హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / ఎరువుల వాడకంలో రైతులు పట్ణచవలసిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎరువుల వాడకంలో రైతులు పట్ణచవలసిన జాగ్రత్తలు

ఎరువుల వాడకంలో రైతులు పట్ణచవలసిన జాగ్రత్తలు.

మొక్కకు 18 ధాతువులు అవసరము. ఈ 18 ధాతువులలో కొన్ని ఎక్కువ మోతాదులోను మరి కొన్ని ధాతువులు తక్కువ మోతాదులోను మొక్కకు అవసరము. కనుక మొక్కకు కావలసిన అన్ని ధాతువులు సమకూర్చుటకు సమగ్ర సస్య పోషణ యాజమాన్య వద్ధతులు పాటించవలయును.

వ్యవసాయ విశ్వ విద్యాలయము శాస్త్రవేత్తలు ప్రతి పంటకు నెల స్వభావమును భట్టి వేయవలసిన ఎరువుల మోతాదును వ్యవసాయ పంచాంగములో పొందుపరచియున్నారు. శాస్త్రవేత్తలు సిఫార్సులు పరిశీలించిన ఎడల భాస్వరము కలిగియున్న కాంప్లెక్స్ ఎరువులు కానీ లేక సూటి ఎరువులు సింగిల్ సుమారు పాస్పేట్ గని ఆఖరు దుక్కిలో వేయవలెననియు తరువాత పంట ఎదుగుదల దశలో యూరియా పైపాటుగా వేయవలెననియు సిపార్సు చేసి యున్నారు. కానీ కొంత మంది రైతులు ఎలాంటి సిపార్సు పాటించకుండా కంప్లెక్స్ ఎరువులు వేయకుండా యూరియా మాత్రమే ఉపయోగించుచున్నారు. మరికొంత మంది రైతులు కంప్లేక్స్ ఎరువులు సిపార్సు లేక పోయినప్పటికీ పైపాటుగా వేయుచున్నారు. భాస్వరము, పొటాషియం కలిగిన కాంప్లేక్స్ ఎరువులు ఆఖరు దుక్కిలో వేయకుండా ఒక్క యూరియా మాత్రమే అధిక మోతాదులో వాడిన యేడల మొక్క ఎవుగా పెరిగి చీడ పీడలు ఆశించుటకు అనువుగా ఉండును మరియు మొక్కకు కావలసిన ఇతర ధాతువులు భూమి నుండి అధిక మోతాదులో తీసుకొనుట వలన భూమి ఆరోగ్యమును దెబ్బతినును. పంట దిగుబడులు గణనీయంగా పడిపోవును. అతిగా కాంప్లేక్సు ఎరువులు పై పాటుగా వేసినపుడు కంప్లేక్స్ యూఎరివి;పీఎంఓ భాస్వరము మొక్క తీసుకోకపోగా భూమి లోని సూక్ష్మధాతువులతో కలిసి సూక్ష్మధాతులు మొక్కకు లభ్యము కానీ స్ధితిలోనికి మార్చుట వలన పంటలో సూక్ష్మధాతులోపము ఏర్పడును.

కనుక రైతు సోదరులు వ్యవసాయ అధికారులు సూచించినట్లు పశువుల ఎరువు, నత్రజని, భాస్వరము, పొటాషియం కలిగియున్న కంప్లేకు ఎరువులు మరియు జింకు స్లెపాటు ఆఖరు దుక్కి లోను మిగిలిన మోతాదు నతజని సిపార్సు మేరకు పైపాటుగా వేసి అధిక దిగుబడులు సాధించువచ్చును. అట్లుగాక అధిక మోతాదులో యూరియా మాత్రమే ఉపయోగించిన యేడల మొక్క ఏపుగా పెరిగి చీడ పీడలు ఆశించిన దిగుబడులు గణనీయంగా తగ్గి రైతుకి నష్టము నటిల్లును.

3.13043478261
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు