ఏం చేయాలి?
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పి.ఎం.కె.ఎస్.వై.)
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ 01.07.2015 న 2015-16 నుండి 2019-20 వరకు ఐదేళ్ల పాటు రూ. యాభై వేల కోట్ల బడ్జెట్ తో పి.ఎం.కె.ఎస్.వై.ని ఆమోదించింది.
ప్రతి చుక్కకూ అధిక దిగుబడిని సాధించేందుకూ, తద్వారా గ్రామీణ ప్రాంతాలను సుసంపన్నం చేసేందుకు దేశంలోని అన్ని పంటపొలాలకూ ఏదో ఒక రక్షిత నీటి పారుదలను అందించడం పి.ఎం.కె.ఎస్.వై. లక్ష్యం. నీటి పారుదలను అందించడంలో నీటి వనరు నుండి పంట పొలం దాకా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పి.ఎం.కె.ఎస్.వై.ని రూపొందించడం జరిగింది - అంటే నీటి వనరులూ, పంపిణీ వ్యవస్థ, పంట పొలాల్లో సమర్థవంతమైన వినియోగం, జిల్లా/రాష్ట్ర స్థాయిల్లో సమగ్రమైన పథకాలు రూపొందించి నూతన టెక్నాలజీలనూ,సమాచారాన్ని రైతులకు చేర్చే విస్తరణ సేవలూ మొదలగు వాటిపై కేంద్రీకరిస్తుంది.
మీకేం లభిస్తుంది ?
క్ర.సం. |
సహాయ వివరాలు |
సహాయపు మొత్తం |
పధకం |
1. |
నీటి సరఫరా పైపుల కొనుగోలు కోసం |
కొనుగోలు ధరలో 50% రాయితీ హెచ్.డి.పి పైపులైతే మీటరుకు రూ.50/- పీ.వీ.సీ. పైపులైతే మీటరుకు రూ.35 హెచ్.డీ.పీ.ఈ ల్యామినేటెడ్ ఓవెన్ లే ప్లాట్ ట్యూబులైతే మీటరుకు రూ 20/- లకుమించకుండా. గరిష్టంగా రైతుకు/లబ్దేహీదారుకు రూ.15000/- లకు మించకుండా. |
ఈశాన్య భారతం లో హరిత విప్లవం తేవటం (బ్రింగింగ్ గ్రీన్ రేవోల్యూషన్ తు ఎస్టార్న్ ఇండియా బి.జీ.యర్.ఇ.ఐ)/నూనె గింజలు ఆయిల్ పామ్ పై జాతీయ మిషన్ (ఎన్.ఎం.ఒ.ఒ.పి) |
2. |
అయిల్ పామ్ కోసం బిందు సేద్య విధానం |
సుస్ధీర వ్యవసాయ జాతీయ మిషన్ (ఎన్.ఎం.ఎస్.ఎ) ఖారారు చేసిన విధంగా. |
ఎన్.ఎం.ఒ.ఒ.పి |
3. |
ప్లాస్టిక్/ఆర్ సిసి తో నీటిని నిలువ చేసే నిర్మాణాలు/పొలం లోని కొలనుల, సమిష్టి చెరువుల నిర్మాణం (100మీ. x100మీ x3మీ). చిన్నసైజు కుంటలు/ట్యాంకుల కోసం ఖర్చు లో రాయితీ కమాండ్ ఏరియాను బాటి దామాషా ఆధారంగా |
10 హెక్టార్ల కమాండ్ ఏరియాకు మైదాన ప్రాంతంలో యూనిట్ కు రూ.20 లక్షలు పర్వత ప్రాంతంలో 500 మైక్రాన్ ప్లాస్టిక్ లైనింగ్/ఆర్ సిసి లైనింగ్ తో యూనిట్ కు రూ.25 లక్షలు |
ఎం.ఐ.డి.హెచ్ ఉపస్కీములైన ఎన్.హెచ్.ఎం./హెచ్.ఎం.ఎన్.ఇ.హెచ్. |
4. |
పొలంలోని చిన్న కొలను/బావి (20 మీ.x20మీ.x3మీ) విక్తిగతంగా చిన్న సైజు కొలనులూ, బావుల కోసం ఖర్చు దామాషా ప్రకారం |
2 హెక్టార్ల ఏరియాకు మైదాన ప్రాంతంలో ఒక్క లబ్ధిదారులకు రూ.1.5 లక్షలు; పర్వత ప్రాంతంలో 300 మైక్రాన్ ప్లాస్టిక్ లైనింగ్/ఆర్ సిసి లైనింగ్ తో ఒక్క లబ్ధిదారులకు రూ1.8 లక్షలు |
ఎం.ఐ.డి.హెచ్.ఉపస్కీములైన ఎన్.హెచ్.ఎం/హెచ్.ఎం.ఎన్.ఇ.హెచ్. |
5. |
పప్పు దినుసులకూ గోధుమకు స్ప్రింక్లర్ సెట్ |
హెక్టారుకు రూ.10000/- కానీ లేదా వెలలో |
జాతీయ ఆరోగ్య భద్రతా మిషన్ |
6. |
a. ఆయిల్ పామ్ తోటలో బోర్ వెల్ కోసం
b. నీటిని నిలువ చేసే నిర్మాణాలు/కొలనులు |
ఎన్.ఎం.ఎస్.ఎ.నిర్దేశకాల ప్రకారం ఖర్చులో 50% రాయితీ బోర్ వెల్ కు/గొట్టపు బావులకు రూ.25000/- మించకుండా. అయితే గ్రౌండ్ వాటర్ అత్యంత ప్రమాదకర స్ధాయికి లేదా ప్రమాదకర స్ధాయికి చేరుకొని చోట అతిగా వాడని చోట మాత్రమే వీటిని వెయ్యాలనే షరతు వర్తీస్తుంది.
నిర్మాణపు ధరలో 50% లైనింగ్ తో సహ మైదాన ప్రాంతాల్లో రూ. 75000 కు లోబడి పర్వత ప్రాంతాల్లో రూ.90000 కు లోబడి. |
ఎన్.ఎం.ఒ.ఒ.పి |
7. |
పంప్ సెట్ |
పంప్ సెట్ కు రూ.10000/- లేదా ధరలో 50% ఏది తక్కువైతే అది. |
ఎన్.ఎఫ్.ఎస్.ఎం |
8. |
బావి లేదా బోర్ వెల్ నిర్మాణానికి |
100% రూ 30000కు లోబడి |
బి.జి.ఆర్.ఇ.ఐ |
9. |
తక్కువ లోతులో గొట్టపు బావులు |
100% రూ.12000 కు లోబడి |
బి.జి.ఆర్.ఇ.ఐ |
10. |
పంప్ సెట్ (10 హెచ్ పి వరకు) |
పంప్ సెట్ కు రూ.10000 లేదా ధరలో 50% ఏది తక్కువైతే అది |
ఎన్.ఎఫ్.ఎస్.ఎం |
11. |
మొబైల్ రేయిన్ గన్ |
మొబైల్ రెయిన్ గన్ కు రూ.15000 లేదా ధరలో 50% ఏది తక్కువైతే అది. |
ఎన్.ఎఫ్.ఎస్.ఎం |
నీటి నిర్వహణ:సుస్ధీర వ్యవసాయనికై జాతీయ మిషన్ (ఎస్.ఎం.ఎస్.ఎ)
క్ర.సం. |
సహాయ వివరాలు |
సహాయపు మొత్తం |
1. |
నీటిని నిలువ చేయటం నీటి నిర్వహణ |
|
1.1a |
వ్యక్తులు నీటిని నిలువ చేసే వ్యవస్ధ (వ్యక్తులకు) |
నిర్మాణపు ధరలో 50% (ఘనపు మీటర్ కు మైదాన ప్రాంతంలో రూ.125/- పర్వత ప్రాంతాల్లో రూ.150/-); లైనింగ్ తో సహ మైదానా ప్రాంతాల్లో రూ. 75000/- కు లోబడి పర్వత ప్రాంతాల్లో రూ.90000 కు లోబడి. |
1.1b |
ఎం.ఎన్.ఆర్.జి.ఏ/డబ్ల్యూ.ఎస్.డీ.పీ. కింద నిర్మంచిన ట్యాంకులూ కొలనుల లైనింగ్ కోసం |
ప్లాస్టిక్/ఆర్ సిసి లైనింగ్ కు అయిన ఖర్చులో% రాయితీ ప్రతి కొలను/ట్యాంకు/బావికి రూ 25000 లకు లోబడి. |
1.2 |
నీటిని నిలువ చేసే వ్యవస్ధ కమ్యూనిటీల కోసం: కమ్యూనిటీ ట్యాంకులు/పొలంలో కొలనులు/చెక్ డ్యాములు/ఆర్.సిసి లైనింగ్ తో రిజర్వాయర్లు. |
100% ఖర్చు రాయితీ 10 హెక్టార్ల కమాండ్ ఏరియాకు మైదాన ప్రాంతంలో యూనిట్ కు రూ.20 లక్షలు లోబడి; పర్వత ప్రాంతంలో లైనింగ్ తో యూనిట్ కు రూ. 25 లక్షలు. కమాండ్ ఏరియా 10 హెక్టార్ల కంటే తక్కువ ఉంటే దాని దామాషాలో చెల్లింపు. లైనింగ్ లేని వాటికి 30% తక్కువ. |
1.3 |
లోతు తక్కువ ఉన్న మధ్య తరహా లోతు ఉన్న ట్యూబ్ వెల్స్/బోరు బావుల తవ్వకానికి |
బావుల తవ్వకానికి అయిన ఖర్చులో 50% యూనిట్ కు రూ. 25000 లకు లోబడి. |
1.4 |
చిన్న చెరువుల పునరుద్ధరణ/నవీనీకరణ |
పునరుద్ధరణకు అయ్యే ఖర్చులో 50% ప్రతి యూనిట్ కు రూ. 15000/- లకు లోబడి |
1.5 |
పైపుల ద్వారా నీటి పంపిణీ వ్యవస్ధ |
హెక్టారుకు రూ.10000 లకు లోబడి ఖర్చులో 50% ప్రతి లబ్ధిదారుకు లేదా బృందానికి 4 హెక్టార్ల వరకు. |
1.6 |
నీటిని తోడే సాధనాలు (ఎలక్ట్రిక్,డీజిల్,పవన/సౌర్) |
ఖర్చులో 50% ప్రతి ఎలక్ట్రిక్/డీజిల్ యూనిట్ కు రూ.15000/- లకు లోబడి ప్రతి పవన/సౌర్ యూనిట్ కు రూ. 50000 లకు లోబడి |
1.7 |
సాధ్యమైన స్ధానాల్లో రెండవ నీటి నిలువ నిర్మాణాలను పాలి-లైనింగ్ కంచేలతో చేపట్టడం |
నిలువ సామర్ధ్యం లోని ప్రతి ఘనపు అడుగుకు రూ 100/- కు మించకుండా నిర్మాణ వ్యయంలో 50%. ప్రతి లబ్ధిదారుకు అందగల గరిష్ట సాయం రూ. 200000/- |
1.8 |
ఇటుకలతో లేదా కాంక్రీట్ లైనింగ్, కంచేలతో రెండవ నీటి నిలువ నిర్మాణాలను చేపట్టడం |
నిలువ సామర్ధ్యం లోని ప్రతి ఘనపు అడుగుకు రూ. 350/- కు మించకుండా నిర్మాణ వ్యయంలో 50%. ప్రతి లబ్ధిదారుకు అందగల గరిష్ట సాయం రూ. 200000/- |
2.0 |
బిందు సేద్యం |
డీ.పీ.ఏ.పి (కరువు బాధిత ప్రాంత పధకం) పధకం లేని ప్రాంతాల్లో డి.డి.పి. (ఎడారి అభివృద్ధి కార్యక్రమం)/ఎన్.ఇ.&హెచ్. (North Eastern and Himalayan states) ప్రాంతంలో చిన్న సన్న కారురైతులకు మొత్తం నిర్మాణ వ్యయంలో 45% ఇతర ప్రాంతాల్లో 35% డీ.పీ.ఏ.పి./డీ.డీ.పి.&ఎన్.ఇ.&హెచ్/పర్వత ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులకు మొత్తం నిర్మాణ వ్యయంలో 60% ఇతర రైతులకు 45%. పరికరాలను నెలకొల్పేందుకు ఎంత ధర అయితే నిర్ణయమైందో గరిష్టంగా అంతమేరకే సహాయం లభిస్తుంది.దూరంగా విట్టే పంటలకు నిర్ణతమైన ధర హెక్టారుకు రూ.23500/- నుండి రూ.58400/- దగ్గరగా విట్టే పంటలకు హెక్టారుకు రూ. 85400 నుండి 100000/- అయితే నేల విస్తీర్ణం పంట ఏడాన్ని బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఒక్కో లబ్ధిదారుకు/బృందానికి అత్యధిక సహాయం 5 హెక్టార్ల దాకా మాత్రమే ఉంటుంది. |
3. |
తుంపర సేద్యం |
ఇందులో కూడా విభిన్న రైతు సముదాయాలకు ప్రాంతాలకూ సహాయం బిందు సెంద్యంలో వలెనే ఉంటుంది. పరికరాలను నెలకోల్పేందుకు ఎంత ధర అయితే నిర్ణయ మైందో గరిష్టంగా అంతమేరకే సహాయం లభిస్తుంది. మైక్రో స్ప్రింక్లర్ క నిర్ణీతమైన ధర హెక్టారుకు రూ.58900/- మినీ స్ప్రింక్లర్ కురూ.85200/- పోర్ట్ బుల్ స్ప్రింక్లర్ హెక్టారుకు రూ.19600 పాక్షికంగా శాశ్వత పారుదల వ్యవస్ధకు హెక్టారుకు రూ.36000/- పెద్ద బిందు నీటి పారుదల వ్యవస్ధకు హెక్టారుకు రూ.31600/- ఒక్కో లబ్ధిదారుకు/బృందానికి అత్యధిక సహాయం 5 హెక్టార్ల దాకా మాత్రమే ఉంటుంది. |
ఎవరిని సంప్రదించాలి?
జిల్లా వ్యవసాయాధికారి/జిల్లా మట్టి సంరక్షణాధికారి/ఆత్మ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ - ఎ.టి.ఎం.ఎ) ప్రాజెక్టు సంచాలకులు/ జిల్లా ఉద్యనాధికారి.