హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / పంటలలో జీవన ఎరువలు, జీవన క్రిమి మరియు చీడ నాశకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పంటలలో జీవన ఎరువలు, జీవన క్రిమి మరియు చీడ నాశకాలు

పంటలలో జీవన ఎరువలు, జీవన క్రిమి మరియు చీడ నాశకాలు.

సాధారణంగా వర్షాధారిత ప్రాంతాల్లోని భూముల్లో పంటలకు కావలసిన పోషక పదార్ధాల లోపం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాక ఈ పంటల్లో క్రిములు మరియు చీడలు పంటలకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయే. వర్షధర వ్యవసాయంలో ముక్యంగా సన్నకారు మరియు చిన్న రైతులు ఖరీదైన రసాయనిక ఎరువులు క్రిమి లేదా చీడ నాశక మందుల పై ఎక్కువ పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు.

మన భూముల్లో వున్న కొన్ని జాతుల సూక్మజీవులు మొక్కలకు నత్రజని, భాస్వరం, జోకు వంటి పోషక పదార్ధాలు అందించగలవు. అదేవిధంగా కొన్ని జాతుల సూక్మజీవులు పంటలనాశచే క్రిముల చీడలను కూడా నివారించగలవు, రైతులు ఈ జీవన ఎరువులను మరియు జీవ సంబంధిత శిలింద్రనాశినిని విత్తన శుద్ధి ధ్వారా లేదా పశువుల పెంటతో లేదా వర్మీకంపోస్టుతో కానీ కలిపి భూమిలో వేసుకోవచ్చు. విత్తనశుద్ధి జీవన ఎరువులను వాడడం ధ్వారా పోషకాల లభ్యతను పెంచటమే కాక 10 నుండి 25 శాతం వరకు పంట దిగుబడులను పెంచుకోవచ్చు. ఈ ఎరువుల వాళ్ళ పంట సాగకయ్యు ఖర్చు తగ్గటమే కాక పరోక్షంగా సేంద్రియ సేద్యం సాధ్యమవుతుంది.

జీవన ఎరువులు

1) నత్రజని అందించే ఎరువులు

ఎరువులు / పంటలు

మోతాదు/వాడే విధానం

ఎ) అజోస్పైరీల్లమ్

వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ మరియు ప్రత్తి

బి) అజటోబాక్టర్ / అన్ని పంటలకు, కూరగాయలు మరియు ఉద్యానవన పంటలు

సి) రైజోబియం

అపరాలు సోయాచిక్కుడు వేరుశనగ

విత్తన శుద్ధి: ఒక కిలో విత్తనానికి 5 -10 గ్రా. పొడిని వాడుకోవాలి.

నారుమడి / దుంప శుద్ధి : 100 లీటర్ల నీటిలో ఒక కోలి పొడిని కలిపి, ఒక ఎకరానికి సరిపడు నారు మరియు దుంప వేర్లను ఈ ద్రావణంలో 10 -15 నిమిషాల పటు ఉంచాలి. వీలైనంత త్వరగా ఈ నారును నాటుకోవాలి.

విత్ణశుద్ధి, నారుమడి/ దుంప శుద్ధి మరియు నెలలో వేసుకొనుటకు అజోస్పైరీల్లమ్ కు పాటించిన పద్ధతినే దీనికి కూడా పాటించవచ్చు.

విత్తనశుద్ధి ఒక కిలో విత్తనానికి 5 -10 గ్రా. పొడిని వాడుకోవాలి. ఒక ఎకరానికీ సరిపోయే విత్తనాన్ని కావాల్సిన రైజోబియం. పొడిని, కావలసినంత నీరు తీసుకొని రైజోబియంతో పాటు ఇవ్వబడిన 5 గ్రా. సి. ఎమ్.సి. బాగా కలుపుకోవాలి. ఈ విత్తనాలను శుభ్రమైన నెల మీద గని లేదా ప్లాస్టిక్ కవరు పైన గని లేదా గొనె సంచి మీద గని పోసి నీడలో ఆరనివ్వాలి. ఈ విత్తనాలను 3 గంటలు వ్యవధిలో విత్తుకోవచ్చును.

2) భాస్వరాన్ని అందించే ఎరువులు

ఎ) పి.ఎస్.బి. అన్ని పంటలకు వాడుకోవచ్చు.

విత్తనశుద్ధి ఒక కోలి విత్తనానికి 5 -10 గ్రా. పొడిని పైన వివరించిన విధంగా వాడుకోవాలి. నారుమడిలో : 100 లీటర్ల నీటిలో ఒక కోలి పొడిని కలిపి. ఒక ఎకరానికి సరిపడు ఈ ద్రావణంలో 5 -10 నిమిషాల పటు ఉంచాలి. వీలైనంత త్వరగా ఈ నారును నాటుకోవాలి. నెలలో చేసుకొనుట అజోస్పైరీల్లమ్ కు పాటించిన పద్ధతినే దీనికి కూడా పాటించవచ్చు.

బి) మైకోరైజా

అన్ని పంటలకు వాడుకోవచ్చు.

వేరు మొదలులో వేయుట : ఒక ఎకరాకు ఒక కిలో పొడిని 50 కిలోల పశువుల ఎరువు / కంపోస్టులో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొక్కల వేరు మొదళ్ళలో వేసుకోవాలి.

3) బయోకంపోస్టు ఎరువులు

ఎ) బయాకంపోస్టు వాడే విధానం :

అన్ని పంటల వ్యర్ధపదార్ధాలు

5 కిలోల బయోకంపోస్టు పొడిని 25 లీటర్ల నీటిలో మరియు 20 కిలోల ఆవు పేడలో కలుపుకొని బయోకంపోస్టు ద్రావణం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం ఒక టన్ను (1000 కిలోలు ) సేంద్రియ వ్యర్ధ పదార్ధానికి కలుపుకోవచ్చు. మొదట 200 కిలోల సేంద్రియ వ్యర్ధ పదార్ధాన్ని ఒక పొరగా పరచాలి. దీని పై 10 లీటర్ల బయోకంపోస్టు ద్రావణాన్నిచిలకరించాలి . దీని పై మరల 200 కిలోల సేంద్రియ వ్యర్ధ పదార్ధాన్ని పరచాలి. తిరిగి 10 లీటర్ల మిశ్రమాన్ని చిలకరించాలి . ఈ విధంగా మొత్తం వ్యర్ధ పదార్ధాన్ని 5 పొరలుగా వేసుకోవాలి. ఇలా వేసుకొన్న వ్యర్ధ పదార్ధాన్ని 5 పొరలుగా వేసుకోవాలి. ఇలా వేసుకొన్న వ్యర్ధ పదార్ధం మరియు బయోకంపోస్టు మిశ్రమాన్ని 6 -12 వారాల తరువాత చల్లుకుంటే పంటలకు కావాల్సిన పోషక పదార్ధాలు బాగా అందిచవచ్చును.

సూడోమోనాస్ అపరాలు, వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న , ఉద్యానవన పంటలు

విత్తన శుద్ధి: 10 గ్రా. సూడోమోనాస్ పొడి మందును ఒక కిలో విధానానికి విధానానికి విత్తన శుద్ధిగా, మందు తెలిపిన విధంగా వాడాలి.

నారుమడి: 10 గ్రా. సూడోమోనాస్ పొడిని ఒక లీటరు నీటిలో కలుపుకోవాలి. ఒక ఎకరానికి సరిపడే నారును ఈ ద్రావణంలో 5 -10 నిమిషాల వరకు ముంచి అపుడు నాటుకుంటే మంచి ఫలితం వుంటుంది.

 

నెలలో వేసుకొనుట: 100 కిలోల పశువుల ఎరువుకి 3 కిలోల సూడోమోనాస్ పొడి కలిపి ఆ మిశ్రమం పైన గొనె సంచిని కప్పి 3 -5 రోజుల పటు ఉంచాలి. గొనె సంచి మీద తగినంత నీరు చల్లతు ఉండాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఎకరాలో చల్లుకోవాలి.

క్రిమి / శిలింద్రణాశీసులు ట్రైకోడైర్మ విరిడి

విత్తనశుద్ధి: 4 గ్రా. ట్రైకోడైర్మ పొడిని ఒక కిలో విత్తనానికి వాడాలి విత్తనానికి మందు సి.ఏం.సి.తో తయారు చేసుకున్న ద్రావణాన్ని పట్టించిన తర్వాత ట్రైకోడైర్మ పొడిని పైన చల్లాలి. ఈ విధంగా చేసిన విత్తనాన్ని ఒక సంచిలో గాని, పాలిథిన్ కవర్లోగాని తీసుకొని పొడి అన్ని విత్తవాలకు పట్టేలా నిదానంగా కలియబెట్టి, నీడలో ఆరబెట్టాలి.

నారుమడిలో: 10 గ్రా. పొడిని ఒక లీటరు నీటిలో కలుపుకోవాలి. ఒక ఎకరాకు సరిపడే నారును ఈ ద్రావణంలో 5 -10 నిమిషాల వరకు మంచి అపుడు నాటుకుంటే మంచి ఫలితం వుంటుంది.

నెలలో వేసుకొనుట: 100 కిలోల పశువుల ఎరువుకి 2 .5 కిలోల ట్రైకోడైర్మ పొడిని కలిపి ఆ మిశ్రమం పైన గొనె సంచిని కప్పి వారం రోజులపాటు గొనె సంచిని తీసి చూస్తే ట్రైకోడైర్మ పశువుల పేద మీద తెల్లని బూజులా అల్లుకుపోయి వుంటుంది. దీనిని బాగా కలుపుకొని ఒక ఎకరంలో చల్లుకోవచ్చు. ఇదంత నీడలోనే తయారు చేసుకోవాలి.

2.84444444444
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు