హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / కల్తి ఎరువులను గుర్తించడం ఎలా
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కల్తి ఎరువులను గుర్తించడం ఎలా

కల్తీ ఎరువులను గుర్తించడానికి కొన్ని చిట్కాలు

రైతు సోదరులు కల్తీ ఎరువులను ఉపయోగించడం వలన పంటకు అయ్యే ఖర్చు పెరగడంలో పాటు దిగుబడి తగ్గుతుంది. కావున రైతు సోదరులు ఎరువులను కొనుగోలు చేసేటప్పుడు కల్తీ ఎరువులను గుర్తించడానికి కొన్ని మెళికువలు పాటించాల్సిన అవసరం ఉంది. రైతు సోదరులు ఎరువులన నియంత్రణ చట్టం 1985లోని ముఖ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని రసాయన ఎరువులను కొనుగోలు చేసుకోవాలి.

  • ఎరువులు అమ్మేవారు ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా గుర్తింపు పొంది ఉండాలి. డీలరు నమోదు పత్రంలో పొందుపరిచిన ఎరువులను మాత్రమే విక్రయించాలి. నమోదు పత్రంలో పొందుపరచని ఇతర ఎరువులను అమ్మకూడదు.
  • డీలరు తమవద్ద ఉన్న వివిద ఎరువుల నిల్వలను, వాటి ధరలను ప్రతిరోజు బోర్డుమీద రాసి, దుకాణంలో ముఖ్యమైన చోట ఉంచాలి. డీలరు రైతు కొనుగోలు చేసి ఎరువులను తప్పనిసరిగా నగదు లేదా అరవుబిల్లు విదిగా ఇవ్వాలి. డీలరు నిల్వ ఉంచిన అరవు బిల్లు విధిగా ఇవ్వాలి. డీలరు నిల్వ ఉంచిన ఎరువులను విక్రయిచేందుకు నిరాకరించినా, గరిష్ట ధరలకు మించి అమిన్నా చట్టరిత్యా నేరమని రైతు సోదరులు గమనించాలి.
  • రశీదుపై మీరుకొన్న సరుకుల వివరాలు నమోదు చేయించుకొని, మీరు దానిపై సంతకం పెట్టాలి. రశీదును పంటకాలం వరకు మీ వద్దనే భధ్రపరుచుకోవాలి.• నిర్ణయించిన ప్రమాణాలు లేని ఎరువులను కల్తీ ఎరువులను విక్రయించకూడదు. రైతులు కొనే ప్రతి ఎరువు బస్తాను డీలరు తూకం వేసి ఇవ్వాలి.
  • నిర్ణయించిన ప్రమాణాలు లేని ఎరువులను కల్తీ ఎరువులను విక్రయించకూడదు. రైతులు కొనే ప్రతి ఎరువు బస్తాను డీలరు తూకం వేసి ఇవ్వాలి.
  • నాణ్యత లోపించిన ఎరువులు, చిరిగిన లేదా తేమ వచ్చిన బస్తాలుంటే అలాంటి బస్తాలపై తప్పనిసరిగా ఎర్ర సిరాతో ‘ఎక్స్’ గుర్తు వేసి ఉంచాలి. టువంటి బస్తాలను డీలర్లు రైతులకు విక్రయించకూడదు. రైతులు వాటిని కొనకూడదు.

కల్తీ ఎరువులను గుర్తించడంలో కొన్ని ముఖ్య సూచనలు

  • కొందరు వ్యాపారులు ఎరువులను అక్రమ పద్ధతుల్లో విక్రయిస్తారు.
  • తక్కువ ధర కలిగిన ఒక రసాయన ఎరువును, ఎక్కువ ధర ఉండే వేరే రసాయన ఎరువు పేరుతో అమ్మడం.
  • చలామణిలో ఉన్న ఎరువును పోలిన నకిలీ ఎరువును కానీ ప్రత్యామ్నాయంగా మరొక దానిని కానీ ఆ పేరుతో అమ్మడం.
  • నిర్ణయించిన ప్రమాణాలు లేకున్న అవి ఉన్నట్లు బస్తాలపై ముద్రించి అమ్మడం.

ఎరువుల్లో కల్తీని గుర్తించే సులభ పరీక్షలు

ఒక పరీక్ష నాళికలోగానీ, సన్నమూతిగల ఏదైనా చిన్న నిలువుపాటి గాజుపాత్రలో గానీ, 4-5 గ్రా. ఎరువు తీసుకొని దానికి 10 మి.లీ. డిస్టిల్డ్ వాటర్ కలిపి ద్రావకం తయారు చేయాలి. సులభ పరీక్షలలో ఈ కింది లక్షణాలకు భిన్నంగా ఉంటే అవి కల్తీ ఎరువులుగా అనుమానించి ఖచ్చితమైన నిర్ధారన పరీ7 కోసం సమీప ప్రయోగశాలకు వ్యవసాయ అధికారి ద్వారా గానీ, నేరుగా గానీ పంపాలి.

వివిధ రకాల ఎరువులు, వాటి స్వభావం

యూరియా : నీటిలో యూరియా పూర్తిగా కరిగి, తాకితే చల్లగా ఉండే రంగులేని ద్రావకం ఏర్పడుతుంది.

డైఅమ్మోనియం ఫాస్ఫేట్ : నీటిలో వేసి కలిపితే మడ్డి అడుగుకు చేరుతుంది. దీనికి నత్రికామాలం కలిపితే అధిక భాగం మడ్డి కరిగి గోధుమ రంగు ద్రావకం వస్తుంది.

kalthi.jpg

అమ్మోనియం సల్ఫేట్ : కొద్ది పాటి గుధుమ రంగు ద్రావకం తయారవుతుంది. ఇది చల్లగా ఉండదు.

అమ్మోనియం క్లోరైడ్/మ్యూరేట్ ఆఫ్ పొటాష్ : ఎరువులను బాగా కలిపితే కరిగి, రంగులేని చల్లని ద్రావకం తయారవుతుంది.

కాల్షియం అమ్మోనియం నైట్రేట్ : ద్రావణం మడ్డిగా, చల్లగా ఉంటుంది. దీనకి గాధ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపితే అధిక భాగం మడ్డి కరిగి గోధుమ రంగు ద్రావకం ఏర్పడుతుంది.

15:15:15 / 28:28:0 : ఎరువుల ద్రావకం మడ్డిగా, చల్లగా ఉంటుంది. గాధ హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేస్తే 15:15:15 ఎరువుగాను, 28:28:0 కొద్దిపాటి గోధుమ రంగులో శుద్ధమైన ద్రావకంగా మారుతుంది.

నైటోఫాస్ఫేట్ : ఎరువులు కలిపి ద్రావనానికి గాధ నత్రికామ్లం కలిపితే మడ్డి చాలా వరకు గోధుమ రంగు ద్రావకంగా మారుతుంది.

సాధారణంగా ఎరువుల్లో కల్తీ వేసేందుకు ఉపయోగించేవి

ఉప్పు: యూరియా, అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం సల్ఫేట్, మ్యూరేట్ ఆప్ పొటాఫ్ వంటి ఎరువుల్లో కలిపి కల్తీ చేస్తారు.

బొగ్గు : డి.ఎ.పి, ఇతర కాంప్లెక్స్ ఎరువులు.

సున్నం: సూపర్ ఫాస్ఫేట్, చీలేటెడ్ జింక్.

ఇసుక : పొటాఫ్, మ్యూరేట్ ఆఫ్ పొటాఫ్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్.

నల్లమట్టి : డి.ఎ.పి., ఇతర ఎరువులు

మెగ్నీషియం సల్పేట్ : జింకు సల్ఫేట్.

జిప్సం : సూపర్ ఫాస్ఫేట్, సల్పేట్ ఆఫ్ పొటాఫ్, చీలేటెడ్ జింక్.

వివిధ రకాల కల్తీ చేయబడే ఎరువులు, కల్తీ వేయడానికి వినియోగించే ఎరువులు

యూరియా : అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్.

డి.ఎ.పి. : కాల్షియం అమ్మోనియం నైట్రేట్, సూపర్ ఫాస్ఫేట్ (గుళికలు), అమ్మోనియం ఫాస్ఫేట్ సల్పేట్.

28:28:0 : అమ్మోనియం ఫాస్ఫేట్ సల్ఫేట్.

ఎన్.పి.కె. : సూపర్ ఫాస్ఫేట్ (గుళికలు).

డీలర్ నాణ్యత లోపించిన ఎరువులను విక్రయించినట్లు గమనిస్తే రైతులు సమీప మండల వ్యవసాయాదికారికి ఫిర్యాదు చేసి ఆ నిల్వ నుంచి ఎరువుల నమూనాలు సేకరించి పరీక్షకు పంపడానికి తోడ్పడాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.03296703297
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు