గోధుమలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్ల శాతం ఎక్కువ. అదే సమయంలో వీటిల్లో గ్లూటెన్ ఉండదు. దీంతో పిండిపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా వచ్చే ఊబకాయం, మధుమేహం, హృద్రోగ సమస్యలూ తలెత్తవు. పైగా వీటిని ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉండే ఇతర పదార్థాల్లా కాకుండా బియ్యం, గోధుమలకు, ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. కిచిడీలూ, కుకీలు, బ్రడ్లు బిస్కెట్లు ఇలా అన్ని చేసుకోవచ్చు. ఈ గింజలు రెండు నుంచి నాలుగు గంటల్లోనే మొలకలు వస్తాయి. దీంతో సలాడ్ల తయారీకి చక్కగా సరిపోతాయి. ఇతర ఆకుకూల్లానే ఈ మొక్క ఆకుల్నీ తింటారు.
గోధుమ, ఎరువు, ముదురు గోదుమ, నలుపు, గులాభి రంగుల్లో ఇవి ఉంటాయి. గ్లూటెన్ రహితమైన ఈ ధాన్యాన్ని ఇటీవల అమెరికన్లూ ఎక్కువగా తింటున్నారు. దాంతో ఏటికేడాదికి వీటి ఉత్పత్తి పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి గతేడాదిని అంతర్జాతీయ క్వినోవా సంవత్సరంగా ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సుమారు ఏడువేల సంవత్సరాల క్రితమే అండీస్ పర్యతశ్రేణుల్లో నివసించే దక్షణ అమెరికన్లు వీటని సాగుచేసేవారు. నీరసాన్ని దరిచేరనివ్వని కారణం కలిగిఉన్న దీనిని సూపర్ గ్రెయిన్ ఆఫ్ ద ప్యూచర్‌గా చెబుతున్నారు.
క్వినోవాలో ప్రొటీన్లే కాకుండా మిటమిన్ బీ, ఈ, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్‌లు కూడా పుష్కలంగా లభిస్తాయి. మిగిలిన వాటితో పోలిస్తే అలర్జీ గుణాలు ఇందులో తక్కువే. శరీరానికి అవుసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి. అందుకే దీన్ని ప్రోటీన్లకు పూర్తిస్థాయి వనరుగా చెబుతారు. శాఖారులకు దీన్నుంచి మాంసకృతులు పుష్కలంగా దొరుకుతాయి.
మంచి లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ గింజలను ఆహారంగా తీసుకునేవారి సంఖ్య పెరుగుతుండడంతో విపరీతమైన డిమాండ్ నెలకొంది. డిమాండ్‌తో పోల్చుకుంటే స్థానికంగా దీని ఉత్పత్తి చాలా తక్కువేనని చెప్పవచ్చు. విపరీతమైన డిమాండ్ ఉన్నందున దీనిని సాగుచేసే రైతులకు లాభాల పంట పండుతోంది. అందుకే దీని సాగును అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు. దీనిపై రైతులకు కూడా అవగాహన పెరుగుతుండడంతో పండించడానికి ముందుకు వస్తున్నారు.
వంద గ్రాముల క్వినోవాలో పోషకాల లభ్యత ఈ విధంగా ఉంటుంది... కేలోరీలు 368, ప్రొటీన్లు 14 గ్రా, పిండిపదార్థాలు 64గ్రా, పీచు 7గ్రా, కొవ్వులు 6 గ్రా, శ్యాచురేటేడ్ కొవ్వులు 0.7 గ్రా, మోనో అన్శ్యాచురేటెడ్ 1.6 గ్రా, పాలీ అన్శ్యాచురేటెడ్ కొవ్వులు 3.3గ్రా, విటమిన్ ఈ 2.44 మిగ్రా, క్యాల్షియం, 47మి గ్రా, ఐరన్ 4.6 మిగ్రా, మెగ్నీషీయం 197 మిగ్రా, ఫాస్పరస్ 457 మిగ్రా, పొటాషియం 563 మిగ్రా, జింక్ 3.1 మిగ్రా.
ఈ పంట 90 రోజుల్లో చేతకి వస్తుంది. నారు పోసిన 10 నుంచి 20 రోజుల్లో నాటాలి. పంటకు ఎలాంటి తెగుళ్లు ఆశించవు. ఖర్చు ఎకరాకు రూ. 2 వేలు మాత్రమే. రబీ పంటగా విత్తుకోవచ్చు. రబీలో రెండో పంటగా విత్తుకోవచ్చు. శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అనువుగా ఉంటుంది. కాగా ఈ పంట సాగుకు అన్ని పొలాలు అనుకూలం. కిలో రూ. 22 పైగా ధర పలుకుతుంది. ఎకరాకు 10 క్విటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
మండల కేంద్రానికి చెందిన రైతు గంగుల సురేందర్‌రెడ్డి గత సంవత్సరం శాంపిల్‌గా ఒక మడిలో ఈ పంటను సాగు చేయగా 80 కిలోల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఎకరా విస్తీర్ణంలో పండించడానికి సిద్ధమవుతున్నారు. ఆత్మ అధికారుల సూచన మేరకు తాను ఈ పంటపై ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం పొట్టు తీసే యంత్రాలను సరఫరా చేస్తే రూ.200 నుంచి రూ.600 కిలో పలికే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు