు పెట్టినపుడు, కలుపుతీసినపుడు సల్లితే మొక్కలు దొడ్డుగ వెరుగుతయి. గీ సంగతే ఢిల్లీల కలెక్టర్లతో చెప్పిన. వాళ్లు పుస్తకంల రాసుకున్నరు’’ అని తన ఎరువుల తయారీ గురించి చెప్పింది లలితమ్మ.

అన్నీ తానై....

సుస్థిర వ్యవసాయం అంటే ఎరువుల్ని, విత్తనాల్ని రైతులే తయారుచేసుకోవాలి. ఓపికుంటే అమ్మకాలు కూడా రైతులే చేసుకుంటే పెట్టుబడిలేని వ్యాపారంలా సాగుతుంది. లలితమ్మ విజయం వెనకున్న కారణాలు ఇవే. తనకోసం మాత్రమే కాదు ఆ చుట్ట్టుపక్కల యాభై మంది రైతులకు సేంద్రీయ విత్తనాలను, ఎరువుల్ని అమ్ముతుంది కూడా. ప్రస్తుతం ఆమె పదమూడు రకాల సేంద్రీయ పంటల్ని పండిస్తోంది. అమ్మకం పని కూడా తనదే. దళారీల ప్రసక్తే రానివ్వదు. "పొలముంది కదా అని ఒకటే రకం పంట ఏసుకుంటే బొమ్మ బొరుసులెక్క ఉంటది. అట్లగాకుండా నాలుగైదు రకాల పంటలేసుకుంటే అమ్ముకోడానికి బాగుంటుంది. ఒకదాన్ల నష్టమొచ్చినా ఇంకోదాన్ల లాభమొస్తది. మన దగ్గర రైతులు ఎక్కువ తలకాయి నొప్పిలేకుండా పంట పండాలంటరు. వ్యవసాయంలా ఎంత ఓర్పు ఉంటే గంత లాభముంటది. పంట సరిగ రాకుంటే దేవుడా....అంట కూసుంటరు. మొక్క లేవకుంటే ఎంబడే పీకేసి కూరగాయలు పెట్టుకుని మార్కెట్‌కి ఏస్కుంటే కాలం కలిసొస్తది, సొమ్ములొస్తయి’’ లలితమ్మ ఆలోచనతో కాదు...అనుభవంతో చెప్పిన మాటలివి. ఐదేళ్లపాటు పాతపంటలపై రకరకాల ప్రయోగాలు చేసి, ఆ తర్వాత ఐదేళ్లలో సేంద్రీయ పంటల్లో ఎవ్వరూ ఊహించని విజయాలు సాధించింది. అందుకుగానూ మూడేళ్లక్రితం ప్రభుత్వంవారు ఉత్తమరైతు అవార్డు కూడా ఇచ్చారు.

తోటి రైతులకు...

కొర్రలు తింటే స్థూలకాయం తగ్గుతుంది. సజ్జలు మంచి న్యూట్రిషన్, తైదలు శక్తినిస్తాయి. మరివన్నీ ఎక్కడ దొరుకుతాయి? అక్కడక్కడ తప్ప ఎక్కడబడితే అక్కడ అందుబాటులో లేవు. ఈ విషయాన్ని గ్రహించిన లలితమ్మ లాభాలరైతుగా పేరు తెచ్చుకుంది. ఆమె విత్తనాలకు, ఎరువులకు, ఆహార ధాన్యాలకు విపరీతమైన గిరాకి ఉంది. అలాగని లలితమ్మ తన వ్యవసాయాన్ని పదుల ఎకరాలకు విస్తరింపచేయలేదు. తనకున్న నాలుగెకరాల్లోనే ప్రయోగాలైనా, పంటలైనా. తన వ్యవసాయ పనులతో పాటు తన గ్రామంలో ఉన్న రైతులకు, చుట్టుపక్కల సేంద్రీయ పద్ధతుల్లో పంటలు వేసే రైతులకు లలితమ్మ ఉచితంగా శిక్షణ ఇస్తోంది. ఏ రైతుకొచ్చిన ఇబ్బంది అయినా, సందేహమైనా తీర్చేవరకూ లలితమ్మకు నిద్ర పట్టదు. మొక్క పెట్టే దగ్గర నుంచి మార్కెట్ కెళ్లేవరకూ ఆ చుట్టుపక్కల రైతులకు లలితమ్మ అండగా నిలబడుతుంది. గురువులు పాఠాలు మాత్రమే చెబుతారు. లలితమ్మ పాఠాలు చెపుతూనే ప్రాక్టికల్స్ చేసి చూపిస్తోంది. వాటిలో పొరపాటు జరక్కుండా కాపాడుతుంది కూడా. అందుకే ఈమె టీచింగ్‌కి కాబోయే కలెక్టర్లుసైతం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

మొక్క పెట్టే దగ్గర నుంచి మార్కెట్‌కెళ్లేవరకూ ఆ చుట్టుపక్కల రైతులకు లలితమ్మ అండగా నిలబడుతుం

కిసాన్‌రాజా

భార్యాబాధితుల సంఘం

మా అన్నలాంటి రైతులకోసం–’కిసాన్‌రాజా’

నువ్వు ఇంత పెద్ద ఇంజనీరువి. రైతులకు సాయం చేసేలా ఏమైనా చెయ్యచ్చు కదా? నన్ను సిటీకి తీసుకెళ్లడం కాదు, చేతనైతే ఇక్కడే ఉంచి నా పని సులువు చేసే మార్గాలు చూడు‘ అన్నాడాయన. ఆ మాటే మంత్రంలా పనిచేసిందీ యువకుడి మీద.
పల్లెలో వ్యవసాయమంటే మాటలా? కరెంటుంటే నీళ్లుండవు, నీళ్లుంటే కరెంటుండదు. ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్తు వల్ల రైతులకెన్నో కష్టాలు. మొబైల్ సాయంతో చేలో ఉన్న మోటార్ పంపును నియంత్రించాలనే ఆలోచనలు, ప్రయోగాలు చేస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే వాటిని ఆచరణలో పెట్టి ’కిసాన్‌రాజా‘ అనే పరికరంగా రూపొందించి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది మాత్రం కడప జిల్లాకు చెందిన రైతు బిడ్డ దిన్నెపు విజయభాస్కర్‌రెడ్డి. పేటెంటు పొందే క్యూలో అందరికన్నా ముందు నిలబడిన‘కిసాన్‌రాజా‘ ఇప్పటికే రెండువేల మంది వ్యవసాయదారుల కరెంటు కష్టాల్ని గట్టెక్కించింది.

కడప జిల్లా కాశినాయన మండలం బాలాయపల్లె గ్రామంలో సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిపెరిగిన దిన్నెపు విజయభాస్కర్‌రెడ్డికి పన్నెండేళ్లు వచ్చేవరకూ కరెంటంటే ఎలా ఉంటుందో తెలియదు. ’టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని వాతావరణం నుంచి రావడంతో దానిపట్ల ఆసక్తి నాలో రెండింతలయింది. అందుకే నాకు సాంకేతిక త అంటే మక్కువ ఎక్కువ’ అంటారాయన.

1997లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి మరో రెండేళ్లకు మద్రాసు ఐఐటి నుంచి ఎంటెక్ పట్టా అందుకున్న ఈ యువకుడు విప్రో, ఇంటెల్, సిస్కో వంటి సంస్థల్లో పనిచేస్తున్నా,అమెరికాలో ఉంటున్నా ఏదో తెలియని వెలితి అతన్ని వెంటాడేది. అందుకే 2003లో బెంగుళూరు వచ్చేసి విన్‌ఫైనెట్ టెక్నాలజీస్ అనే సంస్థను ప్రారంభించాడు.

ఒకరోజు ఊరె ళ్లినప్పుడు అన్నయ్య వెంకటకృష్ణారెడ్డి దూరాన ఉన్న చేనుకు నీళ్లు పెట్టడానికి అర్థరాత్రి బయటకెళ్లడం కంటపడింది. ’నేను సాయం చేస్తా, నగరానికొచ్చి వేరే ఉపాధి వెతుక్కో…’ అన్నాడు తమ్ముడు విజయభాస్కర్.

‘నువ్వు ఇంత పెద్ద ఇంజనీరువి. రైతులకు సాయం చేసేలా ఏమైనా చెయ్యచ్చు కదా? నన్ను సిటీకి తీసుకెళ్లడం కాదు, చేతనైతే ఇక్కడే ఉంచి నా పని సులువు చేసే మార్గాలు చూడు’ అన్నాడాయన. ఆ మాటే మంత్రంలా పనిచేసిందీ యువకుడి మీద.

తన అన్నయ్యనంటే సిటీకి తీసుకెళ్లగలడు. కానీ అందరు రైతులనూ వ్యవసాయానికి దూరంగా జరగమని చెప్పగలడా? రైతు కుటుంబం నుంచి వచ్చి సాటివారికి సాయపడకపోతే ఎలా? ఈ ప్రశ్నలు ఆయన్ని కుదురుగా ఉండనివ్వలేదు. ముఖ్యంగా పల్లెల్లో కరెంటు అప్పుడప్పుడూ వస్తూపోతూ ఉంటుంది.లోఓల్టేజ్ వల్ల మోటార్లు నడవవు. పొలానికి వెళ్లిరావాలంటే దూరం. అక్కడే పడుకోవాలంటే చలి, దోమలు, పాములు పురుగూపుట్రా. రెండు చేలుండి రెండు మోటార్లుంటే ఒకటి వేసి మరోదాని దగ్గరకు పరుగెత్తాలి. ఈ కష్టాలన్నిటినీ నివారించడానికి వచ్చిందే ’కిసాన్‌రాజా’ ఆలోచన.

ఈ పరికరం సాయంతో చేలో ఉన్న మోటార్ పంపును మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. 2010 ఆగస్ట్‌లో రూపుదిద్దుకున్న ఈ పరికరం 2011లో సామ్‌సంగ్ ఇన్నొవేషన్ అవార్డ్‌తో పాటు జాతీయస్థాయిలో కొత్త ఆవిష్కరణలకు ఇచ్చే అనేక పురస్కారాలను అందుకుంది. జీఎస్ఎమ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఈ పరికరం ఒక యూనిట్ ఖరీదు దాదాపు 6000 రూపాయలు. గడచిన రెండేళ్లలో 2000 యూనిట్లు అమ్ముడుపోయిన ’కిసాన్‌రాజా’కు ఈ వేసవిలో మరో వెయ్యి వరకూ అమ్ముడుపోయేంత డిమాండ్ ఉంది.

తయారు చెయ్యడం సరే, దాన్ని రైతుల దగ్గరకు తీసుకెళ్లేదెలా? దీని పనితీరు గురించి వారికి అవగాహన కలిగించేదెలా?అమ్మకాల సంగతేమిటి? మొదట్లో తన బృందంతోనే వీటిని చెయ్యాలనుకున్న విజయభాస్కర్ నెమ్మదిగా అది అసాధ్యమని తెలుసుకున్నారు. గ్రామాల్లో రైతులకు ’కిసాన్‌రాజా’ గురించి తెలియజెప్పడానికి స్థానికులయితేనే మంచిదన్న విషయమూ తెలిసొచ్చింది. దాంతో ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను అమ్మే డీలర్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నారు. ప్రతి పరికరం మీదా డీలర్లకు పదిహేను శాతం లాభం ఉంటుంది.

‘అప్పుడే ఏమయింది? ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పెరగాలి. మరిన్ని సర్వీస్ సెంటర్లు అందుబాటులోకి రావాలి. అప్పుడే అది రైతులకు అందుబాటులోకి వచ్చినట్టు…’ అంటున్నారు విజయ్‌భాస్కర్.

ఒకసారి తయారు చేసి ఊరుకోవడం కాకుండా ఈ పరికరానికి ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తున్నారాయన. మొదట్లో కిసాన్‌రాజా ఎనిమిది కిలోల బరువుండేది. అదిగాక బ్యాటరీలను విడిగా అమర్చాల్సి వచ్చేది. డిజైన్‌లో మార్పుచేర్పులు చేసి సెల్‌ఫోన్లలో ఉండే లిథియమ్-అయాన్ బ్యాటరీలను అమర్చాక దాని ఆకారమూ బరువూ రెండూ తగ్గిపోయాయి. ఓల్టేజ్‌లో హెచ్చుతగ్గులను తట్టుకోవడం కోసం దీన్ని 300 -500 వాట్ల రేంజ్‌కు రూపొందించారు. సెల్‌ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చే ఐవీఆర్ భాష కూడా అయోమయంగా ఉండటంతో రైతులు ఇబ్బంది పడేవాళ్లు. నెమ్మదిగా దాన్ని కూడా మార్చడంతో ఇప్పుడు వాళ్లకు వాడకం సులువయింది.

ఇక్కడితో అయిపోయినట్టేం కాదు. ’కిసాన్‌రాజాను ఎప్పటికప్పుడు మరింత సులభతరంగా రూపొందించడానికి మేం కృషిచేస్తున్నాం.800 గ్రాముల బరువు, కనీస సౌకర్యాలతో మూడున్నర వేలకే అందించేలా డిజైన్ చేస్తున్నాం.

అలాగే ఏడున్నర వేల రూపాయల్లో లభించే పరికరం ఒకటి కన్నా ఎక్కువ మోటర్లున్నప్పుడు బిగించుకోవచ్చు. అలాగే ఇకపై రాబోయే పరికరాలు ప్లాస్టిక్‌తో చేస్తున్నవి, నీళ్లు పడినా ఏమీ కాదు’ అని ధీమాగా చెబుతున్న విజయ్‌భాస్కర్ బృందం మోటర్ల నుంచి పడే నీటిధారను నియంత్రించే వాల్వ్‌లనూ వాల్వ్ అమర్చబోతున్నారు.

మన రాష్ట్రమే కాదు,అటు కర్నాటక రైతులూ ఈ పరికరం గురించి ఆసక్తి చూపిస్తున్నారు. మైసూరు దగ్గర రెండున్నర ఎకరాల్లో అరటి సాగుచేసే పాటిల్ అనే రైతు కిసాన్‌రాజాను సుమారు రెండేళ్లుగా ఉపయోగిస్తున్నారు.

‘మా ఇంటి నుంచి పొలానికి 20కి.మీ. దూరం. అర్ధరాత్రి తర్వాతే మాకు మూడు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుంది. ఆ సమయంలో అంత దూరం వెళ్లి రావడమంటే ఎంతో కష్టం. ఆ కష్టాన్నంతా త గ్గించిందీ పరికరం’అంటున్నాడాయన. దీని గురించి ప్రచారం చెయ్యడానికీ, అమ్మకాలను పెంచడానికీ నిరుద్యోగ యువకులు ముందుకొస్తే వారికీ లాభసాటిగా ఉంటుందని హామీనిస్తున్న విజయ్‌భాస్కర్ తన ప్రయత్నాల వల్ల రైతు కష్టం ఏమాత్రం తీరినా సంతోషమేనంటున్నారు.

కిసాన్‌రాజా ఎలా పనిచేస్తుందంటే..

మామూలుగా మోటార్ పంపు పనిచెయ్యాలంటే త్రీ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ ఉండాలి. ప్రతి ఫేజ్‌కూ మధ్య 440వాట్ల అంతరం ఉండాలి. విద్యుత్ ఇక్కడి నుంచి స్టార్టర్‌కు వెళ్లి మోటార్ నడిచేలా చేస్తుంది. కిసాన్‌రాజా పరికరం ఒకటింపావు కేజీల బరువుంటుంది. పవర్‌కూ స్టార్టర్‌కూ మధ్య దీన్ని బిగించాలి. ఇది ఒక రిమోట్ కంట్రోల్‌లాగా పనిచేసి స్టార్టర్‌ను ఆన్ అయేలా చేస్తుంది. ఒకవేళ మోటార్ మొదలవాల్సిన సమయానికి విద్యుత్ లేకపోతే కనుక, కిసాన్‌రాజాలో అమర్చిన సాఫ్ట్‌వేర్ మోటర్ ఎంతసేపు నడవాలో లెక్కపెట్టి కరెంటు రాగానే నడుపుతుంది.

మొబైల్ ఫోన్‌లోని అన్ని కమాండ్లూ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ముందే పెట్టేస్తారు. రైతు కేవలం ఫోన్లో నెంబర్ నొక్కితే చాలు. ఓల్టేజ్‌లో హెచ్చుతగ్గులు, వైర్లు కట్టయి ఉండటాలు, దొంగతనాలు, డ్రై అయిపోవడం వంటివి ఉంటే, రైతుకు వెంటనే అలారం మోగిస్తుందీ పరికరం. భూమి లోపలి అమర్చే సబ్‌మెర్జ్‌డ్ మోటార్లకు కూడా దీన్ని బిగించవచ్చు. భద్రత కోసం మరొక అంశమూ ఉంది. అదేమంటే దానిలో ఫీడ్ చెయ్యని నెంబర్లను నొక్కడం కుదరదు. అలా ఎవరైనా నొక్కాలని ప్రయత్నిస్తే అప్పుడది కోడ్ అడుగుతుంది.

కిసాన్‌రాజా ఫోన్ నెంబర్లు:
09980010810
09989374566అరుణ పప్పు

ఈ విషయం పై సాక్షి లో మరో వ్యాసం

ఆధారము: అగ్రికల్చర్ గేట్వే బ్లాగ్

కిచెన్ గార్డెన్

ఇంటిపంట

రసాయన ఎరువులతో పండించే కాయగూరలు తింటూ మనం ఎదుర్కొంటున్న ఆరోగ్యసమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీసం ఆకుకూరలైన సేంద్రీయ ఎరువులతో పండించుకుని తినే భాగ్యం మనకు లేదా? అని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. అలాంటివారికి కిచెన్‌గార్డెనింగ్ చాలా సాయపడుతుంది. ఓ నాలుగు మట్టి కుండీలు, ఆకుకూరల విత్తనాలు చేతిలో ఉంటే ఎంచక్కా మీరే స్వయంగా సేంద్రీయ పంటలు పండించుకోవచ్చు.

ఆకుకూరలతో ఆరంభం...
ఒకటి లేదా రెండు కుండీలతో ఆకుకూరల సాగు సరదాగా మొదలు పెట్టొచ్చు. ఆకుకూరలకు ఆరు అంగుళాల కన్నా లోతు మట్టి అవసరం లేదు. వెడల్పు ఎక్కువ, ఎత్తు తక్కువ ఉండే కుండీలు/ట్రేలు/మడులలో ఆకుకూరలు ఎంచక్కా సాగు చేయొచ్చు. మొదట.. ఎర్రమట్టి, చివికిన పశువుల ఎరువు / వర్మీకంపోస్టు సమపాళ్లలో కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి. కొబ్బరి పొట్టు, వేపపిండి కొంచెం కలిపితే మంచిది. కుండీ అడుగున బెజ్జం మీద కుండ పెంకులు లేదా రాళ్లతో కప్పండి(ఈ బెజ్జం పూడిపోకుండా ఉంటేనే.. అదనపు నీరు బయటకుపోతుంది. కుండీలో నీరు నిలబడితే మొక్కకు నష్టం). ఆ తర్వాత కుండీ అడుగున అంగుళం మందాన ఎండు ఆకులు వేసి.. పైన మట్టి మిశ్రమం పోయండి. మట్టి నింపిన రోజే విత్తనాలు చల్లకండి. నీరు పోస్తూ ఒకటి, రెండు రోజులు కుండీ సాగు సిద్ధమయ్యాక.. విత్తనాలు చల్లండి లేదా మొక్కలు నాటండి.

ఏ కాలమైనా...
విత్తనాలు లేవా? పర్లేదు. పోపు డబ్బాలో మెంతులు ఉన్నాయి కదా? మెంతి కూర ఎంత ఆరోగ్యమో మీకు తెలుసు కదా! గుప్పెడు మెంతులు తీసుకొని కుండీలో చల్లండి. వాటిపైన పల్చగా మట్టి వేసి.. నెమ్మదిగా నీటిని చిలకరించండి. మొక్కలు మొలిచే వరకూ తడి ఆరకుండా చూడండి. మొలకలొచ్చే వరకు పైన ఎండు ఆకులు కప్పితే మరీ మంచిది. కుండీలో/ట్రేలో మట్టి ఏకాలంలోనైనా తడీపొడిగా ఉండాలి. నీరు నిలవ కూడదు.. అంతే! వారం/పది రోజుల్లో ముచ్చటైన బేబీ మెంతి కూర పచ్చగా పలకరిస్తుంది! మెంతికూర ఒక్కటేనా? పాలకూర, చుక్కకూర.. ఒకటేమిటి ఆకుకూరలేవైనా.. ఏ కాలంలోనైనా సాగు చేయొచ్చు. అలాగే కొత్తిమీర పెంచుకోవాలంటే కూడా ఇదే పద్ధతిని అనుసరించాల్సిందే. అయితే ధనియాలను యథాతథంగా చల్లకూడదు. బాగా పలుకులుగా నలిచి ఆ తర్వాత చల్లాలి. చేత్తో నలిపితే ధనియంలోని గింజ బయటకు రాదు, ధనియాలను నేల మీద వేసి గట్టి అట్టముక్కతో నలపాలి.

కుంకుమపువ్వు - వంటింటి పువ్వు...

కుంకుమపువ్వు... పిల్లలు తెల్లగా పుట్టడం కోసం గర్భిణులకు ఇచ్చే ఔషధంగా సుపరిచితం. ఈ కుంకుమపువ్వు ప్రధానంగా స్పెయిన్, ఇరాన్, భారతదేశాలలో పండుతుంది. అయితే కాశ్మీరులో లభించే కుంకుమపువ్వునే ఉత్తమమైనదిగా భావిస్తారు. వందలకొలదీ సంవత్సరాలుగా ఇది కాశ్మీరులో విస్తృతంగా పండుతోంది. దీనిని మొదట గ్రీసుదేశంలో పండించేవారు. భారతదేశంలో కుంకుమపువ్వు అత్యధికంగా కాశ్మీరులో పండుతుంది. దీనిని క్రోకస్ పువ్వు నుంచి తీస్తారు. పువ్వులలోని కేసరాలను వేరుచేస్తే కుంకుమపువ్వు లభిస్తుంది.

అతి చిన్న గ్రామమైన పాంపోర్‌లో వేలకొలదీ హెక్టార్ల భూమిలో ఈ పంట సాగుబడి జరుగుతోంది. ఈ ప్రాంతం కాశ్మీరు రాజధాని అయిన శ్రీనగర్‌కి కేవలం అరగంట ప్రయాణ దూరంలో ఉంది. పాంపోర్‌ని ‘కాశ్మీరీ కుంకుమపువ్వు గ్రామం’గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాల నడుమ ఊదారంగులో ఉండే ఈ పూవులు కనువిందు చేస్తాయి.

దాదాపు 75000 పూలనుంచి కేవలం అరకిలో కన్నా తక్కువ కుంకుమపువ్వు మాత్రమే వస్తుంది. అందుకే కిలో కుంకుమపువ్వు ఖరీదు లక్షాఎనభై వేల రూపాయలు. అన్నట్లు కాశ్మీర్‌లో కుంకుమపువ్వు టీ ప్రత్యేకం. కేహ్వా అనే పానీయాన్ని... దాల్చినచెక్క, ఏలకులు, కుంకుమపువ్వులను వేడినీటిలో వేసి మరిగించి, తేనె, బాదంపప్పు తరుగు జతచేసి తయారుచేస్తారు. ఇది బలాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం.

సారవంతంగా... జీవితపు సాగు

ఆమె ఒక సామాన్య రైతు... జీవనం కోసం వ్యవసాయాన్ని ఎంచుకొంది... సేంద్రియ ఎరువులనుఉపయోగించి పత్తి పండించింది... పంట దిగుబడిని రెట్టింపు చేసింది... నేలను మరింతసారవంతం చేసింది... నీటి వాడకాన్ని తగ్గించింది... ఇరవై సంవత్సరాల అవిశ్రాంత కృషి...పనిపట్ల ఉన్న అంకితభావం... ఆమెను గొప్ప రైతుగా మార్చాయి...
తమిళనాడు ఈరోడ్ జిల్లా వెల్లితిరుప్పూర్‌కి చెందినసామాన్య రైతుసామాన్య రైతు ఒక సామాన్యమహిళ. ఇరవై సంవత్సరాల క్రితం భర్త మరణించాడు. అప్పటికి ఆమెకు ముగ్గురు పిల్లలు.వారిని ఒంటి చేత్తో ఎలా పెంచాలో ఆమెకు అర్థం కాలేదు. పెద్దగా చదువుకోలేదు కనుక, పెద్ద పెద్దఉద్యోగాలు చేసే శక్తి లేదు. కాని కళ్ల ముందు ముగ్గురు పిల్లల భవిష్యత్తు, బాధ్యతకదలాడుతున్నాయి. వారిని ఎలా పెంచాలో ఆమెకు పాలుపోలేదు. ఆ సమయంలో రోజుగడవడం కోసం వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంది.

మామూలుగా వ్యవసాయం చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి ఆమె దగ్గరఅంత ధనం లేదు. వ్యవసాయం ఎలా చేయాలో ఆమెకు పాలుపోలేదు. ఇంతలో కొందరు వ్యక్తులద్వారా, సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంట దిగుబడిని పెంచవచ్చునని తెలుసుకుంది.పత్తి పంట పండిస్తే లాభాలు అధికంగా వస్తాయని తెలుసుకుంది. సేంద్రియ ఎరువులనుతీసుకువచ్చి తన పొలంలో వేసింది. నేలను సారవంతం చేసింది. పత్తి విత్తనాలు జల్లింది.ఊహించని విధంగా పంట ఏపుగా పెరిగి, దిగుబడి మూడు రెట్లు అధికంగా వచ్చింది. ఆమెఆనందానికి అవధులు లేవు. తన కష్టాలు ఇక గట్టెక్కినట్లే అనుకుంది.

సేంద్రియమే ఎందుకంటే...

సేంద్రియ ఎరువుల వినియోగానికి అధికంగా డబ్బు వెచ్చించనక్కరలేదు. కాని దిగుబడి మాత్రంఅధికంగా ఉంటోంది. అందువల్ల కలైవాణి గత కొన్ని సంవత్సరాలుగా తన దృష్టిని సేంద్రియఎరువులు ఉపయోగించి పత్తిని పండించడం మీదే కేంద్రీకరించింది. తరచుగా పత్తి రైతులఆత్మహత్యల గురించి వింటున్న నేపథ్యంలో ఈమె పత్తిని ఎంచుకోవడం సాహసమే అని ఎవరైనాఅంటే, "సేంద్రియ విధానంలో పత్తి పండిస్తే, దీనిని మించిన లాభసాటి వ్యాపారం లేదు. పంచగవ్య,జీవామృతం... ఈ రెండింటిలోనూ ఆవు పేడ ప్రధాన వస్తువు. వీటి వాడకం వలన కేవలం పంటదిగుబడి పెరగడమే కాకుండా, భూమి మరింత సారవంతమవుతుంది. వీటి తయారీకి ఏమంతపెద్ద ఖర్చు కాదు. జంతువుల విసర్జకాలను సేకరించి, ఎరువులు తయారుచేసి పంటలకువినియోగించి పంట దిగుబడిని పెంచుకోవచ్చు’’ అని అందరికీ విజ్ఞానాన్ని పంచుతోంది కలైవాణి.

ఖర్చు తక్కువ... గిరాకీ ఎక్కువ...
పత్తి పంట ఆరునెలలలో దిగుబడికి వస్తుంది. పంట వేసిన ఒకటిన్నర నెలలకే చెట్టు పూతకువస్తుంది. రెండు నెలలకు కాయ రూపంలోకి మారుతుంది. నాలుగు నెలలు పూర్తయ్యాకకాయలు నెమ్మదిగా పగలడం ప్రారంభమవుతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు పత్తి చేతికివస్తుంది.
రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన పత్తి కంటె, సేంద్రియ ఎరువులతో పండించినపత్తికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రసాయన ఎరువులను ఉపయోగించి పండించిన పత్తి కేవలంఆరు నెలలు మాత్రమే చెడిపోకుండా ఉంటుంది. అదే సేంద్రియ ఎరువులను ఉపయోగించిపండించిన పంట, ఆరు నెలల తరువాత కూడా చెడిపోకుండా ఉంటుంది. అందువల్ల అధిక పత్తి...అధిక లాభం... మరొక లాభం కూడా ఉంది.
ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వల్ల భూమి సారవంతం కావడమే కాకుండా, నీటివినియోగం కూడా బాగా తగ్గుతుంది’’ అని చెప్పే కలైవాణి తీరిక సమయాలలో అనేక గ్రామాలకువెళ్లి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చే సే విధానం, వాటి వలన కలిగే లాభాలు... వంటి ఎన్నోవిషయాలు చెబుతూ అనేకమందిని చైతన్యవంతుల్ని చేస్తున్నారు.
(ఆమెను 098654 85221 నంబరులో నేరుగా సంప్రతించవచ్చు.)

పంట పండించుకోవడానికి మనదంటూ విత్తనం లేకుండా పోతోంది. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నాడో సాధారణ రైతు. దేశవాళీ విత్తనాలను కాపాడేందుకు వీలైనంతగా శ్రమిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతానికి చెందిన జై ప్రకాశ్ సింగ్ చేస్తున్న కృషి, సాధించిన విజయం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మామూలు రైతు ఇప్పటి దాకా 460 రకాల దేశవాళీ వరి విత్తనాలు, 120 రకాల గోదుమ విత్తనాలు, 30 రకాల పప్పు ధాన్యాల విత్తనాలు, 4 రకాల ఆవాల విత్తనాలను భద్రపరిచాడు. ఈ దేశవాళీ విత్తనాలతో రైతులు ఎవరైనా సరే ఆ యా పంటలు వేసుకొని, భారీగా దిగుబడులు సాధించవచ్చని సాక్షాత్తూ సర్కారు వారు కూడా రాజముద్ర వేశారు.

అన్నదాత జై ప్రకాశ్ సింగ్ కాపాడిన దేశవాళీ గోదుమ విత్తన రకంతో పంట వేస్తే, హెక్టారుకు ఏడు టన్నులకు పైగా పంట పండుతోంది. అలాగే, సర్వసాధారణంగా దీర్ఘకాలం పట్టే వరి రకంతో పంట చేతికి రావడానికి 150 నుంచి 160 రోజులు పడుతుంది. కానీ, జై ప్రకాశ్ దగ్గరున్న వరి కేవలం 130 రోజులకే విరగపండుతుంది. ఇలా ఆయన కాపాడుతున్న బ్రహ్మాండమైన దేశవాళీ విత్తనాలు, వాటి లక్షణాలపై ఇప్పటికే దేశం నలుమూలల నుంచి పలు వ్యవసాయ, పరిశోధక సంస్థలు పరిశోధన సాగించాయి. వారణాసికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని తండియా గ్రామం ఈ రైతు - శాస్త్రవేత్తది. కేవలం 60 గడపలున్న గ్రామం అది. చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, పదో తరగతి తప్పాక, ఆయన చదువు కొనసాగించలేక పోయాడు. అదే సమయంలో ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన తండ్రి ఆయనను చదివించలేకపోయారు. తరువాతి రోజుల్లో క్రమంగా సేద్యం వైపు ఆకర్షితుడైన జై ప్రకాశ్ పంటపొలాల్లో తన ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాలు, సేద్యాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేయాలనే కృషే ఇవాళ ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.

దాదాపు పాతికేళ్ళుగా సాగుతున్న తన కృషి దేశంలోని రైతులందరికీ ఉపయోగపడాలన్నది ఈ ఆదర్శ రైతు ఆశయం. అందుకే ఆయన తాను కాపాడుతున్న ఈ దేశవాళీ విత్తన రకాలను విక్రయించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నారు. తన దగ్గర కొన్న విత్తనాలను వేరే ఎవరికైనా విక్రయించాలనుకుంటే, కొన్న ధరకే విక్రయించాలంటూ ఏకంగా పత్రాల మీద సంతకాలు కూడా చేయించుకుంటున్నారు. ‘విత్తనాల కోసం భారీగా పెట్టుబడి పెట్టలేని చిన్న సన్నకారు రైతులందరికీ ఈ దేశవాళీ రకాలను అందుబాటులో ఉంచాలన్నదే నా ప్రయత్నం’ అని గర్వంగా చెబుతారు. దేశానికి అన్నభిక్ష పెట్టడం కోసం ఈ సామాన్యుడు సాగిస్తున్న కృషి చూసి సర్కారు వారు సైతం సలామ్ చేశారు. వందలాది దేశవాళీ విత్తన రకాలను కాపాడి, అందుబాటులో ఉంచుతున్నందుకు గాను జై ప్రకాశ్ సింగ్ 2002లో, 2009లో రెండు సార్లు అప్పటి రాష్ట్రపతుల నుంచి అవార్డులు అందుకున్నారు. అలాగే, ‘ప్లాంట్ జీనోమ్’ అవార్డు కూడా దక్కింది.

ఈ ఆదర్శ వ్యవసాయదారుడు మాత్రం వచ్చిన అవార్డులను చూసుకొని మురిసిపోవడం లేదు. ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందంటూ వ్యవస్థను నిలదీస్తున్నాడు. "రానున్న ఆహార కొరతను అధిగమించాలంటే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ దేశవాళీ విత్తనాలను పరిరక్షించుకోవడం, సమర్థంగా వాడడం అవసరమని మన ప్రభుత్వాలు గ్రహించాలి. జన్యుమార్పిడి విత్తనాలకూ, వాటి సేద్యానికీ అనవసరంగా బోలెడంత డబ్బు తగలేస్తున్నాం’’అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. దేశం కోసం తపన ఉన్న ఇలాంటి అన్నదాత కృషిని అవార్డులతో కాక, ఆచరణలో ప్రోత్సహిస్తే, వందల రకాల దేశవాళీ విత్తనాలను కాపాడగలిగితే మన జన్మభూమిని బంగారుభూమిగా మార్చుకోవడం కష్టమేమీ కాదు.

ఇల్లెక్కిన తోట...

రాజుల కాలంలో డాబాల మీద చంద్రశాల ఉండేదని కథలలో విన్నాం... వాటినే ఇప్పుడు ఇంటి మీద తోటగా నిర్మిస్తున్నారు... అవే టై గార్డెన్‌లు. ఇవి కంటికి పచ్చదనం, ఒంటికి ఆరోగ్యం రెండూ ఇస్తున్నాయి...

మహానగరాలలో ఎక్కడ చూసినా బహుళ అంతస్థులు, పచ్చిక కనిపించకుండా సిమెంటు రోడ్లు, బిజీబిజీ జీవనశైలి. ఇక స్వచ్ఛమైనగాలికి చోటేది? ప్రశాంత వాతావరణంలో కాలుష్యం లేని గాలి పీల్చుకోవడానికి పార్కులే శరణ్యం అయ్యాయి. అయితే అక్కడకు వెళ్లేంత తీరిక ఏదీ? అటువంటి వారికోసం ఏర్పడినవే టై గార్డెన్‌లు. టై గార్డెన్ అనేది చాలా సంవత్సరాలుగా సంపన్న వర్గాలకే పరిమితమై ఉంది. ప్రస్తుతం ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి.

ఇలా తయారుచేసుకోవాలి...

టై గార్డెన్‌ని ఏర్పాటు చేసుకోవడానికి, ముఖ్యంగా మనకు ఎంత స్థలం ఉందో, ఎండ ఎటు వైపు నుంచి ఎటు పడుతోందో చూసుకోవాలి టై గార్డెన్‌ని ఏర్పాటు చేయడానికి ముందుగా స్లాబ్‌ని లీక్ ప్రూఫ్ చేయించుకోవాలి. ఆ తరువాత జి.ఐ.టెక్స్‌టైల్ అండ్ డ్రెయిన్ సెల్స్ అండ్ బర్న్‌ట్ బ్రిక్స్ వేయాలి ఎర్రమట్టి, ఇతర ముడిపదార్థాలు వేసే ముందు ఆ బరువుని స్లాబ్ తట్టుకుంటుందా? లేదా? గమనించాలి వర్షం వ చ్చినప్పుడు నీళ్లు ఎటు వెళ్లాలో ముందుగానే చూసుకోవాలి అవగాహన లేకుండా ఎర్రమట్టి, ఇతర ముడిపదార్థాలు వాడేస్తే, స్లాబ్ బరువు పెరిగి నీళ్లు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. నిపుణులైన లాండ్‌స్కేప్ డిజైనర్‌ల సలహాలతో చేయించుకోవటం మంచిది.

టై గార్డెన్ వల్ల ఉపయోగాలు...

స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది ఇంటి పరిసర ప్రాంతంలో దుమ్ము ధూళిని గ్రహించి కాలుష్య రహితంగా ఉంచుతుంది ఇంటిని చల్లగా ఉంచుతుంది వేసవికాలంలో సాయంకాలాలు సేద తీరుస్తూ, శరీరానికి హాయినిస్తుంది మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న అనుభూతిని కలిగిస్తుంది.
- డా. వైజయంతి

అందంగా ఉండ టానికి...

పూలమొక్కలు, పూలతీగలలాంటి సీజనల్ ప్లాంట్స్ పెట్టుకోవటం వల్ల టై గార్డెన్‌కి శోభ వస్తుంది విద్యుద్దీపాలు ఏర్పాటుచేసుకుంటే సాయంత్రాలు తారకలు నేల మీదకు వచ్చిన అనుభూతి కలుగుతుంది స్థలాన్ని బట్టి ఊయల లేదా సిమెంట్ బెంచ్‌లుఏర్పాటుచేసుకోవడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి, వెన్నెలలో భోజనం చేస్తూ ఆనందించడానికి అవకాశం ఉంటుంది వాటర్ ఫాల్ కాని వాటర్ ఫౌంటెయిన్ కాని ఏర్పాటుచేసుకోవచ్చు. లోటస్ పాండ్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.
- కె.పి.రావు,
వెంకటేశ్వర నర్సరీ అండ్ గార్డెన్స్

పంటమార్పిడితో ప్రయోజనం

నిజామాబాద్ వ్యవసాయం : ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వేస్తూ ఉంటే దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. చాలామంది రైతులు నేటికీ ఒకేరకమై పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుందని జేడీఏ నర్సింహా తెలిపారు. రబీలో ఆలస్యంగా సాగుచేస్తున్న రైతులకు ‘పంటమార్పిడి విధానం’పై పలు సూచనలు చేశారు.

అవగాహన అవసరం

పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది. దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఒకరిని చూసి మరొకరు వేసిన పంటేనే వేస్తూ నష్టాలపాలవుతున్నారు. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల చీడపీడల బెడద అస్పలుండదు. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర తెగుళ్లను దూరం చేయవచ్చు. బీజాలు వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి ఎక్కువవుతుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందవు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది.

రైతులు గమనించాల్సినవి

భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.
తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి.
వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి.
బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.

జాగ్రత్తలు
పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి.
ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలను వేయడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి.
దీని వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు.
పత్తి పైరు సాగు చేసిన నేలలో మినుము, పెసర వంటి పం టలతో మార్పు చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గించవచ్చు.
వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించాలి.
దీని వల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు.
పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీని వల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది.
వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గానీ నూనె గింజల పైర్లనుగాని పండించడం వల్ల వరి పంటను ఆశించే టంగ్రో వైరస్, దోమ పోటులను సమర్ధంగా నివారించవచ్చు.
పెసర గాని పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే తర్వాత వేరుశనగ పంటలు వేసుకోవాలి.

సూచనలు
జొన్న సాగు తర్వాత మళ్లీ అదే పంట వేయొద్దు.
దీని వల్ల ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించవచ్చు.
వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు.
నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, మినుము, పెసర పంటలు వస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి.

రబీ.. ఆరుతడి పంటలే మేలు

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులు, కుంటలు, చెరువుల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా జిల్లాలో 60 వేల హెక్టార్లకు గాను 20వేల హెక్టార్లలోనే వరి సాగైంది. ఇదే ప్రభావం వల్ల మెట్ట పంటల్లోనూ దిగుబడి తగ్గింది. ఖరీఫ్ ప్రభావం ప్రస్తుతం రబీ కాలంలో కరెంటు కోతలతో సహా అదే విధంగా ఉంది.

నీటి సౌకర్యం ఉన్న రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే దిగుబడి సాధించి అవసరమైన ఆదాయం పొందవచ్చని ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజశేఖర్ వివరించారు. ప్రత్యామ్నాయ పంటల్లో మొక్కొజన్న, జొన్న, పెసర, మినుము, కుసుమ, పొద్దు తిరుగుడు పంటలు సాగు చేయొచ్చు. ఆరుతడి పంటలు సాగు చేస్తే అవసరమైన నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడులు తగ్గుతాయి. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో కనీసం రెండు నుంచి నాలుగెకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. పంట మార్పిడి వల్ల పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పైరులో పప్పు ధాన్యాల పంటలతో భూసారం వృద్ధి చెందుతుంది.

మొక్కజొన్న
అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు వేసుకోవచ్చు. జీరోటిల్లేజి పద్ధతిలో మొక్కజొన్న విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కేజీల విత్తనం అవసరమవుతుంది. డీహెచ్‌ఎం-111/ 117 వంటి మధ్యకాలిక రకాలు, డీహెచ్‌ఎం-115 వంటి స్వల్పకాలిక రకాలు వేసుకోవచ్చు. హైబ్రిడ్లలో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఎంచుకుని వేసుకోవచ్చు. కోహినూర్, బియో-9637 95రోజుల నుంచి వంద రోజులు, పయనిర్ 3342, డీకేసీ-7074, జేకేఎంహెచ్-1701, 85- 90 రోజుల పంట కాలం. మొక్కజొన్నకు 600 మిల్లీమీటర్ల నీటి పరిమాణం, 450 యూనిట్లు విద్యుచ్ఛక్తి అవసరం.

పొద్దుతిరుగుడు
నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం. ఊష్ణోగ్రతలు 38డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు దిగుబడి అంతగా రాదు. పంట కాలం 90 రోజులు. హైబ్రిడ్‌లు కేబీఎస్‌హెచ్1/14, ఎన్‌డీఎస్‌హెచ్-1, డీఆర్‌ఎస్‌హెచ్-1, ఏపీఎస్‌హెచ్ 66, ఇంకా ప్రైవేట్ హైబ్రిడ్లను కూడా వేసుకోవచ్చు. దీనికి 400 మిల్లీమీటర్ల నీటి పరిమాణం, 300 యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరం.

శనగ
వరికి ప్రత్యామ్నాయమే కాకుండా సోయాబీన్ తర్వాత కూడా ఆరుతడి పంటగా నవంబర్ వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 25-30 కిలోల విత్తనం అవసరం. జేజీ11, అన్నెగిరి, జేఏకేఐ 9218 రకాలు ఎంచుకోవచ్చు. 100-105 రోజుల పంట కాలం. దీనికి 150 మిల్లీమీటర్ల నీటి పరిమాణం. 112 యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరం.

పూతను కాపాడితేనే కాత

భారతదేశంలో పండించే ఫలాల్లో మామిడిని ‘రారాజు’గా అభివర్ణిస్తారు. జిల్లాలో 43,391 హెక్టార్లలో మామిడి తోటలను సాగు చేస్తున్నారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, పాల్వంచ, ముల్కలపల్లి, చండ్రుగొండ, కొత్తగూడెం, జూలూరుపాడు తదితర మండలాల్లో పండిస్తున్నారు.

మామిడి సాగుకు తెలంగాణ రాష్ట్ర వాతావరణం అనుకూలంగా ఉంటుందని, మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పూత ఆలస్యంగా రావడం, పలు దఫాలుగా రావడం, పిందెలు ఆలస్యంగా కట్టడం వల్ల పంట సకాలంలో (మే నెలలో) కోతకు రావటం లేదు. ఈ మారుతున్న వాతావరణ ప్రభావాలను అధిగమించాలంటే రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు-2 కె.సూర్యనారాయణ తెలిపారు.

పూత, పిందె సకాలంలో వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • జూన్, జూలై నెలల్లో మామిడి కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. ముఖ్యంగా ఎండు పుల్లలను మొత్తం తీసివేయటం ద్వారా చెట్టంతా శుభ్రంగా ఉంటుంది.
 • ఆగస్టులో చిలేటెడ్ జింక్ 1 గ్రాము లీటరు నీటికి, బోరాన్ (19 శాతం) 1.25 గ్రాములు, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 • అక్టోబర్ / నవంబర్ నెలల నుంచి మామిడి చెట్లకు నీరు కట్టడం ఆపి చెట్లను నీటి ఎద్దడికి గురి చేయాలి.
 • నవంబర్‌లో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13-0-45) లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే పూత, మొగ్గలు సకాలంలో వస్తాయి.
 • పూమొగ్గ పెరుగుదల దశలో (జనవరి 15 నుంచి) తేలికపాటి నీటి తడులు ఇవ్వడం వల్ల త్వరగా పూత విచ్చుకుని ఫలదీకరణ చెందుతుంది.
 • పదేళ్లకు పైబడిన చెట్లకు 4 డిప్పర్లు చెట్టు కాండం నుంచి మీటరు దూరంలో ఉండేటట్లు అమర్చి ఒక చెట్టుకు 60 నుంచి 80 లీటర్ల నీరు అందేటట్లు (రోజుకు 2 గంటలు) ఇవ్వాలి.
 • సూక్ష్మధాతు లోపం ఉన్న తోటల్లో 1.25 గ్రాముల బోరాన్ (19 శాతం) లీటరు నీటిలో కలిపి పూమొగ్గల పెరుగుదల దశలో పిచికారీ చేయడం ద్వారా ఫలదీకరణం బాగా జరిగి పిందె బాగా కట్టి అధిక దిగుబడి ఇస్తుంది.
 • మామిడి పిందె దశలో (జొన్న పరిమాణం) ఉన్నప్పుడు నాఫ్తిలిన్ అసిటిక్ ఆమ్లం(ఎన్‌ఏఏ) 20-20 నపీపీఎం గాఢతతో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తద్వారా పూత, పిందె బాగా నిలుస్తుంది.
 • కాయలు నిమ్మకాయల పరిమాణంలో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్‌ను (13-0-45) 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ద్వారా కాయ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని త్వరగా పెరుగుతుంది.

సిరుల ‘ఫ్లవర్’

ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలు.. వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాలపాలవుతున్న రైతులు కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా అధిక పోషకాలు కలిగిన, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కాలీఫ్లవర్ సాగుపై మక్కువచూపుతున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమ యం.. అధిక లాభాలు ఉండడంతో పంట విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పంటను మండలంలో వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. కాలీఫ్లవర్ సాగు-పంటకు వచ్చే చీడపీడలు-నివారణ చర్యలను హార్టికల్చర్ ఆఫీసర్ సంజీవరావు వివరించారు.

చలికాలం చివరి వరకునాటుకోవచ్చు..
మెలకువలు పాటిస్తే కాలీఫ్లవర్‌లో అధికదిగుబడి సాధించవచ్చు. ఈ పంటను చలికాలం చివరివరకు నాటుకోవచ్చు. వేసవి తీవ్రత మొదలుకాకముందే పంట చేతికి వస్తుం ది. కాలీఫ్లవర్‌లో ముఖ్యంగా నల్లి, మచ్చతెగులు, ఆవాలరంపపు పురుగు, తొలుచు పురుగు, డైమండ్ బ్యాక్‌మాస్(మచ్చలు)తో పాటు కొరడా తెగులు, బ్రౌనింగ్, రైజీనెస్, పేనుబంక, బట్టరింగ్ లాంటి సమస్యలు వస్తాయి. సకాలంలో వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.

చీడపీడలు-నివారణ

 • డైమండ్ బ్యాక్‌మాస్ : దీని లార్వాలు ఆకుల కణజాలాన్ని గీకి జల్లలాగా మారుస్తాయి. పెద్ద లార్వాలు ఆకుపై రంధ్రాలు చేస్తాయి. చెట్టు రంధ్రాలతో కనిపిస్తుంది. దీని నివారణకు ముందు గుడ్లను నాశనం చేయాలి. 100 మిల్లీలీటర్ల నీటిలో 5శాతం వేపగింజల కశాయాన్ని పిచికారీ చేస్తే గుడ్లు కుళ్లిపోతాయి. మలాథియాన్ లేదా క్లోరో ఫైరిఫాస్ లీటరు నీటికి 2మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.
 • పేనుబంక : పేను బంక వారణకు లీటరునీటిలో ఒక మిల్లీలీటరు రోగోర్‌ను కలిపి పిచికారీ చేయాలి.
 • రైజీనెస్ : దీని లక్షణం పువ్వు వదులుగా ఉండడం. గడ్డమీద నూగు ఉంటుంది. దీంతో విలువ తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పువ్వులు వదులవుతాయి. దీని నివారణకు పూలను సమయానికి కోయాలి.
 • కొరడా తెగులు : ఆకులు పసుపు రంగుగా మారుతాయి. అంచులు తెల్లబడుతాయి. మధ్యభాగం ఈనె కొరడా లాగా బయటకు కనబడుతుంది. మాలిబ్డినమ్ లోపం వల్ల, నత్రజని ఎక్కువ కావడం వల్ల ఈతెగులు వస్తుంది. దీని నివారణకు సిఫారసు మేరకే ఎరువులు వాడాలి. ఎకరానికి 400 గ్రాముల అమ్మోనియం మాలిబిడేట్‌ను 200లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి.
 • బ్రౌనింగ్ : బోరాన్ లోపం వల్ల పువ్వుపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. పువ్వుపెరిగే దశలో లీటరు నీటిలో 3గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8కిలోల బోరాక్స్ వేయాలి.
 • బట్టరింగ్ : కాలీఫ్లవర్‌లు చిన్న పరిమాణంలో ఉండడాన్ని బట్టరింగ్ అంటారు. ముదిరిన నారు నాటడం వల్ల బట్టరింగ్ వస్తుంది. స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా వేయొద్దు. తగిన మోతదులో ఎరువులు వేయాలి. సిపారసు చేసిన ఎరువులనే వాడాలి.

- సంజీవరావు(83744 49385),హార్టికల్చర్ ఆఫీసర్

నారు నర్సరీలో పోసుకోవాలి
నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. నారు నర్సరీలో పోసుకోవాలి. 30రోజుల సమయం పడుతుంది. సాగు చేసిన తర్వాత సుమారు మూడునెలల్లో పంట చేతికి వస్తుంది. రెండున్నర నెలల్లో ఫ్లవర్ కోయడానికి 15రోజులు అనువుగా ఉంటుంది. ఈపదిహేను రోజుల్లోనే మార్కెటింగ్ చేసుకోవాలి. అయితే హోల్‌సేల్‌గా అమ్మేదానికంటే రిటైల్‌గా అమ్ముకుంటేనే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఈ పంట సాగుకు తేమలేకుండా ఉండే నేల అనుకూలం. మొక్కలు పెట్టేముందు భూమిని చదునుచేసుకోవాలి. తర్వాత సాళ్లు తీసి భూమిని తడిపి గడ్డిమందు పిచికారీ చేయా లి. తర్వాత మొక్కలు పెట్టాలి. ఎకరానికి 14వేల మొక్కలు పెట్టాలి. ఎకరానికి రూ.25వేల పెట్టుబడి అవుతుంది. రూ.80వేల వరకు లాభం పొందవచ్చు.

- బిల్లా విష్ణువర్ధన్‌రెడ్డి(98667 06483), గుడెప్పాడ్

చీడపీడలు ఆశించకుండా చూసుకోవాలి
నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. ఈ పంటకు ఎక్కువగా లద్దె పురుగు, పచ్చ పురుగులు ఆశిస్తాయి. ఇవి రాకుండా చూసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. నిరంతరం పంటను జాగ్రత్తగా చూసుకోవాలి. వాణిజ్య పంటలకటే కాలీఫ్లవర్ సాగు చాలా లాభదాయకం. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తే బాగుంటుంది.

వేసెయ్‌జీ.. క్యాబేజీ

క్యాబేజీ పంట సాగుకు ఇది అనుకూలమైన సమయం. ఈ పంటను జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఇల్లెందు, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, భద్రాచలం, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో ఈ పంట సేద్యమవుతోంది. క్యాబేజీ పంటలో రకాలు, విత్తన మోతాదు, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ తదితర అంశాలను ఖమ్మం ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న వివరించారు.

క్యాబేజీ రకాలు: గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రీమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైవేటు కంపెనీలు విడుదల చేసిన రకాలు.

 • విత్తనమోతాదు: ఎకరానికి 100 నుంచి 150 గ్రాముల విత్తనాలు.
 • విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్‌ను కలిపి విత్తన శుద్ధి చేయాలి.
 • విత్తే విధానం: మొక్కల మధ్య, వరుసల మధ్య 45 సెం.మీ దూరం ఉండాలి.

ఎరువులు, నీటి యాజమాన్యం

ఎకరానికి 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో, 50 కిలోల వరకు నత్రజనిని ఇచ్చే ఎరువులను మూడు దఫాలుగా వేసుకోవాలి. (నాటిన 25-30 రోజులు, 50-60 రోజులు, 75-80 రోజులు). బిందు సేద్యం ద్వారా నీరు పారించటం శ్రేయస్కరం.

సస్యరక్షణ
తల్లి రెక్కల పురుగులు: ఇవి చిన్నవిగా గోధుమ రంగులో ఉంటాయి. డైమండ్ ఆకారంలో ఈ పురుగులు ఉంటాయి. కనుక వీటిని డైమండ్ బాక్ మాత్ అంటారు. ఈ పురుగులు గుడ్లను పెట్టి పొదుగుతాయి. వీటి నుంచి వచ్చే లార్వాలు అడుగు భాగాన చేరి ఆకులను తినేస్తాయి.

నివారణ: ప్రతి 25 వరుసల క్యాబేజి పంటకు 2 వరుసల చొప్పున ఆలా మొక్కలు ఎర పంటగా నాటాలి. 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. పురుగుల ఉధృతిని బట్టి లీటర్ నీటిలో 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 0.3 మి.లీ స్పెనోశాడ్ మందును పిచికారీ చేయాలి.

బ్యాక్టీరియా నల్లకుళ్లు: దీని వల్ల ఆకులు పత్రహరితం కోల్పోయి ‘వి’ ఆకారంలో మచ్చలు ఏర్పడుతాయి.

నివారణ: 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్ , 5 మి.గ్రా, స్పెప్ట్రోసైక్లిన్ మందును పిచికారీ చేయాలి. ఎకరాకు 5 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను భూమిలో పైపాటుగా వేయాలి.

వరిలో చీడపీడల నివారణే కీలకం

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ముగిసింది. దీంతో రైతుల ఆశలన్నీ రబీపైనే పెట్టుకున్నారు. ప్రధానంగా చీడ పీడల నుంచి కాపాడుకుని, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఖరీఫ్‌లో కన్నా రబీలోనే వరి పంటలో అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయు అధికారి హరిప్రసాద్ పేర్కొన్నారు. వరిలో విత్తన ఎంపిక, నారుమళ్లు, సస్యరక్షణపై ఆయన వివరించారు.
- చెన్నారావుపేట

అనువైన విత్తన రకాలు

 • జగిత్యాల సన్నాలు(జేజీఎల్-1798) : ఎకరానికి 2.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఉల్లికోడును తట్టుకుంటుంది. 125 రోజుల్లో కోతకు వస్తుంది.
 • వర్ష(ఆర్‌డీఆర్-355) : ఎకరానికి 2 టన్నుల దిగుబడి ఇస్తుంది. కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకువుుడుత పురుగుల్ని తట్టుకుంటుంది. 125 రోజుల్లో కోతకు వస్తుంది.
 • జగిత్యాల సాంబ(జేజీఎల్-3844) : ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. చలిని, ఉల్లికోడును తట్టుకుంటుంది. 125 రోజుల్లో కోతకు వస్తుంది.
 • జగిత్యాల వుసూరి( జేజీఎల్-11470) : పంటకాలం 130-135 రోజులు. ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. చలిని పూర్తిగా, చీడ పీడలను కొంత వరకు తట్టుకుంటుంది.
 • వరంగల్ సన్నాలు(డబ్యూజీఎల్-32100) : పంటకాలం 135 రోజులు. ఎకరానికి 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఉల్లికోడు, అగ్గి తెగులును తట్టుకుంటుంది.
 • నెల్లూరి వుసూరి(యున్‌యుల్‌ఆర్-34449) : పంటకాలం 125 రోజులు. ఎకరానికి 3.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. అగ్గి తెగులు, చౌడును తట్టుకుంటుంది.
 • పద్యువ్ను(జేజీఎల్-17004) : ఇది స్వల్పకాలిక పంట రకం. 110 రోజుల్లో కోతకు వస్తుంది. చదరపు మీటరకు 60-65 కుదుర్లు ఉండేలా నాటుకుంటే ఎకరానికి 2.8 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఉల్లికోడు, చలిని సవుర్థవంతంగా తట్టుకుంటుంది.

కాటన్‌దొర సన్నాలు(ఎంటీయూ-1010), విజేత(ఎంటీయూ-1001) : దొడ్డు రకాలు సాగు చేసే రైతులకు ఇవి అనువుగా వుంటారుు. 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. సుడి దోవు, అగ్గి తెగులును తట్టుకుంటారుు. ఎకరానికి 3.5 టన్నుల చొప్పున దిగుబడి వస్తుంది. వీటిని సాగు చేస్తున్నపుడు పొలంలో విధిగా జింక్ సల్ఫేట్ వేసుకోవావలి. వీటితో పాటు ఐఆర్-64 రాశి, తెల్లహంస, పోతన, కృష్ణహంస, దివ్య, ఎర్రవుల్లెలు, శీతల్, వరాలు, రాజేంద్ర వంటి రకాలు కూడా అనువుగానే ఉంటారుు. ఆయూ ప్రాంతాల రైతులు వ్యవసాయు శాస్త్రవేత్తలు, వ్యవసాయూధికారుల సలహాలు తీసుకుని అనువైన రకాలను ఎంచుకోవాలి.

విత్తన మోతాదు-విత్తన శుద్ధి
సన్న రకాలైతే ఎకరానికి 10-15 కిలోలు, దొడ్డు రకాలైతే 20-25 కిలోల విత్తనాలు అవసరవువుతారుు. లీటరు నీటికి ఒక గ్రావుు కార్భండిజమ్ కలపాలి. ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. వురో 24 గంటలు వుండె కట్టాలి. మొలకెత్తిన విత్తనాలను నారువుడిలో చల్లాలి.

నారు పోసుకునే సమయం
దీర్ఘకాలిక రకాలైతే నవంబర్ మొదటి వారం లోపు, వుధ్య కాలిక రకాలైతే రెండో వారం లోపు, స్వల్ప కాలిక రకాలైతే వుూడో వారం లోపు విత్తనాలు చల్లుకోవాలి. సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేనివారు డిసెంబర్ చివరి వరకు నారు పోసుకోవ చ్చు. ఏప్రిల్ మొదటి వారానికి కోతలు పూర్తయ్యేలా చూసుకోవడం వుంచిది. నారువుడి కోసం ఎంచుకున్న ప్రదేశాన్ని వుూడుసార్లు దవుు్మ చేసి, చదును చేయూలి. నీరు పెట్టడానికి, తీయుడానికి వీలుగా వేర్వేరు కాలువలు ఏర్పాటు చేయూలి.

నారు త్వరగా ఎదగాలంటే..
రబీలో నారు మొక్కలు త్వరగా ఎదగాలంటే ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేయుడానికి సరిపడే నారువుడిలో 2 కిలోల నత్రజని(కిలోఎరువును విత్తనాలు చల్లేటపుడు, మిగిలిన ఎరువును 12-14 రోజులకు) ఎరువు వేయూలి. దుక్కిలో 1.5 కిలోల భబాస్వరం, కిలో పోటాష్‌ను అం దించే ఎరువులు వేయూలి. రాత్రి సవుయుంలో నారువుడిపై టార్పాలిన్‌షీట్ లేదా యుూరియూ సంచులతో కుట్టిన పరదాల్ని కప్పాలి. నారువుడిలో రాత్రిపూట నిల్వఉన్న నీరు చలి కారణంగా చల్లగా ఉంటుంది. కాబట్టి రోజూ ఉదయుం నీటిని తేసేసి కొత్త నీరు పెట్టాలి.

కాలిబాటలతో మేలు
పొలంలో కాలిబాటలు తీసి నాట్లు వేయడం ద్వారా పంటలో చీడపీడలు తగ్గుతారుు. సస్యరక్షణ చర్యలకు అనువుగా ఉంటుంది, ఎరువులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

కుసుమ తో లాభం

కుసుమ విత్తుకునే సమయం సెప్టెంబర్ రెండో పక్షం నుంచి అక్టోబర్ మొదటి పక్షం వరకు. అయితే వర్షాలు ఆలస్యమైన ప్రాంతాల్లో, నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో నవంబర్ మొదటి పక్షం రోజుల్లోపు విత్తుకుంటే మంచిది. పంట కాలంలో వాతావరణంలో తక్కువ తేమతోపాటు అల్ప ఉష్ణోగ్రతలు పంట ఎదుగుదలకు దోహదం చేస్తాయి. కుసుమను శనగ లేదా ధనియాలతో 1:2 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేస్తే అధిక నికరాదాయాన్ని పొందవచ్చు.

ఈ నేలలు అనుకూలం..
నీరు నిల్వని, బరువైన, తేమను నిల్వ చేసుకునే నల్లరేగడి, నీటి వసతి ఉన్న ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఫ్యుజేరియం ఎండుతెగులు ఎక్కువ ఆశించే అవకాశం ఉన్నందున ఆమ్లత్వం ఉన్న భూములు పనికిరావు. కొద్దిపాటు క్షారత్వాన్ని కుసుమ పంట తట్టుకుట్టుంది.

దుక్కి తయారీ ఇలా..
రబీలో ఏకపంటగా వేసుకునేటప్పుడు నాగలి, ట్రాక్టర్‌తో గాని లోతుగా దున్నుకొని, ఆ తర్వాత రెండు మూడుసార్లు గుంటకలను తోలుకున్నట్లైతే కలుపును నివారించి, భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. కుసుమను స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల తర్వాత వేసుకునేప్పుడు, ఖరీఫ్ పంటను కోసిన అనంతరం పైపైన రెండుసార్లు గుంటకలను తోలి కలుపు లేకుండా చూసుకోవాలి.

విత్తనం, విత్తే పద్ధతి..
ఎకరానికి 4 కిలోలు (పూర్తి పంటకు), 1.5 కిలోలు (అంతరపంటకు) విత్తనాన్ని గొర్రుతో గాని, నాగటి సాళ్లలో గాని విత్తుకోవచ్చు. విత్తనాన్ని 5 సె.మీ.లోతులో విత్తుకోవాలి. విత్తనం ఎక్కువ లోతులో పడితే మొలక శాతం తగ్గుతుంది. నేలలో తేమను బట్టి, విత్తిన లోతును బట్టి 4 నుంచి 7 రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది.

రకాలు..
టీఎస్‌ఎఫ్-1, మంజీర, సాగర్ ముత్యాలు (ఏపీఆర్‌ఆర్-3), నారి-6, పీబీఎన్‌ఎస్-12, జేఎస్‌ఎఫ్-414 (ఫూలె కుసుమ), డీఎస్‌హెచ్-129, నారి ఎన్‌హెచ్-1 రకాలన్నీ రబీ కాలానికి అనుకూలం. విత్తే దూరం- వరుసల మధ్య 45 సె.మీ. లేదా వరుసలలో మొక్కల మధ్య 20 సె.మీ.

ఎరువులు..
వర్షాధారపు పంటకు ఎకరానికి 16 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం విత్తనంతోపాటు దుక్కిలో వేసుకోవాలి. నీటి వసతి కింద కుసుమను సాగు చేసుకున్నట్లయితే, సిఫారసు చేసిన నత్రజనిలో 50శాతం లేదా పూర్తి భాస్వరాన్ని దుక్కిలో వేసుకోవాలి. మిగితా 50 శాతం నత్రజనిని 5 వారాల తర్వాత మొదటి తడి కట్టేటప్పుడు పైపాటుగా వేసుకోవాలి.

భాస్వరాన్ని సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే దానిలోని గంధకం వల్ల నూనె దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. జీవన ఎరువైన లజోస్పైరిల్లమ్ 25 గ్రా.తో ఒక కిలో విత్తనాన్ని శుద్ధి చేసినట్లయితే, ఎకరాకు 8 కిలోల నత్రజని ఆదా చేసుకోవచ్చు. 45 కిలోల గంధక మూలకాన్ని సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్ దూపంలో వేసుకున్నట్లయితే అధిక గింజ దిగుబడిని, నూనె శాతాన్ని సాధించవచ్చు. శాఖీయ ఎదుగుదలను అదుపు చేసే హార్మోను అయిన ‘సూకోసిల్’ను 1000 పీపీ ఎం మోతాదులో 50శాతం పూత దశలో పిచికారీ చేసుకోవడం వల్ల గింజ దిగుబడిని అధికంగా సాధించే అవకాశం ఉంది.

నీటి యాజమాన్యం..
బరువైన నేలల్లో పంటకు నీటి తడి ఇవ్వాల్సిన అవసరం లేదు. తేలిక నేలల్లో ఒకటి, రెండు నీటి తడులు అవసరం. రకాన్ని బట్టి లేదా నేలలో తేమను బట్టి కుసుమలో పూత 65 నుంచి 75 రోజులకు వస్తుంది. వర్షాభావ పరిస్థితులల్లో కీలక దశలైన కాండం సాగే దశ (30 నుంచి 35 రోజులకు) లేదా పూత దశ (65 రోజుల నుంచి 75 రోజులకు)లలో ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు 40-60శాతం పెరిగే అవకాశం ఉంటుంది.

కలుపు నివారణ/అంతరకృషి
విత్తిన 20-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25 రోజులకు లేదా 40-50 రోజులకు దంతులు తోలి అంతరకృషి చేసుకోవాలి. దీని వల్ల కలుపును నివారించడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. విత్తిన వెంటనే అలాక్లోర్ 50శాతం లేదా పెండిమిథాలిన్ 30శాతం ఎకరాకు లీటరు చొప్పున ఏదో ఒక దానిని విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి. విత్తనం వేయకముందు ఫూక్లోరాలిన్ 1 కేజీ మూల పదార్ధంగా మందును 1 హెక్టారుకు భూమిలో కలియబెట్టడం వల్ల ముందుగా వచ్చే కలుపు ఉధృతిని తగ్గించుకోవచ్చును.

పేను తాకిడి.. నివారణ
కుసుమ పంటకు పేను తాకిడి చాలా ప్రమాదకరం. ఆలస్యంగా విత్తిన పంటపై (అక్టోబర్ రెండో పక్షంలో) దీని ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది విత్తిన 40-45 రోజుల నుంచి పంటను ఆశించి ఒక వారం రోజుల్లో ఇబ్బడిముబ్బడిగా సంతతిని పెంచుకుంటుంది. ఇది ఎక్కువగా లేతగా ఉండే మొవ్వు, చిగుళ్లు, ఆకు అడుగు భాగాలను ఆశించి రసం పీల్చడం వల్ల మొక్కలు వడలి ఎండిపోతాయి. ముళ్లులేని కుసుమ రకాలతో పేను తాకిడి అధికం. దీని నివారణకు డైమిథోయేట్ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6. మి.లీ. లేదా కోరిఫైరిఫాస్ 2.5. మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఆకుమచ్చ తెగులు.. నివారణ
ఈ తెగులు పూత మొదలయ్యే దశ (విత్తిన 60 రోజుల) నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య రుతుప్రభావం వల్ల డిసెంబరు- జనవరి నెలల్లో వర్షాలు కురవడం లేదా ఆకాశం మేఘావృతమై వాతావరణంలో తేమ 70శాతం మించినప్పుడు పూతదశలో ఉన్న పంటపై ఆశించి అధిక నష్టం చేస్తుంది.

ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతాయి. నివారణకు మాంకోజెబ్ 2.5.గ్రా.లీటరు నీటికి కలిపి మచ్చలు కనిపించగానే ఒకసారి, 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేసుకోవాలి.

బోడో మిశ్రమంతో క్రిమికీటకాలు దూరం

బోడో మిక్చర్ తయారీ విధానం..
కిలో కాపర్ సల్ఫేట్‌లో 10 లీటర్ల నీళ్లు పోసి కేసీ సున్నం వేసి కలిపితే బోడో మిక్చర్ తయారవుతుంది. దీన్ని చెట్ల మొదళ్లకు, కొమ్మలకు పూయడం వల్ల చీమలు, కీటకాలు, పురుగుల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. పిండి నల్లులు, పండు ఈగలు చెట్లపై వాలకుండా ఉండాలనుకుంటే కొమ్మలకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలని సూచించారు.

పాల దిగుబడిపై వ్యాధుల ప్రభావం

ఒంగోలు టూటౌన్ : ‘వాతావరణాన్ని బట్టి పశువులకు వ్యాధులు సోకుతుంటాయి. వ్యాధుల ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది. దుక్కులు దున్నే పశువులు పని సామర్థ్యం కోల్పోవడం, పెయ్యలు ఎదకు రాకపోవడం లాంటి నష్టాలు వాటిల్లుతుంటాయి.

వ్యాధులను సకాలంలో గుర్తించి, వైద్యం అందించకపోతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంద’ని ఒంగోలు పశువైద్యాధికారి సురేంద్రప్రసాద్ తెలిపారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పశువులను పరిశీలించడం ద్వారా పశువుల అనారోగ్య సమస్యలు, ఎద లక్షణాలు గమనించవచ్చని చెప్పారు.

అనారోగ్య లక్షణాలను
గుర్తించడం ఇలా..
పశువులు నిలబడటం, కదలిక, ప్రవర్తనలో మార్పులు కనపడతాయి. యజమాని పిలిచినా స్పందించవు. పశువు నిలబడినప్పుడు వంగిపోయినట్లు, తలను నేలకు ఆనించి ఉంటాయి. నడకలో నెమ్మది ఉంటుంది.

 • మేత, నీరు సక్రమంగా తీసుకోవు. నెమరు వేయవు. నోటి నుంచి సొంగ కారుతుంది.
 • చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. వెంట్రుకలు (రోమాలు) పైకి లేస్తాయి.
 • జ్వరం ఉంటుంది. ముట్టె తడారిపోయి, పొడిగా ఉంటుంది.
 • శ్వాస వేగంగా లేదా కష్టంగా ఉంటుంది. నాడి వేగంగా కొట్టుకొంటుంది.
 • కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. పుసులు వస్తాయి. పేడ పలుచగా లేదా గట్టిగా, రక్తంతో, జిగురుగా, నల్లగా ఉంటుంది.
 • మూత్రం చిక్కగా, తక్కువ పరిమాణంలో, రంగుమారి, వాసనతో వస్తుంది.

వ్యాధుల రకాలు
వైరస్ ద్వారా గాలికుంటు, శ్వాసకోశ, మెదడువాపు, మశూచి, తలవాపు లాంటి వ్యాధులు వస్తాయి.
నూతన కాంగో వైరస్ జ్వరం పొంచి ఉంది. సూక్ష్మజీవుల ద్వారా గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, బ్రూసెల్లోసీస్, లెప్టోస్పైరోసిస్ లాంటి వ్యాధులు వ్యాపిస్తాయి. పరాన్న జీవుల ద్వారా కుందేటి వెర్రి, బేబీ సియోసిస్, మైక్రోఫైలేరియా, కాలేయవుజలగ, జీర్ణాశయపు జలగ, మూగబంతి, తదిరర వ్యాధులు సోకుతాయి.

జీర్ణక్రియలో లోపాల వల్ల పాలజ్వరం,పొదుగు వాపు, పడకజబ్బు, కిటోసిస్ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులను సకాలంలో గుర్తించి పశువైద్యాధికారులను సంప్రదించడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు.

ఆదాయ పంట.. అలసంద

పంట సాగుకు ఇదే అదును

రబీలో ఈ పంట వేసుకోవడానికి నవంబర్ నెల నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. తేలికపాటి నేలలు, ఇసుకతో కూడిన బరువైన నేలలు, ఎర్రనేలలు, మురుగు నిల్వ ఉండని ఒండ్రు మట్టి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి.

ఒక ఎకరాలో అలసంద సాగు చేయాలంటే 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. అదే అంతర పంటగా సాగు చేయాలంటే 3 నుంచి 4 కిలోల వరకు సరిపోతాయి. సాళ్ల మధ్య 45 సెంటి మీటర్లు మొక్కల మద్యల 20 సెంటిమీటర్లు ఉందేలా విత్తుకొవాలి. నాగలితో గాని గొర్రుతో వేసుకోవాలి.

సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడి
రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే విత్తన నాణ్యత పెరుగుతుంది. దిగుబడి అధికంగా వస్తుంది. రసాయనిక ఎరువులైతే.. ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ ఎరువులు చివరి దుక్కిలో వేయాలి. అంతర పంటగా సాగు చేసినట్లయితే ఈ ఎరువులు ఏవీ వాడాల్సిన అవసరం లేదు. ప్రధాన పంటకు వేసిన ఎరువులే సరిపోతాయి.

చీడపీడల నుంచి రక్షణ ఇలా :
చిత్త పురుగులు : పైరు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆకులపై రంగులు చేసి నష్టపరుస్తాయి. వీటి వల్ల మొక్క బలహీనపడి పెరుగుదల ఆగిపోతుంది. చిత్త పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ మిల్లీలీటర్ మందుతో కిలో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్ గానీ ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును గానీ లీటరు నీటికి కలిపి పంటకు పిచికారీ చేయాలి.

పేనుబంక : పేనుబంకతో అలసందకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగులు మొక్కల అన్ని భాగాలనూ ఆశించి రసం పీల్చి, ఎదుగుదలను తగ్గిస్తాయి. నివారణకు ఇమిడాక్లో ప్రిడ్ గానీ కార్డ్బోసల్ఫాన్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. పైరులో పేనుబంకను గమనిస్తే డైమిథోయేట్ 2.0 మి.లీ. గానీ, మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

వేరుకుళ్లు తెగులు
ఈ తెగులు సోకిన మొక్కలు, ఆకుల వాడిపోయి ఎండిపోతాయి. విత్తిన 3 వారాల్లో ఎండిపోయిన మొక్కలు పొలంలో పలచగా అక్కడక్కడా కనిపిస్తాయి. ట్రైకోడెర్మావిరిడీ 4 గ్రాములు, థైరామ్ 3 గ్రాములను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకుంటే వేరుకుళ్లు రాకుండా చేయవచ్చు. వేరుకుళ్లు సోకితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3.0 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిసేలా పోయాలి. బొబ్బర్ల సాగులో ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు ఖర్చులు పోనూ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు నికర ఆదాయం లభిస్తుంది.

విత్తనాల రకాలు :

 • జీసీ-3 : ఈ రకం విత్తనాలు వేస్తే 85-90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3-4క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
 • వీ-2 : ఈ రకం విత్తనం ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.పంట 90 నుంచి 95 రోజుల్లో దిగుబడి వస్తుంది.
 • కో-7 : ఈ విత్తనం 70 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుంది. పంట దిగుబడి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు వస్తుంది.
 • సీ 152 : ఈ రకం విత్తనంతో 90 నుంచి 100 రోజులో
 • పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
 • టీపీటీసీ-29 : ఈ రకం విత్తనం 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరక దిగుబడి వస్తుంది.

రామసీతా ఫలం కమ్మ దనం

సీతాఫలాలను ‘పేదోడి సేప్పండు’ అని కూడా అంటారు. బాగా పెద్దగా పెరిగిన ఒక రకమైన మధురమైన పండ్లను రామసీతాలం పండ్లంటారు. శాస్త్రీయంగా సీతాఫలాల చెట్టు అనోనాషియా అనే కుటుంబానికి చెందింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా రెండువేలకు పైగా రకాలు ఉన్నాయి. ప్రధానంగా రెండు రకాలను చెబుతుంటారు. అవి పింక్స్ మమ్మూత్ (హిల్లరి వైట్), ఆఫ్రికన్ ఫ్రైడ్స్ ఇవి రెండు తియ్యగానే కాక మంచి గుజ్జు రసంతో సుమధురమైన రుచిని కలిగి ఉంటాయి. పింక్స్ మమ్మూత్ సీతాఫలాలైతే మరీ పెద్దగా ఉంటాయి.

ఆఫ్రికన్ ఫ్రైడ్స్ మధ్యస్త పరిమాణంలో ఉండే ఒక్కో పండు సుమారు అరకిలో బరువు ఉంటుంది. సీతాఫలం చర్మం సన్నగా ఉన్నా గట్టిదనం ఎక్కువే. చెట్టుకు పూసే పూలన్నీ కాయలై అవి ఎదిగి పక్వానికి రావడానికి 20 నుంచి 25 వారాల సమయం పడుతుంది. కాయ పండు అయ్యాక లోన తెల్లని గుజ్జు ఏర్పడి ఒక్కో గింజ చుట్టు విడివిడిగా అదంతా అతుక్కు పోతుంది. ఒక్కో పండులో సుమారు 50 నుంచి 75 వరకు గింజలుంటాయి.

సీతాఫలం చెట్టు అనేక చిన్న చిన్న కొమ్మలతో ఉన్న చిన్న వృక్షం. ఇది మూడు మీటర్ల నుంచి 8 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతుంది. ఇది అన్ని కాలాల్లో పచ్చగా పెరుగుతూ అనేక సంవత్సరాల పాటు తీయని ఫలాలను అందిస్తుంది. ఈ సీతాఫలం చెట్టు రెండేళ్ల నుంచే పూత పూసినప్పటికీ ఇవి పూత నిలుపుకొని కాయలు కాయడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుంది.

పోషకాలకు నిలయం!
సీతాఫలంలో పోషకాలు పుష్కలం. మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థకు బాగా ఉపయోగపడే విటమిన్ సీ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో ఉంటాయి. హృద్రోగ సమస్యల నుంచి మనల్ని రక్షించే పోటాషియం, మెగ్నీషియం అధిక పాళ్లలో లభిస్తాయి. మెగ్నీషియం మన దేహంలోని నీటి సమతుల్యతను కాపాడడమే కాక కీళ్లలోని అవాంఛనీయ రసాయనాలను తొలగిస్తుంది. ఫలితంగా కీళ్లవ్యాధి, కీళ్ల వాతం లక్షణాలు తగ్గుముఖం పడతాయి.

సీతాఫలం గుజ్జులో కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, క్యూడ్‌ఫైబర్, ప్రోటీన్లు,కాల్షియం,పాస్పరస్, స్వల్ప పాళ్లలో ఐరన్, కెరోటిన్, థియామైన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, ఆఫ్జారిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్‌లు ఉంటాయి. సీతాఫలాలతోపాటు దీని చెట్టు ఆకుల నుంచి బెరుడు దాక అన్నీ వివిధ రకాల వ్యాధులు, అనారోగ్యాల చికిత్సలకు చక్కగా ఉపయోగపడతాయి.

ఈ చెట్టు ఆకు డికాషిన్‌ను చేసుకుని తాగితే జీర్ణాశయంలో సమస్యలు తొలగిపోతాయి. ఆకులను నూరి లేదా గుజ్జు పేస్టును కురుపులు, పొక్కులు, అల్సర్ పుండ్ల చికిత్సకు ఉపయోగిస్తారు. దీని పక్వం కాని, కాయ గుజ్జును అతిసార వంటి రోగాల చికిత్సలోను వాడతారు.

సీతాఫలానికి వీరు దూరం..
ఆస్తమా, మధుమేహం ఉన్నవారు మాత్రం ఈ సీతాఫలం తీ సుకోకూడదు. బాగా పండిన పండును తిన్నట్లయితే అందు లో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు హాని చేస్తుంది. మూత్రపిండాలు, కాలేయ వ్యాధితో బాధపడే వారు సైతం సీతాఫలానికి దూరంగా ఉండాలి.

పత్తి, వరిలో...తెగుళ్ల నివారణ ఇలా..

కందుకూరు: జిల్లా పరిధిలో సాగులో ఉన్న పత్తి, వరి పైర్లలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తెగుళ్లు ఆశించి రైతులు సతమతమవుతు న్నారు. ఆ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల్ని గురించి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు ఎన్.ప్రవీణ్, సీహెచ్.చిరంజీవి, పి.అమ్మాజీ రైతులకు సూచనలు, సలహాలు అందించారు.

పత్తిలో..
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో నల్లమచ్చ తెగులు ఆశించినట్లు గుర్తించడమైంది. ఈ తెగులు ఆశిస్తే కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత మూడవ దశలో ఆకుల ఈనెల ద్వారా తెగులు వ్యాపించి నల్లగా మారుతుంది. దీనిని బ్లాక్ ఆర్మ్ అని పిలుస్తారు. ఉద్ధృతిని బట్టి 3, 4 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి 1 గ్రా. పౌషామైసిన్ లేదా ప్లాంటోమైసిన్ మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

పలు చోట్ల పత్తిలో బూడిద తెగులు ఆశించింది. ఆకుల మీద కోణాకారపు మచ్చలు ఏర్పడి బూడిద తెగులు బీజాలు ఆకుల అడుగు భాగాన ఏర్పడతాయి. క్రమేపీ ఆకుల పై భాగాలకు కూడా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి పండు బారి రాలిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా 1 గ్రా. కార్బండిజం కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రా. ఎసిఫెట్ లేదా 2 మి.లీ. ప్రిఫోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి.

వరిలో...
చాలా ప్రాంతాల్లో వరిలో కంకినల్లి మరియు గింజమచ్చ తెగులు ఆశించింది. నివారణ చర్యలు చేపట్టకపోతే గింజ పట్టే దశలో ఉన్న పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీని నివారణకు 2 మి.లీ ప్రొఫినోఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మి.లీ. క్లోరాజోన్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సుడి దోమ బాగా ఆశిస్తోంది. నివారణకు పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. కాలి బాటలు వదలాలి. ముందుగా పొలంలో నీటిని తీసి వేసి మొదలు తడిచే విధంగా ఇథోపెన్ ప్రాక్ట్ 1.5 మి.లీ. లేదా ఎసిఫెట్ 1.5 గ్రా. మరియు డైక్లోరోవాస్ 1.0 మి.లీ. లేదా బుప్రొజిన్ 1.6 మి.లీ. లీటర్ నీటికి కలిపి అవసరం మేరకు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

ముడతలు ముంచేస్తాయ్..

తామర పురుగులు ఆకుల అడుగ భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. మొక్కలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. నివారణకు కార్బరిల్ 600 గ్రాములు లేదా ఫాసలోన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా పిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు లేదా స్పైనోశాడ్ 75 మిల్లీలీటర్లు లేదా పెసగాన్ 300 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.

మిరప నారు నాటిన 15, 45వ రోజు పిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయడం ద్వారా పై ముడత ను నివారించవచ్చు. పై ముడతతో పాటు కింది ముడత కూడా ఉంటే కార్బరిల్, ఎసిఫేట్ మందులు వాడకూడదు.

తెల్లనల్లి (కింది ముడత)
తెల్లనల్లి పురుగులు ఆకుల్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకుని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారతాయి. మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దగా మారతాయి. కింది ముడత నివారణకు డైకోఫాల్ ఒక లీటరు లేదా నీటిలో కరిగే గంధ కం 600 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పంటకు ఆకులు తడి చేలా పిచికారీ చేయాలి. పై ముడత ఉధృతి ఒకేసారి గమనిస్తే ఉధృతిని బట్టి ఎకరాకు జోలోన్ 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చే సుకోవాలి.

పేనుబంక
లేత కొమ్మల ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గుతుంది. ఇది తియ్యటి పదార్థాలను విసర్జించడం వల్ల చీమలను ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు మసిపూసినట్లుగా నల్లగా మారిపోతాయి. పేనుబంక నివారణకు మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పూత పురుగులు
పిల్ల పురుగులు మొగ్గలు, పూత, పిందెను ఆశించి నష్టపరుస్తాయి. పురుగు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉబ్బుతుంది. తొలిచి చూస్తే ఈగ పిల్ల పురుగులు, ప్యూపాలను గమనించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 40 శాతం వరకు పూత రాలిపోతుంది. కాయలు ఏర్పడవు. ముందే ఏర్పడిన కాయలు గిడసబారి ఆకృతి మారిపోయి వంకర్లు తిరిగి ఉండటం వల్ల నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో ధరపలకదు.

నివారణకు ట్రైజోపాస్ ఎకరానికి 250 మిల్లీలీటర్లు లేదా కార్బోసల్ఫాన్ 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి వారం రోజుల తర్వాత మరలా క్లోరోపైరిఫాస్ 500 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేస్తే పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.

కాయతొలుచు పురుగు
పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చ పురుగులు మొదటి దశలో మిరప ఆకులను నష్టపరిచి తర్వాత కాయల్లోకి చేరి గింజలను తినేస్తాయి. నివారణకు థయోడికార్బ్ 200 గ్రాములు లే దా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా టోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా ఫినాల్‌ఫాస్ 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. గుడ్ల నుంచి అప్పుడే బయటికి వచ్చే పిల్లపురుగులను అరికట్టేందుకు నోవాల్యురాన్ 150 మిల్లీలీటర్లు లేదా డైప్లూబెంజురన్ 200 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి ఎకరాకు పిచికారీ చేయాలి.

విషపు ఎరల ద్వారా బాగా ఎదిగిన లద్దెపురుగులను నివారించవచ్చు. విషపు ఎర తయారీకి.. 5 కిలోల తవుడుకు 500 గ్రాముల కార్బరిల్ లేదా 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 500 గ్రాముల బెల్లం, తగినంత నీటిని కలిపి చిన్నచిన్న గుళికలుగా తయారు చేసి సాయంత్రం వేళ చేలో సమానంగా చల్లితే నెర్రెల్లో దాగి ఉన్న పురుగులు రాత్రి వేళ బయటికి వచ్చి తిని చనిపోతాయి. కాయతొలుచు పురుగుల ఉధృతిని గుర్తించడానికి ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు అమర్చాలి.

ఎరలను మాత్రం 25 రోజులకు ఒకసారి మార్చాలి. ఆకర్షణ పైరుగా చేనులో ఆముదం, బంతి మొక్కలు వేసుకోవాలి. మిరప పంటకు పురుగుల మాదిరిగా పలురకాల తెగుళ్లు సోకి నష్టం కలిగిస్తాయి.

లాభాలు పట్టుకోండి

ఖమ్మం వ్యవసాయం: పట్టుదల ఉంటే పట్టు పరిశ్రమలో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ పరిశ్రమను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ఏర్పాటుకు ప్రభుత్వం కూడా తోడ్పాటునిస్తోంది. పట్టు పరిశ్రమ నిర్వహణలో షెడ్ నిర్మాణం, నిర్వహణ ముఖ్యమైనది. పట్టు పురుగుల మేత కోసం మల్బరీ తోటలు పెంచుకోవాలి.

జిల్లాలో మొత్తం 365 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 138 ఎకరాల్లో నూతనంగా మల్బరీ సాగు చేపట్టారు. తిరుమలాయపాలెం, ముదిగొండ, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కొణిజర్ల, కొత్తగూడెం, భద్రాచలం, కూసుమంచి తదితర మండలాల్లో పట్టుపరిశ్రమలను నిర్వహిస్తున్నారు. పట్టుపరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, పరిశ్రమల ఏర్పాటు, మల్బరీ తోటల పెంపకం గురించి జిల్లా పట్టుపరిశ్రమల అధికారి మడికంటి ఆదిరెడ్డి వివరించారు.

ప్రభుత్వ చేయూత
మల్బరీ తోటల పెంపకానికి, షెడ్ ఏర్పాటుకు ప్రభుత్వం సీడీపీ (క్యాటలైటిక్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) పథకం కింద నిధులను మంజూరు చేస్తుంది.

 • దీనికి రైతులు కనీసం 2 ఎకరాలు ఒక యూనిట్‌గా మల్బరీ తోటలను పెంచుకోవాలి.
 • మల్బరీ సాగు చేసే రైతులు పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన షెడ్ విధిగా నిర్మించాలి.
 • షెడ్ నిర్మాణానికి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనిలో సుమారు 50 శాతం నిధులను సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తుంది.
 • షెడ్ 50ఁ20 పొడవు, వెడల్పు సైజులో నిర్మించాలి.
 • షెడ్‌లో మెస్సు నిర్మాణానికి రూ.16 వేలు, పరికరాలు, ప్లాస్టిక్ ట్రేలు, ప్లాస్టిక్ నేత్రికలకు రూ.21,500లను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది.
 • పట్టుపరిశ్రమ శాఖ మల్బరీ మొక్కలను సరఫరా చేస్తుంది.
 • జిల్లాలోని అశ్వారావుపేట, అక్కినేపల్లి, ఖమ్మం సమీపంలోని టేకులపల్లి, కొత్తగూడెం మండలంలోని గరిమళ్లపాడు నర్సరీల్లో మల్బరీ మొక్కలు పెంచుతున్నారు.
 • జిల్లాలోని నర్సరీల్లో వి-1 రకం మొక్కలు లభిస్తున్నాయి.
 • ఎకరాకు 5,500 మొక్కలు పడుతాయి. వీటికి రూ.9,500 ఖర్చు వస్తుంది. వీటిలో పట్టుపరిశ్రమశాఖ రూ.6,750లను సబ్సిడీ కింద ఇస్తుం ది. అంటే రైతు మొక్క ల కోసం రూ. 2,250లను భరిస్తే సరిపోతుంది.
 • ప్లాంటేషన్
 • మల్బరీ మొక్కలను జూన్ నుంచి నవంబర్ నెల వరకు నాటుకోవచ్చు.
 • దుక్కిని లోతుగా దున్నాలి. 4 సార్లు దుక్కి దున్నితే మంచిది.
 • దుక్కిలో 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. వర్మి కంపోస్టునూ వేసుకోవచ్చు.
 • మొక్కల మధ్య, వరుసల మధ్య 3ఁ3 సైజు ఉండే విధంగా నాటు కోవాలి.
 • మొక్క నాటిన తొలి రోజుల్లో వారానికి ఒక తడి ఇవ్వాలి. తరువాత 10 రోజులకు ఒకసారి తడులు ఇవ్వవచ్చు.
 • నేల రకాలు, పట్టు పరిశ్రమశాఖ అధికారుల సూచనల మేరకు రెండునెలలకు ఒకసారి అవసరమైతేనే రసాయన ఎరువులు వాడాలి.
 • 4 నెలలకు మొదటి పంట వస్తుంది.
 • మొదటి సంవత్సరంలో మూడు పంటలు వస్తాయి. రెండో సంవత్సరం 5 నుంచి 7 పంటలు తీయవచ్చు. ఒకసారి మల్బరీ వేస్తే 12 నుంచి 15 ఏళ్ల వరకు దాన్ని మేతగా ఉపయోగించుకోవచ్చు.

పట్టు పురుగుల పెంపకం

 • సెంట్రల్ సిల్క్ బోర్డ్ విజయవాడ నుంచి పట్టుగుడ్లను సరఫరా చేస్తుంది.
 • 100 పట్టుగుడ్ల ధర రూ.550 (మేలు రకమైన పట్టు గుడ్లు)
 • నెల రోజుల్లో పట్టు గూళ్లు అల్లుకుంటాయి.

ఆదాయం: ఎకరం మల్బరీ సాగు చేస్తే దాని ఆకుతో పెంచిన పురుగులతో సంవత్సరానికి రూ. లక్ష ఆదాయం వస్తుంది.

ఒక కిలో పట్టు గూడు ధర నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.340 వరకు ఉంటుంది. ప్రభుత్వం ప్రోత్సహకంగా కిలోకు రూ.50 చొప్పున అందిస్తోంది.

మార్కెటింగ్
రైతులు పండించిన పంటను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చు. తెలంగాణలోని జనగాం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని హనుమాన్‌జంక్షన్, అనంతపురం, రామ్‌నగర్ (బెంగళూరు)లలో పంటను అమ్ముకునే అవకాశం ఉంది. ఏడాదిలో ఆగస్టు 15, జనవరి 26 మినహా అన్ని రోజుల్లో ఇక్కడ పంటను అమ్ముకోవచ్చు. నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడే అమ్ముకోవడానికి వీలుకాదు.

పాలు పితికే వేళ.. జాగ్రత్తలు పాటించాలి

కందుకూరు: పశువుల నుంచి పాలు పితికే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే అటు పశువుల ఆరోగ్యంతో పాటు ఇటు పాలను స్వచ్ఛంగా ఉంచవచ్చు. దీంతో ఎక్కువ సమయం పాలు చెడిపోకుండా ఉంటాయి. వీటి నుంచి తీసిన వెన్న, నెయ్యి, మంచి రుచి, వాసన కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

పాల శుభ్రత అనేది పశువుల ఆరోగ్య స్థితి, పశుశాలలు, పాలు పితికే మనిషి, పాలు నిల్వ ఉంచే పాత్రల శుభ్రత మీద ఆధారపడి ఉంటుందంటున్నారు మండల పశువైద్యాధికారి రవిచంద్ర . పాలు పితికే సమయంలో పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఆయన పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

పశువుల ఆరోగ్య స్థితి...
పాలిచ్చే పశువుల ఆరోగ్యం పట్ల రైతులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటువ్యాధులతో బాధపడే పశువులను మంద నుంచి వేరు చేసి పశువైద్యుల సలహా మేరకు అవసరమైన చికిత్సను అందించాలి. పశువు శరీర భాగాలైన కడుపు, డొక్కలు, పొదుగు పాలు పితికే ముందు శుభ్రంగా కడిగి తడి బట్టతో తుడవాలి. డొక్కలకు పొదుగుకు మధ్య ఉండే వెంట్రుకలను పొడవు పెరగనీయకుండా కత్తిరించాలి. పొదుగును శుభ్రపరిచి పొడిబట్టతో తుడవాలి.

ఆ తర్వాత పాలు పితకాలి. పాలు తీయడం పూర్తయిన తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం (ఉదాహరణకు కోర్సలిన్ ద్రావణం లీటర్ నీటికి 2 మి.లీ కలపాలి)తో కడగాలి. అదే నీటితో పిండిన వ్యక్తి తన చేతులను కడుక్కోవాలి. పితికిన వెంటనే నేలపై పశువును అరగంట వరకు పడుకోనీయవద్దు. అప్పుడే పాలు పిండటంతో చను రంధ్రాలు తెరచుకోని ఉంటాయి. దీంతో ఒక వేళ పశువు పడుకుంటే ఆ రంధ్రాల నుంచి నేలపై ఉన్న బ్యాక్టీరియా త్వరగా పొదుగులోకి చేరి పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాలు పితికిన వెంటనే పశువు పడుకోకుండా ఉంచాలంటే వాటి ముందు గడ్డి కాని లేదా దాణా పెట్టాలి.

పశువుల షెడ్‌లో...
పశువుల షెడ్‌లను ఎత్తయిన, నీరు నిల్వ ఉండని ప్రాంతంలో నిర్మించుకోవాలి. దీంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. షెడ్ లోపలఙగడ్డి గాని లేదా ఇటీవల మార్కెట్లో ప్రత్యేకంగా వస్తున్న రబ్బర్ షీట్లను గాని పరుచుకోవచ్చు. షెడ్‌లో దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త వహించాలి. అవసరాన్ని బట్టి క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. దుమ్ము లేచే నేల అయితే పాలు తీసే ముందు కొద్దిగా నీరు చల్లాలి.

పాలు తీసే వ్యక్తి...
పశువుల నుంచి పాలు తీసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. అంటువ్యాధులు, చర్మ వ్యాధులతో బాధపడేవారిని పాలు తీయడానికి ఉపయోగిం చవద్దు. పాలు తీసే వారి చేతి గోర్లు పెరగకుండా కత్తిరించుకునేలా చూడాలి. పాలు తీసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుని పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుని మరొక దాని పాలు తీయాలి. లేకపోతే ఆ పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వేడినీటితో పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

పాడి-పంట : వాన నీటిని ఒడిసి పడదామా

జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల్లోకదలిక కారణంగా గత రెండు మూడు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోతే అది కాలువలు, వాగులు, నదుల్లో కలిసి చివరికి సముద్రం పాలవుతుంది. వాన నీటిని వివిధ పద్ధతుల ద్వారా నిల్వ చేసుకొని, అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటే రైతుకు సాగు నీటి కష్టాలే ఉండవు. సాగు నీటి వినియోగం, సంరక్షణపై రైతులు తగిన శ్రద్ధ వహిస్తే బెట్ట పరిస్థితుల్లోనూ పంటకు నీరు అందించవచ్చు. ఈ నేపథ్యంలో వర్షపు నీటి నిల్వపై కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయు పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.నిర్మల అందిస్తున్న సూచనలు...

ఎందుకు నిల్వ చేయాలి?

వివిధ వనరుల ద్వారా వునకు లభిస్తున్న నీటి లో 80% వరకు పంటలకు వినియోగమవుతోం ది. అయితే వివిధ కారణాల వల్ల ఇందులోనూ 35-40% వృథా అవుతోంది. అన్ని నీటి వనరులకు వర్షపు నీరే ఆధారం. దానిని నిల్వ చేసుకొని, సకాలంలో వినియోగించుకోలేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. కాబట్టి ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది.
భూమి పైన పడుతున్న వర్షపు నీటిలో కొంత లోపలి పొరల్లోకి వెళుతుంది. కొంత ఆవిరవుతుంది. వుట్టిలో ఇంకిన నీరే పంటలకు ప్రధాన ఆధారవువుతుంది. కాబట్టి ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూమిలోకి ఇంకిపోయేలా చేయుటంతో పాటు తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయకపోతే వర్షపు నీటితో పాటు విలువైన భూమి పైపొర మట్టి, మనం వేసే పోషకాలు కూడా కొట్టుకుపోతాయి. ఫలితంగా కొన్నేళ్లకు ఉత్పాదకత తగ్గి, దిగుబడులు గణనీయంగా పడిపోతాయి. పంట భూమి నిస్సారమవుతుంది.

ఇలా చేయండి

ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి భూమిని లోతుగా దున్నితే వర్షపు నీరు లోపలికి బాగా ఇంకుతుంది. దీనివల్ల మొక్కల వేర్లు లోపలి పొరల్లోకి చొచ్చుకుపోరుు ఎక్కువ నీటిని, పోషకాలను గ్రహిస్తారుు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ పైరు వెంటనే నీటి ఎద్దడికి గురికాదు. పొలంలో వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రదేశంలో గుంత తవ్వుకోవాలి. దానిలోకి చేరిన వాన నీటిని అవసరమైనప్పుడు పంట పొలానికి వాడుకోవాలి. గుంత వైశాల్యం తక్కువగా, లోతు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే నీరు ఆవిరి కాదు. 3-4 మీటర్ల లోతు, 35-40 మీటర్ల పొడవు, అంతే వెడల్పు ఉండేలా గుంతను తవ్వుకోవాలి. గుంతలోని నీరు ఇంకిపోకుండా అడుగున, నాలుగు వైపులా టార్పాలిన్ షీట్ వేయాలి. సూర్యరశ్మికి నీరు అవిరి కాకుండా గుంత పైభాగాన్ని కూడా కప్పాలి. అలాగే కొండ లోయులు, గుట్టల వుధ్య కందకాలు తవ్వి గట్లను ఏర్పాటు చేసుకుంటే నీటి ప్రవాహ వేగం తగ్గి, కొంత నీరైనా నిల్వ ఉంటుంది.

మెట్ట ప్రాంతాల్లో...

మెట్ట ప్రాంతాల్లో వర్షపు నీటిని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన అతి సులభమైన పద్ధతి కాంటూరు సేద్యం. 2-7% వాలు ఉన్న భూములకు ఇది బాగా అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో వర్షపు నీరు ప్రవహించే వాలుకు అడ్డంగా గట్లు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. నేల కోతకు గురికాదు. నీటి ప్రవాహ వేగం తగ్గి, భూమిలోనే ఇంకిపోతుంది. వర్షపు నీటిని పంట భూమిలో ఇంకిపోయేలా చేయాలంటే వాలుకు అడ్డంగా దున్నాలి.

వర్షపు నీటిని మళ్లిస్తే...

భూమిపై పడిన వర్షపు నీరు వృథా కాకుండా దానిని బావులు, కుంటల్లోకి మళ్లించాలి. దీనివల్ల సాగు నీటి సవుస్యలు చాలా వరకు తీరతాయి. అంతేకాక బావులు, కుంటల్లో భూగర్భ జల మట్టం పెరుగుతుంది కూడా. అలాగే ఇంటి పైకప్పు నుంచి పడే నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించాలి. దీనివల్ల బోరు బావుల్లో నీటి లభ్యత పెరుగుతుంది. చిన్న చిన్న పిల్ల వాగుల సమీపంలో ఓ మోస్తరు గుంతలను తవ్వాలి. వర్షాలు పడినప్పుడు ఆ వాగుల్లోని నీటిని గుంతల్లోకి పంపితే చుట్టుపక్కల ఉన్న బావులు రీచార్జ్ అవుతాయి.

నేలను బట్టే నిల్వ

నేల ఏ మేరకు నీటిని నిల్వ చేసుకోగలదనేది దా ని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. తేలిక నే లల కంటే సారవంతమైన నేలలే ఎక్కువ నీటిని నిల్వ చేసుకోగలుగుతాయి. భూమిలో చేరిన నీరు మొత్తం మొక్కలకు అందుబాటులో ఉం డదు. ఎందుకంటే నేలలో ఇంకిపోయిన నీటిలో ఎక్కువ భాగం లోపలి పొరల్లోకి చేరుతుంది. దానిని మొక్కలు గ్రహించలేవు. అందుబాటు లో ఉన్న నీటినే క్రవుం తప్పకుండా గ్రహిం చడం వల్ల నీటి లభ్యత తగ్గి మొక్కలు వాడిపోతాయి. కాబట్టి నీటిని ఒకేసారిగా మొక్కలకు ఇవ్వకుండా అవసరాన్ని బట్టి దఫదఫాలుగా అందిస్తే దిగుబడులు బాగుంటాయి.

వేరుశనగ అన్ని ప్రాంతాల్లో విత్తుకోవచ్చు

గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తున్నది.వరి, పత్తి పంటల తర్వాత తెలుగు నాట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట వేరుశనగ. అన్ని ప్రాంతాల్లోనూ జూలై నెలలో వేరుశనగ విత్తుకోవచ్చు.కదిరి-5,6,9, అనంత, నారాయణి, వేమన, జేసీజీ-88, అభయ, ధరణి లాంటి రకాలు తక్కువ వర్షపాత ప్రాంతాల్లోను, గ్రీష్మ, రోహిణి, కాళహస్తి, టీజీ-26, టీఏజీ-24 లాంటి రకాలు ఎక్కువ వర్షపాత ప్రాంతాల్లో సాగుకు అనువైనవి.

విత్తనాన్ని గొర్రుతోకానీ, ట్రాక్టరుతో నడిచే విత్తు యంత్రంతో కానీ సాలుకు, సాలుకు మధ్య 30 సెం.మీ, మొక్కకు, మొక్కకు మధ్య 10 సెం.మీ. ఉండేటట్లుగా, 5 సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి.ఎకరానికి 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువు, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 18 కిలోల యూరియా, మొత్తం ఎరువులను విత్తే సమయంలో ఆఖరి దుక్కిలో వేయాలి.భూమి, విత్తనం ద్వారా వ్యాప్తిచెందే శిలీంధ్రాల నివారణకు, వైరస్ తెగుళ్ల నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. మొదటగా కిలో విత్తనానికి, ఒక గ్రా. టిబ్యుకొనజోల్ లేక 3 గ్రా. మాంకోజెబ్ లేక 2 గ్రా. కార్బండిజమ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును కూడా విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 6.5 మి.లీ.ల క్లోరోఫైరిఫాస్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసే ప్రాంతాల్లో రైజోబియం కల్చర్‌ను పట్టించాలి.
కలుపు నివారణకు విత్తిన వెంటనే కానీ లేదా 2-3 రోజుల లోపల పెండిమిథాలిన్ 1.3-1.6 లీ. లేదా 1.25-1.5 లీ. బ్యూటాక్లోర్ 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 21 రోజుల తర్వాత మొలచిన కలుపు నివారణకు ఇమాజితఫిర్ 300 మి.లీ. లేదా క్విజలోఫాప్ ఇథైల్ 400 మి.లీ. ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.

ఊడలు దిగే సమయంలో అంటే 45 రోజుల సమయంలో రెండోసారి కలుపు తీసి, ఎకరానికి 200 కిలోల జిప్సం వేసి మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల తర్వాత వేరుశనగలో అంతర సేద్యం చేయరాదు.వేరుశనగను కంది, ఆముదం, సజ్జ, జొన్న పంటల్లో అంతర పంటగా వేసుకోవాలి.సజ్జ, జొన్న పంటలను అంతర పంటలుగానే కాకుండా.. పొలం చుట్టూ నాలుగు వరుసలు వేసుకుంటే తామర పురుగులను నిరోధించి తద్వారా పంటను వైరస్ తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.

- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్

రైతన్న కష్టాలను తీర్చే వినూత్న పరికరాల రూపకర్త

‘పంట పక్షుల పాలు పాలి కాపు అప్పుల పాలు’ అన్నారు పెద్దలు. ఈ మాటలు పక్షుల బెడద తీవ్రతను చెప్తున్నాయి . ప్రస్తుతం ఉన్న కూలీల కొరతతో పక్షులకు కాపలా కాయడం పెద్ద సమస్య. దీనికి పరిష్కారంగా ఆయన పక్షులను పారదోలే పరికరాన్ని రూపొందించాడు గిరీష్. వేసిన పంటను బట్టి దాన్ని పాడు చేసే పక్షులు, జంతువులను పారదోలేందుకు వాటి సహజ శత్రువుల ధ్వనిని రికార్డు చేసి ఒక మెమరీ కార్డులో అమర్చి పంట పొలంలో ఏర్పాటు చేస్తారు. అది సృష్టించే శబ్ధ తరంగాలతో పక్షులు, జంతువులు పారిపోతాయి. ఒక పరికరం రెండెకరాల మేరకు ప్రభావం చూపుతుంది.

ఇనుము కొలిమిలో పడి కాలి సమ్మెట దెబ్బలతో పదునెక్కినట్లు జీవితంలో చవిచూసిన కష్టాలు అతనిలో పట్టుదలను పెంచాయి. ఓ మామూలు రైతు బిడ్డ. రైతు బతుకులో ఒడిదుడుకులు ఎస్‌ఎస్‌ఎల్‌సీతోనే చదువుకు మంగళహారతి పాడించాయి. అయితేనేం జీవితం నేర్పిన పాఠాలు, కష్టాలకు ఎదురీదే క్రమంలో నేర్చుకున్న ప్రత్యక్ష పాఠాలు ఆయనను ఓ శాస్త్రవేత్తగా తీర్చిదిద్దాయి. పేరొందిన శాస్త్రవేత్తలే పరిజ్ఞానానికి అబ్బురపడేట్లు చేశాయి. బిజాపూ ర్‌లోని కార్వార్‌కు చెందిన గురుపాదప్ప, బసవమ్మల బిడ్డ. ఐదుగురు తోబుట్టువులతో కష్టాలు పంచుకొని పెరిగాడు.

గురుపాదప్ప సన్నకారు రైతు. ఉన్న ఆరెకరాల పొలంతో ఏడుగురి బట్టపొట్ట గడవాలి. చదువుకుంటే బతుకు బాగుపడే మాటేమో కాని ఆకలి సావాసం మాత్రం నీడలా వెంటాడే పరిస్థితి. ఈ పరిస్థితిలో కుటుంబానికి ఆసరాగా నిలవడానికి గిరీష్ ఎస్‌ఎస్‌ఎల్‌సీతోటే చదువు ముగించాడు. చదువు మీద ఆశను చంపుకున్నాడు కానీ చిన్ననాటి శాస్త్రపరిజ్ఞానం మీద పట్టు సాధించాలనే ఆశయాన్ని మాత్రం చంపుకోలేదు. చిన్ననాడే ఇంట్లో పాడయిన ఎలక్ట్రిక్ పరికరాలను పట్టుపట్టి బాగుచేసి, పట్టు సాధించాడు.

బోరు మోటరే తొలి గురువు

గిరీష్ పొలంలో ఓ బోరు బావి ఉండేది. అయితే అది అస్తమానం తిప్పలు పెట్టేది. దాన్ని రిపేర్ చేయించడానికే చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. తండ్రి కష్టాన్ని కండ్లారా చూసిన గిరీష్ బోరు సంగతేదో తేల్చాలనుకున్నాడు. ప్రతి రోజు బోరు దగ్గరకెళ్లి పరిశీలించేవాడు. ఏదేదో చేసేవాడు. ఇది చూసిన వాళ్లంతా గిరీష్‌కి పిచ్చెక్కిందని వెక్కిరించేవారు. బోరులో సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలన్నది నా ప్రయత్నం. అందుకోసమే నిత్యం బోరు దగ్గర కూర్చుని అందులో ఉన్న వైర్లు వాటి పనితీరు ఇలా అన్నింటిని గమనించేవాణ్ని. ఇది చూసిన వాళ్లంతా నాకు పిచ్చిపట్టింది అని అనేవారు. ఆఖరుకు అమ్మనాన్న కూడా ఇరుగుపొరుగు మాటలతో భయపడి నన్ను ఆ బోరు దగ్గర కెళ్లొద్దని మందలించారు. అయినా ఆగలేదు. ఎవరికీ తెలియ కుండా రాత్రిళ్లు లాంతరు పట్టుకొని బోరు దగ్గరకెళ్లే వాణ్ని. అలా మా బోరుబావి మోటార్ నాకు గురువుగా మారింది. ఆ పాఠాలే నేటి నా ఆవిష్కరణలకు స్ఫూర్తయ్యాయి అని గిరీష్ తన జీవన ప్రస్థానాన్ని వివరించారు.

తన ఆశలకు రూపం ఇవ్వడానికి ఊరొదిలిన గిరీష్ బెంగళూరు చేరి తన ఆలోచనలకు పదును పెట్టుకున్నాడు. వాటిని ‘నాబార్డ్’ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు. నాబార్డ్ ప్రతినిధులను గిరీష్ తపన, ప్రతిభ ఆకట్టుకుంది. వారందించిన ఆర్థిక సహకారంతో ఒక బోర్‌వెల్ స్కానర్, బర్డ్ రిపెల్లెంట్‌లను రూపొందించాడు. వీటిని పరీక్షకు పెట్టగా పరిశీలనకు వచ్చిన రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం సంతృప్తి చెంది కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ పరికరాలను రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం తన వ్యవసాయ క్షేత్రాల్లో వినియోగిస్తోంది.

అన్నదాత కోసం ఎన్నో ఆవిష్కరణలు..

రైతుబిడ్డగా పుట్టిన గిరీష్‌కు రైతుల పాట్లన్నీ తెలుసు. ఇందులో ప్రధానమైనది నీటి సమస్య. భూగర్భ జలాలే ఆధారంగా వ్యవసాయం సాగే ప్రాంతాల్లో రైతులు బోర్లు వేసి నీరు పడక చివరకు ఉన్న మడి చెక్కలను అమ్ముకున్న వారు అనేకులు. అందుకే భూగర్భంలోని నీటిని తెలుసుకునేందుకు బోర్‌వెల్ స్కానర్ అనే పరికరాన్ని రూపొందించాడు. అనంతరం పంటలకు పక్షుల బెడదను తప్పించేందుకు బర్డ్ రిపెల్లంట్‌ను తయారు చేశాడు. తరువాత క్రమంలో లీడ్ సెన్సర్ ఇరిగేషన్ కంట్రోల్‌ను కనుక్కున్నాడు. ఇది పంటకు నీరవసరమైనప్పుడు బోర్ మోటార్ తనకు తానుగా స్టార్టయ్యేటట్లు చేస్తుంది. ప్రస్తుతం బోర్‌వెల్ స్కానర్‌ను మరింత ఆధునీకరించి బోర్‌వెల్ స్కానర్ రెండో వర్షన్ రూపకల్పనలో నిమగ్నమయ్యాడు.

బోర్‌వెల్ స్కానర్: సాధారణంగా భూమిలో స్టాక్‌వాటర్, రెగ్యులర్ వాటర్ అని రెండు రకాల నీటి నిల్వలుంటాయి. వీటిలో స్టాక్‌వాటర్ ఉన్నచోట బోరు వేస్తే మొదట నీళ్లు పడినట్టే కనిపిస్తాయి కానీ...ఆ నీళ్లు వారంరోజుల్లో అయిపోయి బోర్ ఫెయిలవుతుంది. అందుకే రెగ్యులర్ వాటర్ ఉన్న చోట బోరు వేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ వాటర్ ఎక్కడుందో కనిపెట్టడానికే ‘బోర్‌వెల్ స్కానర్’ ఉపయోగపడుతుంది. బోరు వేయాలనుకున్న ప్రాంతంలో కనీసం ఐదు నుండి పది అడుగుల లోతుకు తవ్వాల్సి ఉంటుంది. అనంతరం బోర్‌వెల్ స్కానర్‌కు అమర్చిన ఒక కేబుల్‌ను బోర్‌లోకి, మరో కేబుల్‌ను ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తారు. స్కానర్‌లో అమర్చిన మైక్రో చిప్‌ల ద్వారా ఆ బోర్‌లో ఎంత లోతున నీళ్లు ఉన్నాయి, నీళ్లుంటే అవి నిలువనీరా? ఊట నీరా? అనే వివరాలు ల్యాప్ టాప్ నమోదవుతాయి. ఈ సమాచారంతో నీటి లభ్యత వివరాలు తెలిసిపోతాయి. ఈ బోర్‌వెల్ స్కానర్ ధర రూ. 82 వేలు. వ్యవసాయ శాఖ అధికారులే ముందుకొచ్చి రైతు ప్రయోజనాలను సంరక్షించేందుకు ఈ స్కానర్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.
లీడ్ సెన్సర్ ఇరిగేషన్ కంట్రోల్: ఇది మోటార్‌కు బిగించే పరికరం. పంటకు నీటి అవసరం ఏర్పడినపుడు పొలంలో అమర్చిన సెన్సర్లు నేలలో తడిని గుర్తించి మోటారుకు సంకేతాలు అందిస్తాయి. దాంతో మోటారు తనకు తానుగా స్టార్టయి నీరు విడుదల చేస్తుంది. ఇందులో ఉష్టోగ్రత నమోదు చేసే పరికరం, నేలలోని తేమను కొలిచే సెన్సర్ లీడ్ సెన్సర్ అనే పరికరాలు అమర్చి ఉంటాయి. ఈ పరికరం ధర రూ.26,000. విద్యుత్ కోతల సమయంలో పడిగాపులు కాసి పంటకు నీరు పెట్టాల్సిన బాధ ఈ పరికరం తీరుస్తుంది.
ఆసక్తి గల రైతులు గిరీష్‌ను 09902133996 ద్వారా సంప్రదించవచ్చు.

ఆవున్న చోటే అన్నముంది!

ప్రతి ఏటా దాళ్వాకు విరామం!

 • ఆరు ఆవులతో 28 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం.. భూమికి
 • విశ్రాంతి కోసం దాళ్వా వరి సాగుకు ప్రతి ఏటా సెలవు!
 • సార్వాలో మాత్రమే వరి సాగు.. వినియోగదారులకు నేరుగా ముడి బియ్యం అమ్మకం ద్వారా ఎకరానికి రూ. 40 వేల నికరాదాయం
 • ఒక్కో దేశీ ఆవు ద్వారా రూ. 40 వేల సాగు ఖర్చులు ఆదా!

‘వ్యవసాయం పరమ లక్ష్యం అధికంగా పంట దిగుబడులు నూర్చడం కాదు.. మంచి మనసు గల మనుషులున్న సమాజాన్ని నిర్మించడం..’ అంటాడు సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా. నాచుగుంటలోని భూపతిరాజు రామకృష్ణంరాజు(65) వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే ఈ మాటలకు అర్థం ఏమిటో కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. భూమిని తల్లిగా కొలిచే రైతుగా గత ఏడేళ్లుగా వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన గోఆధారిత వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ.. మొదట్లో జీవామృతం వాడినా.. ఇప్పుడు ఏ ఎరువూ వేయకుండా ఎకరానికి 29 బస్తాల విష రహిత ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. 5-10 ఏళ్లు జీవామృతం వాడిన పొలంలో ఏ ఎరువూ వేయకుండానే పంటలు పండించొచ్చని రుజువు చేశారు. తను చేయడమే కాకుండా తోటి రైతులకు జ్ఞానాన్ని పంచి.. పచ్చని బతుకు దారి చూపుతున్నారు. ‘పిచ్చి రాజు.. పిచ్చి పంట..’ అని ఎగతాళి చేసిన రైతులే ఇప్పుడు అనుసరిస్తున్నారు!

అత్యాశకు పోయి రసాయనిక వ్యవసాయంతో భూమిని సర్వనాశనం చేసుకోవడం రైతు తనకు తాను ద్రోహం చేసుకోవడమేనని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు భూపతిరాజు రామకృష్ణంరాజు(65) ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రకృతిని ఉపయోగించుకుంటూనే ప్రకృతి పరిరక్షణకు దోహదపడే రీతిలో రైతు జీవన విధానం, పంటల విధానం ఉండాలంటారాయన. ఉంగుటూరు మండలం నాచుగుంటలోని శ్రీగోపాలకృష్ణ గోశాలకు డా. సుంకపల్లి పర్వతరావు 28 ఎకరాలను దానం ఇచ్చారు. ఆ భూమిని లీజుకు తీసుకొని రామకృష్ణంరాజు సాగు చేస్తున్నారు.

పచ్చని పంటలతో మనిషికి ఆయువునిచ్చే భూమిని వ్యాపార వస్తువుగా కాకుండా తల్లిగా చూడడం ఆయన ప్రత్యేకత. సార్వా వరి పంట కోసిన తర్వాత వెంటనే దాళ్వా వేయకుండా.. మినుమో, పిల్లిపెసరో, అలసందో చల్లుతారు. అయిన కాడికి కాయలు కోసుకున్నాక పశువులకు మేపుతారు. ఆనక ఆవులతో పొలంలో మందగడతారు. తొలకరి వర్షాలు కురిశాక దమ్ము చేసి నాటేస్తారు.. నలభయ్యేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న రామకృష్ణంరాజు 2007 నుంచి పంటల సాగు తీరును పూర్తిగా మార్చుకున్నారు.

ఎగతాళి చేసిన వారే..!

తొలుత 9.5 ఎకరాల్లో జీవామృతంతో వ్యవసాయాన్ని ప్రారంభించి.. క్రమంగా 28 ఎకరాలను ఈ పద్ధతిలోనే రసాయనిక ఎరువులు, పురుగుమందులను కొంచెం కూడా వాడకుండా సాగు చేస్తున్నారు. తొలుత జీవామృతంతో సాగు చేసిన 9.5 ఎకరాల్లో నాలుగేళ్లుగా అసలు జీవామృతం కూడా వాడడం లేదని, కేవలం ఆవులతో మందగట్టడం తప్ప ఇంకేమీ చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయనను పిచ్చి రాజు గారు, పిచ్చి వ్యవసాయం. ఇది అయ్యేదా పొయ్యేదా.. అని ఎగతాళి చేసిన రైతులే ఇప్పుడాయనను అనుసరిస్తున్నారు.
రామకృష్ణంరాజు స్వగ్రామం తణుకు మండలం తేతలి గ్రామం. పూర్వీకుల దగ్గర నుంచి వ్యవసాయ కుబుంబం. 1970లో వ్యవసాయం చేపట్టి.. పరిమితంగా రసాయనిక ఎరువులు వాడుతూ సేద్యం చేశారు. సాంద్ర వ్యవసాయ పద్ధతి అమల్లో ఉన్న జిల్లాలో ఇతర రైతులు విరివిగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు దట్టిస్తూ.. తెరపి లేకుండా పంటల మీద పంటలు వేయడం పట్ల అసంతృప్తి చెందుతుండే వారు. ఆ దశలో మధ్యప్రదేశ్ చిత్రకూట్‌లోని దీనదయాళ్ సంస్థ, నాగపూర్‌లో మరో సంస్థను సందర్శించినప్పుడు ప్రకృతి వ్యవసాయం విలువ ఆయనకు అవగతమైంది. ఆ విధంగా ఏడేళ్ల క్రితం ప్రకృతిసిద్ధమైన పద్ధతుల్లో వ్యవసాయం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేసిన తొలి ఎకరానికి ఏడాది 20 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. క్రమంగా 29 బస్తాలకు పెరిగింది. ఒక్క ఆవు మూత్రం, పేడలతో జీవామృతం తదితర కషాయాలను తయారు చేసుకుంటూ తక్కువ ఖర్చుతో 4, 5 ఎకరాలను సాగు చేయవచ్చని నిరూపించారు. ఇతర రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7,8 వేలు ఖర్చు పెడుతున్నారు. ఇరుగు పొరుగు రైతుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆయనను అనుసరిస్తున్నారు. గద్దె వెంకటరత్నం అనే రైతు 10 ఎకరాల్లో, మరో రైతు 4 ఎకరాల్లో గోఆధారిత వ్యవసాయం చేయనారంభించారు. మరో 20 మంది రైతులు అరెకరం, ఎకరంలో ఈ పద్ధతిలో సాగు చేస్తూ ధాన్యాన్ని సొంతానికి వాడుకుంటున్నారు.

నాట్లు వేయటం.. కలుపుతీయటం.. పంట కోయటం!

అనేక ఏళ్లుగా జీవామృతం వేసి పంటలు పండిస్తున్నందున భూమి పూర్తిగా సారవంతమైంది. నాట్లేయటం, కలుపు తీయడం, పంట కోసుకోవడం తప్ప ఏ ఎరువులూ వేయాల్సిన అవసరం లేనేలేదని రామకృష్ణం రాజు తెలిపారు. కోత కోసిన తర్వాత పిల్లిపెసర వంటి గింజలు చల్లితే.. ఆవులు తినగా మిగిలిన పంట పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఎరువులు, జీవామృతం వేయకుండానే తదుపరి ఖరీఫ్‌లో వరి పంటను సాగు చేయవచ్చని ఆయన రుజువు చేశారు. ఏ భూమిలోనైనా వరుసగా ప్రకృతి వ్యవసాయం చేస్తే వానపాములు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, భూమిలో సేంద్రియ కర్బనం కొరత తీరుతుందని, 5 నుంచి 10 ఏళ్లలో ఇదే ఫలితం వస్తుందని ఆయన గంటాపథంగా చెబుతున్నారు.

ఈ సాగు పద్ధతి గురించి ఆ నోటా ఈ నోటా విన్న రైతులు అనేక జిల్లాల నుంచి వచ్చి శిక్షణ పొందుతూ ఉంటారు. ఏడాదికి 400 నుంచి 500 మంది రైతులు శిక్షణ పొందుతుండగా, వీరిలో 60 % మంది ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని రామకృష్ణంరాజు తెలిపారు.

- యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, ప. గో. జిల్లా
ఫొటోలు: ఎస్ కే రియాజ్

ఎకరాకు రూ. 40 వేల నికరాదాయం

గత ఖరీఫ్‌లో అరెకరంలో చెరకు, 27.5 ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఎకరాకు 15 వేలు ఖర్చు చేశారు. అవిపోను రూ. 40 వేల నికరాదాయం సంపాదించారు. ఇతర రైతులు రెండు పంటలు పండించి ధాన్యం అమ్ముకొని సంపాదించే మొత్తాన్ని. తాను ఒక పంటలో పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి సంపాదిస్తున్నానని రామకృష్ణంరాజు తెలిపారు. పండించిన ధాన్యాన్ని నిల్వ చేసి, మరపట్టించి ముడి బియ్యాన్ని కిలో రూ. 52 చొప్పున నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. పీఎల్ -1100, బీపీటీ -5204 రకాల బియ్యం సుమారు 55 వేల కిలోలను రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలతో పాటు చెన్నై, బెంగళూరు, బళ్లారి, కోయంబత్తూరు, పుణే వంటి ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్టు ద్వారా పంపిస్తున్నారు. ఈ బియ్యాన్ని సుమారు 500 కుటుంబాలు వాడుతున్నాయి. ఆరోగ్యదాయకమైన ఈ బియ్యాన్ని జనానికి అలవాటు చేయడానికి తనకు మూడేళ్లు పట్టిందని, వీటి విలువ తెలిసిన తర్వాత వాళ్లే పది మందికి చెబుతున్నారని రామకృష్ణంరాజు వివరించారు. ‘పెద్ద రైతులు, చిన్న. సన్నకారు రైతులు ఎవరికైనా ఈ వ్యవసాయం సాధ్యమే. కాకపోతే ఓపిక ఉండాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్ముకోగలగాలి..’ అంటారాయన.

ఆవుతో 40 వేలు ఆదా!

రామకృష్ణంరాజు వ్యవసాయ క్షేత్రంలో ఆరు దేశవాళీ ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే మూత్రం, పేడతో ఇక్కడ 28 ఎకరాల వ్యవసాయం సాగుతోంది. ఒక ఆవు మూత్రం, పేడతో తయారుచేసిన జీవామృతం తదితరాలతో 4,5 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. అంటే ఆ 4,5 ఎకరాల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు మిగిలినట్టే కదా. ఒక ఆవు ద్వారా రూ. 40 వేలకుపైగా వ్యవసాయ ఖర్చు తగ్గుతుంది. ఏటా రెండు పంటలు వేసే వాళ్లకు ఇంతకు రెట్టింపు మిగిలినట్టే. దేశవాళీ ఆవు లీటరు పాలిచ్చినా.. అవి అమృతతుల్యమైనవి. ఆవు ఉన్న ఇంట్లో పిల్లలు, పెద్దలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. అంతేకాదు.. ఆవు మూత్రంతో అర్క్, చర్మవ్యాధుల నివారణకు లేపనం కూడా తయారు చేసి అమ్ముతున్నారు. గడ్డి కొనాల్సిన అవసరం లేని రైతుకు ఒక్కో ఆవుకు రూ. వెయ్యి వరకు దాణా ఖర్చవుతుంది అంటారాయన. గో ఆధారిత వ్యవసాయాన్ని పట్టుదలగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న రైతులకు తన పొలం దగ్గర ఒక రోజు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

ఆలోచనా విధానం మారాలి

రైతుల ఆలోచనా విధానం మారాలి. మన తాతలు, తండ్రులు, మనకు సారవంతమైన భూమిని ఇచ్చారు. మనం మన తర్వాతి తరాలకు భూమిని సారవంతంగా ఉంచి అప్పగించాలంటే గో ఆధారిత వ్యవసాయం చేయాలి. ఈ వ్యవసాయంలో భూమి సారవంతమవుతుంది. ఆరోగ్యదాయకమైన ధాన్యం పండించుకోవచ్చు. ఆస్పత్రి మెట్లెక్కే అవసరం రాదు. ఇంటిల్లి పాదీ సుఖంగా ఉండవచ్చు, ఇంట్లో ఒక దేశీయ ఆవు ఉంటే అదే మహాభాగ్యమని రైతులోకం గుర్తించాలి. సేంద్రియ కర్బనం పెరగడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. ప్రతి నీటి చుక్కను పట్టుకొనే గుణం భూమికి ఉంటుంది. 20 శాతం నీరు ఆదా అవుతుంది. వర్షాలు తగ్గినా ఇబ్బంది ఉండదు. పూర్వీకులు భూమిని తల్లిగా చూసేవారు, మనం వ్యాపార వస్తువుగా చూస్తున్నాం, మనం పూర్వీకుల బాట పట్టాలి. ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. సంఘటితమై స్వాభిమానం చాటాలి.

- భూపతిరాజు రామకృష్ణంరాజు(94404 87864),
గో ఆధారిత వ్యవసాయదారుడు, నాచుగుంట,
ఉంగుటూరు మండలం, ప. గో. జిల్లా

కలుపు నివారణ : ఇవి మహా మొండివి!

వివిధ పంటల్లో అధికోత్పత్తులు సాధించడానికి సమగ్ర పోషక యాజమాన్యం ఎంత ముఖ్యమో సమగ్ర కలుపు నిర్మూలన కూడా అంతే అవసరం. రైతులు తమకు అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులనూ ఉపయోగించుకొని కలుపు మొక్కల్ని నిర్మూలించాలి. ఎందుకంటే ఇవి పంట మొక్కలతో పోటీ పడి పెరుగుతూ గాలి, నీరు, వెలుతురు, పోషకాలను గ్రహిస్తాయి. దీనివల్ల పంట దిగుబడులు, నాణ్యత దెబ్బతింటాయి. చీడపీడల సమస్య కూడా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు) అందిస్తున్న సూచనలు...

కలుపు మొక్కలు తమ జీవితకాలాన్ని త్వరగా పూర్తి చేసుకుంటాయి. ఒకే పంటకాలంలో చాలాసార్లు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విత్తనాలు భూమి లోపల అనేక సంవత్సరాల పాటు మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి. వాతావరణం అనుకూలించినప్పుడు మొలకెత్తుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి మహా మొండివి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ కూలీల కొరత, అధిక కూలి రేట్లు వంటి కారణాల వల్ల రైతులు సకాలంలో కలుపు మొక్కల్ని నిర్మూలించలేకపోతున్నారు. అయితే వాతావరణం అనుకూలిస్తే వ్యవసాయ పనిముట్లను ఉపయోగించి కూడా కలుపును నివారించవచ్చు. దీనివల్ల నేల గుల్లబారుతుంది. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. నేలకు నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం పెరుగుతుంది.

ఎలా వాడాలి?
పంట విత్తిన వెంటనే లేదా 2 రోజుల లోపు భూమిలో తేమ ఉండేలా చూసుకొని లీటరుకు 5-6 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ (స్టాంప్, పెండిగార్డ్, పెండిమిన్, పెండిస్టార్) లేదా అలాక్లోర్ (లాసో, అలాటాప్) చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందుల్ని మొక్కజొన్న, పత్తి, మిరప, కంది, పెసర, మినుము, సోయాచిక్కుడు, బొబ్బర్లు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వులు, ఆముదంతో పాటు కూరగాయ పంటలైన టమాటా, క్యారట్, ఉల్లి, వెల్లుల్లి, బెండ, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, ధనియాలు, మెంతులు, ఆకుకూరలు, పందిరి జాతి కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు.

తృణ ధాన్యపు పంటలైన జొన్న, సజ్జ, రాగిలో విత్తనాలు వేసిన 24-48 గంటల్లో లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున అట్రాజిన్ (అట్రాటాప్, సోలాలో, మిలేజిన్, సూర్య) కలిపి నేలపై పిచికారీ చేయాలి. ఇక మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి పంటల్లో పైరు, కలుపు మొక్కలు మొలకెత్తిన 15-20 రోజుల తర్వాత లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల 2,4-డీ సోడియం సాల్ట్ (ఫెర్నాక్సాన్, సాలిక్స్) చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు.

అలాగే పత్తి, మిరప, పసుపు, కంది, పెసర, మినుము, సోయాచిక్కుడు, బొబ్బర్లు, వేరుశనగ, ఆముదంతో పాటు కూరగాయ పంటలైన ఉల్లి, వెల్లుల్లి, బెండ, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ధనియాలు, మెంతులు, ఆకుకూరలు, సొర, బీర, కాకర, గుమ్మడి, దోసలో గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల క్విజలాఫాప్-పి-ఇథైల్ (టర్గా సూపర్) లేదా 1.25 మిల్లీలీటర్ల ప్రొపాక్విజాఫాస్ (ఎజిల్) చొప్పున కలిపి పైరు మొక్కలు, కలుపు మొక్కలు మొలకెత్తిన 15-20 రోజుల మధ్య పిచికారీ చేసుకోవాలి. కలుపు మొక్కలు మొలకెత్తిన తర్వాత వాడే మెట్రిబుజిన్ (శంకర్) మందును లీటరు నీటికి 2.5-3 గ్రాముల చొప్పున (చెరకు, టమాటాలో 1.5 గ్రాములు) కలిపి 10-15 రోజుల లోపు పిచికారీ చేసుకోవాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పంటకు సిఫార్సు చేసిన మందును సరైన మోతాదులో, సరైన సమయంలో వాడాలి. కలుపు మందు పక్క పొలానికి ఏమైనా నష్టం కలిగిస్తుందేమో ముందుగానే తెలుసుకోవాలి. స్ప్రేయర్ నుంచి మందు సమానంగా పడేలా చూసుకోవాలి. కలుపు మందును ఒకసారి పిచికారీ చేసిన తర్వాత మళ్లీ వాడకూడదు. ఫ్లాట్ ఫ్యాన్/ఫ్లడ్ జెట్ నాజిల్‌ను ఉపయోగించాలి. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి బాగా వీస్తున్నప్పుడు కలుపు మందు వాడకూడదు. కాబట్టి ఉదయం వేళల్లో గాలి తక్కువగా ఉన్నప్పుడే పిచికారీ చేయడం మంచిది. గాలికి ఎదురుగా మందు పిచికారీ చేయకూడదు.
ఆహార, పశుగ్రాస పంటలపై కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు సూచించిన కాలపరిమితి తర్వాతే పైర్లు కోయాలి. కలుపు మందును తేలికపాటి నేలలో తక్కువ మోతాదులో, సేంద్రియ పదార్థం-బంకమట్టి ఎక్కువగా ఉండే నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో, ఎర్ర నేలల్లో మధ్యస్థంగా వాడుకోవాలి. మందు పిచికారీ చేసిన తర్వాత 6-8 గంటల లోపు వర్షం వస్తే దాని ప్రభావం తగ్గుతుంది.

నీటిలో కరిగే పొడి మందును ఇసుకలో కలిపి వెదజల్లకూడదు. స్పష్టమైన సూచనలు లేనిదే కలుపు మందును పురుగు, తెగుళ్ల మందులతో కలపకూడదు. చేలో బాగా పదును ఉన్నప్పు డే మందులు వాడాలి. కలుపు మందును పిచికారీ చేసిన తర్వాత స్ప్రేయర్‌ను 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. ఎప్పుడూ ఒకే కలుపు నివారణ మందును వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలు దానిని తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటాయి.

అంతరపంట వేయడం మరవద్దు

ప్రధాన పంటలో వరుసల మధ్య వేసుకునే పైరునే అంతరపంట అంటారు. ఒకప్పుడు రైతులు విధిగా అంతరపంటలు వేసుకునే వారు. అయితే ఇప్పుడది బాగా తగ్గిపోయింది. అంతరపంటల వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. నేలలో ఉత్పాదక శక్తి, భూసారం పెరుగుతాయి. నేల కోతకు గురికాదు. భూమిలో తేమ చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. పంటకు ఎక్కువ నీటి తడుల అవసరం ఉండదు. బహుళ పంటల సాగు వల్ల చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది. పప్పు ధాన్యాల పంటలతో ఇతర పంటలను కలిపి వేసుకుంటే నేలలో నత్రజని స్థిరీకరణ జరిగి భూమి సారవంతమవుతుంది.

నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు, అనావృష్టి పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పంటను నష్టపోయినప్పటికీ మరో పంట రైతుకు ఆదాయాన్ని అందిస్తుంది. వాతావరణం అనుకూలిస్తే రెండు పంటల నుంచి మంచి ఆదాయం పొందవచ్చు. ఇన్ని ప్రయోజనాలను అందిస్తున్న అంతరపంటను వేయడం రైతులు మరవకూడదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పంటల్లో వేసుకోదగిన అంతరపంటల గురించి వైఎస్‌ఆర్ జిల్లా ఊటుకూరులోని వ్యవసాయ సలహా-విస్తరణ కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య, కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర పద్మోదయ అందిస్తున్న సూచనలు...
సాలీనా 650 నుంచి 750 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండి, భూమిలో తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నేలలు అంతరపంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి.

కందిలో...
కందిలో పొద్దుతిరుగుడును 1:2 నిష్పత్తిలో వేసుకున్నట్లయితే ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆముదాన్ని 2:1 నిష్పత్తిలో వేయాలి. కొర్రలు వేసే వారు 1:5 నిష్పత్తిని పాటించాలి. కందిలో రాగిని 2:8 నిష్పత్తిలో వేసుకోవచ్చు. కందిలో జొన్న, మొక్కజొన్న, సజ్జను 1:2 నిష్పత్తిలో వేసుకోవాలి. అదేవిధంగా పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగను 1:7 నిష్పత్తిలో వేసుకోవాల్సి ఉంటుంది.

వేరుశనగలో...
వేరుశనగలో కంది, ఆముదం, సజ్జ, జొన్నను అంతరపంటలుగా వేసుకోవచ్చు. వర్షాధార పంటలో ఎర్ర నేలలైతే ప్రతి 7 వేరుశనగ సాళ్లకు ఒక సాలు, నల్ల నేలలైతే ప్రతి 11 వేరుశనగ సాళ్లకు ఒక సాలు కంది వేసుకోవాలి. వేరుశనగలో ఆముదం పంటను 7:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. ప్రతి 6 సాళ్ల వేరుశనగకు 2 సాళ్లు సజ్జ వేసుకోవాలి. దీనివల్ల వైరస్ ద్వారా వ్యాపించే మొవ్వుకుళ్లు తెగులును నివారించవచ్చు కూడా. వేరుశనగలో పొద్దుతిరుగుడును 4:2 నిష్పత్తిలో వేసుకోవాలి.

పత్తిలో...
బీటీ పత్తిని సాగు చేసే నల్లరేగడి నేలల్లో సోయాచిక్కుడు, మినుము, పెసర, బేబీకార్న్, అలసంద పైర్లను అంతరపంటలుగా వేసుకోవచ్చు. పత్తిలో సోయాచిక్కుడును 1:1 నిష్పత్తిలో, పెసరను 1:3 నిష్పత్తిలో వేసుకోవాలి. కందిని 1:4/6 నిష్పత్తిలో వేసుకోవచ్చు. పొద్దుతిరుగుడును అంతరపంటగా వేసుకుంటే పత్తిని ఆశించే పచ్చదోమను సమర్ధవంతంగా నివారించవచ్చు.

ఇవి కూడా...
రెండు మొక్కజొన్న సాళ్ల మధ్య ఒక సాలు కంది లేదా 6 సాళ్ల వేరుశనగ లేదా 6 సాళ్ల అపరాల పంటలు వేసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే మొక్కజొన్నలో సోయాచిక్కుడును 1:1 నిష్పత్తిలో వేసుకోవాలి. పసుపులో మొక్కజొన్నను 2:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. అలాగే ఆముదాన్ని 10/12:1 నిష్పత్తిలో వేసుకోవాలి. ఖరీఫ్ జొన్న, సజ్జ పంటల్లో కందిని 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. అలసందను 1:1 నిష్పత్తిలో వేసుకుంటే కాండం తొలుచు పురుగుల బారి నుంచి జొన్నకు రక్షణ లభిస్తుంది. ఆముదంలో అలసందను 1:1 నిష్పత్తిలో వేసుకుంటే అలసందలో పేను తాకిడి తగ్గుతుంది. కుసుమలో శనగ లేదా ధనియాలను 1:2 నిష్పత్తిలో వేసుకోవచ్చు.

రాగిలో కందిని 8:2 నిష్పత్తిలో, చిక్కుడును 8:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. రాగిలో కంది వేసే వారు రాగి వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. కందిలో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇక రాగిలో చిక్కుడు వేయాలనుకుంటే రాగిలో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. చిక్కుడులో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండాలి.

ఇప్పుడు ఏం చేయాలి?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు వి విధ పంటల్లో చేపట్టాల్సిన చర్యలపై రాజేం ద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందిస్తున్న సూచనలు...
విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణకు వరి, కంది, వేరుశనగ విత్తనాలను విధిగా తెగుళ్ల మందులతో శుద్ధి చేసుకోవాలి. నూనె గింజల పంటల విత్తనాలు విత్తేటప్పుడు గంధకం ఆధారిత రసాయన ఎరువులు వేయాలి. వర్షాధార మొక్కజొన్న పైరు విత్తనాలు వేసేటప్పుడు ఎకరానికి 20-24 కిలోల నత్రజని, 20-24 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాషియంను అందించే రసాయన ఎరువులు వేయాలి. వర్షాధార వేరుశనగ పైరుకు విత్తనాలు వేసేటప్పుడు ఎకరానికి 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ అందించాలి.

పాడి-పంట: ఈ ధాతువులూ అవసరమే!

మొక్కల పెరుగుదలకు సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం. వీటిలో జింక్, ఇనుము ధాతువుల గురించి గతంలో తెలుసుకున్నాం. సూక్ష్మ పోషకాలలో ముఖ్యమైన ఇతర ధాతువులు మె గ్నీషియం, బోరాన్, గంధకం. పత్తి, వేరుశనగ పంటల్లో ఈ పోషకాలు లోపిస్తే ఏం జరుగుతుంది? ఆ లోపాలను ఎలా సవరించాలి? అనే దానిపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి అందిస్తున్న సూచనలు...

జీవ ప్రక్రియలకు తోడ్పడుతుంది
మెగ్నీషియం ధాతువు జీవ ప్రక్రియలకు తోడ్పడుతుంది. పత్తి పైరులో ఈ ధాతు లోపం ఎక్కువగా కన్పిస్తుంది. పైరులో ముదురు, మధ్య ఆకులు ఎర్రబారితే మెగ్నీషియం లోపించినట్లు గ్రహించాలి. అయితే భాస్వరం లోపించినప్పుడు, బెట్ట పరిస్థితుల్లో, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గిపోయినప్పుడు, ఎర్ర నేలల్లో పైరును సాగు చేసినప్పుడు కూడా పత్తి ఆకులు ఎర్రబడతాయి. ఆకులు ఎర్రబడడానికి ఇవేమీ కారణం కాదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి.

ఆహారాన్ని సరఫరా చేస్తుంది
ఆకుల్లో తయారయ్యే ఆహారాన్ని మొక్కలోని వివిధ భాగాలకు చేర్చడంలో బోరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మొక్కలో కాల్షియం, పొటాషియం నిష్పత్తిని కూడా క్రమబద్ధీకరిస్తుంది. పత్తి పైరులో ఈ ధాతువు లోపిస్తే కొత్తగా పెరిగే చివరి మొగ్గలు దెబ్బతింటాయి. కొమ్మల చివరి మొగ్గల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఫలితంగా పక్క నుంచి అనేక కొమ్మలు పుట్టుకొచ్చి, మొక్క గుబురుగా కన్పిస్తుంది. ఆకులు, కాడలు, చివరి మొగ్గలు రంగును, రూపాన్ని కోల్పోతాయి. అన్ని భాగాలు ముతకగా, దళసరిగా, పెళుసుగా, అక్కడక్కడ తేమగా ఉంటాయి. అవన్నీ కుళ్లుతున్నట్లు కన్పిస్తే దానిని బోరాన్ లోపంగా గుర్తించాలి. ఈ ధాతువు లోపిస్తే పిందెలు, కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 కిలోల చొప్పున బోరాక్స్ వేసుకోవాలి. పైరులో లోప లక్షణాలు కన్పిస్తే లీటరు నీటికి 1-1.5 గ్రాముల చొప్పున బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి.

వేర్ల ఏర్పాటుకు సహకరిస్తుంది
గంధకం ధాతువు వివిధ రకాల ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఎంజైముల తయారీకి ఉపయోగపడుతుంది. వేర్లు, విత్తనాలు ఏర్పడడానికి సహకరిస్తుంది. వేరుశనగ పైరులో గంధకం లోపిస్తే కింది ముదురాకులు మామూలుగా ఆకుపచ్చగానే కన్పించినప్పటికీ కొత్తగా వచ్చిన చిగురాకులు మాత్రం చిన్నవిగా, పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకు కాడలు నిటారుగా ఉంటాయి. ఆకులు ఇంగ్లీషు ‘యు’ ఆకారంలో కన్పిస్తాయి. మొక్క సరిగా పెరగక చిన్నదిగా ఉంటుంది. వేర్లపై బుడిపెలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల నత్రజని స్థిరీకరణ తగ్గి, పైరు సరిగా పెరగదు. పంటకు సూపర్ ఫాస్ఫేట్‌ను వేయడం ద్వారా గంధక లోపాన్ని నివారించవచ్చు. లేకుంటే ఎకరానికి 2 క్వింటాళ్ల జిప్సంను దుక్కి సమయంలో లేదా పూత దశలో వేసుకోవచ్చు.

ఏ పైరులో అయినా రెండు మూడు ధాతు లోపాలు ఒకేసారి కన్పిస్తే మిశ్రమ ధాతువుల్ని కలిగిన ఫార్ములా-4, ఫార్ములా-6, మాక్స్ వంటి మందుల్లో ఏదో ఒక దానిని లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పోషకాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కాల్ సెంటర్ శాస్త్రవేత్తలను (ల్యాండ్‌లైన్:1100, మొబైల్:1800-425-1110) కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు.

ఎలుకలు దాడి చేస్తుంటే...

పెనుగొండ ( పశ్చిమ గోదావరి): వరి పైరుకు ఎలుకలు చేసే నష్టం అపారం. ఇవి నారుమడిలో చల్లిన విత్తనాలను తినేస్తాయి. ఆ తర్వాత వివిధ దశల్లోనూ పైరుపై దాడి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎలుకల నివారణకు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు, డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి అందిస్తున్న సూచనలు...

100 గ్రాముల బ్రోమడయోలోన్ విషపు ఎరను తయారు చేసుకోవడానికి 96 గ్రాముల నూకలు+2 గ్రాముల నూనె+ 2 గ్రాముల మందు కలపాలి. ఆ సమయంలో చేతులకు గ్లౌజులు/పాలిథిన్ సంచులు తొడగాలి. లేకపోతే చేతి వాసనను ఎలుకలు పసిగట్టి, ఎరను తినవు. మందును 10 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టుకోవాలి. ఒక్కో బొరియలో 10 గ్రాముల మందు పొ ట్లాన్ని అంగుళం లోపలికి వేసుకోవాలి. బొరియను మూసేయకూడదు. వర్షాలు పడుతున్నప్పుడు మందు కలపకూడదు. వర్షం లో తడిసిన మందు పనిచేయదు. మధ్యాహ్నం వేళ మందును కలిపి, సాయంత్రం బొరియలో వేయాలి. ఈ మందు తిన్న నాలుగైదు రోజులకు ఎలుకలు చనిపోతాయి. వాటిని ఏరి, భూమిలో పాతిపెట్టాలి. బొరియల్లోకి పొగను పంపడం (బర్రో ఫ్యూమిగేషన్) ద్వారా కూడా ఎలుకల్ని మట్టుపెట్టవచ్చు. తొలకరి చినుకు లు పడిన తర్వాత భూమిని దుక్కి చేస్తే ఎలుకల బెడద తగ్గుతుం ది. పొలం గట్లను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.

చెట్టుకూ విశ్రాంతి అవసరమే!

మామిడి కాయల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. చాలా మంది రైతులు కోతల తర్వాత తోటల్ని పట్టించుకోరు. దీనివల్ల చీడపీడల దాడి పెరిగి తదుపరి పంటపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో కాయల కోత అనంతరం మామిడి రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై ఉద్యాన శాఖ జాయింట్ డెరైక్టర్ (రిటైర్డ్) వేంపల్లె లక్ష్మీరెడ్డి అందిస్తున్న సూచనలు...

కత్తిరింపులు ఎందుకు చేయాలి?

మామిడి ఆకులు సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. దీనివల్ల చెట్టుకు కావాల్సిన ఆహార పదార్థాలు సమృద్ధిగా సమకూరుతాయి. అయితే ఓ అధ్యయనం ప్రకారం... చెట్టు గుబురుగా ఉండడం వల్ల సుమారు 85% ఆకులకు తగినంత సూర్యరశ్మి తగలడం లేదు. అవి దాదాపుగా నీడలోనే ఉంటున్నాయి. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతోంది.పైగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే జామ, సీతాఫలం వంటి చెట్ల ఆకులతో పోలిస్తే మామిడి ఆకులకు సూర్యరశ్మిని గ్రహించే శక్తి కాస్త తక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెట్టుకు ఆహార పదార్థాలు (పిండి పదార్థాలు) పూర్తి స్థాయిలో లభించాలంటే అన్ని ఆకుల పైన సూర్యరశ్మి పడాలి. ఇందుకోసం కొమ్మల కత్తిరింపు తప్పనిసరి. దీనివల్ల చెట్లకు చీడపీడల బెడద కూడా తగ్గుతుంది.

ఎలా చేయాలి?

కాయలు కోసిన తర్వాత 15-20 రోజుల పాటు చెట్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే అప్పటి వరకు చెట్లు కాయల వృద్ధికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తాయి. కోత తర్వాత అవి నీరసిస్తాయి. కాబట్టి చెట్లకు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే కొమ్మల కత్తిరింపు జరపాలి. ఆగస్ట్ మొదటి పక్షం లోగా కత్తిరింపులు పూర్తి చేయాలి. ఇందుకోసం అడ్డదిడ్డంగా పెరిగిన, తెగులు సోకి ఎండిపోయిన కొమ్మల్ని పూర్తిగా తొలగించాలి. అలాగే నేలను తాకుతూ వ్యవసాయ పనులకు అడ్డుగా ఉన్న కొమ్మల్ని కత్తిరించాలి. ఎండిన పూత కాడల (కొరడాలు) కారణంగా ఎండు తెగులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు పడకముందే వాటిని కూడా తీసేయాలి.

సూర్యరశ్మి, గాలి బాగా ప్రసరించేందుకు వీలుగా గుబురుగా పెరిగిన చెట్ల తల పైన 3-4 అంగుళాల మందం ఉన్న కొమ్మల్ని తీసేయాలి. దీనివల్ల మధ్యాహ్నపు ఎండ చెట్టు మొదలుపై పడుతుంది. అవసరమైతే తూర్పు-పడమర దిశలో కూడా 2-3 అంగుళాల మందం ఉన్న కొమ్మల్ని దిశకు ఒకటి చొప్పున తొలగించాలి. ఈ విధంగా కత్తిరింపులు చేస్తే ఆకులకు సూర్యరశ్మి బాగా తగులుతుంది.

ఆల్ఫోన్సో (కాధర్), బంగినపల్లి (బేనిషాన్) రకాల చెట్లు ప్రతి సంవత్సరం కాపుకు వచ్చి, మంచి దిగుబడులు అందించాలంటే జూలైలో అన్ని చిరుకొమ్మల్ని 10 సెంటీమీటర్ల వెనక్కి (ఆకులు గుంపుగా ఉన్న చోటుకు అంగు ళం పైకి) కత్తిరించాలి. దీనివల్ల ప్రతి కొమ్మ పైన 3-4 చిగురు కొమ్మలు పుడతాయి. వాటిలో ఆ రోగ్యంగా, దృఢంగా ఉన్న కొమ్మలు డిసెంబర్ నాటికి ముదిరి, జనవరిలో పూతకు వస్తాయి.

తల మార్పిడి చేయాలంటే...

నాటు రకం చెట్లు, తక్కువ దిగుబడిని అందించే చెట్లు, మార్కెట్‌లో మంచి ధర పలకని రకాలకు చెందిన చెట్లు... ఇలాంటి చెట్ల వల్ల రైతుకు ఆదాయం సరిగా రాదు. వీటి నుంచి కూడా నాణ్యమైన, అధిక దిగుబడులు పొందాలంటే తల మార్పిడి (టాప్ వర్కింగ్) చేయాలి. కాయల కోత తర్వాత జూలైలో కొమ్మలన్నింటినీ 4-5 అడుగుల పొడవు ఉంచి, రంపంతో కోసేయాలి. వాటిపై పుట్టుకొచ్చే లేత కొమ్మలకు సెప్టెంబర్‌లో మంచి రకాల కొమ్మలతో అంట్లు కట్టాలి.

కత్తిరింపుల తర్వాత...
కత్తిరింపులు చేసిన వెంటనే కోసిన భాగంపై మందు ద్రావణాన్ని పూయాలి. లీటరు నీటికి 10 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+6 గ్రాముల కార్బరిల్ చొప్పున కలిపి మందు ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. అలాగే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+10 గ్రాముల యూరియా చొప్పున కలిపి చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.

అంతర సేద్యం చేయాలి

కాయల కోత తర్వాత తోటల్లో పడిన టెంకలు, ఎండు పుల్లల్ని ఏరి కాల్చేయాలి. జూలైలో వర్షాలు పడగానే భూమిని 2-3 సార్లు దున్నాలి. చెట్ల కింద దున్నడం కుదరకపోతే పారతో మట్టిని కలపాలి. సెప్టెంబర్ తర్వాత భూమిని దున్నకపోవడమే మంచిది.

ఎరువులు ఇలా...

రాలిపడిన ఎండుటాకుల్ని చెట్ల పాదుల్లో వేసి, మట్టితో కప్పేస్తే ఆ తర్వాత అవి కుళ్లి సేంద్రియ పదార్థంగా మారతాయి. చెట్లకు బలాన్నిస్తాయి. జూలై-ఆగస్ట్ నెలల్లో జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు చల్లి పూత దశలో మొక్కల్ని భూమిలో కలియదున్నాలి. జూలై-ఆగస్ట్‌లో ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు వేయాలి. నీటి వసతి ఉంటే... చెట్టుకు కిలో యూరియా, 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 750 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసి తడి ఇవ్వాలి. వర్షాధారపు తోటల్లో ఒక్కో చెట్టుకు 2 కిలోల యూరియా, 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. చెట్టు మొదలుకు 4-5 అడుగుల దూరంలో గాడి తీసి, అందులో ఎరువులు వేసి మట్టితో కప్పేయాలి.

చిన్న రైతుకు పెద్ద వరం! వర్మి కంపోస్ట్ ద్వారా...

రసాయన ఎరువుల్ని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి బారి నుంచి పంటల్ని కాపాడుకోవాలంటే సేంద్రియ ఎరువుల వినియోగం తప్పనిసరి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విదేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, నాణ్యమైన వ్యవసాయోత్పత్తుల్ని అందించడానికి కూడా వీటి వాడకం అవసరమే.

వర్మి కంపోస్ట్ ద్వారా...
గతంలో రైతులు పశువులు/జీవాల ఎరువు, కంపోస్ట్, వేప/వేరుశనగ చెక్క వంటి సేంద్రియ ఎరువులు బాగా వాడేవారు. అయితే ఇప్పుడు వాటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో... పరిమితంగా లభిస్తున్న సేంద్రియ పదార్థాల్ని ఉపయోగించి తక్కువ పెట్టుబడి-శ్రమతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అధిక పోషక విలువలు కలిగిన వర్మి కల్చర్ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది.

పనికిరాని సేంద్రియ వ్యర్థ పదార్థాల్ని వానపాముల సాయంతో సారవంతమైన ఎరువుగా మార్చడాన్నే వర్మి కంపోస్ట్ అంటారు. వానపాములు సేంద్రియ వ్యర్థ పదార్థాల్ని ఆహారంగా తీసుకొని జీవిస్తూ, మట్టిని సారవంతం చేస్తాయి. వర్మి కంపోస్ట్ తయారీకి భూమి పైపొరల్లో సంచరించే వానపాములు అనువుగా ఉంటాయి.

వర్మి బెడ్ అంటే...
ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పద్ధతుల ద్వారా వర్మి కంపోస్ట్‌ను తయారు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. అయితే చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వానపాముల ఎరువును సులభంగా తయారు చేసుకునే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పద్ధతి వారికో పెద్ద వరం. అదే పోర్టబుల్/మొబైల్ ‘వర్మి బెడ్’. దీనికి ఎక్కడికైనా తీసికెళ్లవచ్చు. మనకు అనువైన స్థలంలో, తేలికగా అమర్చుకోవచ్చు. మొబైల్ వర్మి బెడ్‌ను వ్యవసాయ శాఖ సబ్సిడీ మీద రైతులకు అందజేస్తోంది. 12 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు ఉండేలా వర్మి బెడ్‌ను తయారు చేస్తారు. ఇది దృఢంగా ఉంటుంది కాబట్టి చినిగిపోదు.

ఎండ, వానల్ని తట్టుకుంటుంది. అన్ని వైపుల నుంచి లోపలికి గాలి తగులుతుంది. ఒక్కో వర్మి బెడ్ నుంచి 45-60 రోజుల్లో 1.5 టన్నుల కంపోస్ట్ తయారవుతుంది. వ్యవసాయాధికారుల సూచనల మేరకు వర్మి బెడ్లను అమర్చుకోవాలి. వర్మి కంపోస్ట్ తయారీకి పశువులు/జీవాల ఎరువు, కలుపు మొక్కలు, కూరగాయలు/పండ్ల వ్యర్థాలు, వివిధ పంటల వ్యర్థాలు అవసరమవుతాయి. అయితే ఇనుము, గాజు, రాయి, పాలిథిన్, సింథటిక్ వంటి వాటిని వాడకూడదు.

ఏం చేయాలి?
బెడ్ అడుగున ఎండుటాకులు, గడ్డి, చెత్తాచెదారం వంటి వ్యర్థాల్ని 15 సెంటీమీటర్ల మందాన వేయాలి. వాటి మీద బాగా కుళ్లిన పశువులు/జీవాల ఎరువును 15 సెంటీమీటర్ల మందంతో రెండో పొరగా వేసుకోవాలి. పశువుల మూత్రంలో పశువుల ఎరువు కలిపి, దానిని ఆ పొర మీద చల్లుకోవాలి. దానిని 2 రోజుల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఒక చదరపు మీటరుకు వెయ్యి వానపాముల చొప్పున వదలాలి. వాటి పైన పాక్షికంగా కుళ్లిపోయిన సేంద్రియ పదార్థాల్ని 20 సెంటీమీటర్ల మందాన పరవాలి.
బెడ్‌లో వానపాముల్ని వదిలిన తర్వాత ప్రతి రోజూ కొద్దికొద్దిగా నీరు చల్లుతూ ఉండాలి. బెడ్‌లో 30-40% తేమ ఉండాలి.

తేమను కాపాడటానికి, పక్షుల దాడి నుంచి వానపాముల్ని రక్షించుకోవడానికి బెడ్ పైన పాత గోనె సంచులు/వరిగడ్డిని పరవాలి. 45-60 రోజుల్లో తయారయ్యే వర్మి కంపోస్ట్ నల్లగా, తేలికగా ఉంటుంది. ఎలాంటి చెడు వాసన రాదు. వానపాములు పైకి వస్తాయి. అప్పుడు బెడ్ పైన 3-4 రోజుల పాటు నీటిని చల్లితే వానపాములు తేమ కోసం బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఈ విధంగా సంవత్సరానికి 5-6 సార్లు వర్మి కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందులో సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, రాగి, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి.

ఎలా వాడాలి?
వరి నాట్లు వేసిన తర్వాత ఎకరానికి టన్ను వర్మి కంపోస్ట్ వేసుకోవాలి. పత్తి, మిరప, మొక్కజొన్న పసుపు పంటల్లో టన్ను, చెరకు, పొద్దుతిరుగుడు పంటల్లో 1.5 టన్నులు, బెండ, టమాటా, వంగ పైర్లలో 1-1.5 టన్నుల వర్మి కంపోస్ట్‌ను దుక్కిలో వేయాలి. మామిడి, కొబ్బరి, నిమ్మ, దానిమ్మ తోటల్లో చెట్లు నాటేటప్పుడు ఒక్కో చెట్టుకు 2 కిలోలు, 1-5 ఏళ్ల వయసున్న చెట్టుకు 5 కిలోలు, 6-9 ఏళ్ల వయసున్న చెట్టుకు 10 కిలోలు, పదేళ్ల పైబడిన చెట్టుకు 20 కిలోల చొప్పున వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు.

ఉపయోగాలెన్నో...
వర్మి కంపోస్ట్ నేలను గుల్లబరుస్తుంది. భూసారాన్ని పెంచుతుంది. మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి దోహదపడుతుంది. వాటికి చీడపీడల్ని తట్టుకునే సామర్థ్యం చేకూరుతుంది. పంట దిగుబడి, నాణ్యత పెరుగుతాయి. నేలకు నీటిని పట్టి ఉంచే సామర్ధ్యం కూడా పెరుగుతుంది.

వర్మి వాష్‌ను ఎలా వాడాలంటే...
వర్మి బెడ్ నుంచి వర్మి వాష్ అనే ద్రవ పదార్థాన్ని కూడా సేకరించవచ్చు. దీనిని 4-5 లీటర్ల నీటిలో లీటరు కలిపి పంటపై పిచికారీ చేసుకోవచ్చు. లేదా లీటరు వర్మివాష్, లీటరు ఆవు మూత్రాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. దీనివల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. చీడపీడల్ని తట్టుకునే సామర్ధ్యాన్ని పొందుతాయి.
డాక్టర్ ఎన్.మల్లిఖార్జునరావు
పోగ్రాం కో-ఆర్డినేటర్
ఎం.స్వాతి, రిసెర్చ్ అసోసియేట్
కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఖమ్మం జిల్లా

పూతకు రాకముందే పీకేయాలి

వర్షాలు పడుతున్నాయంటే చాలు... రైతులు ముందుగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కల గురించే. ఇక్కడా... అక్కడా.... అని లేకుండా ఈ మొక్క ఎక్కడైనా పెరుగుతుంది. దీనిని వివిధ ప్రాంతాల్లో క్యారట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కపుల్లాకు, కాంగ్రెస్ గడ్డి, చేతక్ చాందిని, అపాది, గజర్ అని కూడా పిలుస్తుంటారు. పేరేదైనా ఈ మొక్క కలిగించే నష్టం అపారం.

మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. దూర ప్రాంతాలకు సైతం తేలికగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో వయ్యారిభామ కలుపు మొక్కల గురించి ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.సంధ్యారాణి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఒ.శారద, ఎం.సునీల్ కుమార్ అందిస్తున్న ఆసక్తికరమైన విషయాలు...

ఏం జరుగుతుంది?
వయ్యారిభామ వల్ల పంట మొక్కలకే కాదు... మనుషులు, పశువులకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. మనుషులు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధమైన అలర్జీతో బాధపడతారు. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పలు వాయడం వంటి సమస్యలూ వస్తాయి. ఈ విషపూరితమైన మొక్కల్ని తింటే పశువులు హైపర్ టెన్షన్‌కు గురవుతాయి. వాటి వెంట్రుకలు రాలిపోతాయి.

ఇక పంటల విషయానికి వస్తే... వయ్యారిభామ మొక్కలు నీరు, పోషకాల కోసం పంట మొక్కలతో పోటీ పడి పెరుగుతుంటాయి. ఫలితంగా దిగుబడులు 40% వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాటా, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వుకుళ్లు, కాండంకుళ్లు తెగుళ్లు సోకవచ్చు. వేరుశనగ పైరుకు నెక్రోసిస్ తెగులు సోకుతుంది. వయ్యారిభామ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. వాటి దిగుబడిని తగ్గిస్తాయి. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న వయ్యారిభామ మొక్కల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమ గ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

ఏం చేయాలంటే...
వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాటిని చేతితో పీకేయాలి. మొక్కలు పూత దశకు రాకముందే పీకి తగలబెట్టాలి. లేకుంటే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కల్ని పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి.

రసాయనాలతో...
మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలకెత్తక ముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. మొక్కజొన్న, జొన్న పంటల్లో విత్తనాలు మొలకెత్తిన 15-20 రోజులకు లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున 2,4-డి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాస పంటలు వేసే వారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేయాలి.

ఆ సమయంలో చేలో వయ్యారిభామ మొక్కలు కూడా ఉండకూడదు. పశుగ్రాస పైరు మొలకెత్తి న 15-20 రోజులకు లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. లేకుంటే లీటరు నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్ లేదా 5-7 మిల్లీలీటర్ల పారాక్వాట్ చొప్పున కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు.

కంపోస్ట్ తయారీ ఇలా...
వయ్యారిభామ మొక్కలు ఎంత హానికరమైనవి అయినప్పటికీ వాటిని ఉపయోగించి కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేలా గుంతను తవ్వాలి. అందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కల్ని వేసి, వాటిపై 5 కిలోల యూరియా లేదా 50 కిలోల రాక్ ఫాస్ఫేట్ చల్లుకోవాలి. వీలైతే 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె కూడా చల్లవచ్చు. ఒకవేళ వయ్యారిభామ మొక్కలకు వేర్లు లేకపోతే 10-15 కిలోల బంకమట్టి కలపాలి.

ఈ విధంగా పొరలు పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేయాలి. నాలుగైదు నెలల్లో కంపోస్ట్ తయారవుతుంది. దానిని జల్లెడ పట్టి, పంటకు వేసుకోవాలి. ఈ కంపోస్ట్‌లో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. కూరగాయ పంటలకు ఎకరానికి 2 కిలోల కంపోస్ట్ వేసుకోవచ్చు.
వయ్యారిభామ మొక్కలతో తయారైన ఎరువు మనుషులు, పశువులు, పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. వయ్యారిభామలో ఉండే పార్థినిస్ అనే హానికరమైన రసాయనం ఎరువు తయారీ దశలోనే నశిస్తుంది. కంపోస్ట్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని, అన్ని పంటలకూ వేసుకోవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలి?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చేపట్టాల్సిన చర్యలపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందిస్తున్న

సూచనలు...
పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి వర్షాధార పంటల్ని నేల పూర్తిగా తడిసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కొత్తగా పండ్ల తోటలు పెట్టే వారు గుంతలు తీసుకోవాలి. టమాటా, వంగ, మిరప వంటి కూరగాయ పంటలకు నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగ జాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలి.

పంట వేస్తున్నారా? విత్తనశుద్ధి మరవద్దు!

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని రైతన్నలు వివిధ పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఏ పంట వేసినా రైతులు ముందుగా విత్తనాలను సేకరించుకోవాలి. వాటిని విధిగా శుద్ధి చేయాలి. అప్పుడే చీడపీడల బారి నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. హైబ్రిడ్ విత్తనాలను ఆయా కంపెనీలే శుద్ధి చేసి విక్రయిస్తాయి. అయినప్పటికీ రైతులు మరోసారి విత్తనశుద్ధి చేసుకోవడం మంచిది. దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు. పైగా మంచి దిగుబడులు వస్తాయి. ఈ నేపథ్యంలో వివిధ పంటల్లో విత్తనశుద్ధిపై వైఎస్‌ఆర్ జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య అందిస్తున్న సూచనలు...

ఆహార ధాన్యపు పంటల్లో...
కిలో వరి విత్తనాలకు 3 గ్రాముల చొప్పున కార్బండజిమ్ కలిపి, 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దుంప నారుమడులైతే లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి, మరో 24 గంటలు మండె కట్టాలి. ఆ మొలకల్ని దుంప నారుమడిలో చల్లాలి. ఇక మొక్కజొన్న వేసే వారు కిలో విత్తనాలకు 3 గ్రాముల మాంకోజెబ్/థైరమ్/కాప్టాన్ చొప్పున పట్టించాలి. విత్తనశుద్ధి చేసిన తర్వాత విత్తనాలను నీటిలో నానబెట్టకూడదు. జొన్న వేసే వారు కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/కాప్టాన్ చొప్పున కలపాలి. మొవ్వు తొలిచే ఈగ నివారణకు కిలో విత్తనాలకు 3 గ్రాముల చొప్పున థయోమిథాక్సామ్ కలపాలి.

సజ్జ విత్తనాలను శుద్ధి చేయాలంటే ముందుగా లీటరు నీటికి 20 గ్రాముల చొప్పున ఉప్పు కలపాలి. ఆ ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. దీనివల్ల ఎర్గాట్ శిలీంద్ర అవశేషాలు పైకి తేలతాయి. వాటిని తొలగించి, విత్తనాలను బాగా ఆరబెట్టాలి. అనంతరం కిలో విత్తనాలకు 3 గ్రాముల చొప్పున థైరమ్ పట్టించాలి. రాగి విత్తనాల శుద్ధి కోసం కిలో విత్తనాలకు 2 గ్రాముల కార్బండజిమ్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ చొప్పున కలపాలి.

పప్పు పంటల్లో...
కంది పంట వేసే వారు ఎకరానికి సరిపడే విత్తనాలకు 200-400 గ్రాముల రైజోబియం కల్చర్ కలిపితే మంచి దిగుబడులు వస్తాయి. ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 5 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడెను పట్టించాలి. అయితే ఫైటోఫ్తోరా ఎండు తెగులు సోకే ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 2 గ్రాముల చొప్పున మెటలాక్సిల్ కలపాలి. మినుము/పెసర పంట వేసేటప్పుడు కిలో విత్తనాలకు ముందుగా 30 గ్రాముల చొప్పున కార్బోసల్ఫాన్ పట్టించాలి. మొక్కలు మొలిచిన తర్వాత 15-20 రోజుల వరకు పంటను రసం పీల్చే పురుగుల బారి నుంచి కాపాడుకోవాలంటే కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/థయోమిథాక్సామ్ చొప్పున కలపాలి. కొత్తగా పైరు వేసే వారు రైజోబియం కల్చర్‌ను కలిపితే మంచి దిగుబడులు వస్తాయి.

నూనె గింజల పంటల్లో...
కిలో వేరుశనగ విత్తనాలకు ఒక గ్రాము టెబ్యుకొనజోల్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కార్బండజిమ్ చొప్పున పట్టించాలి. కాండంకుళ్లు వైరస్ తెగులు సోకే ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 2 మిల్లీలీటర్ల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ కలపాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కిలో విత్తనాలకు 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ చొప్పున కలపాలి. వరి మాగాణుల్లో వేసే వారు లేదా కొత్తగా వేరుశనగ సాగు చేసే వారు విత్తనాలకు రైజోబియం కల్చర్‌ను పట్టించాలి.

మొదలుకుళ్లు, వేరుకుళ్లు, కాండంకుళ్లు తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉన్న చోట కిలో వేరుశనగ విత్తనాలకు 4 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడెను పట్టించాలి. విత్తనాలను ముందుగా క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి, ఆరబెట్టాలి. ఆ తర్వాత శిలీంద్ర నాశనిని పట్టించాలి. అవసరమైతే రైజోబియం కల్చర్‌ను కూడా కలపవచ్చు. కిలో ఆముదం విత్తనాలకు 3 గ్రాముల కార్బండజిమ్/మాంకోజెబ్ చొప్పున పట్టిస్తే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, మొలక దశలో సోకే కుళ్లు తెగులు, వేరు-కాండంకుళ్లు తెగులును నివారించవచ్చు.

పత్తిలో...
కిలో పత్తి విత్తనాలను 80-100 మిల్లీలీటర్ల గాఢ గంధకపు ఆమ్లంలో 2-3 నిమిషాల పాటు ఉంచాలి. ఆ వెంటనే వాటిని 2-3 సార్లు నీటితో, తర్వాత సున్నపు తేటతో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఈ విధంగా శుద్ధి చేసిన కిలో విత్తనాలకు తగినంత జిగురు కలపాలి. వాటికి 40 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పట్టించాలి. ఎండాకు, వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్ లేదా 2 గ్రాముల కార్బండజిమ్ లేదా 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్/ట్రైకోడెర్మా విరిడె చొప్పున కలిపి విత్తుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నారుమడుల్లో సస్యరక్షణ
కూరగాయ పంటల నారుమడుల్లో నారుకుళ్లు తెగులు కన్పించినట్లయితే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి, ఆ మందు ద్రావణంతో నారుమడిని పూర్తిగా తడపాలి. రసం పీల్చే పురుగులను గమనించినట్లయితే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు.

పప్పులే కాదు.. భూమికి బలాన్నీ ఇస్తాయి!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పడుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని రైతులు పెసర, మినుము విత్తనాలు వేసుకుంటున్నారు. మార్కెట్‌లో పప్పు ధాన్యాలకు మంచి రేటు పలుకుతుండడంతో చాలా మంది రైతన్నలు ఇప్పుడు వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పైగా ఇవి అతి తక్కువ కాలంలో చేతికొస్తాయి.

గాలిలోని నత్రజనిని రైజోబియుం బాక్టీరియూ సాయంతో స్థిరీకరించి, పంట ఎదుగుదలకు దోహదపడడంతో పాటు ఎకరానికి 16-20 కిలోల నత్రజని ఎరువును అందిస్తాయి. పంట తీసుకున్న తర్వాత భూమిలో కలియదున్నితే పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడి భూసారాన్ని పెంచుతాయి. రైతులు మేలైన రకాలను ఎంచుకొని, తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చునని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటయ్య. ఆ వివరాలు...

పెసర పంటే ఎందుకు?
పెసరను పంటమార్పిడి పైరుగా, అంతరపంటగా కూడా వేసుకోవచ్చు. ఆయుకట్టు ప్రాంతాలలోనూ, చెరువులు-వ్యవసాయ బావులు వంటి నీటి వనరుల కింద వరి పండించే భూముల్లోనూ ముందుగా పెసర వేసుకొని, ఆ తర్వాత వరి వేసుకోవచ్చు. అయితే పైరు ఒకేసారి కోతకు రాకపోవడం, చీడపీడలకు సులభంగా లోనవడం వంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెసరను అన్ని రకాల నేలల్లో సాగు చేయువచ్చు. కానీ చౌడు నేలలు, మరుగు నీరు నిలిచే భూములు పనికిరావు.

అనువైన రకాలివే
ఎల్‌జీజీ-407 రకం పంటకాలం 70-75 రోజులు. మొక్కలు నిటారుగా పెరిగి కాయులు మొక్క పైభాగాన కాస్తారుు. గింజలు మెరుస్తూ వుధ్యస్థ లావుగా ఉంటారుు. ఈ రకం ఎల్లో మొజారుుక్, నల్ల ఆకువుచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. ఎల్‌జీజీ-410 రకం 75 రోజుల పంట. మొక్కలు నిటారుగా, గుబురుగా పెరుగుతారుు. గింజలు పెద్దవిగా మెరుస్తూ ఉంటారు. పైరు ఒకేసారి కోతకు వస్తుంది. ఎల్‌జీజీ-450 రకం పైరు 65-70 రోజుల్లో కోతకు వస్తుంది. మొక్కలు వుధ్యస్థ ఎత్తులో ఉండి, గుబురుగా కన్పిస్తారుు. పంట చేతికొచ్చే సవుయుంలో వర్షాలు కురిసినప్పటికీ గింజలు కొంతమేర చెడిపోవు.

పూసా-105 రకం పంటకాలం 65-70 రోజులు. ఇది అన్ని ప్రాంతాలకూ అనువైనది. కాయులన్నీ పైభాగంలోనే ఉండి ఒకేసారి కోతకు వస్తాయి. ఈ రకం పల్లాకు, ఆకువుచ్చ తెగుళ్లను కొంతమేర తట్టుకుంటుంది. ఎంజీజీ -295 రకం 65-70 రోజుల పంట. మొక్కలు నిటారుగా పెరుగుతారుు. ఈ రకం నల్లవుచ్చ తెగులును తట్టుకుంటుంది. గింజ వుధ్యస్థ లావుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. డబ్ల్యూజీజీ-37 రకం పంటకాలం 60-65 రోజులు. గింజలు ఆకర్షణీయుంగా, పచ్చగా మెరుస్తుంటారు. దీనిని అన్ని ప్రాంతాల్లో సాగు చేయువచ్చు. పైరు ఒకేసారి కోతకు వస్తుంది. ఎల్లో మెజారుక్ తెగులును తట్టుకుంటుంది.

ఎల్‌జీజీ-460 రకం 60-65 రోజుల పంట. కాయులు గుత్తులుగా ఉండి కోయుడానికి సులువుగా ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఎంఎల్-267 రకం 65 రోజుల పంట. అన్ని ప్రాంతాలకూ అనువైనది. మొక్క నిటారుగా ఉండి కింది నుండి పై దాకా కాస్తుంది. పెసర రకాలన్నీ ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని అందిస్తాయి.

తేమను నిలుపుకునే నేలల్లో...
మినుమును నల్లరేగడి భూవుుల్లో పొగాకు పంటకు వుుందు ఎక్కువగా సాగు చేస్తారు. పంటల సరళిలో దీనిని పంటవూర్పిడి పైరుగా, అంతరపంటగా వేస్తారు. అయితే తొలకరిలో వేసే మినువుు పంట నీటి ఎద్దడిని త ట్టుకోలేదు. కాబట్టి తేవును నిలుపుకోలేని తేలికపాటి భూవుులు, ఎర్ర నేలలు మినువుు సాగుకు పనికిరావు. ఖరీఫ్ పైరుకు పల్లాకు, ఆకుముడత తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి.

ఈ రకాలు వేసుకోవచ్చు
ఎల్‌బీజీ-20 రకం ఆకులు సన్నగా, పొడవుగా వుుదురాకుపచ్చ రంగులో ఉంటారుు. ఈ రకం పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు నల్లగా మెరుస్తుంటారుు. పైరు 70-75 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. డబ్ల్యుబీజీ-26 రకం మొక్కలు గుబురుగా, పొట్టిగా ఉంటారుు. గింజలు సాదాగా ఉంటారు. ఈ రకం పల్లాకు తెగులును కొంతమేర తట్టుకోగలదు. దీని పంటకాలం 70-75 రోజులు. ఎకరానికి

సుమారు 5 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది.
ఎల్‌బీజీ-623 రకం కాయులు పొడవుగా, లావుగా ఉంటాయి. వాటి పైన నూగు చాలా తక్కువగా ఉంటుంది. గింజలు లావుగా మెరుస్తూ ఉంటారుు. మొక్కలు గుబురుగా పెరుగుతారుు. ఈ రకం బూడిద తెగులును కొంతమేర తట్టుకుంటుంది. దీని పంటకాలం 75-80 రోజులు. ఎకరానికి 7 క్వింటాళ్లకు పైగా దిగుబడిని అందించగలదు. టీ-9 రకం మొక్కలు గుబురుగా, పొట్టిగా ఉంటారుు. ఆకులు సన్నగా, వుుదురాకుపచ్చ రంగులో ఉంటారు. దీని పంటకాలం 70-75 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

సాగు ఇలా...
పెసర పంటకు ఎకరానికి 6-7 కిలోలు, మినుముకు 8-10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తడానికి ముందు కిలో విత్తనాలకు 30 గ్రాముల కార్బోఫ్యూరాన్ మందును పట్టించి శుద్ధి చేయాలి. పైరును తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/థయోమిథాక్సామ్ చొప్పున కలపాలి. ఈ పైర్లను కొత్తగా సాగు చేసే వారు రైజోబియం కల్చర్‌ను కూడా కలిపితే మంచి దిగుబడులు వస్తాయి.

నారుమడిని నష్టపరిచే పురుగులివే

పెనుగొండ (పశ్చిమ గోదావరి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొంతమంది రైతులు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే నారు పోసుకుంటున్నారు. వరిలో మంచి దిగుబడులు సాధించాలంటే చీడపీడలు ఆశించని ఆరోగ్యవంతమైన నారును పెంచాల్సిన అవసరం ఉన్నదని పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ కె.వసంతభాను, డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి నారుమడిని ఆశించే హిస్పా, కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు పురుగుల నివారణకు వారు అందిస్తున్న సూచనలు...

రైతులు ముందుగా తమ ప్రాంతానికి అనువైన, చీడపీడల్ని తట్టుకునే వంగడాల్ని ఎంపిక చేసుకోవాలి. తెగుళ్లు చాలా వరకు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన పొలం నుంచే విత్తనాలను సేకరించాలి. లేదా విత్తనాలను విధిగా శుద్ధి చేయాలి. ఇందుకోసం లీటరు నీటిలో ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ మందు ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి, ఆ తర్వాత మండె కట్టాలి. నారుమడిని ప్రతి రోజూ గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

ముందుగా గడ్డిని ఆశ్రయించి...

తొలకరిలో కురిసిన వర్షాలకు పొలం గట్ల పైన, పొలంలో గడ్డి బాగా పెరుగుతుంది. నారు పోయకముందే హిస్పా పురుగులు ఈ గడ్డిని ఆశ్రయిస్తాయి. ఆ తర్వాత నారుపై దాడి చేస్తాయి. హిస్పా అనేది నీలం, నలుపు రంగులతో కూడిన పెంకు పురుగు. దీని శరీరంపై ముళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. తల్లి పెంకు పురుగు కూడా నారుమడిని నష్టపరుస్తుంది. ఈ పురుగులు ఆశించడం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు, తెల్లని నిలువు చారలు ఏర్పడతాయి. చివరికి ఆకులు ఎండిపోతాయి.

వర్షాలు ఆలస్యమైతే...

తొలకరి వర్షాలు జూన్ మొదటి వారంలో పడి, నారుమడులు సకాలంలో పోసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు తాకిడి ఉండదు. అయితే ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. జూలై ప్రవేశించినా వరుణుడు కనికరించడం లేదు. ఒకవేళ ఇప్పుడు వర్షాలు పడినప్పటికీ నారుమడిని కాండం తొలుచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది. దీని రెక్కల పురుగులు పసుపు రంగులో ఉంటాయి. రెక్కల ముందు, రెక్కల మధ్యలో నల్లని మచ్చలు కన్పిస్తాయి. ఒక్కో పురుగు ఆకుల చివరి భాగంలో 20-70 గుడ్లను సముదాయాలుగా పెట్టి, వాటిని వెంట్రుకలతో కప్పుతుంది. ఈ గుడ్ల నుంచి వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వచ్చి, మూడు రోజుల్లో కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినేస్తాయి. దీనివల్ల మొవ్వు ఆకు ఎండి చనిపోతుంది.

అంకురం వృద్ధి చెందదు

గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాకు, తెలంగాణలోని అన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఉల్లికోడు పురుగు ఇటీవలి కాలంలో ఇతర ప్రాంతాలకూ వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఉల్లికోడు పురుగులు పిలక దశ తర్వాతే పంటపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్ పంట సాగు ఆలస్యమవుతుండడంతో ఈ పురుగు తాకిడి నారుమడి దశలోనే కన్పిస్తోంది. ఉల్లికోడు పురుగులు ముదురు ఎరుపు రంగులో దోమల మాదిరిగా ఉంటాయి. ఇవి ఆకులపై విడిగా కానీ లేదా 2-3 గుడ్లను కలిపి కానీ పెడతాయి. వీటి నుండి వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వస్తాయి. అవి అంకురం వద్దకు చేరి, అక్కడ ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల అంకురం ఆకుగా వృద్ధి చెందదు. అది పొడవాటి గొట్టంగా మారి, ఉల్లికోడు మాదిరిగా బయటికి వస్తుంది.

ఇవి కూడా...

నారుమడి పోసిన తర్వాత వర్షాభావ పరిస్థితులు ఎదురైతే... ముఖ్యంగా మెట్ట నారుమడుల్ని తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగులు ఆకుల చివర్ల నుండి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకు చివర్లు ఎండిపోతాయి. ఒకవేళ నారుమడి పోసిన తర్వాత వర్షాలు బాగా కురిసి మొక్కలు ముంపుకు గురైతే వాటిని నారును కత్తిరించే లద్దె పురుగులు ఆశిస్తాయి. ఇవి రాత్రి సమయంలో నారుమడిని ఆశించి, మొక్కల్ని కొరికేస్తాయి. పగటి వేళ కలుపు మొక్కల పైన, భూమిలోనూ ఉంటాయి.

ఏం చేయాలి?

నారు పోసిన ఏడవ రోజు నుంచే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్/ప్రొఫెనోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేకుంటే నారు తీయడానికి వారం రోజుల ముందు 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ లేదా 50 గ్రాముల ఫోరేట్ 10జీ గుళికల్ని ఇసుకలో కలిపి సెంటు నారుమడిలో చల్లుకోవాలి. ఆ సమయంలో నారుమడిలో నీరు పలచగా ఉండాలి. నారుమడిని లద్దె పురుగు ఆశిస్తే పైన తెలిపిన మందుల్ని సాయంత్రం వేళ పిచికారీ చేసుకోవాలి.

ఎండిన బోర్లలోకి వాన నీటిని ఒడిసిపట్టి కరువుకు చెక్! చినుకు బతికిం‘చేను’

కరువు తాకిడికి రైతులు విలవిల్లాడుతుంటే.. పూర్తిస్థాయి వర్షాల జాడ లేక కళ తప్పిన పొలాలు బావురుమంటున్నాయి. కానీ, కోటంక గ్రామానికి చెందిన రైతు బోయ రామాంజనేయులు మాత్రం ముందెన్నడూ లేనంత ధైర్యంగా ఉన్నాడు! వర్షాలు ఆలస్యమైనా తన మిరప, వేరుశనగ తోటలకేమీ ఢోకా లేదంటున్నాడు! ఈ రైతే కాదు..ఆ గ్రామంలో మరికొందరు రైతులు కూడా ఇంతే ధీమాగా పంటలు పండిస్తున్నారు. అంతేకాదు.. తాగునీటి కొరతతో ఊళ్లకు ఊళ్లు అల్లాడుతుంటే.. ఆ గ్రామంలో మాత్రం తాగునీటి ఎద్దడి లేదు! అలాగని.. ఈ గ్రామం నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్రాంతంలోనిదనుకుంటే పొరపాటే. కరువు సీమైన అనంతపురం జిల్లాలో ఉంది! ఎండిపోయిన బోర్లు, బావులను వాన నీటి ఇంకుడు గుంతల ద్వారా రీచార్జి చేయడం తాలూకూ మహత్తు ఇది..!

 • కరువు సీమలో కాంతిరేఖ
 • వాన నీటి సంరక్షణ మహత్తు చాటుతున్న అనంతపురం జిల్లా కోటంక రైతులు
 • ఎండిన బోరుకు రీచార్జితో వేసవిలోనూ నిశ్చింతగా తుంపర్లు, బిందు సేద్యం
 • గ్రామంలో 20% బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మిస్తే చాలంటున్న నిపుణులు
 • సులభమైన పద్ధతిలో రైతులే నిర్మించుకునే అవకాశం
 • మెట్ట రైతులను బ్యాంకు రుణంతో ప్రోత్సహిస్తే సాగు నీటికి భద్రత

తొలకరి చినుకు నేలతల్లిని పులకింపజేస్తుంది. మొలకెత్తిన విత్తనం పంటవుతుంది. కానీ, పంటకు అవసరమైనప్పుడల్లా వాన పడదు. అవసరమైనప్పుడల్లా నీరు అందుబాటులో ఉండాలంటే.. కురిసినప్పుడే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలి. ఇంటికి సరిపడే నీరైతే భూగర్భ ట్యాంకులో భద్రపరచుకోవచ్చు. పంటల సాగు కోసమైతే భూగర్భంలో తప్ప మరెక్కడ దాచుకోగలం? నీటిలో జీవశక్తి ఉంది. వాన నీటి సంరక్షణలో పునరుజ్జీవన మహత్తుంది. దీన్ని గ్రహించలేకపోతే ఎంత పుష్కలంగా వర్షం కురిసినా.. ఆ నీటి బొట్టు కోసం ఆనక అలో లక్ష్మణా అని అలమటించక తప్పదు. ఇప్పటి మాదిరిగా కరువొస్తే ఇక చెప్పనక్కర్లేదు.

భూమ్మీద పడిన వర్షపు చినుకుల్లో 12 నుంచి 18 శాతం వరకు సహజంగానే మట్టిలోకి ఇంకుతాయి. ఆవిరైపోగా మిగిలిన 25-30 శాతం వాన నీరు వాగులు, వంకల ద్వారా నదుల్లోకి పారుతుంది. వృథాగా పోయే ఈ నీటిలో కొంత భాగాన్ని జాగ్రత్త చేసుకున్నా చాలు.. అది కేరళ అయినా, అనంతపురం అయినా తాగునీటికి, సాగునీటికి బెంగ ఉండదని కోటంక గ్రామ రైతులు రుజువు చేస్తున్నారు.దేశంలోకెల్లా అత్యల్ప వర్షపాతం(సగటున ఏటా 550 మిల్లీమీటర్ల) నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం రెండో స్థానంలో ఉంది. 750 అడుగుల్లోతుకు వెళితే కానీ నీటి జాడ దొరకని ప్రాంతాలకు నెలవైన ఈ జిల్లాలో ఏటా 29 శాతం బోర్లు ఎండిపోతుంటాయి. ఆర్థిక స్థోమతకు మించి రైతులు బోర్లు వేసిన, వేస్తున్న రైతులు వేల సంఖ్యలో వున్నారు.

వాన నీటి సంరక్షణకు ఉపకరించే అనేక పద్ధతులు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా ఎండిపోతున్న బోర్లను రీచార్జి చేసే కొత్త పద్ధతి ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. ఎండిపోయిన బోరు బావుల పునరుజ్జీవం కోసం కర్ణాటకకు చెందిన భూగర్భ జల నిపుణుడు ఎన్‌జే దేవరాజ్ రెడ్డి(09448125498) రూపొందించి అమలు పరుస్తున్న నమూనా ప్రసిద్ధి పొందింది. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ(సీడబ్ల్యూయస్) సంస్థ నిపుణులు మన ప్రాంత అవసరాలకు అనుగుణంగా ఈ నమూనాకు మెరుగులు దిద్ది సుస్థిర భూగర్భ జల యాజమాన్యం(సుగమ్) ప్రాజెక్టు ద్వారా ఎండిపోయిన బోర్లలో జలసిరిని నింపుతున్నది. యూరోపియన్ యూనియన్ ఆర్థిక సహాయంతో అనంతపురం, వరంగల్ జిల్లాల్లోని 6 పంచాయతీల్లోని 13 గ్రామాల్లో స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా రైతుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు అమలవుతోంది. వర్షపు నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణం ద్వారా ఎండిపోయిన బోర్లు, బావులు తిరిగి జలకళను సంతరించుకుంటున్నాయి.

ఈ నీటితో రైతులు తుంపర, బిందు సేద్య పద్ధతులను అనుసరిస్తూ కరువు కాలంలోనూ మెట్ట పొలాల్లో నిశ్చింతగా పంటలు పండిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల గ్రామాల్లో భూగర్భ జల సంరక్షణపై రిడ్స్ సంస్థ పని చేస్తోంది. గార్లదిన్నె మండలంలోని కోటంక గ్రామంలో తొలుత మంచినీటి బోరు వద్ద ఇంకుడు గుంతను నిర్మించారు. ఎండిపోయిన ఆ బోరులో నుంచి మళ్లీ నీళ్లు వస్తుండడంతో స్ఫూర్తి పొందిన రైతు బోయ రామాంజనేయులు తన బోరు వద్ద కూడా ఇంకుడు గుంతను నిర్మించుకున్నాడని రిడ్స్ డెరైక్టర్ కిష్టప్ప(94405 28626) తెలిపారు.

ఆయనను మరో 18 మంది రైతులు అనుసరించారు. తత్ఫలితంగా కోటంక పరిసర భూముల్లో భూగర్భ జల మట్టం 165 అడుగుల(2012 మే) నుంచి 105 అడుగులకు(2013 మే) పెరిగింది. గ్రామ పరిధిలోని 370 బోర్లలో 174 బోర్లు గతంలో ఎండిపోయాయి. ఇంకుడు గుంతల నిర్మాణం తర్వాత వీటిల్లో 78 బోర్లు తిరిగి వినియోగంలోకి వచ్చాయి. గ్రామానికి సాగు నీటి భద్రత ఏర్పడడమే కాకుండా తాగు నీటి ఎద్దడీ తీరింది.

మొదటి సారిగా మూడో పంట!

నాలుగేళ్ల క్రితం వరకు చేనేత కార్మికుడిగా పనిచేసిన రామాంజ నేయులు(38) తన సోదరుడు ఓబులేశుతో కలిసి ఉమ్మడిగా ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా రు. తమకున్న 5 ఎకరాల పొలంలో 2011లో బోరు వేశాడు. ఒకటిన్నర ఇంచ్ నీళ్లు పడ్డాయి. మరుసటి ఏడాది మరో బోరు వేశాడు. అందులోనూ అదేమోస్తరు నీరు పడినా.. కొన్నాళ్లకు ఎండిపోయింది. స్వచ్ఛంద సంస్థ ఆర్థిక తోడ్పాటు, సాంకేతిక సాయంతో ఎండిపోయిన బోరు వద్ద 2013 జూన్‌లో రీచార్జ్ పిట్ నిర్మించారు. నెల రోజుల్లోనే నీటి మట్టం పెరిగి బోరు రెండు అంగుళాల నీరు వచ్చింది. మొదటి బోరులోనూ నీరు పెరిగింది. రెండు బోర్లూ పనిచేస్తుండడంతో గత ఏడాది ఖరీఫ్, రబీ పంటలు పండించడం విశేషం. వరుసగా రెండు పంటలు చేతికొచ్చే సరికి సాగు నీటికి భయపడాల్సింది లేదన్న భరోసా కలిగింది.

దీంతో తమ ఐదెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని ఈ వేసవిలో మూడో పంట వేశారు. స్ప్రింక్లర్లతో ఆరు ఎకరాల్లో నెల క్రితం వేరుశనగ, డ్రిప్‌తో ఎకరంలో రెండు నెలల క్రితం మిరప, మరో ఎకరంలో టమాటా వేసి.. రెండు బోర్లలోనూ ప్రస్తుతం వస్తున్న ఇంచున్నర నీటితో నిశ్చింతగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పచ్చి మిరప కాయలను కేజీ రూ. 25-30కి అమ్ముతున్నానని సంతోషంగా చెప్పారు. ఏటా నీరు చాలక రెండు, మూడెకరాల్లో ఒకే పంటతో సరిపెట్టుకునే ఆయన ఈ కరువు కాలంలోనూ ధైర్యంగా 8 ఎకరాలు సాగు చేస్తుండడం విశేషం. ఈ చిన్న రైతు విజయగాథ వాన నీటి సంరక్షణ ప్రయోజనాన్ని రైతు లోకా నికి చాటి చెబుతోంది.

ప్రభుత్వం పూనుకొని వాన నీటి సం రక్షణను ఉద్యమంగా చేపడితే.. గాల్లో దీపంలా కొట్టుమి ట్టాడుతున్న మెట్ట రైతులకు శాశ్వతంగా మేలు జరుగుతుంది. వాననీటి సంరక్షణ కోసం బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తే రైతులను కరువు కోరల్లోంచి రక్షించవచ్చు. ఏ గ్రామ పొలాల్లోనైనా 20% బోర్ల వద్ద ఇంకుడు గుంతలను నిర్మిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. 4,5 రోజుల్లో దీన్ని నిపుణుల పర్యవేక్షణలో రైతులే రూ. 40-45 వేల ఖర్చుతో నిర్మించుకోవచ్చు. ప్రతి ఏటా 2,3 అడుగుల లోతు ఇసుకను మార్చుకుంటే చాలు. ప్రభుత్వం వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను రుణాలిచ్చి ప్రోత్సహించాలి. కరువు కాలంలో ఇది తక్షణావసరం.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఇన్‌పుట్స్: జే ఆంజనేయులు, గార్లదిన్నె, అనంతపురం జిల్లా

నీటి సంరక్షణ మహత్తును చాటడమే లక్ష్యం!

మెట్ట, కరువు ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణతో ప్రజలకు ఎంతటి ప్రయోజనం చేకూరుతుందో మేం కొత్త పద్ధతిలో అమలు చేస్తూ.. సత్ఫలితాలు సాధిస్తున్నాం. మూడేళ్లలో 13 గ్రామాల్లోని 65 బోర్లను రీచార్జ్ చేశాం. వాన నీటి సంరక్షణ మహత్తును రైతులకు, ప్రభుత్వానికి తెలిసేలా చేయడమే మా లక్ష్యం. వాన నీటి సంరక్షణ వల్ల భూగర్భ జలాల్లో టీడీఎస్, ఫ్లోరైడ్, ఉప్పదనం, హార్డ్‌నెస్ తగ్గి.. నాణ్యత, రుచి పెరుగుతాయి. డ్రిప్ పరికరాల మన్నిక పెరుగుతుంది. నాణ్యమైన పంట దిగుబడులొస్తాయి. 100% పారిశుద్ధ్యం పాటించే చోట్ల, రసాయనిక ఎరువులు, పురుగుమందులు అతిగా వాడని చోట్ల వాన నీటి సంరక్షణ ఉత్తమం. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చాం. రైతులు గానీ, మరెవరైనా గానీ సమావేశాలు నిర్వహిస్తుంటే మమ్మల్ని పిలిస్తే నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తాం.

- ఆర్.వి. రాంమోహన్, భూగర్భ జల నిపుణుడు,
సుగమ్ ప్రాజెక్టు, సికింద్రాబాద్. ఫోన్: 040-27007906 Emai: projectsugwm@cwsy.org, projectsugwm@gmail.com
Weblink: www.cwsy.org

ఎటువంటి బోర్లను బతికించగలం?

సీడబ్ల్యూయస్ నిపుణుల కథనం ప్రకారం.. కొన్నాళ్లు పనిచేసి ఎండిపోయిన బోర్లనే తిరిగి బతికించగలం. మొదట్లోనే ఫెయిలైన బోర్లు పనికిరావు. ఏ బోరును రీచార్జ్ చేయవచ్చో లేదో రైతులే ఎటువంటి పరికరాలు లేకుండా, స్వయంగా, సులువుగా తెలుసుకోవచ్చు. 200 అడుగుల లోతు వేసిన బోరైతే 5 వేల లీటర్ల ట్యాంకర్‌తో నీటిని తెచ్చి ఈ బోరులోకి నీటిని పోయాలి. 400-600 అడుగుల లోతు బోరైతే.. 10 వేల లీటర్ల నీటిని పోయాలి. నీరు సజావుగా బోరు లోపలికి వెళ్లే.. ఆ బోర్లను వాన నీటి సంరక్షణ ద్వారా తిరిగి బతికించవచ్చు. పోస్తున్న నీరు లోపలికి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తుంటే మాత్రం ఆ బోరును ఏమీ చేయలేం. 10-15 ఎకరాల భూమిలో నుంచి వర్షపు నీటిని మళ్లించడానికి వీలయ్యే బోర్ల దగ్గర ఇంకుడు గుంతలు నిర్మించడమే ప్రయోజనకరం. నల్లరేగడి పొలాల్లోని బోర్లకన్నా, నీరు త్వరగా ఇంకే ఎర్ర, ఇసుక నేలల్లో బోర్లను రీచార్జ్ చేయడం సులభం.

పుణ్యం కట్టుకున్నారు..!

భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గత మూడేళ్లలో దాదాపు 450 ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోయాయి. తాగడానికి నీరుకూడా సక్రమంగా అందేదికాదు. ఇంతకుముందు ఏడాదికి ఒకటే పంట పెట్టేవాళ్లం. కొద్ది కొద్దిగా నీళ్లు పోసే బోర్ల మీద నమ్మకం లేక రెండో పంట పెట్టే వాళ్లం కాదు. టౌనుకో, బెంగళూరుకో బేల్దారి పనులకు పోవాల్సివ చ్చేది. స్వచ్ఛంద సంస్థల వాళ్లు మా ఊరొచ్చి పుణ్యం కట్టుకున్నారు. నా లాగే 18 మంది రైతులు బోర్లు, బావులను మళ్లీ బతికించుకొని ఇప్పుడు పచ్చగా ఉన్నారు. తాగే నీళ్లక్కూడా కరువు లేకుండా చేశారు. మా రెండు బోర్లలో ఇప్పుడు ఇంచున్నర నీళ్లొస్తున్నాయి. ఈ నమ్మకంతోనే పంటలు పెట్టాం. మొట్టమొదటగా వేసవిలోనూ మిరప, వేరుశనగ పంటలు పెట్టా. మంచి ఆదాయం వస్తోంది. - బోయ రామాంజనేయులు (77993 32024), రైతు, కోటంక, అనంతపురం జిల్లా

బోరు చుట్టూ ఇంకుడు గుంత నిర్మించేదెలా?

బోరు బావి చుట్టూ 3 మీటర్ల(పొడవు, వెడల్పు, లోతు) గుంత తవ్వాలి. ప్లాస్టిక్ కేసింగ్ పైపు నాణ్యతను సరిచూచుకోవాలి. అది పాడైతే కొత్త పీవీసీ పైపు వేయాలి. దాని అడుగు భాగాన ఐరన్ క్లాంప్‌ను అమర్చి కేసింగ్ పట్టు సడలి పోకుండా జాగ్రత్తపడాలి. పైపునకు అన్ని వైపులా 4-6 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో రంధ్రాలు వేయాలి. వీటి ద్వారా ఇసుక, మట్టి బోరులోకి వెళ్లకుండా పైపు చుట్టూ నైలాన్ నెట్‌ను చుట్టాలి. ఆ తర్వాత గుంతను ఐదు దొంతర్లలో వివిధ సైజుల రాళ్లతో నింపి, పైపొరగా ఇసుక వేయాలి. అడుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు 30-40 సెంటీ మీటర్ల వ్యాసార్థం కలిగిన రాళ్లను వేయాలి. వాటిపైన ఒక అడుగు మందాన 15-20 సెంటీమీటర్ల రాళ్లను పేర్చాలి. ఆపైన అర అడుగు మందాన 7.5 సెంటీమీటర్ల చిన్న రాళ్లు, మరో అర అడుగు మందాన 2-4 సెంమీ గులక రాళ్లు పరవాలి.

ఆపైన నైలాన్ నెట్‌ను పరిచి, దానిపై 2 అడుగుల మందాన ముతక ఇసుకను పోయాలి. ఇసుక పైన కూడా నైలాన్ నెట్‌ను అమర్చాలి. చెత్తా చెదారాన్ని పైనే వడకట్టి స్వచ్ఛమైన వర్షపు నీటిని బోరులోకి ఇంకింపజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని చుట్టూ ఇటుకలు, సిమెంట్‌తో అడుగు భూమి లోపలకు, అడుగు పైకి ఉండేలా గోడను నిర్మించాలి. ప్రతి ఏడాదీ పైన 2 అడుగుల మేరకు ఉన్న ఇసుకను తొలగించి, కొత్త ఇసుక నింపాలి. వర్షపు నీరు త్వరగా ఇంకడానికి కొత్త ఇసుక దోహద పడుతుంది. ఈ గుంత వైపు ఎగువ నుంచి వర్షపు నీరు వచ్చేలా చిన్న మట్టి కాలువను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. దీని నిర్మాణానికి రూ.40 నుంచి 45 వేలు ఖర్చవుతుంది. అదే గనక ఎండిపోయిన బావుల్లోకి నీటిని మళ్లించడానికైతే రూ.5 వేలు చాలు. పాడుపడిన బావుల్లోకి నీటిని ఇంకింపజేసినా 200 మీటర్ల పరిధిలో భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి.

ఆధారము: అగ్రికల్చర్ గేట్వే బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate