హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / పశుగ్రాస నిల్వ పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పశుగ్రాస నిల్వ పద్ధతులు

పశుగ్రాస నిల్వ పద్ధతులు.

వివిధ కారణాల చేత ఈ మధ్య కాలంలో వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు. కావున రైతులు అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మేకల, గొర్రెల పెంపకం మొదలగునవి చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పశుగణంగా అధ్యాయం (2012) ప్రకారం పశుసంపద 267.8 లక్షలు. ఇందులో ఆవులు, ఎద్దులు 50.3 లక్షలు, గేదెలు 41.9 లక్షలు, మేకలు 46.7 లక్షలు మరియు గొర్రెలు 128.7 లక్షలు. జనాభా గణాంకాల ప్రకారం జనాభా 11% పెరగగా, పశుసంపద 6.5 శాతం తగ్గింది. ప్రస్తుతమున్న పశుసంపద నుండి పొందవలసిన పాల మరియు మాంసం దిగుబడులు పొందలేకపోతున్నాము. నాణ్యమైన పోషక విలువలున్న పచ్చిమేతను మధించవలసిన అవసరం ఉన్నది. పశుపోషణలో 70% ఖర్చు మేతకు అవుతుంది. మేత ఖర్చు తగ్గాలంటే చౌకగా లభ్యమయ్యే పశుగ్రాస పంటలను సాగు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పశుగ్రాస పంటలు 1.1 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతున్నది. ఇది పంటల సాగు విస్తీర్ణంలో 1.9% మాత్రమే. మన భారతదేశంలో కూడా వ్యవసాయ భూమిలో 12.5% భూమిని పశుగ్రాసాల సాగుకు కేటాయంచాలి. కానీ కేవలం 4.7% భూమే పశుగ్రాసాల క్రైందా సాగులో ఉంది. కాబట్టి ఈ పచ్చిమేత కొరతను అధిగముంచడానికి వివిధ ప్రత్యామ్నాయాల పై ఆధారపడటం ఎత్తైన అవసరం. పచ్చిమేత కొరత వర్షాకాలంలో అంతగా ఉండకపోయినా చలికాలంలోనూ, వేసవిలోనూ తీవ్రంగా ఉంటుంది.

అనువైన కాలంలో (సెప్టెంబర్, అక్టోబర్) అధికంగా పండే పశుగ్రాసాన్ని వివిధ పద్దతులలో నిల్వ చేసుకుని పశుగ్రాస కొరత ఉండే కాలంలో (మర్చి-జూన్) వాడుకోవచ్చు.

సైలేజ్ (పాతర గడ్డి)

పచ్చిగా ఉండే పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసి గాయాలు లేకుండా పులియబెట్టి, నిలువ చేయడాన్ని సైలేజి అని అంటారు. గుంతలో పాతరేసి కానీ, ట్యంక్ లో నింపి కానీ లేదా ఈ మధ్య పాలిథిన్ సంచులలో నింపి సైలేజ్ తయారుచేస్తున్నారు. ఆక్సిజన్ కూడా లేని పరిస్ధితిలో నిలువ చేయడం వలన పశుగ్రాసంలో ఉండే నీటిలో కరిగే పండిపదార్ధాలు ఆర్గానిక్ ఎమ్మెల్యేలుగా మారడం వలన పశుగ్రాసం యెక్క ఆమ్లా పరిమాణం పెరుగుతుంది. గడ్డిలోని ఎండు పదార్ధం మరియు కరిగించబడే తీపి పదార్ధాల పై నాణ్యత ఆధారపడి ఉంటుంది తీపి పదార్ధాల నిష్పత్తి కూడా ముదిమాంసకృత్తులు శాతం పై  ప్రభావాన్ని చూపిస్తుంది. మంచి నాణ్యత గల సైలేజ్ తయారీకి పంటను 50% పూత దశలో లేదా పాలాదశలో కోయాలి. మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలను పాలుపోసుకునే దశలో, నేపియర్ గడ్డి, పరాగడ్డి, గిని గడ్డిలను పూత దశలో కోసి సైలేజ్ కి ఉపయెగించాలి. పశుగ్రాసాలలో తేమ 65-70% మించి ఉండకూడదు.

సైలేజ్ తయారీకి త్రవ్విన గుంతలో అడుగుభాగాన, ప్రక్కలకు సిమెంట్య్ గోడలు కట్టాలి. అడుగు భాగంలో వరిగడ్డి వేసిన యెడల పాతర గడ్డి వృధా కాకుండా ఉంటుంది. గాలి, నీరు సోకితే పాతర గాడి బూజు పట్టి చెడిపోతుంది కావున ఏ మాత్రం గాలి, వర్షపు నీరు పాతరలోకి పోకుండా జాగ్రత్త పడాలి. చాప్ కట్టర్ తో సన్నగా నరికిన మీథేన్ పాతరలో నింపేటప్పుడు ప్రతి టన్ను గడ్డికి 2-3 కిలోల బెల్లపు మడ్డి మరియు ఒక కిలో రాతి ఉప్పును పొరల మధ్య చల్లాలి. పాతరలో గాలిలేకుండా ట్రాక్టర్ తో నడపాలి. భూమికి 2-3 అడుగుల ఎత్తు వరకు నింపి దాని పై మందపాటి పాలిథిన్ షిట్ ను గాని లేదా వరిగడ్డిని గాని పరచి, మట్టి లేదా పేద మిశ్రమంతో అలికి గాలి చొరబడకుండా చేయాలి. ఇలా పాతర వేసిన గాడి 2-3 నెలలకు మాగి పండ్ల సువాసనతో లేత పసుపుపచ్చ రంగులో తేమ కలిగి ఉంటుంది. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. పశువులు చాలా ఇష్టంగా తింటాయి. గుంత తెరిచిన తరువాత నెల రోజుల లోపు వాడుకోవాలి లేనిచో ఆరిపోయి చెడిపోతుంది. గుంత నుండి సైలేజ్ ని వాడుకునేటప్పుడు ఒక ప్రక్క నుండి పొరలుగా తీసి వాడుకోవాలి. సైలేజ్ ని 10 కిలోల ఎండుమితతో కలిపి పాలు పితికిన తరువాత లేదా పిండడానికి 4 గంటల ముందు మేపాలి. ముదురు గోధుమ నలుపు రంగు కలిగి పులుపు వాసన ఉన్న సైలేజ్ ని వినియెగించరాదు.

సాధారణంగా సైలేజ్ అవసరమయ్యే కాలం 4 నెలలు 5 పశువులకు గాను ఈ 4 నెలల్లో 12 టన్నుల సైలేజి అవసరమౌతుంది. ఒక కిలో సైలేజ్ తయారీకి కావాల్సిన పచ్చిమేత 1.5 కిలోలు. 12 టన్నులకు 18000 కిలోల పచ్చిమేత కావాలి. ఇది ఒక ఎకరా విస్తీర్ణంలో పండించిన మొక్కజొన్న పంట నుండి లభించే పచ్చిమేతకు సమానం. 15 కిలోల పచ్చిమేతను సైలేజ్ గుంతగా చేయడానికి కావాల్సిన స్ధలం ఒక ఘునాపుటడుగు. 18 టన్నుల పచ్చిమేతను సైలేజ్ చేయడానికి 1200 ఘు.చ. ఒకటే గుంత చేసికొని నెలకు ఒక గుంత నుండి సైలేజ్ తీసి వాడుకోవడానికి అనువుగా నాలుగు గుంతలు (ఒక్కొక్కటి 300 ఘు.చ.ఆ) చేసుకోవాలి. కాబట్టి 20 అడుగుల పోసావు, 5 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు గుంతలు నాలుగిటిలో సైలేజ్ తాయారు చేసి ప్రతి రోజు 20 కిలోలు మేపాలి. ఒక నెల తరువాత మరో గుంత తెరచి వాడుకోవాలి.

హే

పశుగ్రాస పంటలను పూత దశ కంటే ముందు దశలో కోసి ఎండిబెట్టిన గడ్డిని 'హే' అంటారు. పశుగ్రాసాన్ని నిల్వ చేసే పద్దతులలో ఇది చాలా సులువైనది. ధాన్యపు జాతి కానీ గడ్డిజాతి పశుగ్రాసాలను పప్పుజాతి పశుగ్రాసాలతో కలిపి కానీ, లలపకుండా కానీ హే తయారుచేయవచ్చు. ఎక్కువగానున్న పశుగ్రాసం పులియకుండా, బూజు పట్టకుండా, లేత ఆకుపచ్చరంగులోనున్న ఆకులు, కొమ్మలు తడిలేకుండా, ఖండంలోని నీటి శాతం తగ్గే వరకు ఎండనివ్వాలి. ఇలా పశుగ్రాసాన్ని వాడబెట్టడం వలన కెరోటిన్ మరియు క్లోరోఫిల్ పరిమాణం తగ్గిపోతుంది. 'హే' ను రెండు రకాలుగా తాయారు చేయవచ్చు.

మొదటి పద్దతిలో మంచు బిందువులన్ని ఆవిరైన తర్వాత మాత్రమే మొక్కలను కోసి పొలంలోనే ఆరనివ్వాలి. ప్రతి 4-5 గంటలకొకసారి గడ్డిపణలను త్రిప్పుతూ 40% తేమ ఉన్నప్పుడు గాలి చొరబడే విధంగా కుప్ప వేయాలి. 25% తేమ వచ్చే వరకు ఆరనివ్వాలి. ఈ పద్దతిలో గడ్డి త్వరగా ఎండుతుంది. ఇలా ఎండిన గడ్డిని సుమారు 20% తేమ ఉండేలా చూసుకొని నిల్వ చేసుకోవాలి. వర్షాకాలంలో నీడలో వాడబెట్టి 'హే' తయారుచేయాలి.

రెండవ పద్దతిలో ఇనుప కంచెలను ఉపయేగించి తాయారు చేసిన ఫ్రీములలో గడ్డిని ఎండిబెడతారు. పప్పుజాతి పంటలను ఈ విధంగా ఎండబెట్టవచ్చు. ఇలా ఎండబెట్టడం వలన 2-3% మాంసకృత్తులు మాత్రమే నష్టం అవుతాయి. పప్పుజాతి మొక్కలలో కోత దశలో ఆకులు, కాయలు ఎండి రాలిపోతాయి. ఆలస్యంగా కోతలు కోయడం వలన పోషకాలు తగ్గుతాయి.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.17647058824
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు