హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / ఎరువుల వినియెగ సామర్ధ్యం పెంచుటకు పాటించవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎరువుల వినియెగ సామర్ధ్యం పెంచుటకు పాటించవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు

ఎరువుల వినియెగ సామర్ధ్యం పెంచుటకు పాటించవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు.

ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తిని సాధించటానికి ఎరువుల వాడకం ముఖ్యమైనది. ఒకప్పుడు రైతు పూర్తిగా సేంద్రియ ఎరువులు ముఖ్యంగా పశువుల పేడ, పచ్చిఅకు, చెరువుల మట్టిని వాడేవారు. అధిక దిగుబడి వంగడములు వచ్చిన తరువాత రసాయానికి ఎరువుల వాడకం క్రమేపి పెరిగింది. ఎరువుల వినియెగ సామర్ధ్యం వేసే నెల స్వభావం మీద, వేసిన ఎరువుల పరిమాణం, వేసినప్పుడు పైరు దశ మరియు వేసే అడ్ఢతి మీద ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు నెల గుణగణాలు, పైరు స్వభావం మరియు వాతావరణ పరిస్ధితులు ఎరువుల వినియెగ సామర్ధ్యాన్ని నిర్ధరిస్తాయి. ఇవే కాకుండా పైరు సాగునీరు నాణ్యత, కట్టిన తదుకు, కలుపు తీత, ఎరువుల వినియెగ సామర్ధ్యం పెంచుటకు ఉన్నతమైన యాజమాన్య పద్ధతులు ఎన్నుకొనటం ఎంతో అవసరం.

ఎరువుల వినియెగ సామర్ధ్యాన్ని నిర్ణయంచడం ఎలా?

ఎరువుల సామర్ధ్యాన్ని కొందరు ప్రతి కిలో రసాయానికి ఎరువు వాడకం వల్ల వచ్చిన పంటను అధిక దిగుబడిగా పరిగణిస్తే మరికొందరు ప్రతి కిలో రసాయానికి ఎరువు వాడకం వల్ల వచ్చిన అధిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారు. తక్కువ మేతదులలో రసాయానికి ఎరువులు వాడినప్పుడు ఏ ఎరువుల వినియెగ సామర్ధ్యం అధికముగా ఉండి మేతాడు పెంచిన కొద్దీ తగ్గుతుంది. ఎరువుల వినియెగ సామర్ధ్యాన్ని పెంచుట వలన ప్రత్తి కిలో రసాయానికి ఎరువు వాడకం వలన వచ్చే పంట దిగుబడి పెరిగి, తద్వారా రైతుకు ఆదాయము పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయము కూడా తగ్గుతుంది. వాతావరణ కాలుష్యము, భూమి మరియు నీటి కాలుష్యము తగ్గించవచ్చు. నత్రజని ఎరువుల సామర్థ్యంలో తేడా ఉంటుంది. నత్రజని ఎరువుల సామర్ధ్యం వారిలో 20-30 శాతం, ప్రత్తిలో 20-35 శాతం,  చెడుకులో  30-35 శాతం ఉండగా భాస్వరపు ఎరువుల వినియెగాము 15-25 శాతం పొటాషియం ఎరువుల సామర్ధ్యం 25-40 శాతం ఉంటాయని పరిశోధన ఫలితాల వల్ల నిర్ధారణ అయంది.

ఎరువుల వినియెగ సామర్ధ్యము పై ప్రభావాన్ని చూపే అంశాలు

  1. నేల లక్షణాలు: వివిధ రకాల నెలలు వేరు వేరు లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ లక్షణాలలో ముఖ్యమైనది ఉదజని సూచిక, లవణ సాంద్రత, భూసారము, నెలలో బంకమన్ను, ఇసుకేరేణు శాతం, బంకమన్నులో ఖనిజాలు, సేంద్రియ పదార్ధము మరియు సున్నముల పరిమాణము. నేల వాలు స్వభావము మరియు మురుగు నీటి సాకర్యము, ఎరువుల వినియగా సమర్ధము పై ప్రభనాన్ని చూపిస్తాయి. ఈ లక్షణాలలో ఎటువంటి లోపాలు లేకుండా అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి.
  2. పంటలు : పంటలలో జన్యు సంబంధమైన తేడాలు, వివిధ రకాల వంగడాలు, వేర్లు నిర్మాణము వాటి ఎదుగుదల భూమిలో వాటి విస్తరణ పద్ధతి ఎరువులకు మొక్కలు ప్రతిస్పందించే తీరు పంటలలో గల చీడపీడలను తట్టుకొనే శక్తి అలాగే భూములలో ప్రధాన సమస్యలైన చౌడు, ఆమ్లగుణము, నీటి ముంపును తట్టుకొనే శక్తి మెదలైనవి ఎరువుల వినియగా సామర్ధ్యమును గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
  3. వాతావరణము : వాతావరణం అంశాలైన వర్షపాతం, దాని విస్తరణ, సూర్యరశ్మి రోజులు, మంచు కురిసే రోజులు, గాలి, భూమిలోని ఉష్ణోగ్రత తేడాలు ఎరువుల వినియెగాము పై ప్రభావాన్ని చూపుతాయి.
  4. యాజమాన్య పద్ధతులు: పంటలు మరియు వాటి వంగడాల ఎంపిక, పంటలు విత్తే సమాయయు, మొక్కల సంఖ్య, నీటి వాసకాము, కలుపు నివారణ, ఎరువుల ఎంపిక, మెత్తారు, వేసే పద్ధతి, సమగ్ర పోషకాల సరఫరా విధానము, సస్యరక్షణ వంటి యాజమాన్య పద్ధతులు ఎరువుల వినియెగ సామర్ధ్యం పై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపిస్తాయి.

వివిధ రసాయన ఎరువుల వాడుక విధానము

నత్రజని ఎరువులు : మాగాణి భూములలో నత్రజని నష్టాన్ని అరికట్టి వేసిన ఎరువు సామర్ధ్యము పెంచేందుకు కొన్ని చర్యలై తీసుకోవడం అవసరం. రైతులు సాధారణముగా వాడుతున్న యూరియా గుళికల పై వేపపిండి పూతనుగాని గంధకపు పూతలను గని వెయ్యటం ద్వారా యూరియా సామర్ధ్యమును పెంచవచ్చు. యూరియా గుళికలు పెద్దవిగా తాయారు చెయ్యటం వాటిని సక్రమమైన పద్దతిలో నెలలో పాతిపెట్టుట వలన పైరు వేరు సమీపంలో కూడా నత్రజని వినియెగ సామర్ధ్యము పెరుగుతుంది. అలాగే మెత్త ప్రాంతాలలో కూడా నత్రజనిని తేమ ఉన్న భూమిలో తగినంత లోతులో  భూమిలో వెయ్యటం వలన సామర్ధ్యం పెరుగుతుంది. యూరియా ద్రావణాన్ని పిచికారి చేయడం ద్వారా కూడా ఈ ఎరువు వినియగా సామర్ధ్యాన్ని పెంచే వీలుంది. అయితే ఈ ద్రావణాన్ని 2 శాతం మించకుండా చూడాలి. పిచికారి చెయ్యబడ్డీ యూరియా ద్రావణాన్ని మొక్కలు సమర్ధవంతంగా వినియెగించుకోటానికి ఈ ద్రావణాన్ని ప్రొద్దన్నే గాని సాయంత్రపు సమయాల్లో గాని పిచికారి చెయ్యాలి.

భాస్వరపు ఎరువులు : రాక్ పాస్పెట్ వంటి భాస్వరం ఎరువులు అసలు నీటిలో కరగవు. ఇవి ఆమ్లా స్వభావం ఉన్న నెలల్లో పెరిగే పైర్లకు భాస్వరాన్ని బాగా అందజేస్తాయి. సున్నపు పాలు ఎక్కువగా ఉన్న భూములలో కూడా భాస్వరపుటేరువుల వినియెగ సామర్ధ్యము తక్కువగా ఉంటుంది. నల్లరేగడి భూములలో ఉన్న బంకమట్టి మరియు సున్నము ఈ పోషకపు ఆందునాటును తగ్గిస్తాయి. కాబట్టి ఈ ఎరువులను వాడుతున్నప్పుడు వాటి సామర్ధ్యాన్ని పెంచటానికి పాటించాల్సిన మెళకువలు తెల్సుకోవాలి. భాస్వరపు ఎరువులు ఎప్పుడు కూడా పూర్తి మేతాడు చివరి దుక్కిలో మాత్రమే వేయవలెను. రైతులు ఈ ఎరువును రెండు మూడు ధపాలుగా వేయుట వలన ఖర్చు పెరగడము తప్ప దిగుబడులతో ఎటువంటి మర్చి ఎండాడని తెలుసుకొనవలెను. ఈ ఎరువు మొక్కలకు తగినంత దూరంలో సరియైన లోతులో సాళ్ళలో వెయ్యటం వల్ల భాస్వరపు దిగ్బంధనము తగ్గి మొక్కకు అందుబాటు పెరుగుతుంది.

పోటాష్ ఎరువులు : ఈ ఎరువులను పంటకు రెండు దపాలలో వేయవలెను. మొదటి దపా ఎరువు భాస్వరముతో పాటు ఆఖరి దుక్కిలోను రెండో దపా ఎరువు పూత సమయంలోను వేయవలెను. ఈ ఎరువు మ్యారేట్ ఆఫ్ పోటాష్, సల్పేట్ ఆఫ్ పోటాష్ రూపంలో అభ్యమవుతాయి. పొగాకు వంటి కొన్ని పంటలలో మ్యారేట్ ఆఫ్ పోటాష్ ఎరువు పొగాకులోని ఆకు భాగానికి హాని కలిగిస్తుంది. కావున ఇలాంటి పంటలకు కేవలం సల్పేట్ ఆఫ్ పోటాష్ ని మాత్రమే వాడవలెను.

ఆధారం : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు