హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / పప్పుధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పప్పుధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పప్పుధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు.

మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం 5.03 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు చేయబడినవి. కంది పంటలో పూత మరియు కాయ తయారయ్యే దశలో బెట్ట పరిస్ధితులు రావడం వలన గత సంవత్సరంతో పోలీసై ఈ సంవత్సరం దిగుబడి చాలా వరకు తగ్గింది. సాధారణంగా పప్పుధాన్యాలలో వివిధ దశలలో వివిధ రకాలుగా నష్టం జరిగుతుంది. అందులో సుమారుగా 20-25 శాతం వరకు కోత మరియు విలువతో జరుగుతోందని అంచనా. కావున వచ్చిన దిగుబడిని సరైన జాగ్రత్తలు తీసుకొని నిల్వ చేసినతలైయితే నిల్వలో జరిగే నష్టాన్ని కొంత వరకు అరికట్టడమే కాక రైతులకు మంచి మార్కెట్ దార రావడానికి అవకాశం ఉంటుంది.

సాధారణంగా పూత దశ నుండి కంది 45-60 రోజులలో, పెసర 30-40 రోజుల్లో మినుము 40-50 రోజాల్లో  పక్వతకు చేరుకుంటాయి. కాయలు మొదటగా పసుపు రంగుకు మరి నిదానంగా పండిపోతాయి. ఈ సమయంలో కోసినచో అత్యధిక గింజ నాణ్యత కలిగి ఉండును.

పంటను మనుషుల ద్వారా కాయలు కోయుట లేదా కొడవలి ఉపయేగించి మొక్కలు కోయుట లేదా యంత్రాల సహాయంతో కోయవచ్చును. తక్కువ సమయంలో ఎక్కువ సామర్ధ్యం కొరకు యంత్రాలను వాడవచ్చు. వాడే ముందు యంత్రాలను శుభ్రపరచుకుంటే కల్తీని తగ్గించవచ్చు.

పంటకోత తర్వాత పంటను కాండం, ఆకులు ఎండే వరకు చిన్న కుప్పలుగా వేసి వారం రోజులు ఎండిన తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి మనుషులతో, కర్రలతో కొట్టి లేదా నూర్పిడి యంత్రం (ఆల్ క్రాప్ త్రషర్) ఉపయేగించి చేసుకోవాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి చెత్త, మట్టి, పుల్లలు, రాళ్ళూ మరియు తలు గింజల విత్తనాలను తొలగించి శుభ్రపరిచి బాగా ఎండబెట్టుకోవాలి. నూర్పిడి చేసినప్పుడు సాధారణంగా 13-14 శాతం తేమ కలిగి ఉంటుంది. ఆ స్ధాయిలో నిల్వ చేసినప్పుడు లేదా నిల్వ సమయంలో చెమ్మగిల్లిన లేదా కీటకాలు మరియు ఎలుకల ఉన్న వివిధ శిలింద్రాలు ఆశిస్తాయి. పప్పుధాన్యాలలో అస్పర్జిల్లాస్, పెన్సిలియం అనే శిలింద్రాలు ఆశించి గింజల పై తెల్లటి, పచ్చటి లేదా నల్లటి బూజుగా ఏర్పడతాయి. దీని వలన గింజలు నాణ్యత రంగు మరియు రుచిని కోల్పోతాయి. ఈ శిలింద్రాలు మైకోటాక్సిన్స్  అనే విషపూరిత రసాయనాలను గింజలు విడుదల చేస్తాయి. ఈ గింజలు మానవులు మరియు పశువులకు హానికరమేకాక క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కలుగజేస్తాయి. కావున రైతులు తగు గిట్టు బాటు దార రావడానికి శుభ్రపరిచి గింజలను 9 శాతం తేమ ఉండేలా ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.

పప్పుధాన్యాల నిల్వలో పెంకుపురుగు అత్యధికంగా నష్టపరస్తుంది. సశరణంగా కాయ పరిపక్వత దశలోనే పాతపొలంలో పెంకుపురుగు ఆశించి గింజల ద్వారా నిల్వ చేసే గోదాములోకి ప్రవేశించి నష్టం కలుగుజేస్తుంది. పెంకు పురుగు గింజల పై తెల్లని గ్రుడ్లని పెడుతుంది. ఈ గ్రుడ్లు నుండి వచ్చిన గోధుమ రంగు గ్రబ్స్ గింజల లోపల భాగాన్ని తినేసి రంద్రాలను చేస్తాయి. ఇందులోనే గ్రబ్స్ కోశస్ధ దశలోకి మరి అందులో నుండి పెంకు పురుగులు వస్తాయి. కవన కోతకు 3-4 రోజుల ముందు పంట పై కాసిల్ పాస్ 25 ఇసి 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పెంకుపురుగు సహించకుండా కాపాడవచ్చు. గృహ అవసరానికి నిల్వ చేసుకునేటప్పుడు 5 గ్రా. వేపపొడి లేదా 5 మీ.లి. వేప నూనె లేదా వంట నూనె ప్రతి కిలో విత్తినానికి కలిపి నిల్వ చేస్తే పెంకు పురుగు గ్రేడ్లను పొడగకుండా నివారించబడి గ్రబ్స్ గింజలలోకి చొరబడకుండా చనిపోయే అవకాశం ఉంది.

గింజలను నిల్వ చేసే గోదాములు శుభ్రంగా అందేలా చూడాలి. అంతేకాక విత్తన నిల్వ చేసే గదుల్లో పగుళ్ళు, రంధ్రాలు పూడ్చి సున్నం వేయాలి  లేదా గాడి గోడల పైన క్రంది 20 మీ.లి. మలాథియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేసినచో దాగి ఉన్న పురుగులు / కీటకాలు చనిపోతాయి. నిల్వ చేసే బస్తాలను నెల పైన కాకుండా కొంచెం  ఎత్తెన చెక్క బల్ల పై పేర్చి గొడవలకు తగలకుండా జాగ్రత్త పడాలి.

పాత సంచులను నిల్వకు వాడేటప్పుడు 100 మీ.లి. వేప ద్రావణం లేదా 50 మీ.లి. వేప కాషాయం లేదా 10 మీ.లి. మలాథియాన్ లేదా 2 మీ.లి. డెల్టామేత్రిన్ లీటరు నీటికి కలిపి సంచుల పై పిచికారి చేసి ఆరబెట్టి వాడుకోవాలి.

రైతులు ఉత్పత్తి నిల్వ చేసేటప్పుడు గింజలలో తేమ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మధ్యలో ఆరబెట్టుకుంటూ గింజలను నిల్వ చేసినతలయితే మార్కెట్ కి అనువైన నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల రైతులకు అధిక ధర లభిస్తుంది

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.975
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు